‘‘మగధీర’ సినిమాలో మిత్రవిందగా కాజల్ ఎలా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా హీరోయిన్స్ వారి కెరీర్‌ను కొనసాగించవచ్చనడానికి కాజల్ ఓ ఉదాహరణగా నిలుస్తున్నారు. ‘సత్యభామ’ సినిమా గ్లింప్స్ బాగుంది.. టీమ్‌కు ఆల్ ది బెస్ట్’’ అని దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘సత్యభామ’. అఖిల్ డేగల దర్శకత్వంలో అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి నిర్మిస్తున్నారు. నేడు (సోమవారం, జూన్ 19) కాజల్ బర్త్ డే.
ఈ సందర్భంగా ఆదివారం ‘సత్యభామ’ సినిమా గ్లింప్స్‌ని శేఖర్ కమ్ముల విడుదల చేశారు. కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ– ‘‘తెలుగుచిత్ర పరిశ్రమ నాకు ఇల్లులాంటింది. తెలుగు ఆడియన్స్ బెస్ట్. వారి ప్రేమ, ప్రోత్సాహం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా’’ అన్నారు. ‘‘నా తొలి సినిమాకు హీరోగా నిలిచిన కాజల్‌గారికి ధన్యవాదాలు’’ అన్నారు అఖిల్ డేగల. ‘‘మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తాం’’ అన్నారు శ్రీనివాస్, బాబీ. ఈ కార్యక్రమంలో స్క్రీన్‌ప్లే, చిత్ర సమర్పకుడు శశికిరణ్ తిక్క, కథారచయితలు రమేష్, ప్రశాంత్, కెమెరామేన్ మోహిత్ కృష్ణ, క్రియేటివ్ ప్రొడ్యూసర్ రాజీవ్ భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment