‘అలాంటి వారు నా సినిమాను చూడొద్దు’ | Oviya Comments 90ML Movie | Sakshi
Sakshi News home page

అలాంటి వారు నా సినిమాను చూడొద్దు

Published Tue, Feb 26 2019 9:43 AM | Last Updated on Tue, Feb 26 2019 9:48 AM

Oviya Comments 90ML Movie - Sakshi

తమిళసినిమా: అలాంటి వారు నా చిత్రాన్ని చూడొద్దు అంటోంది నటి ఓవియ. కలవాణి చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన మలయాళీ కుట్టి ఈ అమ్మడు. ఆ చిత్రంలో విమల్‌కు ప్రేమికురాలిగా నటించి మంచి పేరు తెచ్చుకున్న ఓవియా ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించినా పెద్దగా సక్సెస్‌ కాలేదు. అలాంటిది బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షోలో పాల్గొని సంచలన నటిగా చాలా పాపులర్‌ అయ్యింది.  తాజాగా కథానాయకిగా బిజీ అయిపోయింది. లారెన్స్‌తో కాంచన–2, 90 ఎంఎల్‌ వంటి సంచలన చిత్రాల్లో నటిస్తోంది.

ఈ రెండు చిత్రాలు నెల రోజుల గ్యాప్‌లో విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ముఖ్యంగా 90 ఎంఎల్‌ చిత్రంపై వివాదం చెలరేగుతోంది. అందుకు కారణం ఈ చిత్ర ట్రైలర్‌లో ఓవియా మద్యం సేవించడం, సిగరెట్లు తాగడం వంటి సన్నివేశాలు చోటు చేసుకోవడమే. దీనికి సంచలన నటుడు శింబు సంగీ తాన్ని అందించారు. చిత్రం మార్చిలో తెరపైకి రానుంది. వ్యతిరేకతపై నటి ఓవియా స్పందిస్తూ పాటలు, ట్రైలర్‌ను చూసి చిత్రాన్ని అంచనా వేయరాదని పేర్కొంది. చిత్రం విడుదలైన తరువాత అభిమానుల మధ్య తానీ చిత్రాన్ని చూడాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. కారణం చిత్రం బాగుం టుందని, మహిళల సహజమైన జీవన విధానంలో వారి భావాలను ఆవిష్కరించే చిత్రంగా 90 ఎంఎల్‌ చిత్రం ఉంటుందని పేర్కొంది. అయితే సంస్కృతిపై నమ్మకం లేకపోతే పురుషాధిక్యం కోరుకునే వారెవరూ తన చిత్రాన్ని చూడవద్దు అని అంది. కాగా 90 ఎంఎల్‌ చిత్రానికి సెన్సార్‌ బోర్డు సభ్యులు ఏ సర్టిఫికెట్‌ను ఇచ్చారన్నది గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement