KRK
-
బరిలో బాలీవుడ్ నటుడి సోదరుడు.. ఫస్ట్ ఫేజ్‌లో ఈయనే రిచ్!
Lok Sabha Elections 2024: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలకు ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్పూర్ నియోజకవర్గం నుంచి మాజిద్ అలీని బహుజన సమాజ్ పార్టీ (BSP) అభ్యర్థిగా నిలిపింది. కేఆర్కేగా పిలిచే బాలీవుడ్ నటుడు, నిర్మాత కమాల్ ఆర్ ఖాన్ సోదరుడే మాజిద్ అలీ. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఏప్రిల్ 19న తొలి దశలో పోలింగ్ జరగనున్న ఉత్తరప్రదేశ్‌లోని ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులందరిలో మాజిద్ అలీ అత్యంత ధనవంతుడు. ఆయన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. అలీ మొత్తం ఆస్తులు సుమారు రూ. 160 కోట్లుగా ప్రకటించారు. మాజిద్ అలీకి రియల్ ఎస్టేట్, మైనింగ్, క్వారీయింగ్, ఆహార ఉత్పత్తులు, దుస్తుల వ్యాపారాలు ఉన్నాయి. అవిసెన్నా స్టోన్స్ అండ్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్, తోదర్పూర్ అగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మజిద్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోర్విజన్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటివి ఆయన నిర్వహిస్తున్న కొన్ని కంపెనీలు. మాజిద్ అలీ లోక్‌సభకు పోటీ చేయడం ఇదే తొలిసారి కాగా, ఆయన రాజకీయాలకు కొత్తేమీ కాదు. 2009లో బీఎస్పీతో రాజకీయ ప్రయాణం ప్రారంభించిన ఆయన 2016లో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. 2017లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో దేవ్‌బంద్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2021లో ఆజాద్ సమాజ్ పార్టీలో చేరి వెంటనే తిరిగి బీఎస్పీకి వచ్చేశారు. -
KRK Arrest: వివాదాస్పద సినీ క్రిటిక్ అరెస్ట్.. ఆ స్టార్ హీరోపై తీవ్ర ఆరోపణలు!
కమల్ రషీద్ ఖాన్ అంటే ఎవరు గుర్తుపట్టరేమో కానీ.. కేఆర్కే అంటే వెంటనే కనిపెట్టేస్తారు. అంతలా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు. స్టార్ హీరోల సినిమాలపై నెగెటివ్ రివ్యూలు ఇస్తూ హల్ చల్ చేసేవారిలో కేఆర్కే ఒకరు. ఇటీవల డంకీ, సలార్ చిత్రాలపై తనదైన శైలిలో రివ్యూలు ఇచ్చేశాడు. సినిమా ఏదైనా సరే బాగాలేదు, డిజాస్టర్ అనే పదాలు ఎక్కువగా వినియోగించే వారిలో కేఆర్కేను మించినవారు ఉండరు. అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నామని అనుకుంటున్నారా? అసలే జరిగిందో ఓ లుక్కేద్దాం. (ఇది చదవండి: Alia-Ranbir: ముద్దుల కూతురిని పరిచయం చేసిన స్టార్ కపుల్!) కేఆర్కే అసలు పేరు కమల్ రషీద్ ఖాన్ కాగా.. తాజాగా ఆయను ముంబై విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తన అభిమానులకు తెలియజేశాడు. నేను జైల్లో చనిపోతే అది హత్యగా భావించాలంటూ ట్విట్టర్లో పేర్కొన్నాడు. అతను ట్వీట్లో రాస్తూ.. "నేను గత ఏడాది కాలంగా ముంబైలో ఉన్నా. నా అన్ని కోర్టు కేసులకు క్రమం తప్పకుండా హాజరవుతున్నా. ఈ రోజు నేను కొత్త సంవత్సరం వేడుకల కోసం దుబాయ్‌కి వెళ్తున్నా. కానీ ముంబై పోలీసులు నన్ను విమానాశ్రయంలో అరెస్టు చేశారు. పోలీసుల దృష్టిలో నేను మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నా. ఇది 2016లో జరిగిన ఒక కేసు. నా వల్లే తన సినిమా టైగర్-3 ఫ్లాప్ అయిందని సల్మాన్ ఖాన్ చెబుతున్నాడు. నేను ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్లోనో, జైల్లోనో చనిపోతే అది హత్యగా మీరందరు భావించాలి. దీనికి బాధ్యులు ఎవరో మీ అందరికీ తెలుసు. " అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం కేఆర్కే పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. గతేడాది తన అరెస్ట్‌కు, సల్మాన్ ఖాన్‌కు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. సల్మాన్ ఖాన్ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు నన్ను క్షమించండి అంటూ పోస్ట్ చేశారు. తాజా అరెస్ట్‌తో మళ్లీ సల్మాన్‌పై ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. (ఇది చదవండి: ప్రియుడికి స్పెషల్ విషెస్ చెప్పిన 'సరైనోడు' భామ.. పోస్ట్ వైరల్!) గతేడాది ఆగస్ట్ 30న దుబాయ్ నుంచి ముంబైకి వచ్చినప్పుడు కూడా అరెస్టు చేశారు. తన వివాదాస్పద సోషల్ మీడియా పోస్ట్‌లపై 2020లో నమోదైన కేసులో అదుపులోకి తీసుకున్నారు. గతంలో దివంగత ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్‌లపై చేసిన ట్వీట్లపై యువసేన నాయకుడు రాహుల్ కనాల్ 2020 ఏప్రిల్ 30న ఫిర్యాదు చేశాడు. I am in Mumbai for last one year. And I am attending my all court dates regularly. Today I was going to Dubai for new year. But Mumbai police arrested me at the airport. According to police, I am wanted in a 2016 case. Salman khan is saying that his film #Tiger3 is flop because… — KRK (@kamaalrkhan) December 25, 2023 -
కంగ్రాట్స్.. కొంచెమైనా సిగ్గుండాలి.. ఆశిష్ విద్యార్థిపై కేఆర్కే ట్వీట్ వైరల్
బాలీవుడ్ సినీ క్రిటిక్‌గా పాపులర్ అయిన కమల్ ఆర్ ఖాన్ (కేఆర్కే) పరిచయం అక్కర్లేని పేరు. తన సంచలన కామెంట్స్‌తో పాపులర్ అయ్యారు. సినీ తారలపై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు కేఆర్కే. బాలీవుడ్ వివాదస్పద సినీ క్రిటిక్‌గా పేరు సంపాదించుకున్నారు. అయితే తాజాగా సీనియర్ నటుడు ఆశిష్ విద్యార్థి పెళ్లిపై ట్వీట్ చేశారు. ఒకవైపు కంగ్రాట్స్ చెబుతూనే మరోవైపు.. కొంచెమైనా సిగ్గుండాలి భాయ్‌సాబ్ అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. అయితే ఈ ట్వీట్‌పై నెటిజన్స్ కేఆర్కేకు కౌంటరిస్తున్నారు. ఈ జంటను చూసి ఓర్వలేకపోతున్నావ్? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. (ఇది చదవండి: ఎంగేజ్మెంట్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న పరిణీతి చోప్రా) ఇవాళ ఆశిష్ విద్యార్థి గౌహాతికి చెందిన ఓ వ్యాపారవేత్త రూపాలి బరువాను కోల్‌కతాలో రెండో పెళ్లి చేసుకున్నారు. సన్నిహితులు, బంధువుల సమక్షంలో రిజిస్టర్ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుత వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. రూపాలికి కోల్‌కతాలో ఫ్యాషన్ స్టోర్స్ నిర్వహిస్తున్నారు. (ఇది చదవండి: 60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న 'పోకిరి' విలన్) Congratulations to 60 years old actor Ashish Vidyarthi who got married second time. Kucch to Sharam Kar lete Bhaisaab! pic.twitter.com/15cOyRYQd1 — KRK (@kamaalrkhan) May 25, 2023 -
'నీ బాయ్‌ఫ్రెండ్‌కి పట్టిన గతే నీకూ పడుతుంది'.. రష్మికపై దారుణమైన ట్వీట్
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం టాప్ హీరోయిన్గా వెలిగిపోతుంది. సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఆమె నటించిన మిషన్ మజ్ను, వారీసు చిత్రాలు రిలజ్కు రెడీగా ఉన్నాయి. ఇక సినిమాలతో పాటు వివాదాలతోనూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్న రష్మికపై బాలీవుడ్ క్రిటిక్ కేఆర్కే దారుణమైన కామెంట్స్ చేశాడు. `మేడమ్ రష్మిక జీ.. మా హిందీ ప్రేక్షకులు మీ బాయ్‌ఫ్రెండ్ అనకొండ సినిమా లైగర్‌ను రిజెక్ట్ చేసి అతన్ని బాలీవుడ్ నుంచి ఎలాగైతే తరిమికొట్టారో.. సరిగ్గా నీకు కూడా అలాగే చేయబోతున్నాం. కానీ మిమ్మల్ని భోజ్‌పురి చిత్రాల్లో చూడటం మాకు ఆనందంగా ఉంటుంది` అంటూ రష్మికను కించపరిచే విధంగా కేఆర్కే ట్వీట్ చేశాడు. దీంతో అతడి ట్వీట్‌పై అటు రష్మిక ఫ్యాన్స్, ఇటు విజయ్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ముందు నీ సంగతి చూసుకో, తర్వాత మిగతా వారి గురించి కామెంట్స్ చేద్దువు గానీ అంటూ కేఆర్కేపై మండిపడుతున్నారు ఫ్యాన్స్. Madam @iamRashmika Ji hope you know, what we Hindi audiences did with your boyfriend Anakonda film #Liger and throw him out of Bollywood. Exactly same, we are going to do with you. But we will be happy to watch you in Bhojpuri films. — KRK (@kamaalrkhan) January 9, 2023 Those all the people should do checkup of their eyes, who call @iamRashmika a national crush. Rashmika should do films with #RaviKishan #Nirahua #PawanSingh #KhesariLal etc if she wants to rock.🤪😁 — KRK (@kamaalrkhan) January 9, 2023 -
బాద్షా ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. పఠాన్ మువీ వాయిదా..!
కేఆర్కే (కమల్ ఆర్ ఖాన్) బాలీవుడ్లో పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఎంత పెద్ద సినిమా అయినా సరే తన సంచలన రివ్యూలతో వార్తల్లో నిలుస్తుంటారు. అతను ఇచ్చే ప్రతి రివ్యూ వివాదానికి దారి తీసేలా ఉంటాయి. బాలీవుడ్ సినీ విమర్శకుడిగా పేరొందిన ఆయన అసలు పేరు కమల్ ఆర్ ఖాన్. ఇండస్ట్రీలో కేఆర్కేగానే ఫేమస్ అందరికీ తెలుసు. తాజాగా కేఆర్కే షారూఖ్ ఖాన్ మూవీ పఠాన్‌పై ఆసక్తకర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఆ సినిమాలోని బేషరాం రంగ్ తీవ్ర వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేఆర్కే మరోసారి వార్తలో నిలిచారు. ఇకపై షారూక్ సినిమా టైటిల్ పఠాన్, 'బేషరం రంగ్' సాంగ్ కనిపించవంటూ కామెంట్స్ చేశారు. పఠాన్ మూవీ కూడా వాయిదా వేస్తారని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ బీ-టౌన్లో హాట్ టాపిక్‌గా మారింది. కానీ అంతకుముందే షారూక్ ఖాన్, దీపికా పదుకొణె నటించిన మూవీ పఠాన్ రివ్యూ తన చివరిదని స్పష్టం చేశారు. కేఆర్కే ట్వీట్ చేస్తూ.. 'పఠాన్ టైటిల్ ఇక ఉండదు. అలాగే ఆరెంజ్ బికినీ కూడా ఇందులో కనిపించదు. ప్రస్తుతం ఈ సినిమా విడుదలను వాయిదా వేయాలని నిర్మాతలు నిర్ణయించారు. ఈరోజు లేదా రేపు అధికారిక ప్రకటన రావొచ్చు.' అంటూ పోస్ట్ చేశారు. మరి దీనిపై చిత్రబృందం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. It’s confirm that #Pathaan title is no more. Orange bikini is also no more. But now makers have decided to postpone the release of the film. Official announcement can come today or tomorrow. — KRK (@kamaalrkhan) January 3, 2023 -
కేఆర్కే సంచలన నిర్ణయం.. అదే నా చివరి సినిమా అంటూ ట్వీట్..!
కేఆర్కే బాలీవుడ్లో పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఎంత పెద్ద సినిమా అయినా సరే తన సంచలన రివ్యూలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఎందుకో తెలుసా? అతను ఇచ్చే ప్రతి రివ్యూ వివాదానికి దారి తీయడమే. బాలీవుడ్ సినీ విమర్శకుడిగా పేరొందిన ఆయన అసలు పేరు కమల్ ఆర్ ఖాన్. ఇండస్ట్రీలో కేఆర్కేగానే ఫేమస్ అయ్యారు. తాజాగా కేఆర్కే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సినిమా రివ్యూలు చేయనంటూ ట్వీట్ల చేశారు. షారూక్ ఖాన్, దీపికా పదుకొణె నటించిన మూవీ పఠాన్ రివ్యూ తన చివరిదని స్పష్టం చేశారు. దీంతో ఆయన ట్వీట్‌పై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే గతంలోనూ ఇలాంటి ప్రకటనలు చేసి వాటిని వెనక్కి తీసుకున్నారు. దీంతో ఆయన ట్వీట్‌పై వ్యంగ్యాస్రాలు సంధిస్తున్నారు. గతంలో ఆయన చేసిన ట్వీట్లను కామెంట్ల రూపంలో పోస్ట్ చేస్తున్నారు. పలు సినిమాల రివ్యూలు ఇచ్చిన కేఆర్కే ఎక్కువగా వివాదాల్లో నిలిచారు. కాగా కేఆర్కే హిందీ బిగ్‌బాస్-3లో పాల్గొన్నారు. పలు హిందీ సినిమాల్లో నటించినా ఆయనకు అంతగా గుర్తింపు రాలేదు. అయితే నటీనటులపై తరచూ వివాదస్పద వ్యాఖ్యలతో కేఆర్కే వెలుగులోకి వచ్చారు. Dear friends, it’s 100% final. I will review last film #Pathaan! Thank you all for supporting me for so many years. Love you all.❤️🌹🙏 — KRK (@kamaalrkhan) December 29, 2022 -
''బ్రహ్మస్త్ర నష్టాలతో కరణ్ జోహార్ ఆత్మహత్యకు ప్రయత్నించాడు''
బాలీవుడ్ సినీ క్రిటిక్‌గా పాపులర్ అయిన కమల్ ఆర్ ఖాన్ (కేఆర్కే) కరణ్ జోహార్‌పై సంచలన కామెంట్స్ చేశారు.ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కేఆర్కే మరోసారి సంచలనాత్మక ట్వీట్ చేశాడు. బ్రహ్మాస్త్ర తో భారీ నష్టాలను చవిచూసిన కరణ్‌జోహార్ ఆత్మహత్యకు ప్రయత్నించాడంటూ బాంబ్ పేల్చాడు. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్ర చిత్రాన్ని స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ నిర్మించాయి. ''ఈ సినిమా ఫలితం, నష్టాలను చూసి కరణ్‌కు దిమ్మతిరిగిపోయింది. దీంతో డిప్రెషన్‌తో ఇంట్లోనే ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తనకు సమాచారం ఉందని కేఆర్కే ఆరోపించాడు. ఆ తర్వాత ముఖేష్ అంబానీ అతనికి రూ. 300 కోట్లు అప్పుగా ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నాడు. అయితే బ్రహ్మాస్త్ర కారణంగా దివాళా తీసినట్లు కరణ్ ఎందుకు ప్రపంచానికి చెప్పట్లేదు'' అంటూ కేఆర్కే ప్రశ్నించాడు. కాగా గతంలో బ్రహ్మాస్త్ర బాక్సాఫీస్ లెక్కలు తప్పిచూపించారని ఆరోపించిన కేఆర్కే ఇప్పుడు కరణ్ ఆత్మహత్యకు ప్రయత్నించాడని కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కేఆర్కే చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. According to sources, Sometimes ago, Karan Johar made a drama at his home for suicide coz of huge loss of #Brahmastra! Then Mukesh Ambani gave him ₹300Cr loan. Now Question is this, why Karan doesn’t tell to world clearly that he has become bankrupt coz of disaster #Brahmastra — KRK (@kamaalrkhan) December 2, 2022 -
కంగ్రాట్స్.. పెళ్లైన ఏడు నెలలకే.. అలియా భట్ దంపతులపై కేఆర్కే సంచలన ట్వీట్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, రణ్‌బీర్ కపూర్ దంపతులకు పాప జన్మించిన విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆలియా ఆడ బిడ్డకి జన్మనిచ్చింది. కొన్నాళ్లుగా డేటింగ్లో ఉన్న రణ్‌బీర్ కపూర్-అలియా 2022 ఏప్రిల్ 14న వివాహం చేసుకున్నారు.పెళ్లైన రెండు నెలలకే ప్రెగ్నెన్సీని కన్ఫార్మ్ చేశారు. పాపకు జన్మనివ్వడంతో కపూర్ కుటుంబంలో సంతోషంలో మునిగిపోయింది. మరోవైపు పలువురు బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. (చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆలియా) కానీ వివాదస్పద రివ్యూలతో ఎప్పుడు వార్తల్లో నిలిచే బాలీవుడ్ క్రిటిక్, ట్రేడ్ అనలిస్ట్ కేఆర్కే అలియా భట్-రణ్‌బీర్ కపూర్‌కు శుభాకాంక్షలు చెప్పారు. కానీ ఎప్పటిలాగే వివాదస్పద రీతిలో ట్వీట్ చేశారు. పెళ్లయిన ఏడు నెలలకే తల్లిదండ్రులైనందుకు అలియా భట్-రణ్‌బీర్ కపూర్‌కు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. నీకు కూడ కూతురు ఉంది కదా.. వ్యక్తిగతంగా అలా ఎలా మాట్లాడుతారని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మీకు నెగెటివ్ కామెంట్స్ చేయడం తప్ప.. పాజిటివ్‌గా మీరు ఆలోచించరా అని కౌంటరిస్తున్నారు. దీనిపై స్పందించిన కేఆర్కే.. 'ఎందుకు మీరంతా నాకు చెబుతున్నారు..దేశంలో లక్షల మంది ఏడు నెలలకే పుట్టినవాళ్లు ఉన్నారు. ఇలాంటి ప్రీ మెచ్యూర్ బర్త్ సర్వ సాధారణం అంటూ' తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. Congratulations to #RanbirKapoor and #AliaBhatt for becoming proud parents of a beautiful daughter within 7months.👏🎉💃 — KRK (@kamaalrkhan) November 6, 2022 -
బ్రహ్మస్త్రపై కేఆర్కే సంచలన కామెంట్స్.. ఇదొక పెద్ద..!
బాలీవుడ్ సినీ క్రిటిక్‌గా పాపులర్ అయిన కమల్ ఆర్ ఖాన్ (కేఆర్కే) బ్రహ్మాస్త్రపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల విడుదలైన రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ మూవీని తనదైన శైలిలో విమర్శించారు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కేఆర్కే మరోసారి సంచలనాత్మక ప్రకటన చేశారు. బ్రహ్మస్త్ర ఒక పెద్ద డిజాస్టర్ అని బాంబు పేల్చారు. ఈ వ్యాఖ్యలకు తనను నిందించవద్దని నిర్మాత కరణ్ జోహార్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. మరోసారి సంచలన వ్యాఖ్యలతో ఒక్కసారిగా బాలీవుడ్‌ను షేక్ చేశారాయన. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఓ పెద్ద ఫెయిల్యూర్ అని అభివర్ణించారు. బాలీవుడ్లో ఇతర సినిమాల్లాగే ఇది కూడా పెద్ద వైఫల్యమని చిత్రబృందానికి దిమ్మతిరిగే షాకిచ్చారు. కేఆర్కే సోషల్ మీడియాలో స్పందిస్తూ ' అలియా భట్, రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర చిత్రాన్ని నేను సమీక్ష చేయలేదు, అయినప్పటికీ ప్రజలు సినిమా చూసేందుకు థియేటర్లకు వెళ్లలేదు. అందుకే ఇదొక పెద్ద డిజాస్టర్. ఇతర బాలీవుడ్ నిర్మాతల్లాగే కరణ్ జోహార్ తన వైఫల్యానికి నన్ను నిందించరని ఆశిస్తున్నా" అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. I didn’t review film #Brahmastra still people didn’t go to theatres to watch it. So it has become a disaster. Hope @karanjohar won’t blame me for the failure like many other Bollywood people. — KRK (@kamaalrkhan) September 16, 2022 కాగా కేఆర్కే హిందీ బిగ్‌బాస్-3లో పాల్గొన్నారు. పలు హిందీ సినిమాల్లో నటించినా ఆయనకు అంతగా గుర్తింపు రాలేదు. అయితే నటీనటులపై తరచూ వివాదస్పద వ్యాఖ్యలతో ఆయన తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. బాలీవుడ్ నటులైన సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్, అమిర్ ఖాన్, షారుక్ ఖాన్ల మీద ఎప్పుడూ విమర్శలు చేస్తూ పాపులారిటీ దక్కించుకున్నారు. బాలీవుడ్ స్టార్స్‌పై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించే కేఆర్కే చుట్టూ నిత్యం వివాదాలు అల్లుకునే ఉంటాయి. 2020లోఆయన చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది. దీంతో కమల్ ఆర్ ఖాన్ (కేఆర్కే)ను గతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. -
హీరోయిన్‌కు సడెన్‌గా ముద్దు పెట్టిన హీరో.. వీడియో వైరల్
Varun Dhawan Kisses Kiara Advani And KRK Trolls: తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్. వరుసగా ప్రేమ కథా, కుటుంబ కథా చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవల వరుణ్ ధావన్ నటించిన చిత్రం 'జుగ్ జుగ్ జీయో'. జూన్ 24న విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అనిల్ కపూర్, నీతూ కపూర్ సైతం కలిసి యాక్ట్ చేసిన ఈ మూవీ ఇప్పటికే రూ. 100 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించినట్లు సమాచారం. అయితే ఈ మూవీలో వరుణ్‌కు జోడీగా కియారా అద్వాణీ నటించింది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఒక మేగజైన్ కవర్ ఫొటో కోసం ఫోజులిచ్చారు. ఈ ఫొటో షూట్లో వరుణ్, కియారా ఇద్దరు కౌగిలించుకుని స్టిల్స్ ఇస్తున్నారు. ఇదే సమయంలో హఠాత్తుగా కియారా బుగ్గపై వరుణ్ ధావన్ ముద్దు పెడతాడు. ఈ అనుకోని పరిణామానికి షాక్ అయి వరుణ్‌ను పక్కకు నెడుతుంది కియారా. ఈ ఫొటో షూట్ వీడియోను బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్‌గా చెప్పుకునే కమాల్ ఆర్ ఖాన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోకు 'షూటింగ్ సమయంలో కంట్రోల్ చేసుకోకపోతే ఇలాంటివే జరుగుతాయి' అని రాసుకొచ్చాడు కూడా. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవగా.. 'ఇలా అయితే కష్టం గురూ' అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చదవండి: భార్యతో అబద్ధాలు చెప్పకపోతే ఇన్ని కాపురాలు ఉంటాయా: డైరెక్టర్ నాపై విష ప్రచారం, బాధగా ఉంది.. అమీర్ ఖాన్ ఆవేదన బికినీ దుస్తుల్లో వేదిక రచ్చ.. సినిమా అవకాశాల కోసమేనా? Jab Aadmi shoot Karte Huwe Mood Main Aa Jata Hai Toh Kuch Aisa Ho Jata Hai. pic.twitter.com/3SzXU6M5WR — KRKBOXOFFICE (@KRKBoxOffice) August 1, 2022 -
బాహుబలిని మించిన సినిమా తీస్తా: కమల్ ఆర్ ఖాన్
Kamla R Khan Comments On Baahubali: బాలీవుడ్ సినీ విమర్శకుడిగా గుర్తింపు పొందిన కమల్ ఆర్ ఖాన్ తరచూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. తన యూట్యూబ్ చానల్లో ద్వారా నటీనటులు, సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వీడియోలు షేర్ చేస్తుంటాడు. ఇటీవల పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్, ఈ మూవీ డైరెక్టర్ జక్కన్నపై షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత చెత్త సినిమా తీసినందుకు డైరెక్టర్ రాజమౌళిని జైలులో పెట్టాలని కేఆర్కే తీవ్ర విమర్శలు గుప్పించాడు. చదవండి: ‘శాకుంతలం’ డబ్బింగ్ కోసం 3 నెలలు శిక్షణ తీసుకున్న సామ్ తాజాగా అతడు రాజమౌళి మరో పాన్ ఇండియా చిత్రం బాహుబలిపై స్పందించాడు. బాహుబలి మూవీ కేవలం తెలుగులోనే కాదు ప్రపంచ సినిమాలోనే ఎలాంటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో రాజమౌళి, ప్రభాస్‌తో పాటు ఎంతోమంది నటీనటులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అయితే ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు పొందిన బాహుబలి చిత్రాన్ని మించిన సినిమా తీస్తానంటూ కేఆర్కే సవాలు చేశాడు. దేశ్‌ద్రోహీ మూవీ సీక్వెల్‌ను ప్రకటిస్తూ దీన్ని బాహుబలిని మిచంఇన బడ్జెట్‌తో తెరకెక్కిస్తానని పేర్కొన్నాడు. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలేంటో లుక్కేయండి! దీంతో అతడి కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. అతడి తీరుపై ప్రభాస్, జక్కన్న ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తాము మరో మహమ్మారిని ఎదుర్కొలేమని, నాలుగో వేవ్‌ను చూడలేమంటూ అతడి ట్వీట్‌పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా 2008లో కేఆర్కే హీరోగా నటించిన చిత్రమే ‘దేశద్రోహి’. ఈ సినిమాపై, ఇందులో కేఆర్కే నటనపై ఇప్పటికీ ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. అయితే ఇన్నాళ్ల తర్వాత దేశద్రోహి పార్ట్ 2 తెరకెక్కించేందుకు కేఆర్కే సిద్ధమయ్యాడు. అది కూడా బాహుబలిని మించేలా తెరకెక్కిస్తానని, ఇది చూసి బాలీవుడ్ వారు సినిమా ఎలా తీయాలో నేర్చుకోవాలి అంటూ మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు కేఆర్కే. Shooting is going to start soon! pic.twitter.com/WEXxe5MkRB — KRK (@kamaalrkhan) April 18, 2022 -
రిచా దావా: కేఆర్కే న్యాయవాది వివరణ
ముంబై: లైంగిక ఆరోపణలు నేపథ్యంలో నటి రిచా చద్ధాపై వివాస్పద వ్యాఖ్యలు చేసినందుకు నటి పాయల్ ఘోష్ బహిరంగంగా క్షమాపణలు కోరారు. ముంబై హైకోర్టు పాయల్ క్షమాపణ అంగీకరించి ఇకపై రిచాకు వ్యతిరేకంగా ఏ వ్యక్తి కూడా నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా మధ్యంతర ఉత్తర్వును జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఉత్తర్వులు ఏబీఎన్‌కు, వివాదాస్పద నటుడు కమల్ రషిద్ ఖాన్ అలియాస్ కేఆర్కేను ఉద్దేశిస్తూ జారీ చేసింది. అంతేగాక దీనిపై ఏబీఎన్, కమల్ రషీద్‌లు వివరణ ఇవ్వాలని నాలుగు వారాల గుడువు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో బుధవారం కమల్ తరపు న్యాయవాది బుధవారం స్పందించారు. ‘రిచాపై పరువు నష్టం కలిగించేలా బహిరంగంగా ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయరని స్పష్టం చేశారు. త్వరలోనే ఆయన దీనిపై బహిరంగ ప్రకటన కూడా చేయనున్నట్లు వెల్లండించారు. (చదవండి: రిచాను క్షమాపణలు కోరిన పాయల్) దర్శకుడు అనురాగ్ కశ్యప్ లైంగికంగా ఇబ్బందులకు గురి చేశాడంటూ నటి పాయల్ ఘోష్ గత నెలలో ఆరోపించిన విషయం తెలిసిందే. ఆరోపణల నేపథ్యంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. రిచా చద్ధాతో పాటు మరో ఇద్దరూ నటీనటులపై అవమానకర వ్యాఖ్యలు చేశారు. దీంతో చద్ధా, పాయల్‌పై పరువు నష్టం దావా వేస్తూ నోటీసుల జారీ చేశారు. దీంతో గత వారం పాయల్ ముంబై కోర్టులో బహిరంగంగా తను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని, బేషరతుగా రిచాను క్షమాపణలు కోరుతున్నానని పేర్కొన్నారు. పాయల్ క్షమాపణలు చెప్పడంతో వివాదం ముగిసిందంటూ చద్ధా బుధవారం ట్వీట్ చేశారు. (చదవండి: నా పేరెందుకు వాడారు?: నటి) -
అక్షయ్ సినిమాను బాయ్‌కాట్ చేయాలి: కేఆర్కే
ముంబై: తరచూ సహా నటులు, సినిమాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూంటాడు ప్రముఖ బాలీవుడ్ నటుడు, సినీ విమర్శకుడు కమల్ రషిద్ ఖాన్ అలియాస్ కేఆర్కే. తాజాగా అతడు బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్‌ను టార్గెట్ చేశాడు. అక్షయ్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం టైటిల్ ‘లక్ష్మీ బాంబ్’.. హిందువుల ఆరాధ్య దేవత లక్ష్మీదేవిని అపహాస్యం చేసేల ఉందని, ఈ సిమాను తప్పనిసరిగా బహిష్కరించాలని కేఆర్కే మంగళవారం ట్విటర్ వేదికగా పిలుపునిచ్చాడు. (చదవండి: ఒక లక్ష్మి.. ఇంకొక లక్ష్మికి ప్రశంస) 🙏 #Laxami is a Goddess, Devi and #AkshayKumar is mocking her by his film #LaxmiBomb! Public must boycott it to teach him a lesson, So that he doesn’t do such a big blunder in the future. It’s India not Canada. Yahan Devi Devtaon Ki puja Ki Jati Hai Mazaak Nahi Banaya Jata! — KRK (@kamaalrkhan) October 12, 2020 కమల్ రషీద్ ట్వీట్ చేస్తూ.. ‘లక్ష్మీ అంటే భారతీయులు అత్యంత పవిత్రంగా కొలిచే ఆరాధ్య దేవత. కానీ అక్షయ్.. తన తాజా చిత్రం ‘లక్ష్మీ బాంబ్’ పేరుతో దేవిని ఎగతాళి చేస్తున్నాడు. వెంటనే ఈ సిమాను బాయ్‌కాట్ చేయాలి. ఈ సినిమాను బహిష్కరించడం ద్వారా భవిష్యత్తులో ఇటువంటి తప్పులు పునరావృతం కావు. ఇది భారతదేశం.. కెనడా కాదు. ఇక్కడ దేవతలను ఆరాధిస్తారు కానీ.. అపహాస్యం చేయరు’ అంటూ కేఆర్కే తన ట్వీట్లో రాసుకొచ్చాడు. అక్షయ్ కుమార్, కియారా అద్వానీ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ చిత్రానికి లాఘవ లారెన్స్ దర్శకుడిగా వ్వవహరిస్తున్నాడు. దక్షిణాన బ్లక్‌బస్టర్‌గా నిలిచిన ‘కాంచన’ మూవీని హిందీలో ‘లక్ష్మీ బాంబ్’ పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా దీపావళి కానుకగా విడుదల కానుంది. (చదవండి: కామెడీతో నవ్విస్తూనే భయపెట్టేశాడు..) -
సూసైడ్ చేసుకుంటా.. కేఆర్కే వార్నింగ్!
తనను తాను విమర్శకుడిగా చెప్పుకుంటూ.. నిత్యం సినీ ప్రముఖులపై నోరుపారేసుకునే కమల్ ఆర్ ఖాన్ అలియాస్ కేఆర్కేకు ఇటీవల గట్టి షాక్ తగిలిన సంగతి తెలిసిందే. సెలబ్రిటీలపై విరుచుకుపడే కేఆర్కేకు ట్విట్టర్లో మంచి ఫాలోయింగ్ ఉంది. పెద్దసంఖ్యలో అభిమానులూ ఉన్నారు. అయితే, ఇటీవల వచ్చిన ఆమిర్‌ఖాన్ సినిమా ’సీక్రెట్ సూపర్‌స్టార్’పై కేఆర్కే తనదైన శైలిలో నోరుపారేసుకున్నాడు. ఈ సినిమాను సమీక్షిస్తూ.. ఏకంగా క్లైమాక్స్‌ను వెల్లడించాడు. అంతేకాకుండా ఆమిర్‌పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశాడు. ’నువ్వు మంచి తండ్రివి కాకపోయినంతమాత్రాన లేదా, నువ్వు గౌరవించని నీ తండ్రి మంచి నాన్న కాకపోయినంత మాత్రాన మేం పిల్లలను ప్రేమించమని చెప్పకు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత కేఆర్కేకు గట్టి షాక్ తగిలింది. ఆయన ట్విట్టర్ ఖాతా రద్దయిపోయింది. ఆమిర్ ఖాన్ ఫిర్యాదు కారణంగానే ట్విట్టర్ ఆయన ఖాతాను తొలగించిందని ఆరోపణలు వచ్చాయి. తాజాగా కేఆర్కే ఓ పత్రిక ప్రకటనను విడుదల చేశారు. 15 రోజుల్లో ట్విట్టర్లో తన ఖాతాను పునరుద్ధరించకపోతే.. తాను ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొన్నారు. ’15 రోజుల్లో నా ఖాతాను పునరుద్ధరించాల్సిందిగా ట్విట్టర్ ఇండియా, ట్విట్టర్ సిబ్బంది అయిన మహిమ కౌల్, విరాల్ జాని, తరణ్‌జీత్ సింఘ్తోలకు విజ్ఞప్తి చేస్తున్నా. మొదట నా మీద వారు మిలియన్లకొద్దీ డబ్బును చార్జ్ చేశారు. తర్వాత నా ఖాతాను సస్పెండ్ చేశారు. వారు నన్ను మోసం చేయడంతో నేను కుంగిపోయాను. నా ఖాతాను పునరుద్ధరించకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. నా మృతికి వీరే కారణం. ఇట్లు ఒత్తిడిలో ఉన్న కేఆర్కే’ అంటూ ఆయన ప్రతిక ప్రకటనను విడుదల చేశారు. -
నటి భైరవి గోస్వామికి దిమ్మతిరిగే షాక్!
ముంబయి: బాడీ షేమింగ్ వివాదంలో నటి భైరవి గోస్వామికి దిమ్మతిరిగే షాకిచ్చింది కృతి సనన్. 'నాపై భైరవి గోస్వామి కామెంట్ చేసిందని తెలిసింది. అయితే ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి' అంటూ మీడియాను నటి కృతిసనన్ అడిగారు. మీపై తీవ్ర విమర్శలు చేసిన భైరవి గోస్వామి 'హేట్ స్టోరీ' మూవీలో నటించారని చెప్పగానే కృతి కాస్త ఆశ్చర్యానికి లోనైంది. 'ఇప్పటివరకూ ఆమె ఎవరో కూడా ఎంతో మందికి తెలియదు. నాపై విమర్శలు చేయడంతోనైనా ఆమె నటి అని చాలా మందికి తెలిసింది. నాపై విమర్శలతోనైనా ఆమె పాపులర్ అయ్యారు. ఆమెను కూడా గుర్తిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సినీ విమర్శకుడు కేఆర్కే మాటలపై స్పందించాల్సిన అవసరం లేదని' కృతి అభిప్రాయపడ్డారు. అసలు వివాదం ఏంటంటే..! అనిల్ కపూర్, అర్జున్ కపూర్ నటించిన ‘ముబారకన్’ సినిమాలోని ‘హవా.. హవా..’ అనే పాటకు చేసిన డ్యాన్స్ చేసిన వీడియోను కృతిసనన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గతంలో ఆమె నటించిన రాబ్తా మూవీ ఫ్లాప్ కావడంతో ఆమెకు మానసిక స్థితి బాలేదని కేఆర్కే ట్వీట్ చేయగా, అసలు కృతి నటి ఎలా అయింది. ఆమెకు హెడ్ లైట్ లేదు, బంపర్ లేదు. కనీసం ఆమె కాలేజీ స్టూడెంట్ లాగ కూడా కనిపించదంటూ మరో నటి భైరవి గోస్వామి కామెంట్ చేసింది. మూవీ ఛాన్స్ ల కోసం, తనను తాను ప్రమోట్ చేసుకోవాలని భైరవి పిచ్చి పిచ్చి కామెంట్లు చేసిందని నెటిజన్లు ఆమెపై మండిపడ్డారు. -
వీడియో వైరల్.. నటిపై దారుణ వ్యాఖ్యలు
ముంబయి: నటి కృతి సనన్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందుకు కారణం.. అనిల్ కపూర్, అర్జున్ కపూర్ నటించిన ‘ముబారకన్’ సినిమాలోని ‘హవా.. హవా..’ అనే పాటకు చేసిన డ్యాన్స్ వీడియోను ప్రమోట్ చేయడమే. తొలుత బాలీవుడ్ విమర్శకుడు కేఆర్కే స్పందించాడు. కృతిసనన్ నటించిన రాబ్తా ఫ్లాఫ్ కావడంతో నటి మెంటల్ గా డిస్టర్బ్ అయ్యారని, అందుకే ఆమె ఇలా పిచ్చి గంతులు వేస్తున్నారని కేఆర్కే ట్వీట్ చేశాడు. బాలీవుడ్ నటి భైరవి గోస్వామి తోటి నటిగా కృతికి మద్ధతు తెలపడం బదులుగా దారుణంగా విమర్శించింది. ‘రాబ్తా ఫ్లాప్ అవడంతో కృతి పిచ్చిదానిలా తయారైంది. అసలు ఆమె హీరోయిన్ ఎలా అయింది. ఆమెకు హెడ్ లైట్ లేదు, బంపర్ లేదు. కాలేజీ విద్యార్థినులు ఆమె కంటే చాలా బెటర్‌గా కనిపిస్తారంటూ’ భైరవి ట్వీట్ చేసింది. అవకాశాల్లేక వేరే నటిని అడ్డం పెట్టుకుని ఇలా చేయడం సరికాదంటూ భైరవిపై నెటిజన్లు మండిపడుతున్నారు. భైరవి చివరగా ‘హేట్ స్టోరీ’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. -
వీడియో వైరల్.. నటిపై దారుణ వ్యాఖ్యలు
-
కోహ్లీకి ఆ అవినీతి పరుడంటే ఇష్టం!
న్యూఢిల్లీ: టీమిండియా ప్రధాన కోచ్‌గా అనిల్ కుంబ్లే రాజీనామా అనంతరం బీసీసీఐ కొత్త కోచ్ కోసం వేట మొదలు పెట్టింది. కెప్టెన్ విరాట్ కోహ్లీతో విభేదాల కారణంగానే నిజాయతీ పరుడైన కుంబ్లే తన బాధ్యతల నుంచి స్వయంగా తప్పుకున్నాడని మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కుంబ్లే రాజీనామా వివాదంలో కోహ్లీపై బాలీవుడ్ నటుడు, విమర్శకుడు కమల్ రషీద్ ఖాన్ (కేఆర్కే) విరుచుకుపడ్డాడు. నిజాయతీగా పనిచేసే వ్యక్తులు కోహ్లీకి నచ్చరంటూ ట్వీట్ చేశాడు కేఆర్కే. 'కుంబ్లే నిజాయతీపరుడు. విరాట్ మాత్రం రవిశాస్త్రి లాంటి వ్యక్తినే కోచ్‌గా ఇష్టపడతాడు. రవిశాస్త్రి కూడా కోహ్లీ లాగే అవినీతి పరుడు కావడమే ఇందుకు కారణమని' కేఆర్కే తన ట్వీట్లో రాసుకొచ్చాడు. ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో భారత్ కచ్చితంగా కప్పు నెగ్గదని కేఆర్కే జోస్యం చెప్పగా అదే నిజమైన సంగతి తెలిసిందే. కోహ్లీ ప్రవర్తన వల్లే జట్టు ఓటమిని మూటకట్టుకుంటుందని కెప్టెన్ పై నిప్పులు చెరిగాడు. ప్రస్తుతం కోచ్ వివాదంలోనూ కుంబ్లేకు ఎసరు పెట్టడానికి కారణంపై స్పందించాడు. కోహ్లీకి తనలాగే అవినీతికి పాల్పడే వ్యక్తే కోచ్‌గా ఉండేందుకు ఇష్టపడతాడని భారత కెప్టెన్ పై విమర్శలు గుప్పించాడు. Kumble is honest man so of course Virat will love to have Ravi Shashtari as coach coz he is big corrupt like Kohli. https://t.co/4z8wQQZPkj — KRK (@kamaalrkhan) 22 June 2017 -
బాలీవుడ్ బ్యూటీ ఆమేనట
చెన్నై: బాలీవుడ్లో కత్రినాకైఫ్, ప్రియాంకచోప్రా, దీపికాపడుకొనే లాంటి ముద్దుగుమ్మలు చాలా మందే ఉన్నారు. అయితే వారందనీ వెనక్కునెట్టి బాలీవుడ్ బ్యూటీ క్రెడిట్‌ను మాత్రం శ్రుతీహాసన్ కొట్టేశారు. ఈమెకు అందాలరాశి పట్టం కట్టింది ప్రముఖ బాలీవుడ్ విమర్శకుడు, నటుడు కేఆర్కే(కమాల్ ఆర్ ఖాన్). సినిమాలను సీన్ బై సీన్ తన విమర్శలతో చీల్చి చండాడే ఈయన సాధారణంగా ఎవరినీ ప్రశంసించరట. అలాంటిది తనకు నచ్చిన బాలీవుడ్ హీరోయిన్ శ్రుతీహాసన్ అనీ, ఆమె చాలా అందగత్తె అనీ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. అయితే శ్రుతిలో చిన్న లోపాన్ని కూడా కేఆర్కే వెల్లడించారు. ఆమెకు మంచి చిత్రాలను ఎంపిక చేసుకోవడం తెలియడం లేదని అన్నారు. ఆయన శ్రుతీహాసన్‌ను బాలీవుడ్ బ్యూటీగా పేర్కొనడం అక్కడి ప్రముఖులను సైతం విస్మయానికి గురి చేసిందట. ఇక కేఆర్కే ట్వీట్‌కు అభిమానులు బాగానే రియాక్ట్ అవుతున్నారు. ఒక అభిమాని స్పందిస్తూ.. ‘శ్రుతీహాసన్ బాలీవుడ్ బ్యూటీ అనడాన్ని ఆహ్వానిస్తున్నా, అయితే ఆమెకు మంచి చిత్రాలను ఎంచుకోవడం తెలియదనడాన్ని అంగీకరించబోమ’ని అన్నారు. ఈ నెల 9వ తేదీన విడుదల కానున్న బీహెటీ(బెహాన్ హోగి తేరి) చిత్రం చూసిన తరువాత కేఆర్కే కచ్చితంగా తన అభిప్రాయాన్ని మార్చుకుంటారని అన్నాడు. ఇక బాలీవుడ్ బ్యూటీ అన్న విషయాన్ని చాలా మంది అభిమానులు అంగీకరిస్తున్నారు. మొత్తం మీద ఈ అందగత్తె ఇటీవల సంఘమిత్ర చిత్రం నుంచి వైదొలగి పతాక శీర్షికల్లో నిలిచారు. -
బాహుబలి-2, ప్రభాస్‌పై చెలరేగిపోయిన కేఆర్కే
ముంబై: సెన్సేషనల్ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి సినిమా బాహుబలి-2(ద కంక్లూజన్)పై బాలీవుడ్ ఫిల్మి క్రిటిక్ ,పబ్లిసిటీ కింగ్ కమల్ ఆర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వివాదాస్పద మూవీ రివ్యూలతో పాపులర్ అయిన కమల్ తాజాగా రాజమౌళి ప్రతిష్టాత్మక మూవీ బాహుబలి-2ని టార్గెట్ చేశాడు. ట్విట్టర్ వేదికగా బాలీవుడ్ -2 సినిమాను రివ్యూ చేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఇందులో విమర్శల బుల్లెట్ల వర్షం కురిపించాడు. అంతేకాదు హీరో ప్రభాస్పైకూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒంటెలా కనిపించే ప్రభాస్‌ను హిందీ నిర్మాతలు ఎవరైనా తీసుకుంటే, వారు కచ్చితంగా ఇడియట్స్ అంటూ చెలరేగిపోయి ట్వీట్ చేశాడు. బాహుబలి2 లో కథే లేదు. రాజమౌళి దర్శకత్వం అస్సలు బాగోలేదు. సంగీతం గురించి అసలు మాట్లాడక్కర్లేదు. ఎంటర్ టైన్మెంట్ లేదు. ఎమోషన్ లేదు. విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఘోరం. థియేటర్లో ఉన్న ప్రేక్షకులను చాలా డిస్టర్బ్ చేస్తుంది. రియాల్టీకి దగ్గరగా లేదు. వాస్తవానికి వేలమైళ్ల దూరంలోఉంది. సంగీతం హిందీ ప్రేక్షకులకు అస్పలు నచ్చదు. ఇది కమల్ ఆర్ ఖాన్ రివ్యూ. అంతేకాదు ఈ సినిమా చూడడం శుద్ధ దండుగ అని తేల్చేశాడు. డబ్బులు, సమయం వృధా చేసుకోవద్దంటూ ప్రేక్షకులకు ఓ సలహా ఇచ్చేశాడు. ఫస్ట్ పార్ట్‌తో పోల్చితే పదిశాతం కూడా బాగా లేదన్నాడు. ఇక ఎడిటర్‌పై అయితే తీవ్ర విమర్శలు గుప్పించాడు. మూడు గంటలు తీయాల్సిన మెటీరియలేదు.. వేస్ట్ అంటూ ప్రస్తావించాడు. అంతేకాదు ఈ సినిమా పిల్లలు కంప్యూటర్ వీడియో గేమ్‌లా చూడ్డానికి బావుంటుందంటూ పేర్కొన్నాడు. అయితే రానా దగ్గుపాటి, అనుష్క శెట్టి, ప్రభాస్ బాగా నటించారని చెప్పాడు. ఈ సినిమాకు వన్ రేటింగ్ ఇచ్చాడు. బిజినెస్ రేటింగ్ మాత్రం 8 ఎనిమిది ఇచ్చాడు. ఈ సినిమాకు ఇచ్చిన హైప్ కారణంగా 2నుంచి 3 వందల కోట్లు వసూలు చేస్తుందని వ్యాఖ్యానించాడు. కమల్ వీడియోపై ప్రభాస్ అభిమానులు మండిపడుతున్నారు. సౌత్ సినిమాలంటే బాలీవుడ్ వాళ్లకి చిన్నచూపని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కమల్ ఆర్ ఖాన్ కు అలవాటేనంటూ కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. ట్రెండ్‌ని తనకు అనుకూలంగా మార్చుకుని తిరిగి వార్తల్లోకి రావడమే ఆయన లక్ష్యమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. If some Hindi producers are taking Prabhas who looks like 🐫in their films then definitely they are idiots. #Baahubali is working not Prabhas — KRK (@kamaalrkhan) April 29, 2017 -
వివాదంపై పెదవి విప్పిన కరణ్ జోహార్
బాలీవుడ్ లో గత కొద్దిరోజులుగా అజయ్ దేవగన్, సినీ విమర్శకుడు కమాల్ ఆర్ ఖాన్(కేఆర్కే)ల మధ్య నడుస్తున్న వివాదంపై దర్శక, నిర్మాత కరణ్ జోహార్ పెదవి విప్పారు. దీపావళికి విడుదల కాబోతున్న అజయ్ దేవగన్ కొత్త సినిమాకు నెగిటివ్ గా ప్రచారం చేయడానికి కేఆర్కేకు కరణ్ జోహార్ రూ.25లక్షలు ఇచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఓ ఎంటర్ టైన్ మెంట్ వెబ్ సైట్ వేసిన ప్రశ్నకు కరణ్ జవాబిచ్చారు. తన ఆత్మగౌరవం, కంపెనీ ప్రతిష్ట, తర్వాత సినిమాలు ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు ఒప్పుకోవడం లేదని అన్నారు. కరణ్ నిర్మిస్తున్న అయే దిల్ హై ముష్కిల్ తో పోటీ పడుతుందన్న కారణంతోనే శివాయ్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. దీనిపై విచారణ జరపాలని అజయ్ దేవగన్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇక వచ్చేనెల 28న ‘శివాయ్’తో పాటుగా కరణ్ జోహార్ మూవీ ‘యే దిల్ హై ముష్కిల్’ రిలీజవుతోంది.