KRK Tweet on Ashish Vidyarthi Gets Married Again to Rupali Barua at 60 - Sakshi
Sakshi News home page

Ashish Vidyarthi: కొంచెమైనా సిగ్గుండాలి.. ఆశిష్ విద్యార్థిపై పెళ్లిపై కేఆర్కే ట్వీట్

Published Thu, May 25 2023 7:09 PM | Last Updated on Thu, May 25 2023 7:46 PM

KRK Tweet On Ashish Vidyarthi gets married again with Rupali Barua at 60 - Sakshi

బాలీవుడ్ సినీ క్రిటిక్‌గా పాపులర్ అయిన కమల్ ఆర్ ఖాన్ (కేఆర‍్కే) పరిచయం అక్కర్లేని పేరు. తన సంచలన కామెంట్స్‌తో పాపులర్‌ అ‍య్యారు. సినీ తారలపై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు కేఆర్కే. బాలీవుడ్ వివాదస్పద సినీ క్రిటిక్‌గా పేరు సంపాదించుకున్నారు. అయితే తాజాగా సీనియర్ నటుడు ఆశిష్ విద్యార్థి పెళ్లిపై ట్వీట్ చేశారు. ఒకవైపు కంగ్రాట్స్ చెబుతూనే మరోవైపు.. కొంచెమైనా సిగ్గుండాలి భాయ్‌సాబ్ అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. అయితే ఈ ట్వీట్‌పై నెటిజన్స్ కేఆర్కేకు కౌంటరిస్తున్నారు. ఈ జంటను చూసి ఓర్వలేకపోతున్నావ్? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

(ఇది చదవండి: ఎంగేజ్‌మెంట్‌ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న పరిణీతి చోప్రా)

ఇవాళ ఆశిష్ విద్యార్థి గౌహాతికి చెందిన ఓ వ్యాపారవేత్త రూపాలి బరువాను కోల్‌కతాలో రెండో పెళ్లి చేసుకున్నారు. సన్నిహితులు, బంధువుల సమక్షంలో రిజిస్టర్ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుత వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. రూపాలికి కోల్‌కతాలో ఫ్యాషన్ స్టోర్స్ నిర్వహిస్తున్నారు. 

(ఇది చదవండి: 60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న 'పోకిరి' విలన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement