నా పాత్రను కత్తిరించకండి | Ovia asks not to cut her scenes in movies | Sakshi
Sakshi News home page

నా పాత్రను కత్తిరించకండి

Published Tue, Nov 5 2013 4:00 AM | Last Updated on Sat, Sep 2 2017 12:16 AM

నా పాత్రను కత్తిరించకండి

నా పాత్రను కత్తిరించకండి

తాను నటించిన సన్నివేశాలపై కత్తెర వేయకండి అంటోంది ఓవియా. ఈ కేరళ బ్యూటీ కలవాని చిత్రంతో కోలీవుడ్‌లో ప్రకాశించింది. అప్పుడప్పుడూ ఒకటి రెండు చిత్రాల్లో నటిస్తూ తన ఉనికిని చాటుకుంటోంది. ఆ మధ్య ఇద్దరు హీరోయిన్ల చిత్రంలో తన సన్నివేశాలను ఎడిటింగ్ రూమ్‌లో బుట్ట దాఖలు చేశారంటూ ఆరోపణలు గుప్పించింది. అంతేకాదు ఇకపై ఇద్దరు హీరోయిన్ల చిత్రాలలో నటించరాదని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ భామ మదయానై కూటం, ఇరుక్కు ఆనాల్ ఇల్లై చిత్రాలలో నటిస్తోంది.
 
 ఇరుక్కు ఆనాల్ ఇల్లై చిత్రంలో ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా నటిస్తోంది. ఇద్దరు హీరోయిన్ల చిత్రాలలో నటించననే పాలసీకి తిలోదకాలిచ్చారా? అన్న మీడియూ ప్రశ్నకు ఆమె తనదైన శైలిలో బదులిచ్చింది. దర్శకులందరూ ఒకేలా ఉంటారని భావించకూడదంది. మన వద్ద ఏదైతే చెబుతారో దానిని అలాగే చిత్రంలో పొందుపరిచే దర్శకులూ ఉంటారని పేర్కొంది. తన సన్నివేశాలను కత్తిరించకూడదనే నిబంధనతోనే ఇరుక్కు ఆనాల్ ఇల్లైలో నటిస్తున్నట్లు వెల్లడించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement