వీడియో వైరల్.. నటిపై దారుణ వ్యాఖ్యలు | Kriti Sanon danced And gets trolled by Bhairavi Goswami | Sakshi
Sakshi News home page

వీడియో వైరల్.. నటిపై దారుణ వ్యాఖ్యలు

Published Sun, Jul 30 2017 6:48 PM | Last Updated on Tue, Sep 5 2017 5:13 PM

వీడియో వైరల్.. నటిపై దారుణ వ్యాఖ్యలు

వీడియో వైరల్.. నటిపై దారుణ వ్యాఖ్యలు

ముంబయి: నటి కృతి సనన్‌ డ్యాన్స్ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. ఇందుకు కారణం.. అనిల్ కపూర్, అర్జున్ కపూర్ నటించిన ‘ముబారకన్‌’ సినిమాలోని ‘హవా.. హవా..’ అనే పాటకు చేసిన డ్యాన్స్ వీడియోను ప్రమోట్ చేయడమే. తొలుత బాలీవుడ్ విమర్శకుడు కేఆర్‌కే స్పందించాడు. కృతిసనన్ నటించిన రాబ్తా ఫ్లాఫ్ కావడంతో నటి మెంటల్ గా డిస్టర్బ్ అయ్యారని, అందుకే ఆమె ఇలా పిచ్చి గంతులు వేస్తున్నారని కేఆర్‌కే ట్వీట్ చేశాడు.

బాలీవుడ్ నటి భైరవి గోస్వామి తోటి నటిగా కృతికి మద్ధతు తెలపడం బదులుగా దారుణంగా విమర్శించింది. ‘రాబ్తా ఫ్లాప్ అవడంతో కృతి పిచ్చిదానిలా తయారైంది. అసలు ఆమె హీరోయిన్ ఎలా అయింది. ఆమెకు హెడ్ లైట్ లేదు, బంపర్ లేదు. కాలేజీ విద్యార్థినులు ఆమె కంటే చాలా బెటర్‌గా కనిపిస్తారంటూ’  భైరవి ట్వీట్ చేసింది. అవకాశాల్లేక వేరే నటిని అడ్డం పెట్టుకుని ఇలా చేయడం సరికాదంటూ భైరవిపై నెటిజన్లు మండిపడుతున్నారు. భైరవి చివరగా ‘హేట్‌ స్టోరీ’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement