
తమిళసినిమా: సినీ ఫైట్ మాస్టర్ కణల్ కన్నన్ బెయిల్‌పై మద్రాసు హైకోర్టు సడలింపు ఆదేశాలు జారీ చేసింది. ఆ మధ్య స్థానిక మదురవాయిల్‌లో హిందూ మున్నని పార్టీ నిర్వహించిన సమావేశంలో పాల్గొని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఈయన అరెస్టయిన విషయం తెలిసిందే. అనంతరం షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యారు. నాలుగు వారాల పాటు ఉదయం, సాయంత్రం రోజుకు రెండుసార్లు విచారణ అధికారుల ముందు హాజరై సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది.
ఇలాంటి పరిస్థితుల్లో కణల్ కన్నన్ షూటింగ్ నిమిత్తం ఇతర రాష్ట్రానికి వెళ్లాల్సి ఉండడంతో తన బెయిల్‌పై నిబంధనలను రద్దు చేయాలని దాఖలు చేశారు. విచారించిన న్యాయమూర్తి జగదీష్ చంద్ర ఒక వారం పాటు కణల్ కన్నన్ బెయిల్‌పై నిబంధనలు రద్దు చేస్తూ శనివారం ఆదేశాలు జారీ చేశారు.