‘సత్యభామ’లో కొత్త కాజల్ ను చూస్తారు: శశికిరణ్ తిక్క | Sashi Kiran Tikka Talk About Satyabhama Movie | Sakshi
Sakshi News home page

‘సత్యభామ’లో కొత్త కాజల్ ను చూస్తారు: శశికిరణ్ తిక్క

Published Thu, Jun 6 2024 5:11 PM | Last Updated on Thu, Jun 6 2024 5:16 PM

Sashi Kiran Tikka Talk About Satyabhama Movie

కాజల్ అరవై సినిమాల్లో నటించింది. అయినా ఇప్పటికీ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. షూటింగ్‌ టైమ్‌లో ఆమె ఎనర్జీ మా అందరికి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చేంది.‘సత్యభామ’లో కాజల్‌ చేసిన యాక్షన్స్‌ ప్రేక్షలను అలరిస్తాయి. ముఖ్యంగా ఎమోషన్ ఈ మూవీలో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. ఎన్నో పోలీస్ స్టోరీస్ వచ్చినా ఎమోషనల్ గా “సత్యభామ” స్పెషల్ గా ఉంటుంది. తెరపై కొత్త కాజల్‌ని చూస్తారు’అని అన్నారు డైరెక్టర్‌  శశికిరణ్ తిక్క. ఆయన ప్రెజెంటర్, స్క్రీన్ ప్లే రైటర్ గా వర్క్ చేసిన మూవీ  ‘సత్యభామ’. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా అవురమ్ ఆర్ట్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించింది. సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. రేపు(జూన్‌ 7)ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా శశికిరణ్‌ తిక్క మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

యూకేలో ఉండే నా స్నేహితులు చెప్పిన కథతో ‘సత్యభామ’ జర్నీ మొదలైంది. ఆ పాయింట్ నచ్చి నేను, దర్శకుడు సుమన్ డెవలప్ చేశాం. అప్పుడు మేజర్ సినిమా జరుగుతోంది. అది పూర్తయ్యాక సెట్స్ మీదకు తీసుకెళ్లాలని అనుకున్నాం. కాజల్ గారికి ‘సత్యభామ’ కథ చెప్తే ఆమెకు వెంటనే నచ్చింది. అలా ఈ సినిమా ప్రారంభం అయింది.

⇢ నాకు దర్శకుడిగా చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నా స్క్రిప్ట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందుకే “సత్యభామ” సినిమాకు దర్శకత్వం వహించలేదు.అలాగే  అవురమ్ ఆర్ట్స్ పై మరిన్ని మూవీస్ చేయాలనుకుంటున్నాం. నాకు ప్రొడ్యూసర్ గా అనుభవం కావాలి. డైరెక్షన్ ప్రొడక్షన్ తో పాటు ఎడిటింగ్ కూడా చేయాలని ఉంది.

⇢ మూవీ ప్రెజెంటర్ గా సినిమా మేకింగ్ లో మరో కోణాన్ని చూశాను. దర్శకుడిగా నేను ప్రొడక్షన్ కాస్ట్ ను చెప్పినంతలో చేస్తాననే పేరుంది. ఇప్పుడు “సత్యభామ” నిర్మాత అనుభవాలు ఎలా ఉంటాయో తెలిసింది. ఓవరాల్ గా ప్రొడక్షన్ సైడ్ చాలా విషయాలు నేర్చుకున్నాను. సినిమా మేకింగ్ ను వైడ్ యాంగిల్ నుంచి తెలుసుకున్నా. దర్శకత్వం అమ్మలాంటి పని అయితే నిర్మాతగా ఉండటం నాన్న లాంటి బాధ్యత.

⇢ దర్శకుడు సుమన్ చిక్కాల, నేను, శ్రీచరణ్ పాకాల(సంగీత దర్శకుడు) మేమంతా ఫ్రెండ్స్. కలిసే మూవీస్ చేస్తుంటాం. “సత్యభామ” సినిమాకు కూడా అలాగే టీమ్ వర్క్ చేశాం. దర్శకుడిగా సుమన్ వర్క్ ఆకట్టుకుంటుంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా మా మూవీ ఉంటుంది. అయితే రెగ్యులర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ లా కేవలం కేసును క్లూలలతో పట్టుకోవడం కాకుండా కథలో ఎమోషన్ బాగా వర్కవుట్ అయ్యింది.

⇢ ఈ చిత్రంలొ నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్థన్, రవి వర్మ ఇలా మంచి కాస్టింగ్ కీ రోల్స్ చేశారు. వీళ్లు కాకుండా కొందరు కొత్త వాళ్లు నటించారు. వాళ్లకు ఈ సినిమా రిలీజ్ అయ్యాక మంచి పేరొస్తుంది.

⇢ ఈ సినిమా టీమ్ వర్క్ అని చెప్పాలి, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్, డైరెక్టర్, నేను, ప్రొడ్యూసర్స్ మేమంతా కలిసే పనిచేస్తూ వచ్చాం. మా మూవీని నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు రిలీజ్ చేస్తున్నారు. ఏపీలో ధీరజ్ మొగిలినేని రిలీజ్ చేస్తున్నారు. ఓవర్సీస్ లో సారిగమ రిలీజ్ చేస్తోంది. ఓటీటీ సహా ఓవరాల్ గా మా సినిమాకు ట్రేడ్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

⇢ దర్శకుడిగా నా తదుపరి సినిమా త్వరలో అనౌన్స్ చేస్తాను. వరుసగా థ్రిల్లర్స్ చిత్రాలే కాకుండా మల్టీపుల్ జానర్ మూవీస్ చేస్తాను.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement