
ఓవియ
సినిమా: వివాహ వ్యవస్థపై తనకు నమ్మకం లేదని అంటోంది నటి ఓవియ. బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో కార్యక్రమంతో ప్రాచుర్యం పొందిన నటి ఈ అమ్మడు. అదే గేమ్ షోలో నటుడు ఆరవ్‌తో ప్రేమ, మనస్పర్థలు అంటూ కలకలంతో వార్తల్లోకెక్కిన ఓవియకు సినీ అవకాశాలు బాగానే వస్తున్నాయి. ప్రస్తుతం చేతిలో నాలుగైదు చిత్రాలు ఉన్నాయి. మరోసారి నటుడు ఆరవ్‌తో కలిపి ఓవియపై వదంతులు జోరుగా సాగుతున్నాయి. ఈ వ్యవహారంపై ఒక ఇంటర్వ్యూలో స్పందించిన ఓవియ ఏమందో చూద్దాం. నేను రాజబీమా చిత్రంలో నటి ఓవియగానే ఒక కీలక పాత్రలో నటిస్తున్నాను. అందులో నటుడు ఆరవ్‌తో ఒక పాటకు డాన్స్ చేశాను. విశేషం ఏమిటంటే ఆ పాటను ఆరవ్‌నే రాశాడు.
అదీ నన్ను పొగుడుతూ రాశాడు. నిజం చెప్పాలంటే ఒక స్నేహితుడిగా ఆరవ్ అంటే నాకు చాలా ఇష్టం. అదీ కాకుండా బిగ్‌బాస్ ఇంట్లో ఇద్దరం కలిసి ఉన్నాం. ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడి చాలా గొడవపడ్డాం కూడా. అయితే ఆ కార్యక్రమం ముగిసిన తరువాత మా మధ్య విభేదాలు తొలగిపోయాయి. బయట కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటున్నాం. అయితే మేము ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకోనున్నాం, సహజీవనం చేస్తున్నాం అని ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. నిజంగా అలాంటి జీవితాన్ని గడిపే పక్షంలో దాన్ని దాచాల్సిన అవసరం నాకు లేదు. ఆరవ్‌కు సంబంధించినంతవరకూ అతను నాకు మంచి ఫ్రెండ్. ఈ విషయంలో ఎలాంటి మార్పులేదు. అతను నాకు సపోర్టుగా ఉన్నాడు. నాకు వివాహ వ్యవస్థపై నమ్మకం లేదు. అది నా జీవితంలో అవసరం లేదు కూడా. నాకా జీవితం సెట్ కాదు అని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment