Ashish Vidyarthi Opens Up On His Second Wedding With Rupali Barua - Sakshi
Sakshi News home page

Ashish Vidyarthi: నాకింకా 57 మాత్రమే, మళ్లీ పెళ్లి చేసుకోవాలని గట్టిగా ఫిక్సయ్యా..

Published Fri, May 26 2023 6:15 PM | Last Updated on Sat, May 27 2023 9:49 AM

Ashish Vidyarthi on Second Marriage at 57 Says I Want to Travel with Somebody - Sakshi

ప్రేమకు వయసుతో పని లేదని చెప్తోంది మళ్లీ పెళ్లి మూవీ. అది నిజమేనంటూ అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచాడు ప్రముఖ నటుడు ఆశిష్‌ విద్యార్థి. అరవై ఏళ్లకు దగ్గర్లో ఉన్న ఆయన ఫ్యాషన్‌ డిజైనర్‌ రూపాలీ బారువాను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి ముచ్చట ఎంత సెన్సేషన్‌ అవుతుందో అంతగా తిట్టిపోస్తున్నారు జనాలు. ఈ వయసులో పెళ్లేంది? మొదటి భార్యకు విడాకులిచ్చేశావా? మరొకరు తోడు కావాల్సి వచ్చిందా? అంటూ ట్రోల్‌ చేస్తున్నారు.

ఎట్టకేలకు ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చాడు ఆశిష్‌. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్‌ చేశాడు. 'మన జీవితాలు వేరు. మన బ్యాక్‌గ్రౌండ్‌, చదువు, ఎదుర్కొనే ఛాలెంజెస్‌, ఆలోచన విధానం అన్నీ వేరు. అందరిదీ ఒక్కో వృత్తి. మనందరం వేర్వేరు నమ్మకాలతో బతుకుతున్నాం. కానీ అందరూ కామన్‌గా కోరుకునేది సంతోషంగా ఉండటం. 22 ఏళ్ల క్రితం పీలూ (మొదటి భార్య రాజోషి) నేను పెళ్లి చేసుకున్నాం. అది అద్భుతంగా జరిగింది.

మాకు అర్థ్‌ అనే కొడుకున్నాడు. వాడికిప్పుడు 22 ఏళ్లు. గత కొన్ని సంవత్సరాలుగా కలిసిమెలిసి ఉన్న మాకు భవిష్యత్తు ఆలోచనలు వేర్వేరుగా ఉండటాన్ని గమనించాం. భేదాభిప్రాయాలు కలిసి మాట్లాడుకుంటే పరిష్కారమవుతాయేమో కానీ ఈ క్రమంలో ఎవరో ఒకరు మరొకరి మాట, ఆలోచన, అభిప్రాయాన్ని ఒప్పుకుని తీరాల్సిందే! అప్పుడు ఎవరో ఒకరి సంతోషం దూరమవుతుంది. ఆనందం అనేది అందరికీ చెందాలి కదా! అందుకే కలిసి ముందుకు నడవలేనప్పుడు విడిపోయి స్నేహపూర్వకంగా ముందుకు సాగుదాం అని నిర్ణయించుకున్నాం.

నాకు ఒక తోడు కావాలనిపించింది. మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకున్నాను. 55 ఏళ్ల వయసులో వివాహం చేసుకోవాలని మరింత గట్టిగా ఫిక్సయ్యాను. అప్పుడే రూపాలిని కలిశా. మేము చాటింగ్‌ చేసుకున్నాం. ఏడాది క్రితం కలుసుకున్నాం. అప్పుడే మేము భార్యాభర్తలుగా కలిసి ముందుకు వెళ్తే బాగుంటుందని ఆలోచించాం. అందుకే పెళ్లి చేసుకున్నాం. తనకు 50 ఏళ్లు, నాకింకా 60 ఏళ్లు రాలేదు, 57 మాత్రమే! అయినా ప్రేమకు వయసుతో పనేంటి? మేమిద్దరం సంతోషంగా కలసి ప్రయాణిస్తాం' అని చెప్పుకొచ్చాడు ఆశిష్‌ విద్యార్థి.

చదవండి: తిరుమలకు చైతన్య జొన్నలగడ్డ, నిహారిక ఎక్కడ?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement