కేఆర్కే సంచలన నిర్ణయం.. అదే నా చివరి సినిమా అంటూ ట్వీట్..! | Cine Critic KRK Quit After Pathaan Movie Review Tweet Goes Viral | Sakshi
Sakshi News home page

KRK: వందశాతం చెబుతున్నా.. అదే నా చివరి సినిమా.!

Published Thu, Dec 29 2022 9:19 PM | Last Updated on Thu, Dec 29 2022 9:23 PM

Cine Critic KRK Quit After Pathaan Movie Review Tweet Goes Viral - Sakshi

కేఆర్కే బాలీవుడ్‌లో పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఎంత పెద్ద సినిమా అయినా సరే తన సంచలన రివ్యూలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఎందుకో తెలుసా? అతను ఇచ్చే ప్రతి రివ్యూ వివాదానికి దారి తీయడమే. బాలీవుడ్‌ సినీ విమర్శకుడిగా పేరొందిన ఆయన అసలు పేరు కమల్‌ ఆర్‌ ఖాన్‌. ఇండస్ట్రీలో కేఆర్కేగానే ఫేమస్ అయ్యారు. తాజాగా కేఆర్కే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సినిమా రివ్యూలు చేయనంటూ ట్వీట్ల చేశారు. షారూక్‌ ఖాన్, దీపికా పదుకొణె నటించిన మూవీ పఠాన్‌ రివ్యూ తన చివరిదని స్పష్టం చేశారు. 

దీంతో ఆయన ట్వీట్‌పై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే గతంలోనూ ఇలాంటి ప్రకటనలు చేసి వాటిని వెనక్కి తీసుకున్నారు. దీంతో ఆయన ట్వీట్‌పై వ్యంగ్యాస్రాలు సంధిస్తున్నారు. గతంలో ఆయన చేసిన ట్వీట్లను కామెంట్ల రూపంలో పోస్ట్‌ చేస్తున్నారు. పలు సినిమాల రివ్యూలు ఇచ్చిన కేఆర్కే ఎక్కువగా వివాదాల్లో నిలిచారు. కాగా కేఆర్కే హిందీ బిగ్‌బాస్‌-3లో పాల్గొన్నారు. పలు హిందీ సినిమాల్లో నటించినా ఆయనకు అంతగా గుర్తింపు రాలేదు. అయితే నటీనటులపై తరచూ  వివాదస్పద వ్యాఖ్యలతో కేఆర్కే వెలుగులోకి వచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement