Ashish Vidyarthi 2nd Marriage With Rupali Barua: First Wife Rajoshi Post Goes Viral - Sakshi
Sakshi News home page

Ashish Vidyarthi: పోకిరి విలన్‌ రెండో పెళ్లి.. జీవితమే ఒక పజిల్‌ అంటూ మొదటి భార్య పోస్ట్‌ వైరల్‌

Published Fri, May 26 2023 12:50 PM | Last Updated on Fri, May 26 2023 4:54 PM

Ashish Vidyarthi Second Marriage: First Wife Rajoshi Post Goes Viral - Sakshi

పోకిరి విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో చేరువైన నటుడు ఆశిష్‌ విద్యార్థి రెండో పెళ్లి చేసుకున్నాడు. ప్రేమకు వయసుతో పని లేదని చెప్తూ 60 ఏళ్ల వయసులో ఫ్యాషన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ రూపాలి బారువాను పెళ్లాడాడు. సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా వీళ్ల పెళ్లి టాపికే నడుస్తోంది. ఈ క్రమంలో ఆశిష్‌ మొదటి భార్య రాజోషి(పిలూ విద్యార్థి) సోషల్‌ మీడియాలో పెట్టిన వరుస పోస్టులు నెట్టింట వైరల్‌గా మారాయి.


రెండో భార్య రూపాలితో ఆశిష్‌ విద్యార్థి

చిరునవ్వులు చిందిస్తున్న సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన రాజోషి 'జీవితం అనే పజిల్‌లో గందరగోళానికి లోనవద్దు' అని రాసుకొచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో.. 'నిన్ను అర్థం చేసుకునేవాడు ఎప్పుడూ నిన్ను ప్రశ్నించడు. నిన్ను బాధపెట్టే పనుల జోలికి అస్సలు వెళ్లడు. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి' అని రాసుకొచ్చింది. మరో స్టోరీలో.. 'అతిగా ఆలోచిస్తూ అనవసర సందేహాలు పెట్టుకున్నావేమో కానీ ఇక మీదట అవి ఉండకపోవచ్చు. ఇప్పుడు వచ్చిన క్లారిటీతో ఈ గందరగోళమంతా తుడిచిపెట్టుకుపోతుంది. నువ్వు చాలాకాలంగా స్ట్రాంగ్‌గా ఉన్నావు. ఇప్పుడు అందరి ఆశీర్వాదాలు తీసుకునే సమయం వచ్చింది. అందుకు నువ్వు పూర్తి అర్హురాలివి' అని రాసుకొచ్చింది.


మొదటి భార్య రాజోషితో ఆశిష్‌ విద్యార్థి

ఈ పోస్టులు చూసిన నెటిజన్లు తనసలు సంతోషంగానే ఉందా? ఆశిష్‌తో విడాకుల తీసుకున్న బాధ నుంచి బయటపడినట్లు అనిపించడం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆశిష్‌ రెండో వివాహాంపై ఆమె పాజిటివ్‌గానే ఉన్నట్లు కనిపిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రముఖ బెంగాలీ నటి శకుంతల బారువా తనయురాలే రాజోషి. గతంలో ఆశిష్‌..రాజోలీని పెళ్లాడగా వీరికి 23 ఏళ్ల ఆర్త్‌ అనే కుమారుడు ఉన్నాడు. ఆశిష్‌- రాజోషికి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో వీరు విడాకులు తీసుకున్నారు.

చదవండి: ప్రేమ అంటే గుడ్డిదేమో.. ఆశిష్‌ విద్యార్థిపై నెటిజన్ల సెటైర్లు
ఓటీటీలోకి వచ్చేసిన పొన్నియన్‌ సెల్వన్‌ 2

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement