Sandy Master Ex Wife Kaajal Pasupathi Makes a Surprise Visit Home - Sakshi
Sakshi News home page

Kaajal Pasupathi: విడాకులు తీసుకున్న పదేళ్లకు మాజీ భర్తకు కాజల్ సర్‌ప్రైజ్

Published Tue, Nov 15 2022 8:16 PM | Last Updated on Tue, Nov 15 2022 9:07 PM

Sandy Master ex wife Kaajal Pasupathi makes a surprise visit home  - Sakshi

తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన కొరియోగ్రాఫర్‌  శాండీ మాస్టర్. అతను నటి కాజల్ పశుపతిని వివాహం చేసుకున్నారు. అయితే కొన్ని విభేదాల కారణంగా ఈ జంట 2012లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత శాండీ మరో అమ్మాయి సిల్వియాను వివాహమాడారు. కానీ తాజాగా అకస్మాత్తుగా మాజీ భార్య కాజల్ అతని ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. విడాకులు తీసుకుని పదేళ్లకు ఆమె శాండీ ఇంటికి వెళ్లడంతో షాక్‌కు కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. 

అయితే ఇటీవలే శాండీ ఇంటికి వెళ్లిన కాజల్ పసుపతి అతని భార్య సిల్వియా, ఇద్దరు పిల్లలు లాలా, షాన్ మైఖేల్‌తో మాట్లాడారు. అంతే కాకుండా శాండీ కుటుంబంతో ఆమె దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు కాజల్. విడాకుల తర్వాత కూడా ఈ జంట కలవడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. విడాకుల తర్వాత కూడా మంచి స్నేహం కొనసాగించడంపై కాజల్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఫోటోలను షేర్‌ చేసిన కాజల్.. 'శాండీ, సిల్వియా మీరు, మీ పిల్లలు సంతోషంగా ఉండాలి" అంటూ తన ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చింది. గతంలో శాండీ, సిల్వియా వివాహంపై కాజల్ విమర్శలు చేసింది. కానీ ఆ తర్వాత శాండీకి  శుభాకాంక్షలు తెలిపింది. తమ విడాకులపై శాండీని నిందించవద్దని.. అలాగే అతని రెండో భార్యను లక్ష్యంగా చేసుకోవద్దని ఆమె తన అభిమానులను అభ్యర్థించింది. కాగా.. 2019లో కాజల్ ఓ బిడ్డను దత్తత తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు ప్రకటించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement