విలన్ పాత్రలతో గుర్తింపు పొందిన నటుడు ఆశీష్ విద్యార్థి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ‘కాల్ సంధ్య’సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈయన తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందారు.
ముఖ్యంగా తెలుగులో పోకిరి, గుడుంబా శంకర్ చిత్రాలతో పాపులర్ అయ్యారు. తన మూడవ సినిమా ‘దోర్హ్ కాల్’తో నేషనల్ అవార్డు సంపాదించుకున్న ఆశీష్ విద్యార్థి ఇప్పటివరకు 11 భాషల్లో సుమారు 200కి పైగా చిత్రాల్లో నటించారు.
అయితే తాజాగా రెండోపెళ్లితో ఆశీష్ విద్యార్థి వార్తల్లో నిలిచారు. 60ఏళ్ల వయసులో అస్సాంకు చెందిన రూపాలి బారువాను పెళ్లాడారు. ఈమె ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్. ఈమెకు కోల్‌కతాలో పలు ఫ్యాషన్ స్టోర్స్ ఉన్నాయి. కొంత కాలంగా ఆశిష్ విద్యార్ధి.. రూపాలి బారువాతో సన్నిహితంగా మెలుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా వాటినే నిజం చేస్తూ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.
అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరు వివాహం చేసుకున్నారు. గతంలో ఆశీష్ విద్యార్థి రాజోషి బారువాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈమె థియేటర్ ఆర్టిస్ట్‌గా, నటిగా, సింగర్‌గా సుపరిచితం. వీరికి అర్త్ విద్యార్థి అనే కొడుకు కూడా ఉన్నాడు. అయితే మనస్పర్థ కారణంగా ఆశీష్ విద్యార్థి-రాజోషి బారువా విడిపోయారు. ఇప్పుడు ఈయన 60 ఏళ్ల వయసులో రూపాలిని మనువాడాడు.
Comments
Please login to add a commentAdd a comment