
ప్రభుదేవా పేరు చెప్పగానే అద్భుతమైన డ్యాన్సులే గుర్తొస్తాయి. రీసెంట్ టైంలో పెద్దగా మెరుపుల్లేవ్. కొన్నాళ్ల ముందు వరకు పలు సినిమాలకు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం నటుడిగా తమిళ మూవీస్ చేస్తున్నాడు. సరే ఇదలా ఉంచితే ఇప్పుడు డ్యాన్స్ తో తన వారసుడిని పరిచయం చేశాడు.
(ఇదీ చదవండి: ఇది 40 ఏళ్ల ప్రేమ.. ఉపాసన పోస్ట్ వైరల్)
ప్రభుదేవా.. చెన్నైలో తాజాగా ప్రభుదేవా లైవ్ డ్యాన్స్ పేరుతో కాన్సర్ట్ నిర్వహించాడు. దీనికి పలువురు హీరోయిన్లు, సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ వేడుకలోనే ప్రభుదేవా.. తన కొడుకు రిషి రాఘవేందర్ ని పరిచయం చేశాడు. ఇద్దరూ కలిసి డ్యాన్స్ కూడా చేయడం విశేషం.
కొడుకు స్టేజీ పెర్ఫార్మెన్స్ వీడియో షేర్ చేసి తెగ ఎమోషనల్ అయిపోయాడు. కొడుకుని పరిచయం చేయడం ఎంతో గర్వంగా ఉందని, ఇది కేవలం డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కాదని అంతకు మించి అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే ప్రభుదేవాకు ఇద్దరు కుమారులు. వాళ్లలో రిషి ఒకడు. మరొకరు అదిత్.
(ఇదీ చదవండి: ఆ ఓటీటీలోనే 'మజాకా' సినిమా)