Kajal Aggarwal Birthday Special Story In Telugu - Sakshi
Sakshi News home page

Kajal Aggarwal: ఆ సినిమాతో స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌.. పెళ్లితో సినిమాలకు బ్రేక్‌.. కానీ..

Published Mon, Jun 19 2023 1:27 PM | Last Updated on Mon, Jun 19 2023 4:00 PM

Kajal Aggarwal Birthday Special Story - Sakshi

సాక్షి, వెబ్‌డెస్క్‌ : లక్ష్మీ కల్యాణం మూవీతో టాలీవుడ్‌ తెరపై మెరిసింది కలువ కళ్ల సుందరి కాజల్‌ అగర్వాల్‌. తన రెండవ చిత్రం చందమామ మూవీతో తొలి సెక్సెస్‌ అందుకుంది ఈ భామ. ఆ తర్వాత హిస్టారికల్‌ మూవీ మగధీరతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. దీంతో సౌత్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంది. ఆమె కుటుంబ నేపథ్యం పంజాబీ,  నేటితో 38వ వసంతంలోకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ.

కాజల్‌ కెరీర్‌ మలుపు తిప్పిన సినిమా
2007లో కృష్ణవంశీ దర్శకత్వంలో విడుదలైన 'చందమామ' సినిమాతో క్రేజీ హీరోయిన్‌గా మారిన కాజల్ వరుసగా తెలుగు, తమిళ చిత్రాలలో హీరోయిన్‌గా అవకాశాలు అందుకుంది. కానీ  2009లో ఎస్ ఎస్ రాజమౌళి  దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమా ఆమెకు ఒక స్టార్‌ ఇమేజ్‌ని ఇచ్చింది.  రామ్ చరణ్  హీరోగా తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయం సొంతం చేసుకుంది. ఈ సినిమాతో కాజల్‌కు సౌత్‌లో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది.

అక్కడి నుంచి ఆమె సినీ కెరీర్ ఊహించని విధంగా మారిపోయింది. రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్‌, బన్నీ, రామ్ పోతినేని లాంటి యంగ్ హీరోల సరసన మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య లాంటీ సీనియర్ స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందుకుంది. వారితో నటించిన చాలా వరకు సినిమాలు  బ్లాక్ బస్టర్స్‌ అయిన విషయం తెలిసిందే. 

కాజల్‌ కాంట్రవర్సీ
టాలీవుడ్‌లో సుమారు 16 ఏళ్లుగా తను హీరోయిన్‌గా కొనసాగుతుంది. కానీ కాజల్‌ సినీ కెరీర్‌లో ఎలాంటి కాంట్రవర్సీలు కూడా లేవని చెప్పవచ్చు. అంతేకాకుండా తను కూడా ఎవరిపై ఎలాంటి ఆరోపణలకు కూడా చేసిన దాఖలాలు లేవని చెప్పవచ్చు. తనకు అందరితోనూ కలిసిపోయే మనస్తత్వం ఉందని ఇండస్ట్రీలోని కొందరు చెబుతుంటారు కూడా.. అందుకే అందరూ ఆమెను సొంత వ్యక్తిగానే చూస్తారని టాక్‌. కాజల్ ఒకే హీరోతో రెండుకు పైగానే చిత్రాలు చేసి కూడా సూపర్‌ హిట్స్ అందుకున్నవి చాలానే ఉన్నాయి.  మెగాస్టార్ చిరంజీవి సరసన ఆయన రీ ఎంట్రీ మూవీ  'ఖైదీ 150'లో హీరోయిన్‌గా నటించడంతో ఆమె ఇమేజ్‌ మరింత పెరిగిపోయింది.


వివాహబంధానికి ప్రాముఖ్యత
తన ప్రియసఖుడు గౌతమ్‌ కిచ్లుతో ఏడడుగులు వేసి శ్రీమతిగా మారారు కాజల్‌ అగర్వాల్‌. 2020 అక్టోబర్‌ 30న వీరి వివాహం అతి తక్కువమంది బంధువుల సమక్షంలో ముంబయిలోని ఓ హోటల్‌లో జరిగింది. ఆమె సినీ కెరీర్ మంచి ఊపులో ఉండగానే వ్యాపార వేత్త అయిన గౌతమ్ కిచ్లూను ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ఫ్యాన్స్‌ కూడా షాక్‌ అయ్యారు. వారి వివాహబంధానికి గుర్తుగా 2022 ఏప్రిల్‌ 19న నీల్‌ కిచ్లూ పుట్టాడు. ప్రస్తుతం తల్లిగా ఆనందకరమైన సమయాన్ని గడుపుతున్న ఆమె మళ్ళీ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. 

కాజల్‌కు తగ్గని అవకాశాలు 

బాలయ్యతో భగవంత్‌ కేసరిలో ఎంట్రీ ఇచ్చింది. తాజాగా  ఆమె ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్‌ థ్రిల్లర్ 'సత్యభామ'లో ఒక పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా రానుంది. తన కెరీర్‌లో ఇది 60వ చిత్రం కావటం విశేషం. అఖిల్ డేగల దర్శకుడు. కాజల్‌ పుట్టినరోజును సందర్భంగా టైటిల్‌తో పాటు సినిమా గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు. అందులో కాజల్‌ లుక్‌ అదిరిపోయేలా ఉంది.

మరోవైపు శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న కమల్‌ హాసన్‌ 'ఇండియన్ 2'లో ప్రధానమైన రోల్‌లో తను కనిపించనుంది. తరగని అందం కాజల్ సొంతం. అందుకే, ఆమె మరికొన్నేళ్లపాటు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా కొనసాగుతారని పలువురు సినీ తారలు అభిప్రాయపడుతున్నారు. అభిమానులు అదే కోరుకుంటున్నారు. నేడు(జూన్ 19) 'చందమామ' కాజల్ అగర్వాల్‌ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు అభిమానులు, సినీ ప్రముఖులు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

(ఇదీ చదవండి: షూటింగ్‌కు ముందే హీరోతో లిప్‌లాక్‌ చేసిన హీరోయిన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement