ప్రెగ్నెన్సీ.. కంట్రోల్‌లో లేని బరువు? కలవరపడుతున్న ఇలియానా! | Ileana DCruz About Weight Gain In Pregnancy Time | Sakshi
Sakshi News home page

Ileana D'Cruz: నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నా, తొలిసారి..

Published Sun, Jun 25 2023 7:56 AM | Last Updated on Sun, Jun 25 2023 8:07 AM

Ileana DCruz About Weight Gain In Pregnancy Time - Sakshi

ఒకప్పుడు బొద్దుగుమ్మలకు డిమాండ్‌ ఉండేది. కానీ కాలం మారుతూ ఉండేకొద్దీ సన్నజాజిలకు క్రేజ్‌ పెరిగిపోయింది. సరిగ్గా అలాంటి సమయంలో జీరో సైజ్‌ నడుముతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. స్లిమ్‌ అండ్‌ ఫిట్‌గా ఉంటే ఈ బ్యూటీ దేవదాసు చిత్రంతో తెలుగులో తళుక్కుమని మెరిసింది. ఆ తర్వాత పోకిరి, రెడీ వంటి పలు హిట్‌ చిత్రాల్లో నటించిన ఆమె ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. ఇటీవల పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. తరచూ బేబీ బంప్‌ ఫోటోలు కూడా షేర్‌ చేస్తోంది. కానీ బిడ్డకు తండ్రెవరు? అన్నది మాత్రం చెప్పడం లేదు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది.

నువ్వు బరువు పెరుగుతున్నావని ఏమైనా ఆందోళన చెందుతున్నావా? అన్న ప్రశ్నకు ఇలియానా స్పందిస్తూ.. 'కడుపులో బిడ్డను మోస్తున్నప్పుడు బరువు పెరగడం సహజం. కానీ జనాలు దీని గురించి పదేపదే కామెంట్‌ చేస్తుండటంతో మొదట నేను కూడా కొంత కలవరపడ్డాను. డాక్టర్‌ దగ్గరకు చెకప్‌కు వెళ్లిన ప్రతిసారి బరువు చెక్‌ చేస్తుండటంతో ఎంత వెయిట్‌ ఉన్నానో తెలిసిపోయేది. నా కడుపులో ఒక శిశువు ప్రాణం పోసుకుంటున్న విషయాన్ని అందరూ గుర్తు చేసేవారు. అప్పుడు బరువు గురించి ఆలోచించడం అనవసరం అనిపించింది. కొన్ని నెలలుగా నా శరీరంలో ఎలాంటి మార్పులు వచ్చినా సంతోషంగా స్వీకరిస్తున్నాను.

ఇదొక అద్భుతమైన ప్రయాణం. నా చుట్టూ నన్ను ప్రేమించే వ్యక్తులు ఉన్నారు. కాబట్టి బరువు అనేది పెద్ద విషయం కాదు. సరిగ్గా ఇన్ని కిలోలు పెరిగితే చాలు వంటి నిబంధనలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండండి. మీ శరీరం మాట వినండి. మీ మనసుకు నచ్చిందే చేయండి' అని చెప్పుకొచ్చింది. తొలిసారి బేబీ గుండెచప్పుడు విన్నప్పుడు మీకెలా అనిపించింది? అన్న ప్రశ్నకు 'అత్యంత ఆనందమైన క్షణాల్లో ఇది ఒకటి. నేను ఎంత సంతోషించాను అనేదాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. సంతోషం, కన్నీళ్లు, తృప్తి.. ఇలా అన్ని భావోద్వేగాలు ఒకేసారి వచ్చాయి' అని పేర్కొంది ఇలియానా.

చదవండి: రజనీకాంత్‌ భార్యగా నిరోషా? ఈ సినిమాతోనే రీఎంట్రీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement