పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | Birthday celebrated Celebrities | Sakshi
Sakshi News home page

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Published Thu, Jun 18 2015 10:27 PM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు - Sakshi

పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

 ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: కాజల్ అగర్వాల్ (నటి); అశిష్ విద్యార్థి (నటుడు)
 
ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 6. ఇది శుక్రుడికి సంబంధించిన సంఖ్య కాబట్టి వీరికి సంవత్సరమంతా ఉత్సాహకరంగా, ప్రోత్సాహవ ంతంగా ఉంటుంది. విదేశీ ప్రయాణం ఉండవచ్చు. కొత్త వాహనాలు కొంటారు. వస్త్రధారణలో మార్పు వస్తుంది. విలువైన వస్త్రాభరణాలకి ఖర్చు చేస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమలో పడతారు. మీ బర్త్ డేట్ 19 అయినందువల్ల అధికారుల సహకారంతో, పట్టుదలతో అనుకున్న పనులన్నింటినీ సాధిస్తారు. వయసు పై బడుతున్నా, హుషారుగా, ఆకర్షణీయంగా కనిపిస్తూ, ఇతరులకు ఆదర్శంగా  నిలుస్తారు. ఇల్లు, ఆస్తులు కొనుక్కోవాలనే కోరిక తీరుతుంది.

లక్కీ నంబర్స్: 1,5,6,9; లక్కీ డేస్: బుధ, శుక్ర, ఆదివారాలు; లక్కీ కలర్స్: రోజ్, ఆరంజ్, గ్రీన్, క్రీమ్. సూచనలు: శుక్రుడి ప్రభావం వల్ల మనసు కొంచెం చంచలమవుతుంది. కొత్త బంధాలు ఏర్పడవచ్చు. అందువల్ల కొంచెం జాగ్రత్త అవసరం. పెద్దవారైతే గుండెకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం మంచిది. శుక్రజపం చేయించుకోవడం, ఆదిత్య హృదయం పఠించడం, భృగుపాశుపత హోమం చేయించటం, అనాథ అమ్మాయిలకు ఆర్థిక సాయం చేయటం.
 - డా. మహమ్మద్ దావూద్, జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement