పాత సంవత్సరం వీడ్కోలు పలకగా కొత్త సంవత్సరం కొంగొత్త ఆశలతో మన జీవితాల్లో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా 2024 ఎలా గడిచిందనేది పలువురూ గుర్తు చేసుకుంటున్నారు. సంతోషాలు, బాధలు, కష్టాలు, గుణపాఠాలు.. ఇలా ఎన్నో రకాల జ్ఞాపకాలను తడిమి చూసుకుంటున్నారు. హీరోయిన్ ఇలియానా (Ileana D'Cruz) కూడా 2024 గురించి చిన్నపాటి వీడియో రిలీజ్ చేసింది. జనవరి నుంచి డిసెంబర్ వరకు తన జీవితం ఎలా ఉందనేది చూపించింది.
మరోసారి ప్రెగ్నెన్సీ
జనవరి నుంచి సెప్టెంబర్ వరకు తన పిల్లాడితోనే క్షణం తీరిక లేకుండా అయిపోయిందని చెప్పింది. అయితే సెప్టెంబర్‌లో మాత్రం మరోసారి గర్భం దాల్చానంటూ ప్రెగ్నెన్సీ కిట్‌ను చూపించింది. ఇది చూసిన అభిమానులు ఇలియానాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ ఏడాది మరో బుజ్జాయి రాబోతోందంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇలియానా ప్రియుడు మైఖేల్ డోలన్‌ను పెళ్లాడింది. కొన్నాళ్ల పాటు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచింది. 2023లో కుమారుడు పుట్టిన తర్వాత మైఖేల్ పూర్తి ఫొటోను షేర్ చేసింది.
అప్పట్లో టాప్ హీరోయిన్
సినిమాల విషయానికి వస్తే.. ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్‌గా వెలుగొందింది. తొలి చిత్రం దేవదాసుతో అందరికీ తెగ నచ్చేసింది. పోకిరి, రాఖీ, మున్నా, ఆట, జల్సా, కిక్.. ఇలా వరుసగా తెలుగు చిత్రాల్లో నటించింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్‌గా రాణిస్తున్న సమయంలో బాలీవుడ్‌లో బర్ఫీ మూవీ ఛాన్స్ వచ్చింది. అది మంచి కథ కావడంతో అందులో నటించింది. ఆ వెంటనే హిందీలోనే వరుస చిత్రాలు చేసింది. ఆమె బాలీవుడ్‌లోనే సెటిలైపోయిందన్న భావనతో ఇలియానాను సౌత్ ఇండస్ట్రీ పట్టించుకోలేదు.
చదవండి: ముంబై వదిలేసి సౌత్‌కు షిఫ్ట్ అయిపోతా: అనురాగ్ కశ్యప్
Comments
Please login to add a commentAdd a comment