హీరోయిన్ కాజల్ అగర్వాల్ 39వ పుట్టినరోజుని తాజాగా జరుపుకొంది. ఈ క్రమంలోనే అభిమానులు, తోటీ సెలబ్రిటీలు ఈమెకు విషెస్ చెప్పారు. అందరూ శుభాకాంక్షలు చెప్పి వదిలేశారు కానీ కాజల్ ఫ్యాన్స్ మాత్రం చాలాకాలం గుర్తుండిపోయే పని చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 11 మూవీస్.. మొత్తంగా 17 రిలీజ్)
ముంబైలో పుట్టి పెరిగిన కాజల్ అగర్వాల్.. 'లక్ష‍్మీ కల్యాణం' సినిమాతో హీరోయిన్ అయింది. 'మగధీర' మూవీతో స్టార్ హోదా సొంతం చేసుకుంది. ఆ తర్వాత దక్షిణాదిలోనూ స్టార్ హీరోలందరితోనూ దాదాపుగా నటించేసింది. కరోనా లాక్‌డౌన్ టైంలో ప్రియుడు గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకుంది. ఈమెకు ఓ కొడుకు పుట్టాడు.
సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన కాజల్.. ఈ మధ్య 'సత్యభామ' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. సరే ఇదంతా పక్కనబెడితే కాజల్ ఫ్యాన్స్.. ఈమె పుట్టినరోజు సందర్భంగా 150 మందికి ఫుడ్ పంచారు. అలానే ఈ నెలాఖరులోపు 50 మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు. దీని గురించి తెలిసి కాజల్ భావోద్వేగానికి గురైంది. అద్భుతమైన పని చేశారని చెప్పి మెచ్చుకుంది.
(ఇదీ చదవండి: 'కల్కి' మరో వీడియో.. స్టోరీని దాదాపు చెప్పేసిన డైరెక్టర్!)
You guys never fail to amaze me with your thoughtfulness and kind compassion towards society. Thank you so much my amazing friends at @wekafawa for all the birthday love ❤️🙏🏻❤️ https://t.co/5F4xTZiZ10
— Kajal Aggarwal (@MsKajalAggarwal) June 20, 2024
Comments
Please login to add a commentAdd a comment