Sandy
-
ఫ్యాన్స్‌కు షాకిచ్చిన నటి.. రెండో పెళ్లి చేసుకున్నకాజల్ పసుపతి ..!
నటి కాజల్ పసుపతి కోలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. కో, మౌన గురు, కథమ్ కథమ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో అల్లు శిరీష్ నటించిన ద్విభాషా చిత్రం గౌరవంలో కనిపించింది. అయితే 2008లో తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన కొరియోగ్రాఫర్ శాండీ మాస్టర్‌ను పెళ్లాడింది. ఆ తర్వాత విభేదాల కారణంగా 2012లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత శాండీ మరో అమ్మాయి సిల్వియాను వివాహమాడారు. కానీ కాజల్ పసుపతి మాత్రం ఇప్పటివరకు మరో పెళ్లి చేసుకోకుండానే ఒంటరిగానే ఉంటోంది. అయితే గతంలో ఓ బిడ్డను దత్తత తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు కాజల్ ప్రకటించింది. కానీ తాజాగా ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. శాండీతో విడాకులు తీసుకుని ఇప్పటికే 11 ఏళ్లయింది. తాను రెండో పెళ్లి చేసుకున్నానంటూ పాత పెళ్లి ఫోటోను షేర్ చేసింది. కాజల్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఫైనల్‌గా రెండో పెళ్లి చేసుకున్నా.. నన్ను క్షమించండి ఫ్రెండ్స్.. అందరూ క్షేమంగా ఉన్నారనే ఆశిస్తున్నా' అంటూ పోస్ట్ చేసింది. అయితే ఇది చూసిన నెటిజన్స్ కొందరు కంగ్రాట్స్ చెబుతుండగా..మరికొందరు మీ భర్త ఎవరంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది ఏకంగా ఇదంతా ఫేక్ అని కొట్టి పారేస్తున్నారు. అయితే కాజల్ కేవలం తన ఫోటోనే షేర్ చేయడంతో ఫ్రాంక్ చేసి ఉంటుందని ఆడియన్స్ భావిస్తున్నారు. లేదా ఏదైనా మూవీ ప్రమోషన్ కోసం ఇలా చేసి ఉంటుందని అంటున్నారు. రెండో పెళ్లిపై క్లారిటీ రావాలంటే కాజల్ స్పందించాల్సిందే. అయితే గతంలో ఆమె ఓ బీజేపీ నేతను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by KAAJAL PASUPATHI OFFICIAL⚛️ (@kaajal_pasupathi) -
మాజీ భర్తకు కాజల్ సర్ప్రైజ్.. విడాకులు తీసుకున్న పదేళ్లకు..!
తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన కొరియోగ్రాఫర్ శాండీ మాస్టర్. అతను నటి కాజల్ పశుపతిని వివాహం చేసుకున్నారు. అయితే కొన్ని విభేదాల కారణంగా ఈ జంట 2012లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత శాండీ మరో అమ్మాయి సిల్వియాను వివాహమాడారు. కానీ తాజాగా అకస్మాత్తుగా మాజీ భార్య కాజల్ అతని ఇంటికి వెళ్లి సర్ప్రైజ్ ఇచ్చింది. విడాకులు తీసుకుని పదేళ్లకు ఆమె శాండీ ఇంటికి వెళ్లడంతో షాక్‌కు కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. అయితే ఇటీవలే శాండీ ఇంటికి వెళ్లిన కాజల్ పసుపతి అతని భార్య సిల్వియా, ఇద్దరు పిల్లలు లాలా, షాన్ మైఖేల్‌తో మాట్లాడారు. అంతే కాకుండా శాండీ కుటుంబంతో ఆమె దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు కాజల్. విడాకుల తర్వాత కూడా ఈ జంట కలవడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. విడాకుల తర్వాత కూడా మంచి స్నేహం కొనసాగించడంపై కాజల్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఫోటోలను షేర్ చేసిన కాజల్.. 'శాండీ, సిల్వియా మీరు, మీ పిల్లలు సంతోషంగా ఉండాలి" అంటూ తన ఫేస్బుక్లో రాసుకొచ్చింది. గతంలో శాండీ, సిల్వియా వివాహంపై కాజల్ విమర్శలు చేసింది. కానీ ఆ తర్వాత శాండీకి శుభాకాంక్షలు తెలిపింది. తమ విడాకులపై శాండీని నిందించవద్దని.. అలాగే అతని రెండో భార్యను లక్ష్యంగా చేసుకోవద్దని ఆమె తన అభిమానులను అభ్యర్థించింది. కాగా.. 2019లో కాజల్ ఓ బిడ్డను దత్తత తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు ప్రకటించింది. View this post on Instagram A post shared by Kaajal PasuPathi (@kaajal_pasupathi__verified) View this post on Instagram A post shared by Kaajal PasuPathi (@kaajal_pasupathi__verified) -
మరో రియల్ లైఫ్ క్యారెక్టర్లో...
‘వంగవీటి’ సినిమాలో వంగవీటి రంగా, వంగవీటి రాధా... రెండు పాత్రల్లో ఆకట్టుకున్న సాండీ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు నిర్మించనున్న ఈ చిత్రానికి ‘దళం’ ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు జార్జ్‌రెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించబోతున్నాం. 1962 నుంచి 1972లలో విద్యార్థి రాజకీయాలు, ఆనాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, ఓయూ పరిణామాలు, జార్జ్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం ఉంటుంది. ప్రీ–ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. భారీ బడ్జెట్‌తో తెలుగు సినిమాల్లోనే ఒక డిఫరెంట్ జానర్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో తెలుగు నటులతో పాటు హిందీ, తమిళ, మలయాళ నటులు ప్రధాన పాత్రలు పోషిస్తారు. తెలుగు, హిందీ భాషల్లో రానున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను త్వరలో విడుదల చేస్తాం. మరాఠీ సినిమా ‘సైరాట్’ కెమెరామన్ సుధాకర్ ఎక్కంటి మా చిత్రానికి పని చేయనున్నారు’’ అన్నారు. -
ఎవరిది?
మిస్టరీ రైలు వేగంగా పరిగెడుతోంది. ‘‘అబ్బా... గుండె పట్టేసినట్టుగా ఉంది’’... తనలో తనే అనుకుంది మిషెల్లా. ఏదో ఇబ్బంది. గుండెను ఎవరో పట్టి నొక్కుతున్నట్టుగా అనిపిస్తోంది. వెంటనే బ్యాగ్‌లోంచి వాటర్ బాటిల్ తీసి రెండు గుటకలు తాగింది. కాస్త నెమ్మదించినట్టుగానే ఉంది. ‘‘ఏంటండీ... ఒంట్లో బాలేదా?’’ అంది ఎదురుగా కూర్చున్నామె. అవు నన్నట్టు తలూపింది మిషెల్లా. ‘‘ఏంటో నండీ... సడెన్‌గా గుండె పట్టేసినట్టు అవుతోంది’’ అంది. ‘‘అవునా? ఇదే మొదటిసారా ఇంతకుముందెప్పుడైనా ఇలా అయ్యిందా?’’ అందామె. ఆవిడా ప్రశ్న ఎందుకడిగిందో తెలియదు కానీ, మనసులో ఏదో మెదిలి నట్టయ్యింది మిషెల్లాకి. తనకు ఇంతకు ముందు ఇలా అయ్యిందా? అయ్యింది. గత వారం. సరిగ్గా రైల్లోనే. కరెక్ట్‌గా ఈ ప్రదేశానికి వచ్చినప్పుడే. తనకేం అనా రోగ్యం లేదు. కానీ గతవారం ఈ రైల్లో ప్రయాణించినప్పుడు ఉన్నట్టుండి గుండె పట్టినట్టయ్యింది. చెమటలు పోశాయి. రైలు దిగీ దిగగానే ఆస్పత్రికి పరుగెత్తింది. మొత్తం చెకప్ చేసి ఏమీ లేదన్నాడు డాక్టర్. కానీ ఇప్పుడు మళ్లీ ఇలా అయ్యింది. ఏంటిది? ఏం జరుగుతోంది? మైండ్ డైవర్ట్ చేసుకోడానికి పుస్తకం తీసి చదవడం మొదలుపెట్టింది. అర గంట తిరిగేసరికల్లా గమ్యస్థానం చేరు కుంది. ఆ విషయం మర్చిపోయింది. కానీ దాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం సరిగ్గా వారం తర్వాత వచ్చింది. తాను డొనేషన్స్ ఇచ్చే పక్క ఊరి అనాథాశ్రమంలోని పిల్లలతో గడపడానికి రెలైక్కింది మిషెల్లా. మళ్లీ అదే రైలు. అదే ప్రదేశం. అదే సమయం. అదే అవస్థ. గుండె పట్టింది. వెన్నులోంచి వణుకు పుట్టుకొచ్చింది. ఏదో ఉంది. ఈ ప్రదేశానికి వచ్చేసరికి తనకేదో అవుతోంది. చెబుదామంటే బోగీలో ఎవరూ లేరు. దాంతో మరింత భయం వేసింది. చల్లగాలి కోసం కిటికీ తెరిచింది. అంతే... ఉలిక్కిపడింది. తెల్లని గౌను... చిన్న జుత్తు... తన వైపే చూస్తోందామె. రైలుతో పాటు సాగు తోంది. కాళ్లు కనబడవే. నేల మీద నిల బడదే. గాలిలో తేలుతోంది. దెయ్యమా? అవును దెయ్యమే. గుండె జారిపోయింది మిషెల్లాకి. రెప్ప వేయడం మర్చిపో యింది. అప్పుడు కనిపించింది ఆమె ముఖం స్పష్టంగా. శాండీ! విస్తుపోయింది మిషెల్లా. ‘‘శాండీ’’ అంది వణుకుతోన్న స్వరంతో. ‘‘గుర్తుపట్టావా అమ్మా! నేను అక్కడే ఉన్నాను. నేను నీకు అక్కడే దొరుకుతాను. రామ్మా... తప్పకుండా వస్తావు కదూ?’’ ఆమె రూపం దూరంగా వెళ్లిపోతోంది. మెల్లగా చీకటిలో కలిసిపోతోంది. ‘శాండీ’ అంటూ మిషెల్లా అరుస్తోంది. కానీ ఆమె ఆగలేదు. మాయమైపోయింది. ఎప్పటికో తేరుకుంది మిషెల్లా. ఎంతోకాలంగా తన మనసులో ఉన్న ప్రశ్నలన్నింటికీ జవాబు దొరుకుతున్నట్టుగా అనిపించింది. ‘‘అయామ్ సారీ మిసెస్ మిషెల్లా’’... జాలిగా అన్నాడు ఇన్స్పెక్టర్. మిషెల్లా మాట్లాడలేదు. అటవీ ప్రాంతంలో వెతికి వెతికి తుప్పల మధ్య నుంచి తీసిన ఆ అస్తిపంజరాన్ని చూస్తోంది. తన కూతురు శాండీ. నెల రోజుల క్రితం... పని మీద పక్క సిటీకి వెళ్లింది. తిరిగి రాలేదు. ఎంత వెతికినా కనిపించలేదు. చివరికి ఆమె ఆత్మ వచ్చి జాడ తెలిపింది. ఆమెను ఎవరో అత్యాచారం చేసి చంపేశారని పోస్ట్‌మార్టం రిపోర్టు వెల్లడించింది. ఎవరో రైల్లోనే రేప్ చేసి చంపేసి, బయటకు విసిరేసి ఉంటారని పోలీసులు అన్నారు. మిషెల్లా అమ్మ మనసు అల్లాడి పోయింది. తర్వాతి వారం రైలులో వెళ్తు నప్పుడు ఆ ప్రాంతానికి ఎప్పుడు చేరు కుంటానా అని ఆమె తహతహలాడింది. రైలు అక్కడికి చే రుకుంది. కానీ ఈసారి మిషెల్లా గుండె పట్టెయ్యలేదు. ఆతృతగా కిటికీ తీసి చూసింది మిషెల్లా. చుట్టూ వెతికింది. ఎక్కడా శాండీ కనిపించలేదు. ఇక కనిపించదేమో. తనకు ఏమయ్యిందో తల్లికి తెలియజేయడానికే అన్నాళ్లూ అక్కడ సంచరించిందేమో. ఇక తన పని పూర్త య్యిందని పై లోకానికి వెళ్లిపోయిందేమో. ఆకాశం వైపు చూసింది మిషెల్లా. ‘‘నా బిడ్డ నరకం అనుభవించి చచ్చిపోయింది. మనశ్శాంతి లేకుండా ఆత్మగా తిరుగా డింది. కనీసం అక్కడైనా దానికి శాంతి కలిగించు తండ్రీ’’ అంటూ మనసులోనే ప్రార్థించింది!