Ashish vidyarthi (actor)
-
నెరుస్తున్న బంధాలు
పెళ్లయిన కొత్త... పడలేదు..విడిపోయారు...పెళ్లయ్యి పదేళ్లు... విడిపోయారు... ఇవి అందరికీ తెలిసినవే.కాని పెళ్లయ్యి ముప్పై, నలబై ఏళ్లు అయ్యాక కూడా విడిపోవాలా?వీటిని ‘గ్రే డివోర్స్’లని ‘సిల్వర్ స్పిల్టింగ్’ అంటున్నారు.నటుడు ఆశీష్ విద్యార్థి తన 60వ ఏట విడాకులు తీసుకుంటే ఇప్పుడు రెహమాన్ జంట కేసు కూడా గ్రే డివోర్స్ను చర్చాంశం చేసింది. సైకాలజిస్ట్‌లు మాత్రం జట్టు తెల్లబడేకొద్దీ వైవాహిక జీవితం గట్టిపడేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.ఆశీష్ విద్యార్థి కుమారుడు అమెరికాలో చదువుకుంటున్నారు. అతని గ్రాడ్యుయేషన్ సెరిమనీకి ఆశీష్ తన భార్య రాజోషి బారువాతో వెళ్లాడు. కాని వారు మరోసారి అలా కలిసి వెళ్లలేని విధంగా 2022లో విడిపోయారు. ‘మా సొంత ఇష్టాలు, ఆసక్తులు నెరవేర్చుకునే సమయం ఇది అనిపించింది’ అన్నారు వారు. ‘తండ్రిగా ఆషిష్లో ఏ వంకా వెతకలేము. భార్యగా నాకుండే కంప్లయింట్లు ఉంటాయి’ అని విడిపోయాక అతని గురించి రాజోషి అంది. వారు ఒకరి మీద ఒకరు గౌరవం చూపుతూనే విడిపోయారు. కాని సైకాలజిస్టులు ఏమంటారంటే ఒకరి మీద ఒకరు గౌరవం చూపుతూ కలిసి ఉండొచ్చుగా?హృదయాలు ఎందుకు పగలాలి?ఏ.ఆర్.రెహమాన్ 57 ఏళ్ల వయసులో అతని భార్య సైరా బాను 57 సంవత్సరాల వయసులో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ‘ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రేమ అలాగే ఉంది. కాని హృదయాలు పగిలేంతగా అగాథాలు వచ్చాయి’ అని వారిద్దరూ తెలిపారు. అయితే అగాథాలు ఒక్కరోజే వచ్చిపడవు. పగుళ్లు కనిపిస్తూనే ఉంటాయి. వాటిని గుర్తించి సరి చేసుకునేందుకు ప్రయత్నించాలి. 99 సార్లు ప్రయత్నం చేసి నూరవసారి ఈ తీవ్ర నిర్ణయానికి రావచ్చు.జాగ్రత్త పడాల్సింది ఇప్పుడేఅమెరికాలో గ్రే డివోర్సులు గత పదేళ్లలో పెరిగాయి. ఆశ్చర్యం ఏమంటే 50 ఏళ్ల వయసులో డివోర్స్ తీసుకునే వారు 13 శాతం ఉంటే 65 ఏళ్ల తర్వాత డివోర్స్ తీసుకునేవారు 29 శాతం ఉన్నారు. భారత దేశంలో విడాకుల వరకూ వెళ్లే వారి సంఖ్య తక్కువే అయినా ఏళ్ల తరబడి భర్త ఒక సంతానం దగ్గర, భార్య ఒక సంతానం దగ్గర, లేదంటే ఒకే చూరు కింద అపరిచితుల్లా ఉన్నవారు అనేకమంది ఉన్నారు. పెళ్లినాటి నుంచే మొదలయ్యే బంధాల నిర్వహణాలోపం కాలక్రమంలో ఇక్కడిదాకా తెస్తుంది. ఇక్కడ దాకా వచ్చాక విడిపోవడంలో సౌలభ్యం ఉందని చెప్పినా కొత్త జీవితంలో కూడా అంతే సౌలభ్యం పొందగలరా అనేది ప్రశ్నార్థకం. అందులో ఎదురయ్యే సవాళ్లు అల్రెడీ ఉన్న సంసారిక జీవితంలో ఎదురయ్యే సవాళ్ల కంటే గట్టివైతే ఏమిటి చేయడం?గ్రే డివోర్సులకు కారణాలు– నివారణ→ ఖాళీ ఇల్లు: పిల్లలు పెద్దవారయ్యే వెళ్లిపోయాక అంత వరకూ తల్లిదండ్రులుగా ఉన్నవారు తాము భార్యాభర్తలుగా ఉండటం మర్చిపోయామని గ్రహిస్తారు. భార్యాభర్తలుగా ఉండటం కొత్తగా మొదలెట్టాక సమస్యలు మొదలవుతున్నాయి. అంటే పిల్లలతో పాటుగా కుటుంబంగా ఉండటం సాధన చేస్తే ఈ ‘ఖాళీ’ రాదు. పిల్లలు లేని ఏకాంతం భార్యాభర్తల్లో మరింత ఇష్టాన్ని, విహారాన్ని, కబుర్లని ఇవ్వాలిగాని తగూలాటను కాదు. సమస్యను దాచి పిల్లల ముందు వ్యవహరించడం వల్ల ఇప్పుడు ఆ సమస్య విడాకులు కోరుతోంది. → మరింత అధికారం: భార్యాభర్తల మధ్య పొజెసివ్‌నెస్ ఉంటుంది. నాకే చెందాలి అని. ఉద్యోగాల్లో ఉండగా పట్టిపట్టి చూడటం కుదరుదు. ఈ రిటైర్మెంట్ తర్వాత భర్త తరచూ క్లబ్లో కూచుంటున్నా భార్య తరచూ బంధువులతో గంటల ఫోన్లలో ఉన్నా చిరాకులు తలెత్తుతాయి. ఏం చేసినా వీలైనంత వరకూ ఉమ్మడి అనుబంధాలలో గడపడం ఈ వయసులో చాలా ముఖ్యం. అంటే కామన్ ఫ్రెండ్సే, కామన్ ఆసక్తులే బంధాలను నిలుపుతాయి. ఇక అనుమానాలకు చోటిచ్చే ఇతర ఏ ఆకర్షణవైపుకు వెళ్లకపోవడమే ఉత్తమం.→ రూపాయి తగాదా: డబ్బు నీది, నాది అంటూ కాపురం సాగి ఉంటే ఆ రూపాయి భూతంలా మారే సందర్భం ఇదే. నా డబ్బు నేను ఇచ్చుకుంటాను, నా ఆస్తి నేను పంచుకుంటాను అని భార్య/భర్త ఎప్పుడైతే అనుకుంటారో అగాధాలు మొదలవుతాయి. డబ్బు ఒకరికి తెలియకుండా మరొకరు దాచకుండా ముందు నుంచి సంసారం సాగాలి. ఆర్థిక నిర్ణయాలు పరస్పర అంగీకారంతో జరగాలి. రిటైర్మెంట్ తర్వాత ఎలా ఆర్థికంగా ఉండబోతున్నారో ఆస్తులు ఎవరికి ఎలా ఇవ్వబోతున్నారో పదే పదే చర్చించుకుని సంతృప్తి పడితే సమస్య రాదు. → అనారోగ్య సమయాలు: అనారోగ్యాలు ఎదురయ్యే ఈ సమయంలో భార్య/భర్త దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉంటే ఓదార్పు కోసం కొత్త స్నేహానుబంధాల్లోకి వెళ్లడం విడాకులకు మరో కారణం. ఈ సమయంలో ఉండే అభద్రతను దృష్టిలో ఉంచుకుని జీవిత భాగస్వామి మరింత బాధ్యతగా ఉండాలి. ఇలాంటి సమయాల్లో విడిపోయే దాకా రావడం భార్యాభర్తల కంటే పిల్లలకు పెద్ద విఘాతం కాగలదు. కలిసి ఉంటే కలదు సుఖముపెళ్లయిన నాటి నుంచి తగాదాల కాపురం అయితే అందులో ఒక సమర్థింపు ఉండొచ్చుగాని హఠాత్తుగా ముప్పయి నలబై ఏళ్ల తర్వాత విడాకులంటే ఏదో నిర్లక్ష్యం భార్యాభర్తల్లో ఉన్నట్టే. జవాబుదారీతనం లేదులే అనుకోవచ్చుగాని విడిపోవడం అంత సులువు కాదు. పైగా అది ఒకరు గట్టిగా తీసుకొంటే మరొకరి పెనుఘాతం కావచ్చు. ఇష్టంతో, గౌరవంతో విడిపోయినా మళ్లీ ‘సాధారణస్థితి’కి రావడానికి చాలా కాలం పడుతుంది. కలిసి జీవించి పిల్లలకు జన్మనిచ్చి వారితో సంతోషంగా కాలం గడపాల్సిన ఈ వేళలో మరింత శ్రద్ధ. ప్రేమలను అనుబంధంలో పెంచడమే భార్యాభర్తలు చేయాల్సింది. -
నేను బతికే ఉన్నా.. ఛాన్సులివ్వమని ఎందుకన్నానంటే: ఆశిష్ విద్యార్థి
ఆశిష్ విద్యార్థి.. డిల్లీలో పుట్టి, పెరిగిన ఆయన 1991లో ‘కాల్ సంధ్య’ అనే హిందీ చిత్రంతో తెరంగేట్రం చేశారు. ‘పాపే నా ప్రాణం’తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత మహేశ్ బాబు నటించిన పోకిరి సినిమాతో టాలీవుడ్లో ఆయన పేరు మారుమ్రోగింది. దీంతో ఒక్కసారిగా ఆయనకు లెక్కలేనన్ని సినిమా అవకాశాలు వచ్చాయి. విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. అతిథి, తులసి, పోకిరి, లక్ష్యం, అలా మొదలైంది, నాన్నకు ప్రేమతో వంటి ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల్లో విభిన్న పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించాడు. కొద్దిరోజు క్రితం రైటర్ పద్మభూషణ్ సినిమాలో హీరో తండ్రిగా కనిపించి మెప్పించిన ఆయన రానా నాయుడు వంటి వెబ్‌సిరీస్‌లోనూ దుమ్మురేపాడు. కన్నడ, తమిళ్, మలయాళం, బెంగాలీ, ఒడియా, ఇంగ్లిష్ చిత్రాల్లోనూ నటించిన ఆయన కెరీర్ ప్రారంభంలోనే (1995) జాతీయ అవార్డు అందుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో నాడు బిజీగా ఉన్న ఆయన నేడు అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. ఆయన కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను బతికే ఉన్నాను. నాకు కూడా అవకాశాలు ఇవ్వండి. నన్ను గుర్తించి ఆఫర్లు ఇవ్వండి అంటూ కామెంట్లు చేశాడు. అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఆయనకు ఇలాంటి పరిస్థితి రావడం ఏంటి అంటూ కొందరు ఆశ్చర్యపోయారు కూడా.. తాజాగా ఆ వ్యాఖ్యలపై మరోసారి ఆశిష్ విద్యార్థి స్పందించారు. నేను చాలా భాషలలో నటించాను. అందులో ఎన్నో సినిమాల్లో మంచి పాత్రలు చేశాను. ఒక్కోసారి విలన్ పాత్రలు కూడా చేశాను. కానీ నన్ను ఇప్పటికీ అలానే చూస్తున్నారు. అలాంటి పాత్రలే ఆఫర్ చేస్తున్నారు. కానీ నేను వేరే పాత్రలు కూడా చేయగలను. ప్రేక్షకుల అభిరుచికి తగినట్లు సరికొత్త పాత్రలు చేయగలను. ఆ కోణంలో కూడా నన్ను చూడాలనే అభిప్రాయంతో ఆ వ్యాఖ్యలు చేశాను.' అని ఆయన అన్నారు. ఆశిష్ ఇటీవల రుపాలీ బరూవాను రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. -
ఆశిష్ - రూపాలి.. రెండో పెళ్లి తర్వాత తొలిసారిగా అలా!
పోకిరీ సినిమాతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆశిష్ విద్యార్థి. ఈ సినిమాలో పోలీసు పాత్రలో అభిమానులను అలరించారు. ఆ తర్వాత దక్షిణాదిలో పలు చిత్రాల్లో నటించారు. అయితే ట్రావెల్ చేస్తూ వీడియోలు చేస్తున్న ఆశిష్ విద్యార్థి 60 ఏళ్ల వయసులో గువాహటికి చెందిన ఫ్యాషన్ ఎంట్రప్రెన్యూర్ రుపాలీ బరూవాను వివాహమాడిన విషయం తెలిసిందే. అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. అయితే ఇప్పటికే ఆయనకు పెళ్లి కాగా.. మొదటి భార్యతో 2021లో విడాకులు తీసుకున్నారు. (ఇది చదవండి: సినీ ప్రియులకు బంపరాఫర్.. కేవలం రూ.99 కే టికెట్!) తాజాగా ఇటీవల ఆయన సొంతూరుకు వెళ్లారు. కేరళలోని హోమ్ టౌన్‌కు వెళ్లిన ఆయన ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన రెండో భార్య రూపాలిని మొదటిసారి మా ఊరికి వచ్చిందని వెల్లడించారు. తనకు సొంత గ్రామాన్ని సందర్శించడం సంతోషంగా ఉందంటూ తను బాల్యంలో ఉన్న ఇంటిని వీడియో చూపించారు. తొలిసారి తన భార్యతో కలిసి ఓనం పండుగకు వచ్చామని ఆశిష్ వివరించారు. ఇన్‌స్టాలో రాస్తూ..'కేరళలోని నా స్వస్థలాన్ని సందర్శించాను. ఇక్కడ నా బాల్యంలో జ్ఞాపకాలు ఉన్నాయి. రూపాలికి ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి. తనతో కలిసి మొదటి ఓనం జరుపుకుంటున్నా.' అంటూ పోస్ట్ చేశారు. అయితే ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లిపై ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ లేటు వయసులో పెళ్లి అవసరమా? అంటూ చాలా మంది విమర్శలు చేశారు. అయితే వాటిని ఆయన సున్నితంగా కొట్టిపారేశారు. రెండో భార్య రుపాలీ బరూవా సైతం అలాంటి వాటిని పట్టించుకోనని గతంలోనే తెలిపింది. (ఇది చదవండి: విజయ్ 'లియో' మూవీ.. సామాన్యుడిలా తిరుమలకు డైరెక్టర్!) View this post on Instagram A post shared by Ashish Vidyarthi (@ashishvidyarthi1) -
సంతోషం దూరం.. అందుకే విడిపోయాం.. రెండో పెళ్లిపై నటుడి క్లారిటీ
ప్రేమకు వయసుతో పని లేదని చెప్తోంది మళ్లీ పెళ్లి మూవీ. అది నిజమేనంటూ అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచాడు ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి. అరవై ఏళ్లకు దగ్గర్లో ఉన్న ఆయన ఫ్యాషన్ డిజైనర్ రూపాలీ బారువాను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి ముచ్చట ఎంత సెన్సేషన్ అవుతుందో అంతగా తిట్టిపోస్తున్నారు జనాలు. ఈ వయసులో పెళ్లేంది? మొదటి భార్యకు విడాకులిచ్చేశావా? మరొకరు తోడు కావాల్సి వచ్చిందా? అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చాడు ఆశిష్. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేశాడు. 'మన జీవితాలు వేరు. మన బ్యాక్‌గ్రౌండ్, చదువు, ఎదుర్కొనే ఛాలెంజెస్, ఆలోచన విధానం అన్నీ వేరు. అందరిదీ ఒక్కో వృత్తి. మనందరం వేర్వేరు నమ్మకాలతో బతుకుతున్నాం. కానీ అందరూ కామన్‌గా కోరుకునేది సంతోషంగా ఉండటం. 22 ఏళ్ల క్రితం పీలూ (మొదటి భార్య రాజోషి) నేను పెళ్లి చేసుకున్నాం. అది అద్భుతంగా జరిగింది. మాకు అర్థ్ అనే కొడుకున్నాడు. వాడికిప్పుడు 22 ఏళ్లు. గత కొన్ని సంవత్సరాలుగా కలిసిమెలిసి ఉన్న మాకు భవిష్యత్తు ఆలోచనలు వేర్వేరుగా ఉండటాన్ని గమనించాం. భేదాభిప్రాయాలు కలిసి మాట్లాడుకుంటే పరిష్కారమవుతాయేమో కానీ ఈ క్రమంలో ఎవరో ఒకరు మరొకరి మాట, ఆలోచన, అభిప్రాయాన్ని ఒప్పుకుని తీరాల్సిందే! అప్పుడు ఎవరో ఒకరి సంతోషం దూరమవుతుంది. ఆనందం అనేది అందరికీ చెందాలి కదా! అందుకే కలిసి ముందుకు నడవలేనప్పుడు విడిపోయి స్నేహపూర్వకంగా ముందుకు సాగుదాం అని నిర్ణయించుకున్నాం. నాకు ఒక తోడు కావాలనిపించింది. మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకున్నాను. 55 ఏళ్ల వయసులో వివాహం చేసుకోవాలని మరింత గట్టిగా ఫిక్సయ్యాను. అప్పుడే రూపాలిని కలిశా. మేము చాటింగ్ చేసుకున్నాం. ఏడాది క్రితం కలుసుకున్నాం. అప్పుడే మేము భార్యాభర్తలుగా కలిసి ముందుకు వెళ్తే బాగుంటుందని ఆలోచించాం. అందుకే పెళ్లి చేసుకున్నాం. తనకు 50 ఏళ్లు, నాకింకా 60 ఏళ్లు రాలేదు, 57 మాత్రమే! అయినా ప్రేమకు వయసుతో పనేంటి? మేమిద్దరం సంతోషంగా కలసి ప్రయాణిస్తాం' అని చెప్పుకొచ్చాడు ఆశిష్ విద్యార్థి. View this post on Instagram A post shared by Ashish Vidyarthi Avid Miner (@ashishvidyarthi1) View this post on Instagram A post shared by Ashish Vidyarthi Avid Miner (@ashishvidyarthi1) చదవండి: తిరుమలకు చైతన్య జొన్నలగడ్డ, నిహారిక ఎక్కడ? -
నటుడి రెండో పెళ్లి.. మొదటి భార్య పోస్టులు వైరల్..
పోకిరి విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో చేరువైన నటుడు ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి చేసుకున్నాడు. ప్రేమకు వయసుతో పని లేదని చెప్తూ 60 ఏళ్ల వయసులో ఫ్యాషన్ ఎంటర్ప్రెన్యూర్ రూపాలి బారువాను పెళ్లాడాడు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీళ్ల పెళ్లి టాపికే నడుస్తోంది. ఈ క్రమంలో ఆశిష్ మొదటి భార్య రాజోషి(పిలూ విద్యార్థి) సోషల్ మీడియాలో పెట్టిన వరుస పోస్టులు నెట్టింట వైరల్‌గా మారాయి. రెండో భార్య రూపాలితో ఆశిష్ విద్యార్థి చిరునవ్వులు చిందిస్తున్న సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన రాజోషి 'జీవితం అనే పజిల్లో గందరగోళానికి లోనవద్దు' అని రాసుకొచ్చింది. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో.. 'నిన్ను అర్థం చేసుకునేవాడు ఎప్పుడూ నిన్ను ప్రశ్నించడు. నిన్ను బాధపెట్టే పనుల జోలికి అస్సలు వెళ్లడు. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి' అని రాసుకొచ్చింది. మరో స్టోరీలో.. 'అతిగా ఆలోచిస్తూ అనవసర సందేహాలు పెట్టుకున్నావేమో కానీ ఇక మీదట అవి ఉండకపోవచ్చు. ఇప్పుడు వచ్చిన క్లారిటీతో ఈ గందరగోళమంతా తుడిచిపెట్టుకుపోతుంది. నువ్వు చాలాకాలంగా స్ట్రాంగ్‌గా ఉన్నావు. ఇప్పుడు అందరి ఆశీర్వాదాలు తీసుకునే సమయం వచ్చింది. అందుకు నువ్వు పూర్తి అర్హురాలివి' అని రాసుకొచ్చింది. మొదటి భార్య రాజోషితో ఆశిష్ విద్యార్థి ఈ పోస్టులు చూసిన నెటిజన్లు తనసలు సంతోషంగానే ఉందా? ఆశిష్‌తో విడాకుల తీసుకున్న బాధ నుంచి బయటపడినట్లు అనిపించడం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆశిష్ రెండో వివాహాంపై ఆమె పాజిటివ్‌గానే ఉన్నట్లు కనిపిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రముఖ బెంగాలీ నటి శకుంతల బారువా తనయురాలే రాజోషి. గతంలో ఆశిష్..రాజోలీని పెళ్లాడగా వీరికి 23 ఏళ్ల ఆర్త్ అనే కుమారుడు ఉన్నాడు. ఆశిష్- రాజోషికి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో వీరు విడాకులు తీసుకున్నారు. View this post on Instagram A post shared by Piloo Vidyarthi (@piloovidyarthi) చదవండి: ప్రేమ అంటే గుడ్డిదేమో.. ఆశిష్ విద్యార్థిపై నెటిజన్ల సెటైర్లు ఓటీటీలోకి వచ్చేసిన పొన్నియన్ సెల్వన్ 2 -
60 ఏళ్ల వయసులో నటుడు రెండో పెళ్లి.. వధువు బ్యాక్‌గ్రౌండ్ ఇదే
ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, బెంగాలీ సహా సుమారు 11 భాషల్లో 200కి పైగా సినిమాల్లో నటించాడు. టాలీవుడ్లో విలన్ పాత్రలతో గుర్తింపు పొందిన ఆయన తాజాగా 60ఏళ్ల వయసులో రెండోసారి పెళ్లిబంధంలోకి అడుగుపెట్టాడు. అస్సాంకు చెందిన 33 ఏళ్ల ఫ్యాషన్ ఎంటర్ప్రెన్యూర్ రూపాలి బారువాను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. కోల్‌కతాలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. అతికొద్ది మంది బంధువులు, కుటుంబసభ్యుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ జంటకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సుమారు 20ఏళ్ల క్రితమే ఆశిష్ విద్యార్థి నటి శాకుంతల బారువా కుమార్తె రాజోషి బారువాను ప్రేమించి మనువాడారు. వీరికి ఆర్త్ విద్యార్థి అనే కుమారుడు ఉన్నాడు. నటిగా, సింగర్‌గా రాజోషి బారువా పాపులర్. అయితే భార్యభర్తల మధ్య కొంతకాలంగా విబేధాలు రావడంతో వీరు విడిపోయారు. ఆ తర్వాత ఫ్యాషన్ ఎంటర్ప్రెన్యూర్ రుపాలీతో ఆశీష్ విద్యార్థికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి చివరకు పెళ్లిపీటలు ఎక్కేదాకా వచ్చింది. ఈమెకు కోల్‌కతాలో పలు స్టోర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. కొంతకాలంగా వీరు రిలేషన్షిప్లో ఉన్నట్లు రూమర్స్ వచ్చినా వాటినే నిజం చేస్తూ పెళ్లి చేసుకున్నారు. రూపాలీని పెళ్లి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని, తమ బంధం వెనుక పెద్ద కథే ఉందని, తర్వాత ఎప్పుడైనా చెబుతానంటూ స్వయంగా ఆశిష్ విద్యార్థి పేర్కొన్నారు. కాగా 60 ఏళ్ల వయసులో ఆశిష్‌విద్యార్థి రెండో పెళ్లి చేసుకోవడం, అది కూడా ప్రేమ పెళ్లి చేసుకోవడం విశేషం. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు కొత్తజంటకు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు మాత్రం ఈ వయసులో మీకిది అవసరమా? అయినా ప్రేమ గుడ్డిది అంటారు. నిజమేనేమో అంటూ సెటైర్లు వేస్తున్నారు. -
60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న 'పోకిరి' విలన్
విలన్ పాత్రలతో గుర్తింపు పొందిన నటుడు ఆశీష్ విద్యార్థి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ‘కాల్ సంధ్య’సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈయన తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా తెలుగులో పోకిరి, గుడుంబా శంకర్ చిత్రాలతో పాపులర్ అయ్యారు. తన మూడవ సినిమా ‘దోర్హ్ కాల్’తో నేషనల్ అవార్డు సంపాదించుకున్న ఆశీష్ విద్యార్థి ఇప్పటివరకు 11 భాషల్లో సుమారు 200కి పైగా చిత్రాల్లో నటించారు. అయితే తాజాగా రెండోపెళ్లితో ఆశీష్ విద్యార్థి వార్తల్లో నిలిచారు. 60ఏళ్ల వయసులో అస్సాంకు చెందిన రూపాలి బారువాను పెళ్లాడారు. ఈమె ఫ్యాషన్ ఎంటర్ప్రెన్యూర్. ఈమెకు కోల్‌కతాలో పలు ఫ్యాషన్ స్టోర్స్ ఉన్నాయి. కొంత కాలంగా ఆశిష్ విద్యార్ధి.. రూపాలి బారువాతో సన్నిహితంగా మెలుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా వాటినే నిజం చేస్తూ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరు వివాహం చేసుకున్నారు. గతంలో ఆశీష్ విద్యార్థి రాజోషి బారువాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈమె థియేటర్ ఆర్టిస్ట్‌గా, నటిగా, సింగర్‌గా సుపరిచితం. వీరికి అర్త్ విద్యార్థి అనే కొడుకు కూడా ఉన్నాడు. అయితే మనస్పర్థ కారణంగా ఆశీష్ విద్యార్థి-రాజోషి బారువా విడిపోయారు. ఇప్పుడు ఈయన 60 ఏళ్ల వయసులో రూపాలిని మనువాడాడు. -
రోడ్‌సైడ్ హోటల్లో టిఫిన్ చేసిన ప్రముఖ నటుడు.. వీడియో వైరల్
విలన్ పాత్రలతో గుర్తింపు పొందిన నటుడు ఆశీష్ విద్యార్థి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సహా బాహుభాషా నటుడిగా పేరున్న ఆశీష్ విద్యార్థి రీసెంట్గా రైటర్ పద్మభూషణ్‌లో నటించాడు. ఇక సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా ట్రావెల్ చేస్తూ రకరకాల వంటకాలను రుచిచూసి ఆ వీడియోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా ఆయన తిరుపతిలో సందడి చేశారు. రోడ్ సైడ్ హోటల్లో టిఫిన్ చేసారు. వేడివేడి దోశతో పాటు కరకరలాడే ఉద్ది వడ తిన్నానంటూ దానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ సదరు హోటల్ ఫుడ్‌పై ప్రశంసలు కురిపించారు. ఇలాంటి దోసెలు ఈశాన్య రాష్ట్రాల్లో దొరకవంటూ ట్వీట్ చేసారు. దీంతో ఆశీష్ విద్యార్థి షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఫేమస్ నటుడు అయినప్పటికీ ఇలా స్ట్రీట్‌ఫుడ్ ఎంజాయ్ చేయడం బాగుందని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Ashish Vidyarthi Avid Miner (@ashishvidyarthi1) -
పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: కాజల్ అగర్వాల్ (నటి); అశిష్ విద్యార్థి (నటుడు) ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 6. ఇది శుక్రుడికి సంబంధించిన సంఖ్య కాబట్టి వీరికి సంవత్సరమంతా ఉత్సాహకరంగా, ప్రోత్సాహవ ంతంగా ఉంటుంది. విదేశీ ప్రయాణం ఉండవచ్చు. కొత్త వాహనాలు కొంటారు. వస్త్రధారణలో మార్పు వస్తుంది. విలువైన వస్త్రాభరణాలకి ఖర్చు చేస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమలో పడతారు. మీ బర్త్ డేట్ 19 అయినందువల్ల అధికారుల సహకారంతో, పట్టుదలతో అనుకున్న పనులన్నింటినీ సాధిస్తారు. వయసు పై బడుతున్నా, హుషారుగా, ఆకర్షణీయంగా కనిపిస్తూ, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. ఇల్లు, ఆస్తులు కొనుక్కోవాలనే కోరిక తీరుతుంది. లక్కీ నంబర్స్: 1,5,6,9; లక్కీ డేస్: బుధ, శుక్ర, ఆదివారాలు; లక్కీ కలర్స్: రోజ్, ఆరంజ్, గ్రీన్, క్రీమ్. సూచనలు: శుక్రుడి ప్రభావం వల్ల మనసు కొంచెం చంచలమవుతుంది. కొత్త బంధాలు ఏర్పడవచ్చు. అందువల్ల కొంచెం జాగ్రత్త అవసరం. పెద్దవారైతే గుండెకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం మంచిది. శుక్రజపం చేయించుకోవడం, ఆదిత్య హృదయం పఠించడం, భృగుపాశుపత హోమం చేయించటం, అనాథ అమ్మాయిలకు ఆర్థిక సాయం చేయటం. - డా. మహమ్మద్ దావూద్, జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు