Ashish Vidyarthi
-
నటుడు ఆశిష్ విద్యార్థి ఇష్టపడే బెస్ట్ ఫుడ్ ప్లేస్‌లు ఇవే..!
నటుడు ఆశిష్ విద్యార్థి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విలన్‌గా, సహానటుడిగా నటనలో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఆయన ఇటీవల యూట్యూబర్‌గా, పబ్లిక్ స్పీకర్‌గా ప్రజలకు మరింత చేరువయ్యాడు. అంతేగాదు ఫుడ్ వ్లాగింగ్ పేరుతో దేశంలోని ప్రసిద్ద రుచికరమైన వంటకాల గురించి అన్వేషించడం, వాటిని తన అభిమానులకు తెలియజేయడం వంటివి చేస్తాడు. చెప్పాలంటే చాలామందికి తెలియని కొంగొత్త తినుబండారాల గురించి పరిచయం చేస్తాడు. అంతేగాదు ఒక ఇంటర్యూలో వివిధ ప్రాంతాల్లో తనకు ఇష్టమైన ఫుడ్ ప్లేస్‌లు గురించి షేర్ చేసుకున్నారు కూడా. అవేంటంటే..ఫుడ్ వ్లాగింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో భారతదేశంలో ట్రై చేయగల బెస్ట్ ఫుడ్ ప్లేస్‌లు గురించి చెప్పుకొచ్చారు. కోల్‌కతా ఆహారం అద్భుతమైనదని, అక్కడ కచోరిలతో రోజుని ప్రారంభించమని చెప్పాడు. అందుకోసం మహారాజా(చంగని పప్పి మహారాజ్, బారా బజార్, నింబుతల్లాలో ఉంది), శర్మ టీ స్టాల్ (భవానీపూర్‌లో).రెండు కూడా ప్రసిద్ధ తినుబండారాలే. అలాగే ఆల్ టైం ఫేవరెట్ తినుబండారం అయిన బిర్యానీ కోసం అర్సలాన్ రెస్టారెంట్, హంగ్లాథెరియం (లేక్ గార్డెన్స్‌లో) రెండింటిని ప్రయ్నత్నించొచ్చని చెప్పాడు. బెంగళూరులో 1943లో స్థాపించిన శాఖాహర రెస్టారెంట్లో తినొచ్చని అన్నారు. అక్కడ ప్రసిద్ద కన్నడ ఫుడ్ మంచి రుచిగా అందిస్తారని అన్నారు. నిజానికి దీన్ని సమీపంలోని పాఠశాలల్లోని విద్యార్థుల కోసం శ్రీ వెంకటరమణ ఉరల్చే చిన్న క్యాంటీన్‌గా ప్రారంభించారు. ఆ తర్వత బెంగళూరుని సందర్శించే వాళ్లకు బెస్ట్ ఫుడ్ ప్లేస్‌గా పేరుగాంచింది. అలాగే కేరళలోని పాలక్కాడలో తనకు నచ్చిన బిర్యానీ స్పాట్ గురించి చెప్పారు. హసిన్ కిచెన్‌లో చేసే తలస్సేరి దమ్ బిరియానీ, రుచికరమైన చేపల కూర, నోరూరించే మాంసాహార వంటకాలకు ప్రసిద్ధి చెందింది. ఇక హిమచల్ప్రదేశానికి వస్తే.. బరోగ్లోని చాచు డా ధాబాలో పరాథే ప్రయత్నించమని, అలాగే చండీగఢ్‌లోని పష్తున్ రెస్టారెంట్ రాన్ ప్లేట్‌ను ఆస్వాదించమని సూచించారు.(చదవండి: ప్రపంచ కొబ్బరి దినోత్సవం: కొబ్బరితో చేసే ప్రసిద్ధ వంటకాలివే..!) -
నేను బతికే ఉన్నా.. ఛాన్సులివ్వమని ఎందుకన్నానంటే: ఆశిష్ విద్యార్థి
ఆశిష్ విద్యార్థి.. డిల్లీలో పుట్టి, పెరిగిన ఆయన 1991లో ‘కాల్ సంధ్య’ అనే హిందీ చిత్రంతో తెరంగేట్రం చేశారు. ‘పాపే నా ప్రాణం’తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత మహేశ్ బాబు నటించిన పోకిరి సినిమాతో టాలీవుడ్లో ఆయన పేరు మారుమ్రోగింది. దీంతో ఒక్కసారిగా ఆయనకు లెక్కలేనన్ని సినిమా అవకాశాలు వచ్చాయి. విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. అతిథి, తులసి, పోకిరి, లక్ష్యం, అలా మొదలైంది, నాన్నకు ప్రేమతో వంటి ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల్లో విభిన్న పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించాడు. కొద్దిరోజు క్రితం రైటర్ పద్మభూషణ్ సినిమాలో హీరో తండ్రిగా కనిపించి మెప్పించిన ఆయన రానా నాయుడు వంటి వెబ్‌సిరీస్‌లోనూ దుమ్మురేపాడు. కన్నడ, తమిళ్, మలయాళం, బెంగాలీ, ఒడియా, ఇంగ్లిష్ చిత్రాల్లోనూ నటించిన ఆయన కెరీర్ ప్రారంభంలోనే (1995) జాతీయ అవార్డు అందుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో నాడు బిజీగా ఉన్న ఆయన నేడు అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. ఆయన కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను బతికే ఉన్నాను. నాకు కూడా అవకాశాలు ఇవ్వండి. నన్ను గుర్తించి ఆఫర్లు ఇవ్వండి అంటూ కామెంట్లు చేశాడు. అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఆయనకు ఇలాంటి పరిస్థితి రావడం ఏంటి అంటూ కొందరు ఆశ్చర్యపోయారు కూడా.. తాజాగా ఆ వ్యాఖ్యలపై మరోసారి ఆశిష్ విద్యార్థి స్పందించారు. నేను చాలా భాషలలో నటించాను. అందులో ఎన్నో సినిమాల్లో మంచి పాత్రలు చేశాను. ఒక్కోసారి విలన్ పాత్రలు కూడా చేశాను. కానీ నన్ను ఇప్పటికీ అలానే చూస్తున్నారు. అలాంటి పాత్రలే ఆఫర్ చేస్తున్నారు. కానీ నేను వేరే పాత్రలు కూడా చేయగలను. ప్రేక్షకుల అభిరుచికి తగినట్లు సరికొత్త పాత్రలు చేయగలను. ఆ కోణంలో కూడా నన్ను చూడాలనే అభిప్రాయంతో ఆ వ్యాఖ్యలు చేశాను.' అని ఆయన అన్నారు. ఆశిష్ ఇటీవల రుపాలీ బరూవాను రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. -
'మిణుగురులు' చిత్రానికి పదేళ్లు.. అమెరికాలో స్పెషల్ షో
అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి దర్శకత్వంలో 2014లో తెరకెక్కిన చిత్రం 'మిణుగురులు'. ఆశిష్ విద్యార్ధి, సుహాసిని మణిరత్నం, రఘుబీర్ యాదవ్, దీపక్ సరోజ్ నటించిన ఈ చిత్రం ఇటీవల 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమెరికాలో తాజాగా స్పెషల్ షో వేశారు. విడుదలైన కొన్ని రోజుల్లోనే టాలీవుడ్ దిగ్గజ నటులు, దర్శక నిర్మాతల నుంచి ప్రశంసలందుకుంది ఈ చిత్రం. మెగాస్టార్ చిరంజీవి, స్వర్గస్తులు దర్శకుడు - నిర్మాత దాసరి నారాయణ రావు, దర్శకుడు సుకుమార్, దర్శకుడు శేఖర్ కమ్ముల, పాటల రచయిత చంద్రబోస్ వంటి వారు ఈ చిత్రంలోని సామాజిక అంశాలని, సాంకేతిక విలువలని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణంశెట్టి మాట్లాడుతూ, "2014లో చిత్రం విడుదలైనప్పుడు సోషల్ మీడియా పెద్దగా వ్యాప్తి చెందలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విడుదలయ్యుంటే జాతీయ అంతర్జాతీయ మాధ్యమాల్లో వైరల్ అవ్వడమే కాకుండా అందరి నోటా ఒకే మాటగా వెళ్లేది. ఈ చిత్రంలోని సామాజిక విషయాలు పూర్తిగా పరిశోధించి, నిజ జీవితంలో చూపు లేని పిల్లల దయనీయ పరిస్థితిని చూపించటం జరిగింది. సరిగ్గా వారం కూడా ఆడని చిత్రాల మధ్య 'మిణుగురులు' 10 ఏళ్లు నిలిచింది అని ఈ కార్యక్రమానికి వచ్చిన ఒక ప్రేక్షకుడు అన్నారు. ‘మిణుగురులు’ 18వ అంతర్జాతీయ చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్లో 'గోల్డెన్ ఎలిఫెంట్' గెలుచుకుంది. ఇండియా అంతర్జాతీయ డిసెబిలిటీ ఫిలిం ఫెస్టివల్,ఇతర ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ కి ఎంపికైంది. 9వ బెంగళూరు అంతర్జాతీయ చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్లో 'ఉత్తమ చిత్రం' అవార్డు గెలుచుకుంది. 2014 లో 'అస్కార్స్' కి ఉత్తమ చిత్ర జాబితాలో ఎంపికయిన చిత్రాల్లో 'మిణుగురులు' కూడా ఉంది. ఆస్కార్ గ్రంథాల్లో శాశ్వత చిత్రాల జాబితాలో 'మిణుగురులు' కథ కూడా ఉంటుంది. అని ఆయన చెప్పారు. అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి జాతీయంగా, అంతర్జాతీయంగా పేరొందిన దర్శకుడు. పోర్ట్ ల్యాండ్, ఒరెగాన్లోని నార్త్ వెస్ట్ ఫిలిం సెంటర్లో ఫిలిం మేకింగ్ నేర్చుకున్న ఈయన అమెరికా టివి ఛానల్ ఓపిబిలో కొన్నేళ్లు పనిచేశారు. తన దర్శక నిర్మాణంలో తీసిన పలు షార్ట్ ఫిలిమ్స్, డాక్యూమెంటరీలు చాల అవార్డులు గెలుచుకున్నాయి. ఆయన 'మిణుగురులు' చిత్రం 2014 లో 7 నంది అవార్డులు గెలుచుకుంది. నేటి పరిస్థితులకి తగ్గట్టుగా ఉండే రొమాంటిక్ ప్రేమ కథతో '24 కిస్సెస్' అనే చిత్రాన్ని తీశారు. ఆయన తదుపరి కథల వరుసలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లో రిలీజ్ అవ్వనున్న గ్లోబల్, ఓటిటిలో చిత్రాలు ఉండడం విశేషం. -
ఆశిష్ - రూపాలి.. రెండో పెళ్లి తర్వాత తొలిసారిగా అలా!
పోకిరీ సినిమాతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆశిష్ విద్యార్థి. ఈ సినిమాలో పోలీసు పాత్రలో అభిమానులను అలరించారు. ఆ తర్వాత దక్షిణాదిలో పలు చిత్రాల్లో నటించారు. అయితే ట్రావెల్ చేస్తూ వీడియోలు చేస్తున్న ఆశిష్ విద్యార్థి 60 ఏళ్ల వయసులో గువాహటికి చెందిన ఫ్యాషన్ ఎంట్రప్రెన్యూర్ రుపాలీ బరూవాను వివాహమాడిన విషయం తెలిసిందే. అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. అయితే ఇప్పటికే ఆయనకు పెళ్లి కాగా.. మొదటి భార్యతో 2021లో విడాకులు తీసుకున్నారు. (ఇది చదవండి: సినీ ప్రియులకు బంపరాఫర్.. కేవలం రూ.99 కే టికెట్!) తాజాగా ఇటీవల ఆయన సొంతూరుకు వెళ్లారు. కేరళలోని హోమ్ టౌన్‌కు వెళ్లిన ఆయన ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన రెండో భార్య రూపాలిని మొదటిసారి మా ఊరికి వచ్చిందని వెల్లడించారు. తనకు సొంత గ్రామాన్ని సందర్శించడం సంతోషంగా ఉందంటూ తను బాల్యంలో ఉన్న ఇంటిని వీడియో చూపించారు. తొలిసారి తన భార్యతో కలిసి ఓనం పండుగకు వచ్చామని ఆశిష్ వివరించారు. ఇన్‌స్టాలో రాస్తూ..'కేరళలోని నా స్వస్థలాన్ని సందర్శించాను. ఇక్కడ నా బాల్యంలో జ్ఞాపకాలు ఉన్నాయి. రూపాలికి ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి. తనతో కలిసి మొదటి ఓనం జరుపుకుంటున్నా.' అంటూ పోస్ట్ చేశారు. అయితే ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లిపై ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ లేటు వయసులో పెళ్లి అవసరమా? అంటూ చాలా మంది విమర్శలు చేశారు. అయితే వాటిని ఆయన సున్నితంగా కొట్టిపారేశారు. రెండో భార్య రుపాలీ బరూవా సైతం అలాంటి వాటిని పట్టించుకోనని గతంలోనే తెలిపింది. (ఇది చదవండి: విజయ్ 'లియో' మూవీ.. సామాన్యుడిలా తిరుమలకు డైరెక్టర్!) View this post on Instagram A post shared by Ashish Vidyarthi (@ashishvidyarthi1) -
ఆశిష్ విద్యార్థితో పెళ్లిపై మొదటిసారి స్పందించిన రుపాలీ
ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి 60 ఏళ్ల వయసులో గువాహటికి చెందిన ఫ్యాషన్ ఎంట్రప్రెన్యూర్ రుపాలీ బరూవాను వివాహమాడిన విషయం తెలిసిందే. సుమారు రెండు నెలల క్రితం ఇరు కుటుంబాలు, అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. ఆయన రెండో పెళ్లిపై ఆశిష్ విద్యార్థి మొదటి భార్య పిలు విద్యార్థి కూడా ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. సుమారు 22 ఏళ్ల పాటు కలిసి జీవించిన వీరిద్దరూ 2021లో విడాకులు తీసుకున్నారు. (ఇదీ చదవండి: లావణ్య త్రిపాఠి రూట్లో 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి.. పెళ్లిపై నిజమెంత?) ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి చేసుకుని ఇప్పటికి రెండు నెలలు దాటినా ఆయనపై ట్రోల్స్ ఆగడం లేదు.. ఇప్పుటికే వాటిని ఆయన సున్నితంగా తిరష్కరించారు కూడా.. తాజాగా మళ్లీ ఆయనతో పాటు రెండో భార్య రుపాలీ బరూవా కూడా స్పందించారు. తమపై వచ్చిన అసభ్య వ్యాఖ్యలను చదివినప్పుడు వారి మనస్సులో ఏమి ఉందని ప్రశ్నించగా రుపాలీ ఇలా స్పందించారు. 'నన్ను తిట్టే వాళ్లందరూ నాకు తెలియని వ్యక్తులే కాబట్టి నేను దానిని పట్టించుకోను తిరిగి వారిని కూడా తిట్టుకోలేదు. మా జీవితంలో జరిగిన విషయాల గురించి వారికి స్పష్టంగా తెలియదు.. అందరిలాగే వారు కూడా ఈ విషయాన్ని చూశారు. ఎందుకంటే వారికి నా గురించి తెలియదు. వాళ్లందరూ నన్ను తిడుతున్నారని వారి వద్దకు వెళ్లి క్లారిటీ ఇవ్వలేను. నెటిజన్లలో ఒక వర్గం వారు తిడితే మరో వర్గం వారు అర్థం చేసుకుంటారు. అలా ఎవరు ఎలాంటి మాటలు అనుకున్నా పర్వాలేదు. నేను ఆ కామెంట్లను అంతగా చదవనందున ఇది నన్ను అంతగా ప్రభావితం చేయలేదు. నా సన్నిహితులు నాకు మద్దతు ఇస్తున్నారు, నాకు వేరే వారి సపోర్ట్ అవసరం లేదు.' అని ఆమె చెప్పింది. (ఇదీ చదవండి: సూర్య కోసం సెన్సేషనల్ హీరోయిన్, విలన్ ఎంట్రీ) ఇంతలో, ఆశిష్ విద్యార్థి కలుగజేసుకుని ఇలా చెప్పారు. ప్రేమ, ఆప్యాయతతో కూడిన ఈ రెండు విషయాలపై మరోకరికి నిరూపించాల్సిన అవసరం లేదు. మేమిద్దరం ఏ విషయాన్ని నిరూపించుకోవడానికి ఇక్కడ లేము. మా మధ్య కలత లేదు, కోపం లేదు. మమ్మల్ని తిడితే మీకు సంతోషమా..? అయితే అలాగే చేయండి. నా రెండో పెళ్లిపై ముసలోడు.. సభ్యత, సంస్కారం లేని వాడు అంటూ చాలా అసభ్యకరమైన పదాలను కూడా వాడారు. జీవితానా చివరి దశలో ఉన్నప్పుడు తోడు కావాలనుకోవడంలో తప్పు ఏంటి.. ? 22 ఏళ్లుగా నా మొదటి భార్యతో జీవితాన్ని పంచుకున్నాను. తర్వాత ఇద్దరి మధ్య వచ్చిన గొడవలతో సంసారం చితికిపోయింది. అప్పుడు నేను ఒంటరివాడినయ్యాను. అలాంటి సమయంలో రుపాలీ నా జీవితంలోకి వచ్చింది.' అని ఆయన అన్నారు. జీవితంలో ఇద్దరం ఒంటరిగా ఉన్న సమయంలో ఒక తోడు దొరకడం , కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించడం చాలా పెద్ద విషయం అని రుపాలి ఇలా తెలిపారు. 'విశ్వం ఈ అవకాశం ఇవ్వడం చాలా పెద్ద విషయం. దీని ముందు నా జీవితంలో మరేదైనా చిన్నదే. నేను ఏమి కోల్పోయానో నాకు మాత్రమే తెలుసు. ఈ వయసులో తోడు దొరకడం ఒక వరం. ఆ ఆశీర్వాదం చాలా పెద్దది. ఈ విషయంపై ప్రతికూలతలు వచ్చినా అవి తాత్కాలికమే.' అని ఆమె చెప్పింది. కోల్‌కతాలోని ఓ ప్రముఖ ఫ్యాషన్ స్టోర్‌లో రుపాలీకి భాగస్వామ్యం ఉంది. తన తండ్రి నార్త్ ఇండియాలో ప్రముఖ వ్యాపారవేత్త అని సమాచారం. ఆశిష్ విద్యార్థి కూడా విశాల్ భరద్వాజ్ స్పై-థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Ashish Vidyarthi Avid Miner (@ashishvidyarthi1) -
57 ఏళ్ల వయసులో రెండో భార్యతో ఆశిష్ విద్యార్థి హనీమూన్ (ఫోటోలు)
-
లేటు వయసులో నటుడి పెళ్లి.. మళ్లీ హనీమూన్ కూడానా?
ప్రముఖ సీనియర్ నటుడు ఆశిష్ విద్యార్థి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, బెంగాలీ సహా సుమారు 11 భాషల్లో 200కి పైగా సినిమాల్లో నటించాడు. పోకిరీ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్లో విలన్ పాత్రలతో గుర్తింపు పొందిన ఆయన.. ఇటీవలే దాదాపు 57 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్నారు. అస్సాంకు చెందిన 33 ఏళ్ల ఫ్యాషన్ ఎంటర్ప్రెన్యూర్ రూపాలి బరువాను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే ఇప్పటికే మొదటి భార్యకు ఓ కుమారుడు కూడా ఉన్నారు. కోల్‌కతాలో జరిగిన వీరి పెళ్లికి అత్యంత సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు. (ఇది చదవండి: Bigg Boss Telugu 7 Promo: బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమో వచ్చేసింది.. మేకర్స్ ఏం చెప్పారంటే) అయితే ప్రస్తుతం ఈ జంట హనీమూన్ ట్రిప్‌లో ఉన్నారు. ఇండోనేషియాలో బాలిలో ఈ జంట చక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించిన ఫోటోలను రూపాలి బరువా తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. పచ్చదనం, ఆహ్లాదకరమైన కొండల మధ్య దిగిన ఫోటోను షేర్ చేశారు. గత నెలలో కూడా ఈ జంట సింగపూర్‌లో విహారయాత్రకు వెళ్లినట్లు సమాచారం. అయితే లేటు వయసులో పెళ్లి చేసుకోవడంతో ఆశిష్ విద్యార్థి ట్రోల్స్‌కు గురయ్యారు. ఆ వయసులో అవసరమా? అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. కాగా.. ఆశిష్ విద్యార్థి మొదటి భార్య పిలూకు 2022లో విడాకులిచ్చారు. ప్రస్తుతం ఆశిష్ తదుపరి చిత్రం ఖుఫియాలో కనిపించనున్నారు. (ఇది చదవండి: నా కంటే 30 ఏళ్లు పెద్దవాడు.. అయినా పెళ్లి చేసుకుంటే: ప్రముఖ సింగర్) View this post on Instagram A post shared by Rupali Barua (@ru.pa.li.73) -
అలాంటి రోల్స్ చేసి చాలా ఇబ్బందిపడ్డా: ఆశిష్ విద్యార్థి
ఏ సినిమాలో అయినా స్క్రీన్ పై కనిపించేవాళ్లు కేవలం నటులు. కానీ మనమేమో హీరోలని అభిమానిస్తాం, హీరోయిన్లని ప్రేమిస్తాం, విలన్స్‌ని ద్వేషిస్తాం. చెప్పాలంటే విలన్ పాత్రని క్రూరంగా చూపిస్తే మనమే అసహ్యించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సదరు విలన్ యాక్టర్స్ నిజ జీవితంలో అలా ఉండరు! కానీ ఆ పాత్రల తాలుకూ ప్రభావం మాత్రం వాళ్లపై గట్టిగానే పడుతుంది. తెలుగు సినిమాల్లో ఎప్పటికప్పుడు కొత్త విలన్స్ వస్తూనే ఉంటారు. కానీ చాలామందికి ఆశిష్ విద్యార్థి వన్ ఆఫ్ ది ఫేవరెట్ అని చెప్పొచ్చు. పోకిరి సినిమాలో 'పద్మావతి హ్యాపీయేనా?' అనే డైలాగ్ గుర్తొచ్చినప్పుడల్లా మనకు ఈ నటుడే గుర్తొస్తాడు. కెరీర్ ప్రారంభంలో సీరియస్ విలన్ పాత్రలు చేసిన ఇతడు.. ఆ తర్వాత కామెడీ విలన్ రోల్స్ కి షిప్ట్ అయ్యాడు. ఏదేమైనా వీటి వల్ల తను చాలా ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌హిట్ 'గురక సినిమా'.. అస్సలు మిస్సవ్వొద్దు!) 'సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ చేయడం వల్ల చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. నేను చేసిన అలాంటి పాత్రల గురించి మాట్లాడాలంటే నాకే సిగ్గుగా అనిపిస్తుంది. ఎందుకంటే విలన్స్ తమ యాక్టింగ్ గురించి గొప్పగా చెప్పుకోలేరు! కదా? వాటి ప్రభావం నాపై చాలా ఎక్కువగా పడింది. ఆ మాటలు, ఆ డైలాగ్స్, ఆ కామెంట్స్.. అన్నీ!' అని నటుడు ఆశిష్ విద్యార్థి చెప్పుకొచ్చాడు. తన ఇన్ స్టాలో దీనితోపాటు చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. ఆశిష్ విద్యార్థి వ్యక్తిగత జీవితం చూసుకుంటే.. ఓవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నాడు. మరోవైపు ఫుడ్, ట్రావెల్ వ్లాగ్స్ చేస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. 2001లో రాజోషి బరువాని పెళ్లి చేసుకున్న ఇతడు.. గతేడాది ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఈ మధ్యే రూపాలీ బరువా అనే ఆమెని రెండో పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల ముందు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. View this post on Instagram A post shared by Ashish Vidyarthi Avid Miner (@ashishvidyarthi1) (ఇదీ చదవండి: శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 28 సినిమాలు!) -
రెండో పెళ్లిపై దారుణ ట్రోల్స్.. స్పందించిన ఆశిష్ విద్యార్థి
మహేశ్ బాబు పోకిరీ చిత్రంతో ఫేమ్ తెచ్చుకున్న ఆశిష్ విద్యార్థి టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే రెండో పెళ్లి చేసుకుని ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. అస్సాం రాష్ట్రానికి వ్యాపారవేత్త రూపాలీ బరువాను ఆయన రెండో వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇప్పటికే మొదటి భార్య పిలూ విద్యార్థితో విడాకులు తీసుకున్నారు. (ఇది చదవండి: భోళా శంకర్: మెగాస్టార్, నందమూరి ఫ్యాన్స్ కోసం భలే స్కెచ్!) అయితే 57 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడంతో పెద్ద ఎత్తున ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆశిష్ విద్యార్థి తనపై వచ్చిన ట్రోల్స్‌పై స్పందించారు. రెండో పెళ్లి చేసుకున్నాక తనను కించపరిచేలా ట్రోల్స్ చేశారని అన్నారు. చాలా దారుణమైన పదాలు ఉపయోగించారని ఆయన అన్నారు. ఇది తన వ్యక్తిగత విషయమని.. ఇలాంటి విషయాల్లో మద్దతుగా నిలవాలని సూచించారు. ఆశిష్ విద్యార్థి మాట్లాడుతూ.. 'తనపై బుడా(ముసలి), ఖుసత్ (సభ్యత , సంస్కారం లేని) లాంటి అవమానకరమైన పదాలతో ఉపయోగించారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే మనలో ప్రతి ఒక్కరూ వయసులో పెద్దవాళ్లమనే భయాన్ని మనలోనే ఉంచుకుంటాం. అదే విషయాన్ని ఇతరులకు కూడా చెబుతున్నాం. కానీ ప్రస్తుతం జనరేషన్ మారింది. వయసు మీద పడినంత మాత్రాన ఎలాంటి పనులు చేయకూడదని మనకు మనమే చెప్పుకుంటున్నాం కదా. కానీ మన జీవితాన్ని సంతోషంగా ముగించాలకున్నప్పుడు.. ఎవరైనా సరే తోడు కావాలని ఎందుకు కోరుకోకూడదు?' అని అన్నారు. (ఇది చదవండి: నాలుగున్నరేళ్లుగా నటుడితో సహజీవనం.. మీరిక పెళ్లి చేసుకోరా?) తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని.. ప్రతి విషయాన్ని చట్టబద్ధంగా వ్యవహరిస్తానని తెలిపారు. పన్నులు చెల్లిస్తున్నానని, కష్టపడి పనిచేస్తున్నానని అన్నారు. కుటుంబాన్ని కలిగి ఉండాలనే ఆసక్తితోనే చట్టబద్ధంగా వివాహం చేసుకున్నట్లు వివరించారు. ఇది తన వ్యక్తిగత నిర్ణయమని తెలిపారు. ప్రజలు ఒకరిని నిందించకుండా.చ. ఒకరికొకరు మద్దతుగా ఉండాలని ఆశిష్ అన్నారు. -
ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి.. దీని వెనుక ఇంత కథ ఉందా..!
మహేశ్ బాబు పోకిరీ చిత్రంలో మెప్పించిన ఆశిష్ విద్యార్థి టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే రెండో పెళ్లి చేసుకుని ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. అస్సాం రాష్ట్రానికి వ్యాపారవేత్త రూపాలీ బరువాను వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇప్పటికే పెళ్లి కాగా.. మొదటి భార్యతో విడాకులు తీసుకున్నారు. ఆశిష్ విద్యార్థి మొదటి భార్య పిలు విద్యార్థి కూడా వీరి పెళ్లికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. (ఇది చదవండి: లగ్జరీ కారు కొనుగోలు రామ్ చరణ్ హీరోయిన్.. ధర ఎన్ని కోట్లంటే?) అయితే ఆశిష్ విద్యార్థి ఈ పెళ్లికి ముందు జరిగిన సంఘటనలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. రూపాలీతో వివాహానికి అనుకున్నంత ఈజీగా జరగలేదని తెలిపారు. రెండో పెళ్లి చేసుకోవాలన్న మా నిర్ణయం తమ కుటుంబ సభ్యులను తీవ్రంగా బాధ పెట్టిందని పేర్కొన్నారు. ఆశిష్ విద్యార్థి మాట్లాడుతూ.. 'గతేడాది వ్లాగింగ్ అసైన్మెంట్లలో భాగంగా నేను రూపాలిని కలిశా. ఆ తర్వాత మేము చాట్ చేయడం ప్రారంభించాం. రూపాలీ ఐదేళ్ల క్రితం తన భర్తను కోల్పోయింది. ఆ తర్వాత ఆమె కూడా తన బాధను కాస్తా మరిచిపోయింది. అదే సమయంలో మళ్లీ పెళ్లి చేసుకోవడంపై ఇద్దరం ఆలోచించాం. ఆమెతో చాట్ చేస్తున్నప్పుడు తనతో జీవితాన్ని పంచుకోవాలనుకున్నా. పెళ్లి చేసుకోవాలని ఇద్దరం నిర్ణయించుకున్నాం. ఆమె జీవితంలో నేను ఉన్నందుకు ఆశ్చర్యంగా ఉంది.' అని అన్నారు. (ఇది చదవండి: కంగ్రాట్స్.. కొంచెమైనా సిగ్గుండాలి.. ఆశిష్ విద్యార్థిపై కేఆర్కే ట్వీట్ వైరల్) అయితే తన నిర్ణయం కుటుంబానికి తీవ్రమైన బాధ కలిగించిందని తెలిపారు. తన భార్య పిలూను స్నేహితుడిలా చూసేవాడినని అన్నారు. ఆశిష్ మాట్లాడుతూ.. 'పిలూతో పెళ్లి తర్వాత మా జీవితం అద్భుతంగా సాగింది. ఆమె నాకు భార్య మాత్రమే మంచి ఫ్రెండ్ కూడా. నాతో ఎప్పుడూ అలానే ఉండేది. కానీ ఈ పెళ్లికి ముందు చాలా బాధ అనుభవించా. విడిపోవడమనేది చాలా బాధ కలిగించింది. అది చాలా కష్టంగా అనిపించింది కూడా. ఈ విషయంలో మేమిద్దరం చాలా ఫీలయ్యాం.' అని రెండో పెళ్లి వెనుక పడ్డ బాధను పంచుకున్నారు. -
సంతోషం దూరం.. అందుకే విడిపోయాం.. రెండో పెళ్లిపై నటుడి క్లారిటీ
ప్రేమకు వయసుతో పని లేదని చెప్తోంది మళ్లీ పెళ్లి మూవీ. అది నిజమేనంటూ అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచాడు ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి. అరవై ఏళ్లకు దగ్గర్లో ఉన్న ఆయన ఫ్యాషన్ డిజైనర్ రూపాలీ బారువాను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి ముచ్చట ఎంత సెన్సేషన్ అవుతుందో అంతగా తిట్టిపోస్తున్నారు జనాలు. ఈ వయసులో పెళ్లేంది? మొదటి భార్యకు విడాకులిచ్చేశావా? మరొకరు తోడు కావాల్సి వచ్చిందా? అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చాడు ఆశిష్. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేశాడు. 'మన జీవితాలు వేరు. మన బ్యాక్‌గ్రౌండ్, చదువు, ఎదుర్కొనే ఛాలెంజెస్, ఆలోచన విధానం అన్నీ వేరు. అందరిదీ ఒక్కో వృత్తి. మనందరం వేర్వేరు నమ్మకాలతో బతుకుతున్నాం. కానీ అందరూ కామన్‌గా కోరుకునేది సంతోషంగా ఉండటం. 22 ఏళ్ల క్రితం పీలూ (మొదటి భార్య రాజోషి) నేను పెళ్లి చేసుకున్నాం. అది అద్భుతంగా జరిగింది. మాకు అర్థ్ అనే కొడుకున్నాడు. వాడికిప్పుడు 22 ఏళ్లు. గత కొన్ని సంవత్సరాలుగా కలిసిమెలిసి ఉన్న మాకు భవిష్యత్తు ఆలోచనలు వేర్వేరుగా ఉండటాన్ని గమనించాం. భేదాభిప్రాయాలు కలిసి మాట్లాడుకుంటే పరిష్కారమవుతాయేమో కానీ ఈ క్రమంలో ఎవరో ఒకరు మరొకరి మాట, ఆలోచన, అభిప్రాయాన్ని ఒప్పుకుని తీరాల్సిందే! అప్పుడు ఎవరో ఒకరి సంతోషం దూరమవుతుంది. ఆనందం అనేది అందరికీ చెందాలి కదా! అందుకే కలిసి ముందుకు నడవలేనప్పుడు విడిపోయి స్నేహపూర్వకంగా ముందుకు సాగుదాం అని నిర్ణయించుకున్నాం. నాకు ఒక తోడు కావాలనిపించింది. మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకున్నాను. 55 ఏళ్ల వయసులో వివాహం చేసుకోవాలని మరింత గట్టిగా ఫిక్సయ్యాను. అప్పుడే రూపాలిని కలిశా. మేము చాటింగ్ చేసుకున్నాం. ఏడాది క్రితం కలుసుకున్నాం. అప్పుడే మేము భార్యాభర్తలుగా కలిసి ముందుకు వెళ్తే బాగుంటుందని ఆలోచించాం. అందుకే పెళ్లి చేసుకున్నాం. తనకు 50 ఏళ్లు, నాకింకా 60 ఏళ్లు రాలేదు, 57 మాత్రమే! అయినా ప్రేమకు వయసుతో పనేంటి? మేమిద్దరం సంతోషంగా కలసి ప్రయాణిస్తాం' అని చెప్పుకొచ్చాడు ఆశిష్ విద్యార్థి. View this post on Instagram A post shared by Ashish Vidyarthi Avid Miner (@ashishvidyarthi1) View this post on Instagram A post shared by Ashish Vidyarthi Avid Miner (@ashishvidyarthi1) చదవండి: తిరుమలకు చైతన్య జొన్నలగడ్డ, నిహారిక ఎక్కడ? -
60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న ఆశిష్ విద్యార్థి (ఫోటోలు)
-
60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న నటుడు
-
నటుడి రెండో పెళ్లి.. మొదటి భార్య పోస్టులు వైరల్..
పోకిరి విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో చేరువైన నటుడు ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి చేసుకున్నాడు. ప్రేమకు వయసుతో పని లేదని చెప్తూ 60 ఏళ్ల వయసులో ఫ్యాషన్ ఎంటర్ప్రెన్యూర్ రూపాలి బారువాను పెళ్లాడాడు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీళ్ల పెళ్లి టాపికే నడుస్తోంది. ఈ క్రమంలో ఆశిష్ మొదటి భార్య రాజోషి(పిలూ విద్యార్థి) సోషల్ మీడియాలో పెట్టిన వరుస పోస్టులు నెట్టింట వైరల్‌గా మారాయి. రెండో భార్య రూపాలితో ఆశిష్ విద్యార్థి చిరునవ్వులు చిందిస్తున్న సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన రాజోషి 'జీవితం అనే పజిల్లో గందరగోళానికి లోనవద్దు' అని రాసుకొచ్చింది. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో.. 'నిన్ను అర్థం చేసుకునేవాడు ఎప్పుడూ నిన్ను ప్రశ్నించడు. నిన్ను బాధపెట్టే పనుల జోలికి అస్సలు వెళ్లడు. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి' అని రాసుకొచ్చింది. మరో స్టోరీలో.. 'అతిగా ఆలోచిస్తూ అనవసర సందేహాలు పెట్టుకున్నావేమో కానీ ఇక మీదట అవి ఉండకపోవచ్చు. ఇప్పుడు వచ్చిన క్లారిటీతో ఈ గందరగోళమంతా తుడిచిపెట్టుకుపోతుంది. నువ్వు చాలాకాలంగా స్ట్రాంగ్‌గా ఉన్నావు. ఇప్పుడు అందరి ఆశీర్వాదాలు తీసుకునే సమయం వచ్చింది. అందుకు నువ్వు పూర్తి అర్హురాలివి' అని రాసుకొచ్చింది. మొదటి భార్య రాజోషితో ఆశిష్ విద్యార్థి ఈ పోస్టులు చూసిన నెటిజన్లు తనసలు సంతోషంగానే ఉందా? ఆశిష్‌తో విడాకుల తీసుకున్న బాధ నుంచి బయటపడినట్లు అనిపించడం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆశిష్ రెండో వివాహాంపై ఆమె పాజిటివ్‌గానే ఉన్నట్లు కనిపిస్తోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రముఖ బెంగాలీ నటి శకుంతల బారువా తనయురాలే రాజోషి. గతంలో ఆశిష్..రాజోలీని పెళ్లాడగా వీరికి 23 ఏళ్ల ఆర్త్ అనే కుమారుడు ఉన్నాడు. ఆశిష్- రాజోషికి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో వీరు విడాకులు తీసుకున్నారు. View this post on Instagram A post shared by Piloo Vidyarthi (@piloovidyarthi) చదవండి: ప్రేమ అంటే గుడ్డిదేమో.. ఆశిష్ విద్యార్థిపై నెటిజన్ల సెటైర్లు ఓటీటీలోకి వచ్చేసిన పొన్నియన్ సెల్వన్ 2 -
60 ఏళ్ల వయసులో నటుడు రెండో పెళ్లి.. వధువు బ్యాక్‌గ్రౌండ్ ఇదే
ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, బెంగాలీ సహా సుమారు 11 భాషల్లో 200కి పైగా సినిమాల్లో నటించాడు. టాలీవుడ్లో విలన్ పాత్రలతో గుర్తింపు పొందిన ఆయన తాజాగా 60ఏళ్ల వయసులో రెండోసారి పెళ్లిబంధంలోకి అడుగుపెట్టాడు. అస్సాంకు చెందిన 33 ఏళ్ల ఫ్యాషన్ ఎంటర్ప్రెన్యూర్ రూపాలి బారువాను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. కోల్‌కతాలో వీరి వివాహం నిరాడంబరంగా జరిగింది. అతికొద్ది మంది బంధువులు, కుటుంబసభ్యుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ జంటకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సుమారు 20ఏళ్ల క్రితమే ఆశిష్ విద్యార్థి నటి శాకుంతల బారువా కుమార్తె రాజోషి బారువాను ప్రేమించి మనువాడారు. వీరికి ఆర్త్ విద్యార్థి అనే కుమారుడు ఉన్నాడు. నటిగా, సింగర్‌గా రాజోషి బారువా పాపులర్. అయితే భార్యభర్తల మధ్య కొంతకాలంగా విబేధాలు రావడంతో వీరు విడిపోయారు. ఆ తర్వాత ఫ్యాషన్ ఎంటర్ప్రెన్యూర్ రుపాలీతో ఆశీష్ విద్యార్థికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి చివరకు పెళ్లిపీటలు ఎక్కేదాకా వచ్చింది. ఈమెకు కోల్‌కతాలో పలు స్టోర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. కొంతకాలంగా వీరు రిలేషన్షిప్లో ఉన్నట్లు రూమర్స్ వచ్చినా వాటినే నిజం చేస్తూ పెళ్లి చేసుకున్నారు. రూపాలీని పెళ్లి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని, తమ బంధం వెనుక పెద్ద కథే ఉందని, తర్వాత ఎప్పుడైనా చెబుతానంటూ స్వయంగా ఆశిష్ విద్యార్థి పేర్కొన్నారు. కాగా 60 ఏళ్ల వయసులో ఆశిష్‌విద్యార్థి రెండో పెళ్లి చేసుకోవడం, అది కూడా ప్రేమ పెళ్లి చేసుకోవడం విశేషం. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు కొత్తజంటకు కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు మాత్రం ఈ వయసులో మీకిది అవసరమా? అయినా ప్రేమ గుడ్డిది అంటారు. నిజమేనేమో అంటూ సెటైర్లు వేస్తున్నారు. -
కంగ్రాట్స్.. కొంచెమైనా సిగ్గుండాలి.. ఆశిష్ విద్యార్థిపై కేఆర్కే ట్వీట్ వైరల్
బాలీవుడ్ సినీ క్రిటిక్‌గా పాపులర్ అయిన కమల్ ఆర్ ఖాన్ (కేఆర్కే) పరిచయం అక్కర్లేని పేరు. తన సంచలన కామెంట్స్‌తో పాపులర్ అయ్యారు. సినీ తారలపై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు కేఆర్కే. బాలీవుడ్ వివాదస్పద సినీ క్రిటిక్‌గా పేరు సంపాదించుకున్నారు. అయితే తాజాగా సీనియర్ నటుడు ఆశిష్ విద్యార్థి పెళ్లిపై ట్వీట్ చేశారు. ఒకవైపు కంగ్రాట్స్ చెబుతూనే మరోవైపు.. కొంచెమైనా సిగ్గుండాలి భాయ్‌సాబ్ అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. అయితే ఈ ట్వీట్‌పై నెటిజన్స్ కేఆర్కేకు కౌంటరిస్తున్నారు. ఈ జంటను చూసి ఓర్వలేకపోతున్నావ్? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. (ఇది చదవండి: ఎంగేజ్మెంట్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న పరిణీతి చోప్రా) ఇవాళ ఆశిష్ విద్యార్థి గౌహాతికి చెందిన ఓ వ్యాపారవేత్త రూపాలి బరువాను కోల్‌కతాలో రెండో పెళ్లి చేసుకున్నారు. సన్నిహితులు, బంధువుల సమక్షంలో రిజిస్టర్ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుత వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. రూపాలికి కోల్‌కతాలో ఫ్యాషన్ స్టోర్స్ నిర్వహిస్తున్నారు. (ఇది చదవండి: 60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న 'పోకిరి' విలన్) Congratulations to 60 years old actor Ashish Vidyarthi who got married second time. Kucch to Sharam Kar lete Bhaisaab! pic.twitter.com/15cOyRYQd1 — KRK (@kamaalrkhan) May 25, 2023 -
60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న 'పోకిరి' విలన్
విలన్ పాత్రలతో గుర్తింపు పొందిన నటుడు ఆశీష్ విద్యార్థి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ‘కాల్ సంధ్య’సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈయన తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా తెలుగులో పోకిరి, గుడుంబా శంకర్ చిత్రాలతో పాపులర్ అయ్యారు. తన మూడవ సినిమా ‘దోర్హ్ కాల్’తో నేషనల్ అవార్డు సంపాదించుకున్న ఆశీష్ విద్యార్థి ఇప్పటివరకు 11 భాషల్లో సుమారు 200కి పైగా చిత్రాల్లో నటించారు. అయితే తాజాగా రెండోపెళ్లితో ఆశీష్ విద్యార్థి వార్తల్లో నిలిచారు. 60ఏళ్ల వయసులో అస్సాంకు చెందిన రూపాలి బారువాను పెళ్లాడారు. ఈమె ఫ్యాషన్ ఎంటర్ప్రెన్యూర్. ఈమెకు కోల్‌కతాలో పలు ఫ్యాషన్ స్టోర్స్ ఉన్నాయి. కొంత కాలంగా ఆశిష్ విద్యార్ధి.. రూపాలి బారువాతో సన్నిహితంగా మెలుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా వాటినే నిజం చేస్తూ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరు వివాహం చేసుకున్నారు. గతంలో ఆశీష్ విద్యార్థి రాజోషి బారువాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈమె థియేటర్ ఆర్టిస్ట్‌గా, నటిగా, సింగర్‌గా సుపరిచితం. వీరికి అర్త్ విద్యార్థి అనే కొడుకు కూడా ఉన్నాడు. అయితే మనస్పర్థ కారణంగా ఆశీష్ విద్యార్థి-రాజోషి బారువా విడిపోయారు. ఇప్పుడు ఈయన 60 ఏళ్ల వయసులో రూపాలిని మనువాడాడు. -
రోడ్‌సైడ్ హోటల్లో టిఫిన్ చేసిన ప్రముఖ నటుడు.. వీడియో వైరల్
విలన్ పాత్రలతో గుర్తింపు పొందిన నటుడు ఆశీష్ విద్యార్థి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సహా బాహుభాషా నటుడిగా పేరున్న ఆశీష్ విద్యార్థి రీసెంట్గా రైటర్ పద్మభూషణ్‌లో నటించాడు. ఇక సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా ట్రావెల్ చేస్తూ రకరకాల వంటకాలను రుచిచూసి ఆ వీడియోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా ఆయన తిరుపతిలో సందడి చేశారు. రోడ్ సైడ్ హోటల్లో టిఫిన్ చేసారు. వేడివేడి దోశతో పాటు కరకరలాడే ఉద్ది వడ తిన్నానంటూ దానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ సదరు హోటల్ ఫుడ్‌పై ప్రశంసలు కురిపించారు. ఇలాంటి దోసెలు ఈశాన్య రాష్ట్రాల్లో దొరకవంటూ ట్వీట్ చేసారు. దీంతో ఆశీష్ విద్యార్థి షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఫేమస్ నటుడు అయినప్పటికీ ఇలా స్ట్రీట్‌ఫుడ్ ఎంజాయ్ చేయడం బాగుందని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Ashish Vidyarthi Avid Miner (@ashishvidyarthi1) -
Ashish Vidyarthi: ఆ బాధ్యత మాదే
‘‘తోటి నటీనటులతో పాటు యాక్ట్ చేస్తూ, నా పాత్రకు ఎంతవరకు న్యాయం చేస్తున్నాననే విషయంపై మాత్రమే నేను దృష్టి పెడతాను. అంతేకానీ ఇది చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడాలు చూడను’’ అన్నారు నటుడు ఆశిష్ విద్యార్థి. సుహాస్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో జి. మనోహర్ సమర్పణలో అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 3న విడుదల కానుంది. ఈ చిత్రంలో కీ రోల్ చేసిన నటుడు ఆశిష్ విద్యార్థి మాట్లాడుతూ– ‘‘మంచి హ్యూమర్, ఎమోషన్స్ ఉన్న సినిమా ఇది. ఈ చిత్రంలో కొడుకు ఏదో సాధిస్తాడని ఆశపడే ఓ మధ్యతరగతి తండ్రి పాత్రలో నటించాను. కానీ ఈ తండ్రి జీవితంలో ఓ ట్విస్ట్ ఉంటుంది. ఈ సినిమాలో నాకు, రోహిణీగారికి మధ్య వచ్చే సన్నివేశాలు అలరిస్తాయి’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘చేసే ప్రతి పాత్రను నేను డ్రీమ్ రోల్‌గానే భావిస్తాను. మొదట్లో విలన్ రోల్స్ చేశాను. అయితే నాకు కామెడీ అంటే ఇష్టం. కానీ నాకు అన్ని రకాల పాత్రలూ చేయాలని ఉంది. అయితే మనకు ఎటువంటి పాత్రలు ఇవ్వాలనేది దర్శక–రచయితలపై ఆధారపడి ఉంటుంది. అలాగే ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రకు మేం న్యాయం చేస్తామనే నమ్మకాన్ని వారిలో కలిగించే బాధ్యత మా ఆర్టిస్టులదే’’ అని అన్నారు. -
ఆస్పత్రిలో జాయిన్ అవుతున్నా: నటుడు
ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘‘కాస్త జ్వరంగా అనిపించడంతో కరోనా పరీక్ష చేయించుకున్నాను. పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ ఒక్క విషయంలోనే నేను పాజిటివ్‌గా ఉండకూడదు అనుకున్నాను. కానీ సాధ్యం కాలేదు. ఢిల్లీలోని ఓ హాస్పిటల్లో జాయిన్ అవుతున్నాను. కొద్ది రోజులుగా నాతో సన్నిహితంగా ఉన్నవారు దయచేసి కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని కోరుతున్నాను’’ అని పేర్కొన్నారు ఆశిష్. ‘చిరుత, అతిథి, అదుర్స్, పంతం, ఇస్మార్ట్ శంకర్’ వంటి సినిమాల్లో నటించిన ఆశిష్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. కేవలం తెలుగులోనే కాదు...తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో కూడ ఆశిష్ సినిమాలు చేశారు. చదవండి: ఆ హీరో దుస్తులకు దూరం -
హైదరాబాద్‌కు వచ్చినప్పుడు అది ఇష్టంగా తింటా’..
సోమాజిగూడ: ‘హైదరాబాద్ రాగానే నాలో తెలియని ఆనందం వస్తుంది. నెలలో 19 రోజులు సూట్‌కేసు జీవితమే.. తాజ్ కృష్ణలో మకాం. హైదరాబాద్‌లో నా ఇల్లు అదే’.. అంటూ చెప్పుకొచ్చారు ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం హోటల్ ది పార్కులో ‘లీడింగ్ టుమారో, ఫ్రమ్ టుడే’ అనే అంశంపై ముఖాముఖి ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆశిష్ విద్యార్థి మాటల్లోనే.. ‘‘జీవితంలో ఏదీ ఈజీగా రాదు. కష్టాన్ని మాత్రమే నమ్ముకోవాలి. అదే నేను పాటిస్తున్న సూత్రం. నేటి యువత కూడా అదే పాటించాలి. ఇప్పటిదాకా 11 భాషల్లో 230కి పైగా చిత్రాల్లో నటించా. అందులో చాలావరకు తెలుగు సినిమాలే. నేను పుట్టింది కేరళ, పెరిగింది ఢిల్లీ. నివాసం మాత్రం ముంబై. మా కుటుంబంలో నేను ఒక్కడినే మగ బిడ్డను. నాకూ ఒక్క కుమారుడే సంతానం. పుల్లారెడ్డి స్వీట్స్‌లో గవాపూరి అంటే చాలా ఇష్టం.హైదరాబాద్ షూటింగ్‌కు వచ్చినప్పుడు అది ఇష్టంగా తింటా’’ అంటూ ముగించారు. వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా.. సినిమాలతో ఎంతో బిజీగా ఉండే ఆశిష్ విద్యార్థి అందుకు భిన్నంగా తన అభిరుచి మేరకు వ్యక్తిత్వ వికాస నిపుణుడిగానూ సేవలందిస్తున్నారు. ప్రత్యేకంగా ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా విప్రో, ఓల్టాస్ వంటి ప్రముఖ సంస్థల్లోని ఉద్యోగులకు జీవితంలో ఎలా మసులుకోవాలి.. ఒడిదొడుకులను ఎలా ఎదుర్కోవాలో చెబుతున్నారు. అందులో భాగంగానే ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
గ్రామీణ నేపథ్యంలో...
ఆశిష్ గాంధీ. ఆశిమా నెర్వల్ జంటగా నటించిన చిత్రం ‘నాటకం’. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సాయిధీప్ చాట్ల, రాధికా శ్రీనివాస్, ప్రవీణ్ గాంధీ, ఉమా కూచిపూడి నిర్మించారు. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రమిది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ‘‘ఈ నెల 28న ‘నాటకం’ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కథే ప్రధానంగా ఈ చిత్రం సాగుతుంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: ‘గరుడవేగ’ ఫేమ్ అంజి, సంగీతం: సాయికార్తీక్. -
నాకేం తక్కువ? కొంచెం కలర్ తక్కువ...
ఉత్తమ విలన్ గౌరీ... ఇది ఆట కాదు. జీవితం. ఏదైనా సరే... నాకు ఓడిపోవడం ఇష్టం ఉండదు. అలాంటి నన్ను ఓడించాలని చూస్తావా? నాకేం తక్కువ? కొంచెం కలర్ తక్కువ. పవర్ ఉంటే... అన్నీ కొట్టుకుపోతాయి. అది నాకు ఉంది కదా! ‘గుడుంబా శంకర్’ సినిమాలో కుమారస్వామి నాయుడు డైలాగ్ ఇది. ఈ నాయుడు... ఆశిష్ విద్యార్థి. నిజమే... ఆశిష్ దగ్గర పవర్ ఉంది. అది పొలిటికల్ పవర్ కాదు. కరెన్సీకి సంబంధించిన పవర్ కాదు... కలేజా పవర్! ‘నన్ను సవాల్ చేసే పాత్ర రావాలి...దాన్ని నేను సవాలు చేయాలి’ అనుకునే పవర్. ప్రాంతీయ టీవీ ఛానెళ్లలో మొదట్లో మైనర్ రోల్స్ చేసిన ఆశిష్ పెద్ద విలన్‌గా ఎదగడానికి ఈ పవరే కారణం. ‘ఒరేయ్ ఆనంద్... బ్రిటిష్ వాళ్లు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్లిపోయారని ఓ... ఏడుస్తుంటారు మనవాళ్లంతా. దాని పేరేమిటి? కోహినూర్ వజ్రం. ఎవరు చెప్పారురా బ్రిటిష్ వాళ్లు పట్టుకెళ్లారని? అదిగో... రోడ్ల మీద తిరుగుతోంది కోహినూర్ డైమండ్....’ అందమైన ఆడపిల్ల శ్రుతిని ఇలా కవితాత్మకంగా టీజ్ చేయడమే కాదు... ఎన్ని దుర్మార్గాలు చేయాలో అన్ని దుర్మార్గాలూ చేస్తాడు ‘పోకిరి’ సినిమాలో ఇన్స్పెక్టర్ పశుపతి(ఆశిష్). ఈ పశుపతి అంటే అందాల శ్రుతికి మాత్రమే కాదు ఆమె తమ్ముడికి, అమ్మకీ భయమే. వీళ్ల సంగతి వదిలేయండి...పెద్ద పెద్ద గూండాలే ఇతనికి భయపడతారు. పనిగట్టుకొని దుర్మార్గాన్ని అదేపనిగా పండిస్తున్నట్లుగా ఉండదు ఆశిష్ విద్యార్థి నటన. సహజంగా ఉంటుంది. ఎంత సహజంగా అంటే... తెర మీద విలన్‌ను చూస్తున్నట్లుగా ఉండదు. నిజజీవితంలో ఎప్పుడో, ఎక్కడో ఒక దుర్మార్గుడిని చూసినట్లుగానే ఉంటుంది. అతనిలోని ‘చెడు’ను చూస్తున్నట్లుగానే ఉంటుంది. ‘ఆశిష్ విద్యార్థి మంచి నటుడు’ అనే పేరు ఒకే ఒక సినిమాతోనో, రెండో సినిమాతోనో రాలేదు. అదొక అందమైన ప్రయాణం. ‘నటుడు అనే వాడు ఎప్పటికప్పుడు సవాళ్ల కోసం ఎదురుచూడాల్సిందే’ అంటాడు ఆశిష్. ‘ద్రోహ్కాల్’లో ‘కామ్రేడ్ భద్రా’గా తన అద్భుత నటనతో ప్రేక్షకుల మెప్పును మాత్రమే కాదు... జాతీయ అవార్డ్‌ను కూడా అందుకున్నాడు ఆశిష్. ‘ఒక సంతృప్తికరమైన పాత్రను పోషించాను’ అని ఫుల్లుగా సంతృప్తి పడి ఎడాపెడా పాత్రలు చేసుకుంటూ పోలేదు. తనను సవాలు చేసే పాత్రల కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. కానీ అతడి నిరీక్షణ ఫలించలేదు. ‘సేమ్ కైండ్ ఆఫ్ రోల్స్’ అతడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఊపిరి పీల్చుకోవడానికి ముంబై విడిచి పారిపోవడం తప్ప వేరే మార్గం లేదు అనుకున్నాడు. ఈలోపు ఒక పెద్ద నటుడిని కలిసి తన మనసులో బాధను చెప్పుకున్నాడు. ‘‘చేసిన పాత్రలే చేసి బోర్ కొడుతోంది’’ అన్నాడు. ‘‘ఫరావాలేదు... మొదట బోర్ కొట్టినా... ఆ తరువాత అదే అలవాటైపోతుంది’’ అన్నాడు ఆ నటుడు. ఆయన సీరియస్‌గా అన్నాడో, నవ్వించడానికి అన్నాడోగానీ.... ఆశిష్‌కు బోర్ పాత్రలు అలవాటైపోలేదు. మరింత బోర్ కలిగించాయి. ‘ఈమాత్రం దానికేనా నేను సినిమాల్లో నటించేది!’ అనుకున్నాడు. తక్షణం ముంబాయి విడిచాడు. ఒక పాత కథ ముగియలేదు. ఒక కొత్త కథ మొదలైంది... ఆకలితో ఉన్న ఆశిష్‌కు దక్షిణాది సినీపరిశ్రమ కడుపు నిండిపోయే ఆతిథ్యాన్ని ఇచ్చింది. ఎలాంటి పాత్రలైతే చేయాలనుకున్నాడో అలాంటి పాత్రలు చేశాడు. ఒకదానితో ఒకటి సంబంధం లేని పాత్రలు. తృప్తితో కడుపు నిండే పాత్రలు. ‘బాబా’, ‘శ్రీరామ్’, ‘ఏకె-47’, ‘గుడుంబాశంకర్’, ‘నరసింహుడు’, ‘పోకిరి’, ‘చిరుత’, ‘అతిథి’, ‘తులసి’, ‘అలా మొదలైంది’, ‘కిక్-2’... మొదలైన సినిమాలు ఆశిష్‌కు మంచి గుర్తింపును ఇచ్చాయి. ‘‘సౌత్‌లో నేను పోషించిన పాత్రలు... నటుడిగా నన్ను నేను పునర్నిర్మించుకోవడానికి ఉపయోగపడ్డాయి’’ అంటాడు ఆశిష్ కృతజ్ఞత నిండిన కంఠంతో. -
రన్నింగ్ విలన్
సినిమా బాగా ఆడిందంటే మంచి రన్ ఉన్న సినిమా అంటారు. అంటే కథలో, కథనంలో, పాత్రల్లోస్టామినా ఉన్నట్టన్నమాట. ఆశీష్ విద్యార్థి మంచి రన్ ఉన్న విలన్. పేరులో స్టూడెంట్ ఉందని కన్ఫ్యూజ్ కావద్దు. డ్రామాల్లో గురువు. థియేటర్ నుంచి వచ్చాడు. థ్రిలింగ్‌గా అనిపిస్తాడు. ఆడియన్స్‌ని సినిమా థియేటర్‌కి పరుగెత్తిస్తాడు. మీ జీవితం గురించి తెలుసుకోవాలని ఉంది.. మా నాన్నగారు మలయాళీ. పేరు గోవింద్ విద్యార్థి. మలయాళ నాటకరంగంలో పరిచితమైన పేరు. అమ్మ బెంగాలీ. పేరు రెబా విద్యార్థి. ఫేమస్ కథక్ డాన్సర్. నేను ఢిల్లీలో పుట్టాను. అయితే మీది కళాకారుల కుటుంబమేనన్నమాట... కళాకారుల కుటుంబమేకాని ఎవరైనా ‘పెద్దయిన తర్వాత ఏమవ్వాలనుకుంటున్నావ్?’ అనడిగితే ఆర్టిస్ట్ కావాలనుకుంటున్నానని చెబితే నవ్వుతారేమోనని ‘మర్చంట్ నేవీ’లో చేరాలనుకుంటున్నానని చెప్పేవాణ్ణి. ఏం చదువుకున్నారు... ఢిల్లీ యూనివర్సిటీలో హిస్టరీలో ఆనర్స్ చేశాను. ఆ తర్వాత నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో యాక్టింగ్. అరవైకి పైగా నాటకాల్లో నటించాను. 1992లో ముంబయ్ వెళ్లాక టి.వి. చాన్సులు వచ్చాయి. అయితే పెద్ద తెర మీద కనిపించే అవకాశం కన్నడ సినిమా ఇచ్చింది. దాని పేరు ‘ఆనంద్’. హిందీలో ‘1942: ఎ లవ్‌స్టోరీ’ మొదటి సినిమా. 2000 సంవత్సరం వరకూ హిందీ సినిమాలకే పరిమితయ్యాను. తర్వాత దక్షిణాది చిత్రాలు చేయడం మొదలుపెట్టాను. గత పద్నాలుగేళ్లల్లో హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్, భోజ్‌పురి, బంగ్లా, మరాఠీ, బెంగాలీ, ఒరియా.. ఇలా మొత్తం పన్నెండు భాషల్లో మూడువందల సినిమాలకు పైగా చేశాను. కరడు గట్టిన విలన్‌గా చేసినా, కామెడీ విలన్‌గా కనిపించినా ఆదరిస్తున్నారు. అందుకే ఇలా ఇంటర్వ్యూలిచ్చే రేంజ్‌కి ఎదిగాను (నవ్వుతూ). నార్త్ అండ్ సౌత్.. ఈ షటిల్ సర్వీస్ సమస్య కాదా? ఒకప్పుడు ఉద్యోగం కోసం తిరిగేవాణ్ణి. ఇప్పుడు యాక్టింగ్ కోసం తిరుగుతున్నా. ఏ నటీనటులైనా ప్రయాణికులని నా ఫీలింగ్. వాళ్లకు భాషలు, సంప్రదాయాలతో సంబంధం లేదు. ఎటైనా వెళ్లొచ్చు. ఏ సంప్రదాయాన్నయినా ఆచరించవచ్చు. నేర్చుకుంటే ఏ భాష అయినా మాట్లాడొచ్చు. సో.. నార్త్ అండ్ సౌత్.. ఈ ప్రయాణం చాలా గమ్మత్తుగా, ఆనందంగా ఉంది. నటుడిగా మీ ప్రయాణం దాదాపు ‘నెగటివ్ కారెక్టర్స్’తోనే సాగుతోంది. బోర్ అనిపించడం లేదా? అఫ్కోర్స్ చేసిన పాత్రలే చేసినప్పుడు కొంచెం బోర్‌గానే ఉంటుంది. ఒక్కోసారి ‘మనమేం చేస్తున్నాం’ అని సందిగ్ధంలో పడిపోతుంటాను. జీవితాన్ని తీసుకుంటే మనం బాధపడే సంఘటనలు చాలా జరుగుతాయి. పట్టరాని కోపంతో రగిలిపోయే సందర్భాలూ ఉంటాయి. ఈ ప్రపంచంలో అన్ని కోరికలూ తీరి, సంతృప్తిగా ఉన్నవారిని చూపించగలరా? చేసే ఉద్యోగంలో కొన్ని అసంతృప్తులు ఉంటాయి. కానీ, ఆ అసంతృప్తి నా జీవితాన్ని డామినేట్ చేయలేదు. ఎందుకంటే ఒక్కో టీ స్పూన్ అసంతృప్తికి రెండు స్పూన్ల హ్యాపీనెస్‌ని కలిపి, సంతృప్తి పడతా. మీకెన్ని భాషలు వచ్చు.. తెలుగు అర్థమవుతుందా? హిందీ, బంగ్లా, ఇంగ్లిష్ బాగా వచ్చు. మిగతావి కొంచెం కొంచెం అర్థమవుతాయ్. మీరు తెలుగులో తిడితే అర్థం చేసేసుకుంటా(నవ్వుతూ). అందుకని నాతో పైకి నవ్వుతూ మట్లాడుతూనే తిట్టొద్దు, జోక్స్ వేయొద్దు. భాష తెలియనివాళ్లని జనరల్‌గా అలానే ఆడుకుంటాం కదా. నన్నలా ఆడుకోవద్దు. ఈ మధ్య ఓ యాడ్‌లో కూతుర్ని నమ్మే తండ్రిగా ఓ పాజిటివ్ షేడ్‌లో కనిపించారు... విలన్‌గా చూసిన మిమ్మల్ని పాజిటివ్‌గా చూడటం భలే అనిపించింది? ఈ మాట నాతో చాలామంది అన్నారు. నాక్కూడా పాజిటివ్ కారెక్టర్స్ చేయాలని ఉంది. ఈ ఇంటర్వ్యూ చదివే తెలుగు దర్శకులు నన్ను పాజిటివ్‌గా చూపించాలనుకుంటే నేను చాలా ఆనందపడతా. యాక్చువల్‌గా నేను ఆకలి మీద ఉన్నాను. వెరైటీ రోల్స్ కోసం ఎదురు చూస్తున్నా. పూరి (పూరి జగన్నాథ్) నాకు మంచి స్నేహితుడు. తనతో ‘ఏదైనా వెరైటీ రోల్ ఉంటే ఇవ్వండి’ అని అంటుంటాను. సురేందర్‌రెడ్డి కూడా వెరైటీ రోల్ ఇస్తానని ప్రామిస్ చేశాడు. నా మీద ఉన్న విలన్ ఇమేజ్‌కి వ్యతిరేకమైన పాత్రను ఏ దర్శకుడు ఇస్తారో చూడాలి. నేనైతే రెడీగా ఉన్నా. ఇప్పటివరకు మీరు చేసిన పాత్రల్లో మీకు బాగా నచ్చినవి? ‘గుడుంబా శంకర్’లో చేసిన కామెడీ విలన్ ఓ రిలీఫ్. ‘పోకిరి’ బాగా ఇష్టం. ఇంకా చాలా ఉన్నాయి. ‘పోకిరి’లో పూరి చూపించిన విధానం నాకిష్టం. అందుకే రెండు నెలలకోసారి ఆయన ఫోన్‌కి మెసేజ్‌లు పంపిస్తాను... మంచి పాత్రలివ్వమని. హీరోలకు అభిమానులుంటారు. కానీ విలన్లకు అభిమానులు ఉండకపోగా తిట్టేవాళ్లే ఎక్కువ... విలన్లకు అభిమానులు ఉంటారా? లేదా? అనేది పక్కన పెడదాం. అభిమానించకపోయినా గుర్తుపడతారు. ఎక్కడైనా కనిపిస్తే ఆప్యాయంగా పలకరిస్తారు. భాష కాని భాషలో, ఊరు కాని ఊరిలో గుర్తింపు అంటే చిన్న విషయం కాదు. ఓ నటుడిగా నాకది ఆనందంగా ఉంటుంది. ఆ సంగతి వదిలేస్తే, నాకెలా నచ్చితే అలా ఉండగలుగుతాను. హీరోలు స్వేచ్ఛగా తిరగలేరు. కానీ, నేను హాయిగా చిన్న చిన్న హోటల్స్‌కి వెళతాను. బస్సుల్లో, ట్రైన్స్‌లో వెళతాను. నా చుట్టూ జనాలు గుమిగూడరు. అలా స్వేచ్ఛగా ఉండటం ఓ ఆశీర్వాదమే కదా. ఏదో అలా అంటున్నారు కానీ, మీ దగ్గర కూడా ఆటోగ్రాఫ్స్ తీసుకునేవాళ్లుంటారు కదా? (నవ్వుతూ). అఫ్కోర్స్ ఉంటారు. అది కాదనలేను. మీది లవ్ మ్యారేజ్ అని విన్నాం? పీలు అనే వండర్ఫుల్ లేడీని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాను. మాకో అబ్బాయి ఉన్నాడు. వాడికి పద్నాలుగేళ్లు. పేరు అర్థ్ విద్యార్థి. నైన్త్ స్టాండర్డ్ చదువుతున్నాడు. పీలు మంచి సింగర్, నటి. ప్రస్తుతం ‘సుహానీ సే ఏక్ లడ్కీ’ అనే సీరియల్లో నటిస్తోంది. నేను పీలు అంటాను. కానీ, తన పేరు రాజోషీ విద్యార్థి. పీలు బహుముఖ ప్రజ్ఞాశాలి. మ్యూజికల్ క్లాసెస్ నడుపుతోంది. ‘విద్యార్థి సమ్మాన్’ పేరుతో మీరేదో అవార్డు ఇస్తుంటారట? మా నాన్నగారు గోవింద్ విద్యార్థి జ్ఞాపకార్థం ఈ అవార్డు ఇస్తున్నాం. ఓ నటుడిగా కామన్ పీపుల్‌తో గడిపే సమయం నాకుండదు. కామన్ పీపుల్ అభిమానాన్ని మాత్రం పొందగలిగాను. అందుకే ఆటోరిక్షా డ్రైవర్లు, ఇంటి పనులు చేసుకునేవాళ్లు.. ఇలా ఆర్డనరీ.. నా దృష్టిలో ఎక్స్ట్రార్డినరీ పీపుల్ని సత్కరించాలనే సంకల్పంతో 2007లో ఈ ‘విద్యార్థి సమ్మాన్’ని ప్రారంభించాను. ప్రతి ఏడాదీ కామన్ మ్యాన్‌కి నేను చేసే సెల్యూట్ ఇది. {Vేట్... మీ నాన్నగారి మీద మీకున్న ప్రేమాభిమానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. ఆయన గురించి చెబుతారా? నాన్నగారు మంచి ఫిలాసఫర్. ఫొటో జర్నలిస్ట్. ఆధ్యాత్మికవేత్త. రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. ఇండియన్స్ పీపుల్ థియేటర్ అసోసియేషన్ రూపకల్పనకు పాటుపడిన వ్యక్తి. జవహర్లాల్ నెహ్రూ మణిపూర్ డాన్స్ అకాడమీ, కథక్ కేంద్రకు డెరైక్టర్‌గా వ్యవహరించేవారు. అలాగే, సంగీత్ నాటక్ అకాడమీకి అసిస్టెంట్ సెక్రటరీగా చేశారు. ఆయన రిటైర్ అయ్యింది కూడా అప్పుడే. ఒక్క మాటలో చెప్పాలంటే ఇతరులు ఆదర్శంగా తీసుకోదగ్గ వ్యక్తి. నాన్నగారు చనిపోయి పదేళ్లవుతోంది. కానీ, ఆయన చేసిన మంచి పనుల ద్వారా బతికే ఉన్నారు. ఫైనల్‌గా పరభాషా నటులు.. ముఖ్యంగా పరభాషల విలన్లు తెలుగులో ఎక్కువయ్యారనే విమర్శ ఇక్కడ కొంతమంది చేస్తున్నారు..? నా దగ్గర ఎవరూ నేరుగా చెప్పలేదు. తెలుగు వాళ్లు హిందీలో, హిందీవాళ్లు తమిళ్, కన్నడ వాళ్లు తమిళ్లో ఎక్కడ మంచి అవకాశాలొస్తే అక్కడ చేస్తున్నారు. భాష అనేది కళాకారులకు సమస్యే కాదు. ఇప్పుడు తమిళ దర్శకులు హిందీలో ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు. పరభాషల నటులు తెలుగులో ఎక్కువయ్యారని ఎవరు అన్నారో నాకు తెలియదు. వాళ్లు ఏ సందర్భంలో అన్నారన్నది ముఖ్యం. అందరి అభిప్రాయాలను గౌరవించాలనుకునే తత్వం నాది. బేసిక్‌గా నేను చేసేది నెగటివ్ షేడ్స్ కారెక్టర్ అయినా నాదంతా పాజిటివ్ మైండ్ సైట్. థ్యాంక్స్, హాయ్, హలోలతో సాగించేస్తా. - డి.జి. భవాని ఆశీష్ జీ చాలా ఫ్రెండ్లీ... ఆశీష్జీ చాలా అద్భుతమైన నటుడు. అందుకే ‘పోకిరి’లో ఆయన కాంబినేషన్లో యాక్ట్ చేసేటప్పుడు నాకు చాలా ఒత్తిడి అనిపించేది. పైగా నాకది రెండో సినిమా. ‘దేవదాసు’ తర్వాత నేను వెంటనే అంగీకరించిన చిత్రమిది. పెద్దగా అనుభవం లేకపోవడం కొంచెం టెన్షన్ అనిపించేది. కానీ కెమెరా ముందు ఆశీష్జీ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. బాగా సహకరించేవారు. దాంతో నేను సులువుగా నటించగలిగేదాన్ని. కెమేరా వెనుక మేమిద్దరం పెద్దగా మాట్లాడుకునేవాళ్లం కాదు కానీ, ఆయన ప్రతిభ మీద నాకు అపారమైన గౌరవం ఉంది. అలాగే నేను సులువుగా నటించేలా చేసినందుకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. - ఇలియానా ఆశీష్ టాప్ టెన్ గుడుంబా శంకర్ పోకిరి చిరుత తులసి కంత్రి లక్ష్యం అలా మొదలైంది అదుర్స్ మిణుగురులు గోపాల...గోపాల -
ప్రముఖ నటుడికి తృటిలో తప్పిన ప్రమాదం
రాయ్‌పూర్: ప్రముఖ నటుడు ఆశీష్ విద్యార్థికి తృటిలో ప్రమాదం తప్పింది. బిలాయి సమీపంలో బాలీవుడ్ డైరీ చిత్రం షూటింగ్ జరుపుకోంటుంది. అందులోభాగంగా ఆశీష్ నదిలో నిలబడి ప్రార్థిస్తున్నట్లుగా నుంచున్నారు. ఆ సమయంలో నదిలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. దాంతో ఆశీష్ నీటిలో మునిగిపోతుండగా... అక్కడే ఉన్న పోలీసు కానిస్టేబుల్ వికాస్ సింగ్ వెంటనే అప్రమత్తమై నదిలోకి దూకారు.ఆశీష్ ను రక్షించి ఒడ్డుకు చేర్చారు. వెంటనే తేరుకున్న అశీష్ మాట్లాడుతూ... ఈ ఘటనతో కొంత భయాందోళనకు గురయైనట్లు ఆశీష్ చెప్పారు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు తీవ్ర జాగ్రత్తలు పాటించాలని ఆయన సహాచర నటీనటులకు సూచించారు. ఈ ప్రమాదం తనకు ఓ పాఠమని చెప్పారు.