నటి భైరవి గోస్వామికి దిమ్మతిరిగే షాక్! | Now you guys know her name also, says Kriti Sanon | Sakshi
Sakshi News home page

నటి భైరవి గోస్వామికి దిమ్మతిరిగే షాక్!

Published Wed, Aug 2 2017 6:55 PM | Last Updated on Sun, Sep 17 2017 5:05 PM

నటి భైరవి గోస్వామికి దిమ్మతిరిగే షాక్!

నటి భైరవి గోస్వామికి దిమ్మతిరిగే షాక్!

ముంబయి: బాడీ షేమింగ్ వివాదంలో నటి భైరవి గోస్వామికి దిమ్మతిరిగే షాకిచ్చింది కృతి సనన్. 'నాపై భైరవి గోస్వామి కామెంట్ చేసిందని తెలిసింది. అయితే ఆమె ఎవరో కూడా నాకు తెలియదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి' అంటూ మీడియాను నటి కృతిసనన్ అడిగారు. మీపై తీవ్ర విమర్శలు చేసిన భైరవి గోస్వామి 'హేట్ స్టోరీ' మూవీలో నటించారని చెప్పగానే కృతి కాస్త ఆశ్చర్యానికి లోనైంది.

'ఇప్పటివరకూ ఆమె ఎవరో కూడా ఎంతో మందికి తెలియదు. నాపై విమర్శలు చేయడంతోనైనా ఆమె నటి అని చాలా మందికి తెలిసింది. నాపై విమర్శలతోనైనా ఆమె పాపులర్ అయ్యారు. ఆమెను కూడా గుర్తిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సినీ విమర్శకుడు కేఆర్కే మాటలపై స్పందించాల్సిన అవసరం లేదని' కృతి అభిప్రాయపడ్డారు.

అసలు వివాదం ఏంటంటే..!
అనిల్ కపూర్, అర్జున్ కపూర్ నటించిన ‘ముబారకన్‌’ సినిమాలోని ‘హవా.. హవా..’ అనే పాటకు చేసిన డ్యాన్స్ చేసిన వీడియోను కృతిసనన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గతంలో ఆమె నటించిన రాబ్తా మూవీ ఫ్లాప్ కావడంతో ఆమెకు మానసిక స్థితి బాలేదని కేఆర్కే ట్వీట్ చేయగా, అసలు కృతి నటి ఎలా అయింది. ఆమెకు హెడ్ లైట్ లేదు, బంపర్ లేదు. కనీసం ఆమె కాలేజీ స్టూడెంట్ లాగ కూడా కనిపించదంటూ మరో నటి భైరవి గోస్వామి కామెంట్ చేసింది.  మూవీ ఛాన్స్ ల కోసం, తనను తాను ప్రమోట్ చేసుకోవాలని భైరవి పిచ్చి పిచ్చి కామెంట్లు చేసిందని నెటిజన్లు ఆమెపై మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement