Second marriage
-
మొదటి భర్త ఉండగానే రెండో పెళ్లి
హొసపేటె: మొదటి భర్త ఉండగానే అతనిని వదిలేసి మరో పెళ్లి చేసుకున్న కేసులో మహిళకు జేఎంఎఫ్‌సీ కోర్టు జైలు శిక్ష విధించింది. వివరాలు.. దేవిక అనే మహిళకు 2008 మార్చి 21న సత్యనారాయణ అనే వ్యక్తితో పెళ్లయింది, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2014 ఫిబ్రవరి 25న బీదర్ జిల్లా భాల్కి తాలూకా ఆలహళ్లి గ్రామానికి చెందిన అంబరీష్ ను రిజిస్ట్రార్ కార్యాలయంలో రెండో పెళ్లి చేసుకుంది. దీంతో తనను మోసం చేసిందని మొదటి భర్త టీబీ డ్యాం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్రైం ఎస్ఐ స్వామి కేసు దర్యాప్తు చేసి నిందితురాలిపై విచారణ జరిపి చార్జిషిటును దాఖలు చేశారు. హొసపేటెలోని జేఎంఎఫ్‌సీ కోర్టులో విచారణ సాగుతోంది. మంగళవారం తుది విచారణలో నేరం రుజువు కావడంతో జడ్జి అశోక్.. నిందితురాలు దేవికకు రెండేళ్ల సాధారణ జైలు శిక్ష, రూ.5000 జరిమానా విధించారు. పీపీ రేవణ్ణ సిద్దప్ప వాదనలు వినిపించారు. -
ప్రియుడితో ప్రముఖ సింగర్ రెండో పెళ్లి.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్!
ప్రముఖ మలయాళ సింగర్ అంజు జోసెఫ్ వివాహబంధంలోకి అడుగుపెట్టింది. అయితే తన పెళ్లి చాలా సింపుల్‌గా చేసుకుంది. తన ప్రియుడు ఆదిత్య పరమేశ్వరన్‌ను ఆమె పెళ్లాడింది. సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అంజు జోసెఫ్ అలప్పుజా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లి చేసుకున్నారు.శుక్రవారం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న అంజు.. ఆ తర్వాత శనివారం అతిథుల కోసం వివాహా రిసెప్షన్ వేడుక నిర్వహించింది. ఈ వేడుకలో పలువురు సినీతారలు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి కూడా ఈ రిసెప్షన్‌కు హాజరయ్యారు.కాగా.. అంజు జోసెఫ్ డాక్టర్ లవ్ చిత్రంలోని చిల్లానే పాటతో సింగర్‌గా మాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె పలు మలయాళ సినిమాలో పదికి పైగా పాటలు పాడింది. తనదైన టాలెంట్‌తో అభిమానులను సంపాదించుకుంది. ఆమె తొలిసారిగా అర్చన 31 నాటౌట్ అనే చిత్రంలోనూ నటించింది. అయితే గతంలో అంజు స్టార్ స్టార్ మ్యాజిక్ సీరియల్ డైరెక్టర్ అనూప్ జాన్‌ను వివాహం చేసుకున్నారు. కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. View this post on Instagram A post shared by Anju Joseph (@anjujosephofficial) -
రెండో పెళ్లి చేసుకున్న దర్శకుడు క్రిష్ జాగర్లమూడి.. అమ్మాయి ఎవరంటే? (ఫోటోలు)
-
రెండో పెళ్లి చేసుకున్న డైరెక్టర్ క్రిష్
తెలుగు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ప్రీతి చల్లా అనే డాక్టర్‌తో కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు. ఈమెది హైదరాబాద్. గతంలోనే ఈమెకు వివాహం జరిగినప్పటికీ.. పలు కారణాల వల్ల భర్తతో విడాకులు తీసుకుంది. ఈమెకు 11 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడట. ఇద్దరి పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇప్పుడు పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది.2008లో వచ్చిన 'గమ్యం' సినిమాతో దర్శకుడిగా మారిన క్రిష్.. వేదం, కొండపొలం, గౌతమిపుత్ర శాతకర్ణి తదితర చిత్రాలు తీశాడు. 16 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ హిట్స్ అయితే కొట్టలేకపోయాడు. మధ్యలో రమ్య అనే డాక్టర్ని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ బంధం ఎంతో కాలం నిలబడలేదు. విభేదాల కారణంగా వీళ్లిద్దరూ విడిపోయారు. రమ్య.. మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని యూఎస్‌లో సెటిల్ అయిపోయింది.(ఇదీ చదవండి: కన్నడ బ్యాచ్ కన్నింగ్ గేమ్.. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు?)చాన్నాళ్ల క్రితం క్రిష్ పెళ్లి గురించి రూమర్స్ వచ్చాయి. హీరోయిన్ అనుష్కని పెళ్లి చేసుకుంటాడని అన్నారు. కానీ ఇప్పుడు ప్రీతి చల్లాని పెళ్లి చేసుకోవడంతో వాటికి ఎండ్ కార్డ్ పడింది. అలానే కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన క్రిష్‌కి పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు.పవన్‌తో 'హరిహర వీరమల్లు' సినిమాని క్రిష్ డైరెక్ట్ చేయాలి. కానీ ప్రాజెక్ట్ లేట్ అవుతూ ఉండేసరికి తప్పుకొన్నాడు. ప్రస్తుతం అనుష్కతో 'ఘాటీ' చేస్తున్నాడు. త్వరలో ఈ మూవీ రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. అవి ఏంటంటే?) -
డైరెక్టర్ క్రిష్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారా?
ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం, మళ్లీ పెళ్లి చేసుకోవడం.. ఇలాంటి మాటలు సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. త్వరలో నాగచైతన్య కూడా ఇలానే మళ్లీ పెళ్లిచేసుకోబోతున్నాడు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో కొత్త జీవితం ప్రారంభించబోతున్నాడు. ఇదలా ఉంచితే తెలుగు దర్శకుడు క్రిష్ కూడా మరోసారి వివాహం చేసుకోబోతున్నాడనే రూమర్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయాయి.(ఇదీ చదవండి: మొదటి భర్త గురించి అమలాపాల్ ఇన్‌డైరెక్ట్ కామెంట్స్)'గమ్యం', 'వేదం' తదితర సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న క్రిష్.. 2016లో రమ్య అనే డాక్టర్ని పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు బాగానే ఉన్నారు కానీ మనస్పర్థలు వచ్చి 2021లో విడిపోయారు. అప్పటినుంచే సింగిల్‌గానే ఉంటున్న క్రిష్.. ఇప్పుడు కొత్త జీవితంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడట. ఓ లేడీ డాక్టర్‌తో త్వరలో పెళ్లి జరగనుందని తెలుస్తోంది. వచ్చే వారం ఈ మేరకు నిశ్చితార్థం జరుపుకోనున్నారనే టాక్ వినిపిస్తుంది.క్రిష్ పెళ్లి చేసుకోబోయే మహిళకు ఇదివరకే పెళ్లయి విడాకులు తీసుకుందని, 11 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడని అంటున్నారు. మరి ఈ రూమర్స్ నిజమేనా అనేది తెలియాల్సి ఉంది. చివరగా 'కొండపొలం' మూవీతో పలకరించిన క్రిష్.. పవన్ 'హరిహర వీరమల్లు' సినిమా మొదలుపెట్టాడు. ఇది జరిగి ఏళ్లు గడిచిపోయింది. పవన్ ఎంతకీ ఈ మూవీ గురించి పట్టించుకోకపోవడంతో దర్శకుడిగా ఇతడు పక్కకు తప్పుకొన్నాడు. ప్రస్తుతం అనుష్కతో 'ఘాటీ' మూవీ చేస్తున్నాడు. ఇంతలోనే ఇలా క్రిష్ పెళ్లి రూమర్స్ రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: డబ్బు లాక్కొని హీరోయిన్ని భయపెట్టిన బిచ్చగాడు) -
భార్యను ఏమార్చి రెండో వివాహం
కందుకూరు: భార్యతో ప్రేమగా ఉంటూనే ఆమె కళ్లుగప్పి మరో వివాహం చేసుకున్నారో ప్రబుద్ధుడు. విషయం తెలుసుకున్న ఆమె కల్యాణ మండపానికి చేరుకునేలోపే మరో యువతితో వివాహం జరిగిపోయింది. దీంతో వివాదం పోలీస్‌స్టేషన్‌కు చేరింది. కందుకూరు పట్టణంలో ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. బాధితురాలి వివరాల మేరకు.. దగదర్తి మండలం ధర్మవరానికి చెందిన యర్రయ్య కుమారుడు రూబేను బీటెక్ పూర్తి చేశారు. కావలిలోని కచ్చేరిమిట్ట కాలనీలో నివాసం ఉంటున్న అరుణకుమారి, విజయ్‌కుమార్ దంపతుల కుమార్తె నీలిమతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. దీంతో వీరు 2012లో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వీరికి కెవిన్ రూబెన్, స్టెపానీ గోల్డ్ పిల్లలు. ఈ క్రమంలో గ్రామంలో మీ సేవ, ఆన్లైన్ సెంటర్‌ను కొంతకాలం నిర్వహించారు. అనంతరం దంపతుల నడుమ ఏర్పడిన విభేదాలు పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లాయి. పెద్దల సమక్షంలో రాజీ చేసుకొని ఇటీవల నుంచి సఖ్యతగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సాఫ్ట్వేర్ ఉద్యోగమంటూ రూబేను హైదరాబాద్ వెళ్లారు. అక్కడే ఉద్యోగం చేస్తున్నట్లు భార్య, పిల్లలను నమ్మించారు. కావలి కోర్టులో ఉద్యోగం చేస్తున్న నీలిమ అక్కడే ఉంటూ పిల్లలను చూసుకోసాగారు. ఫోన్ నంబర్ బ్లాక్ నిత్యం భార్యాపిల్లలతో ఫోన్లో మాట్లాడే రూబేను అకస్మాత్తుగా నీలిమ నంబర్‌ను బ్లాక్ చేశారు. కోర్టు విధులకు శుక్రవారం హాజరైన నీలిమ.. రూబేనుకు కందుకూరులో మరో వివాహం జరుగుతోందనే విషయాన్ని పాస్టర్ ద్వారా తెలుసుకున్నారు. వెంటనే పిల్లలు, బంధువులతో కలిసి వివాహం జరుగుతున్న ఎస్వీఎస్ కల్యాణ మండపానికి చేరుకున్నారు. అక్కడికి చేరుకునేసరికే భర్త రెండో వివాహం పూర్తయిపోయింది. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు రూబేనును స్టేషన్‌కు తరలించారు. పేరు మార్చుకొని.. వివాహం కోసం తన పేరును ఆదర్శ్‌గా మార్చుకొని కందుకూరు మండలం కోవూరుకు చెందిన శ్రీవాణిని వివాహం చేసుకున్నారు. మొదటి భార్య వచ్చి బండారం బయటపెట్టడంతో పెళ్లి వివాదంగా మారింది. దీంతో శ్రీవాణిని ఆమె తరఫు బంధువులు ఇంటికి తీసుకెళ్లారు. -
భర్త రెండవ పెళ్లి.. మొదటి భార్య గలాటా
చిక్కబళ్లాపురం: భార్య నిక్షేపంగా ఉండగానే భర్త రెండవ పెళ్లి చేసుకుంటూ ఉండగా భార్య వచ్చి గలాటా చేయడంతో అందరూ అవాక్కయ్యారు. మామూలుగా ఇటువంటి సీన్లు సినిమాలలో సీరియళ్లలో కనిపిస్తాయి. కానీ ఈ సంఘటన నిజంగా బుధవారం చిక్కబళ్లాపురంలోని సీఎస్ఐ చర్చిలో జరిగింది. వివరాలు.. 2018లో నోహన్కాంత్కు రశ్మి అనే యువతితో పెళ్లయింది. వారికి ఒక పాప జన్మించింది. గొడవలు రావడంతో దంపతులు విడివిడిగా ఉంటున్నారు. ఇంతలో నోహన్కాంత్ గ్లోరి అనే యువతితో రెండవ పెళ్లి చేసుకుంటూ ఉండగా రశ్మి వచ్చి అడ్డుకుంది. దీంతో ఇరువర్గాల మధ్య పోట్లాట జరిగింది. నాకు విడాకులు ఇవ్వకుండా రెండవ పెళ్లి ఎలా చేసుకొంటావ్, నా కూతురికి, నాకు న్యాయం కావాలని రశ్మి పట్టుబట్టింది. నోహన్కాంత్ మాట్లాడుతూ తమకు 2022 లో విడాకులు వచ్చాయని, చట్ట ప్రకారం రెండవ పెళ్లి చేసుకొంటున్నాను అని చెప్పాడు. చివరకు గొడవ పోలీసు స్టేషన్‌కు చేరింది. -
రెండో పెళ్లికి సిద్ధమైన భర్త.. ఝలక్ ఇచ్చిన మొదటి భార్య
సాక్షి, తిరుపతి: తిరుమలలో రెండో వివాహానికి సిద్ధమైన వ్యక్తికి తన భార్య ఝలక్ ఇచ్చింది. కోర్టులో కేసు విచారణలో ఉండగా తెలంగాణకి చెందిన రాకేష్ అనే వ్యక్తి మౌన స్వామి మఠంలో వివాహానికి సిద్ధమయ్యాడు. సమాచారం తెలుసుకున్న భార్య సంధ్యా ఉదయం మండపం వద్ద వివాహాన్ని అడ్డుకుంది.వెంటనే మఠం వద్దకు పోలీసులు రావడంతో రెండవ పెళ్లి పంచాయితీ స్టేషన్‌కి చేరింది. 2016లో రాకేశ్ సంధ్యాలకు వివాహం జరగ్గా, ఆడపిల్ల పుట్టిందని వదిలించుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నాడు. దీంతో తన భార్య కోర్టును ఆశ్రయించగా, ప్రస్తుతం విచారణ జరుగుతుంది.. కానీ కోర్టు ఆదేశాలను తుంగలో తొక్కి రాకేష్ రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. -
ఇటీవలే రెండో పెళ్లి.. భార్యతో కేక్ కట్ చేసిన బిగ్‌బాస్ విన్నర్!
బిగ్‌బాస్ విన్నర్ మునావర్ ఫారూఖీ ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే రెండో పెళ్లి చేసుకున్నారు. గతేడాది బిగ్‌బాస్ సీజన్-17లో విజేతగా నిలిచిన మునావర్ మరోసారి వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. మేకప్ ఆర్టిస్ట్ అయిన మెహజబీన్ కోట్వాలాను పెళ్లాడారు. పెళ్లయిన పది రోజుల తర్వాత ముంబయిలో రిస్పెప్షన్ వేడుక కూడా నిర్వహించారు.తాజాగా మునావర్.. తన భార్య మహ్జబీన్ కోట్వాలాతో కలిసి కేక్ కట్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరలవుతున్నాయి. మేకప్ ఆర్టిస్ట్ మెహజబీన్ కోట్వాలాను సీక్రెట్‌గా వివాహం జరిగిన విషయం అత్యంత సీక్రెట్‌గా ఉంచారు. ఈనెల 26న ఆదివారం ముంబయిలోని ఐటీసీ మరాఠాలో రిసెప్షన్‌తో ఈ విషయం బయటకొచ్చింది. ఈ వేడుకలో నటి హీనా ఖాన్ సందడి చేసింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో 'మేరే యార్ కి షాదీ హై' అంటూ ఫోటోను పంచుకున్నారు.కాగా.. మునావర్‌కు గతంలోనే వివాహం జరిగింది. అతనికి మొదటి భార్యతో ఓ కుమారుడు ఉన్నాడు. మరోవైపు మెహజబీన్కు కూడా 10 ఏళ్ల కుమార్తె ఉన్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by MunawarXTabish (@munawar___faruquiiii) -
మహానటి.. సునీత.. వివేకా రెండో వివాహం గురించే తెలియదట
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి.. షమీమ్ అనే మహిళను పెళ్లి చేసుకోవడం, ఆమెతో ఒక కుమారుడిని కూడా కనడం వల్లే ఆయన కుటుంబంలో విభేదాలు చెలరేగి.. హత్యకు దారితీశాయని ఊరువాడా కోడై కూస్తున్నా.. వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత మాత్రం తన తండ్రి రెండో వివాహం గురించి తనకు తెలియదని చెబుతుండటం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. ‘వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకున్నారట కదా.. ఆమెతో ఆయనకు ఓ కుమారుడు ఉన్నాడట కదా.. అందుకే మీ కుటుంబంలో విభేదాలు ఏర్పడ్డాయంట కదా’ అని కొద్దిరోజుల క్రితం నర్రెడ్డి సునీత హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఒక మీడియా ప్రతినిధి ఆమెను ప్రశ్నించారు. దీనికి ఆమె తన రెండు భుజాలు ఎగురవేస్తూ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా.. ‘ఐ డోంట్ నో (నాకు తెలియదు)’ అని. నిజంగానే వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకున్న విషయం సునీతకు తెలీదా అంటే ఎందుకు తెలీదు...పూర్తిగా తెలుసు అనే సమాధానమే వస్తోంది. షమీమ్ అనే ముస్లిం మహిళను వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకున్న విషయం బహిరంగ రహస్యం. షమీమ్‌ను వివేకా 2010లో ముస్లిం సంప్రదాయం ప్రకారం రెండో వివాహం చేసుకున్నారు. వారిద్దరికీ 2014లో ఓ కుమారుడు జన్మించారు. ఆ కుమారుడికి షెహెన్ షా అనే పేరు కూడా పెట్టారు. వివేకా తన రెండో భార్య షమీమ్, కుమారుడు షెహెన్ షాతో కలసి ఉన్న ఫొటోలు, వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. వివేకా రెండో వివాహం వల్లే ఆయన కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. తన రెండో భార్య షమీమ్‌కు ఆస్తిలో వాటా ఇస్తానని.. తన కుమారుడిని రాజకీయ వారసుడిగా ప్రకటిస్తానని వివేకా చెప్పారు. దీంతో ఉలిక్కిపడ్డ వివేకా అల్లుడు, సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఆస్తి వారసత్వం తనకే దక్కాలని, రాజకీయ వారసత్వం తనకే దక్కాలని వివేకా పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి పట్టు బట్టారు. ఆ విభేదాలతోనే వివేకా మొదటి భార్య సౌభాగ్యమ్మ పులివెందులను వదిలేసి హైదరాబాద్‌లో కుమార్తె సునీత నివాసంలో ఉండేవారు. ఇక సునీత.. షమీమ్‌ను తీవ్రంగా దూషిస్తూ వాట్సాప్ సందేశాలు పంపారు. ఆ విషయాన్ని కూడా షమీమ్.. వివేకా దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయాలను షమీమ్ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలోనూస్పష్టంగా పేర్కొన్నారు. షమీమ్ తన వాంగ్మూంలో వెల్లడించిన విషయాలు ఇవీ.. రెండో పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారు.. వివేకా రెండో పెళ్లిని ఆయన కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. సునీత ఏకంగా షమీమ్‌కు ఫోన్ చేసి తీవ్రంగా బెదిరించారు. శివప్రకాశ్‌రెడ్డి కూడా షమీమ్ బావకు ఫోన్ చేసి తీవ్రంగా దూషించడంతో ఆయన కుటుంబం పులివెందుల వదిలివెళ్లిపోయింది. ఆ విషయం తెలిసి వివేకా తీవ్ర ఆగ్రహంతో శివప్రకాశ్‌రెడ్డి కాలర్ పట్టుకుని నిలదీశారు. షమీమ్‌ను తాను రెండో పెళ్లి చేసుకున్నానని.. ఆమె తన భార్యని స్పష్టం చేశారు. ఆస్తి, రాజకీయ వారసత్వం కోసమే కక్ష గట్టారు.. 2013 నుంచి సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివ ప్రకాశ్‌రెడ్డిల నుంచి షమీమ్‌కు వేధింపులు తీవ్రమయ్యాయి. 2014లో వివేకా, షమీమ్‌లకు బాబు పుట్టాడు. ఆ బాబుకు షెహెన్ షా అనే పేరుపెట్టి ఆస్తిలో వాటా ఇస్తాననడంతోపాటు తన రాజకీయ వారసుడిగా ప్రకటిస్తానని కూడా వివేకా చెప్పారు. వివేకా మొదటి భార్యకు కుమారుడు లేకపోవడంతో ఆయన ఆస్తికి ఏకైక వారసుడిని కావాలని అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి భావించారు. ఆయన రాజకీయ వారసుడిని కావాలని నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి పట్టుదలగా ఉండేవారు. దీంతో వారిద్దరూ వివేకానందరెడ్డిపై కక్ష గట్టారు. బైరటీస్ గనులు ఉన్న నాలుగు ఎకరాల భూమిని షమీమ్ కుమారుడి పేరున రాయాలని వివేకా భావించారు. కానీ అందుకు సునీత, నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ నాలుగు ఎకరాల భూమిని శివప్రకాశ్‌రెడ్డి తన పేరున రాయించేసుకున్నారు. అంతేకాకుండా వివేకా అప్పటికే షమీమ్‌కు ఇచ్చిన ఓ ఇంటి పత్రాలను కూడా బలవంతంగా శివప్రకాశ్‌రెడ్డి తీసేసుకున్నారు. షమీమ్‌ను దూషించిన సునీత సునీత.. వివేకా రెండో భార్య షమీమ్‌కు ఫోన్ చేసి బెదిరించారు. ఆమెను తీవ్రంగా దూషించారు. సునీత తనను ఎలా దూషించిందీ చెబుతూ షమీమ్.. వివేకాకు వాట్సాప్ సందేశాలు పంపారు. వివేకా హత్య కేసును దర్యాప్తు చేసిన సిట్ అధికారులు ఆ వాట్సాప్ చాటింగ్‌లను అప్పట్లోనే వెలికి తీశారు కూడా. అయినా సరే తన తండ్రి వివేకా రెండో వివాహం గురించి తనకు తెలీయదని సునీత చెప్పడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. వివేకా హత్య కేసు వెనుక ఉన్న కుట్రను బయటకు రాకుండా చేసేందుకే ఆమె ఇలా అవాస్తవాలు మాట్లాడుతున్నారన్నది స్పష్టమవుతోంది. ఒంటరి అయిన వివేకా.. వివేకానందరెడ్డిని ఆయన మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది శివ ప్రకాశ్ రెడ్డి తీవ్రంగా వేధించారు. కుటుంబానికి చెందిన కంపెనీలలో డైరెక్టర్‌గా ఆయనకు ఉన్న చెక్ పవర్‌ను తొలగించారు. ఆయన్ని ఒంటరిగా పులివెందులలో విడిచిపెట్టి కుటుంబసభ్యులు అందరూ హైదరాబాద్‌లో ఉండేవారు. దీంతో రోజువారి ఖర్చులకు కూడా ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పులు తీర్చడానికి హైదరాబాద్ మణికొండలో ఉన్న తన ఇంటిని కూడా 2018లో విక్రయించారు. -
వరలక్ష్మి ఎంగేజ్మెంట్.. కాబోయే భర్త గురించి విస్తుపోయే నిజాలు!
ఇప్పుడు వరలక్ష్మీ శరత్ కుమార్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవలే హనుమాన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ముద్దుగుమ్మ నాంది, క్రాక్, యశోద, వీరసింహారెడ్డి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. అయితే తమిళ స్టార్ యాక్టర్ శరత్ కుమార్ వారసురాలిగా అందరికీ తెలిసిందే. అయితే ఇదిలా ఉండగా.. ఉన్నట్టుండి ఈ భామ అభిమానులకు ఊహించని షాకిచ్చింది. పెళ్లిపై గతంలో చాలాసార్లు దాటవేస్తూ వచ్చిన వరలక్ష్మి ఏకంగా ఎంగేజ్మెంట్ చేసుకుని ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. ముంబయికి చెందిన గ్యాలరిస్ట్‌ను పెళ్లాడనుంది. దీంతో వరలక్ష్మి శరత్ కుమార్‌ను పెళ్లాడబోయే వ్యక్తిగా గురించి ఫ్యాన్స్ తెగ ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఆయన ఎవరు? వీరిద్దరికీ పరిచయం ఎలా ఏర్పడింది? అనే విషయాలపై ఆడియన్స్ నెట్టింట చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరలక్ష్మి చేసుకోబోయే నికోలయ్ సచ్దేవ్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అసలు అతనెవరు? వరలక్ష్మీకి ఎలా పరిచయమయ్యాడు? అతని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి వెతకగా.. ఆశ్చర్యపోయే నిజం బయటికొచ్చింది. వరలక్ష్మి అతన్ని పెళ్లి చేసుకోనుందన్న వార్త తెలియగానే.. నికోలయ్ సచ్దేవ్ గురించి ఆమె ఫ్యాన్స్ నెట్టింట వెతకడం మొదలెట్టారు. అయితే ఆయన గురించి అభిమానులకు గుండె పగిలే నిజం తెలిసింది. అతనికి ఇంతకుముందే పెళ్లయినట్లు సమాచారం. నికోలయ్ మొదట కవిత అనే ఓ మోడల్‌ను పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారట. దీంతో విషయం తెలుసుకున్న వరలక్ష్మి ఫ్యాన్స్ కాబోయే భర్తకు ఇది రెండో పెళ్లా? అని చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై నికోలయ్, వరలక్ష్మీ కానీ ఇంకా స్పందించలేదు. వీరిలో ఎవరైనా క్లారిటీ ఇస్తే అసలు విషయం తెలిసే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈ విషయంలో వరలక్ష్మి ఫ్యాన్స్ మాత్రం ఆశ్చర్యానికి గురవుతున్నారు. View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) -
రెండో పెళ్లి చేసుకున్న సైతాన్ నటి.. వరుడు ఎవరంటే?
ప్రముఖ మలయాళ నటి లేనా తెలుగులో వచ్చిన సైతాన్ వెబ్ సిరీస్‌లో నటించింది. మహి వీ రాఘవ తెరకెక్కించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సిరీస్‌లో లేనా మేరీ జోసెఫ్ పాత్రలో మెప్పించింది. ఆమె ప్రస్తుతం పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తోన్న ఆడుజీవితం చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఈ భామ వివాహాబంధంలోకి అడుగుపెట్టిన విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ఈ 42 ఏళ్ల నటి జనవరి 17న ప్రముఖ ఆస్ట్రోనాట్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌ను పెళ్లాడినట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. నెలన్నర తర్వాత రివీల్.. పెళ్లి చేసుకున్న దాదాపు 40 రోజుల తర్వాత తన పెళ్లి విషయాన్ని బయటపెట్టింది లేనా. అయితే ఇది ఆమెకు రెండో వివాహం కాగా.. మొదటి భర్తతో విడాకులు తీసుకుంది. ఇటీవల కేరళలో పర్యటించిన మోదీ గగన్‌యాన్ ప్రాజెక్ట్‌లో పాల్గొనే నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రకటించారు. వారిలో పైలట్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ కూడా ఉన్నారు. గగన్‌యాన్‌లో పాలుపంచుకునే నలుగురి పేర్లను మోదీ ప్రకటించిన వెంటనే లేనా తన పెళ్లి విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ప్రశాంత్ నాయర్‌తో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. లేనా తన ఇన్‌స్టాలో రాస్తూ..' ఈరోజు, ఫిబ్రవరి 27, 2024న, మన ప్రధాని మోదీ భారత వైమానిక దళ ఫైటర్ పైలట్, గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌కు మొదటి భారతీయ ఆస్ట్రోనాట్ వింగ్స్ బహుకరించారు. మన దేశం, కేరళ, ముఖ్యంగా నాకు ఇది చాలా గర్వించదగ్గ చారిత్రక సందర్భం. అధికారికంగా నేను ప్రశాంత్‌ను జనవరి 17, 2024న సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నానని మీకు తెలియజేయడానికి ఈ ప్రకటన కోసం వేచి ఉన్నా' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. భారతదేశపు మొట్టమొదటి మానవ అంతరిక్ష ఫ్లైట్ మిషన్ గగన్‌యాన్ కోసం శిక్షణ పొందిన నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని మోదీ ప్రకటించారు. వారిలో కెప్టెన్ ప్రశాంత్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా ఎంపికయ్యారు. ఈ నలుగురు వ్యోమగాములు రష్యాలోని యూరి గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందారు. View this post on Instagram A post shared by Lenaa ലെന (@lenaasmagazine) -
సానియా మీర్జాకు విడాకులు?.. నటిని పెళ్లాడిన షోయబ్ మాలిక్!
Shoaib Malik marries Pakistani actress Sana Javed:పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. పాకిస్తానీ నటి సనా జావెద్‌ను పెళ్లాడాడు. ఈ విషయాన్ని షోయబ్ మాలిక్ స్వయంగా వెల్లడించాడు. సోషల్ మీడియా వేదికగా తమ పెళ్లి ఫొటోలు పంచుకుంటూ.. ‘‘జంటగా మేము ఇలా’’ అంటూ హార్ట్ ఎమోజీలు జతచేశాడు షోయబ్ మాలిక్. షోయబ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సానియా కాగా భారత టెన్నిస్ స్టార్, హైదరాబాదీ సానియా మీర్జా- షోయబ్ మాలిక్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2010లో వీరి వివాహం జరుగగా.. 2018లో కుమారుడు ఇజహాన్ జన్మించాడు. అయితే, సానియా కంటే ముందు షోయబ్ మాలిక్ అయేషా సిద్దిఖీ అనే మహిళను పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ఆమె నుంచి విడిపోయిన తర్వాత సానియాను పెళ్లాడినట్లు తెలుస్తోంది. హృదయం ముక్కలైందన్న సానియా ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా సానియా- షోయబ్ మధ్య విభేదాలు తలెత్తాయనే వార్తలు వచ్చాయి. వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారంటూ వదంతులు వ్యాపించాయి. నటి ఆయేషాతో ఓ ఫొటోషూట్‌లో షోయబ్ మాలిక్ అత్యంత సన్నిహితంగా కనిపించడం.. అదే సమయంలో హృదయం ముక్కలైందంటూ సానియా పోస్టులు పెట్టడం వీటికి ఊతమిచ్చింది. అదే విధంగా కుమారుడి పుట్టినరోజు వేడుకలోనూ సానియా- షోయబ్ అంటీ ముట్టనట్టుగానే వ్యవహరించడంతో విడాకుల వార్తలు విస్తృతంగా వ్యాపించాయి. ఈ నేపథ్యంలో సానియా మీర్జా బుధవారం నర్మగర్భ సందేశం పోస్ట్ చేయడంతో వీరు విడిపోయారని నిర్ధారణకు వచ్చారు నెటిజన్లు. వివాహ బంధం.. విడాకులు.. రెండూ క్లిష్టమైనవే: సానియా ‘‘వివాహ బంధం అత్యంత క్లిష్టమైనది. విడాకులు కూడా అంతే కష్టమైనవి. ఇందులో ఏది అత్యంత ఇబ్బందికరమైందో మీరే ఎన్నుకోండి. ఒబేసిటీ హార్డ్.. ఫిట్‌గా ఉండటం కూడా కష్టమే. మరి ఇందులో ఏది ఎంచుకుంటారు? అప్పుల్లో కూరుకుపోవడం కష్టంగా తోస్తుంది.. అదే సమయంలో ఆర్థికంగా క్రమశిక్షణతో ఉండటం కూడా అలాగే అనిపిస్తుంది. ఇందులో మీకు ఏం కావాలో ఎంచుకోండి. కమ్యూనికేట్ చేయడం.. కమ్యూనికేట్ చేయకుండా ఉండటం కూడా కష్టమే. ఇందులో ఏది అత్యంత కష్టమో మీరే ఎంచుకోండి. జీవితం నల్లేరు మీద నడకలాంటిది కాదు. తెలివిగా ఎంచుకోవాలి ఎప్పుడూ క్లిష్టతరంగానే ఉంటుంది. అయితే, అందులో మనకేదీ కావాలో మనం తెలివిగా ఎంచుకోవాలి’’ అని సానియా మీర్జా భావోద్వేగపూరిత నోట్ షేర్ చేసింది. ఇంతలో షోయబ్ మాలిక్ ఇలా శనివారం నటి సనా జావెద్‌తో పెళ్లి ఫొటోలను షేర్ చేయడం గమనార్హం. సానియా- షోయబ్ జంట అభిమానులు ఈ చేదు వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ఏదైనా యాడ్ షూట్‌కు సంబంధించిన ఫొటో అయితే బాగుండని కామెంట్లు చేస్తున్నారు. Confirmation: Our beloved superstar @realshoaibmalik has tied the knot (Nikkah) with #SanaJaved. Wishing the new couple an amazing life ahead filled with happiness and joy! #ShoaibMalik ❤️ pic.twitter.com/l73fQwLmit — Arsalan H. Shah (@arsalanhshah) January 20, 2024 చదవండి: Ayodhya Ram Mandir Inauguration: అయోధ్యకు వెళ్లి తీరతా.. ఏం చేస్తారో చేసుకోండి: హర్భజన్ సింగ్ - Alhamdullilah ♥️ "And We created you in pairs" وَخَلَقْنَاكُمْ أَزْوَاجًا pic.twitter.com/nPzKYYvTcV — Shoaib Malik 🇵🇰 (@realshoaibmalik) January 20, 2024 -
'నా జీవితంలో మార్పు తెచ్చిన క్షణమిదే'.. సింగర్ సునీత పోస్ట్ వైరల్!
సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతలా తెలుగువారి గుండెల్లో ఆమె స్థానం సంపాదించుకున్నారు. 17 ఏళ్ల వయసులోనే కెరీర్ ప్రారంభించిన సునీతకు 19 ఏళ్లకే పెళ్లయింది. చిన్న వయసులోనే సంపాదిస్తూ.. కుటుంబానికి నేనే పెద్ద దిక్కుగా నిలిచారు. ఇద్దరు పిల్లలు పుట్టాక.. మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుంది. అయినప్పటికీ సునీత తన కెరీర్‌ను కొనసాగించింది. అటు సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు సునీత. పాటల తోటలో పాతికేళ్లుగా అలుపెరగని గాన కోయిల ఆమె. సునీత పాటకు పరవశించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. టాలీవుడ్లో ఏ సింగర్‌కి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమెకు ఉంది. జీవితంలో అన్ని ఒడుదొడుకులు ఎదుర్కొన్న సింగర్ సునీత మరోసారి వివాహాబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత సునీత రెండో పెళ్లి చేసుకుంది. జనవరి 9న, 2021లో ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని పెళ్లాడింది. ఆమెకు రెండో పెళ్లయ్యాక మూడో వివాహా వార్షికోత్సవం ఇవాళ జరుపుకోనుంది. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. నా జీవితం మొత్తంలో అద్భుతమైన క్షణమిదే అంటూ పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు చెబుతున్నారు. ప్రస్తుతం సునీత పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. కాగా.. ఇటీవలే స్టార్ సింగర్ సునీత కుమారుడు ఆకాశ్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. సర్కారు నౌకరి అనే చిత్రంలో నటించారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) View this post on Instagram A post shared by Singer_Sunitha_Official (@singer_sunitha_official) -
ఫ్యాన్స్‌కు షాకిచ్చిన నటి.. రెండో పెళ్లి చేసుకున్నకాజల్ పసుపతి ..!
నటి కాజల్ పసుపతి కోలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. కో, మౌన గురు, కథమ్ కథమ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో అల్లు శిరీష్ నటించిన ద్విభాషా చిత్రం గౌరవంలో కనిపించింది. అయితే 2008లో తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన కొరియోగ్రాఫర్ శాండీ మాస్టర్‌ను పెళ్లాడింది. ఆ తర్వాత విభేదాల కారణంగా 2012లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత శాండీ మరో అమ్మాయి సిల్వియాను వివాహమాడారు. కానీ కాజల్ పసుపతి మాత్రం ఇప్పటివరకు మరో పెళ్లి చేసుకోకుండానే ఒంటరిగానే ఉంటోంది. అయితే గతంలో ఓ బిడ్డను దత్తత తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు కాజల్ ప్రకటించింది. కానీ తాజాగా ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. శాండీతో విడాకులు తీసుకుని ఇప్పటికే 11 ఏళ్లయింది. తాను రెండో పెళ్లి చేసుకున్నానంటూ పాత పెళ్లి ఫోటోను షేర్ చేసింది. కాజల్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఫైనల్‌గా రెండో పెళ్లి చేసుకున్నా.. నన్ను క్షమించండి ఫ్రెండ్స్.. అందరూ క్షేమంగా ఉన్నారనే ఆశిస్తున్నా' అంటూ పోస్ట్ చేసింది. అయితే ఇది చూసిన నెటిజన్స్ కొందరు కంగ్రాట్స్ చెబుతుండగా..మరికొందరు మీ భర్త ఎవరంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది ఏకంగా ఇదంతా ఫేక్ అని కొట్టి పారేస్తున్నారు. అయితే కాజల్ కేవలం తన ఫోటోనే షేర్ చేయడంతో ఫ్రాంక్ చేసి ఉంటుందని ఆడియన్స్ భావిస్తున్నారు. లేదా ఏదైనా మూవీ ప్రమోషన్ కోసం ఇలా చేసి ఉంటుందని అంటున్నారు. రెండో పెళ్లిపై క్లారిటీ రావాలంటే కాజల్ స్పందించాల్సిందే. అయితే గతంలో ఆమె ఓ బీజేపీ నేతను పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by KAAJAL PASUPATHI OFFICIAL⚛️ (@kaajal_pasupathi) -
రెండోపెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరోయిన్.. బర్త్ డే రోజే సర్ప్రైజ్!
స్టార్ హీరోయిన్ అమలాపాల్ తెలుగువారికి సైతం పరిచయం అక్కర్లేని పేరు. రామ్ చరణ్ మూవీ నాయక్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మలయాళ భామ.. అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో చిత్రంలో మెప్పించింది. ఈ ఏడాది అజయ్ దేవగణ్ నటించిన భోళా చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. అయితే ఇవాళ తన 32వ పుట్టినరోజు జరుపుకుంటున్న కేరళ కుట్టి రెండోసారి పెళ్లికి సిద్ధమైంది. తన ప్రియుడు జగత్ దేశాయ్‌తో కలిసి పెళ్లి పీటలెక్కనుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది ముద్దుగుమ్మ. (ఇది చదవండి: Pooja Hegde: లగ్జరీ కారు కొన్న పూజా హెగ్డే.. ధర ఎంతో తెలిస్తే షాకే!) ఈ మేరకు తన ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్ చేసింది. అమలాపాల్, జగత్ కలిసి డ్యాన్స్ చేసిన వీడియో తెగ వైరలవుతోంది. తన లవర్ అమలాపాల్‌కు జగత్ దేశాయ్ మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత కాబోయే దంపతులు ఒకరినొకరు ముద్దుపెట్టుకుని కౌగిలించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. జగత్ దేశాయ్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. "నా జిప్సీ క్వీన్ ఓకే చెప్పింది. హ్యాపీ బర్త్‌డే మై లవ్" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇది చూసిన అభిమానులు అమలాపాల్‌కు అభినందనలు చెబుతున్నారు. కాగా.. గతంలో డైరెక్టర్ ఏఎల్ విజయ్ను పెళ్లాడిన అమలాపాల్.. 2017లో విడాకులు తీసుకుంది. కాగా.. అమలాపాల్ 2009లో మలయాళ చిత్రం నీలతామరా మూవీలో తొలిసారిగా నటించింది. 2010లో తమిళ చిత్రం మైనాలో ఆమె పాత్రకు మంచి గుర్తింపు దక్కించుకుంది. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలతో పాటు అనేక అవార్డులు అందుకుంది. బాలీవుడ్, తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాల్లోనూ నటించింది. . (ఇది చదవండి: మా కోసమే ఉంటున్నాడు.. అతనొక రియల్ హీరో: నాగార్జున) -
నేను శరత్ బాబును రెండో పెళ్లి చేసుకోలేదు.. ఆ ఫోటోలపై స్పందించిన నటి!
స్నేహ నంబియార్ మలయాళీ అయినప్పటికీ.. ఆమె పుట్టి పెరిగింది బెంగళూరులోనే. స్నేహా ఎక్కువగా కన్నడ సినిమాలు, టీవీ సీరియల్స్‌లో కూడా నటించారు. మలయాళ కుటుంబం నుంచి వచ్చిన స్నేహ బెంగళూరులో పుట్టి పెరిగడంతో కన్నడ భాష సులభంగానే నేర్చుకుంది. అంతే కాకుండా ఆమెకు తమిళ భాషపై కూడా పట్టుంది. దక్షిణాది భాషలపై ఆమెకున్న ప్రావీణ్యం కారణంగా తమిళం, మలయాళం, కన్నడ సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు పొందింది. అలా స్నేహ తమిళ ఇండస్ట్రీకి వెళ్లినప్పుడు ఆమెపై అప్పట్లో కొన్ని వార్తలు వ్యాపించాయి. ప్రముఖ నటుడు శరత్‌బాబును స్నేహ రెండో పెళ్లి చేసుకుందన్న వార్త అప్పట్లో వైరల్‌గా మారింది. అంతేకాదు కొంతకాలానికి వీరు విడాకులు సైతం తీసుకున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: సినిమా అగ్రిమెంట్ సంతకం పెట్టాక కాస్టింగ్ కౌచ్‌కు తెరలేపేవారు) నా ఫోటోలు ప్రచారం చేశారు అయితే శరత్ బాబు రెండో భార్యగా స్నేహ నంబియార్ ఫోటోలకు బదులుగా తన ఫోటోలు ప్రచురించారని వాపోయింది మరో నటి స్నేహ. ఓ తమిళ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమెపై వచ్చిన రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చింది. 'నా పేరుతో సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెట్టారు. శరత్ బాబు రెండో భార్యగా నా ఫొటో పెట్టారు. శరత్ బాబు రెండో భార్య స్నేహ నంబియార్ అని.. కుటుంబ సభ్యులకు చెప్పకుండానే శరత్ బాబు రెండో పెళ్లి చేసుకున్నారంటూ నా ఫోటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అప్పుడు కూడా వదల్లేదు ఆ వార్తలు నాకు చాలా ఇబ్బంది కలిగించాయి. ఆయన చనిపోయినప్పుడు కూడా శరత్ బాబు రెండో భార్యను నేనే అని ప్రచారం చేశారు. కానీ నేను ఆయన భార్యను కాదు. అసలైన స్నేహ నంబియార్ నాకంటే పెద్దది. తను ప్రముఖ నటుడు నంబియార్ కూతురు. మా ఇద్దరి పేర్లు ఒకటే కావడంతో ప్రతిసారి నా ఫోటోలు పెట్టేవారు. నిజానికి నా పేరు కేవలం స్నేహ మాత్రమే! అయితే స్నేహ అనే పేరుతో చాలామంది నటీమణులు ఉన్నందున నా పేరు పక్కన మా నాన్న పేరును చేర్చారు. స్నేహ పేరు పక్కన నంబియార్ చేర్చడానికి కారణం.. పైగా నంబియార్ అనేది కేరళలోని కన్నూరులో ఓ చిన్న వర్గం. అందుకే తన పేరు తర్వాత మా వర్గమైన నంబియార్‌ను జత చేశారు. అలా నన్ను స్నేహ నంబియార్ అని పిలిచారు. అప్పట్లో అది కూడా పెద్ద వార్తే. ఎందుకంటే నేను ప్రముఖ తమిళ నటుడు ఎంఎన్ నంబియార్ కుమార్తె అని చెప్పుకుంటున్నాననీ విమర్శించారు. నేను శరత్‌బాబును రెండో పెళ్లి చేసుకోలేదు. నంబియార్ కుమార్తెను కూడా కాదు' అని ఇన్నేళ్ల తర్వాత ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది నటి. (ఇది చదవండి: పెళ్లిలో ఆలియా భట్‌ను ఫాలో అయిన పరిణీతి చోప్రా, ఫోటోలు వైరల్) రమాప్రభతో పెళ్లి-విడాకులు సీనియర్ నటి రమాప్రభతో ఆయన ప్రేమాయణం అప్పట్లో ఇండస్ట్రీలో ఓ సంచలనం. శరత్ బాబు కంటే రమాప్రభ ఇండస్ట్రీలో సీనియర్ నటి. అప్పటికే ఆమె ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు దశాబ్దం తర్వాత శరత్ బాబు సినీ నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఇద్దరికి తెలిసిన ఓ స్నేహితుడి ద్వారా వీళ్లు ఒకరికొకరు పరిచయమయ్యారు. కొన్ని సినిమాల్లో కలిసి నటించారు కూడా. 14 ఏళ్ల తర్వాత విడాకులు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. దాదాపు 14 ఏళ్ల పాటు వీరి సంసారం సజావుగానే సాగింది. అంతలా అన్యోన్యంగా కలిసున్న వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ప్రముఖ నటుడు నంబియార్ కుమార్తె స్నేహ నంబియార్‌ను రెండో పెళ్లి చేసుకోగా వీరి బంధం కూడా ఎక్కువకాలం నిలవలేదు. -
శ్రావణ భార్గవికి రెండో పెళ్లా..? హల్దీ ఫంక్షన్ ఫోటోలు వైరల్
బోయపాటి- బాలయ్య కాంబినేషన్లో 2010లో వచ్చిన సింహా చిత్రంలో 'సింహమంటి చిన్నోడే' అంటూ సిల్వర్ స్క్రీన్‌పై తన వాయిస్‌తో మ్యాజిక్ చేశారు గాయని శ్రావణ భార్గవి. సంగీతంపై ఆమెకు ఉన్న ఆసక్తినే ప్రముఖ గాయనిగా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంది. కీరవాణి,దేవిశ్రీ ప్రసాద్, తమన్, చక్రి, మణిశర్మ, మిక్కీ జె మేయర్ ఇలా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లతో ఆమె కలిసి పనిచేశారు. సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ ఆమె టాలెంట్ చూపించారు. కెరీర్లో రాణిస్తున్న తరుణంలోనే ప్రముఖ సింగర్ హేమచంద్రతో శ్రావణ భార్గవి ఏడు అడుగులు వేశారు. మొదటి నుంచి స్నేహితులైన వీరిద్దరూ 2013లో పెద్దల అంగీకారంతో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ పాప ఉంది. అయితే, వ్యక్తిగత కారణాలతో వీళ్లద్దరూ విడిపోయారని గతంలోనే పలు వార్తలు వచ్చాయి. ఆ వార్తలలో నిజం లేదనే అర్థం వచ్చేలా వారిద్దరూ అప్పట్లోనే తిప్పికొట్టారు. కానీ అందులో నిజం లేదని తెలుస్తుంది. సుమారు రెండేళ్లుగా వారిద్దరూ కలిసి ఎలాంటి ప్రొగ్రామ్ చేయడం కానీ.. ఒక వేదిక మీద కనిపించడం కానీ జరగలేదు. కొన్ని నెలలుగా శ్రావణ భార్గవి సోషల్ మీడియాకు దూరంగా ఉన్నా హేమ చంద్ర మాత్రం తన ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉన్నారు. (ఇదీ చదవండి: ‘గేమ్ ఛేంజర్’ ఆడియో లీక్.. క్రిమినల్ కేసు పెట్టిన దిల్‌రాజు) గతంలో వారిద్దరూ చాలా ప్రోగ్రామ్స్ జంటగా చేశారు.. కానీ కొన్ని నెలలుగా వారిద్దరూ కలిసి చేసిన ఒక్క ప్రోగ్రామ్ కూడా లేదు. దీంతో వారిద్దరూ దాదాపు విడిగానే ఉన్నారు అనేది నిజమేనని నమ్మాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఇదిలా ఉండగా తాజాగా శ్రావణ భార్గవి రెండో పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. దానికి ప్రధాన కారణం ఆమె హల్దీ ఫంక్షన్లో ఉన్న కొన్ని ఫోటోలు బయటకు రావడమే. దీంతో ఆ ఫోటోలు చూసిన కొందరు శ్రావణ భార్గవి రెండో పెళ్లి చేసుకుంటున్నారు అనే ప్రచారం మొదలైంది. వాస్తవానికి ఆ ఫోటోలు తన సొదరుడు అయిన హరీష్ హల్దీ ఫంక్షన్‌కు సంబంధించినవి. ఎప్పుడో సంవత్సరం క్రితం జరిగిన కార్యక్రమానికి చెందిన ఫోటోలను ఇప్పుడు వైరల్ చేస్తూ.. ఆమెకు రెండో పెళ్లి అంటూ పలువురు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఆమె విడాకులే తీసుకోలేదు, వాటిపై క్లారిటీ ఇవ్వలేదు.. అంటే వారిద్దరూ భార్యాభర్తలే అని అర్థం. అలాంటిది రెండో పెళ్లి అని ఎలా రూమర్స్ క్రియేట్ చేస్తారని పలువురు కామెంట్ చేస్తున్నారు. -
50 ఏళ్ల వయసులో 'మళ్లీ పెళ్లి'.. సీనియర్ నటి క్లారిటీ
మిగతా వాళ్ల సంగతేమో గానీ సెలబ్రిటీలు ఏం చేసినా సరే అది వార్త అవుతూ ఉంటుంది. ఇక వాళ్లు రిలేషన్లో ఉన్నా, పెళ్లి చేసుకున్నా, విడాకులు ఇచ్చినా కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. అయితే పలు తెలుగు సినిమాల్లో తల్లి పాత్రలు చేస్తూ బిజీగా ఉన్న ఓ సీనియర్ నటి.. ఇప్పుడు రెండో పెళ్లికి సిద్ధమైందనే న్యూస్ తెగ వైరల్ అయింది. పైన ఫొటోలో కనిపిస్తున్న నటి.. 'శ్రీమంతుడు' సినిమాలో మహేశ్‌కి తల్లిగా నటించింది. అయితే గతంలో ఈమె పలు తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. సహాయ పాత్రల్లోనూ మెప్పించింది. టాలీవుడ్లో పెద్దరికం, అమ్మకొడుకు, సాంబ, శ్రీ, మున్నా, అధినాయకుడు తదితర చిత్రాల్లో నటించింది. అయితే ఎక్కువగా మలయాళ మూవీస్‌తో ఫేమ్ తెచ్చుకుంది. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్) నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న టైంలోనే అంటే 2002లో సుకన్య.. శ్రీధరన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయింది. ఏమైందో ఏమోగానీ ఏడాదిలోనే ఆయన్నుంచి విడిపోయి, తిరిగి స్వదేశానికి వచ్చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. సౌత్ సినిమాల్లో సహాయ పాత్రలు చేస్తూ, మరోవైపు డబ్బింగ్ ఆర్టిస్టుగానూ ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం సుకన్యకు 50 ఏళ్లు. అయితే ఈమె త్వరలో పెళ్లి చేసుకోనుందనే రూమర్ బయటకొచ్చింది. ఇది ఆ నోట ఈ నోట పడి.. ఆమె వరకు చేరుకుంది. దీంతో ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు విషయం బయటపెట్టింది. 'అలాంటి ఆలోచన నాకు లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే పుట్టే పిల్లలు.. అమ్మ అని పిలుస్తారా? అమ్మమ్మ అని పిలుస్తారా?' అని కౌంటర్స్ వేసింది. దీంతో ఈమె పెళ్లి కేవలం పుకారు మాత్రమే అని తేలిపోయింది. (ఇదీ చదవండి: 'చంద్రా’లు దిద్దిన కాపురం.. స్కెచ్ మాములుగా లేదు!) -
తల్లికి రెండో పెళ్లి చేసిన నటుడు.. నెటిజన్ల ప్రశంసలు!
మరాఠీ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సిద్ధార్థ్ చందేకర్. 'జెండా', 'క్లాస్మేట్స్', 'బాలగంధర్వ' లాంటి చిత్రాల్లో నటించారు. మధుర దేశ్‌పాండే, స్వప్నిల్ జోషి, అమృతా ఖాన్విల్కర్తో కలిసి 'జీవ్లగా' షోలో కూడా కనిపించారు. ఇటీవలే నాగేష్ కుకునూర్ దర్శకత్వంలోని 'సిటీ ఆఫ్ డ్రీమ్స్' అనే వెబ్ సిరీస్‌లో నటించాడు. తాజాగా సిద్ధార్థ్ చేసిన పనికి నెటిజన్స్ మనసులను గెలుచుకున్నారు. ఇటీవల తన తల్లిని రెండవ వివాహం చేసి ఆదర్శంగా నిలిచాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తల్లి కోసం ఉద్వేగభరితమైన నోట్ రాసుకొచ్చారు. అంతేకాకుండా తల్లి సీమా చందేకర్ రెండో పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. (ఇది చదవండి: నరేశ్-పవిత్ర ప్రేమాయణం.. ఫస్ట్ నుంచీ ఇదే జరుగుతుంది!) సిద్ధార్థ్ నోట్లో రాస్తూ.. ' అమ్మా.. హ్యాపీ సెకండ్ ఇన్నింగ్స్. నీ బిడ్డలతో పాటు నీ జీవితం ఇంకా ఉంది. నీకు స్వతంత్రమైన అందమైన ప్రపంచం ఉంది. ఇప్పటివరకు మా కోసం చాలా త్యాగం చేశారు. ఇప్పుడు మీ గురించి, మీ కొత్త భాగస్వామి గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. ఈ విషయంలో మీ పిల్లలు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటారు. మీరు నా పెళ్లిని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇప్పుడు నేను అదే చేశా. నా జీవితంలో అత్యంత ఎక్కుగా ఆనందపడే పెళ్లి. ఐ లవ్ యూ అమ్మ.. హ్యాపీ మ్యారీడ్ లైఫ్.' అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్స్ సిద్ధార్థ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మీరు చాలా మందికి ఆదర్శంగా నిలిచారంటూ అభినందిస్తున్నారు. (ఇది చదవండి: జైలర్ కంట కన్నీరు.. ఆ డైలాగ్ రజనీ నిజ జీవితానిదే: డైరెక్టర్) View this post on Instagram A post shared by Siddharth Seema Chandekar (@sidchandekar) -
'అనవసరంగా నిందించొద్దు'.. బుల్లితెర నటి పోస్ట్ వైరల్!
గుప్పెడంత మనసు సీరియల్ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న నటి జ్యోతి రాయ్. కన్నడ ఇండస్ట్రీలో ఫేమస్ అయిన నటి దాదాపు 20కి పైగా సీరియల్స్‌లో నటించింది. అంతేకాకుండా చాలా సినిమాల్లోనూ కనిపించింది. శాండల్‌వుడ్‌లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న నటీమణుల్లో జ్యోతిరాయ్ ఒకరు. ప్రస్తుతం సీరియల్స్‌తో పాటు ప్రెట్టీ గర్ల్ అనే క్రైమ్ థిల్లర్ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఇటీవలే శాండల్‌వుడ్ భామ యువ దర్శకుడితో రిలేషన్లో ఉందంటూ ఇటీవలే ఓ వార్త చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె ట్విటర్ హ్యాండిల్లోనూ జ్యోతి పుర్వాజ్ అనే పేరు పెట్టుకోవడంతో ఆమె రెండో పెళ్లి చేసుకుందని సోషల్ మీడియాలో వైరలైంది. (ఇది చదవండి: డైరెక్టర్‌తో బుల్లితెర నటి రిలేషన్?.. భర్త ఉండగానే!) అయితే తాజాగా జ్యోతిరాయ్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 'మీకు తెలియకుండా.. అర్థం కాకుండా ఎవరినీ నిందించొద్దు. మీరు ఎవరు కూడా నా వెంట నడవలేరని గుర్తు పెట్టుకోండి.' అంటూ సుకు పూర్వాజ్‌తో పాటు తన కుమారుడితో ఉన్న ఫోటోను పంచుకుంది. అయితే ఆమె ఎవరినీ ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టిందో తెలియాల్సి ఉంది. అయితే వీరిద్దరి రిలేషన్‌పై రూమర్స్ వస్తున్న సమయంలో ఈ పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చినట్లే కనిపిస్తోంది. కాగా.. కర్ణాటకలోని మడికేరిలో జన్మించిన జ్యోతిరాయ్.. మంగళూరులో చదివుకుంది. జ్యోతిరాయ్‌కి 20 ఏళ్ల వయసులోనే పద్మనాభ అనే వ్యక్తితో పెళ్లి కాగా.. వీరికి బాబు కూడా ఉన్నారు. జ్యోతిరాయ్ నటి కావడానికి కూడా అతనే కారణమని కన్నడ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. సీరియల్స్‌తో పాటు కన్నడలో పలు చిత్రాల్లో నటించింది. రాయ్ దియా, గంధాడ గుడి లాంటి వెబ్ సిరీస్‌లలో కనిపించింది జ్యోతి రాయ్. (ఇది చదవండి: నెటిజన్ వింత ప్రశ్న.. గట్టిగానే ఇచ్చిపడేసిన స్టార్ హీరోయిన్!) -
రెండోపెళ్లి చేసుకోనున్న ఐశ్వర్య రజనీకాంత్..?
తమిళనటుడు ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ దంపతులు విడిపోతున్నట్లు గతేడాది ప్రకటించిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల వారి వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు వీరిద్దరూ సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. కానీ మళ్లీ కొద్దిరోజుల కిందట విడాకులు రద్దు చేసుకుంటున్నారంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఆ వార్తలపై అటు ధనుష్ కానీ, ఇటు ఐశ్వర్య కానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో వీరిద్దరు మళ్లీ కలవడం అనేది అసాధ్యం అని అభిమానులు కామ్ అయిపోయారు. (ఇదీ చదవండి: నా కంటే 30 ఏళ్లు పెద్దవాడు.. అయినా పెళ్లి చేసుకుంటే: ప్రముఖ సింగర్) తాజాగా ఐశ్వర్య రజనీకాంత్ రెండోపెళ్లి చేసుకోబోతున్నారంటూ విపరీతంగా ప్రచారం జరుగుతుంది. ప్రస్థుతం ఆమె ఇద్దరు పిల్లలతో సింగిల్ మదర్‌గా ఉంటున్నారు. అంతే కాకుండా ఓ సినిమాకు డైరెక్షన్ కూడా చేస్తున్నారు. ఇలాంటి పుకార్లు రావడానికి ప్రధాన కారణం ఐశ్వర్యపై ఈమధ్య కోలీవుడ్‌కు చెందిన ఓ హీరోతో ఆమె కనిపించిందని తెలుస్తోంది. చెన్నైలోని ఓ రిసార్ట్‌లో అతడితో ఆమె సన్నిహితంగా మెలుగుతూ కనిపించడంతో ఈ రెండో పెళ్లిపై పుకార్లు బలంగా వ్యాపిస్తున్నాయి. ఇందులో ఎంతమేరకు నిజముందో తెలియదు. ఇదే విషయంపై ఐశ్వర్య రజనీకాంత్ స్పందిస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. లేదంటే ఇలాంటి పుకార్ల వల్ల ఇమేజ్ దెబ్బతింటుందని వారు తెలుపుతున్నారు. ఎందుకు విడిపోయారు.. కారణం ఇదేనా? కారణం ఏంటనేది ఇప్పటికీ పూర్తిగా బయటకు తెలియదు. తామిద్దరం విడిపోతున్నట్లు మొదట ఐశ్వర్య ప్రకటించగా తర్వాత ధనుష్ ప్రకటించారు. దీంతో అంతా అవాక్కయ్యారు. కానీ సుచీ లీక్స్‌లో ధనుష్ ఫోటోలు బయటకు వచ్చినరోజు నుంచే వీరి మధ్య గొడవ స్టార్ట్ అయిందనే ప్రచారం ఉంది. ఆ తర్వాత ధనుష్ ఓ హీరోయిన్‌తో చనువుగా ఉండటం ఐశ్వర్యకి నచ్చలేదని, అందుకే ఐశ్వర్య విడాకులు ఇచ్చేందుకు రెడీ అయిందనే టాక్ ఉంది. కోలీవుడ్‌లో ధనుష్‌కు ఉన్న ఎఫైర్ విషయంలో ఐశ్వర్య చాలా కాలంగా భరిస్తూ వచ్చి.. చివరకు చేసేదేమిలేక విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని తమిళ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. (ఇదీ చదవండి: ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌కు ఊరట.. కేసు కొట్టివేసిన హైకోర్టు) -
తండ్రికి రెండో పెళ్లి చేసిన బుల్లితెర నటి.. ఫోటోలు వైరల్!
బాలీవుడ్ బుల్లితెర నటి సుంబుల్ తౌకీర్ పెద్దగా పరిచయం లేని పేరు. హిందీ టీవీ షోలలో ఎక్కువగా కనిపించింది. సుంబుల్ తన నటనా జీవితాన్ని 2013 షో జోధా అక్బర్‌తో ప్రారంభించింది ఆమె టీవీ షో ఇమ్లీ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన రియాలిటీ షో బిగ్ బాస్- 16 సీజన్లో కనిపించింది. బిగ్ హౌస్‌లో అడుగుపెట్టిన అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది. 2018లో చంద్రగుప్త మౌర్యలో కూడా కనిపించింది. అయితే తాజాగా ఆమె తన తండ్రికి రెండో పెళ్లి చేసి వార్తల్లో నిలిచింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. (ఇది చదవండి: ఎంగేజ్మెంట్ తర్వాత తొలిసారి ఫోటో షేర్ చేసిన లావణ్య త్రిపాఠి! ) సుంబుల్ తండ్రి తౌకీర్ ఖాన్ జూన్ 15న పెళ్లి చేసుకున్నారు. వివాహానికి సంబంధించిన ఫోటోలను నటి ఇవాళ అభిమానులతో పంచుకుంది. దీంతో ఆమె చేసిన పనికి కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. తండ్రిపై ప్రేమను చాటుకున్నారంటూ పొగుడుతున్నారు. తన తండ్రికి రెండో వివాహం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది సుంబుల్. మా తండ్రికి భార్యతో పాటు.. ఓ సోదరి కూడా మాతో చేరనున్నట్లు వెల్లడించింది. (ఇది చదవండి: ఇండస్ట్రీలో ఉండాలని రాలేదు.. స్టార్ డైరెక్టర్ సంచలన నిర్ణయం.!) View this post on Instagram A post shared by Sumbul Touqeer (@sumbul_touqeer) -
రెండో పెళ్లిపై దారుణ ట్రోల్స్.. స్పందించిన ఆశిష్ విద్యార్థి
మహేశ్ బాబు పోకిరీ చిత్రంతో ఫేమ్ తెచ్చుకున్న ఆశిష్ విద్యార్థి టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే రెండో పెళ్లి చేసుకుని ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. అస్సాం రాష్ట్రానికి వ్యాపారవేత్త రూపాలీ బరువాను ఆయన రెండో వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇప్పటికే మొదటి భార్య పిలూ విద్యార్థితో విడాకులు తీసుకున్నారు. (ఇది చదవండి: భోళా శంకర్: మెగాస్టార్, నందమూరి ఫ్యాన్స్ కోసం భలే స్కెచ్!) అయితే 57 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడంతో పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆశిష్ విద్యార్థి తనపై వచ్చిన ట్రోల్స్‌పై స్పందించారు. రెండో పెళ్లి చేసుకున్నాక తనను కించపరిచేలా ట్రోల్స్ చేశారని అన్నారు. చాలా దారుణమైన పదాలు ఉపయోగించారని ఆయన అన్నారు. ఇది తన వ్యక్తిగత విషయమని.. ఇలాంటి విషయాల్లో మద్దతుగా నిలవాలని సూచించారు. ఆశిష్ విద్యార్థి మాట్లాడుతూ.. 'తనపై బుడా(ముసలి), ఖుసత్ (సభ్యత , సంస్కారం లేని) లాంటి అవమానకరమైన పదాలతో ఉపయోగించారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే మనలో ప్రతి ఒక్కరూ వయసులో పెద్దవాళ్లమనే భయాన్ని మనలోనే ఉంచుకుంటాం. అదే విషయాన్ని ఇతరులకు కూడా చెబుతున్నాం. కానీ ప్రస్తుతం జనరేషన్ మారింది. వయసు మీద పడినంత మాత్రాన ఎలాంటి పనులు చేయకూడదని మనకు మనమే చెప్పుకుంటున్నాం కదా. కానీ మన జీవితాన్ని సంతోషంగా ముగించాలకున్నప్పుడు.. ఎవరైనా సరే తోడు కావాలని ఎందుకు కోరుకోకూడదు?' అని అన్నారు. (ఇది చదవండి: నాలుగున్నరేళ్లుగా నటుడితో సహజీవనం.. మీరిక పెళ్లి చేసుకోరా?) తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని.. ప్రతి విషయాన్ని చట్టబద్ధంగా వ్యవహరిస్తానని తెలిపారు. పన్నులు చెల్లిస్తున్నానని, కష్టపడి పనిచేస్తున్నానని అన్నారు. కుటుంబాన్ని కలిగి ఉండాలనే ఆసక్తితోనే చట్టబద్ధంగా వివాహం చేసుకున్నట్లు వివరించారు. ఇది తన వ్యక్తిగత నిర్ణయమని తెలిపారు. ప్రజలు ఒకరిని నిందించకుండా.చ. ఒకరికొకరు మద్దతుగా ఉండాలని ఆశిష్ అన్నారు. -
ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి.. దీని వెనుక ఇంత కథ ఉందా..!
మహేశ్ బాబు పోకిరీ చిత్రంలో మెప్పించిన ఆశిష్ విద్యార్థి టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే రెండో పెళ్లి చేసుకుని ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. అస్సాం రాష్ట్రానికి వ్యాపారవేత్త రూపాలీ బరువాను వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇప్పటికే పెళ్లి కాగా.. మొదటి భార్యతో విడాకులు తీసుకున్నారు. ఆశిష్ విద్యార్థి మొదటి భార్య పిలు విద్యార్థి కూడా వీరి పెళ్లికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. (ఇది చదవండి: లగ్జరీ కారు కొనుగోలు రామ్ చరణ్ హీరోయిన్.. ధర ఎన్ని కోట్లంటే?) అయితే ఆశిష్ విద్యార్థి ఈ పెళ్లికి ముందు జరిగిన సంఘటనలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. రూపాలీతో వివాహానికి అనుకున్నంత ఈజీగా జరగలేదని తెలిపారు. రెండో పెళ్లి చేసుకోవాలన్న మా నిర్ణయం తమ కుటుంబ సభ్యులను తీవ్రంగా బాధ పెట్టిందని పేర్కొన్నారు. ఆశిష్ విద్యార్థి మాట్లాడుతూ.. 'గతేడాది వ్లాగింగ్ అసైన్మెంట్లలో భాగంగా నేను రూపాలిని కలిశా. ఆ తర్వాత మేము చాట్ చేయడం ప్రారంభించాం. రూపాలీ ఐదేళ్ల క్రితం తన భర్తను కోల్పోయింది. ఆ తర్వాత ఆమె కూడా తన బాధను కాస్తా మరిచిపోయింది. అదే సమయంలో మళ్లీ పెళ్లి చేసుకోవడంపై ఇద్దరం ఆలోచించాం. ఆమెతో చాట్ చేస్తున్నప్పుడు తనతో జీవితాన్ని పంచుకోవాలనుకున్నా. పెళ్లి చేసుకోవాలని ఇద్దరం నిర్ణయించుకున్నాం. ఆమె జీవితంలో నేను ఉన్నందుకు ఆశ్చర్యంగా ఉంది.' అని అన్నారు. (ఇది చదవండి: కంగ్రాట్స్.. కొంచెమైనా సిగ్గుండాలి.. ఆశిష్ విద్యార్థిపై కేఆర్కే ట్వీట్ వైరల్) అయితే తన నిర్ణయం కుటుంబానికి తీవ్రమైన బాధ కలిగించిందని తెలిపారు. తన భార్య పిలూను స్నేహితుడిలా చూసేవాడినని అన్నారు. ఆశిష్ మాట్లాడుతూ.. 'పిలూతో పెళ్లి తర్వాత మా జీవితం అద్భుతంగా సాగింది. ఆమె నాకు భార్య మాత్రమే మంచి ఫ్రెండ్ కూడా. నాతో ఎప్పుడూ అలానే ఉండేది. కానీ ఈ పెళ్లికి ముందు చాలా బాధ అనుభవించా. విడిపోవడమనేది చాలా బాధ కలిగించింది. అది చాలా కష్టంగా అనిపించింది కూడా. ఈ విషయంలో మేమిద్దరం చాలా ఫీలయ్యాం.' అని రెండో పెళ్లి వెనుక పడ్డ బాధను పంచుకున్నారు. -
60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న నటుడు
-
60 ఏళ్ల వయసులో నటుడు రెండో పెళ్లి.. వధువు బ్యాక్‌గ్రౌండ్ ఇదే
ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, బెంగాలీ సహా సుమారు 11 భాషల్లో 200కి పైగా సినిమాల్లో నటించాడు. టాలీవుడ్లో విలన్ పాత్రలతో గుర్తింపు పొందిన ఆయన తాజాగా 60ఏళ్ల వయసులో రెండోసారి పెళ్లిబంధంలోకి అడుగుపెట్టాడు. అస్సాంకు చెందిన 33 ఏళ్ల ఫ్యాషన్ ఎంటర్ప్రెన్యూర్ రూపాలి బారువాను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. కోల్‌కతాలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. అతికొద్ది మంది బంధువులు, కుటుంబసభ్యుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ జంటకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సుమారు 20ఏళ్ల క్రితమే ఆశిష్ విద్యార్థి నటి శాకుంతల బారువా కుమార్తె రాజోషి బారువాను ప్రేమించి మనువాడారు. వీరికి ఆర్త్ విద్యార్థి అనే కుమారుడు ఉన్నాడు. నటిగా, సింగర్‌గా రాజోషి బారువా పాపులర్. అయితే భార్యభర్తల మధ్య కొంతకాలంగా విబేధాలు రావడంతో వీరు విడిపోయారు. ఆ తర్వాత ఫ్యాషన్ ఎంటర్ప్రెన్యూర్ రుపాలీతో ఆశీష్ విద్యార్థికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి చివరకు పెళ్లిపీటలు ఎక్కేదాకా వచ్చింది. ఈమెకు కోల్‌కతాలో పలు స్టోర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. కొంతకాలంగా వీరు రిలేషన్షిప్లో ఉన్నట్లు రూమర్స్ వచ్చినా వాటినే నిజం చేస్తూ పెళ్లి చేసుకున్నారు. రూపాలీని పెళ్లి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని, తమ బంధం వెనుక పెద్ద కథే ఉందని, తర్వాత ఎప్పుడైనా చెబుతానంటూ స్వయంగా ఆశిష్ విద్యార్థి పేర్కొన్నారు. కాగా 60 ఏళ్ల వయసులో ఆశిష్‌విద్యార్థి రెండో పెళ్లి చేసుకోవడం, అది కూడా ప్రేమ పెళ్లి చేసుకోవడం విశేషం. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు కొత్తజంటకు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు మాత్రం ఈ వయసులో మీకిది అవసరమా? అయినా ప్రేమ గుడ్డిది అంటారు. నిజమేనేమో అంటూ సెటైర్లు వేస్తున్నారు. -
60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న 'పోకిరి' విలన్
విలన్ పాత్రలతో గుర్తింపు పొందిన నటుడు ఆశీష్ విద్యార్థి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ‘కాల్ సంధ్య’సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈయన తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా తెలుగులో పోకిరి, గుడుంబా శంకర్ చిత్రాలతో పాపులర్ అయ్యారు. తన మూడవ సినిమా ‘దోర్హ్ కాల్’తో నేషనల్ అవార్డు సంపాదించుకున్న ఆశీష్ విద్యార్థి ఇప్పటివరకు 11 భాషల్లో సుమారు 200కి పైగా చిత్రాల్లో నటించారు. అయితే తాజాగా రెండోపెళ్లితో ఆశీష్ విద్యార్థి వార్తల్లో నిలిచారు. 60ఏళ్ల వయసులో అస్సాంకు చెందిన రూపాలి బారువాను పెళ్లాడారు. ఈమె ఫ్యాషన్ ఎంటర్ప్రెన్యూర్. ఈమెకు కోల్‌కతాలో పలు ఫ్యాషన్ స్టోర్స్ ఉన్నాయి. కొంత కాలంగా ఆశిష్ విద్యార్ధి.. రూపాలి బారువాతో సన్నిహితంగా మెలుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా వాటినే నిజం చేస్తూ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరు వివాహం చేసుకున్నారు. గతంలో ఆశీష్ విద్యార్థి రాజోషి బారువాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈమె థియేటర్ ఆర్టిస్ట్‌గా, నటిగా, సింగర్‌గా సుపరిచితం. వీరికి అర్త్ విద్యార్థి అనే కొడుకు కూడా ఉన్నాడు. అయితే మనస్పర్థ కారణంగా ఆశీష్ విద్యార్థి-రాజోషి బారువా విడిపోయారు. ఇప్పుడు ఈయన 60 ఏళ్ల వయసులో రూపాలిని మనువాడాడు. -
భర్తను ఉద్యోగం నుంచి తొలగించాలని భార్య ఫిర్యాదు
కర్నూలు(సెంట్రల్): తనను మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్న తన భర్త రాకేశ్‌ను ఉద్యోగం నుంచి తొలగించాలని సచివాలయంలో వెల్ఫేర్, ఎడ్యుకేషన్ కార్యదర్శిగా పని చేస్తున్న ఏ.గాయత్రి సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆమె కలెక్టర్ డాక్టర్ జి. సృజనకు వినతిపత్రం ఇచ్చారు. ఈ అర్జీపై సత్వరంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈఓను కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం గాయత్రి కర్నూలు మండలం గార్గేయపురం సచివాలయంలో పనిచేస్తున్నారు. ఆమె గతంలో హాలహర్విలో పనిచేస్తున్న సమయంలో అక్కడే ఎంపీడీఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రాకేష్‌బాబుతో వివాహమైంది. వీరికి ఒక పాప కూడా పుట్టింది. తరువాత రాకేష్‌బాబు లక్ష్మీ అనే మరో ఉద్యోగిని వివాహం చేసుకున్నారు. దీంతో ఆమె కర్నూలు త్రీటౌన్‌లో ఆరు నెలల కింద కేసు పెట్టారు. తరువాత ఆమె తన బిడ్డ పోషణపై హైకోర్టుకు కూడా వెళ్లారు. -
మొదటి భార్య వుండగానే రహస్యంగా రెండో వివాహం..
తిరువళ్లూరు: డబ్బుకు ఆశపడి మొదటి భార్య వుండగానే రహస్యంగా ఓ వ్యక్తి రెండో వివాహం చేసుకున్న ఘటన వెలుగు చూసింది. వివరాలు.. తను ఉండగా మరో మహిళను పెళ్లి చేసుకున్న తన భర్తపై చర్యలు తీసుకోవడంతో పాటు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం వద్ద బిడ్డతో మహిళ ఆందోళనకు దిగింది. తిరువళ్లూరు జిల్లా పెద్దపాళ్యం సమీపంలోని వండిమేట్టు గ్రామానికి చెందిన మారియమ్మాల్ తండలం గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తిని ప్రేమించి 2007వ సంవత్సరంలో వివాహం చేసుకుంది. వీరికి రెండేళ్ల బాబు ఉన్నాడు. గత కొద్ది నెలల కిందట భార్యభర్తల మధ్య మనస్పర్థలు వచ్చినట్టు తెలుస్తుంది. ఇదే అదునుగా భావించిన రమేష్ మొదటి భార్యకు తెలియకుండా తండలం గ్రామానికి చెందిన ఓ మహిళను రెండవ వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న మారియమ్మాల్ నేరుగా రమేష్ ఇంటికి వెళ్లి నిలదీయగా, దాడి చేసి గాయపరిచినట్టు తెలుస్తుంది. తనతో నీకు సంబంధం లేదని బయటకు విషయాన్ని చెబితే చంపేస్తానని బెదిరించడంతో మనస్తాపం చెందిన మహిళ సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేపట్టింది. తాను ఉండగానే రెండవ వివాహం చేసుకున్న భర్తపై చర్యలు తీసుకోవడంతో పాటు తమకు న్యాయం చేయాలని కోరుతూ నినాదాలు చేసింది. దీంతో కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మహిళను స్టేషన్‌కు తరలించారు. ఆమె ఫిర్యాదును స్వీకరించి న్యాయం చేస్తామని హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించింది. -
తమిళ స్టార్ హీరోతో మీనా రెండో పెళ్లి..?
-
తమిళ స్టార్ హీరోతో మీనా రెండో పెళ్లి!: నటుడు సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ నటి మీనా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. గతేడాది జూన్‌లో భర్త విద్యాసాగర్‌ను కోల్పోయిన మీనా ఆ బాధ నుంచి తేరుకోవడానికి వరుసగా షూటింగ్స్‌లో పాల్గొంటుంది. చాలా గ్యాప్‌తో తర్వాత ఇటీవల విడుదలైన తెలుగు చిత్రం ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మీనా తమిళం, మలయాళంలోనూ పలు చిత్రాలకు సైన్ చేసింది. ఇదిలా భర్తను కొల్పోయిన బాధలో ఉన్న మీనాపై సోషల్ మీడియాలో రకరకాలు పుకార్లు వినిపిస్తున్నాయి. చదవండి: అప్పట్లోనే సొంత హెలికాప్టర్, వేల కోట్ల ఆస్తులు.. నటి కేఆర్ విజయ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ఆమె రెండో పెళ్లికి సిద్ధమైందంటూ కొద్ది రోజులుగా నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే తన పెళ్లి వార్తలపై స్పందించిన మీనా తీవ్రంగా ఖండిచింది. అయినప్పటికీ ఆమె రెండో పెళ్లికి సంబంధించిన రూమర్స్‌కు మాత్రం చెక్ పడటం లేదు. తాజాగో ఓ సినీ క్రిటిక్, నటుడు తమిళ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మీనా రెండో పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. మీనా త్వరలోనే ఓ తమిళ స్టార్ హీరోను పెళ్లి రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ హీరో పాన్ ఇండియా స్టార్ అని, గతేడాది భార్యతో విడాకులు తీసుకున్ని విడిపోయాడంటూ హింట్ ఇచ్చాడు. అంతేకాదు ఆ హీరో మీనా కంటే చిన్నవాడని, నిశ్చితార్థానికి కూడా ముహుర్తం పెట్టుకున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం అతడి కామెంట్స్ కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. సోషల్ మీడియాలో అతడి వ్యాఖ్యలు వైరల్ అవుతుండటంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అతడి కామెంట్స్‌ని కొట్టిపారేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారం ఎలా చేస్తారు?’,‘ఏదైనా చెబితే నమ్మే విధంగా ఉండాలి’ అంటూ సదరు ఫిలిం క్రిటిక్కు చురకలు అట్టిస్తున్నారు. చదవండి: నాటు నాటుకు ఆస్కార్.. అజయ్ దేవగన్ షాకింగ్ కామెంట్స్ కాగా గతంలోనే మీనా తాను తనకు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని మీనా ఇటీవల ఓ ఇంటర్య్వూలో తేల్చి చెప్పిన సంగతి తెలిసింది. ఓ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మీనాకు రెండో పెళ్లిపై ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘నా భర్త చనిపోయినప్పటి నుంచి సోషల్ మీడియాలో నా గురించి ఆసత్య ప్రచారం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. బాధలో ఉన్న నాకు ఇలాంటి వార్తలు మరింత బాధిస్తున్నాయి. అసలు నాకు మరో పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు’ అంటూ మీనా కుండ బద్దలు కొట్టారు. -
మనోజ్ రెండో పెళ్లి మోహన్ బాబుకు ఇష్టం లేదా? ఆయన ఏమన్నారంటే..
యంగ్ హీరో మంచు మనోజ్ ఇటీవలె పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. స్నేహితురాలు భూమా మౌనిక రెడ్డితో మనోజ్ ఇటీవలె ఏడడుగులు వేసి కొత్త జీవితాన్ని ఆరంభించారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇదిలా ఉంటే మనోజ్ పెళ్లి విషయంలో పలు వార్తలు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొట్టాయి. మోహన్ బాబుకు ఈ పెళ్లి ఇష్టం లేదని, వివాహానికి కూడా ఆయన హాజరు కారంటూ వార్తలు వినిపించాయి. కానీ వీటిని పటాపంచెలు చేస్తూ దగ్గరుండి మనోజ్ పెళ్లి జరిపించి వధూవరులను ఆశీర్వదించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మోహన్ బాబు మనోజ్ పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ''మనోజ్ నా దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. ఓసారి ఆలోచించమన్నాను. లేదు డాడీ నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనని నేను భావిస్తున్నాను అన్నాడు. ఇంకేముంది చేసుకో.. బెస్ట్ ఆఫ్ లక్ అన్నాను. కాదని ఎందుకంటాను. ఎవరో ఏదో అనుకుంటారని పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోవాలి. కుక్కలు మొరుగుతూ ఉంటాయి. ఎన్ని కుక్కలను నువ్వు ఆపుతావు?'' అంటూ మనోజ్ పెళ్లిపై విమర్శలు చేస్తున్న వారిని ఉద్దేశిస్తూ ఘాటుగా స్పందించారు. -
మా నాన్న పెళ్లి ఆపండి!
పట్నా: ‘పోలీసంకుల్.. మా నాన్న రెండో పెళ్లి చేసుకుంటున్నాడు. మీరే ఎలాగైనా ఆపాలి..’ అంటూ ఓ బాలిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. బాలిక ధైర్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. బిహార్‌లోని షియోహర్‌లో ఇప్పుడు ఇదే ‘టాక్ ఆఫ్ ది టౌన్’అయ్యింది. షియోహర్‌కు చెందిన మనోజ్ కుమార్ రాయ్‌కు నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. అందరూ 12 ఏళ్లలోపు వారే. సుమారు రెండేళ్ల క్రితం భార్య చనిపోయింది. దీంతో, అతడు రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. తనకున్న సుమారు అరెకరం (ఎకరానికి 32 కతాస్ సమానం) భూమిని ఇచ్చేందుకు కాబోయే భార్యతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. శనివారం సాయంత్రం స్థానిక గుడిలో పెళ్లి జరగాల్సి ఉంది. అయితే, మనోజ్ కూతుళ్లలో ఒకరైన పదేళ్ల చోటీ కుమారి కొందరు గ్రామస్తులతో కలిసి శనివారం ఉదయం పిప్రాహి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. ‘మా నాన్న మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాడు. ఇక మమ్మల్నెవరు చూసుకుంటారు? మా నాన్న లేకుంటే మాకు దిక్కెవ్వరు? ఉన్న భూమినంతా ఆమెకే ఇచ్చేస్తే మేమెలా బతకాలి? ఎలాగైనా, ఈ పెళ్లిని మీరే ఆపాలి’అని బిగ్గరగా ఏడ్చుకుంటూ పోలీసులకు మొరపెట్టుకుంది. చిన్నారి వినతిపై పోలీసులు మానవతా దృక్పథంతో స్పందించారు. గ్రామ సర్పంచి, ఇతర ప్రముఖులను పిలిపించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. గుళ్లో పెళ్లి ఏర్పాట్లలో ఉన్న మనోజ్‌ను స్టేషన్‌కు పిలిపించారు. రెండో పెళ్లిని రద్దు చేసుకునేందుకు, పిల్లల్ని సరిగ్గా చూసుకునేందుకు ఒప్పించారు. ఈ మేరకు బాండ్ పేపర్‌పై అతడితో సంతకం చేయించారు. అనంతరం, తన కూతురు చోటీ కుమారిని తీసుకుని మనోజ్ కుమార్ ఇంటికి వెళ్లాడు. బాలిక ధైర్యాన్ని చూసి పట్టణవాసులంతా శెభాష్ అంటున్నారు. -
సినిమా స్టైల్లో మనోజ్-మౌనికల పెళ్లి.. ఆరోజు అతిథిలా..ఇప్పుడెమో ఇలా
మంచు వారి ఇంట పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. అందరూ అనుకున్నట్లుగానే మంచు మనోజ్ మౌనిక రెడ్డిని వివాహం చేసుకోనున్నారు. ఈరోజు(శుక్రవారం)8.30 నిమిషాలకు వీరు పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నారు. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని మంచు లక్ష్మీ ఇంట్లోనే పెళ్లి వేడకు జరగనుంది. ఇప్పటికే మనోజ్ తన పెళ్లి విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కాబోయే భార్య ఫోటోను షేర్ చేస్తూ.. మనోజ్ వెడ్స్ మౌనిక అంటూ పెళ్లిపై ప్రకటన చేశాడు. ఇప్పటికే మెహందీ, సంగీత్ సహా ప్రీవెడ్డింగ్ ఈవెంట్ ఘనంగా జరిగినట్లు తెలుస్తుంది. ఇరు కుటుంసభ్యులతో పాటు అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో మనోజ్ వివాహం జరగనుంది. చాలాకాలం నుంచే మంచు కుటుంబానికి భూమా ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే మనోజ్-మౌనికల మధ్య కూడా మంచి అనుబంధం ఉంది. అంతేకాకుండా 2015లో మౌనిక రెడ్డి మొదటి పెళ్లికి కూడా మనోజ్ హాజరయ్యారు. అలాంటిది ఇప్పుడు ఆమెనే మనువాడబోతుండం విశేషం. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి. గతంలో మంచు మనోజ్ కు ప్రణతి రెడ్డితో పెళ్లి జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమెతో విడాకులు తీసుకున్నాడు. మౌనిక రెడ్డి కూడా బెంగళూరుకు చెందిన బిజినెస్ మ్యాన్ గణేష్ రెడ్డిని వివాహం చేసుకోగా మనస్పర్థల కారణంగా భర్తతో విడిపోయింది. కొంతకాలంగా మనోజ్- మౌనికలు రిలేషన్లో ఉండగా ఇప్పుడు పెల్లిబంధంతో ఒక్కటి కానున్నారు. -
Dawood Ibrahim: రెండో పెళ్లి కలకలం..వెలుగులోకి సంచలన విషయాలు
పరారీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం గురించి అతని మేనల్లుడు అలీషా పార్కర్ సంచలన విషయాలు వెల్లడించాడు. దావూద్ పాక్ మహిళ పఠాన్‌ను రెండో పెళ్లి చేసకున్నాడంటూ బాంబు పేల్చాడు. అలాగే అతను పాకిస్తాన్‌లోని కరాచిలోనే ఉన్నాడని కాకపోతే వేరే ప్రదేశంలోకి మకాం మార్చాడని కీలక విషయాలు చెప్పాడు. ఈ మేరకు ఉగ్రవాద నిధుల కేసుకి సంబంధించి నేషనల్ ఇన్విస్ట్‌గేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) చేసిన దర్యాప్తులో భాగంగా అలీషా పార్కర్ ఈ విషయాలను బయటపెట్టాడు. ఈ అలీషా పార్కర్ దావూద్ ఇబ్రహీం సోదరి, చనిపోయిన హసీనా పార్కర్ కుమారుడు అలిషా ఇబ్రహీం పార్కర్. ఇప్పటికే ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ దావూద్ ఇబ్రహీం, అతని సన్నిహితులపై కేసు నమోదు చేసి కొందర్ని అరెస్టు చేసింది కూడా. అదీగాక దావూద్ దేశంలో బడా నేతలు, వ్యాపారులపై దాడి చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం అందింది. వారు తమ అరాచకాలను పెద్దపెద్ద నగరాల్లో వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో సాగిన దర్యాప్తులో భాగంగా అలీషా పార్కర్ నుంచి ఎన్ఐఏ ఈ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఈ మేరకు అలీషా పార్కర్ విచారణలో ...దావూద్ ఇబ్రహీం తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదని, అలాగే అతడి భార్య తన వాళ్లతో టచ్‌లోనే ఉందని చెప్పాడు. అలాగే అతను ఈ కేసులో పట్టుబడకుండా ఉండేందుకే పాకిస్తాన్ మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడని ఆమె పేరు పఠాన్ అని చెప్పుకొచ్చాడు.ఇప్పడూ దావూద్ కరాచీలోని అబ్దుల్లా ఘాజీ బాబా దర్గా వెనుక ఉన్న రహీమ్ ఫకీ సమీపంలోని డిఫెన్స్ ప్రాంతంలో నివసిస్తున్నట్లు తెలిపాడు. దావూద్ ఇబ్రహీం మొదటి భార్యను తాను కొన్ని నెలల క్రితం జులై 2022లో దుబాయ్‌లో కలిశానని చెబుతున్నాడు. అలాగే ఆమె పండుగలకు తన భార్యకు ఫోన్ చేస్తుంటుందని, వాట్సాప్ కాల్స్ ద్వారా తన భార్యతో మాట్లాడుతుందని కూడా చెప్పాడు. ప్రస్తుతం దావూద్, అతని సన్నిహితులు అనీస్ ఇబ్రహీం షేక్, ముంతాజ్ రహీమ్ ఫకీ తదితరులు తమ కుటుంబాలతో సహా పాకిస్తాన్‌లోని కరాచీలో డిఫెన్స్ కాలనీలో అబ్దుల్లా ఘాజీ బాబా దర్గా వెనుక నివశిస్తున్నారని పేర్కొన్నాడు. అతను ఇప్పుడూ ఎవరితోనూ టచ్‌లో లేడని చెబుతున్నాడు. అలాగే దావూద్ తన మొదటి భార్యకు విడాకులిచ్చాడనేది అవాస్తవం అని చెప్పాడు. దావూద్‌కి మొదటి భార్య మైజాబిన్‌తో ముగ్గురు కూమార్తెలు, ఒక కూమారుడు ఉన్నారని తెలిపాడు. అంతేగాదు అలీషా పార్కర్ విచారణలో దావూద్ నలుగురు సోదరులకు సంబంధంచిన విషయాలు కూడా దర్యాప్తు సంస్థకు వెల్లడించినట్లు సమాచారం. (చదవండి: దావూద్‌పై ఎన్ఐఏ రూ.25 లక్షల బౌంటీ.. అండర్ వరల్డ్ డాన్‌పై ఎన్ని కేసులన్నాయంటే..) -
మండపంలో హైడ్రామా: పెళ్లైన గంటకే ట్విస్ట్.. షాక్‌లో బంధువులు!
అతిథిలు, బ్యాండ్ చప్పుళ్ల మధ్య అంగరంభ వైభవంగా వారిద్దరికీ పెళ్లి జరిగింది. కానీ.. పెళ్లైన గంటకే వరుడు చేసిన పనికి అక్కడున్న వారంతా షాకయ్యారు. పెళ్లైన గంటకే భార్యకు విడాకులిచ్చి.. ఆమెకు తన సోదరుడితో వివాహం జరిపించాడు. ఈ ఆసక్తికర ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. యూపీలోని సంబల్ జిల్లాలోని సైద్‌నగలి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి 5 ఏండ్ల క్రితం వివాహమైంది. కాగా, వీరిద్దరి మధ్య గొడవల కారణంగా భార్యాభర్తలిద్దరూ విడిగా ఉంటున్నారు. గొడవల కారణంగా ఆమె.. భర్తకు దూరంగా తన పుట్టింట్లో ఉంటోంది. ఈ క్రమంలో భర్త.. మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో, కొన్ని నెలలుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. అనంతరం, ఒకరిపై ఒకరికి ఇష్టంతో కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లికి రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో అతడు.. ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య పెళ్లి మండపానికి చేరుకుని గొడవకు దిగింది. తాను ఉండగా రెండో వివాహం ఎలా చేసుకుంటారని ప్రశ్నించింది. దీంతో, ఒక్కసారిగి ఖంగుతిన్న వధువు కుటుంబ సభ్యులు అయోమయానికి గురయ్యారు. ఈ క్రమంలో పోలీసు కేసుతో ఇబ్బందులు కలుగుతాయని భావించిన పెద్దలు పంచాయితీ పెట్టారు. పెద్దలు తీసుకున్న నిర్ణయం మేరకు ఆ వ్యక్తి పెళ్లైన గంటకే రెండో భార్యకు విడాకులు ఇచ్చి.. అదే మండపంతో ఆమెకు తన సోదరుడితో వివాహం జరిపించాడు. దీంతో గొడవ సద్దుమణిగింది. ఈ ఘటన యూపీలో హాట్ టాపిక్‌గా మారింది. -
రెండోపెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన నటి ప్రగతి
నటి ప్రగతి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అమ్మ, వదిన పాత్రలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక సినిమాల కంటే సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన ప్రగతి వర్కవుట్, డ్యాన్స్ వీడియోలతో నెట్టింట అలరిస్తుంటుంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రెండోపెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. సింగిల్ మథర్ కాబట్టి ఎప్పుడైనా మళ్లీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందా అన్న ప్రశ్నకు ఆమె మాట్లాడుతూ.. ''పెళ్లి అనే పదంకన్నా కంప్యానియన్ అనేది చాలా ముఖ్యం. చాలాసార్లు నాకు కూడా కంప్యానియన్ ఉంటే బాగుంటుందనిపిస్తుంది. కానీ మళ్లీ నా మెచ్యూరిటీ లెవల్‌కి మ్యాచ్ అయ్యేవారు దొరకాలి కదా అనిపిస్తుంటుంది. కొన్ని విషయాల్లో ఇలాగే ఉండాలి అని చాలా కశ్చితంగా ఉంటాను. ఒకవేళ 20ఏళ్ల వయసులో ఉంటే అడ్జస్ట్ అయ్యేదాన్నేమో. కానీ ఇప్పుడు చాలా కష్టం'' అంటూ చెప్పుకొచ్చింది. -
సాఫ్ట్వేర్ ఉద్యోగినంటూ భర్త రెండో పెళ్లి.. మొదటి భార్య సడెన్ ఎంట్రీతో షాక్.. తర్వాత
గుంటూరు ఈస్ట్: మాయమాటలు చెప్పి రెండో పెళ్లికి సిద్ధపడిన వ్యక్తిని పట్టాభిపురం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచిలీపట్నంకు చెందిన షేక్ సుభాని గుంటూరుకు చెందిన యువతి కుటుంబానికి తాను సాఫ్ట్వేర్ ఉద్యోగినని చెప్పి మోసగించి రెండో పెళ్లికి సిద్ధపడ్డాడు. కల్యాణ మండపంలో పెళ్లి జరుగుతుండగా, సుభాని మొదటి భార్య యువతి తల్లిదండ్రులకు సుభాని మోసాన్ని తెలియజేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు మంగళవారం పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. మాయమాటలు నమ్మి మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని తల్లిదండ్రులను పోలీసులు కోరారు. మోసగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చదవండి: ఆఫీస్‌కు వచ్చి పని చేయాల్సిందే.. చివరికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ షాకింగ్ నిర్ణయం -
పెళ్లయిన డైరెక్టర్‌ను ధన్య బాలకృష్ణ సీక్రెట్ పెళ్లి చేసుకుందా? నటి సంచలన వ్యాఖ్యలు
కల్పిక గణేశ్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ప్రయాణం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, జులాయి, పడిపడి లేచే మనసు చిత్రాలతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆమె. ఇటీవలే సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద మూవీలో ముఖ్య పాత్ర పోషించింది కల్పిక. ఇదిలా ఉంటే ఈ మధ్య ఆమె తరచూ తన సహానటీనటులను టార్గెట్ చేస్తూ వారిపై సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. అలా వివాదాలతో, ట్రోల్స్‌తో వార్తల్లో నిలుస్తున్న కల్పిక ఓ నటి గురించిన సంచలన విషయం బయపెట్టింది. ప్రముఖ నటి, హీరోయిన్ ధన్య బాలకృష్ణ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. 7th సెన్స్, నేను శైలజ, జయ జానకి నాయక వంటి చిత్రాలల్లో నటిగా అలరించిన ఆమె ఈ మధ్య వెబ్ సిరీస్‌లో సైతం నటించింది. అల్లుడు గారు, లూసర్, రెక్కీ వంటి వెబ్ సిరీస్‌లో ఆమె హీరోయిన్గా గుర్తింపు పొందింది. ఇదిలా ఉంటే ఆమె ఓ పెళ్లై, విడాకులైన డైరెక్టర్‌ను వివాహం చేసుకుందంటూ షాకింగ్ విషయం బయటపెట్టింది నటి కల్పిక. రీసెంట్ తన యూట్యూబ్ చానల్లో ధన్య గురించి ఈ విషయం చెబుతూ ఆమె ఓ వీడియో విడుదల చేసింది. అయితే కాపీ రైట్ ఇష్యూ కారణంగా యూట్యూబ్ ఈ వీడియోను డిలీట్ చేసింది. ఇక ఆ వీడియోలో కల్పిక మాట్లాడుతూ.. ‘ధన్య బాలకృష్ణ.. కోలీవుడ్ డైరెక్టర్ బాలాజీ మోహన్‌ను ఈ ఏడాది జనవరిలో రెండో పెళ్లి చేసుకుంది. మొదటి నుంచి ఆమె చెన్నై వెళ్లినప్పుడల్లా బాలాజీ మోహన్‌తోనే ఉండేది. అయితే అప్పటికే బాలాజీకి పెళ్లయి భార్యకు విడాకులు కూడా ఇచ్చాడు. తమిళంలో సినిమాలు చేస్తున క్రమంలో బలాజీతో ఆమె పరిచయం అయ్యింది. అది కాస్తా ప్రేమగా మారడంతో వారిద్దరు సీక్రెట్ గా వివాహం చేసుకొని కాపురం కూడా పెట్టేశారు. వీరిద్దర పెళ్లయి ఏడాది కావోస్తోంది. అయినా ఇప్పటికీ తమ రిలేషన్‌ను వారు బయటకు చెప్పేందుకు ఇష్టపడటం లేదు. అయితే వారి పెళ్లి విషయం తెలిసి ధన్య గురించి నాకు భయం వేసింది. అతడు ఆమె టార్చర్ పెడతాడామో అని అనుకున్నా. కానీ, వారిద్దరు చాలా ఆన్యోన్యంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం ఇప్పుడు చెప్పడానికి ఓ కారణం ఉంది. ధన్య మూవీ ప్రమోషన్స్‌కి రావడం లేదు. ఈ విషయంలో బాలాజీ ఆమెను ఇబ్బంది పెడుతున్నాడెమో అనిపించింది. అందుకే నేను ఈ విషయాన్ని చెప్పాల్సి వచ్చింది’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అయితే కాపీ రైట్ ఇష్యూ కారణంగా యూట్యూడ్ ఈ వీడియోను డిలీట్ చేసింది. అయితే ఇది డైరెక్టర్ బలాజీనే వీడియోను డిలిట్ చేయించారని ఆరోపిస్తు ఆమె తన ఫేస్బుక్లో ఓ పోస్ట్ షేర్ చేయడం గమనార్హం. View this post on Instagram A post shared by Dhanya Balakrishna (@dhanyabalakrishna) View this post on Instagram A post shared by Balaji Mohan (@directormbalaji) -
భర్త రెండో పెళ్లి.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన మొదటి భార్య
బొమ్మనహాళ్(అనంతపురం జిల్లా): రెండో పెళ్లి చేసుకున్న యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు.. బొమ్మనహాళ్ మండలం గోవిందవాడ నివాసి సుధాకర్‌కు విడపనకల్లు మండలం మల్లాపురానికి చెందిన శ్రీలేఖను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలం వీరి కాపురం అన్యోన్యంగా సాగింది. కొన్ని రోజులుగా శ్రీలేఖకు దూరంగా వచ్చిన సుధాకర్.. గురువారం ఉదయం కుటుంసభ్యులతో కలసి ఉరవకొండ మండలం రాకెట్లకు చెందిన యువతిని నేమకల్లు ఆంజనేయస్వామి ఆలయంలో రెండో వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న శ్రీలేఖ వెంటనే బొమ్మనహాళ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై విచారణ అనంతరం సుధాకర్‌తో పాటు అతణ్ని రెండో వివాహానికి ప్రేరేపించిన తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: వీడియోలు ఎక్కువగా చూడొద్దని భర్త మందలింపు.. నవవధువు ఆత్మహత్య -
మీనా రెండో పెళ్లి చేసుకోబోతుందా? ఆమె క్లోజ్‌ఫ్రెండ్ ఏమందంటే..
టాలీవుడ్ నటి మీనా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవలె భర్త విద్యాసాగర్‌ను కోల్పోయిన మీనా ఆ బాధ నుంచి తేరుకోవడానికి వరుస షూటింగ్స్‌లో పాల్గొంటుంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో పలు సినిమాలకు ఆమె సైన్ చేసింది. ఇదిలా ఉండగా గత రెండు, మూడు రోజులుగా మీనా రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు షికార్లు చేస్తున్నాయి. తల్లిదండ్రుల ఒత్తిడి, కూతురి భవిష్యత్తును దృష్టిని ఉంచుకొని మీనా రెండో పెళ్లికి ఒకే చెప్పిందంటూ వార్తలు వైరల్ అవతున్నాయి. ఈ విషయం మీనా చెవిన కూడా పడిందట. దీంతో ఇలాంటి రూమర్స్‌ని వైరల్ చేస్తున్నందుకు మీనా ఆగ్రహం వ్యక్తం చేసిందట. 'డబ్బు కోసం ఏమైనా రాస్తారా? సోషల్ మీడియా రోజు రోజుకు దిగజారిపోతుంది. వాస్తవాలు తెలుసుకుని రాయండి. నా భర్త చనిపోయినప్పుడు కూడా సోషల్ మీడియాలో రకరకాల తప్పుడు ప్రచారాలు చేశారు. తనపై అసత్య వార్తలు రాస్తే వాళ్లపై చర్యలు తీసుకుంటా' అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇక మీనా రెండో పెళ్లిపై వస్తున్న వార్తలను ఆమె క్లోజ్‌ఫ్రెండ్ ఒకరు తీవ్రంగా ఖండించారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని, ఒకవేళ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే మీనానే స్వయంగా ప్రకటిస్తుందని, పుకార్లు సృష్టించొద్దు అంటూ క్లారిటీ ఇచ్చారు. -
రెండో పెళ్లికి సిద్ధమవుతున్న మీనా.. వరుడు అతడే?
నటి మీనా రెండో పెళ్లికి సిద్ధమవుతున్నారా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. బాలనటిగా తెరంగేట్రం చేసిన నటీమణుల్లో ఈమె ఒకరు. ఆ తర్వాత కథానాయిక స్థాయికి ఎదిగిన మీనా 1990 దశకంలో అగ్ర కథానాయికగా రాణించారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో అగ్రహీరోల సరసన నటించి పాపులర్ అయ్యారు. ముఖ్యంగా రజనీకాంత్‌తో బాలనటిగా నటించి ఆ తర్వాత యజమాన్, ముత్తు వంటి చిత్రాల్లో కథానాయికగా నటించడం విశేషం. అదే విధంగా తెలుగులోనూ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి ప్రముఖ నటుల సరసన నటించారు. అలా నటిగా మంచి ఫామ్‌లో ఉండగానే 2009లో బెంగళూరుకు చెందిన విద్యాసాగర్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడారు. వీరికి నైనికా అనే కూతురు ఉంది. ఆ పాప కూడా తేరి తదితర చిత్రాల్లో బాలనటిగా గుర్తింపు పొందింది. కాగా వివాహానంతరం కూడా నటనకు అవకాశం ఉన్న పాత్రలో నటిస్తున్న మీనా జీవితంలో విషాద ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యానికి గురైన ఆమె భర్త గత జూన్ నెలలో కన్ను మూశారు. ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మీనా మళ్లీ నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో ఆమె రెండో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. తనకు మళ్లీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని.. ఆమె, కుమార్తె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆమె తల్లిదండ్రులు మీనాకు రెండో పెళ్లి చేయడానికి ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. దీంతో మీనా కూడా పెళ్లికి అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. వరుడు కూడా తెలిసిన వ్యక్తేనట. ఆమె భర్త మిత్రుడే అని సమాచారం. అయితే దీని గురించి మీనా తరఫు నుంచి ఎలాంటి స్పందన లేదు. కాగా మీనా మలయాళంలో మోహన్‌లాల్ జంటగా నటించిన దృశ్యం పార్ట్ 1, పార్ట్ 2 చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. దీంతో పార్ట్ 3 త్వరలో ప్రారంభం కాబోతుందని సమాచారం. -
అదొక్కటే నాకున్న వ్యాపకం.. రెండో పెళ్లిపై దిల్‌రాజు కామెంట్స్
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించి ప్రస్తుతం స్టార్‌ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక దిల్‌రాజు వ్యక్తిగత జీవితానికి వస్తే.. 2017లో ఆయన మొదటి భార్య అనిత గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీంతో 2020లో తేజస్విని(వైఘా రెడ్డి)తో ఆయనకు రెండో వివాహం జరిగింది. తాజాగా తన రెండో పెళ్లిపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దిల్‌రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. '' నా భార్య అనిత చనిపోయాక రెండేళ్ల వరకు మెంటల్లీ చాలా స్ట్రగుల్ అనిపించింది. ఆ టైంలో కూతురు, అల్లుడు నాతోనే ఉండేవారు. ఆ బాధ నుంచి తేరుకోవడానికి చాలా ప్రయత్నించా. నాకున్న వ్యాపకం ఒక్కటే గ్యాంబ్లింగ్. నన్ను అలా చూస్తూ మా పేరెంట్స్ ఉండలేకపోయారు. వాళ్లే నన్ను రెండో పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేశారు. నా కూతురు హన్షితా కూడా సపోర్ట్ చేసింది. నా ఫ్యామిలీ డిస్టర్బ్ కావొద్దనే ఆలోచనతో అన్ని విధాలుగా ఆలోచించి రెండో పెళ్లి చేసుకున్నా'' అంటూ దిల్‌రాజు పేర్కొన్నారు. కాగా ఇటీవలె ఈ దంపతులకు కుమారుడు జన్మించాడు. అతనికి ఇద్దరి భార్యల పేర్లు కలిసొచ్చేలా అన్వయ్ రెడ్డి అని పేరు పెట్టారు. చదవండి : హీరోల క్యారవాన్ కల్చర్‌పై దిల్‌రాజు షాకింగ్ కామెంట్స్ -
వివేకాను హత్య చేయించింది అల్లుడు, పెద్ద బావమరిదే
సాక్షి, అమరావతి/కడప అర్బన్: మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో సీబీఐ ఉద్దేశ పూర్వకంగా విస్మరిస్తున్న కోణాలు తొలిసారిగా న్యాయస్థానం దృష్టికి వచ్చాయి. షమీమ్ అనే మహిళను వైఎస్ వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకోవడంతో ఆయన కుమార్తె, అల్లుడు, పెద్దబావమరిదితో తలెత్తిన ఆస్తి, రాజకీయ వారసత్వ విభేదాలే ఈ హత్యకు కారణమని ఈ కేసులో అరెస్టయిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ పులివెందుల మెజిస్ట్రేట్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. వైఎస్ వివేకానందరెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్‌రెడ్డే హత్యకు కుట్ర పన్నారని చెప్పారు. పులివెందులలో రాజకీయ ఆధిపత్యం కోసం టీడీపీ నేత బీటెక్ రవి, ఆర్థిక, రాజకీయ విభేదాలతో కొమ్మారెడ్డి పరమేశ్వరరెడ్డి, వైజీ రాజేశ్వరరెడ్డి, నీరుగట్టు ప్రసాద్‌లు ఈ హత్య కుట్రలో భాగస్వాములయ్యారని తెలిపారు. వారిని విచారిస్తే ఈ హత్య కేసును ఛేదించవచ్చన్నారు. సీబీఐ ఉద్దేశ పూర్వకంగానే వాస్తవాలను విస్మరిస్తూ నిరపరాధులను అరెస్టులతో వేధిస్తోందని ఆమె వివరించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కుట్ర కోణాన్ని వివరించడంతోపాటు.. సాగాల్సిన రీతిలో సీబీఐ దర్యాప్తు సాగడం లేదని తులసమ్మ ఈ ఏడాది ఫిబ్రవరి 21న పులివెందుల న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై స్పందించిన న్యాయస్థానం ఆమె వాంగ్మూలాన్ని శనివారం నమోదు చేసింది. దాంతో ఇన్నాళ్లూ సీబీఐ కప్పిపుచ్చేందుకు యత్నించిన కీలక వాస్తవాలు న్యాయస్థానంతోపాటు యావత్ ప్రజల దృష్టికి వచ్చాయి. పులివెందుల న్యాయస్థానం నమోదు చేసిన తులసమ్మ వాంగ్మూలంలోని వివరాలను ఆమె న్యాయవాదులు రవీంద్రారెడ్డి, కోదండరామిరెడ్డిలు కడపలో మీడియాకు వెల్లడించారు. తదుపరి విచారణను డిసెంబర్ 24కు వాయిదా వేశారని తెలిపారు. న్యాయవాదులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. హత్య చేయించింది వారిద్దరే.. ► వైఎస్ వివేకానందరెడ్డి షమీమ్ అనే మహిళను రెండో వివాహం చేసుకోవడంతో ఆయన కుటుంబంలో తలెత్తిన విభేదాలే ఈ హత్యకు దారి తీశాయి. బెంగళూరులో భూ సెటిల్మెంట్ ద్వారా వచ్చే రూ.4 కోట్లను తన రెండో భార్య షమీమ్‌కు ఇస్తాననడంతోపాటు ఆమె ద్వారా తనకు కలిగిన కుమారుడిని తన వారసుడిగా ప్రకటిస్తానని వివేకానందరెడ్డి చెప్పారు. ► వివేకానందరెడ్డి రాజకీయ వారసత్వం ఆశిస్తున్న అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, బావమరిది శివ ప్రకాశ్‌రెడ్డి ఆయనపై కక్ష పెంచుకుని హత్యకు కుట్రపన్ని ఉండొచ్చు. వివేకా హత్య అనంతరం ఆయన కుటుంబ సభ్యుల పాత్ర సందేహాస్పదంగా ఉంది. ► వివేకానందరెడ్డి చనిపోయిన విషయాన్ని పీఏ కృష్ణారెడ్డి మొదట ఆయన కుటుంబ సభ్యులకే తెలిపారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహం, ఆ ప్రదేశాన్ని వివేకా అనుచరుడు ఇనయతుల్లా తన సెల్‌ఫోన్ ద్వారా ఫొటోలు, వీడియోలు తీసి నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డిలకు వాట్సాప్ చేశారు. వాటిని చూసిన తర్వాత కూడా శివప్రకాశ్‌రెడ్డి.. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డి తనకు ఫోన్ చేస్తే వివేకా గుండెపోటుతో చనిపోయారని చెప్పారు. అదే విషయాన్ని ఆదినారాయణరెడ్డి మీడియాకు వెల్లడించారు కూడా. ► వివేకా రాసినట్లు చెబుతున్న లేఖ, సెల్‌ఫోన్‌ను తాము వచ్చే వరకు పోలీసులకు అప్పగించవద్దని పీఏ కృష్ణారెడ్డికి రాజశేఖరరెడ్డి ఆదేశించారు. వారు పులివెందుల చేరుకున్న తర్వాత సెల్‌ఫోన్‌లోని మెసేజ్‌లు, ఇతర వివరాలను డిలీట్ చేసిన తర్వాతే వాటిని పోలీసులకు అప్పగించారని అనుకుంటున్నారు. కాబట్టి నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డిలే కుట్ర పన్ని వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయించారని స్పష్టమవుతోంది. ఆధిపత్యం కోసం బీటెక్ రవి కుట్ర ► టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి వివేకాతో రాజకీయ విభేదాలున్నాయి. వివేకా ఉన్నంత కాలం తాను ఆధిపత్యం సాధించలేనని ఆయనకు తెలుసు. అందుకే అడ్డు తొలగించుకునేందుకు వివేకా హత్యకు సహకరించారు. ► వివేకానందరెడ్డికి ఆయన అనుచరుడిగా ఉన్న కొమ్మా పరమేశ్వరరెడ్డికి మధ్య ఆర్థిక విభేదాలు తలెత్తాయి. దాంతో పరమేశ్వరరెడ్డి కక్ష పెంచుకుని వివేకా రాజకీయ ప్రత్యర్థి బీటెక్ రవికి సన్నిహితుడిగా మారారు. వివేకా హత్యకు ముందు ఎలిబీ సృష్టించుకునేందుకు పరమేశ్వరరెడ్డి 2019 మార్చి 13న అనారోగ్యం నెపంతో కడపలోని సన్‌రైజ్ ఆస్పత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేరారు. కానీ ఎవరికీ తెలియకుండా 2019 మార్చి 14 సాయంత్రం టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవితో హరిత హోటల్లో రెండుసార్లు సమావేశమయ్యాడు. ఈ భేటీలో పాల్గొన్న శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి తర్వాత కొద్ది రోజులకే అనుమానాస్పద రీతిలో మృతి చెందడం గమనార్హం. సిట్ దర్యాప్తులో నార్కో పరీక్షకు అతను తిరస్కరించడం సందేహాలకు తావిస్తోంది. కక్షగట్టిన వైజీఆర్.. సహకరించిన నీరుగట్టు ► వైఎస్సార్ కడప జిల్లాకే చెందిన వైజీ రాజేశ్వరరెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రిలో స్థిరపడ్డాడు. ఆయన రాజకీయ ప్రత్యర్థి నారాయణరెడ్డిని వైఎస్సార్సీపీలోకి తీసుకురావాలని వివేకా భావించడంతో కక్ష పెంచుకున్నాడు. వైఎస్ వివేకాపై అప్పటికే కక్షగట్టిన నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి హైదరాబాద్‌లో వైజీ రాజేశ్వరరెడ్డితో పలుమార్లు భేటీ అయ్యారు. ► మరోవైపు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవితో టచ్‌లో ఉంటూ వచ్చారు. 2019 మార్చి 14న పులివెందులకు చెందిన నీరుగుట్టు ప్రసాద్ ఉద్దేశ పూర్వకంగానే వివేకా ఇంటికి ఉత్తరం వైపు తలుపు గడియ పెట్టకుండా వెళ్లిపోయారు. దీంతో హంతకులు ఆ రోజు వివేకా ఇంటిలోకి ప్రవేశించి హత్య చేశారు. దర్యాప్తును తప్పుదారి పట్టిస్తున్న సీబీఐ ► సీబీఐ ఉద్దేశ పూర్వకంగానే ఈ కేసు దర్యాప్తును తప్పుదారి పట్టిస్తోంది. హత్యలో స్వయంగా పాల్గొన్న దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడంతోపాటు అతని ముందస్తు బెయిల్‌ను వ్యతిరేకించక పోవడం సీబీఐ దురుద్దేశాలను వెల్లడిస్తోంది. ఈ హత్యలో అసలు కుట్రదారులుగా భావిస్తున్న నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి, కొమ్మా పరమేశ్వరరెడ్డి, బీటెక్ రవి, వైజీ రాజేశ్వరరెడ్డి, నీరుగుట్టు ప్రసాద్‌లను సీబీఐ ఇప్పటి వరకు విచారించనే లేదు. విచారణ, అరెస్టుల పేరిట నిరపరాధులను వేధిస్తోంది. ► వివేకా హత్య కేసులో పలువురి కాల్ డేటాలు, సీసీ టీవీ ఫుటేజీలు, ఇతర శాస్త్రీయ ఆధారాలను సిట్ బృందాలు సేకరించాయి. కేసును దాదాపు ఓ కొలిక్కి తెచ్చేందుకు సిద్ధమైన తరుణంలో సిట్ దర్యాప్తును అడ్డుకుంటూ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హత్య వెనుక తన కుటుంబ సభ్యుల పాత్ర బయట పడుతుందనే ఆమె సిట్ దర్యాప్తును అడ్డుకున్నారు. గతంలో ఈ కేసును దర్యాప్తు చేసిన సిట్ బృందం సేకరించిన శాస్త్రీయ ఆధారాలు, కీలక అంశాలను సీబీఐ అధికారులు కనీసం పరిగణనలోకి కూడా తీసుకోకపోవడం సందేహాలకు తావిస్తోంది. ► సిట్ బృందాలు గతంలో నమోదు చేసిన కేస్ డైరీలు రెండింటినీ న్యాయస్థానం తెప్పించుకుని పరిశీలించాలి. నిజాయితీగా దర్యాప్తు చేయాలి. ఆ ఆరుగురినీ విచారించాలి. అప్పుడే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కుట్రను ఛేదించవచ్చు. దోషులను గుర్తించి శిక్షించవచ్చు. ఈ ప్రశ్నలకు బదులేదీ? ► వివేకా రాసినట్లు చెబుతున్న లేఖ, సెల్‌ఫోన్‌ను ఎందుకు వెంటనే పోలీసులకు అప్పగించలేదు? ► నర్రెడ్డి రాజశేఖరరెడ్డి వచ్చాక సెల్‌ఫోన్‌లోని డేటాను డిలీట్ చేయడం నిజం కాదా? ► ఆ లేఖను వెంటనే పోలీసులకు ఇచ్చి ఉంటే అది హత్యేనని అప్పుడే తెలిసుండేది కదా? ► రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహం ఫొటోలు చూసి కూడా అది హత్య అని శివప్రకాష్‌రెడ్డికి తెలియలేదా? ► అయినా గుండెపోటుతో మృతి చెందాడని అప్పటి మంత్రి ఆదినారాయణరెడ్డికి ఎందుకు చెప్పినట్లు? ► వివేకా రెండవ భార్య షమీమ్, వివేకా కూతురు సునీతల మధ్య వాట్సాప్ చాటింగ్‌లు సాగలేదా? ► వారి మధ్య జరిగిన చాటింగ్ వివరాలు ఎందుకు బయటకు వెల్లడించలేదు? ► నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివప్రకాష్‌రెడ్డిలు షమీమ్‌తో గొడవ పడలేదా? ► వివేకా.. షమీమ్‌కు ఇవ్వాలనుకున్న ఇంటిని వీరు లాక్కోవడం నిజం కాదా? -
హన్సిక పెళ్లాడబోయే వ్యక్తికి ఇదివరకే పెళ్లయిందా?
దేశ ముదురు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ హన్సిక మోత్వాని. తొలి సినిమాతోనే ఊహించని క్రేజ్‌ను దక్కించుకున్న హన్సిక త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది. ముంబైకి చెందిన సోహెల్ ఖతురియాతో కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ బ్యూటీ డిసెంబర్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది. ఈ మేరకు కాబోయే భర్తతో కలిసి దిగిన అందమైన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. దీంతో అసలు హన్సిక పెళ్లి చేసుకోబోయేది ఎవరు? అతను ఏం చేస్తుంటాడన్నది తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోహెల్‌కు సంబంధించి పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. సోహెల్ ముంబైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త. ఎప్పటినుంచో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. బిజినెస్లోఊ ఇద్దరూ పార్ట్‌నర్స్‌గా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే సోహెల్‌కు ఇది రెండో పెళ్లి. 2016లో రింకీ అనే అమ్మాయితో ఇదివరకే అతనికి పెళ్లయిందట. అయితే తర్వాత విభేదాల కారణంగా వీరు విడాకులు తీసుకున్నారు. మరో విశేషం ఏంటంటే.. రింకీ హన్సికకు బెస్ట్‌ఫ్రెండ్ అట. రింకీ పెళ్లి వేడకలోనూ హన్సిక పాల్గొంది. దీనికి సంబంధించన ఓల్డ్ వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.ఇప్పుడు ఆ బెస్ట్‌ఫ్రెండ్ మాజీ భర్తనే హన్సిక పెళ్లాడబోతుంది. డిసెంబర్ 4న రాజస్థాన్‌లోని ఓ ప్రముఖ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా హన్సిక-సోహెల్ పెళ్లి వేడకకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
పీటల మీద పెళ్లి నిలిపేసిన భార్య.. పాపం హనీమూన్ ట్రిప్..
పెళ్లి మండపంలో ఎటుచూసినా సందడి. మంగళవాయిద్యాలు మోగుతున్నాయి. మూడుముళ్లకు సమయం సమీపిస్తోంది. వరుడు కూడా ఆతృతగా ఉన్నాడు. ఇంతలో ఓ యువతి అక్కడికి వచ్చింది. వధువు తల్లిదండ్రులను కలిసి ఏదో చెప్పింది. అంతే పెళ్లి వేడుక బంద్ అయ్యింది. పోలీసులు వచ్చి వరున్ని తీసుకెళ్లారు. పూల కారుపై ఊరేగాల్సిన వరుడు జీపు ఎక్కాడు. సాక్షి, బెంగళూరు(యశవంతపుర): పెళ్లయిన సంగతిని దాచిపెట్టి రెండో పెళ్లికి సిద్ధమైన మోసగాన్ని హాసన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. బెంగళూరులో ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్న మధుసూదన్‌కు నాలుగేళ్ల క్రితం వసుధ అనే యువతితో వివాహమైంది. గొడవలు రావడంతో ఇద్దరు బెంగళూరులో విడివిడిగా ఉంటున్నారు, కానీ విడాకులు ఇంకా తీసుకోలేదు. హాసన్‌లో రెండో పెళ్లి తతంగం ఆ కేసు పరిష్కారం కాకుండానే అక్క సాయంతో హాసన్‌కు చెందిన అమ్మాయితో గుట్టుగా పెళ్లికి సిద్ధమయ్యాడు. హాసన పట్టణంలోని కళ్యాణ మండపంలో పెళ్లికి ఇరువైపులవారు చేరుకున్నారు. వసుధకు చూచాయగా విషయం తెలిసి గూగుల్‌లో హాసన్ పట్టణంలోని కళ్యాణ మండపాల వివరాలను సేకరించింది. శుక్రవారం ఉదయం 10 గంటలకు మధుసూదన్ వధువుకు తాళికట్టే సమయానికి వసుధ అక్కడకు వచ్చి వధువు తల్లిదండ్రులను కలిసింది. అతని వల్ల నా జీవితం నాశనమైంది. మీ అమ్మాయి జీవితం కూడా పాడు కాకుండా చూసుకోండని గట్టిగా చెప్పింది. అమ్మాయి తల్లిదండ్రులు మోసగాడు మధుసూదన్‌ను గదిలో పెట్టి తాళం వేసి పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి అరెస్ట్ చేశారు. పాపం హనీమూన్ ట్రిప్ పెళ్లి అయిన మరుసటి రోజున మాల్దీవులకు హనీమూన్‌కు వెళ్లాలని మధుసూదన్ ప్లాన్ వేశాడు. శనివారం విమానం ఎక్కడానికి పాస్‌పోర్ట్, వీసా, టికెట్లను రెడీ చేశాడు. పెళ్లి తరువాత మొదటి భార్య బంధువులు ఏమి చేయలేయరనే ధీమాతో ఉన్నాడు గానీ పథకం మొత్తం నీరు గారడంతో పాటు కటకటాల వెనక్కు చేరాడు. కాగా పీటల మీద పెళ్లి నిలిచిపోవడంతో వధువు కుటుంబీకులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. అతని గురించి ముందే తెలిసి ఉంటే ఇంతవరకూ రానిచ్చేవారం కాదని వాపోయారు. -
23 ఏళ్ల యువతిని సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్న ‘బబ్లూ’ పృథ్వీరాజ్
నటుడు బబ్లూ పృధ్వీ రాజ్ గురించి ప్రత్యేకం పరిచయం అక్కర్లేదు. తమిళ నటుడైన ఆయన తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించాడు. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా హీరోగా కూడా పలు చిత్రాలు చేసి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే అవకాశాలు తగ్గడంతో కొంతకాలంగా ఆయన తెలుగు తెరపై కనిపించడం లేదు. ఇటీవల ఇంటింటి గృహలక్ష్మీ అనే సీరియల్‌తో తెలుగులో బుల్లితెర ఎంట్రీ ఇచ్చాడు ఆయన. చదవండి: జపానీస్‌లో మాట్లాడి అదరగొట్టిన తారక్, ఫ్యాన్స్ ఫిదా.. వీడియో వైరల్ ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయన సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. కొంతకాంలగా పృథ్వీరాజ్ భార్యతో దూరంగా ఉంటున్నారంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడనే వార్తలు గుప్పుమన్నాయి. 50 ఏళ్ల పృథ్యీరాజ్ 23 ఏళ్ల యువతిని రెండవ వివాహం చేసుకున్నాడంటూ తమిళ మీడియాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, మెయిన్ స్ట్రీమ్‌లో ఆర్ఆర్ఆర్, అఖండ చిత్రాలు ఈ తాజా బజ్ ప్రకారం.. మలేషియాకు చెందిన 23 ఏళ్ల అమ్మాయిని ఆయన సీక్రెట్ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన రెండో భార్యతోనే కలిసి ఉంటున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రెండో పెళ్లి గురించి ఆయన అధికారిక ప్రకటన కూడా ఇవ్వనున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. మరి ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా పృధ్వీరాజ్‌కు 1994లో బీనా అనే మహిళతో పెళ్ల కాగా వీరికి ఓ బాబు కూడా జన్మించాడు. -
మంచు మనోజ్ రెండో పెళ్లి వార్తలపై మంచు లక్ష్మి స్పందన
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ రెండో పెళ్లిపై కొద్ది రోజులు పుకార్లు షికారు చేస్తున్నాయి. దివంగత భూమా నాగిరెడ్డి-భూమా శోభ దంపతుల రెండో కుమార్తె భూమా మౌనికరెడ్డితో మంచు మనోజ్ ప్రేమలో ఉన్నట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల వినాయక చవిత సందర్భంగా మనోజ్-మౌనికరెడ్డి కలిసి సీతాఫలమండిలోని వినాయక మండపానికి రావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరించింది. అప్పటి నుంచి మనోజ్ రెండో పెళ్లి ఇటూ సినీ వర్గాలతో పాటు అటూ రాజకీయ వర్గాల్లోనూ జోరుగా చర్చ నడుస్తోంది. చదవండి: ఈ దీపావళికి థియేటర్లో సందడి చేయబోతున్న చిత్రాలివే ఈ క్రమంలో మనోజ్ రెండో పెళ్లి ఆయన సోదరి, నటి మంచు లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమెకు మనోజ్ రెండో పెళ్లిపై ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ.. ఎవరి బ్రతుకు వారిని బతకనివ్వండి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అనంతరం ‘మనోజ్ మళ్లీ పెళ్లి చేసుకుంటే నాకు ఆనందమే. ఈరోజుల్లో నిజాయితీ గల ప్రేమ పొందడం చాలా కష్టం. ఇప్పుడు మనోజ్ అలాంటి ప్రేమనే పొందుతున్నాడు. అందుకు నేను చాలా సంతోషిస్తున్నా. నా ఆశీర్వాదం మనోజ్‌కు ఎప్పుడు ఉంటుంది’ అంటూ ఆమె ఆసక్తికరంగా వ్యాఖ్యానించింది. చదవండి: ఆదిపురుష్ టీజర్‌పై తమ్మారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు -
పెళ్లైన విషయాన్ని దాచి.. మరో యువతితో రెండో వివాహం.. విషయం తెలిసి..
సాక్షి, ఖమ్మం: ఓ యువకుడు మొదటి పెళ్లి విషయాన్ని దాచి మరో యువతిని రెండో పెళ్లి చేసుకొని మోసం చేసిన ఘటన ఖమ్మం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భర్త తనను మోసం చేశాడని తెలుసుకున్న రెండో భార్య.. తల్లిదండ్రులతో కలిసి భర్త ఇంటిముందు నిరసన దీక్ష చేపట్టింది. వివరాలు.. ఖమ్మం పట్టణం రోటర్ నగరకు చెందిన నవజీవన్ ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకొని ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా డిసెంబర్ ఒకటో తేదీన ఖమ్మం పట్టణం ఎన్ఎస్టీ ప్రాంతానికి చెందిన కాసం సౌగంధికను రెండో వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన కొద్ది రోజుల నుంచి భార్యతో సఖ్యతగా ఉండకుండా ఆమెను వేధింపులు గురి చేసేవాడు. ఈ క్రమంలో యువతి బంధువులు పలుమార్లు నవజీవన్‌ను హెచ్చరించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. అంతేగాక అతనికి తన కంటే ముందే వేరే యువతితో పెళ్ళి జరిగిన విషయం సౌగంధికకు తెలిసింది. దీంతో భర్త నవజీవన్‌పై మహిళా పోలీసులకు పిర్యాదు చేసింది. అయితే అక్కడ తనకు ఎలాంటి న్యాయం జరగకపోవడంతో భర్త నవజీవన్ ఇంటిముందు శనివారం న్యాయం కోసం నిరసన దీక్ష చేపట్టింది. విషయం తెలుసుకున్న టూ టౌన్ పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టిక్‌టాక్ ప్రేమ.. భర్తకు ప్రియురాలితో పెళ్లి చేసిన భార్య
సాక్షి, తిరుపతి: భర్త మరో అమ్మాయితో చనువుగా ఉన్నాడని తెలిస్తేనే తట్టుకోలేదు భార్య. అలాంటిది మరో పెళ్లి చేసుకునేందుకు అంగీకరిస్తుందా? కానీ, ఇక్కడ సీన్ రివర్స్. భర్తకు ప్రియురాలిని ఇచ్చి భార్య దగ్గరుండి పెళ్లి చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో జరిగింది. టిక్‌టాక్‌లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారగా.. వెతుక్కుంటూ వచ్చిన యువతితో తన భర్తకు దగ్గరుండి రెండో పెళ్లి చేసింది. ఈ అరుదైన వివాహం గురించి తెలుసుకుందాం రండీ... డక్కిలి మండలం అంబేద్కర్ నగర్‌కు చెందిన ఓ యువకుడు డిగ్రీ వరకు చదువుకున్నాడు. టిక్‌టాక్‌లో విశాఖకు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడగా.. ఇద్దరి మనసులు కలిశాయి. ఒకర్ని ఒకరు ప్రేమించుకున్నారు. కొన్నాళ్లు ఇద్దరూ చనువుగా ఉన్నారు.. ఆ తర్వాత యువతి నుంచి యువకుడు దూరమయ్యాడు. కొద్దిరోజులు తర్వాత మరో యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుని హాయిగా ఉంటున్నారు. ఇంతలో ప్రియుడి కోసం కొన్నాళ్లు వేచిచూసిన విశాఖ యువతి నేరుగా తిరుపతికి వచ్చింది. తన ప్రియుడికి ఇప్పటికే పెళ్లి జరిగిన విషయం తెలిసి బాధపడింది. కానీ, ఆ యువతి అంతటితో ఆగిపోలేదు.. తన ప్రేమికుడి భార్యను కలిసి మాట్లాడింది. తానూ ఇక్కడే ఉంటానని.. అందరం కలిసి ఉందామని నచ్చజెప్పింది. మొదటి భార్యకు ఏం చేయాలో పాలుపోలేదు. తొలుత అయోమయంలో పడినా.. చివరకు ముగ్గురూ కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. తన భర్తకు ఆ యువతితో పెళ్లి చేయడానికి భార్య ఒప్పుకుంది. దీంతో భర్తతో కలిసి ప్రియురాలు పెళ్లి పీటలెక్కింది. భార్యే దగ్గరుండి భర్తతో ప్రియురాలికి వివాహం చేసింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ఇదీ చదవండి: పాఠశాలనే మద్యం గోదాం.. లిక్కర్ మాఫియా పనితో టీచర్స్ షాక్! -
సంస్కారం ఉన్న మనుషులు ఇలా మాట్లాడరు.. యాంకర్‌పై సునీత ఫైర్
టాలీవుడ్ సింగర్ సునీత తన మధురమైన గాత్రంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. పాటలతోనే కాకుండా చూడచక్కని రూపంతో హీరోయిన్స్‌కు ఏమాత్రం తీసిపోని ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమెకుంది. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా అలరించిన సునీతకు టాలీవుడ్లో ప్రత్యేక స్థానం ఉందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పటికే ఎన్నో వందల పాటలు పాడిన సునీత గతేడాది వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉన్న సునీత తాజాగా వన్ మినిట్ మ్యూజిక్ వీడియోలతో అభిమానులను అలరిస్తున్నారు. అయితే సింగర్‌గా ఆమెకు బోలెడంత క్రేజ్ ఉన్నా రెండో పెళ్లి విషయంలో సునీతపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఆమెకు ఇదే ప్రశ్న ఎదురైంది. ఆ వయసులో రెండో పెళ్లి అవసరమా అంటూ వచ్చిన ట్రోల్స్‌పై మీరేమంటారు అని యాంకర్ ప్రశ్నించగా సునీత చాలా ఎమోషనల్ అయ్యింది. కెరీర్లో చిత్రగారి తర్వాత 120 హీరోయిన్స్‌కి పైగా డబ్బింగ్ చెప్పానని, చాలామంది ఎంటర్టైన్మెంట్కి కారణమయ్యానంటారు కదా.. ఇన్ని మంచి విషయాలు ఉన్నప్పుడు నా పర్సనల్ జీవితం మీద ఎందుకు ఫోకస్ పెడుతున్నారు? సంస్కారవంతుల లక్షణం ఏంటంటే.. మన మనిషిని ఒకమాట అనేముందు ఒక్క క్షణం ఆలోచించాలి అంటూ యంకర్ను సూటిగా నిలదీసింది. ప్రస్తుతం సునీత చేసిన ఈ కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. -
భర్తకు ట్రాన్స్‌వుమన్‌తో ఎఫైర్.. పెళ్లికి అంగీకరించిన భార్య..
భువనేశ్వర్: ఒడిశా కలాహాండీ జిల్లాలో ట్రాన్స్‌వుమన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు 32 ఏళ్ల వ్యక్తి. అయితే అతనికి అప్పటికే మరో మహిళతో వివాహమైంది. రెండేళ్ల బాబు కూడా ఉన్నాడు. కానీ భార్య అంగీకారంతోనే రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి మొదటి భార్య ఒప్పుకోవడమే గాక.. ట్రాన్స్‌వుమన్ కూడా తమతో పాటు ఒకే ఇంట్లో ఉండేందుకు అనుమతించడం గమనార్హం. అలామొదలైంది.. ట్రాన్స్‌వుమన్‌ను గతేడాది రాయగడ జిల్లా అంబడోలాలో చూశాడు ఈ వ్యక్తి. రోడ్డుపై భిక్షాటన చేసే ఆమెను చూసి తొలిచూపులోనే ప్రేమలోపడిపోయాడు. ఎలాగోలా ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఆ తర్వాత రోజూ మాట్లాడుతూ దగ్గరయ్యాడు. చివరకు ఇద్దరి మధ్య రిలేషన్ ఏర్పడింది. అయితే నెల రోజుల క్రితం ఈ వ్యక్తి భార్య అతని ఫోన్‌ను చెక్ చేయగా అసలు విషయం తెలిసింది. రోజూ ట్రాన్స్‌వుమెన్‌తో మాట్లాడుతున్నట్లు తేలింది. దీంతో అతడ్ని భార్య నిలదీసింది. ఇక చేసేదేంలేక అతను నిజం ఒప్పుకున్నాడు. ట్రాన్స్‌వుమన్‌తో రిలేషన్లో ఉన్నట్లు వెల్లడించాడు. ఆమె తనుకు చాలా ముఖ్యమని స్పష్టం చేశాడు. దీంతో భార్య వారి రిలేషన్‌కు అంగీకరించింది. పెళ్లి చేసుకుంటామంటే ఓకే చెప్పింది. భార్య అంగీకారంతో ట్రాన్స్‌వుమన్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు భర్త. అతికొద్ది మంది బంధువుల సమక్షంలో ఈ వివాహం జరిగింది. రెండో పెళ్లి చెల్లదు.. అయితే మొదటి భార్యతో విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకున్నా అది చెల్లదని న్యాయనిపుణులు చెబుతున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని చేతులెత్తేశారు. ఎవరైనా వచ్చి ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తామన్నారు. భర్త మాత్రం తమ కుటుంబమంతా హ్యాపీగా ఉన్నట్లు చెప్తున్నాడు. చట్టాల గురించి తాము పట్టించుకోమని పేర్కొన్నాడు. చదవండి: అంబులెన్సులా మారిన బుల్డోజర్.. వీడియో వైరల్ -
కృష్ణంరాజు మొదటి భార్య ఎలా చనిపోయిందో తెలుసా?
నటుడిగా, రాజకీయవేత్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న కృష్ణంరాజు అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన సినీ ప్రస్థానంలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా , హీరోగా నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. 1966లో విడుదలైన ‘చిలకా గోరింకా’ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన కృష్ణంరాజు దాదాపు 187 చిత్రాల్లో నటించారు. ఆయన చివరగా ప్రభాస్‌తో రాధేశ్యామ్ చిత్రంలో నటించారు. ఇక కృష్ణంరాజు వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆయన వివాహం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. కృష్ణంరాజుకు శ్యామల దేవి కంటే ముందే సీత దేవితో వివాహం జరిగింది. 1969లో కోట సంస్థానాధీశుల వంశస్తులు రాజా కలిదిండి దేవి ప్రసాద వరాహ వెంకట సూర్యనారాయణ కుమార లక్ష్మీ కాంత రాజ బహుద్దూర్ (గాంధీబాబు), సరస్వతీ దేవిల కుమార్తెనె సీతాదేవి. అయితే 1995లో సీతాదేవి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కొన్నాళ్ల పాటు కృష్ణంరాజు డిప్రెషన్లోకి వెళ్లిపోయారట. దీంతో ఆయన మానసిక పరిస్థితి గమనించిన కుటుంబసభ్యులు రెండో పెళ్లి కోసం ఆయన్ని ఒప్పించారట. తర్వాత 1996లో తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన శ్యామలాదేవితో కృష్ణంరాజుకు రెండో వివాహం జరిగింది. వీరికి ప్రసీది, ప్రకీర్తి, ప్రదీప్తి ముగ్గురు కుమార్తెలు. వీరితో పాటు మొదటి భార్య కుమార్తె కూడా కృష్ణంరాజు దగ్గరే ఉంటోది. ఇక మరో అమ్మాయిని కూడా కృష్ణంరాజు దత్తత తీసుకున్నారు. అలా ఐదుగురు ఆడపిల్లలకు కృష్ణంరాజు దంపతులు తల్లిదండ్రులుగా మారారు. -
Amala Paul: రెండవ పెళ్లి నిజమే..!.. ఇదిగో ఆధారాలు..
ఓ దర్శకుడితో వివాహం.. తర్వాత విడిపోవడం వంటి ఘటనలతో నటి అమలాపాల్.. ఆమధ్య వార్తల్లో ఉండేది. అయితే కొంతకాలం సైలెంట్ అయ్యింది. ఆ మధ్య నిర్మాతగానూ మారి ఎత్తి కడావర్ అనే చిత్రాన్ని నిర్మించి ప్రధాన పాత్రలో నటించింది. ఈమె తిరువళ్లూరు జిల్లా కోట్టకుప్పం ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడి నుంచి తాను చిత్ర నిర్మాణ కార్యక్రమాలు నిర్వహించింది. ఈ క్రమంలో బవేందర్ సింగ్ అనే వ్యక్తి తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించింది. డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తాను అతనితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానంటూ బెదిరిస్తున్నాడని గత నెల 22వ తేదీన తిరువళ్లూరు ఎస్పీకి తన మేనేజర్‌తో ఫిర్యాదు చెయించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో అమలాపాల్ ఫిర్యాదు చేసిన బవేందర్ సింగ్‌ను అరెస్టు చేశారు. దీంతో అతను బెయిల్‌కోసం తిరువళ్లూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అందులో తాను నటి అమలాపాల్‌ను ఎలాంటి లైంగిక వేధింపులకు గురి చేయలేదని, తామిద్దరం 2019లో పెళ్లి చేసుకున్నామని పేర్కొంటూ అందుకు సంబంధించిన ఆధారాలను కోర్టులో సమర్పించాడు. దీంతో ఈ కేసును విచారించిన న్యాయస్థానం బవేందర్ సింగ్‌కు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో నటి అమలాపాల్‌కు రెండవ పెళ్లి జరిగినట్లు రుజువైంది. -
రెండోపెళ్లిపై చర్చకు దారితీసిన రేణు దేశాయ్ కామెంట్స్
నటి, దర్శకురాలు రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆమె ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. 2012లో పవన్ కల్యాణ్‌తో విడాకులు తీసుకున్న రేణు దేశాయ్ అప్పటి నుంచి సింగిల్‌గా ఉంటుంది. అయితే గతంలో రేణు దేశాయ్ రెండో పెళ్లిపై వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. జీవితంలో ఒక తోడు అవసరం అని స్వయంగా రేణు దేశాయ్ కొన్ని ఇంటర్వ్యూలో పేర్కొంది. ఈ క్రమంలోనే రెండో పెళ్లికి సిద్ధమైన రేణు దేశాయ్‌కి 2018లో ఓ వ్యక్తితో నిశ్చితార్థం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత అతనితో పెళ్లిపై ఇంతవరకు క్లారిటీ లేదు. అయితే తాజాగా రేణు దేశాయ్ చేసిన పోస్ట్‌తో ఆమె రెండోపెళ్లిపై మరోసారి చర్చకు దారితీసింది. 'జీవితంలో అవసరం ఉన్నప్పుడు మనచేయి పట్టుకుని నడిపించే ఒక తోడు కావాలి'.. అంటూ ఇన్‌స్టాలో ఓ పోస్టును షేర్చేసింది. అనంతరం మరో పోస్ట్‌లో.. 'మీ సోల్‌మేట్‌ని వెతకడానికి ముందు మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోండి'.. అంటూ ఓ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: పొలిటికల్ లీడర్ కుమార్తెతో మంచు మనోజ్ రెండో పెళ్లి! View this post on Instagram A post shared by renu desai (@renuudesai) View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
పొలిటికల్ లీడర్ కుమార్తెతో మంచు మనోజ్ రెండో పెళ్లి!
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ రెండో పెళ్లికి సిద్ధమయ్యారా? అంటే అవుననే ఊహాగానాలు తెరమీదకి వస్తున్నాయి. ఇదివరకే మంచు మనోజ్ ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2015లో పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. అయితే కారణాలు ఏమోకానీ 2019లో పరస్పర అంగీకారంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కెరీర్ పరంగానూ ఒడిదుడుకులు ఎదుర్కొన్న మనోజ్ సినిమాలకు కూడా కాస్త గ్యాప్ ఇచ్చారు. అప్పటి నుంచి సింగిల్‌గానే ఉంటున్న మనోజ్ తాజగా రెండో పెళ్లికి సిద్ధమైనట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. భూమా నాగిరెడ్డి-భూమా శోభ దంపతుల రెండో కుమార్తె భూమా మౌనికరెడ్డిని మంచు మనోజ్ త్వరలోనే రెండో వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తుంది. తాజాగా వీరిద్దరు కలిసి హైదరాబాద్‌లోని సీతాఫలమండిలోని వినాయక విగ్రహాన్ని దర్శించుకొని ప్రత్యేకపూజలు చేశారు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. ఇక మౌనికరెడ్డికి కూడా గతంలో ఓ వ్యక్తితో వివాహం జరగ్గా కొంతకాలానికే విడాకులు తీసుకుని దూరంగా ఉంటున్నారు. -
పెళ్లిపై ఆసక్తి లేదు.. కానీ బాయ్‌ఫ్రెండ్ కావాలి: సురేఖ వాణి షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి సురేఖ వాణి. ఈ మధ్యకాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉన్న సురేఖవాణి సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్‌గా ఉంటోంది. ఇక కూతురు సుప్రీతాతో కలిసి నెట్టింట ఆమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు. మోడ్రన్ డ్రస్సుల్లో కూతురితో పోటీపడుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారు ఆమె. ఈ క్రమంలో సురేఖ తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. చదవండి: లైగర్ మూవీ ఫ్లాప్ అయితే? విలేకరి ప్రశ్నకు విజయ్ షాకింగ్ రియాక్షన్ ఇదిలా ఉంటే భర్త చనిపోవడంతో కూతురితో కలిసి ఒంటరిగా జీవిస్తోన్న సురేఖ రెండో వివాహంపై తరచూ ఆమెకు ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. అయితే తనకు మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ఎప్పడూ చెప్పే సురేఖ ఈసారి మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించిన ఆమె రెండో పెళ్లిపై స్పందించింది. ‘నాకు రెండో పెళ్లిపై పెద్దగా ఆసక్తిలేదు. కానీ నా కూతురు సుప్రీతా నన్ను మళ్లీ చేసుకోమంటుంది. ఇప్పుడైతే చేసుకునే ఆలోచన లేదు కానీ, భవిష్యత్తులో చేసుకుంటానేమో చూడాలి’ అని చెప్పిది. చదవండి: నగరానికి దూరంగా చిరు బర్త్‌డే వేడుకలు, ఫొటోలు వైరల్ అలాగే మీకు నచ్చిన వ్యక్తి దొరికాడా? అని అడగ్గా.. ప్రస్తుతానికి ఎవరు లేరని సమాధానం ఇచ్చింది. కానీ తనకు బాయ్‌ఫ్రెండ్ కావాలనిపిస్తోందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే అతను తనని బాగా అర్థం చేసుకునేవాడు కవాలని చెప్పింది. ‘మంచి హైట్, పర్సనాలిటి ఉన్న వ్యక్తి నాకు బాయ్‌ఫ్రెండ్‌గా కావాలి. లైట్‌గా గడ్డం ఉండాలి. అతనికి బాగా డబ్బులు ఉండాలి. ముఖ్యంగా నన్ను బాగా అర్థం చేసుకోవాలి. అలాంటి వాడు దొరికి నాకు నచ్చితే అతడినే పెళ్లి చేసుకుంటా’ అని తెలిపింది. ఇకపోతే సురేఖకు రెండో వివాహం చేయాలనుకుంటున్నానని ఆమె కూతురు సుప్రీతా ఇప్పటికే పలు ఇంటర్య్వూలో చెప్పిన విషయం తెలిసిందే. -
సురేఖవాణి మళ్లీ పెళ్లి చేసుకుంటుందా? రివీల్ చేసిన కూతురు
టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి సురేఖ వాణి. ఈ మధ్యకాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉన్న సురేఖవాణి సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టివ్‌గా ఉంటోంది. ఇక కూతురు సుప్రీతతో కలిసి నెట్టింట చేసే రచ్చ అంతా ఇంతా కాదు.గ్లామరస్ ఫోటోలతో తల్లీ కూతుళ్లు తెగ హంగామా చేస్తుంటారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న వీరిద్దరు పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. త్వరలో సురేఖ వాణి పెళ్లి చేసుకోబోతున్నారా అని యాంకర్ ప్రశ్నించగా అందుకు సుప్రీత అవుననే సమాధానం ఇచ్చింది. మా అమ్మకు పెళ్లిచేస్తానంటూ బదులిచ్చింది. ఇక రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి? మీరిద్దరు సింగిలా అని అడగ్గా ప్రస్తుతానికి అవునని, కానీ మాకొక బాయ్‌ఫ్రెండ్ కావాలంటూ సురేఖవాణి పేర్కొంది. అంతేకాకుండా బాయ్‌ఫ్రెండ్‌కి ఉండాల్సిన క్వాలిటీస్ కూడా రివీల్ చేసింది. అయితే నువ్వు చెప్పే క్వాలిటీస్ ఆయనలో లేవెంటీ మమ్మీ అంటూ సుప్రీత కొంటెగా ప్రశ్నించగా ఇలాంటివి చెప్పొద్దంటూ సురేఖవాణి ఆమె నోరు కట్టేసింది. దీంతో సురేఖవాణి త్వరలోనే పెళ్లి చేసుకోనుందనే రూమర్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: సురేఖవాణిపై నటి హేమ సంచలన వ్యాఖ్యలు.. నెట్టింట వైరల్ -
బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లాడనున్న హీరో మాజీ భార్య
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ రెండో పెళ్లి చేసుకోనున్నట్లు బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 14ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత హృతిక్- సుసానే ఖాన్లు 2014లో విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హృతిక్ బాలీవుడ్ నటి, సింగర్ సబా అజాద్‌తో డేటింగ్ చేస్తుండగా, సుసానే ఇప్పుడు అర్స్లాన్ గోనీతో పీకల్లోతు ప్రేమలో ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు వీరుద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. సుసానేకు ఇది రెండో వివాహం. వీరి పెళ్లి చాలా సింపుల్‌గా జరగనుందని సమాచారం.అయితే వివాహ వేడుక, తేది ఎప్పుడన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా వీరిద్దరి ప్రేమ వ్యవహారం బీటౌన్‌లో అందరికి తెలిసిందే. తరచూ వీరిద్దరు ముంబై రోడ్లపై చట్టపట్టాలేసుకుని తిరగడం,డిన్నర్ డేట్స్‌కు,పార్టీలకూ జంటగానే హాజరయ్యేవారు. అంతేకాకుండా బర్త్‌డే లాంటి స్పెషల్ డేస్‌లోనూ ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగానే ప్రేమను వ్యక్తపరిచేవారు. అయితే ఇప్పుడీ జంట పెళ్లిపీటలెక్కుతుందని వార్తలు రావడంతో మరి హృతిక్- సబా అజాద్‌లు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
మొదటి పెళ్లి విషయం దాచి, ప్రేమిస్తున్నానన్నాడు.. మతం మార్చుకొని
సాక్షి, కరీంనగర్: ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు.. నువ్వు లేకుంటే బతకనన్నాడు.. నీకోసం మతం కూడా మార్చుకుంటానని నమ్మించాడు.. దీంతో అతని మాటలు నమ్మిన ఆమె.. ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వ్యక్తితో తల్లిదండ్రులు వివాహం నిశ్చయించినా వద్దని బంగారం, నగదు తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.. చివరకు సర్వం కోల్పోయి.. మోసం చేసిన వ్యక్తి జాడ కోసం వెతుకుతూ కరీంనగర్ వచ్చింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. బాధితురాలి వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన దుర్గారెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేసేది. ఆ సమయంలో అక్కడే ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో పని చేస్తున్న కరీంనగర్‌కు చెందిన ఎండీ.ఫారూఖ్ అలీతో పరిచయం ఏర్పడింది. దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్న అతను తనకు అప్పటికే పెళ్లయిన విషయాన్ని దాచాడు. ప్రేమిస్తున్నానని ఆమెను నమ్మించాడు. పెళ్లి చేసుకోకుంటే చనిపోతానని చెప్పాడు. అయోమయంలో ఉన్న దుర్గారెడ్డికి అప్పటికే ఇంట్లో పెళ్లి సంబంధం చూశారు. ప్రభుత్వ ఉద్యోగం చేసే వ్యక్తి పెళ్లి చేసుకుంటానని వచ్చినా కాదని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఫారూఖ్ మతం మార్చుకోవడంతో పెళ్లి చేసుకుంది. తర్వాత దుర్గ తెచ్చిన డబ్బులు అయిపోయాయి. ఆ సమయంలో దుర్గ వద్దకు వచ్చిన ఆమె అమ్మమ్మ రూ.3 లక్షలు ఇచ్చింది. వాటిని కూడా ఫారూఖ్ సొంతానికి వాడుకున్నాడు. తన చెల్లెలికి కరోనా వచ్చి, ఆరోగ్య పరిస్థితి బాగోలేదని దుర్గ నగలు తాకట్టుపెట్టి, డబ్బు తీసుకున్నాడు. ఈ క్రమంలో ఫారూఖ్‌కు పెళ్లయిన విషయం బయటపడింది. పిల్లలు కూడా ఉన్నట్లు తెలియడంతో నిలదీ సింది. అయిపోయిందేదే అయిపోయింది.. అందరం కలిసి ఉందామన్నాడు. ఆమె సర్దుకుపోయింది. నిరసన తెలుపుతున్న దుర్గ మొదటి భార్యతో కలిసి వేధింపులు.. ఫారూఖ్‌తోపాటు అతని మొదటి భార్య దుర్గను వేధించడం మొదలు పెట్టారు. తాను పని చేస్తున్న కంపెనీని కూడా అతను మోసం చేయడాన్ని గమనించిన దుర్గారెడ్డి యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. దీంతో ఆ కంపెనీవారు ఫారూఖ్‌పై దాడి చేశారు. దీంతో కోపం పెంచుకున్న భర్త, అతని మొదటి భార్య పలుమార్లు ఆమెపై దాడి చేశారు. వేధింపులు భరించలేక బాధితురాలు హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. కానీ వారు పెద్దగా పట్టించుకోక పోవడంతో ఫారూఖ్ మరింత రెచ్చిపోయాడు. దుర్గను వదిలేసి, మొదటి భార్య, పిల్లలతోనే ఉంటున్నాడు. అలుగునూర్‌లో ఉంటున్నట్లు తెలుసుకొని.. ఫారూఖ్ ఇటీవల కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూర్‌కు వచ్చి, ఇల్లు నిర్మించుకొని ఉంటున్నట్లు దుర్గ తెలుసుకుంది. అతడి కోసం కరీంనగర్ వచ్చింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. మంగళవారం అతని ఇంటి ఎదుట నిరసన తెలిపింది. బీజేపీ, వీహెచ్‌పీ నాయకులు ఆమెకు మద్దతుగా నిలిచారు. అనంతరం బాధితురాలు ఎల్ఎండీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి: మారేడుపల్లి ఎస్సైపై కత్తితో దాడి.. ఆసుపత్రికి తరలింపు -
విశాఖ ఆర్కే బీచ్‌లో అదృశ్యమైన సాయిప్రియ కేసులో మరో బిగ్ ట్విస్ట్
సాక్షి, బెంగళూరు: వైజాగ్ ఆర్కే బీచ్‌లో అదృశ్యమైన వివాహిత సాయిప్రియ కేసులో మరో కొత్త ట్విస్ట్ నెలకొంది. ఇప్పటిjకే భర్త శ్రీనివాస్‌కు మస్కా కొట్టి లవర్‌తో పరారైన సాయిప్రియ తాజాగా తను క్షేమంగా ఉన్నట్లు తల్లిదండ్రులకు వెల్లడించింది. అంతేగాక ప్రియుడు రవిని రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. తాళిబొట్టుతో ఉన్న ఫోటోను తల్లిదండ్రులకు వాట్సప్‌లో పంపించింది. అలాగే ఓ వాయిస్ మెసెజ్ పంపింది. ‘నాన్న.. నేను సాయిని మాట్లాడుతున్నాను. నేనేం చచ్చిపోలేదు. బతికే ఉన్నాను. నేను రవితోనే ఉన్నాను. నన్నేం రవి బలవంతంగా తీసుకెళ్లలేదు. మా ఇద్దరికీ పెళ్లి కూడా అయిపోయిది. దయచేసి నాకోసం వెతకొద్దు నాన్న నీకు పుణ్యం ఉంటది. ఇంకా పరిగెత్తే ఓపిక నాకు లేదు. చావు అయినా బతుకైనా రవితోనే ఉంటాను. ప్లీజ్ మమ్మల్ని వెతకద్దు ఒకవేళ నా కోసం వెతికితే చనిపోతా. రవి పేరెంట్స్‌ను ఏమీ చేయొద్దు’ అంటూ వాయిస్ మెసేజ్ చేసింది. ఇక సముద్రంలో గల్లంతైందని భావించి రెండు రోజులుగా భార్య కోసం ఎదురు చూస్తున్న శ్రీనివాస్‌కు, ఆయన తల్లిదండ్రులకు సాయిప్రియ పెద్ద షాక్ ఇచ్చినట్లు అయ్యింది. సంబంధిత వార్త: ఆర్కే బీచ్‌లో వివాహిత అదృశ్యం కేసులో ఊహించని ట్విస్టు కాగా సాయి ప్రియ, శ్రీనివాస్ భార్యభర్తలు. విశాఖపట్నంలోని సంజీవ నగర్లో ఉంటున్నారు. అయితే సాయిప్రియ కొంతకాలంగా శాంతినగర్‌కు చెందిన రవితో ప్రేమాయణం సాగిస్తోంది. సోమవారం పెళ్లి రోజు కావడంతో భర్త శ్రీనివాస్‌తో కలిసి ఆర్కే బీచ్‌కు వెళ్లింది. అక్కడ భర్త కళ్లు గప్పి సాయిప్రియ ప్రియుడితో కలిసి బీచ్ నుంచి పారిపోయింది. భార్య కనిపించకపోవడంతో సముంద్రంలో కోట్టుకుపోయి ఉంటుందని కంగారు పడి పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వివాహిత కోసం రెండు కోస్ట్ గార్డ్ షిప్‌లతో పాటు ఓ హెలికాప్టర్‌తో సముద్రం మొత్తం గాలించారు. అయినా ఆచూకీ దొరకలేదు. ప్రస్తుతం సాయిప్రియ బెంగళూరులో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. -
విశాఖలో అదృశ్యమైన సాయిప్రియ కేసులో కొత్త ట్విస్ట్
-
మూడేళ్ల క్రితం రెండో పెళ్లి.. భర్త వేధింపులు భరించలేక..
బనశంకరి: అందంగా లేవంటూ భర్త పెట్టే వేధింపులు భరించలేక యువతి ఒంటిపై కిరోసిన్ పోసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన కర్నాటకలో డీజే హళ్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడేళ్ల క్రితం నిజాముద్దీన్ అనే వ్యక్తిని అనిశా(33) రెండో వివాహం చేసుకుంది. వీరికి రెండేళ్లు, ఆరు నెలల వయసు కలిగిన ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో అందంగా లేవంటూ అనిశాను భర్త శారీరకంగా, మానసికంగా వేధించేవాడని ఆమె బంధువులు ఆరోపించారు. కాగా, సోమవారం మధ్యాహ్నం కూడా ఇదే విషయంపై గొడవ పడ్డారు. దీంతో, భర్త వేధింపులతో మనోవేదనకు గురైన అనిశా.. ఒంటిగంట సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు విక్టోరియా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ మేరకు డీజే హళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: నెల రోజుల క్రితమే పెళ్లి.. లవర్‌తో కలిసి.. -
Bihar: ప్రభుత్వ ఉద్యోగుల రెండో పెళ్లికి పర్మిషన్ తప్పనిసరి!
పాట్నా: ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనాసరే రెండో పెళ్లి చేసుకోవాలంటే.. సంబంధిత ఉన్నతాధికారుల అనుమతిని తప్పనిసరి చేస్తూ బీహార్ ప్రభుత్వం ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. భార్య/భర్త బతికి ఉండగానే, అలాగే విడాకులు తీసుకోకుండానే చాలామంది రెండో పెళ్లిళ్లు చేసుకుంటుండడం, ఆపై ఉద్యోగం, పెన్షన్.. సంబంధిత వివాదాలు, న్యాయపరమైన చిక్కులు తలెత్తుతుండడంతో ఈ చర్యకు ఉపక్రమించింది. ఈ మేరకు బీహార్ ప్రభుత్వం తాజాగా ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగపు ఉన్నతాధికారి నుంచి అనుమతి తీసుకున్నాకే ప్రభుత్వ ఉద్యోగులు రెండో వివాహానికి ఉపక్రమించాలని ఆ నోటిఫికేషన్లో పేర్కొంది. అంతేకాదు.. ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ల వైవాహిక స్థితి గురించి తప్పనిసరిగా ఉన్నతాధికారులకు నివేదించాలని తెలిపింది. ఒకవేళ రెండో వివాహం చేసుకోవాలనుకుంటే.. విడాకులు అయిన విషయాన్ని, భార్య చనిపోయిన విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేసి.. ఆపై అనుమతితోనే రెండో వివాహం చేసుకోవాలని స్పష్టం చేసింది. ఒకవేళ మొదటి భార్యగానీ, భర్తగానీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తే గనుక.. రెండో భార్య, భర్తకు ఎలాంటి ప్రభుత్వ సదుపాయాలు అందవని ఆ నోటిఫికేషన్లో తెలిపింది. పైఅధికారులకు తెలియజేయకుండా రెండో వివాహం గనుక చేసుకుంటే.. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు, ఇతర సదుపాయాలు అందవని తెలియజేసింది. అలాంటి సమయంలో మొదటి భాగస్వామి ద్వారా పిల్లలు ఉంటే.. వాళ్లకే ప్రాధాన్యత ఇస్తుందని బీహార్ ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. -
సీఎం పగ్గాల తర్వాత లగ్గం చేసుకుంది వీళ్లే!
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(49) వివాహం ఇవాళ వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. దగ్గరి బంధువు డాక్టర్ గుర్ప్రీత్ కౌర్(32)తో కొద్దిమంది సమక్షంలోనే ఆయన వివాహం జరిగింది. ముఖ్యమంత్రి హోదాలో ఆయన వివాహం జరగడం చర్చనీయాంశంగా మారగా.. గతంలోనూ ఇలా రాజకీయంగా అత్యున్నత హోదాలో ఉండి.. మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రముఖులు చాలా మందే ఉన్నారు. హెచ్డీ కుమారస్వామి జేడీ(ఎస్) నేత హెచ్డీ కుమారస్వామి.. కర్ణాటక ముఖ్యమంత్రిగా 2006-07 మధ్య కాలంలో పని చేశారు. 1986లోనే ఆయనకు వివాహం అయ్యింది. అయితే.. 2006లో ఆయన కన్నడ నటి రాధికను రహస్యంగా రెండో వివాహం చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత రాధిక తనంతట తానుగా ప్రకటించేదాకా ఈ విషయం బయటకు తెలీలేదు. ఆ తర్వాత కుమారస్వామి కూడా ఆ విషయాన్ని అంగీకరించారు. వీర్‌భద్ర సింగ్ హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో తిరుగులేని నేత ఈయన. 1962, 1967, 1971లో.. మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. అయితే 1983లో వీర్‌భద్ర సింగ్.. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఏడేళ్లపాటు సీఎంగా ఉన్నారు. ఆ సమయంలోనే 1985లో ప్రతిభా సింగ్‌ను రెండో వివాహం చేసుకున్నారు ఆయన. మొదటి భార్య రత్నకుమారి(జుబ్బల్ యువరాణి) అప్పటికే అనారోగ్యంతో మరణించింది. ప్రతిభా సింగ్ ఎవరో కాదు.. మండి లోక్ సభ ఎంపీ. బాబుల్ సుప్రియో మాజీ కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో. 2015లో మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్న ఈయన.. 2019లో మోదీ కేబినెట్లో కేంద్ర మంత్రిగా ఉండగానే ఎయిర్ హోస్టెస్ రచనా శర్మను రెండో వివాహం చేసుకున్నారు. ముంబై నుంచి కోల్‌కతా మధ్య ఫ్లైట్‌లో ప్రయాణించేప్పుడు వాళ్ల మధ్య పరిచయం అయ్యింది. చందర్ మోహన్ హర్యానా మాజీ ఉప ముఖ్యమంత్రి. ఈయన వివాహ జీవితం వివాదాస్పదంగా నిలిచింది. 2008లో మంత్రి పదవిలో ఉన్నప్పడు.. ప్రేయసి అనురాధా బాలి కోసం మతం మార్చుకున్నాడు ఆయన. భార్య సీమా భిష్ణోయ్ సమ్మతితోనే.. చాంద్ మొహమ్మద్, ఫిజా(అనురాధా బాలి)గా ఇద్దరూ పేర్లు మార్చుకుని మరీ వివాహం చేసుకున్నారు. కానీ, ఈ చర్య ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ఘోరంగా దెబ్బ తీసింది. అయితే ఈ ప్రేమ కథ ఎన్నోరోజులు సాఫీగా సాగలేదు. కొన్నిరోజులకే ఇద్దరూ విడిపోగా.. 2012లో బాలి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ప్రఫుల్లా కుమార్ మహంతా అస్సాం మాజీ ముఖ్యమంత్రి. 1985 డిసెంబర్ నుంచి 1990 వరకు ఆయన సీఎంగా విధులు నిర్వహించారు. సీఎంగా ఉన్న టైంలో 1988లో జయశ్రీ గోస్వామి మహంతను ఆయన వివాహం చేసుకున్నారు. రైటర్ అయిన జయశ్రీ గోస్వామి.. ఆ తర్వాత రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు కూడా. అయితే.. అసెంబ్లీ సెక్రటేరియెట్ ఎంప్లాయి సంఘమిత్ర భరాలిని ఆయన రహస్యంగా రెండో వివాహం చేసుకున్నారన్న ఆరోపణలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. భార్య జయశ్రీ గోస్వామితో ప్రఫుల్లా కుమార్ మహంతా -
రెండో వివాహం చేసుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. ఫొటోలు వైరల్
Music Director D Imman Gets Married Again: కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో డి. ఇమాన్ ఒకరు. శతాధిక చిత్రాలకు సంగీతం అందిచారు ఇమాన్. తాజాగా ఆయన రెండో వివాహం చేసుకున్నారు. 2008లో కంప్యూటర్ ఇంజినీర్ మోనికా రిచర్డ్స్‌ను పెళ్లి చేసుకున్నారు. 13 ఏళ్ల పాటు వీరి దాంపత్య జీవితం సజావుగా సాగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే మనస్పర్థల కారణంగా గతేడాది డిసెంబర్ 29న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. తర్వాత తన పిల్లల భవిష్యత్తు కోసం రెండో పెళ్లి చేసుకుంటానని అప్పట్లోనే తెలిపారు ఇమాన్. ఇప్పుడు దానిని నిజం చేస్తూ రెండో వివాహం చేసుకున్నారు. దివంగత కళా దర్శకుడు ఉబాల్ట్ కుమార్తె అమేలీని రెండో పెళ్లి చేసుకున్నారు ఇమాన్. వీరి వివాహం ఆదివారం ఉదయం చెన్నైలో నిరాడంబరంగా జరిగింది. బంధువులు, సన్నిహితులు హాజరై దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఇమాన్ మ్యారేజ్ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. రజనీకాంత్ 'పెద్దన్న', అజిత్ 'విశ్వాసం', సూర్య 'ఎవరికీ తలవంచకు' సినిమాలకు డి. ఇమాన్ సంగీతం అందించారు. చదవండి: చిరంజీవితో ఏ గొడవ లేదు.. వారే దూరం పెంచుతున్నారు: జీవిత అక్షయ్, అజయ్‌పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఐఏఎస్ ఆఫీసర్ టీనా దాబి.. మళ్లీ పెళ్లి
అందమైన ఆఫీసర్‌గా పేరున్న ఐఏఎస్ అధికారిణి టీనా దాబి(28) మరోసారి వార్తల్లో నిలిచారు. రెండోసారి వివాహానికి ఆమె సిద్ధమయ్యారు. మరో ఐఏఎస్ అధికారితో తాజాగా ఆమె నిశ్చితార్థం జరిగింది. ఇందుకు సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియాలో టీనా దాబి స్వయంగా షేర్ చేశారు. టీనా దాబి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంగేజ్మెంట్ ఫొటోలు షేర్ చేస్తూ.. ‘నువ్వు ఇచ్చిన నవ్వు..’ అంటూ క్యాప్షన్ ఉంచారామె. అలాగే ఆమె కాబోయే భర్త, రాజస్థాన్ కు చెందిన ఐఏఎస్ అధికారి ప్రదీప్ గవాన్డే కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు షేర్ చేశారు. ‘కలిసిఉంటే..’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఏప్రిల్ 22న రాజస్థాన్‌లో వీళ్ల వివాహం జరగనున్నట్లు సమాచారం. ప్రదీప్ ప్రస్తుతం ఆర్కియాలజీ, మ్యూజియమ్స్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. టీనా దాబి ప్రస్తుతం రాజస్థాన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో జాయింట్ సెక్రెటరీగా విధులు నిర్వహిస్తున్నారు. View this post on Instagram A post shared by Tina Dabi (@dabi_tina) రాజస్థాన్‌కు చెందిన టీనా దాబి.. ఢిల్లీ లేడీ శ్రీ రామ్ కాలేజీలో చదివారు. దళిత వర్గం నుంచి మొదటి ప్రయత్నంలోనే టాపర్‌గా నిలిచిన ఫీట్‌ను సొంతం చేసుకున్నారు. టీనా దాబి 2015 సివిల్స్ సర్వీసెస్ ఎంట్రెన్స్‌లో టాపర్. రెండో ర్యాంకర్ అథర్ అమీర్ ఖాన్. వీళ్లిద్దరూ రిలేషన్లో ఉన్నట్లు 2016లో సోషల్ మీడియాలో ప్రకటించారు. ఆ సమయంలో మతపరమైన చర్చతో పెను దుమారమే చెలరేగింది. అయినా ఈ జంట వెనక్కి తగ్గలేదు. 2018లో వీళ్లద్దరూ పెద్దల సమక్షంలో ప్రేమవివాహం చేసుకున్నారు. ఢిల్లీలో జరిగిన వీళ్ల వెడ్డింగ్ రిసెప్షన్‌కు వెంకయ్య నాయుడు, సుమిత్ర మహాజన్ లాంటి రాజకీయ ప్రముఖులు సైతం హాజరయ్యారు. అయితే.. 2020లో విడిపోతున్నట్లు ప్రకటించిన ఈ జంట.. కిందటి ఏడాది జైపూర్ కోర్టు నుంచి అధికారికంగా విడాకులు కూడా తీసుకుంది. తాజాగా 2013 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ ప్రదీప్ గవాన్డేతో ఆమె నిశ్చాతార్థం చేసుకున్నారు. టీనా కంటే ఆయన మూడేళ్లు సీనియర్ బ్యాచ్. గ్లామర్ ఉన్న ఆఫీసర్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువే. టీనా దబీకి సుమారు మిలియన్న్నర ఫాలోవర్లు ఉన్నారు. టీనా సోదరి రియా దాబి 2020 ఐఏఎస్ ఫలితాల్లో 15వ ర్యాంకు సాధించింది. View this post on Instagram A post shared by Tina Dabi (@dabi_tina) -
రెండో పెళ్లి చేసుకోబోతున్న 48 ఏళ్ల స్టార్ హీరో..
నిర్మాత త్యాగరాజన్ కొడుకుగా ఇండస్ట్రీలో ఇంట్రీ ఇచ్చి తనకుంటూ గుర్తింపు సంపాదించుకున్న హీరో ప్రశాంత్. జీన్స్, దొంగ దొంగ, జోడీ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రశాంత్ రామ్‌చరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కోలీవుడ్‌లో స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్సంపాదించుకున్న ప్రశాంత్ ప్రస్తుతం అంధాదూన్ రీమేక్‌లో నటిస్తున్నాడు. అయితే తాజాగా ఈయనకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. త్వరలోనే ప్రశాంత్ రెండో పెళ్లి చేసుకోనున్నట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఈ ఏడాది చివర్లో ఆయన వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తుంది. కాగా 2005లో వ్యాపారవేత్త కూతురు గృహలక్ష్మితో ప్రశాంత్ పెళ్లి జరిగింది. వీరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. మనస్పర్థల కారణంగా పెళ్లయిన మూడేళ్లకే వీరు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న ప్రశాంత్ తాజాగా వారి కుటుంబానికి పరిచయం ఉన్న అమ్మాయిని పెళ్లాడనున్నాడట. త్వరలోనే ఈ వార్తలపై మరింత క్లారిటీ రానుంది. -
రెండో పెళ్లి చేసుకోబోతున్న ప్రముఖ సంగీత దర్శకుడు
ప్రముఖ సంగీత దర్శకుడు డి. ఇమ్మాన్ రెండో పెళ్లికి సిద్దమయ్యాడా అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. 13 ఏళ్ల వివాహ జీవితం అనంతరం భార్య మోనికా రిచర్డ్ నుంచి విడిపోతున్నట్లు ఇమ్మాన్ ఇటీవలె అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా రెండో పెళ్లి చేసుకునేందుకు ఇమ్మాన్ రెడీ అయినట్లు తెలుస్తుంది. చెన్నైకి చెందిని ఉమ అనే మహిళను వివాహం చేసుకోనున్నట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఈ పెళ్లికి దగ్గరి బంధవులతో పాటు అత్యంత సన్నిహితులు హాజరు కానున్నారట. మే నెలలో ఈ వివాహం జరగనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా 2008 ఏప్రిల్‌లో కంప్యూటర్ ఇంజనీర్ మోనికాతో ఇమ్మాన్ వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు వెరోనికా డోరతీ ఇమ్మాన్, బ్లెస్సికా కాథీ ఇమ్మాన్ ఉన్నారు. కానీ విబేధాల కారణంగా గతేడాది విడిపోయారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచి ఏడాది తర్వాత సోషల్ మీడియా వేదికగా విడాకుల ప్రకటన చేశారు. -
రెండో పెళ్లికి సిద్ధమంటున్న హృతిక్.. ఆమెతోనే ఏడడుగులు?
బాలీవుడ్ స్టైలిష్ హీరో హృతిక్ రోషన్ నటి సబా అజాద్‌తో ప్రేమలో మునిగితేలుతున్నాడంటూ బీ-టౌన్లో జోరుగా ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే హృతిక్ ఈ మధ్య సబా ఆజాద్‌తో ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతూ మీడియా కెమెరా కంట పడుతున్నాడు. దీంతో ఈ పుకార్లు నిజమేనేమోనంటూ అందరూ అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు హృతికి ఈ వార్తలను ఖండించలేదు. పైగా ఇటీవల సబాను ఇంటికి కూడా తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా సబా హృతిక్ ఫ్యామిలీతో కలిసి లంచ్ చేసి, సరదాగా వారితో సమయాన్ని గడిపింది. దీంతో ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. చదవండి: భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పై కేటీఆర్ ట్వీట్ దీంతో హృతిక్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ ప్రస్తుతం హాట్‌టాపిక్ మారింది. త్వరలోనే హృతిక్, సబా పెళ్లి చేసుకోబోతున్నారంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. కాగా ఇటీవల ఫర్హాన్ అక్తర్ తన ప్రేయసి శిబానీ దండేకర్‌ను రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కొద్దిమంది సన్నిహితులు, బంధువుల, కుటుంబ సభ్యుల మధ్య ఫర్హాన్-శిబానీల వివాహం ప్రైవేట్‌గా జరిగింది. ఈ వేడుకకు హృతిక్ కూడా హజరయ్యాడు. దీంతో ఫర్హాన్ తరహాలోనే తాను కూడా కొత్త జీవితం ప్రారంభించాలని అనుకుంటున్నాడట. జీవితంలో ఒక తోడు అవసరమని భావించిన హృతిక్ తొందర్లోనే ప్రేయసి సబాను.. శ్రీమతిగా చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. చదవండి: మూడో భార్య రమ్య మోసాలు.. వీడియో రిలీజ్ చేసిన నటుడు నరేష్ మరి ఇందులో ఎంత నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. కాగా హృతిక్ తరచూ సబాతో కలిసి డిన్నర్, లంచ్ డేట్లకు వెళ్లడం, కెమెరాలకు కనబడకుండా తప్పించుకోవడానికి ప్రయత్నించడం చూస్తుంటే వీరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అనేది నిజమేనని, త్వరలోనే ఈ వార్తలు నిజకానున్నాయేమో అని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే హృతిక్ మాజీ భార్య సుశానే ఖాన్ కూడా నటుడు అర్స్లాన్ గోనితో రిలేషన్లో ఉన్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా హృతిక్, సుశానే ఖాన్లు 2000వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. ఆ తర్వాత 2014లో ఈ దంపతులు విడిపోయారు. -
మొదటి భార్యకు తెలియకుండా రెండో పెళ్లికి సిద్ధమైన భర్త.. ట్విస్ట్ ఏంటంటే
సాక్షి, పెనుగంచిప్రోలు(కృష్ణా): మొదటి భార్యకు తెలియకుండా మరొక యువతిని రెండో పెళ్లి చేసుకుంటున్న యువకుడిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. మొదటి భార్య కథనం మేరకు.. హైదరాబాద్‌కు చెందిన సీహెచ్.సరితను భువనగిరికి చెందిన చెర్కుపల్లి మధుబాబు 2016లో వివాహం చేసుకున్నాడు. అదనపు కట్నం కోసం భర్తతోపాటు అత్తమామలు, ఆడపడచు వేధించడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఆదివారం తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో మధుబాబు మరొక యువతిని రెండో వివాహం చేసుకుంటున్నాడని సరితకు తెలిసింది. ఆమె ఆధారాలతో పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు స్పందించి మధుబాబు వివాహాన్ని అడ్డుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: 15 ఏళ్ల క్రితం వివాహం. భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందని -
33 ఏళ్ల క్రితం పెళ్లి.. ఇద్దరు పిల్లలు.. కట్ చేస్తే మరో మహిళతో..
సాక్షి, నిజామాబాద్: భార్య, ఇద్దరు కుమారులు ఉండి మరొక మహిళను వివాహం చేసుకున్న భర్తపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత మహిళ మంగళవారం పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. ఇందల్వాయికి చెందిన చింత పద్మకు జక్రాన్‌పల్లి మండలం మనోహరబాద్‌కు చెందిన పులి రాజేంధర్‌గౌడ్‌తో 33 సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. 1995 నుంచి ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో పనిచేసే జంబుకరాజమణితో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమెను వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలను కన్నడని తెలిపింది. దీనిపై తాను ప్రశ్నిస్తే రాజమణితో ఎస్సీఎస్టీ కేసు పెట్టిస్తానంటూ బెదిరించారని వాపోయింది. తాను ఆర్మూర్ కోర్టులో మెయింటెనెన్స్ ఫైల్ చేయగా, ఈ కేసును విత్‌డ్రా చేసుకోవాలని బెదిరించాడని తెలిపింది. ఈ కేసులో తన భర్త కౌంటర్ కేసు వేసి రెండో భార్య గురించి రాయకుండా కోర్టును తప్పుదోవ పట్టించాడని తెలిపింది. ఎస్సీ,ఎస్టీ కేసులకు భయపడి తన తరపున ఎవరూ సపోర్టు చేయటం లేదని ఫిర్యాదులో పేర్కొంది. రాజమణితో తన భర్తకు దగ్గర ఉండి వివాహం చేసిన మరిది పులి రామాగౌడ్, అతని భార్య పులి బాలమణిలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సీపీకు ఫిర్యాదు చేసింది. -
ప్రియురాలి మోజులో కన్నబిడ్డల్ని 15వ అంతస్తు నుంచి కిందికి తోసిన కసాయి!
Chinese Father Girlfriend Sentenced to Death for killing two toddlers by throwing out of building బీజింగ్: ప్రియురాలి మోజులో కన్న బిడ్డల్నే కడతేడ్చాడా కసాయి తండ్రి. నిర్థాక్షిణ్యంగా 15 వ అంతస్థు నుంచి కిందకి తోసేశాడు. వేరే స్త్రీకి పుట్టిన పిల్లలను పెంచడం ప్రియురాలికి ఇష్టంలేకపోవడమే కారణం. దీంతో కోర్టు సదరు తండ్రికి, అతని ప్రియురాలికి మరణశిక్ష విధించింది. మీడియా కథనాల ప్రకారం.. చైనాలోని చాంగ్కింగ్ మున్సిపాలిటీకి చెందిన జాంగ్ బో (25)అనే వ్యక్తి మొదటి భార్య అయిన చెన్ మెయిలిన్కు విడాకులిచ్చాడు. తర్వాత అతని గర్ల్ ఫ్రెండ్ యే చెంగ్షెన్ను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఐతే మొదటి భార్యకు పుట్టిన ఇద్దరు పిల్లలను పెంచడానికి ఆమె నిరాకరించింది. పిల్లలను వదిలించుకోమని తరచూ పోరుపెట్టేది. అంతేకాకుండా పిల్లలుంటే వివాహం చేసుకోనని షరతు కూడా పెట్టింది. దీంతో ఆ కసాయి తండ్రి గత యేడాది నవంబర్ 2న 15వ అంతస్తు నుంచి పిల్లల్ని కిందకితోసేసి హతమార్చాడు. రెండేళ్ల జాంగ్ రిషు, ఏడాది వయసున్న జాంగ్ యాంగ్రుయ్ పిల్లలిద్దరూ భవనం పై నుంచి కిందపడగానే ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స సమయంలో మృతి చెందారు. చదవండి: Omicron: ‘ఆస్పత్రుల సామర్థ్యాన్ని తక్షణమే పెంచండి... ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేం!’ ఈ ఘటనపై అతని మాజీ భార్య చెన్ మెయిలిన్ మాట్లాడుతూ, 'ఝాంగ్ బో విడాకులకు ముందే వివాహం చేసుకున్నాడు. తర్వాత ఆమెను గర్ల్ ఫ్రెండ్‌గా అందరి ముందు నమ్మబలికాడు. ఆమె కోసమే నాకు విడాకులు ఇచ్చాడు కూడా. కుమార్తె సంరక్షణను ఆమె తల్లికి ఇవ్వాలని, కుమారుడి సంరక్షణ బాధ్యతను తండ్రికి 6 ఏళ్లు వచ్చే వరకు ఇవ్వాలని కోర్టు విడాకుల సమయంలో ఆదేశించింది. చివరికి ఇంత పని చేశాడని పోలీసులకు చెబుతూ కన్నీరు మున్నీరయ్యింది ప్రియురాలికి కోర్టు ఇచ్చిన తీర్పు తెలియడంతో వెంటనే పిల్లల నుంచి విడిపోవాలని కోరింది. ఒక రోజు ఇద్దరు పిల్లలు జాంగ్ బోతో ఉన్న సమయంలో అతని గర్ల్ ఫ్రెండ్ వీడియో కాల్ చేసి చేతి మణికట్టును బ్లేడుతో కోసుకుంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన జాంగ్ బో ఆగ్రహావేశాలతో పిల్లలిద్దరినీ భవనంపై నుంచి కింద పడేశాడు. తను నిద్రిస్తున్న సమయంలో పిల్లలు భవనంపై నుంచి పడిపోయినట్లు అందరికీ కట్టుకథ అల్లి చెప్పాడు. ఐతే పోలీసుల విచారణలో నిజం ఒప్పుకున్నాడు. తాజాగా వెలుగు చూసిన ఈ దుర్ఘటన స్థానికంగా కలకలం రేపింది. చదవండి: ‘ఫ్లొరోనా’కలకలం..! లక్షణాలివే.. -
రహస్యంగా భర్త రెండో పెళ్లి.. మళ్లీవచ్చి తీసుకెళ్తానని చెప్పి..
పిడుగురాళ్ల (గుంటూరు జిల్లా): తనను మోసం చేసి, తన భర్త వేరే వివాహం చేసుకున్నాడని, తనకు న్యాయం చేయాలంటూ ఓ మహిళ పిడుగురాళ్ల పోలీస్‌స్టేషన్ ఎదుట శుక్రవారం నిరసన వ్యక్తం చేసింది. బాధితురాలి కథనం మేరకు.. పిడుగురాళ్ల పిల్లలగడ్డకు చెందిన ముజావర్ షాహీనాకు సత్తెనపల్లి మండలం తొండపి గ్రామానికి చెందిన ముజావర్ సైదాతో 2000 సంవత్సరం జూలై 23వ తేదీ వివాహం జరిగింది. చదవండి: దుస్తులు సరిగా కుట్టలేదని హత్య కొంతకాలం తొండపిలో వీరి కాపురం సాఫీగా సాగింది. వీరికి ఇద్దరు మగ పిల్లలు. భర్త సైదా తన వద్ద డబ్బులు లేవని చెప్పి భార్య షాహీనా పేరు మీద ఉన్న ఆస్తిని అమ్మి వ్యాపారం ప్రారంభిస్తానని నమ్మబలికాడు. దీంతో షాహీనా 20 సవర్ల బంగారం, తన పేరు మీద ఉన్న ఎకరం పొలం, ఇల్లు మొత్తం భర్త సైదాకు రాసి ఇచ్చింది. కొంతకాలం తర్వాత భార్యాపిల్లలను ఆమె పుట్టింట్లో వదిలి వ్యాపారం నిమిత్తం వెళ్తున్నానని, మళ్లీవచ్చి తీసుకెళ్తానని చెప్పి సైదా వెళ్లిపోయాడు. అలా రెండేళ్లు గడిచిపోయాయి. చివరకు భర్త ఎక్కడున్నాడో తెలుసుకుందామని తొండపి వెళ్లగా సైదా వేరే పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి 2021 అక్టోబర్ 17వ తేదీ ఆ వివాహం ఆపివేయించానని భార్య షాహీనా తెలిపింది. అయితే గత నెలలో హైదరాబాద్‌లో మళ్లీ రహస్యంగా వేరే మహిళతో వివాహం చేసుకున్నాడని తెలిసింది. దీంతో తన బంధువులతో కలిసి హైదరాబాద్‌లో తన భర్త, వేరే మహిళ ఉన్నచోటుకు వెళ్లి ఇద్దరిని పట్టుకోవడం జరిగిందని తెలిపింది. శుక్రవారం తన భర్త రెండో పెళ్లి ఆధారాలతో పట్టణ పోలీస్‌స్టేషన్ వద్ద న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేసింది. సైదాను షాహీనా బంధువులు పోలీసులకు అప్పగించారు. సీఐ మధుసూదన్‌రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పిల్లలే పెళ్లి పెద్దలు
-
ఐదేళ్ల క్రితం రెండో పెళ్లి: ఏమైందోఏమో రోడ్డుపై నిర్జీవంగా..
పెడన: మండలంలోని నందమూరు పంచాయతీ సత్యనారాయణపురంలో ఓ మహిళ హత్యకు గురైంది. భర్తే ఆమెను హత్య చేశాడని మృతురాలి కుమార్తెలు ఆరోపిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం వేములదీవికి చెందిన పేరం లక్ష్మి(37) మొదటి భర్తకు విడాకులు ఇచ్చి సుమారు ఐదేళ్ల కిందట పెడన మండలం నందమూరు పంచాయతీ సత్యనారాయణపురం గ్రామానికి వచ్చి ఇక్కడ ఉంటోంది. నందమూరు గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ పరసా సూరిబాబు తన భార్యకు విడాకులు ఇచ్చి లక్ష్మిని రెండో పెళ్లి చేసుకున్నాడు. లక్ష్మికి మొదటి వివాహంలో పుట్టిన సంతానంలో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. సూరిబాబు వారితో కలిసి సత్యనారాయణపురంలోనే ఉంటున్నాడు. నాలుగేళ్ల కిందట లక్ష్మి పెద్దకుమార్తెకు వివాహం చేశారు. ఇటీవల తరుచుగా సూరిబాబు, లక్ష్మిల మధ్య గొడవలు జరుగుతున్నాయి. రెండు రోజుల కిందట సూరిబాబు లక్ష్మితో గొడవపడి ఆమెను గాయపరచడంతో ప్రభుత్వాసుపత్రికి వెళ్లి చికిత్స పొందింది. అనంతరం భర్తపై కేసు పెట్టింది. ఈ కేసు విషయంలో శుక్రవారం ఉదయం కూడా పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం నందమూరు నుంచి కాకర్లమూడి వెళ్లే డొంక మార్గంలో మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ ఎన్.కొండయ్య, ఎస్ఐ మురళి, తమ సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహం లక్ష్మిదిగా గుర్తించారు. ఉదయం పంచాయతీ జరిగిన అనంతరం సూరిబాబు, లక్ష్మి కలసి వెళ్లారని లక్ష్మి కుమార్తెలు లావణ్య, శ్రీదుర్గ చెబుతున్నారు. సూరిబాబే తమ తల్లిని హత్య చేశాడని వారు ఆరోపిస్తున్నారు. మృతురాలి కుమార్తెలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ కొండయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: గుజరాత్ చెడ్డీ గ్యాంగ్ అరెస్ట్: వీళ్ల అరాచకాలు ఒక్కొక్కటిగా.. -
మరోసారి పెళ్లికి సిద్ధమవుతున్న 7/G బృందావన కాలని హీరోయిన్..!
‘7/G బృందావన కాలని’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి సోనియా అగర్వాల్. తెలుగులో ఆమె హీరోయిన్గా కనిపించింది ఒక్క సినిమానే అయినా ఇక్కడ బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రంలో ఆమె అమాయకంగా, క్యూట్ క్యూట్‌గా నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత తమిళ, కన్నడ చిత్రాల్లో నటించిన ఆమె కొద్ది రోజులకు తెరపై కనుమరుగైంది. తనను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన తమిళ డైరెక్టర్ సెల్వరాఘవన్‌ను 2006లో ప్రేమ వివాహం చేసుకుంది. చదవండి: ప్రముఖ యూట్యూబ్ స్టార్ మృతి, దీప్తి సునైనా దిగ్భ్రాంతి ఈ క్రమంలో వ్యక్తిగత ల కారణాలతో 2010లో భర్తకు విడాకులు ఇచ్చింది సోనియా. విడాకుల తర్వాత తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన సోనియా జూనియర్ ఎన్టీఆర్ ‘టెంపర్’ మూవీలో తళుక్కుమ్మంది. ఇక అప్పటి నుంచి సినిమాల్లో క్యారెక్టర్ అర్టిస్టుగా, సహా నటిగా చేస్తూ పలు టీవీ షోలు చేస్తూ వస్తోంది. విడాకుల అనంతరం ఒంటరిగా ఉంటున్న ఆమె తాజాగా రెండో పెళ్లికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఓ డైరెక్టర్‌తో సోనియా సన్నిహితం ఉంటుందట. ఈ క్రమంలో అతడినే ఆమె రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ ఫిలిం దూనియా గుసగుసలు వినిపిస్తున్నాయి. చదవండి: సోషల్ మీడియాలో చేదు అనుభవం, బోల్డ్‌గా స్పందించిన హీరోయిన్ గతంలో కూడా సోనియా రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి సోనియా రెండో పెళ్లి వ్యవహరం తెరపైకి వచ్చింది. ఆమె రెండో పెళ్లికి సిద్దమైందని, త్వరలోనే ఓ డైరెక్టర్‌ను వివాహం చేసుకొనుందంటూ ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే దీనిపై నటి సోనియా అగర్వాల్ స్పందించే వరకు వేచి చూడాలి. కాగా సోనియా తాజాగా నటించిన ద్విభాషా చిత్రం ‘గ్రాండ్మా’ త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. -
ఫారెన్ అమ్మాయితో రెండో పెళ్లి.. స్పందించిన మంచు మనోజ్
Manchu Manoj Reacts On His Second Marraige Rumours: మంచు మనోజ్ త్వరలోనే రెండోపెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. ఓ ఫారెన్ అమ్మాయితో మనోజ్ ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే ఆమెను వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తన పెళ్లి వార్తలపై మంచు మనోజ్ స్పందించారు. 'పెళ్లికి నన్ను కూడా ఆహ్వానించండి. పెళ్లి ఎక్కడ..బుజ్జి పిల్లా? తెల్ల పిల్లా ఎవరు? మీ ఇష్టం రా అంతా మీ ఇష్టం' అంటూ సెటైరికల్‌గా ట్వీట్ చేశాడు. దీంతో తన పెళ్లి వార్తలపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టినట్లయ్యింది. కాగా 2015లో ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న మనోజ్ సుమారు నాలుగేళ్ల అనంతరం వారి వైవాహికి జీవితానికి ముగింపు పలికారు. 2019లో విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇక విడాకుల అనంతరం మనోజ్ సినిమాలపైనే దృష్టిపెట్టారు. ప్రస్తుతం ఆయన `అహం బ్రహ్మాస్మి` అనే చిత్రంలో నటిస్తున్నారు. చదవండి: బిగ్‌బాస్: 'నువ్వు ఇలా చేస్తావనుకోలేదు..నాతో రిలేషన్లో ఉండి'.. మీ కుతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారా అని కంగారు పడకండి: సామ్ ఆసక్తికర పోస్ట్ -
రెండో పెళ్లి చేసుకోవాలంటే ఆ గుడికే వెళ్తారు.. ఎందుకంటే..!
సాక్షి,యడ్లపాడు(గుంటూరు): ఈతిబాధలు..వివాహ సమస్య, సంతానలేమీ.. చికాకులు ఇలా ఒక్కొక్క సమస్య పరిష్కారానికి ఒక్కొక్క ఆలయానికి వెళ్తుంటారు. ఒక్కొక్క ఆలయానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. కొన్ని ఆలయాలను దర్శిస్తే ఈతిబాధలు తొలగిపోతాయి. మరికొన్ని చోట్ల సుదీర్ఘకాలంగా జరగని వివాహాలు తక్షణమే ముహుర్తాలు వస్తాయి. ఇంకొన్ని ఆలయాలకు వెళితే సంతానలేమీ సాఫల్యమవుతుందని భక్తుల నమ్మకం. గుంటూరు జిల్లాలోని ఆలయం ఒకటి వీటన్నింటికి ఎంతో భిన్నమైనది. మరెంతో విశిష్టమైనది. ఇక్కడి స్వామి వారు కొండబండరాయిపై ప్రతిమలా చెక్కబడి దర్శనమిస్తారు. సమీప ప్రాంతాల వారు రెండోవివాహాలు చేసుకోవాలనుకునే వారికి మాత్రం ఈ ఆలయమే కళ్యాణ వేదిక. అందులోని స్వామివారే ఆ దంపతులకు శ్రీరామరక్ష. ఎర్రకొండపై గుహలా ఉన్న పురాతన లక్ష్మినర్సింహస్వామి గుడి కొండబండ తొర్రలో గుడి... జయలక్ష్మి నరసింహస్వామి ఆలయం రాష్ట్రంలోనే విశిష్టమైనదిగా చెప్పవచ్చు. గుంటూరు జిల్లా మండల కేంద్రమైన యడ్లపాడులో ఈ ఆలయం ఉంది. పూర్వం రెండు తెలుగు రాష్ట్రాల్లోని 16 నరసింహస్వామి పూజలందుకున్న దేవాలయాల్లో ఇది ఒకటిగా ప్రాచుర్యం పొందింది. గ్రామానికి సమీపానే 16వ నంబర్ జాతీయ రహదారి పక్కనే ఎర్రకొండపై ఈ స్వామివారి గుడి ఉంది. ఆలయ గోపురాలు, భారీ మండపాలు చుట్టూ ప్రాకారాలు ఏమీ లేకుండా సాదాసీదాగా కనిపిస్తుంది. భారీ బండారాయిని తొలచిన చిన్నపాటి గుహ గుడిగా నిర్మితమైంది. బండరాతిపై చెక్కబడిన ప్రతిమయే దైవంగా దర్శనమిస్తుంది. కొండపై స్వయంభుగా స్వామివారు వెలిశారని, రాజవంశీయులు ప్రతిమను చెక్కించి పూజలు చేశారని, ఓ మహర్షి క్రతువు నుంచి ఉద్భవించిందని, ఇలా రకరకాల కథలు స్థానిక పెద్దల నుంచి వినవస్తాయి. అయితే వీటికి సంబంధించిన చారిత్రక ఆధారాలు ఏవీ అందుబాటులో లేవని చెప్పాలి. కొండకింద నుంచి పైవరకు తోటలా పెరిగిన భారీసైజు తులసీ మొక్కలు కోవెల ఇలా.. కొండ శిఖరంపై ఉన్న భారీ బండరాయిని నాగపడిగ ఆకారంలో చెక్కబడి గుహగా మలిచారు. ఏకకాలంలో సుమారు 400 గొర్రెలు నిలబడేంత విశాలంగా గుహ ప్రదేశం ఆకర్షణీయంగా ఉండేది. స్వామివారి అభిముఖంగా రాతితో చెక్కబడిన పాదాలు, ఆంజనేయస్వామి విగ్రహం దర్శనమిస్తాయి. ఈ పాదాలను సీతమ్మ పాదాలుగా చెప్పుకుంటారు. గ్రామస్తులు వ్యవసాయ పనులు ప్రారంభించే సమయంలో స్వామిని దర్శించి పూజించేవారు. ఏటా ఏప్రిల్ మాసంలో జరిగే ఈ స్వామి ఉత్సవాల్లో భక్తులకు ప్రసాదంగా మామిడికాయలు, వడపప్పు, పానకం, విసనకర్రలు బ్రాహ్మణులు, భక్తులు పంపిణీ చేయడం విశేషం. ఓనాడు ఈ కొండపై పిడుగు పడి గుహ ముందు భాగం ధ్వంసమైంది. ప్రస్తుతం కొద్ది భాగమే గుహ ఆకారంలో ఉంది. సీతమ్మపాదాలు, ఆంజనేయస్వామి విగ్రహాలు కూడా ప్రస్తుతం లేవు. నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ధ్వంసమైన నాటి నీటిదొన ఉన్న ప్రాంతం ద్వితీయ వివాహాలు జరిపించే దివ్యక్షేత్రం... ఎన్నో వందల సంవత్సరాల క్రితం నాటి ఈ ఆలయం ద్వితీయ వివాహాలు నిలయంగా ఉండేది. సంసారంలో అపశ్రుతులు ఎదురై అందుకు దంపతులు విడిపోయినా.. శాశ్వతంగా దూరమైనా పెళ్లి తప్పా ఏ అచ్చటా ముచ్చట తీరని వారి పరిస్థితి అగమ్యగోచరంగా అనిపిస్తుంది. ఇలాంటి వారికి పెద్దలు నచ్చజెప్పొలేదా వారే తమకు నచ్చిన వారిగా మరోతోడు వెతుక్కున్న సమయంలో రెండోపెళ్లిని పెద్దలు ఇక్కడే జరిపించేవారు. అలా రెండోసారి పెళ్లి చేసుకునే వారికి వేదికలా మారింది. దీంతో సమీప గ్రామస్తులే కాదు సుదూర ప్రాంతాలకు చెందిన వారుసైతం ఇక్కడే పూజలు నిర్వహించి తమ రెండో వివాహాలను జరిపించుకునేవారు. స్వామి చెంత రెండోపెళ్లి చేసుకున్న జంటలు శాంతిసౌఖ్యాలతో వర్థిల్లుతారని అంతా విశ్వసించేవారట. ఒంటరి జీవితాలను జంటగా చేసిందే ఆ స్వామి వారేనని భావించి ఇక్కడ వివాహాలు చేసుకుంటారని పెద్దలు చెబుతుంటారు. రెండోవివాహం చేసుకున్న వారంతా స్వామి వారి ఉత్సవాలకు తప్పని సరిగా హాజరై మొక్కులు తీర్చుకోవడం విశేషం. రెండో పెళ్లిళ్లకు ప్రసిద్ధి...నూర్పాల పోలిరెడ్డి, నృసింహస్వాముని భక్తుడు. ప్రస్తుతం నాకు 76 ఏళ్లు. సుమారు 5 దశాబ్దాలుగా స్వామివారి జయంతి వేడుకల్లో పాల్గొని పూజలు నిర్వహిస్తున్నాను. సుబ్రమణ్యం అనే గురువు ఈ స్వామివారి పూజాక్రతులు నిర్వహించేవారు. ఏటా నృసింహ జయంతి నాడు కొండపై కళ్యాణ వేడుకలతో పాటు మామిడి పళ్లు, విసనకర్రలు, పానకం పంపిణీ చేసేవారు. కందకంలోకి పడుకుని లోపలికి వెళ్లాల్సి వచ్చేది. రెండోసారి వివాహం చేసుకునే దంపతులకు ఈ కోవెల నిలయమైంది. తులసీవనాలు, చల్లని వాతావరణం...చల్లా యజ్ఞేశ్వరరెడ్డి, యడ్లపాడు మా తాతల కాలంలో నృసింహుని జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభలు కట్టుకుని అక్కడికి వెళ్లేవాళ్లం. కొండపై తులసి సువాసనలతో ఎంతో చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది. కొండపై దొనలో మంచినీళ్లు స్వచ్ఛంగా ఉండేవి. భక్తులు కొండపై గొర్రెలు, పశుకాపరులు ఇక్కడికి వచ్చి దాహం తీర్చుకునేవారు. చదవండి: బాగ్దాద్ నుంచి భారత్‌కు వచ్చిన ఫకీరు, ఒక్క రూపాయికే అత్తరు