నటి కాజల్ పసుపతి కోలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. కో, మౌన గురు, కథమ్ కథమ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో అల్లు శిరీష్ నటించిన ద్విభాషా చిత్రం గౌరవంలో కనిపించింది. అయితే 2008లో తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన కొరియోగ్రాఫర్ శాండీ మాస్టర్‌ను పెళ్లాడింది. ఆ తర్వాత విభేదాల కారణంగా 2012లో విడాకులు తీసుకుంది.
ఆ తర్వాత శాండీ మరో అమ్మాయి సిల్వియాను వివాహమాడారు. కానీ కాజల్ పసుపతి మాత్రం ఇప్పటివరకు మరో పెళ్లి చేసుకోకుండానే ఒంటరిగానే ఉంటోంది. అయితే గతంలో ఓ బిడ్డను దత్తత తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు కాజల్ ప్రకటించింది. కానీ తాజాగా ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. శాండీతో విడాకులు తీసుకుని ఇప్పటికే 11 ఏళ్లయింది. తాను రెండో పెళ్లి చేసుకున్నానంటూ పాత పెళ్లి ఫోటోను షేర్ చేసింది.
కాజల్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఫైనల్‌గా రెండో పెళ్లి చేసుకున్నా.. నన్ను క్షమించండి ఫ్రెండ్స్.. అందరూ క్షేమంగా ఉన్నారనే ఆశిస్తున్నా' అంటూ పోస్ట్ చేసింది. అయితే ఇది చూసిన నెటిజన్స్ కొందరు కంగ్రాట్స్ చెబుతుండగా..మరికొందరు మీ భర్త ఎవరంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది ఏకంగా ఇదంతా ఫేక్ అని కొట్టి పారేస్తున్నారు. అయితే కాజల్ కేవలం తన ఫోటోనే షేర్ చేయడంతో ఫ్రాంక్ చేసి ఉంటుందని ఆడియన్స్ భావిస్తున్నారు. లేదా ఏదైనా మూవీ ప్రమోషన్ కోసం ఇలా చేసి ఉంటుందని అంటున్నారు. రెండో పెళ్లిపై క్లారిటీ రావాలంటే కాజల్ స్పందించాల్సిందే. అయితే గతంలో ఆమె ఓ బీజేపీ నేతను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment