కొప్పు పెట్టుకుని అందవిహీనంగా.. టైమే ఉండట్లే: ఇలియానా | Ileana Reveals About Postpartum Depression, Says It Is Been Incredibly Tough Some Days - Sakshi
Sakshi News home page

Ileana D'Cruz Latest Look: పిల్లాడు పుట్టాక డిప్రెషన్‌.. నిద్రుండట్లే, నాకు నేనే పరాయిదాన్నిలా..

Published Sun, Mar 3 2024 4:37 PM | Last Updated on Sun, Mar 3 2024 6:23 PM

Ileana: It is Been Incredibly Tough Some Days - Sakshi

దేవదాసు, పోకిరి సినిమాలతో టాలీవుడ్‌లో ఫుల్‌ క్రేజ్‌ తెచ్చుకుంది ఇలియానా. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె గతేడాది ఆగస్టులో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవానంతరం తీవ్రమైన డిప్రెషన్‌కు గురైంది. ఆ సమయంలో తన పార్ట్‌నర్‌ మైఖేల్‌ అండగా ఉన్నాడని గతంలోనే చెప్పుకొచ్చింది. అయితే తల్లిగా తన పిల్లాడిని చూసుకోవడానికే ఉన్న సమయమంతా అయిపోతుందంటోంది బ్యూటీ.. ఈ మేరకు తాజాగా సోషల్‌ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టింది.

కొప్పు పెట్టుకుని అందవిహీనంగా..
'ఒక తల్లిగా పిల్లాడిని చూసుకుంటూ ఇల్లు చక్కబెట్టడానికే సమయమంతా సరిపోతోంది. నాకంటూ టైమే దొరకడంలేదు. బాబుకు నా జుట్టు దొరక్కుండా నెత్తిన కొప్పు పెట్టుకుని అందవిహీనంగా తయారవుతున్నాను. ఓ సెల్ఫీ తీసుకోవాలన్న ఆలోచన కూడా రావడం లేదు. కానీ కొన్నిసార్లు ఇదెంతో కష్టంగా ఉంటోంది. కంటినిండా నిద్ర ఉండట్లేదు. దీని గురించి నేనేమీ ఫిర్యాదు చేయడం లేదు. నాకంటూ ఓ బుడ్డోడు ఉన్నాడు.. అంతకన్నా సంతోషమేముంటుంది? అయితే ప్రసవానంతరం వచ్చే డిప్రెషన్‌ గురించి పెద్దగా మాట్లాడుకోవడం లేదు కానీ ఇది నిజంగా నిజం. మనకు మనమే పరాయివాళ్లమైపోతాము.

ఇప్పుడిదంతా ఎందుకంటే..
నాకంటూ కొంత సమయం కేటాయించుకునేందుకు ఎంతో ప్రయత్నిస్తున్నాను. 30 నిమిషాలు వర్కవుట్‌ చేసి తర్వాత స్నానం చేస్తున్నా.. ఇది ఎంతో అద్భుతంగా పని చేస్తోంది. కానీ కొన్నిసార్లు వర్కవుట్‌ చేయడం కూడా కుదరడం లేదు. ఇప్పుడిదంతా ఎందుకంటే.. నా కొత్త జీవితం ఎలా ఉందో చెప్తున్నాను. ప్రసవం తర్వాత వెంటనే మునుపటిలా కొత్త ఎనర్జీతో కనిపించే తల్లుల జాబితాలోకైతే నేను రాను. అందుకు నాకు సమయం పడుతుంది. అయినా ఇలా ఓ సెల్ఫీ తీసుకుని పోస్ట్‌ చేసి ఎన్నాళ్లైందో కదా!' ' అని రాసుకొచ్చింది.

చదవండి: నలుగురమ్మాయిల కష్టాల కథే ఈ సినిమా.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement