mubarakan
-
టీవీ సీరియల్స్ చేస్తాను: ఇలియానా
సాక్షి, ముంబయి: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లి అక్కడే సెటిలైన హీరోయిన్లలో గోవా సుందరి ఇలియానా ఒకరు. తాను టీవీ సీరియల్స్ లో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇలియానా చెప్పగానే, ఇక సిల్వర్ స్క్రీన్ నుంచి ఆమె తప్పుకోనుందేమోనని ఇండస్ట్రీ వర్గాలు ఒక్కసారిగా షాక్ తిన్నాయి. అసలు విషయం ఏంటంటే.. ఇటీవల ఇలియానా చేసిన వ్యాఖ్యలను కొందరు దుష్ప్రచారం చేయడమే అందుకు కారణం. తాను నటించిన మూవీ ముబారకన్ శనివారం సోని మ్యాక్స్ లో ప్రసారం అవుతుందని అందరూ మూవీని చూడాల్సిందిగా నటి ఇలియానా ప్రమోట్ చేసుకున్నారు. దీనిపై కొందరు స్పందిస్తూ.. ఎన్నో సినిమాల్లో నటించారు, బుల్లితెరపై కనిపించే ఆలోచన లేదా అంటూ ఆమెను అడిగారు. సీరియల్స్ లో నటిస్తానని కచ్చితంగా చెప్పలేను. అయితే ఛాలెంజింగ్ రోల్ దొరికితే టీవీ సీరియల్స్ లో కనిపించేందుకు తనకు ఏ ఇబ్బంది లేదన్నారు ఇలియానా. సినిమా నచ్చితే థియేటర్లకు మళ్లీ మళ్లీ వచ్చి చూసి ప్రేక్షకులు మమ్మల్ని ఆధరిస్తారు. సీరియల్స్ లో అలాంటి అవకాశం ఉండదు. కీలకపాత్ర వస్తే మాత్రం బుల్లితెరపై కనిపించేందుకు వెనుకాడనని స్పష్టం చేశారు. అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించిన ముబారకన్ లో అనిల్ కపూర్, అతియా శెట్టి, అర్జున్ కపూర్ లు ప్రధాన పాత్రలు పోషించారు. -
నటి భైరవి గోస్వామికి దిమ్మతిరిగే షాక్!
ముంబయి: బాడీ షేమింగ్ వివాదంలో నటి భైరవి గోస్వామికి దిమ్మతిరిగే షాకిచ్చింది కృతి సనన్. 'నాపై భైరవి గోస్వామి కామెంట్ చేసిందని తెలిసింది. అయితే ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి' అంటూ మీడియాను నటి కృతిసనన్ అడిగారు. మీపై తీవ్ర విమర్శలు చేసిన భైరవి గోస్వామి 'హేట్ స్టోరీ' మూవీలో నటించారని చెప్పగానే కృతి కాస్త ఆశ్చర్యానికి లోనైంది. 'ఇప్పటివరకూ ఆమె ఎవరో కూడా ఎంతో మందికి తెలియదు. నాపై విమర్శలు చేయడంతోనైనా ఆమె నటి అని చాలా మందికి తెలిసింది. నాపై విమర్శలతోనైనా ఆమె పాపులర్ అయ్యారు. ఆమెను కూడా గుర్తిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సినీ విమర్శకుడు కేఆర్కే మాటలపై స్పందించాల్సిన అవసరం లేదని' కృతి అభిప్రాయపడ్డారు. అసలు వివాదం ఏంటంటే..! అనిల్ కపూర్, అర్జున్ కపూర్ నటించిన ‘ముబారకన్’ సినిమాలోని ‘హవా.. హవా..’ అనే పాటకు చేసిన డ్యాన్స్ చేసిన వీడియోను కృతిసనన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గతంలో ఆమె నటించిన రాబ్తా మూవీ ఫ్లాప్ కావడంతో ఆమెకు మానసిక స్థితి బాలేదని కేఆర్కే ట్వీట్ చేయగా, అసలు కృతి నటి ఎలా అయింది. ఆమెకు హెడ్ లైట్ లేదు, బంపర్ లేదు. కనీసం ఆమె కాలేజీ స్టూడెంట్ లాగ కూడా కనిపించదంటూ మరో నటి భైరవి గోస్వామి కామెంట్ చేసింది. మూవీ ఛాన్స్ ల కోసం, తనను తాను ప్రమోట్ చేసుకోవాలని భైరవి పిచ్చి పిచ్చి కామెంట్లు చేసిందని నెటిజన్లు ఆమెపై మండిపడ్డారు. -
వీడియో వైరల్.. నటిపై దారుణ వ్యాఖ్యలు
ముంబయి: నటి కృతి సనన్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందుకు కారణం.. అనిల్ కపూర్, అర్జున్ కపూర్ నటించిన ‘ముబారకన్’ సినిమాలోని ‘హవా.. హవా..’ అనే పాటకు చేసిన డ్యాన్స్ వీడియోను ప్రమోట్ చేయడమే. తొలుత బాలీవుడ్ విమర్శకుడు కేఆర్కే స్పందించాడు. కృతిసనన్ నటించిన రాబ్తా ఫ్లాఫ్ కావడంతో నటి మెంటల్ గా డిస్టర్బ్ అయ్యారని, అందుకే ఆమె ఇలా పిచ్చి గంతులు వేస్తున్నారని కేఆర్కే ట్వీట్ చేశాడు. బాలీవుడ్ నటి భైరవి గోస్వామి తోటి నటిగా కృతికి మద్ధతు తెలపడం బదులుగా దారుణంగా విమర్శించింది. ‘రాబ్తా ఫ్లాప్ అవడంతో కృతి పిచ్చిదానిలా తయారైంది. అసలు ఆమె హీరోయిన్ ఎలా అయింది. ఆమెకు హెడ్ లైట్ లేదు, బంపర్ లేదు. కాలేజీ విద్యార్థినులు ఆమె కంటే చాలా బెటర్‌గా కనిపిస్తారంటూ’ భైరవి ట్వీట్ చేసింది. అవకాశాల్లేక వేరే నటిని అడ్డం పెట్టుకుని ఇలా చేయడం సరికాదంటూ భైరవిపై నెటిజన్లు మండిపడుతున్నారు. భైరవి చివరగా ‘హేట్ స్టోరీ’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. -
ముబారకన్ ప్రమోషనల్ ఈవెంట్లో స్టార్స్
-
ఆ హీరోతో ఇప్పటికీ టచ్‌లో ఉన్నా: నటి
ముంబయి: టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన నటి ఇలియానా దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లాక ఆమె జోరు పూర్తిగా తగ్గిపోయింది. అక్కడ తొలి చిత్రం బర్ఫీతో మంచి మార్కులే కొట్టేసినా.. ఈ గోవా సుందరికి అవకాశాలు మాత్రం గడప తొక్కలేదు. ఈ బ్యూటీ గత ఐదేళ్లలో ఐదు హిందీ మూవీల్లో మాత్రమే నటించింది. కొంతకాలం గ్యాప్ తీసుకున్న ఈ భామ ముబారకన్ తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ నేపథ్యంలో తన సినీ అనుభవాలను ఆమె షేర్ చేసుకుంది. '15 ఏళ్ల వయసులో మూవీలో చాన్స్ వచ్చింది. అయితే నేను అంతగా నటించను. మీ భాష రాదు, మాట్లాడను. నా ఇష్టం వచ్చినట్లుగా ఉండాను అని షరతులు పెట్టినా దర్శకుడు ఒప్పుకున్నారు. షూటింగ్ విదేశాల్లో అనగానే.. పైసా ఖర్చులేకుండా అమెరికాకు వెళ్తున్నానని సంబరపడ్డాను. తెలుగు, హిందీ భాషలు నాకు అసలే రావు. అయితే ఇంటర్వ్యూలో హిందీలో బదులు చెప్పమని అడిగినా.. ఇంగ్లీష్‌లో ఏదోలా మేనేజ్ చేసేదాన్ని. టాలీవుడ్లో ప్రముఖ హీరోలతో పనిచేసినందుకు చాలా ఆనందంగా ఉంది. కానీ హిందీపైనే ఎక్కువ దృష్టిపెట్టాను. నా లేటెస్ట్ మూవీ ముబారకన్. ఇందులో పంజాబీ అమ్మాయిగా ఆకట్టుకుంటాను. అర్జున్ కపూర్, అనిల్ కపూర్ లాంటి స్టార్లతో పని చేసిన ఈ మూవీ కచ్చితంగా విజయం సాధిస్తుంది. టాలీవుడ్లో తొలిమూవీ ఎనర్జిటిక్ హీరో రామ్‌తో కలిసి చేశాను. అతడితో ఇప్పటికీ టచ్‌లోనే ఉన్నాను. తొలిరోజు స్క్రిప్టు ఇచ్చాక ఎలా పలకాలో సాయం చేయాలని రామ్‌ను అడిగాను. అతడు ఆ మాటలు చదవి వినిపించగానే నేను గట్టిగా నవ్వేశాను. నాకు భాష రాకపోవడంతో తొలుత అతడు జోక్ చేస్తున్నాడని భావించాను. క్రమక్రమంగా నటనపై దృష్టిపెట్టి ఎంతో నేర్చుకున్నానని' నటనలో తొలి రోజులను ఇలియానా వివరించారు. ముబారకన్ జులై 28న విడుదలకు సిద్ధంగా ఉంది. -
ఇది ఫుడ్ కెమిస్ట్రీ !
ఇలియానా పేరు చెబితే గుర్తొచ్చేది ఆమె ఫిగరే. ఎప్పుడూ అంత సెక్సీగా కనిపించాలంటే తప్ప కుండా ఏవి పడితే అవి తినకూడదు. డైట్ పాటించాలి. కానీ, పంజాబీ వంటలను చూస్తే ఇలియానా నోరూరుతుందట! అందువల్ల ఓ మంచి జరిగిం దట! అదేంటంటే... హిందీలో అర్జున్‌కపూర్‌కి జోడీగా ‘ముబారకన్’ సినిమాలో ఇలియానా నటిస్తున్నారు. చాలా రోజులుగా ఒకరికొకరు పరిచయమున్నట్టు హీరో హీరోయిన్ల పాత్రలు ప్రవర్తించాలి. అర్జున్‌కపూర్, ఇలియానా జంటగా నటిస్తున్న మొదటి చిత్రమిది. దాంతో క్యారెక్టర్స్ మధ్య కెమిస్ట్రీ ఎక్కడ దెబ్బ తింటుందోనని ఇలియానా కాస్త భయపడ్డారట. అయితే.. ఇద్దరికీ పంజాబీ ఫుడ్ దగ్గర మంచి దోస్తీ కుదిరింది. అర్జున్ కపూర్‌కి కూడా పంజాబీ ఫుడ్ అంటే ప్రాణం. ఫుడ్ దగ్గర కలసిన మాటలు, స్నేహం సినిమాకీ హెల్ప్ అయ్యిందని ఇలియానా చెప్పారు. షూటింగ్ మొదటిరోజే ఈ దోస్తీ మొదలు కావడం విశేషం.