ఇది ఫుడ్ కెమిస్ట్రీ !
ఇలియానా పేరు చెబితే గుర్తొచ్చేది ఆమె ఫిగరే. ఎప్పుడూ అంత సెక్సీగా కనిపించాలంటే తప్ప కుండా ఏవి పడితే అవి తినకూడదు. డైట్ పాటించాలి. కానీ, పంజాబీ వంటలను చూస్తే ఇలియానా నోరూరుతుందట! అందువల్ల ఓ మంచి జరిగిం దట! అదేంటంటే... హిందీలో అర్జున్‌కపూర్‌కి జోడీగా ‘ముబారకన్’ సినిమాలో ఇలియానా నటిస్తున్నారు. చాలా రోజులుగా ఒకరికొకరు పరిచయమున్నట్టు హీరో హీరోయిన్ల పాత్రలు ప్రవర్తించాలి.
అర్జున్‌కపూర్, ఇలియానా జంటగా నటిస్తున్న మొదటి చిత్రమిది. దాంతో క్యారెక్టర్స్ మధ్య కెమిస్ట్రీ ఎక్కడ దెబ్బ తింటుందోనని ఇలియానా కాస్త భయపడ్డారట. అయితే.. ఇద్దరికీ పంజాబీ ఫుడ్ దగ్గర మంచి దోస్తీ కుదిరింది. అర్జున్ కపూర్‌కి కూడా పంజాబీ ఫుడ్ అంటే ప్రాణం. ఫుడ్ దగ్గర కలసిన మాటలు, స్నేహం సినిమాకీ హెల్ప్ అయ్యిందని ఇలియానా చెప్పారు. షూటింగ్ మొదటిరోజే ఈ దోస్తీ మొదలు కావడం విశేషం.