Ileana
-
రెండోసారి గర్భం దాల్చిన ఇలియానా!
పాత సంవత్సరం వీడ్కోలు పలకగా కొత్త సంవత్సరం కొంగొత్త ఆశలతో మన జీవితాల్లో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా 2024 ఎలా గడిచిందనేది పలువురూ గుర్తు చేసుకుంటున్నారు. సంతోషాలు, బాధలు, కష్టాలు, గుణపాఠాలు.. ఇలా ఎన్నో రకాల జ్ఞాపకాలను తడిమి చూసుకుంటున్నారు. హీరోయిన్ ఇలియానా (Ileana D'Cruz) కూడా 2024 గురించి చిన్నపాటి వీడియో రిలీజ్ చేసింది. జనవరి నుంచి డిసెంబర్ వరకు తన జీవితం ఎలా ఉందనేది చూపించింది.మరోసారి ప్రెగ్నెన్సీజనవరి నుంచి సెప్టెంబర్ వరకు తన పిల్లాడితోనే క్షణం తీరిక లేకుండా అయిపోయిందని చెప్పింది. అయితే సెప్టెంబర్‌లో మాత్రం మరోసారి గర్భం దాల్చానంటూ ప్రెగ్నెన్సీ కిట్‌ను చూపించింది. ఇది చూసిన అభిమానులు ఇలియానాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ ఏడాది మరో బుజ్జాయి రాబోతోందంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇలియానా ప్రియుడు మైఖేల్ డోలన్‌ను పెళ్లాడింది. కొన్నాళ్ల పాటు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచింది. 2023లో కుమారుడు పుట్టిన తర్వాత మైఖేల్ పూర్తి ఫొటోను షేర్ చేసింది.అప్పట్లో టాప్ హీరోయిన్సినిమాల విషయానికి వస్తే.. ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్గా వెలుగొందింది. తొలి చిత్రం దేవదాసుతో అందరికీ తెగ నచ్చేసింది. పోకిరి, రాఖీ, మున్నా, ఆట, జల్సా, కిక్.. ఇలా వరుసగా తెలుగు చిత్రాల్లో నటించింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్‌గా రాణిస్తున్న సమయంలో బాలీవుడ్లో బర్ఫీ మూవీ ఛాన్స్ వచ్చింది. అది మంచి కథ కావడంతో అందులో నటించింది. ఆ వెంటనే హిందీలోనే వరుస చిత్రాలు చేసింది. ఆమె బాలీవుడ్లోనే సెటిలైపోయిందన్న భావనతో ఇలియానాను సౌత్ ఇండస్ట్రీ పట్టించుకోలేదు. View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official)చదవండి: ముంబై వదిలేసి సౌత్‌కు షిఫ్ట్ అయిపోతా: అనురాగ్ కశ్యప్ -
కొప్పు పెట్టుకుని అందవిహీనంగా.. టైమే ఉండట్లే: ఇలియానా
దేవదాసు, పోకిరి సినిమాలతో టాలీవుడ్లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది ఇలియానా. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె గతేడాది ఆగస్టులో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవానంతరం తీవ్రమైన డిప్రెషన్‌కు గురైంది. ఆ సమయంలో తన పార్ట్నర్ మైఖేల్ అండగా ఉన్నాడని గతంలోనే చెప్పుకొచ్చింది. అయితే తల్లిగా తన పిల్లాడిని చూసుకోవడానికే ఉన్న సమయమంతా అయిపోతుందంటోంది బ్యూటీ.. ఈ మేరకు తాజాగా సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టింది. కొప్పు పెట్టుకుని అందవిహీనంగా.. 'ఒక తల్లిగా పిల్లాడిని చూసుకుంటూ ఇల్లు చక్కబెట్టడానికే సమయమంతా సరిపోతోంది. నాకంటూ టైమే దొరకడంలేదు. బాబుకు నా జుట్టు దొరక్కుండా నెత్తిన కొప్పు పెట్టుకుని అందవిహీనంగా తయారవుతున్నాను. ఓ సెల్ఫీ తీసుకోవాలన్న ఆలోచన కూడా రావడం లేదు. కానీ కొన్నిసార్లు ఇదెంతో కష్టంగా ఉంటోంది. కంటినిండా నిద్ర ఉండట్లేదు. దీని గురించి నేనేమీ ఫిర్యాదు చేయడం లేదు. నాకంటూ ఓ బుడ్డోడు ఉన్నాడు.. అంతకన్నా సంతోషమేముంటుంది? అయితే ప్రసవానంతరం వచ్చే డిప్రెషన్ గురించి పెద్దగా మాట్లాడుకోవడం లేదు కానీ ఇది నిజంగా నిజం. మనకు మనమే పరాయివాళ్లమైపోతాము. ఇప్పుడిదంతా ఎందుకంటే.. నాకంటూ కొంత సమయం కేటాయించుకునేందుకు ఎంతో ప్రయత్నిస్తున్నాను. 30 నిమిషాలు వర్కవుట్ చేసి తర్వాత స్నానం చేస్తున్నా.. ఇది ఎంతో అద్భుతంగా పని చేస్తోంది. కానీ కొన్నిసార్లు వర్కవుట్ చేయడం కూడా కుదరడం లేదు. ఇప్పుడిదంతా ఎందుకంటే.. నా కొత్త జీవితం ఎలా ఉందో చెప్తున్నాను. ప్రసవం తర్వాత వెంటనే మునుపటిలా కొత్త ఎనర్జీతో కనిపించే తల్లుల జాబితాలోకైతే నేను రాను. అందుకు నాకు సమయం పడుతుంది. అయినా ఇలా ఓ సెల్ఫీ తీసుకుని పోస్ట్ చేసి ఎన్నాళ్లైందో కదా!' ' అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) చదవండి: నలుగురమ్మాయిల కష్టాల కథే ఈ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
ముందు ప్రెగ్నెన్సీ.. ఆ తర్వాత సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్..!
ప్రస్తుతం పోకిరీ భామ ఇలియానా పేరు నెట్టింట మార్మోగిపోతోంది. గతంలో పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ ధరించినట్లు ప్రకటించి షాక్ ఇచ్చిన భామ.. తాజాగా బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అంతే కాకుండా బిడ్డ పేరును సైతం రివీల్ చేసింది. దీంతో ఇలియానా భర్త పేరుపై చర్చ మొదలైంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ అతన్ని పెళ్లి చేసుకుందా? అని ఆరా తీస్తున్నారు. ఇంతకుముందే తన భర్త ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్న భామ.. అతని పేరు, ఎవరనేది ఇంతవరకు ఎక్కడా వెల్లడించలేదు. (ఇది చదవండి: నటి ఖుష్బూ కూతురును చూశారా..ఎంత అందంగా ఉందో) తాజాగా తన బిడ్డకు కోయా ఫోనిక్స్ డోలన్ అనే పేరు పెట్టింది. దీన్ని పెట్టిన పేరును పరిశీలిస్తే ఇలియానా భర్త పేరు మైఖేల్ డోలన్ అని తెలుస్తోంది. అతనితో దాదాపు ఏడాది పాటు డేటింగ్లో ఉన్న ముద్దుగుమ్మ.. ఈ ఏడాది మే 13 న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందని సమాచారం. ఇలియానా గర్భం ధరించినట్లు సోషల్ మీడియాలో ప్రకటించడానికి ఒక నెల ముందు పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. అయితే పెళ్లి గురించి ఇప్పటివరకు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే ఇలియానా భర్త మైఖేల్ గురించి పూర్తి వివరాలు తెలియరాలేదు. కాగా.. గతంలో కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్‌తో రిలేషన్షిప్లో ఉందని రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. గర్భం ధరించాక పలుసార్లు సోషల్ మీడియాలో అప్డేట్స్ ఇస్తూ వచ్చింది. అదే సమయంలో భర్త ఫోటోలను సైతం రివీల్ చేసింది. (ఇది చదవండి: చేయి ఆడించడం, ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా: నటి) View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. ఫోటో వైరల్
పండంటి బిడ్డకు జన్మనిచ్చి నటి ఇలియానా అమ్మ అయ్యారు . ఆగస్టు 1న మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా ఇలియానా తెలిపారు. తన చిన్నారి ఫొటోను షేర్ చేస్తూ ఆనందాన్ని ఇలా పంచుకున్నారు. 'ఈ ప్రపంచంలోకి మా ప్రియమైన అబ్బాయి ‘కోవా ఫీనిక్స్ డోలన్’ని పరిచయం చేస్తున్నాను. ఇది ఎంత సంతోషంగా ఉందో మాటల్లో వర్ణించలేను. మా హృదయాలను దాటి ప్రపంచానికి ఇలా పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీనిని మాటల్లో చెప్పలేం.' అని ఇలియానా తెలిపారు. దీంతో ఆమెకు పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. (ఇదీ చదవండి: క్లీంకార గురించి చిరంజీవి చెప్పిందే నిజం అయిందా.. కలిసొచ్చిన వేల కోట్లు) తాను తల్లి కాబోతున్నట్లు ఇదే ఏడాదిలో ప్రకటించిన ఇలియానా తన ప్రియుడి వివరాలను చాలా గోప్యంగా ఉంచి.. జులైలో ప్రియుడి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కానీ ఆతని వివరాలు,పేరు ఇప్పటికి వెల్లడించలేదు. దీంతో ఆమెపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తండ్రి వివరాలు బయటి ప్రపంచానికి చెప్పుకోలేని స్థితిలో ఎలా ఉన్నారని సోషల్‌మీడియా ద్వారా పలువురు కామెంట్లు పెడుతున్నారు. కనీసం ప్రియుడితో పెళ్లి అయినా అయిందా..? అంటూ కామెంట్లు చేస్తున్నారు. భర్త వివరాలు ఇంత రహస్యంగా ఎందుకు ఉంచారంటూ ఏకంగా అతనేమైనా టెర్రరిస్టా..? అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే రాయలేని భాష ఉపయోగిస్తు ఇలియానపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఆమె స్పందిస్తే మంచిదని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. దేవదాసు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన గోవా బ్యూటీ ఇలియానా. తొలి సినిమాతోనే గుర్తింపు పొందిన ఈమె ఆ తర్వాత పోకిరి సినిమాతో యూత్ క్రష్‌గా మారింది. కెరీర్ ఆరంభించిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పింది. స్టార్ హీరోలతో పాటు యంగ్‌స్టర్స్‌తోనూ జతకట్టిన ఈ భామ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ టాలీవుడ్‌కు ఫుల్స్టాప్ పెట్టేసి బాలీవుడ్‌కు మకాం మారింది. అయితే తెలుగుతో పోలిస్తే అక్కడ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. దీంతో కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) -
నిండు గర్భంతో పోకిరీ భామ.. బేబీ బంప్ ఫోటో వైరల్!
పోకిరీ భామ ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేశ్ బాబు సరసన 'పోకిరి' సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లింది. ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీసులు కూడా చేస్తోంది. అయితే పెళ్లి కాకుండానే అందరికీ షాకిచ్చింది భామ. ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించి ఊహించని విధంగా ఏకంగా బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. (ఇది చదవండి: ఫ్రెండ్ పార్టీలో చిల్ అవుతోన్న టాలీవుడ్ హీరోయిన్.. ఏకంగా మందు కొడుతూ!) అయితే ఆమె ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం తొమ్మిది నెల గర్భంతో ఉన్న ఇలియానా లేటెస్ట్ బేబీ బంప్ పిక్‌ను పంచుకుంది. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇలియానా తన ఇన్‌స్టాలో రాస్తూ.. ' మై లిటిల్' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. తెలుగులో స్టార్ హీరోయిన్గా నటించిన ఇలియానాకు.. కానీ తర్వాత కాలంలో సరైన సినిమాలు చేయకపోవడం ఈమె కెరీర్‌కు మైనస్ అయిపోయింది. దీనికి తోడు ఆమె ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టకపోవడం కూడా ఓ రకంగా అవకాశాలు తగ్గిపోవడానికి కారణం అని చెప్పొచ్చు. గతేడాది కాస్త సన్నబడినప్పటికీ పెద్దగా ఛాన్సులు అయితే రాలేదు. ఇదిలా ఉండగా.. ప్రెగ్నెన్సీ ప్రకటించి సినిమాలకు విరామం తీసుకుంది. బాలీవుడ్‌లోనూ 'బర్ఫీ', 'పటా పోస్టర్ నిఖలా హీరో', 'మెయిన్ తెరా హీరో', 'రుస్తుం' లాంటీ సినిమాల్లో నటించి మంచి హిట్లు అందుకుంది. అయితే ‘రుస్తుం’,‘బాద్షాహో’ ‘రైడ్’, ‘ముబారకన్’ వంటి కథ ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించినా... ఇలియానాకు బీటౌన్‌లో సరైన బ్రేక్ లభించలేదు. చివరగా ఇలియానా తెలుగులో రవితేజ హీరోగా తెరకెక్కిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ మూవీలో నటించింది. (ఇది చదవండి: మరింత ముదురుతోన్న ఆష్విట్జ్ వివాదం.. ఆ సినిమాను తొలగించాలంటూ డిమాండ్!) View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) -
డేట్ నైట్
‘‘బాగా నిద్రపోవాలని ఫిక్స్ అయినప్పుడు కడుపులో ఉన్న బిడ్డ డ్యాన్స్ పార్టీ పెట్టుకోవాలని ఫిక్స్ అయితే.. ఇక నిద్ర ఎలా పోతాం’’ అంటూ చిరనవ్వులు చిందిస్తూ తన ప్రెగ్నెన్సీ తాలూకు ఆనందాన్ని ఇటీవల ఇలియానా పంచుకున్న విషయం తెలిసిందే. ‘‘నేను తల్లిని కాబోతున్నా’’ అని ఇలియానా ప్రకటించినప్పటి నుంచి తండ్రి వివరాలు తెలుసుకోవాలని చాలామంది ఆసక్తిగా ఉన్నారు. ఆ మధ్య ఓ వ్యక్తి ముఖాన్ని బ్లర్ చేసి, ఇలియానా ఆ ఫొటోను షేర్ చేశారు. సోమవారం స్పష్టంగా ఉన్న ఫొటోను షేర్ చేసి, ‘డేట్ నైట్’ అంటూ ఆ వ్యక్తితో దిగిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అయితే అతని పేరు, ఇతర వివరాలేమీ ఇలియానా బయటపెట్టలేదు. ‘డేట్ నైట్’ అన్నారు కాబట్టి అతను ఇలియానా బాయ్‌ఫ్రెండ్ అని స్పష్టమవుతోంది. మరి.. రహస్య వివాహం ఏమైనా చేసుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది. -
ప్రెగ్నెన్సీ.. కంట్రోల్లో లేని బరువు? కలవరపడుతున్న ఇలియానా!
ఒకప్పుడు బొద్దుగుమ్మలకు డిమాండ్ ఉండేది. కానీ కాలం మారుతూ ఉండేకొద్దీ సన్నజాజిలకు క్రేజ్ పెరిగిపోయింది. సరిగ్గా అలాంటి సమయంలో జీరో సైజ్ నడుముతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. స్లిమ్ అండ్ ఫిట్‌గా ఉంటే ఈ బ్యూటీ దేవదాసు చిత్రంతో తెలుగులో తళుక్కుమని మెరిసింది. ఆ తర్వాత పోకిరి, రెడీ వంటి పలు హిట్ చిత్రాల్లో నటించిన ఆమె ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. ఇటీవల పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. తరచూ బేబీ బంప్ ఫోటోలు కూడా షేర్ చేస్తోంది. కానీ బిడ్డకు తండ్రెవరు? అన్నది మాత్రం చెప్పడం లేదు. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది. నువ్వు బరువు పెరుగుతున్నావని ఏమైనా ఆందోళన చెందుతున్నావా? అన్న ప్రశ్నకు ఇలియానా స్పందిస్తూ.. 'కడుపులో బిడ్డను మోస్తున్నప్పుడు బరువు పెరగడం సహజం. కానీ జనాలు దీని గురించి పదేపదే కామెంట్ చేస్తుండటంతో మొదట నేను కూడా కొంత కలవరపడ్డాను. డాక్టర్ దగ్గరకు చెకప్‌కు వెళ్లిన ప్రతిసారి బరువు చెక్ చేస్తుండటంతో ఎంత వెయిట్ ఉన్నానో తెలిసిపోయేది. నా కడుపులో ఒక శిశువు ప్రాణం పోసుకుంటున్న విషయాన్ని అందరూ గుర్తు చేసేవారు. అప్పుడు బరువు గురించి ఆలోచించడం అనవసరం అనిపించింది. కొన్ని నెలలుగా నా శరీరంలో ఎలాంటి మార్పులు వచ్చినా సంతోషంగా స్వీకరిస్తున్నాను. ఇదొక అద్భుతమైన ప్రయాణం. నా చుట్టూ నన్ను ప్రేమించే వ్యక్తులు ఉన్నారు. కాబట్టి బరువు అనేది పెద్ద విషయం కాదు. సరిగ్గా ఇన్ని కిలోలు పెరిగితే చాలు వంటి నిబంధనలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండండి. మీ శరీరం మాట వినండి. మీ మనసుకు నచ్చిందే చేయండి' అని చెప్పుకొచ్చింది. తొలిసారి బేబీ గుండెచప్పుడు విన్నప్పుడు మీకెలా అనిపించింది? అన్న ప్రశ్నకు 'అత్యంత ఆనందమైన క్షణాల్లో ఇది ఒకటి. నేను ఎంత సంతోషించాను అనేదాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాను. సంతోషం, కన్నీళ్లు, తృప్తి.. ఇలా అన్ని భావోద్వేగాలు ఒకేసారి వచ్చాయి' అని పేర్కొంది ఇలియానా. చదవండి: రజనీకాంత్ భార్యగా నిరోషా? ఈ సినిమాతోనే రీఎంట్రీ -
బేబీ మూన్ ఎంజాయ్ చేస్తోన్న ఇలియానా.. పోస్ట్ వైరల్!
దేవదాసు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన గోవా బ్యూటీ ఇలియానా. తొలి సినిమాతోనే గుర్తింపు పొందిన ఈమె ఆ తర్వాత పోకిరి సినిమాతో ఒక్కసారిగా స్టార్డమ్ సొంతం చేసుకుంది. కెరీర్ ప్రారంభించిన తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత టాలీవుడ్లో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్‌కు మకాం మార్చిన ముద్దుగుమ్మ కొద్ది రోజుల క్రితమే ప్రెగ్నెన్నీ ప్రకటించి అందరికీ షాకిచ్చింది. పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ ప్రకటించడంతో అభిమానులంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. (ఇది చదవండి: బేబీ బంప్‌తో ఇలియానా సెల్ఫీ.. మొత్తానికి ఆ విషయం బయట పెట్టేసిందిగా!) ఇప్పటికే ఇలియానా బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీ మూడ్‌ను ఎంజాయ్ చేస్తోంది ఇలియానా. తాజాగా బేబీమూన్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. బీచ్ ఒడ్డున బేబీమూన్ మూమెంట్స్ అస్వాదిస్తున్న ఫోటోలను పంచుకుంది. ప్రస్తుతం ఇవీ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. (ఇది చదవండి: ఇలియానాకు ప్రెగ్నెన్సీ.. రైడ్‌కు వెళ్లిన ముద్దుగుమ్మ!) కాగా.. ఇలియానా చివరిసారిగా రాపర్-సింగర్ బాద్షాతో కలిసి సబ్ గజాబ్ అనే మ్యూజిక్ వీడియోలో కనిపించింది. ఆమె చివరిగా అభిషేక్ బచ్చన్‌తో కలిసి ది బిగ్ బుల్లో కనిపించింది. ఆ తర్వాత రణదీప్ హుడాతో కలిసి అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ చిత్రంలో కనిపించనుంది. -
బేబీ బంప్‌తో ఇలియానా సెల్ఫీ.. మొత్తానికి ఆ విషయం బయట పెట్టేసిందిగా!
దేవదాసు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన గోవా బ్యూటీ ఇలియానా. తొలి సినిమాతోనే గుర్తింపు పొందిన ఈమె ఆ తర్వాత పోకిరి సినిమాతో యూత్ క్రష్‌గా మారింది. కెరీర్ ఆరంభించిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. కానీ ఆ తర్వాత టాలీవుడ్లో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్‌కు మకాం మార్చింది. అయితే తెలుగుతో పోలిస్తే అక్కడ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. దీంతో కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. (ఇది చదవండి: ఇలియానాకు ప్రెగ్నెన్సీ.. రైడ్‌కు వెళ్లిన ముద్దుగుమ్మ!) ఇటీవలే సోషల్ మీడియాలో తాను గర్భం ధరించినట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చింది. పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ కావడంతో అవాక్కయ్యారు. తాజాగా మరోసారి తన బేబీ బంప్‌ను ప్రదర్శించింది ముద్దుగుమ్మ. మిర్రర్ ముందు సెల్ఫీ దిగుతూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. అంతే కాకుండా 'ఇట్స్ ఆల్ ఏబౌట్ ఎంజెల్స్' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. అంటే పరోక్షంగా ఆమెకు పుట్టబోయే బిడ్డ గురించి హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలియానాకు పుట్టబోయేది కూతురే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇలియానా ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆ బిడ్డకు తండ్రి ఎవరన్న దానిపై జోరుగా చర్చ నడుస్తుంది. గతంలో హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఇలియానా రిలేషన్షిప్లో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు, వీరిద్దరూ కలిసి కత్రినా, విక్కీలతో కలిసి మాల్దీవులకు వెకేషన్‌కు వెళ్లారు. కానీ ప్రెగ్నెన్సీ బయటపెట్టినా ఇంతవరకు తన రిలేషన్ షిప్ స్టేటస్ మాత్రం ఇలియానా రివీల్ చేయకపోవడం గమనార్హం. (ఇది చదవండి: విషాదం.. ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ కన్నుమూత) -
ఇలియానాకు ప్రెగ్నెన్సీ.. రైడ్‌కు వెళ్లిన ముద్దుగుమ్మ!
గోవా బ్యూటీ ఇలియానా ఇటీవలే ప్రెగ్నెన్సీ ధరించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. పెళ్లి కాకముందే గర్భం ధరించనట్లు ప్రకటించడంతో ఫ్యాన్స్ షాకయ్యారు. పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరంటూ కొంతమంది నెటిజన్స్ ప్రశ్నించారు కూడా. ఆ తర్వాత కూడా బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను పంచుకుంది ముద్దుగుమ్మ. అయితే తాజాగా మరో వీడియోను షేర్ చేసింది. బేబీ బంప్‌తో ఉన్న ఇలియానా కారులో వెళ్తున్న వీడియోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. అంతే కాకుండా 'సన్ అవుట్, బంప్స్ అవుట్' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న ఇలియానా!) కాగా.. గతంలో ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో ఇలియానా పెళ్లి అయింది. కొన్నాళ్లు కలిసి జీవించిన ఈ జంట.. 2019లో విడిపోయారు. అప్పట్నుంచి ఆమె సింగిల్ గానే ఉంటోంది. కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వినిపించాయి. కానీ ఇలియానా మాత్రం ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతానికి అయితే ఇలియానా లైఫ్ పార్టనర్ ఎవరనేది ఇప్పటి వరకు తెలియదు. (ఇది చదవండి: పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. 72 గంటలే డెడ్ లైన్: స్టార్ హీరోయిన్) -
తొలిసారిగా బేబీ బంప్ ఫోటోను షేర్ చేసిన ఇలియానా
దేవదాసు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన గోవా బ్యూటీ ఇలియానా. తొలి సినిమాతోనే గుర్తింపు పొందిన ఈమె ఆ తర్వాత పోకిరి సినిమాతో యూత్ క్రష్‌గా మారింది. కెరీర్ ఆరంభించిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పింది. స్టార్ హీరోలతో పాటు యంగ్‌స్టర్స్‌తోనూ జతకట్టిన ఈ భామ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ టాలీవుడ్‌కు ఫుల్స్టాప్ పెట్టేసి బాలీవుడ్‌కు మకాం మారింది. అయితే తెలుగుతో పోలిస్తే అక్కడ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. దీంతో కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఇలియానా రీసెంట్గా తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. తాజాగా తొలిసారిగా తన బేబీ బంప్‌ను షేర్చేసింది. ప్రస్తుతం ఇలియానా షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే ఇలియానా ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆ బిడ్డకు తండ్రి ఎవరన్న దానిపై జోరుగా చర్చ నడుస్తుంది. హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఇలియానా రిలేషన్షిప్లో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు, వీరిద్దరూ కలిసి కత్రినా, విక్కీలతో కలిసి మాల్దీవులకు వెకేషన్‌కు వెళ్లారు. కానీ ప్రెగ్నెన్సీ బయటపెట్టినా ఇంతవరకు తన రిలేషన్ షిప్ స్టేటస్ మాత్రం ఇలియానా రివీల్ చేయకపోవడం గమనార్హం. -
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్లు వీరే
చిత్ర పరిశ్రమలో డేటింగ్ అనేది సర్వసాధారణం. ఇద్దరు ఇష్టపడితే చాలు కలిసి సహజీవనం చేస్తుంటారు. వారిలో కొంతమంది మాత్రమే తమ రిలేషన్‌ని పెళ్లి వరకు తీసుకెళ్తున్నారు. మరికొంతమంది హీరోయిన్లు అయితే పెళ్లికి ముందే డేటింగ్ చేసి గర్భం దాల్చుతున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు పెళ్లికి ముందే గర్భంగా దాల్చారు. అలాంటి వారిపై ఓ లుక్కేద్దాం. ఇలియానా ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగింది ఇలియానా. ఆ తర్వాత బాలీవుడ్‌కి మకాం మార్చింది. అయితే అక్కడ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఇలియానా ఇటీవల షాకింగ్ విషయం తెలిపింది. త్వరలోనే తాను తల్లిని కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో కొన్నాళ్లు డేటింగ్లో ఉన్న ఇలియానా.. 2019లో అతనితో విడిపోయింది. అప్పటి నుంచి ఆమె సింగిల్‌గానే ఉంటుంది. కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మైఖేల్‌తో డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వినిపించాయి. కానీ ఇలియానా మాత్రం ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు సడెన్‌గా తల్లిని కాబోతున్నట్లు వెల్లడించి అందరికి షాకిచ్చింది. త్వరలోనే బిడ్డకి తండ్రి ఎవరో ప్రకటించి, పెళ్లి పీటలేక్కబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలియా భట్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ సైతం పెళ్లికి ముందే గర్భం దాల్చింది. హీరో రణబీర్ కపూర్‌తో కొన్నాళ్ల పాటు డేటింగ్ చేసిన అలియా.. 2022 ఏప్రిల్‌లో అతన్ని పెళ్లి చేసుకుంది. అయితే అప్పటికే అలియా ప్రెగ్నెంట్. కానీ వివాహం అయిన రెండు నెలల తర్వాత ఈ విషయాన్ని వెల్లడించారు. గతేడాది నవంబర్‌లో ఈ జంట ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అమీ జాక్సన్ ఎవడు, రోబో 2.O చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి అమీ జాక్సాన్. నటిగా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే వ్యాపారవేత్త జార్జ్ పనియోటౌతో ప్రేమలో మునిగి తేలిన అమీ జాక్సన్ పెళ్లికాకుండానే ఆండ్రూ అనే కుమారుడికి జన్మనిచ్చింది. చాలా రోజుల క్రితం ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట.. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండానే కలిసి జీవిస్తున్నారు. రేణు దేశాయ్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సైతం పెళ్లికి ముందే అకీరా నందన్‌కు జన్మనిచ్చింది. ‘బద్రి’ సినిమాతో ప్రేమలో పడిన ఈ జంట.. కొన్నాళ్ల పాటు సహజీవనం చేసి అకీరా పుట్టాక పెళ్లి చేసుకుంది. మరో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత విడాకులు తీసుకున్నారు. పూర్ణ మలయాళీ బ్యూటీ పూర్ణ సైతం పెళ్లికి ముందే గర్భం దాల్చింది. ‘సీమ టపాకాయ్’, ‘అవును’చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ.. గతేడాది అక్టోబర్‌లో దుబాయ్ వ్యాపారవేత్త, జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్ షానిద్ అసిఫ్ అలీని పెళ్లాడింది. ఆరు నెలలు గడవకముందే ఏప్రిల్ 4న ఓ బిడ్డకు జన్మనిచ్చింది. వీరితో పాటు బాలీవుడ్ హీరోయిన్లు దియా మీర్జా కల్కి కొచ్లిన్, నేహా ధూపియా అమృత అరోరా కూడా పెళ్లికి ముందే గర్భం దాల్చారు. -
ఇలియానాపై నిషేధం.. అందుకే సినిమాలకు దూరం!
తొలి సినిమా ‘దేవదాస్’తోనే అటు ఫిల్మ్ ఇండస్ట్రీని, ఇటు యూత్‌ని తనవైపుకు తిప్పుకుంది ఇలియానా. రెండో సినిమా పోకిరితో స్టార్ హీరోయిన్ అయింది. ఆ తర్వాత ఇలియానా వెనక్కి తిరిగి చూడలేదు. తెలుగులో వరుస సినిమాలు చేస్తూ.. అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్గా అవతరించింది. సౌత్‌లో కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్నప్పుడే తన మకాంని బాలీవుడ్‌కి మార్చింది. అక్కడ వరుస సినిమాలు చేసినప్పటికీ.. ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. అయినా కూడా మళ్లీ సౌత్ ఇండస్ట్రీ వైపు చూడలేదు. 2018లో అమర్ ఆక్బర్ ఆంటోనీ తర్వాత ఇలియానా తెలుగు తెరపై కనిపించలేదు. అయితే బాలీవుడ్‌పై ఉన్న మోజుతోనే ఇలియానా సౌత్ ఇండస్ట్రీని పక్కకి పెట్టిందని అంతా అనుకున్నారు. కానీ ఆమె కావాలని సౌత్ సినిమాలకు దూరంగా వెళ్లలేదట. సౌత్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇలియానాపై నిషేదం విధించిందట. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఈ నిజం ఇప్పుడు బయటకు వచ్చింది. ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమా సమయంలోనే ఇలియానా ఓ కోలీవుడ్ సినిమా చేసేందుకు ఒప్పుకుంది. కోలీవుడ్ నిర్మాత నటరాజ్.. విక్రమ్ హీరోగా నందం అనే మూవీ ప్లాన్ చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్గా ఇలియానాను తీసుకున్నారు. ఆమెకు రూ.40 లక్షలు కూడా అడ్వాన్స్ ఇచ్చాడట. అయితే అనుకొని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. దీంతో అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇవ్వమని నిర్మాత అడిగితే.. దానికి ఇలియానా నిరాకరించిందట. కావాలంటే మరో సినిమాలో నటిస్తాను కానీ డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వనని తెగేసి చెప్పిందట. దీంతో సదరు నిర్మాత నడిగర్ సంఘంతో పాటు సౌత్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌ని ఆశ్రయించారట. వారు కూడా చెప్పిన వినకపోవడంతో.. డబ్బులు తిరిగి ఇచ్చే వరకు ఇలియానాను సౌత్ సినిమాల్లో తీసుకోకూడదని నిర్ణయించుకున్నారట. అందుకే ఇలియానా తెలుగు సినిమాలకు దూరమైనట్లు తెలుస్తుంది. అయితే ఇటీవల ఈ సమస్యను ఇలియాన పరిష్కరించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆమె సౌత్ సినిమాల్లో నటిస్తుందనే ప్రచారం టీటౌన్లో గట్టిగా వినిపిస్తోంది. మరి ఈ గోవా బ్యూటీ ఏ హీరోతో రీఎంట్రీ ఇస్తుందో చూడాలి. -
ఆస్పత్రి పాలైన ఇలియాన, ఆహారం కూడా తీసుకోలేని స్థితిలో..!
ఇలియానా.. టాలీవుడ్లో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా రాణించింది గోవా బ్యూటీ. ‘దేవదాస్’ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఆమె పోకిరి మూవీతో మంచి గుర్తింపు పొందింది. ఇక ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరమైన ఇలియాన సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలను, లేటెస్ట్ ఫొటోలను తరచూ సోషల్ మీడియాలో పంచుకుంటుంది ఫ్యాన్స్‌కి చేరువుగా ఉంటుంది. అయితే తాజాగా ఇలియాన తీవ్ర అస్వస్థతకు గురైంది. కనీసం ఆహారం తీసుకోలే స్థితిలో ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతుంది. తాజాగా తన హెల్త్ గురించి సోషల్ మీడియాలో ఇలియాన అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలో షేర్ చేసింది. తాను ఆహారం తీసుకోలేని స్థితి ఉండగా వైద్యులు మూడు బాటిళ్ల సలైన్స్ ఎక్కించినట్లు ఈ సందర్భంగా చెప్పింది. తన పోస్ట్‌లో ఒక్క రోజులో ఎంత మార్పు అంటూ చేతికి సలైన్ ఎక్కిస్తున్న ఫొటోని షేర్ చేసింది. ఇక మరో ఫొటోకి.. డాక్టర్లు తనని బాగా ట్రీట్ చేస్తున్నారని, 3 బ్యాగ్స్ ఐవీ లిక్విడ్స్ ఇచ్చినట్లు క్యాప్షన్ ఇచ్చింది. తన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్, సన్నిహితులను ఉద్దేశిస్తూ ఆమె మరో పోస్ట్ షేర్ చేసింది. ‘అందరూ నా ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. ఇంతగా నాపై ప్రేమ, అప్యాయత చూపిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞుతురాలిని. ఇప్పుడ నేను బాగానే ఉన్నాను. నాకు మంచి వైద్యం అందుతోంది’’ అని పేర్కొంది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఆకాంక్షిస్తున్నారు. చదవండి: నా కూతురికి దూరంగా ఉండాల్సి వస్తోంది : ప్రణిత ఎమోషనల్ ఆ భయంతోనే అజిత్ సినిమాను వదులుకున్నాను: జయసుధ -
స్టార్ హీరోయిన్ సోదరుడితో ఇలియానా డేటింగ్ !.. ఫొటోలు వైరల్
Ileana Dating With Katrina Kaif Brother Sebastian: ఇలియానా.. టాలీవుడ్లో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా చెలామణి అయింది ఈ గోవా బ్యూటీ. 'దేవదాస్' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఇల్లీ బేబీ యూత్‌ను 'పోకిరీ'లుగా మార్చేసింది. ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ హీరోయిన్ బ్రదర్‌తో ఈ గోవా బ్యూటీ డేటింగ్లో ఉన్నట్లు ఇంగ్లీష్ వెబ్సైట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ భామ కత్రీనా కైఫ్ సోదరుడుల సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఇలియానా లవ్ ట్రాక్ నడిపిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది కత్రీనా తన బర్త్‌డే సెలబ్రేషన్స్ కోసం భర్త విక్కీ కౌశల్, బ్రదర్ సెబాస్టియన్, ఇతర ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి మాల్దీవులకు వెళ్లింది. ఈ వేడుకల్లో ఇలియానా కూడా పాల్గొంది. సెబాస్టియన్‌తో కలిసి సందడి చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను కత్రీనా, ఇలియానా ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. చదవండి: పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ.. వెబ్ వీక్షకులు ఎక్కువగా సెర్చ్ చేస్తున్న ఈమె ఎవరో తెలుసా ? View this post on Instagram A post shared by Ileana D'Cruz (@ileana_official) నెట్టింట తెగ వైరల్ అయిన ఈ ఫొటోలను చూసిన నెటిజన్స్ 'ఎలాంటి సంబంధం లేకుండా ఇలియానా బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో ఎందుకు పాల్గొంది?' అని చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇలియానా, సెబాస్టియన్ 6 నెలలుగా డేటింగ్ చేస్తున్నట్లు పలు వెబ్సైట్లలో వార్తలు వచ్చాయి. మరోవైపు సెబాస్టియన్ ఇన్‌స్టా అకౌంట్‌ను గత కొంతకాలంగా ఇలియానా ఫాలో అవుతోంది. కాగా ఈ గోవా సుందరి గతంలో ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో ప్రేమాయణం జరిపిన విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల డేటింగ్ తర్వాత వీరిద్దరూ 2019లో విడిపోయారు. అయితే ఆండ్రూ, ఇలియానా పెళ్లి చేసుకునే విడిపోయినట్లు వార్తలు వెలువడ్డాయి. చదవండి: మళ్లీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు.. వీడియో వైరల్ అలియా భట్‌కు కవలలు ? రణ్‌బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. -
నవ్విస్తాం.. ఏడిపిస్తాం...
విద్యాబాలన్–ఇలియానా–ప్రతీక్ గాంధీ–సెంథిల్ రామమూర్తి... ఈ నలుగురూ కలసి నవ్వించడానికి... ఏడిపించడానికి రెడీ అయ్యారు. వీరి కాంబినేషన్లో రూపొందనున్న సినిమా అధికారిక ప్రకటన గురువారం వెల్లడైంది. దర్శకురాలు శీర్షా గుహ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమా గురించి విద్యాబాలన్ మాట్లాడుతూ – ‘‘ఆధునిక మానవ సంబంధాల చుట్టూ ఈ సినిమా ఉంటుంది. ఇది మీ కథలా అనిపించొచ్చు.. లేకపోతే మీ ప్రెండ్ కథలానూ అనిపించొచ్చు. మొత్తం మీద మనలో ఒకరి కథ. సినిమా ఎంత నవ్విస్తుందో అంతే సమానంగా ఏడిపిస్తుంది కూడా’’ అన్నారు. ‘‘ఈ కథలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే... ఇది అందరి కథ. ప్రపంచం మొత్తానికి చెందిన కథ. ఎలాంటి యాక్టర్లతో సినిమా చేయాలని కల కన్నానో వాళ్లతోనే ఈ సినిమా చేస్తున్నాను’’ అని శీర్షా అన్నారు. త్వరలో ఈ సినిమా టైటిల్ ప్రకటించనున్నారు. వచ్చే ఏడాది చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
గోవా బ్యూటీ డిజిటల్ ఎంట్రీ.. త్వరలోనే ‘ఇలియానా టాక్ షో’
కరోనా పుణ్యమా అని డిజిటల్ మీడియాకి డిమాండ్ పెరిగింది. స్టార్ హీరోలతో పాటు హీరోయిన్లు కూడా డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. డిజిటల్లో వెబ్ సీరీస్‌లతో పాటు టాక్ షోలకు కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. వాటిలో ముఖ్యంగా స్టార్ హీరోయిన్లు చేసే టాక్ షోకి మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో టీవీ చానళ్లతో పాటు ఓటీటీ సంస్థలు కూడా పేరున్న హీరోయిన్లను రంగంలోకి దించుతున్నారు. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కోసం సమంత ఓ టాక్ షోని చేసింది.ఆ షోకి మంచి స్పందనే వచ్చింది. ఇక తమన్నాతో సైతం ఓ టాక్ షోకి ప్లాన్ చేస్తుంది ‘ఆహా’. ఇదిలా ఉంటే ఇప్పుడు గోవా బ్యూటీ ఇలియానా కూడా డిజిటల్ ఎంట్రీకి సిద్ధమైందని సీనీ వర్గాల సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఇలియానా ఓ టాక్ షో చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిగిపోయాయట. తొలుత ఓ సీజన్‌ని షూట్ చేసి విడుదల చేస్తారట. దానికి వచ్చిన రెస్పాన్స్ని బట్టి మరో సీజన్‌ని ప్లాన్ చేయాలని భావిస్తున్నారట. ఇక ఈ టాక్ షో కోసం ఇలియానా భారీగానే పుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. దక్షిణాదికి చెందిన ఓ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఈ టాక్‌షోని రూపొందించబోతున్నట్లు సమాచారం. -
అందుకే ఎక్కువ సినిమాలు చేయలేకపోతున్నా!
‘‘ఎక్కువ సినిమాలు చేయాలనే తాపత్రయంలో ఏ కథ నా దగ్గరకు వస్తే ఆ కథకు ఓకే చెప్పాలనుకోవడంలేదు. కథాబలం ఉండి, నా పాత్ర సినిమాను ముందుకు నడిపించేలా ఉంటేనే ఒప్పుకుంటా’’ అంటున్నారు ఇలియానా. ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్గా దూసుకెళ్లిన ఈ బ్యూటీ ఆ తర్వాత హిందీకి వెళ్లారు. అక్కడికి వెళ్లిన మొదట్లో బాగానే అవకాశాలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఇలియానా చేతిలో ఏడాదికి ఒక సినిమా మించి ఉండటం లేదు. ఈ విషయం గురించి ఇలియానా ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ – ‘‘ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు పాత్రల ఎంపికలో నా విధానం పూర్తిగా మారిపోయింది. ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు.. ఎన్ని మంచి సినిమాలు చేశామన్నదే ముఖ్యం. ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాను. డిఫరెంట్ రోల్స్ మాత్రమే చేయాలనుకుంటున్నాను. అందుకే నేను ఎక్కువ సినిమాలు చేయలేకపోతున్నాను. ఇప్పుడైతే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ చేయాలని ఉంది. అలాంటి కథ కోసం చూస్తున్నాను’’ అన్నారు. ఇదిలా ఉంటే.. ఇలియానా నటించిన హిందీ చిత్రం ‘అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ’ విడుదలకు సిద్ధమైంది. -
ఎవరేమన్నా పట్టించుకోను!
సెలబ్రిటీలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వారికి నెటిజన్ల నుంచి ప్రశంసలు ఏ స్థాయిలో ఉంటాయో విమర్శలు కూడా ఆ స్థాయిలోనే ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్ల శరీరాకృతిని హేళన చేస్తూ (బాడీ షేమింగ్) రకరకాల కామెంట్లు పోస్ట్ చేస్తుంటారు. ఈ పోస్టులు సదరు సెలబ్రిటీలను బాధకు గురిచేస్తుంటాయి. గోవా బ్యూటీ ఇలియానా కూడా శరీరాకృతిపై వేధింపుల్ని ఎదుర్కొన్నారట.. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెబుతూ – ‘‘ఇన్ స్టాగ్రామ్‌లో నా శరీరాకృతి విషయంలో వేధింపులకు గురికావడం నాకు కొత్త కాదు. ఆ మాటకొస్తే ఇన్స్టాగ్రామ్ లేని రోజుల్లోనే.. నా బాల్యం నుంచే ఇలాంటి వేధింపులను భరిస్తూ వస్తున్నాను. కొన్నిసార్లు మాటల్లో చెప్పలేని విధంగా కామెంట్లు చేస్తుంటారు. నీ పిరుదుల సైజు ఎంత? సర్జరీ చేయించుకోవచ్చుగా? నీ కాళ్లు అలా ఎందుకున్నాయి? వంటి ప్రశ్నలను సంధిస్తుంటారు. సోషల్ మీడియాలో నాకు వచ్చే మెసేజెస్‌లో కనీసం 10 మెసేజ్‌లు ఇలాంటివే ఉంటాయి. ఆ ప్రశ్నలతో నా శరీరం మీద నాకే ఓ నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. కొన్నిసార్లు ఓ రకమైన భయానికి లోనయ్యేదాన్ని. ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ల లోపం వల్ల శరీరంలో చాలా రకాలుగా మార్పులు సంభవిస్తుంటాయి. నా శరీరాకృతిపై అలాంటి కామెంట్లు చేసే ప్రతి ఒక్కరికీ ఒక్కో రకమైన శరీరాకృతి ఉంటుంది.. అది వారి లోపంగా భావించకూడదనే విషయాన్ని నెటిజన్లు తెలుసుకోవాలి. మాటల రూపంలో నెటిజన్లు పెట్టే హింసను పట్టించుకోవద్దని అనుకొంటాను.. కానీ కొన్నిసార్లు మానసికంగా వేదనకు గురయ్యే కామెంట్లు వినిపిస్తుంటాయి. వేధింపులను తట్టుకోలేక ఓ సందర్భంలో వైద్యులను సంప్రదించాను. ఈ రకమైన సమస్యను డిస్మార్ఫియా అంటారట. ఈ రుగ్మత వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ చూసేవాళ్లు కామెంట్ చేయడం వల్ల ఓ రకమైన మానసిక సంఘర్షణ ఏర్పడేది. అయితే ఈ మానసిక వేదన అంతా ఒకప్పుడు. ఇప్పుడు ఎవరేమన్నా పట్టించుకోను. ఎవరో ఏదో అన్నారని కుంగిపోకూడదు. మన గురించి మనం పాజిటివ్‌గా ఆలోచించుకోవాలి. అప్పుడు ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది’’ అని పేర్కొన్నారు ఇలియానా. కాగా ఇలియానా ప్రస్తుతం రణ్‌దీప్ హుడాతో కలిసి ‘అన్ ఫెయిర్ అండ్ లవ్లీ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ముచ్చటగా మూడోసారి ‘బాద్షా హో’ (2017), ‘రైడ్’ (2018) చిత్రాల్లో అజయ్ దేవగణ్, ఇలియానా జంటగా నటించారు. తాజాగా అజయ్, ఇలియానా మరోసారి జోడీ కట్టనున్నారనే టాక్ బీ టౌన్లో వినిపిస్తోంది. అజయ్ దేవగణ్ ‘రుద్ర’ అనే వెబ్ సిరీస్ అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో అజయ్, ఇలియానా జంటగా కనిపించనున్నారట. ఇది నిజమైతే వీరిద్దరూ ముచ్చటగా మూడోసారి జతకట్టినట్లు అవుతుంది. -
Pokiri@15 Years: ఫస్ట్ అనుకున్న హీరో మహేశ్ కాదు, టైటిల్ ఇదే
‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగాడు.. నేనే’, ‘అన్నయా.. ఈ తొక్కలో మీటింగులేంటో నాకర్థం కావట్లేదు. పదిమంది ఉన్నారు.. అందర్ని లేపేస్తే ఇంటికెళ్లిపోవచ్చు’, ఎప్పుడు వచ్చావని కాదన్నయా.. బుల్లెట్ దిగిందా లేదా?, ‘ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను’ ఈ డైలాగ్స్‌కి ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు దద్దరిల్లిపోయాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు, డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘పోకిరి’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. టాలీవుడ్‌కి కలెక్షన్ల టేస్ట్ చూపించిన సినిమా ‘పోకిరి’. ఈ సూపర్ హిట్ మూవీ విడుదలై నేటికి (ఏప్రిల్ 28) 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ‘పోకిరి’గురించి ఆసక్తికరమైన విషయాలు మీకోసం.. మహేశ్ బాబు, పూరీ జగన్నాథ్ కలయికలో వచ్చిన చిత్రం ‘పోకిరి’. ఈ చిత్రం అప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది. సరిగ్గా 15 ఏళ్ల క్రితం 2006 ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదలైంది. తొలుత ఈ సినిమాకు మహేశ్‌ని అనుకోలేదట పూరి. మాస్ మహారాజ రవితేజని దృష్టిలో పెట్టుకొని ఈ కథను సిద్దం చేసుకున్నాడు. అయితే కొన్ని కారణాల వల్ల రవితేజతో ఈ సినిమాను చేయలేకపోయాడట. అలాగే ఈ సినిమాకు ‘పోకిరి’అనే టైటిల్ కూడా చివర్లో పెట్టారట. మొదట్లో ఈ కథకి ‘ఉత్తమ్ సింగ్.. సన్నాఫ్ సూర్య’అని టైటిల్ ఫిక్స్ చేసుకున్నాడట పూరి. కానీ రవితేజ తప్పుకోవడంతో.. టైటిల్‌తో పాటు కథలో మార్పులు కూడా చేశారట. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమాకు హీరోయిన్గా ఇలియానాను కూడా చివరి నిమిషంలో తీసుకున్నారు. తొలుత ఈ చిత్రానికి హీరోయిన్గా అయేషా టాకియాను సంప్రదించారు. కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమాలో నటించడానికి ఒప్పులేదు. ఆ తర్వాత కంగనా రనౌత్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. షూటింగ్‌కి రెడీ అవుతున్న సమయంలో కంగనా కూడా హ్యాండించింది. తనకు బాలీవుడ్లో ‘గ్యాంగ్‌స్టర్’ చిత్రంలో నటించే అవకాశం రావడంతో ‘పోకిరి’ని వదులుకుంది. దీంతో చివరి నిమిషంలో ఇలియానాను సంప్రదించి ఒప్పించారు. ఈ సినిమాతో ఇలియానా స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఇక పోకిరి కంటే ముందు మహేశ్ అన్ని సినిమాల్లోనూ ఒకేలా కనిపించేవాడు. క్లీన్ షేవ్‌తో క్లాస్‌గా కనిపించేవాడు. కానీ తొలిసారి ఈ సినిమాలో ఊరమాస్ గెటప్ దర్శనం ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. క్లాస్‌గా కనిపించే మహేశ్‌లోని ఊరమాస్ యాంగిల్‌ని ప్రేక్షలకు చూపించాడు పూరి. కథ చెప్పినప్పుడే జుత్తు బాగా పెంచాలని చెప్పాడట. పూరి చెప్పినట్లుగానే ‘అతడు’ తర్వాత మహేశ్ నాలుగు నెలల విరామ తీసుకొని మరీ గెటప్‌ని చేంచ్ చేసుకున్నాడు. సరికొత్త లుక్‌లో కనిపించడానికి చాలానే కష్టపడ్డాడు. ఈ కష్టమంతా తెరపై కనిపించింది. ఈ చిత్రం 200 కేంద్రాల్లో 100 రోజులు పైగా నడిచి ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది. దాదాపు రూ.12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ. 40 కోట్లకు పైగా షేర్ సాధించింది. ఇంత షేర్ సాధించిన తొలి తెలుగు చిత్రంగా పోకిరి రికార్డులకు ఎక్కింది. -
షూటింగ్లో ఇలియానా చేతికి గాయం
'దేవదాసు' చిత్రంతో వెండితెరపై హీరోయిన్గా అడుగు పెట్టిన సన్నజాజి ఇలియానా. వరుస సినిమాలతో తెలుగులో హవా చూపిన ఈ భామ 'దేవుడు చేసిన మనుషులు' చిత్రం తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిపోయారు. హిందీ సినిమాలు చేస్తూ అక్కడే సెటిలయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత 'అమర్ అక్బర్ ఆంటోని'తో టాలీవుడ్లో రీఎంట్రీ ఇచ్చినా పెద్ద ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆమె బాలీవుడ్లోనే అవకాశాలు వెతుక్కుంటోంది. తాజాగా ఆమె 'అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ' అనే రొమాంటిక్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్లో ఇలియానా గాయపడ్డారు. (చదవండి: రీ ఎంట్రీకి రెడీ అయిన తనుశ్రీ దత్తా..!) ఆమె అరచేతికి స్వల్ప గాయమైంది. దీనికి సంబంధించిన రెండు ఫొటోలను ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. "ఒక రొమాంటిక్ కామెడీ సినిమా షూటింగ్లో ఎవరైనా గాయపడతారా?" అని నవ్వుతూ సరదాగా రాసుకొచ్చారు. మరో ఫొటోలో "ఐయామ్ ఫైన్" అని తెలిపారు. ఇక ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం "అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ"లో హీరో రణ్‌దీప్ హుడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. హర్యానా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో వర్ణ వివక్షపై పోరాడే యువతి పాత్రలో ఇలియానా కనిపిస్తారు. ఇలియానా నటించిన ‘ముబారకాన్’ సినిమాకు కథ–స్క్రీన్‌ప్లేను అందించిన బల్వీందర్ సింగ్ జంజ్వా ఈ చిత్రంతో దర్శకునిగా మారుతున్నారు. (చదవండి: నేనెప్పుడూ పర్ఫెక్ట్గా ఉండాలనుకోలేదు) -
అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ
హెడ్డింగ్ చదివి ఆశ్చర్యపోయారా? మరేం లేదు.. ఇలియానా క«థానాయికగా నటించనున్న కొత్త చిత్రం పేరు అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ. రణ్‌దీప్ హుడా, ఇలియానా జంటగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇలియానా నటించిన ‘ముబారకాన్’ సినిమాకు కథ–స్క్రీన్‌ప్లేను అందించిన బల్వీందర్ సింగ్ జంజ్వా ఈ చిత్రంతో దర్శకునిగా మారుతున్నారు. మన దేశంలో మనిషి రంగు గురించి పదే పదే మాట్లాడుతూ ఉండటాన్ని కథావస్తువుగా తీసుకుని వినోద ప్రధానంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. హర్యానా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో వర్ణ వివక్షపై పోరాడే యువతి పాత్రలో ఇలియానా కనిపిస్తారు. ఈ సినిమా గురించి ఇలియానా మాట్లాడుతూ– ‘‘హీరోయిన్ తెల్ల బుగ్గలే హీరోకి ఎందుకు అందంగా కనబడతాయో? అయినా ఇదంతా పాత మాట. ఇప్పుడు ‘అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ’ అనేది కొత్త మాట. ఒక బలమైన పాయింట్‌తో దర్శకుడు కథ తయారు చేశారు. అయితే ఏదో బోధించినట్లుగా కాకుండా సినిమా మొత్తాన్ని వినోదాత్మకంగానే చూపించబోతున్నారు. నాకు నచ్చింది అదే. ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం’’ అన్నారు. ‘‘తెల్లగా ఉన్న అమ్మాయిలంతా అందంగా ఉండాలనేం లేదు, అలాగే అందంగా ఉన్నవాళ్లంతా తెల్లగా ఉండాలని లేదు. అర్థం కాలేదా? మా సినిమా విడుదలయ్యాక అన్నీ అర్థం అవుతాయి. వెయిట్ చేయండి’’ అన్నారు రణ్‌దీప్ హుడా. వచ్చే నెల ఈ చిత్రం షూటింగ్‌ని ఆరంభించనున్నారు. -
ఆ ఆలోచన మానేశా!
‘‘నేనెప్పుడూ పర్ఫెక్ట్గా ఉండాలనుకోలేదు. నాకున్న లోపాలతో సంతృప్తిగానే ఉన్నాను’’ అన్నారు ఇలియానా. తన ఇన్‌స్టాగ్రామ్‌లో బాడీ పాజిటివిటీ గురించి మాట్లాడారామె. మన శరీరం ఎలా ఉన్నా దాన్ని ప్రేమించగలగాలి అనే విషయం గురించి ఇలా రాసుకొచ్చారు ఇలియానా. ‘‘గతంలో నా శరీరాకృతి గురించి ఎప్పుడూ ఆలోచిస్తుండేదాన్ని. ఎలా కనిపిస్తున్నాం? బాగానే కనబడుతున్నామా? అని తెగ ఆలోచించేదాన్ని. ఆ ఒత్తిడి ఎలా ఉండేదో చెప్పలేను. నా ముక్కు షార్ప్‌గా లేదని, పెదాలు ఇంకా పెద్దగా లేవని, చేతులు సరిగ్గా లేవని, పొట్ట కొంచెం ముందుకు ఉంటుందని, నడుము పెద్దగా ఉంటుందని, ఇంకా ఎత్తు ఉండాల్సిందేమోనని, చురుకుగా లేనేమోనని, ఫన్నీగా ఉండనేమోనని, ఫర్ఫెక్ట్గా లేనేమో అని... ఇలా ఆలోచిస్తూ ఉండేదాన్ని. కానీ నేను ఆలస్యంగా తెలుసుకున్నది ఏంటంటే... నేను ఎందుకు పర్ఫెక్ట్గా ఉండాలి? ఎలా ఉన్నానో అలానే అందంగా ఉన్నానని భావించొచ్చు కదా? అనుకున్నాను. అప్పటి నుంచి అందరూ అనుకునే పర్ఫెక్ట్కి, బ్యూటీఫుల్కి నేను సరిపడతానా? లేదా? అనే ఆలోచన మానేశాను. వాళ్లు అనుకునే బ్యూటీ మీటర్లో సెట్ అవ్వడానికి ప్రయత్నించడం ఆపేశాను. ఫిట్ అవ్వాలని ఎందుకు ప్రయత్నించాలి? ఒక్కొక్కరం ఒక్కోలా పుడతాం. ఎలా పుట్టామో అలానే ఉండాలి కదా. మార్చుకోవడానికి ఎందుకు ప్రయత్నించాలి?’’ అన్నారు ఇలియానా. -
అప్పుడు అన్నీ మాయం!
‘‘నా మైండ్‌లోని ఆలోచనలు నన్ను మానసికంగా ఎంత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పటికీ ఒక్కసారి నేను వర్కౌట్స్ చేయడం ప్రారంభిస్తే అవన్నీ మాయమైపోతాయి. అంతేకాదు నా లక్ష్యానికి నేను మరింత దగ్గరగా వస్తున్నానన్న భావన కలుగుతుంది’’ అంటున్నారు ఇలియానా. ‘వ్యాయామానికి రోజూ ఎంత సమయం కేటాయిస్తారు? అనే ప్రశ్నను ఇలియానా ముందుంచితే – ‘‘ప్రస్తుతం ఆన్లైన్ వర్కౌట్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. ప్రతి రోజూ ఓ కొత్త వర్కౌట్‌ను ట్రై చేస్తున్నాను. నా వర్కౌట్ సమయం అన్ని రోజులూ ఒకేలా ఉండదు. ఒకరోజు 75 నిమిషాలు, మరో రోజు 45 నిమిషాలు.. ఇలా రోజు రోజుకీ తేడా ఉంటుంది. ఒక్కో రోజు జస్ట్ యోగా మాత్రమే చేస్తాను. ఫిట్‌గా ఉండటానికి, మానసిక ఆరోగ్యం బాగుండేందుకు మీరు (అభిమానులు) వర్కౌట్స్ చేసి చూడండి. వచ్చే ఫలితం మీకు సంతోషాన్ని ఇస్తుంది’’ అని పేర్కొన్నారు ఇలియానా. -
జోడీ కుదిరిందా?
ఇలియానా తెలుగు సినిమా కమిట్ అయి దాదాపు రెండేళ్లవుతోంది. ‘అమర్ అక్బర్ ఆంటోని’ తర్వాత ఈ గోవా బ్యూటీ మరో తెలుగు సినిమా అంగీకరించలేదు. అయితే ఇప్పుడు ఓ సినిమా సైన్ చేశారని సమాచారం. నాగార్జున సరసన ఇలియానా ఓ సినిమాలో నటించబోతున్నారట. నాగ్‌తో ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించనున్న సినిమాలోనే ఆమె కథానాయికగా కనిపించబోతున్నారని టాక్. ఇందులో నాగార్జున సీఎస్ఓ (చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్) పాత్ర చేయనున్నారని సమాచారం. ఇటీవలే నాగార్జునను కలిసి ప్రవీణ్ సత్తార్ ఈ కథను వినిపించారట. ఈ కథ రీత్యా ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) ఏజెంట్‌గా ఉన్న హీరో ఓ మిషన్ కోసం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా మారతారట. ఈ కథ బాగా నచ్చడంతో ప్రవీణ్ సత్తార్‌కు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఆ తర్వాత ఇలియానాని కూడా చిత్రబృందం సంప్రదించిందట. ఈ చిత్రానికి ‘నా రాత నేనే రాసుకుంటా’ అనే టైటిల్‌ని అనుకుంటున్నారట. -
బయటపెట్టండి.. బయటపడండి!
శ్రుతిహాసన్‌లో ఏదో కోల్పోయిన భావన ఇలియానా వారం రోజులు బయటకు రాలేదు దీపికా పదుకోన్ అంతకు ముందులా చలాకీగా లేదు పరిణీతీ చోప్రా వారాల తరబడి బయటకు రాలేదు పాయల్ ఘోష్ పరిస్థితీ ఇంతే సీనియర్ నటి ఖుష్బూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. కారణం... డిప్రెషన్ మన తెలుగు హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నది డిప్రెషన్ వల్లే... నాలుగు రోజుల క్రితం హిందీ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్శ్రుతీహాసన్ ఆత్మహత్యకు కారణం ఇదే.. ఇప్పుడు అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీల్లో ఒకటే మాట.. మనసులో బాధ ఉంటే ఆ బాధను బయటపెట్టండి.. డిప్రెషన్ నుంచి బయటపడండి.. శ్రుతీహాసన్, ఇలియానా, దీపికా, పరిణీతి, పాయల్, ఖుష్బూ డిప్రెషన్‌ను తరిమికొట్టారు. ఇప్పుడు హాయిగా ఉన్నారు. ఈ ఆరుగురు నాయికలూ డిప్రెషన్ నుంచి ఎలా బయటపడ్డారో తెలుసుకుందాం. వాళ్లకంటే బలమైనదాన్ని ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చారు ఖుష్బూ. కథానాయికగా తెలుగు, తమిళ్, ఇతర భాషల్లో ఓ వెలుగు వెలిగారు. డబ్బు, పేరు రెండూ ఉన్నాయి. కానీ ఖుష్బూని ఏదో సమస్య డిప్రెషన్లోకి నెట్టేసింది. ఆమెకు ఇక జీవితం ఆగిపోయిందనిపించింది. ‘‘జీవితం చాలా చీకటిగా అనిపించింది. సమస్యలను చూడ్డానికి భయపడి నా కళ్లకు గంతలు కట్టుకున్నట్లుగా నాకనిపించింది. అన్ని బాధలూ మరచిపోయి నిద్రపోవాలనుకుంటే నా మానసిక స్థితి నన్ను నిద్రపోనివ్వలేదు’’ అని గతాన్ని తలుచుకున్నారు ఖుష్బూ. అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. అయితే తను పడిపోతే చూడాలనుకునేవారిని జయించాలనే పట్టుదల ఆమెను బతికించింది. ‘‘నా మనసుని బాధపెట్టి, నన్ను భయపెట్టి, నన్ను చీకట్లోకి నెట్టాలనుకున్నవాళ్ల కోసం నా అమూల్యమైన జీవితాన్ని ఎందుకు వదలుకోవాలి అనుకున్నాను. వాళ్లకంటే బలమైనదాన్ని అని నిరూపించుకోవాలనుకున్నాను. నా స్నేహితుల సహాయంతో డిప్రెషన్ నుంచి బయటపడ్డాను’’ అన్నారు ఖుష్బూ. ‘‘ఎవరి జీవితమూ సాఫీగా సాగదు, సమస్యలకు పారిపోకూడదు. మనల్ని ఏ సమస్యా ఏమీ చేయలేనంత బలంగా తయారవ్వాలి’’ అని సలహా ఇచ్చారు ఖుష్బూ. ప్రతి సెకనూ నరకమే ‘ఓం శాంతి ఓం’ అంటూ బాలీవుడ్లో తన కెరీర్‌ని చాలా ప్రశాంతంగా మొదలుపెట్టారు దీపికా పదుకోన్. తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ అయ్యారు. బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమలో కూడా పడ్డారు. ఇక పెళ్లి పీటల మీద కూర్చోవడమే ఆలస్యం అనే సమయంలో ఇద్దరూ విడిపోయారు. తన డిప్రెషన్‌కి ఇదే కారణం అని చెప్పలేదు కానీ ఆ తర్వాత దీపికా మానసికంగా కుంగిపోయారు. ‘‘ఆ సమయంలో ప్రతి సెకను నాకు నరకంలా అనిపించేది. దేని మీదా ఆసక్తి ఉండేది కాదు. కొన్ని రోజులు ఇదే పరిస్థితి. వన్ ఫైన్ డే బతకడం అంటే ఇలా కాదు అనిపించింది. మా అమ్మానాన్నతో మనసు విప్పి మాట్లాడాను. డాక్టర్ని సంప్రదించాను. నా మానసిక ఒత్తిడినంతా పోగొట్టేసుకున్నాను. మన బాధను బయటకు చెప్పాలి. అప్పుడే దాన్ని దూరం చేయగలుగుతాం’’ అన్నారు దీపికా. అంతే కాదు.. ఇలా డిప్రెషన్‌తో బాధపడుతున్నవారి కోసం ఓ సంస్థ కూడా నడుపుతున్నారామె. సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో దీపికా తన ట్వీటర్లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ఆత్మహత్య పరిష్కారం కాదు. మెంటల్ హెల్త్ గురించి ఇవాళ చాలామంది బయటకు వచ్చి మాట్లాడటం అభినందనీయం. డిప్రెషన్లో ఉన్నవాళ్లు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఒంటరి కాదు. మీతో పాటు అందరూ ఉన్నారు. అన్నింటికన్నా ముఖ్యం నమ్మకం’’ అన్నారు. ఐదేళ్లుగా మానసిక ఒత్తిడి ‘‘నేను ఐదేళ్లుగా మానసిక వేదనతో బాధపడుతున్నా’’ అని ఇటీవల పాయల్ ఘోష్ తన ట్వీటర్లో పేర్కొన్నారు. తెలుగు చిత్రాలు ‘ప్రయాణం’, ‘ఊసరవెళ్లి’, ‘మిస్టర్ రాస్కెల్’లో నటించిన ఆమె తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ చిత్రాల్లో నటించారు. ఇప్పుడు ఓ హిందీ సినిమా చేస్తున్నారు. కెరీర్‌పరమైన కారణాలే పాయల్ మానసిక ఒత్తిడికి కారణం అని తెలుస్తోంది. ‘‘నేను ఐదేళ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతున్నా. ఒక్కోరోజు బాగా బాధపడేదాన్ని. ఆ సమయంలో ఆత్మహత్య బెటర్ అనిపించేది. మందులు తీసుకుంటున్నా. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు అండగా నిలబడుతున్నారు. డిప్రెషన్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మాట్లాడితే మంచిది’’ అన్నారు పాయల్. అయితే ఏంటి? గోవా బ్యూటీ ఇలియానా నాలుగైదేళ్ల క్రితం వరకూ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్. బాలీవుడ్ కాలింగ్ అంటూ అక్కడికెళ్లారు. అయితే ఇక్కడ చేసినన్ని సినిమాలు చేయలేకపోతున్నారు. కానీ ఇలియానాకి అదేం పెద్ద సమస్య కాదు. తన శరీరాకృతిని విమర్శించారు. అది ఇలియానాని మానసికంగా కుంగదీసింది. ఓ వారం అంతా ఇంట్లోనే ఉండిపోయారు. ఆత్మహత్య చేసుకుంటే? అనే ఆలోచన మొదలైంది. ఈ ఆలోచన ప్రమాదం అని గ్రహించి, తన స్థితి గురించి ఎవరో ఒకరికి చెప్పుకోవాలనుకున్నారు. ఆ టైమ్‌లోనే డాక్టర్ని కలిశారు. ‘ఇలా జరిగిపోతుందేమో’ అని భయపడేకంటే ‘అయితే ఏంటి?’ అనే భావన పెంచుకోవాలని ఆ డాక్టర్ చెప్పిన సలహా ఇలియానాకి బాగా నచ్చింది. ‘‘ఈ ప్రపంచంలో ఏ ఒక్కరినీ మన లుక్స్‌తో కానీ ప్రవర్తనతో కానీ సంతృప్తిపరచలేం. అందుకే మనం మనలా ఉండటం అలవాటు చేసుకోవాలి. నేను నా కోసం బతుకుతున్నాను. నన్ను నేను ఇష్టపడుతున్నాను. ఎవరో ఏదో అన్నారని మన జీవితాన్ని పాడు చేసుకోకూడదు’’ అంటున్నారు ఇలియానా. మూడేళ్ల మానసిక ఒత్తిడి చిన్నప్పుడు, సినిమాల్లోకి వచ్చాక శ్రుతీహాసన్ కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి గురయ్యారట. అయితే గడచిన మూడేళ్లల్లో ఆమె మానసికంగా చాలా కుంగిపోయారు. ‘‘నా ఒత్తిడి గురించి బయటకు చెప్పడానికి సిగ్గు అనిపించింది. కానీ చెప్పకపోతే ఇవాళ ఇంత హాయిగా ఉండగలిగేదాన్ని కాదు. నా సమస్య చెప్పుకుని మానసిక చికిత్స పొందుతున్నాను. అలా ఒత్తిడి నుంచి దూరం కాగలిగాను. ధ్యానం, యోగా వంటి వాటితో మానసిక ప్రశాంతత లభిస్తోంది. ‘మెంటల్ ఇల్నెస్’ అనేది బయటకు చెప్పకూడనిది కాదు. చెబితేనే దూరం అవుతుంది’’ అన్నారు శ్రుతీహాసన్. రోజుకి పదిసార్లు ఏడ్చాను మరో భామ పరిణీతీ చోప్రా గురించి చెప్పాలంటే.. 2014–2015 మధ్యకాలంలో పరిణీతి కెరీర్ ఏం బాగాలేదు. ‘దావత్–ఎ–ఇష్క్’, ‘కిల్ దిల్’.. ఇలా వరుసగా ఆమె నటించిన సినిమాలు పరాజయంపాలయ్యాయి. సక్సెస్‌లో ఉన్నవారి డోర్ ముందుకు డేట్స్ లేవన్నా అవకాశాలు వస్తాయి. ఫ్లాప్‌లో ఉన్నవారికి ఆ చాన్స్ ఉండదు. అలా పరిణీతికి అవకాశాలు తగ్గాయి. సరిగ్గా అప్పుడే ఓ పెద్ద సంస్థలో డబ్బులు పెట్టుబడిగా పెట్టడం, ఇల్లు కొనడంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయారు. ఖర్చులకు కూడా డబ్బులు ఉండేవి కాదు. ‘‘అప్పుడు వారాల తరబడి ఇంటి నుంచి బయటకు రాలేదు. రోజుకి కనీసం పదిసార్లయినా ఏడ్చేదాన్ని. ఎవరితోనూ మాట్లాడేదాన్ని కాదు’’ అన్నారు పరిణీతి చోప్రా. అయితే తన సోదరుడు, స్టయిలిస్ట్ సహాయంతో ఆమె డిప్రెషన్ నుంచి బయటపడగలిగారు. మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు దాన్ని దగ్గరివాళ్లతో పంచుకోవాలంటున్నారు పరిణీతి. -
హీరోయిన్ ఇలియానా ఫోటోలు
-
రాక్షసిలాగా అనిపించింది ఆ జైలు!
‘దేవదాసు’ సినిమాతో వెండితెరకు పరిచయమై ‘తెలుగింటి అమ్మాయి’గా పేరు తెచ్చుకున్న ఇలియానా ‘బర్ఫీ’, ‘మైనే తేరే హీరో’, ‘రుస్తుం’, ‘బాద్షా హో’... సినిమాలతో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘కంఫర్ట్ జోన్ నుంచి రావడానికే ఎక్కువ ఇష్టపడతాను. అప్పుడు వైవిధ్యమైన పాత్రలు చేయడం సాధ్యపడుతుంది’ అంటున్న ఇలియానా ఫైనాన్షియల్ క్రైమ్–డ్రామా ‘ది బిగ్బుల్’లో నటిస్తోంది. ఆమె గురించి కొన్ని ముచ్చట్లు... అమ్మో... ఆ జైలులో ‘బాద్షా హో’లో ‘మహారాణి గీతాంజలి’ పాత్ర పోషించింది ఇలియానా... ఎమర్జెన్సీ టైంలో తన కుటుంబం నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న బంగారాన్ని తిరిగి సొంతం చేసుకోవడానికి ఎత్తులు వేస్తుంది. పోరాటపటిమ ప్రదర్శిస్తుంది. ఇది ఆషామాషీ పాత్ర కాదు... సినిమా మొత్తం ఈ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. గ్లామర్ డాల్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఇలియానాకు ఈ పాత్ర ఒక సవాల్.బర్ఫీ’ సినిమాతో తనపై ఉన్న గ్లామర్ ముద్రను చెరిపేసుకున్న ఇలియానా ‘మహారాణి గీతాంజలి’ పాత్రతో మరో మెట్టుకు ఎక్కింది.‘‘ఇలాంటి శక్తివంతమైన పాత్రలు కూడా చేయగలననే ఆత్మవిశ్వాసం నాలో నింపిన పాత్ర ఇది’’ అంటోంది ఇలియానా. ఈ సినిమా షూటింగ్ కొంత రాజస్థాన్‌లో జరిగింది. భగభగమండే వేడిలో షూటింగ్ చేయాల్సి వచ్చిందట. ‘‘అదేమంత కష్టంగా అనిపించలేదుగానీ... అసలు కష్టమంతా నిజమైన జైలులో షూటింగ్ చేస్తున్నప్పుడే మొదలైంది. సహజత్వం కోసం ఈ జైలును ఎంచుకున్నారు. దుమ్ము, దుర్వాసన... అయినా తప్పదుకదా! శక్తినంతా హరించి వేసే రాక్షసిలాగా అనిపించింది ఆ జైలు!’’ అని ఆ భయానకమైన జైలును గుర్తు తెచ్చుకుంటోంది. అదృష్టం సినిమా కలలు కంటున్నరోజుల్లో ‘ఓంశాంతి ఓం’లాంటి మాంచి మాస్ మసాలా సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ కావాలనుకుంది ఇలియానా. అయితే ‘బర్ఫీ’ మసాలా ఫిల్మ్ కాదు. ‘‘స్టోరీ విన్నప్పుడు నిర్ణయం తీసుకోవడానికి మూడు నెలలు తీసుకున్నాను. ఇలాంటి సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ అయితే ఎలా ఉంటుంది? అని ఆలోచించాను. మసాలా సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ కావాలనే నా కోరిక ఎలా ఉన్నప్పటికీ ‘బర్ఫీ’లాంటి కథ మళ్లీ చేసే అవకాశం దొరకుతుందో లేదో అనుకొని చేశాను. ఈ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టడం అదృష్టంగా భావిస్తాను. బహు చక్కగా... ‘బర్ఫీ’లో శ్రుతి ఘోష్ పాత్ర చేసి ఉంటే దక్షిణాది ప్రేక్షకులు ఎలా స్వీకరించేవారో తెలియదుగానీ, బాలీవుడ్ జనాలు మాత్రం ‘బహు చక్కగా నటించారు’ అని ప్రశంసించారు.‘‘దక్షిణాదిలో సుపరిచితం అయినప్పటికీ, బర్ఫీ చేస్తున్నప్పుడు మాత్రం ఇక్కడి ప్రేక్షకులకు కొత్త నటినే. అది ప్లస్ అయింది. ‘శ్రుతి ఘోష్’ పాత్రకు న్యాయం చేస్తానా? లేదా? అనేది వేరే విషయంగానీ నాకైతే ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చినట్లు అనిపించింది. ప్రయోగాలు చేయడానికి ఒక వేదిక దొరికినట్లయింది. ప్రేక్షకులకు నా పాత్ర ఎంతగానో నచ్చింది. ఇది నేను ఊహించనిది. నేను ఎప్పుడూ కంఫర్ట్‌జోన్‌ను ఇష్టపడను. అది దాటి బయటికి వచ్చినప్పుడు వైవిధ్యమైన పాత్రలు చేయడానికి అవకాశం దొరుకుతుంది’’ అంటోంది ఇలియానా . -
ప్రేమసంకెళ్లు
హీరోయిన్ ఇలియానాకు ఓ పోలీసాఫీసర్ ప్రేమసంకెళ్లు వేయబోతున్నారట. రణ్‌దీప్ హుడా హీరోగా ‘ముబారకన్’ (2017), ‘సాండ్ కీ ఆంఖ్’ (2019) చిత్రాలకు స్క్రీన్‌ప్లే అందించిన బిల్విందర్ సింగ్ దర్శకత్వంలో ‘అన్ ఫెయిర్ అండ్ లవ్లీ’ అనే ఓ చిత్రం తెరకెక్కుతోందని బాలీవుడ్ సమాచారం. ఇందులో హీరోయిన్ పాత్రకు ఇలియానాను సంప్రదించగా ఆమె అంగీకరించారని తాజా బాలీవుడ్ కబురు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ హర్యానాలో ప్రారంభమైందట. ఇందులో రణ్‌దీప్ హుడా పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారని టాక్. త్వరలో ఇలియానా కూడా సెట్లో జాయిన్ అవుతారు. అయితే ‘అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ’ చిత్రంలో ముందుగా జోయా హుస్సేన్‌ను (రానా హీరోగా నటించిన తాజా చిత్రం ‘అరణ్య’ చిత్రంలో ఓ కీలకపాత్రలో నటించారు) హీరోయిన్గా అనుకున్నారు. కానీ ఆమె కాల్షీట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఇలియానాను తీసుకున్నారని బాలీవుడ్ వర్గాల కథనం. -
మళ్లీ రైడ్
గత ఏడాది హీరో అజయ్ దేవగన్ బాలీవుడ్ వెండితెరపై చేసిన ‘రైడ్’ బాక్సాఫీస్ వద్ద వంద కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. దీంతో మళ్లీ ‘రైడ్’ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు అజయ్. తొలి రైడ్‌లో అజయ్ సరసన హీరోయిన్గా నటించిన ఇలియానాయే మలి రైడ్‌లోనూ నటించబోతున్నారని బాలీవుడ్ సమాచారం. 1980 నేపథ్యంలో అప్పటి వాస్తవ సంఘటనల ఆధారంగా రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వంలో ‘రైడ్’ చిత్రం తెరకెక్కింది. తాజాగా మరో భారీ ఐటీ రైడ్ నేపథ్యంలో ‘రైడ్’కు సీక్వెల్ తీయాలనే ఆలోచనలో ఉన్నారట అజయ్ దేవగన్. ఇందుకు తగిన కథాచర్చలు కూడా జరుగుతున్నాయని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి.. రెండో ‘రైడ్’కు కూడా రాజ్‌కుమార్ గుప్తాయే దర్శకత్వం వహిస్తారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. -
బ్రేకప్ గురించి మాట్లాడను
‘‘యాక్టర్స్ జీవితాల్లో ఏం జరుగుతోందో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకులకు కచ్చితంగా ఉంటుంది. నా గురించి ఏదైనా చెప్పగలను. కానీ, నా రిలేషన్షిప్ గురించి ఏం మాట్లాడలేను. రిలేషన్షిప్ అంటే నేను మాత్రమే కాదు.. నాతో పాటు ఇంకొకరు ఉంటారు. వాళ్ల గురించి నేను మాట్లాడలేను’’ అన్నారు ఇలియానా. ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో ఇలియానా కొన్నాళ్లు రిలేషన్షిప్లో ఉన్నారు. ఇటీవల వీళ్లిద్దరూ రిలేషన్‌షిప్‌కు ఫుల్స్టాప్ పెట్టారు. అయితే ఈ బ్రేకప్ గురించి ఇలియానా ఎక్కడా మాట్లాడలేదు. ఈ విషయం గురించి తాజాగా ఆమె స్పందిస్తూ– ‘‘రిలేషన్షిప్ ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయం. దాని గురించి మనం ఏం మాట్లాడినా అది వాళ్ల గురించి కూడా మాట్లాడినట్టే. అది వాళ్ల్ల ప్రైవసీని (గోప్యత) గౌరవించనట్టే. రిలేషన్‌షిప్‌కి సంబంధించిన విషయాలు సరిగ్గా వ్యక్తపరచకపోయినా, ఆ టాపిక్‌లోని కొన్ని వ్యాఖ్యలు తీసుకొని హైలెట్ చే సినా వేరేవాళ్ల ప్రైవసీని ఇబ్బందుల్లో పెట్టినట్టే. వారి ప్రైవసీని గౌరవిస్తాను. నేను విమర్శలు తీసుకుంటున్నాను. వాళ్లను కూడా దీనికి బాధితులను చేయలేను. అందుకే నా రిలేషన్షిప్ గురించి మాట్లాడాలనుకోవడం లేదు’’ అన్నారు. -
నా లక్ష్యం అదే!
‘‘ప్రేక్షకులను ఆశ్చర్యపరచడం చాలెంజ్‌లాంటిదే. యాక్టర్ నుంచి వాళ్లు ఊహించినది కాకుండా విభిన్నమైనది వస్తే ఆశ్చర్యపడతారు. అది బావుంటే కచ్చితంగా ఆదరిస్తారు. ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలన్నదే నటిగా నా లక్ష్యం’’ అన్నారు ఇలియానా. ‘పాగల్‌పంతి’ అనే మల్టీస్టారర్ కామెడీతో ఈ నెల 22న థియేటర్స్‌లోకి రాబోతున్నారామె. జాన్ అబ్రహామ్, అనిల్ కపూర్, ఇలియానా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో ఇలియానా ఫుల్ కామెడీ పండించబోతున్నారట. వినోదం చేయడం గురించి ఇలియానా మాట్లాడుతూ– ‘‘ముబారకన్’ సినిమాలో ఫస్ట్‌టైమ్ పూర్తిస్థాయి కామెడీ ట్రై చేశాను. నా గురించి ఆలోచించినప్పుడు ప్రేక్షకులకు కామెడీ మైండ్లోకి రాదు. ‘ఆ సినిమాలో మీ పాత్ర చూసి ఆశ్చర్యపోయాం’ అని చాలా మంది అన్నారు. అలా ఆశ్చర్యపరచడం చాలా కష్టం. దానికోసం ఎలాంటి క్రేజీ పాత్ర అయినా చేయాలనుకుంటాను’’ అన్నారామె. -
టవర్ సే నహీ పవర్ సే!
పేరు వైఫై భాయ్. ఇతని నెట్వర్క్ టవర్ నుంచి కాదు... అతని పవర్‌తో నడుస్తుందట. ఈ పవర్ సిగ్నల్స్‌కి ముందుగా రాజ్ కిషోర్, సంజనలు స్పందిస్తారు. మరి.. తన పవర్‌తో వైఫై భాయ్ ఏమేం పనులు చేశారో వెండితెరపై చూడాల్సిందే. అనీస్ బాజ్మీ దర్శకత్వంలో అనిల్ కపూర్, ఇలియానా, జాన్ అబ్రహాం, అర్షద్ వార్షి ముఖ్యతారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘పాగల్ పంతీ’. పుల్కిత్ సామ్రాట్, కృతీ కర్భందా, ఊర్వశీ రౌతేలా, సౌరభ్ శుక్లా కీలక పాత్రధారులు. ఈ సినిమాలో నటించిన ప్రధాన పాత్రధారుల లుక్స్‌ను విడుదల చేశారు. వైఫై భాయ్ పాత్రలో అనిల్ కపూర్, సంజన పాత్రలో ఇలియానా, రాజ్ కిషోర్ పాత్రలో జాన్ అబ్రహాం కనిపిస్తారు. ఈ సినిమాను ఈ ఏడాది నవంబరు 22న విడుదల చేయాలనుకుంటున్నారు. -
అందుకేనేమో కాళ్లపై గాయాలు: ఇలియానా
తాను స్లీప్‌వాకర్ స్నాకర్‌ని అంటున్నారు గోవా బ్యూటీ ఇలియానా. ‘దేవదాస్’ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఇల్లీ బేబీ.. ప్రస్తుతం బాలీవుడ్లో పాగా వేసిన సంగతి తెలిసిందే. అయితే కొంతకాలంగా సినిమాల కన్నా వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో నిలుస్తున్నారు ఇలియానా. ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ నీబోన్‌తో చెట్టాపట్టాలేసుకుని విహరించిన ఆమె..కొన్ని రోజుల కిత్రం అతడిని అన్‌ఫాలో చేయడంతో పాటు తామిద్దరం కలిసి ఉన్న ఫొటోలను తన ఇన్‌స్టా అకౌంట్ నుంచి తొలగించారు. దీంతో ఈ ప్రేమజంట విడిపోయిందనే నిర్ధారణకు వచ్చారు ఫ్యాన్స్. అంతేగాకుండా...‘మనకు ఎవరూ లేరనుకున్నప్పుడు, మనల్ని విడిచి ఎవరైనా వెళ్లిపోతున్నారు అని అనుకున్నప్పుడు మనల్ని మనం ప్రేమించుకోగలగాలి. మనతో మనం ఉండగలగాలి’ అంటూ సెల్ఫ్ లవ్ కొటేషన్లతో ఇలియానా వేదాంత ధోరణిలో పోస్టులు పెట్టడంతో ఒకింత ఆందోళనకు గురయ్యారు. అయితే తాజాగా ఆమె చేసిన ఫన్నీ ట్వీట్ అభిమానులకు నవ్వు తెప్పిస్తోంది. ‘ నాకు నిద్రలో నడిచే అలవాటు ఉందేమో. ఉందా. ఉండే ఉంటుంది. నా కాళ్లపై దర్శనమిస్తున్న గాయాలు, వాటి తాలూకు మచ్చలు చూస్తుంటే అంతే అనిపిస్తోంది మరి. బహుశా ఫ్రిడ్జ్‌లో ఉన్న స్నాక్స్ తినేందుకు అర్ధరాత్రి ట్రిప్ వేశానేమో. నేనో స్లీప్‌వాకింగ్ స్నాకర్‌ని’ అని ఇలియానా ట్వీట్ చేశారు. అదే విధంగా..‘ నేనొక ‘మూర్ఖురాలిని’.. అంటే అర్ధరాత్రి స్నాక్స్ తినే పిచ్చిదానిని’ అంటూ మరో ట్వీట్లో పేర్కొన్నారు. ఇందుకు స్పందించిన అభిమానులు.. ఫన్నీ మీమ్స్‌తో ఆమెకు రిప్లై ఇస్తున్నారు. ఇక కొంతమంది మాత్రం... ‘ఏదో ఒక విధంగా వార్తల్లో ఉండటానికి.. అందరినీ ఆకర్షించడానికి ఇలా చేయడం ఇలియానాకు అలవాటే’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. I’m almost entirely convinced that I sleep walk..... Almost. Maybe. Probably. - There’s no other way to explain how I wake up with mysterious bumps and bruises on my legs 🤷🏻♀️ — Ileana D'Cruz (@Ileana_Official) September 14, 2019 -
నిన్ను నువ్వు ప్రేమించుకో
‘‘మనకు ఎవ్వరూ లేరనుకున్నప్పుడు, మనల్ని విడిచి ఎవరైనా వెళ్లిపోతున్నారు అని అనుకున్నప్పుడు మనల్ని మనం ప్రేమించుకోగలగాలి. మనతో మనం ఉండగలగాలి’’ అని అర్థం వచ్చే ‘సెల్ఫ్ లవ్’ (మనల్ని మనం ప్రేమించుకోవడం) కొటేషన్లను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఇలియానా. హఠాత్తుగా ఈ ‘సెల్ఫ్ లవ్’ వెనక కారణం ఏంటబ్బా? అంటే బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్‌తో బ్రేకప్పే కారణమయ్యుంటుంది అని ఊహిస్తున్నారు కొందరు. ఇటీవలే ఆండ్రూకి, ఇలియానాకు బ్రేకప్ జరిగిందట. ఒకరినొకరు తమ సోషల్ మీడియాలో అన్‌ఫాలో అవ్వడమే కాకుండా ఇద్దరూ కలసి దిగిన ఫొటోలను డిలీట్ చేశారు కూడా. అందుకే సడెన్‌గా సెల్ఫ్ లవ్ గురించిన కొటేషన్లను ఇలియానా షేర్ చేస్తున్నారు అంటున్నారు కొందరు. ‘నీ జీవితం నుంచి ఎవ్వరు బయటకు వెళ్లిపోయినా నిన్ను నువ్వు మాత్రం కోల్పోవద్దు’, ‘కంట్లో నిప్పులు చెలరేగుతున్నా, స్వర్గంలాంటి చిరునవ్వు మాత్రం తనతోనే ఉంది’’ అంటూ పలు కొటేషన్లను షేర్ చేశారు ఇలియానా. ఈ విషయం ఇలా ఉంటే కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా చేయబోయే సినిమాలో హీరోయిన్గా ఇలియానా పేరును పరిశీలిస్తున్నారని టాక్. -
ఒక సినిమా.. రెండు రీమిక్స్‌లు
పాపులర్ పాటల్ని రీమిక్స్ చేసే ట్రెండ్‌ను కొనసాగిస్తూనే ఉంది బాలీవుడ్. పాత పాటలకి ట్రెండీ టచ్ ఇచ్చి సినిమాకు కావాల్సినంత క్రేజ్ తెచ్చుకుంటోంది. లేటెస్ట్గా రెండు పాత పాటల్ని ఒకే సినిమాలో రీమిక్స్ చేయాలనుకుంటున్నారు. జాన్ అబ్రహాం, ఇలియానా, అనిల్ కపూర్ నటించిన చిత్రం ‘పాగల్ పంతీ’. అనీజ్ బజ్మీ దర్శకుడు. ఈ సినిమా కోసం సన్నీ డియోల్, శ్రీదేవి నటించిన ‘చాల్బాజ్’లోని ‘తేరా బీమార్ మేరా దిల్..’ పాటను రీమిక్స్ చేశారట. మరో పాట ఏంటనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. ఒరిజినల్ పాటలో సన్ని, శ్రీదేవి కెమిస్ట్రీ హైలెట్‌గా నిలిచినట్టు, జాన్, ఇలియానా కెమిస్ట్రీ కూడా ఈ సినిమాలో ఓ హెలైట్ అవుతుందట. నవంబర్ 8న ఈ సినిమా రిలీజ్ కానుంది. -
వారిద్దరు విడిపోయారా?!
‘ఐ వానా ఫాలో ఫాలో ఫాలో ఫాలో యు’.. అంటూ ఇన్ని రోజులు ఒకరినొకరు ఫాలో అయ్యారు హీరోయిన్ ఇలియానా, ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ అండ్రూ నీబోన్. చేతిలో చేతులు వేసుకుని ఇన్ని రోజులు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట తాజాగా చేతులు దులుపుకుని విడిపోయారని ప్రచారం జరుగుతోంది. ఆండ్రూతో కలిసి ఉన్న ఫొటోలను తన ఇన్‌స్టా అకౌంట్ నుంచి తొలగించారు ఇలియానా. అలాగే ఇన్‌స్టాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. దీంతో ఆమెకు, ఆండ్రూకు మధ్య విభేదాలు వచ్చాయన్న వార్తలు నిజమేనని ఊహించుకోవచ్చు. ఇలియానా ఓ సందర్భంలో ఆండ్రూని ‘హబ్బీ’ (భర్త) అంటూ ఇన్‌స్టాలో క్యాప్షన్ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి... ఈ బ్రేకప్ ప్రచారం గురించి ఇలియానా స్పందిస్తే కానీ ఊహాగానాలకు ఫుల్స్టాప్ పడదు. ఇక సినిమాల విషయానికి వస్తే... హిందీలో ఇలియానా కథానాయికగా నటించిన ‘పాగల్ పాంతీ’ సినిమా విడుదలకు రెడీగా ఉంది. -
ఏడేళ్ల తర్వాత?
అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్ ఏడేళ్ల తర్వాత కలిసి నటించబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. 1990–2000 మధ్య కాలంలో దేశ ఆర్థిక పరిస్థితుల్లో వచ్చిన మార్పులకు తోడు కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా హిందీలో కూకై గులాటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందట. ఈ సినిమాలో అజయ్, అభిషేక్ హీరోలుగా నటించబోతున్నారని బాలీవుడ్ టాక్. హీరోయిన్గా ఇలియానా నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా అజయ్ దేవగన్ సొంత నిర్మాణ సంస్థలో రూపొందనుందని సమాచారం. చివరి సారిగా అజయ్, అభిషేక్ కలిసి 2012లో వచ్చిన ‘బోల్ బచ్చన్’ సినిమాలో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇంతకుముందు ‘జమీన్’ (2003), ‘యువ’ (2004) (హిందీ వెర్షన్) సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఈ బాలీవుడ్ స్టార్ హీరోలు. -
స్క్రీన్ టెస్ట్
1932లో తెలుగు సినిమా ప్రస్థానం ‘భక్తప్రహ్లాద’తో మొదలైంది. ఆ చిత్రానికి ప్రముఖ దర్శకుడు హెచ్.ఎమ్.రెడ్డి. అదే టైటిల్‌తో 1967లో మరోసారి చిత్రపు నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కింది. రెండు చిత్రాలు పేరు తెచ్చుకున్నాయి. ఇలా హిట్ టైటిల్ రిపీట్ అయితే అదో అదనపు పబ్లిసిటీ అవుతుంది. అలా ఒకే పేరుతో విడుదలైన పలు సినిమాల గురించి ఈ వారం క్విజ్... 1. 1957లో రిలీజైన ‘మాయాబజార్’ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఎవర్‌గ్రీన్‌గా నిలిచింది. అదే టైటిల్‌తో 2006లో మరో సినిమా విడుదలైంది. మొదటి ‘మాయాబజార్’ దర్శకుడు కె.వి.రెడ్డి. 2006లో వచ్చిన సినిమా దర్శకుడు ఎవరు? ఎ) ఇంద్రగంటి మోహనకృష్ణ బి) నీలకంఠ సి) రవిబాబు డి) చంద్రసిద్ధార్థ్ 2.1989లో మణిరత్నం దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్‌హిట్ లవ్ స్టోరీ ‘గీతాంజలి’. అదే పేరుతో 2014లో విడుదలైన హారర్ చిత్రం ‘గీతాంజలి’కి దర్శకుడు రాజకిరణ్. కమెడియన్ శ్రీనివాస్‌రెడ్డి లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రంలో టైటిల్ రోల్ ప్రాత పోషించిన హీరోయిన్ ఎవరో గుర్తుందా? ఎ) ‘కలర్స్’ స్వాతి బి) నందితారాజ్ సి) అంజలి డి) తేజస్వి మడివాడ 3. అక్కినేని, సావిత్రి జంటగా నటించిన ‘దేవదాసు’ సినిమా గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. 1953లో ఆ సినిమా విడుదలైంది. 1974లో హీరో కృష్ణ, 2006లో హీరో రామ్, 2018లో నాగార్జున ఈ పేరుతో మళ్లీ సినిమాలు చేశారు. రామ్ ‘దేవదాస్’ ద్వారా హీరోయిన్గా పరిచయమైన కథానాయిక ఎవరో కనుక్కోండి? ఎ) షీలా బి) హన్సిక సి) జెనీలియా డి) ఇలియానా 4. యన్టీఆర్, కృష్ణ హీరోలుగా 1973లో ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం చేశారు. తర్వాత 2012లో దర్శకుడు పూరి జగన్నాథ్ అదే పేరుతో ఓ సినిమా తీశారు. ఆ సినిమాలో హీరో ఎవరో తెలుసా? ఎ) రానా బి) రవితేజ సి) రామ్ డి) కల్యాణ్ రామ్ 5. 1987లో చిరంజీవి, సుహాసిని జంటగా తమిళ దర్శకుడు భారతీరాజా దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆరాధన’. అదే పేరుతో 1962లోనే యన్టీఆర్ ‘ఆరాధన’ చేశారు. ఆ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించిందెవరో తెలుసా? ఎ) వాణిశ్రీ బి) సావిత్రి సి) జమున డి) కృష్ణకుమారి 6. కృష్ణ నటించిన 200వ చిత్రం ‘ఈనాడు’. ఆ సినిమా సూపర్‌హిట్. అదే పేరుతో 2009లో కమల్ హాసన్ హీరోగా నటించారు. చక్రి తోలేటి దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో మరో తెలుగు హీరో పోలీసాఫీసర్‌గా నటించారు. ఎవరా హీరో? ఎ) నాగార్జున బి) వెంకటేశ్ సి) రాజశేఖర్ డి) చిరంజీవి 7. 1979లో వచ్చిన యన్టీఆర్ ‘వేటగాడు’ సూపర్ హిట్. అదే టైటిల్‌తో 1995లో రాజశేఖర్ హీరోగా సినిమా చేశారు. 1979లో విడుదలైన ‘వేటగాడు’ చిత్రంలో ‘పుట్టింటోళ్లు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు...’ అనే సూపర్‌హిట్ క్లబ్ సాంగ్‌లో యన్టీఆర్‌తో కాలు కదిపిన ప్రముఖ డాన్సర్ పేరేంటి? ఎ) అనురాధ బి) జ్యోతిలక్ష్మీ సి) జయమాలిని డి) హలం 8. కె.విశ్వనాథ్ కెరీర్‌లోని అద్భుతమైన చిత్రాల్లో ‘శంకరాభరణం’ ఒకటి. ఆ సినిమా 1980లో విడుదలైంది. 2015లో విడుదలైన ‘శంకరాభరణం’ చిత్రంలో కథానాయకుడు ఎవరు? ఎ) నితిన్ బి) నవదీప్ సి) సిద్ధార్థ్ డి) నిఖిల్ 9. 1988 ‘ఘర్షణ’, 2004 ‘ఘర్షణ’ మంచి విజయం సాధించాయి. రెండు చిత్రాల్లోని పాటలు సూపర్‌హిట్. పాత ‘ఘర్షణ లోని ‘ఒక బృందావనం సోయగం...’ పాటను చిత్ర పాడారు. తర్వాతి ‘ఘర్షణ’లో ‘చెలియ చెలియ చెలియ చెలియా, అలల ఒడిలో ఎదురు చూస్తున్నా...’ పాట పాడిన గాయని ఎవరో తెలుసా? ఎ) కౌసల్య బి) శ్రేయా గోషల్ సి) మల్గాడి శుభ డి) ఎస్పీ శైలజ 10. ‘పెళ్లి పుస్తకం’ అనగానే బాపు–రమణలు గుర్తుకు వస్తారు. అదే పేరుతో మరోసారి ఓ సినిమా విడుదలైంది. మొదటిసారి విడుదలైన ‘పెళ్లి పుస్తకం’ చిత్రంలో హీరో రాజేంద్రప్రసాద్, రెండో సారి విడుదలైన చిత్రంలో హీరో ఎవరు? ఎ) రాహుల్ రవీంద్రన్ బి) నవీన్ చంద్ర సి) సుశాంత్ డి) సుమంత్ 11. 1989లో విడుదలైన జంధ్యాల దర్శకత్వం వహించిన చిత్రం ‘జయమ్ము నిశ్చయమ్మురా’. అదే పేరుతో కమెడియన్ శ్రీనివాస్‌రెడ్డి హీరోగా మరో సినిమా తెరకెక్కింది. ఆ చిత్రంలో ఆయన సరసన హీరోయిన్గా నటించిన నటి ఎవరో తెలుసా? ఎ) ఈషా రెబ్బా బి) కృతీ కర్భందా సి) తాప్సీ డి) పూర్ణ 12. అక్కినేని, సావిత్రి జంటగా నటించిన చిత్రం ‘పవిత్రబంధం’. అదే పేరుతో వెంకటేశ్ హీరోగా ఓ సినిమా లె రకెక్కింది. ఆ చిత్రంలో ఆయన సరసన హీరోయిన్గా నటించిందెవరో గుర్తుందా? ఎ) ఆమని బి) మీనా సి) సౌందర్య డి) రోజా 13. 1968లో విడుదలైన చిత్రం ‘రాము’. యన్టీఆర్ సరసన జమున కథానాయికగా నటించారు. 1987లో బాలకృష్ణ ‘రాము’ పేరుతో సినిమా చేశారు. ఆయన సరసన నటించిన నటి ఎవరో తెలుసా? ఎ) సుహాసిని బి) రజని సి) రాధ డి) భానుప్రియ 14. కమల్‌హాసన్ ‘సత్య’ చిత్రంతో మంచి పేరు సంపాదించారు. ఆ సినిమా 1988లో విడుదలైంది. పదేళ్ల తర్వాత అదే పేరుతో ఓ సినిమా విడుదలై సంచలనం సృష్టించింది. రామ్‌గోపాల్‌వర్మ నిర్మించి, దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో హీరో జె.డి చక్రవర్తి సరసన నటించిన హీరోయిన్ ఎవరు? ఎ) ఊర్మిళ మటోండ్కర్ బి) ఆంత్రమాలి సి) నిషాకొఠారి డి) మధుషాలిని 15. 1955లో విడుదలైన ఎల్వీ ప్రసాద్ దర్శకత్వం వహించిన క్లాసికల్ మూవీ ‘మిస్సమ్మ’. ఆ చిత్రంలో ‘మిస్సమ్మ’ గా సావిత్రి నటిస్తే 2003లో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘మిస్సమ్మ’ వచ్చింది. 2003 ‘మిస్సమ్మ’ ఎవరో తెలుసా? ఎ) సిమ్రాన్ బి) భూమికా చావ్లా సి) త్రిష డి) రమ్యకృష్ణ 16. 1948లో ఓసారి, 1970 మరోసారి, 1995లో ఇంకోసారి ఇలా అనేక సార్లు ‘ద్రోహి’ టైటిల్‌తో సినిమాలు విడుదలయ్యాయి. 1948 సినిమాకు ఎల్వీ. ప్రసాద్, 1970 సినిమాకు కె.బాపయ్య దర్శకులు. 1995లో విడుదలైన సినిమాకు దర్శకుడు ఎవరో తెలుసా? ఎ) కమల్ హాసన్ బి) సురేశ్ కృష్ణ సి) పి.సి. శ్రీరామ్ డి) అర్జున్ 17. 1951 నాటి ‘మల్లీశ్వరి’ చిత్రంలో టైటిల్ రోల్‌ను భానుమతి పోషించారు. 2004 ‘మల్లీశ్వరి’లో టైటిల్ రోల్ చేసిన నటి ఎవరు? ఎ) కత్రినాకైఫ్ బి) టబు సి) అంజలా జవేరి డి) ప్రీతి జింతా 18. చిత్తూరు నాగయ్య హీరోగా కాంచనమాల హీరోయిన్గా బి.ఎన్. రెడ్డి దర్శకత్వం వహించిన 1939 నాటి చిత్రం ‘వందేమాతరం’. రాజశేఖర్ హీరోగా నటించగా టి.కృష్ణ 1985లో ‘వందేమాతరం’ టైటిల్‌తో సినిమా తీశారు. ఆ చిత్రంలో హీరోయిన్ ఎవరు? ఎ) విజయశాంతి బి) సుహాసిని సి) సుమలత డి) రాధిక 19. 1978లో విడుదలైన ప్రేమకావ్యం ‘మరోచరిత్ర’. బాలచందర్ దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో కమల్‌హాసన్, సరిత జంటగా నటించారు. 2010లో ‘దిల్’ రాజు అదే టైటిల్‌తో ఓ సినిమా నిర్మించారు. ఆ చిత్రంలో హీరో ఎవరో తెలుసా? ఎ) ఆర్య బి) భరత్ సి) ప్రిన్స్ డి) వరుణ్ సందేశ్ 20. 1963లో ఓసారి, 2018లో ఓసారి ‘నర్తనశాల’ సినిమా విడుదలైంది. 1963లో విడుదలైన ‘నర్తనశాల’ లో అభిమన్యుడు పాత్రను పోషించిన నటుడెవరో కనుక్కోండి? ఎ) యన్టీఆర్ బి) శోభన్‌బాబు సి) అక్కినేని నాగేశ్వరరావు డి) కాంతారావు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) సి 3) డి 4) బి 5) ఎ 6) బి 7) సి 8) డి 9) బి 10) ఎ 11) డి 12) సి 13) బి 14) ఎ 15) బి 16) సి 17) ఎ 18) ఎ 19) డి 20) బి నిర్వహణ: శివ మల్లాల -
లండన్ కాలింగ్
ఈ నెల చివర్లో కొత్త సినిమా కోసం లండన్ వెళ్లడానికి జాన్ అబ్రహాం ప్లాన్ చేశారు. ఇందుకోసం ఇలియానా కూడా సై అన్నారు. కానీ వీరి లండన్ ట్రిప్ నెక్ట్స్ మంత్కి వాయిదా పడింది. ఈ లోపు ఈ టీమ్‌తో కలిశారు కృతీ కర్భందా. ‘నో ఎంట్రీ, వెల్కమ్’ చిత్రాల ఫేమ్ అనీస్ బాజ్మీ దర్శకత్వంలో జాన్ అబ్రహాం హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు ‘పాగల్ పంతి’ అనే టైటిల్ పెట్టారు. ఇందులో ఒక కథానాయికగా ఆల్రెడీ ఇలియానాను తీసుకున్నారు. ఇప్పుడు రెండో హీరోయిన్గా కృతీ కర్భందాను టీమ్ సెలక్ట్ చేశారు. ప్రస్తుతం ‘హౌస్‌ఫుల్ 4’ సినిమా ప్యాచ్ వర్క్‌తో బిజీగా ఉన్నారు కన్నడ భామ కృతీ కర్భంద. ఇది కంప్లీట్ కాగానే కొత్త సినిమా కోసం జాన్, ఇలియానాతో కలిసి కృతీ లండన్‌కి వెళతారు. తెలుగులో తీన్మార్, ఒంగోలు గిత్త చిత్రాల్లో హీరోయిన్గా నటించిన కృతి ‘బ్రూస్లీ’లో రామ్‌చరణ్‌కు అక్కగా నటించారు. ఇప్పటివరకు తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలతో సౌత్‌కే పరిమితమైన కృతి ఇప్పుడు నార్త్పై కూడా దృష్టి పెట్టారు. -
స్క్రీన్ టెస్ట్
కొత్త సంవత్సరం వచ్చింది. కొత్త నిర్ణయాలు, కొత్త ఆశయాలు, కొత్త కలలు... ఏడాదంతా బాగుండాలనే పాజిటివ్ ఫీలింగ్‌తో 2019 స్టార్ట్ అయింది. సంవత్సరంలో తొలి నెల, తొలి వారంలో ‘తొలి కబుర్లు’ ఈ వారం క్విజ్ స్పెషల్. 1. సిల్వర్ స్క్రీన్‌పై మొదటిసారి యన్టీఆర్ నటించిన చిత్రం ‘మన దేశం’. కానీ యన్టీఆర్ ఏ చిత్రం ద్వారా మాస్ హీరోగా చిత్రపరిశ్రమలో నిలబడ్డారో తెలుసా? ఎ) పాతాళ భైరవి బి) గులేబకావళి కథ సి) గుండమ్మకథ డి) పాండవ వనవాసం 2. ప్రముఖ నటి విజయశాంతి తెలుగులో నటించిన మొదటి సినిమా ‘కిలాడి కృష్ణుడు’. ఆ చిత్రంలో హీరో ఎవరో చెప్పుకోండి? ఎ) చిరంజీవి బి) మోహన్‌బాబు సి) నాగార్జున డి) కృష్ణ 3. తెలుగులో మొట్టమొదటి సూపర్‌స్టార్ ఈ ప్రముఖ నటి. ఆమె నటి, దర్శకురాలు, సంగీత దర్శకురాలు, సింగర్, రచయిత. ఇంతకీ ఆమెఎవరు? ఎ) అంజలీదేవి బి) జమున సి) సావిత్రి డి) భానుమతి 4. తెలుగులో వచ్చిన మొదటి 70 యం.యం సినిమా పేరేంటో తెలుసా? ఎ) అల్లూరి సీతారామరాజు బి) ఈనాడు సి) తెలుగువీర లేవరా డి) సింహాసనం 5. ‘బంగారక్క’ చిత్రం ద్వారా తెలుగులో హీరోయిన్గా పరిచయమైన నటి ఎవరో తెలుసా? ఎ) రాధ బి) జయప్రద సి) శ్రీదేవి డి) సుహాసిని 6. తాను హీరోయిన్గా నటించిన మొదటి చిత్రం హీరోనే పెళ్లి చేసుకున్న నటి ఎవరో కనుక్కోండి? ఎ) శ్రియ బి) సమంత సి) శ్వేతాబసు ప్రసాద్ డి) స్వాతి 7. నటుడు నాని నటించిన మొదటి చిత్రదర్శకుడెవరో చెప్పుకోండి? ఎ) ఇంద్రగంటి మోహనకృష్ణ బి) ‘పిల్లజమిందార్’ అశోక్ సి) సత్యం బెల్లంకొండ డి) నందినీరెడ్డి 8. వెంకటేశ్ నటించిన మొదటి చిత్రం ‘కలియుగ పాండవులు’. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా తెలుగుకి పరిచయమైన ప్రముఖ నటి ఎవరో తెలుసుకుందామా? ఎ) నగ్మా బి) ఖుష్బూ సి) సౌందర్య డి) రోజా 9. ‘సిరివెన్నెల’ చిత్రంలో పాటలు రాసినందుకు ఆయనకు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అనే పేరొచ్చింది. రచయితగా ఆయన తొలి సినిమా హీరో ఎవరో తెలుసా? ఎ) సర్వధమన్ బెనర్జీ బి) బాలకృష్ణ సి) సోమయాజులు డి) కృష్ణంరాజు 10. ప్రముఖ గాయకుడు యస్పీ బాలసుబ్రహ్మణ్యం ఏ హీరోకి తన మొదటి తెలుగు సినిమా పాట పాడారో తెలుసా? ఎ) శోభన్‌బాబు బి) చంద్రమోహన్ సి) రంగనాథ్ డి) గిరిబాబు 11. రామ్‌గోపాల్ వర్మ ‘రక్తచరిత్ర’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ నటి ఎవరు? ఎ) ఊర్మిళా మటోండ్కర్ బి) మైరా సరీన్ సి) రాధికా ఆప్టే డి) నిషా కొఠారి 12. ‘మంచి మనుషులు’ చిత్రంలో బాలనటునిగా నటించిన నటుడెవరు? చిన్న క్లూ: హీరోగా మెప్పించి, ఇప్పుడు నటుడిగా చాలా బిజీగా ఉన్నారాయన? ఎ) జగపతిబాబు బి) వెంకటేశ్ సి) నాగార్జున డి) కమల్‌హాసన్ 13. సుకుమార్‌కి దర్శకునిగా తొలి అవకాశం ఇచ్చిన నిర్మాత ఎవరో కనుక్కోండి? ఎ) అశ్వనీదత్ బి) సురేశ్‌బాబు సి) ‘దిల్’ రాజు డి) అల్లు అరవింద్ 14. అఖిల్ హీరోగా పరిచయమైన చిత్రం ‘అఖిల్’. ఆ చిత్రానికి దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) శ్రీను వైట్ల బి) వీవీ వినాయక్ సి) పూరి జగన్నాథ్ డి) విక్రమ్ కె. కుమార్ 15. దేవిశ్రీ ప్రసాద్‌కి సంగీత దర్శకునిగా తొలి చిత్రం ‘దేవి’. ఆ చిత్రాన్ని యం.యస్. రాజు నిర్మించారు. చిత్ర దర్శకుడెవరు? ఎ) కోడి రామకృష్ణ బి) కృష్ణవంశీ సి) ఈవీవీ డి) శ్రీను వైట్ల 16. దర్శకుడు పూరీ జగన్నాథ్ 2000లో ఏ చిత్రం ద్వారా దర్శకునిగా మెగా ఫోన్ పట్టారో తెలుసా? ఎ) బాచీ బి) బద్రి సి) ఇడియట్ డి) శివమణి 17. నటుడు సుమంత్ హీరోగా పరిచయమైన చిత్రం ‘ప్రేమకథ’. ఆ చిత్రంలో సుమంత్ సరసన నటించిన నటి ఎవరు? ఎ) ఆంత్ర మాలి బి) ప్రీతీ జింతా సి) ప్రీతీ జింగ్యాని డి) అంజలా జవేరి 18. బాలీవుడ్ ప్రముఖ నటి కంగనారనౌత్ నటించిన ఒకే ఒక్క తెలుగు చిత్రానికి దర్శకుడు పూరి జగన్నాథ్. మరి ఆ చిత్ర హీరో ఎవరో తెలుసా? ఎ) మహేశ్‌బాబు బి) నితి¯Œ ∙సి) రానా డి) ప్రభాస్ 19. దాసరి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘తాతా మనవడు’. ఆ చిత్రంలో తాతగా యస్వీఆర్ నటించారు. మరి మనవడిగా మురిపించిన నటుడెవరో గుర్తుందా? ఎ) చలం బి) శరత్‌బాబు సి) రాజనాల డి) రాజబాబు 20. హీరో రామ్ కెరీర్లో తొలి హీరోయిన్ ఎవరో కనుక్కోండి? ఎ) హన్సిక బి) జెనీలియా సి) ఇలియానా డి) అక్ష మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) డి 3) డి 4) డి 5) సి 6) బి 7) ఎ 8) బి 9) ఎ 10) ఎ 11) సి 12) ఎ 13) సి 14) బి 15) ఎ 16) బి 17) ఎ 18) డి 19) డి 20) సి నిర్వహణ: శివ మల్లాల -
రామ్ చరణ్‌కు షాక్ ఇచ్చిన ఇలియానా..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం వినయ విధేయ రామ. మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భరత్ అనే నేను ఫేం కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ సినిమాలో ఓ స్పెషల్‌కు క్రేజీ హీరోయిన్ను తీసుకోవాలని భావిస్తున్నారు చిత్రయూనిట్. దీంతో తాజాగా టాలీవుడ్లో అమర్ అక్బర్ ఆంటొని చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన ఇలియానాను సంప్రదించారట. అయితే ఒక్క పాటకు ఇలియానా అడిగిన పారితోషికం విని చిత్రయూనిట్ షాక్ అయ్యింది. రామ్‌చరణ్ లాంటి స్టార్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేందుకు ఇలియానా ఏకంగా 60 లక్షల రూపాయలు డిమాండ్ చేసారట. మరి VVR టీం అంత ఇచ్చి ఇలియానానే తీసుకుంటారా..? లేక మరో హీరోయిన్ను ట్రై చేస్తారా తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. -
లవ్వులో పడాల్సిందే... కేక పెట్టాల్సిందే!
ఈ సన్నివేశం సినిమాల్లో బాగా చూసి ఉంటారు.హీరోయిన్ వెళ్లిపోతుంటే హీరో చూస్తుంటాడు.ఫ్రెండ్‌తో చెబుతాడు – అమ్మాయి తిరిగి చూసిందంటే లవ్‌లో పడినట్లే అని.అమ్మాయి తిరిగి చూస్తుంది. ఆడియన్స్ కూడా హీరోలాంటి వాళ్లే.ఏ హీరోయిన్ తిరిగి వచ్చినా..ఏ హీరో రిటర్న్ ఇచ్చినా లవ్వులో పడాల్సిందే... కేక పెట్టాల్సిందే. సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీతో పాటు రీఎంట్రీ కూడా ఉంటుంది. చనిపోయాడనుకున్న హీరో సెకండ్‌హాఫ్‌లో బతికి కనిపించినట్టే తెరమరుగైపోయారనుకున్న తారలు ఒక్కసారిగా మళ్లీ స్క్రీన్ మీద తళుక్కుమని మెరవడానికి వస్తారు. ఒక్కోసారి ఎంట్రీలోని ఇమేజ్ కన్నా రీఎంట్రీలోని క్రేజ్ వారిని ఎక్కడికో తీసుకెళ్లే అవకాశం ఉంది. చిరంజీవి వంటి మెగాస్టారే బ్రేక్ తీసుకుని రీఎంట్రీ ఇచ్చినప్పుడు.. పెళ్లి, బాధ్యతలు, సరైన పాత్రలు రాకపోవడం వంటి కారణాల వల్ల బ్రేక్ తీసుకున్నవారు మళ్లీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడంలో తప్పేముంది? సీనియర్ నటి జయప్రదతో పాటు ఇలియానా, లయ, ప్రియమణి, సంగీత, భాగ్యశ్రీ, హీరో ఆర్యన్ రాజేశ్ తదితరులు టాలీవుడ్లో రీఎంట్రీ ఇస్తున్నారు. టేక్‌కి రెడీ అంటున్నారు. జయప్రదం ‘ఝుమ్మంది నాదం.. సయ్యంది పాదం’.. అన్న జయప్రద ఆ తర్వాత దశ తిరిగి ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ అన్నారు. 1970ల చివరలో 1980లలో ఆమె స్టార్ హీరోయిన్. అయితే ఇక్కడ కెరీర్ పీక్‌లో ఉండగానే బాలీవుడ్‌కు వెళ్లిపోయి తెలుగు సినిమాలు తగ్గించుకున్నారు. ఆ తర్వాత కొత్తతరం రావడం, రాజకీయాల్లో బిజీ కావడం తదితర కారణాల వల్ల తెలుగు సినిమా ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం జరగలేదు. ‘సాగర సంగమం’, ‘దేవత’ వంటి మంచి సినిమాలు చేసిన జయప్రద తెలుగు సినిమాలో మళ్లీ కనిపిస్తే ప్రేక్షకులకు అదే పెద్ద ఆనందం.పి.వాసు దర్శకత్వంలో 2007లో వచ్చిన ‘మహారథి’లో కీలక పాత్రలో నటించిన ఆమె 11ఏళ్ల తర్వాత ‘శరభ’ చిత్రంతో తెలుగులో రీఎంట్రీ ఇస్తున్నారు. ఆకాష్‌కుమార్, మిస్తీ చక్రవర్తి జంటగా యన్.నరసింహారావు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఆమెను తెలుగులో బిజీ చేస్తుందని ఆశిద్దాం. సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. అలాగే ‘సువర్ణ సుందరి’ అనే మరో తెలుగు చిత్రంలోనూ జయప్రద ముఖ్యమైన పాత్ర చేశారు. సూర్య ఎమ్.ఎస్.ఎన్ దర్శకత్వంలో తయారైన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇలా రెండు సినిమాలతో జయప్రదంగా ఆమె రీఎంట్రీ ఇవ్వడం అభిమానులకు ఆనందం. గోవా బ్యూటీ వచ్చేశారు ‘దేవదాసు’ ఆ వెంటనే ‘పోకిరి’ సినిమాతో యూత్ గుండె గోడల మీద పోస్టర్ గర్ల్‌గా నిలిచారు ఇలియానా. ఆ తర్వాత మహేశ్‌బాబు, పవన్ కల్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజ .. వంటి హీరోలందరితో జోడీ కట్టారు. ‘జల్సా’, ‘కిక్’, ‘జులాయి’ వంటి సూపర్ హిట్స్ ఆమె ఫిల్మోగ్రఫీలో ఉన్నాయి. టాలీవుడ్లో అతి తక్కువ టైమ్‌లో కోటి రూపాయలు పారితోషికం అందుకున్న స్టార్ హీరోయిన్గా ఆమెకు పేరుంది.2012లో విడుదలైన ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం తర్వాత టాలీవుడ్‌కి బై చెప్పి ‘బర్ఫీ’ చిత్రంతో బాలీవుడ్‌కి వెళ్లిపోయారామె. ఆరేళ్ల తర్వాత ‘అమర్ అక్బర్ ఆంటొని’ (అఅఆ)తో తెలుగు చిత్ర పరిశ్రమకు రీఎంట్రీ ఇచ్చారు. రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తయారైన ‘అమర్ అక్బర్ ఆంటొని’ ఈ నెల 16న రిలీజైంది. ఇలియానా టాలీవుడ్‌కి వచ్చిన 12ఏళ్లలో తొలిసారి ‘అఅఆ’కి డబ్బింగ్ చెప్పారు.ఈ రీఎంట్రీతో ఆమె మరిన్ని సినిమాలు చేస్తారని చెప్పవచ్చు. ప్రియమైన వెన్నెల ప్రియమణి తెలుగు టీవీ కార్యక్రమాలలో కనిపిస్తున్నారు కానీ తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు. హుషారైన బాడీ లాంగ్వేజ్‌తో, అందమైన చిరునవ్వు, యాక్టింగ్ టాలెంట్‌తో ముఖ్యమైన హీరోలతో పని చేసిన ప్రియమణి ఎక్కువ కాలం తెలుగు మీద ఫోకస్ చేయలేదనే చెప్పాలి. ఎక్కువ సమయం హీరోయిన్గా నిలవలేదనీ చెప్పాలి. తమిళ, తెలుగు, కన్నడ సినిమాలను సుడిగాలిలా చుట్టి ఖాళీ అయిన ఈ నటి ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో షారుక్ ఖాన్‌తో ఐటమ్ సాంగ్ చేసి తానున్నట్టు రిఫ్రెష్ బటన్ నొక్కారు. 2016లో విడుదలైన ‘మన ఊరి రామాయణం’ తర్వాత ఆమె వేరే తెలుగు చిత్రంలో నటించలేదు. ఇప్పుడు ‘సిరివెన్నెల’ అనే తెలుగు చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ప్రకాష్ పులిజాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రకథ బాగా నచ్చడంతో పాటు నటనకి ఆస్కారం ఉన్న పాత్ర కావడంతో నటించేందుకు ఒప్పుకున్నారట. త్వరలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. మైనే ఫిర్ ఆగయీ భాగ్యశ్రీని చూసి కనీసం అరకోటి మంది అబ్బాయిలైనా ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుని ఉంటారు ‘మైనే ప్యార్ కియా’ సమయంలో. అయితే ఆమె సినిమాల్లో కంటిన్యూ కాకుండా హిమాలయ్ను భర్తగా చేసుకుని లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. తెలుగులో ‘ఓంకారమ్’, ‘రాణా’ సినిమాల్లో ఆమె నటించారు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1998లో వచ్చిన ‘రాణా’ చిత్రంలో బాలకృష్ణ చెల్లెలి పాత్రలో కనిపించిన భాగ్యశ్రీ 20ఏళ్ల తర్వాత ‘2 స్టేట్స్’ సినిమాతో తెలుగులో రీఎంట్రీ ఇస్తున్నారు. అడివి శేష్, శివానీ రాజశేఖర్ జంటగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో శివాని తల్లి పాత్రలో భాగ్యశ్రీ నటిస్తున్నారు. టాలీవుడ్ కే పాస్ మై ఫిర్ ఆగయీ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు భాగ్యశ్రీ. తల్లి రీఎంట్రీ.. తనయ ఎంట్రీ ‘ప్రేమించు’ చిత్రంలో అంధురాలి పాత్రలో లయ నటించారనడం కంటే జీవించారనడం కరెక్టేమో. 1992లో అక్కినేని కుటుంబరావ్ దర్శకత్వంలో వచ్చిన ‘భద్రం కొడుకో’ సినిమాతో బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగమ్మాయి ‘స్వయంవరం’ సినిమాతో కథానాయికగా మారారు. ఆ తర్వాత తెలుగు చిత్రాలతో పాటు కన్నడ, మలయాళ, తమిళ చిత్రాల్లో నటించి, అలరించారు. ‘మనోహరం, ‘ప్రేమించు’ చిత్రాలకు నంది అవార్డులు కూడా అందుకున్నారు. 2010లో ‘బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం’ చిత్రం తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసి కుటుంబంతో అమెరికాలో సెటిల్ అయిపోయారు. చాలా రోజులుగా లయ రీఎంట్రీపై వార్తలు వస్తున్నాయి. 8 ఏళ్ల తర్వాత తాజాగా ‘అమర్ అక్బర్ ఆంటొని’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు లయ. ఈ చిత్రంతోనే లయ కూతురు శ్లోక బాలనటిగా ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఒకే సినిమాతో తల్లి రీఎంట్రీ.. తనయ ఎంట్రీ .. ప్రేక్షకులకు డబుల్ ధమాకాయే కదా! ఆరేళ్ల తర్వాత హాయ్ తండ్రి ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో 2002లో వచ్చిన ‘హాయ్’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి హాయ్ చెప్పారు ఆర్యన్ రాజేష్. ఆ తర్వాత తెలుగులోనే కాదు తమిళంలోనూ సినిమాలు చేశారు.రామకృష్ణ దర్శకత్వంలో 2012లో వచ్చిన ‘బాలరాజు ఆడి బామ్మర్ది’ చిత్రం తర్వాత ఏ తెలుగు చిత్రంలోనూ ఆయన నటించలేదు. ఆరేళ్ల తర్వాత తాజాగా ‘వినయ విధేయ రామ’ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నారు. రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో చెర్రీ (రామ్‌చరణ్) సోదరుని పాత్రలో నటిస్తున్నారట. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. పద్మావతి వస్తున్నారహో... సంగీత మంచి డాన్సర్, నటి. ‘అదిరిందయ్యా చంద్రం’ సినిమాలోని ‘పద్మావతి పద్మావతి గుర్తొస్తున్నావే.. దగ దగ ముద్దొస్తున్నావే’ పాట ఆమెకు మంచి హిట్ ఇచ్చింది. 1999లో ‘ఆశల సందడి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగీత ‘ఖడ్గం’, ‘పెళ్ళాం ఊరెళితే’, ‘ఈ అబ్బాయి చాలా మంచోడు’, ‘సంక్రాంతి’ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నారు. 2010లో వచ్చిన ‘కారా మజాకా’ చిత్రంలో నటించిన సంగీత ఆ తర్వాత తెలుగు సినిమాలేవీ చేయలేదు. 8 ఏళ్ల విరామం తర్వాత ‘తెలంగాణ దేవుడు’ చిత్రంతో టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇస్తున్నారామె. ‘‘తెలుగులో ఇది నా సెకండ్ ఇన్నింగ్స్.. ప్రేక్షకులందరూ ఆశీర్వదించాలి’’ అని పేర్కొన్నారు సంగీత. పాతికేళ్ల తర్వాత టాలీవుడ్‌కి... ‘సాక్షి’, ‘మగాడు’, ‘దోషి..నిర్దోషి’, ‘20వ శతాబ్దం’... తదితర చిత్రాలతో 1990వ దశకంలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన లిజీ దర్శకుడు ప్రియదర్శన్‌ను వివాహం చేసుకుని టాలీవుడ్‌కి దూరంగా ఉండిపోయారు. 25ఏళ్ల తర్వాత ‘ఛల్ మోహన్‌రంగ’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. తాజాగా అడివి శేష్, శివాని రాజశేఖర్ జంటగా తెరకెక్కుతున్న ‘2 స్టేట్స్’ సినిమాలో లిజీ ఓ కీలక పాత్ర చేసేందుకు అంగీకరించారని వార్త. అలాగే ఒకప్పటి స్టార్ హీరోయిన్ వాణీ విశ్వనాథ్ 11 ఏళ్ల తర్వాత తెలుగులో రీఎంట్రీ ఇచ్చారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో గతేడాది వచ్చిన ‘జయ జానకి నాయక’ సినిమాతో ఆమె ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో జగపతిబాబు చెల్లెలి పాత్రలో ఆమె కనిపించింది కొద్దిసేపే అయినా మెప్పించారు. ఇక 1980లో ‘మా భూమి’ సినిమాతో టాలీవుడ్‌కి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయిచంద్ చిరంజీవితో ‘మంచు పల్లకీ’తో పాటు అనేక చిత్రాల్లో నటించారు. 1989లో రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శివ’ తర్వాత ఏ తెలుగు సినిమాలోనూ నటించలేదాయన. 27ఏళ్ల తర్వాత ‘ఫిదా’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. తాజాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సైరా’ సినిమాలో ఆయన ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారట. దాంతో ‘మంచుపల్లకీ’ తర్వాత 36 ఏళ్లకు చిరంజీవి, సాయిచంద్ కలిసి నటించినట్టవుతుంది ఈ సినిమాతో. – ఇన్పుట్స్: డేరంగుల జగన్ -
‘అమర్ అక్బర్ ఆంటొని’ మూవీ రివ్యూ
టైటిల్ : అమర్ అక్బర్ ఆంటొని జానర్ : యాక్షన్ డ్రామా తారాగణం : రవితేజ, ఇలియానా, తరుణ్ అరోరా, షాయాజీ షిండే, విక్రమ్‌జిత్ విర్క్, సునీల్ సంగీతం : ఎస్. తమన్ దర్శకత్వం : శ్రీను వైట్ల నిర్మాత : నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్, మోహన్ చెరుకూరి రాజా ది గ్రేట్ సినిమా తరువాత మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ, చాలా కాలంగా సక్సెస్ లేక కష్టాల్లో ఉన్న శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా అమర్ అక్బర్ ఆంటొని. ఈ సినిమాతో చాలా కాలం తరువాత గోవా బ్యూటి ఇలియానా టాలీవుడ్‌కు రీఎంట్రీ ఇస్తోంది. మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాపై హీరో, హీరోయిన్, దర్శకుడు చాలా ఆశలు పెట్టుకున్నారు. మరి అమర్ అక్బర్ ఆంటొని.. ఆ అంచనాలను అందుకుందా..? రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ మరోసారి మ్యాజిక్ రిపీట్ చేసిందా..? ఇలియానా రీ ఎంట్రీలో ఎంత మేరకు ఆకట్టుకుంది.? కథ ; ఆనంద్ ప్రసాద్, సంజయ్ మిత్రా ఇద్దరు ప్రాణ స్నేహితులు. న్యూయార్క్‌లో ఫిడో ఫార్మా పేరుతో కంపెనీని స్థాపించి మిలియనీర్స్‌గా ఎదుగుతారు. ఆనంద్ ప్రసాద్ తన కొడుకు అమర్ (రవితేజ)ను, సంజయ్ మిత్రా కూతురు ఐశ్వర్య (ఇలియానా)కు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. తన కంపెనీలో ఉద్యోగస్తులుగా ఉన్న అరోరా(తరుణ్ అరోరా), సబూ మీనన్ (ఆదిత్య మీనన్), విక్రమ్ తల్వార్ (విక్రమ్‌జీత్) , రాజ్ వీర్ల నిజస్వరూపం తెలియని ఆనంద్, సంజయ్‌లు కంపెనీలో 20 శాతం షేర్స్ ఇచ్చి వారిని భాగస్వాములుగా చేసుకుంటారు. పార్టనర్స్ అయిన వెంటనే ఆనంద్ ప్రసాద్, సంజయ్ మిత్రాల కుటుంబాలను పూర్తిగా అంతం చేయడానికి ప్లాన్ చేస్తారు ఆ నలుగురు. కానీ వారి కుటుంబానికి నమ్మకస్తుడైన జలాల్ అక్బర్(షాయాజీ షిండే) సాయంతో అమర్, ఐశ్వర్యలు తప్పించుకుంటారు. తప్పించుకున్న అమర్ 14 ఏళ్ల తరువాత తిరిగి వచ్చి ఎలా పగ తీర్చుకున్నాడు.? తల్లిదండ్రులు చనిపోయిన తరువాత అమర్, ఐశ్వర్యల జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది..? ఈ కథలో అక్బర్, ఆంటొనిలు ఎవరు..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; రవితేజ మరోసారి ఎనర్జిటిక్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా అమర్ పాత్రలో రవితేజ ఒదిగిపోయిన తీరు ఆకట్టుకుంటుంది. అక్బర్, ఆంటొనీల పాత్రల్లో కామెడీ కొంతమేరకు వర్క్ అవుట్ అయినా సహజంగా అనిపించదు. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన ఇలియాన నటన అలరిస్తుంది. కాస్త బొద్దుగా కనిపించినా పర్ఫామెన్స్తో పాటు గ్లామర్‌తోనూ మెప్పిస్తుంది. తరుణ్ అరోరా, ఆదిత్య మీనన్, విక్రమ్‌జీత్ విర్క్ స్టైలిష్ విలన్లుగా కనిపించారు. విలక్షణ నటుడు షాయాజీ షిండేకు చాలా రోజుల తరువాత ఓ మంచి పాత్ర దక్కింది. జలాల్ అక్బర్ పాత్రలో ఆయన నటన బాగుంది. ఇక తెలుగులో టాప్ కామెడియన్స్‌గా కొనసాగుతున్న వెన్నెల కిశోర్, శ్రీనివాస్ రెడ్డిలతో పాటు తిరిగి కామెడీ పాత్రలు చేస్తున్న సునీల్‌లు కొంత మేరకు నవ్వించే ప్రయత్నం చేశారు. సత్య, రఘుబాబు, గిరి, అభిమన్యు సింగ్, జయప్రకాష్ రెడ్డి అందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. విశ్లేషణ ; చాలా రోజులుగా సరైన సక్సెస్ లేక ఇబ్బందుల్లో ఉన్న దర్శకుడు శ్రీను వైట్ల ఓ భారీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావటంతో ఈ సినిమాపై అంచనాలు కూడా అదే స్థాయిలో ఏర్పాడ్డాయి. అయితే ఆ అంచనాలు శ్రీను వైట్ల ఏ మాత్రం అందుకోలేకపోయాడు. ఓ మామూలు రివేంజ్ డ్రామా కథకు న్యూయార్క్ బ్యాక్ డ్రాప్ తీసుకొని దర్శకుడు తయారు చేసుకున్న కథనం ఆసక్తికరంగా అనిపించదు. అక్కడక్కడా కామెడీ పరవాలేదనిపించినా పూర్తిస్థాయిలో ఆకట్టుకునేలా లేదు. తెర నిండా కమెడియన్లు కనిపిస్తున్నా చాలా సన్నివేశంలో కామెడీ కావాలని ఇరికించారన్న భావన కలుగుతుంది. తమన్ అందించిన పాటలు పరవాలేదనిపించినా నేపథ్య సంగీతం బాగుంది. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫి. ప్రతీ ఫ్రేమ్ కలర్ఫుల్గా, అందంగా, లావిష్‌గా కనిపిస్తుంది. ఎడిటింగ్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది. నిర్మాతలు ఖర్చుకు వెనకాడుకుండా సినిమాను రిచ్‌గా తెరకెక్కించారు. ప్లస్ పాయింట్స్ ; రవితేజ నటన ప్రొడక్షన్ వాల్యూస్ మైనస్ పాయింట్స్ ; పాత కథ ఫోర్స్డ్ కామెడీ స్క్రీన్ ప్లే సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
స్క్రీన్ టెస్ట్
అక్కడ ఇక్కడ.. సినిమాకి నో బౌండరీస్. ఇక్కడ హిట్టయిన సినిమా అక్కడ... అక్కడ హిట్టయిన సినిమా ఇక్కడ రీమేక్ అవుతుంటాయి. అలాంటి రీమేక్ మూవీస్ గురించి ఈ వారం స్పెషల్. 1. హిందీ చిత్రం ‘మిలీ’ తెలుగు ‘జ్యోతి’ చిత్రానికి మాతృక. అక్కడ (బాలీవుడ్లో) జయభాదురీ టైటిల్ రోల్ చేశారు. ఇక్కడ (టాలీవుడ్) ఆ పాత్రను పోషించిన నటి ఎవరు? ఎ) జయసుధ బి) జయప్రద సి) శ్రీదేవి డి) సుజాత 2. యన్టీఆర్ నటించిన ‘యుగంధర్’ సినిమా హిందీ ‘డాన్’కి రీమేక్. ఆ చిత్రంలో హీరోగా నటించిందెవరో గుర్తుందా? ఎ) జితేంద్ర బి) రిషికపూర్ సి) మిథున్ చక్రవర్తి డి) అమితాబ్ 3. తమిళ సూపర్ డూపర్ హిట్ ‘నాట్టామై’ తెలుగులో ‘పెదరాయుడు’గా విడుదలై, ఇక్కడా బంపర్ హిట్ సాధించింది. తెలుగులో మోహన్‌బాబు నటించారు. తమిళ్లో మోహన్‌బాబు పాత్రను పోషించిన నటుడెవరో తెలుసా? ఎ) విజయ్‌కాంత్ బి) పార్తిబన్ సి) శరత్‌కుమార్ డి) రజనీకాంత్ 4. విజయశాంతి హిందీలో చేసిన మొదటి చిత్రం ‘ఈశ్వర్’. తెలుగులో ఘనవిజయం సాధించిన ‘స్వాతిముత్యం’ చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్ర దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) కె.విశ్వనాథ్ బి) బి.గోపాల్ సి) కె. రాఘవేంద్రరావు డి) కె. మురళీమోహన రావు 5. అక్కినేని నాగేశ్వరరావు హిందీలో ఒకే ఒక్క సినిమాలో నటించారు. తెలుగులో ఆయన నటించిన ఓ సూపర్ హిట్ చిత్రానికి రీమేక్ అది. ఆ చిత్రకథానాయిక అంజలీదేవి, ఆమె భర్త, చిత్రనిర్మాత ఆదినారాయణరావు మాటను కాదనలేక ఏయన్నార్ హిందీలో నటించారు. ఇంతకీ ఆ సినిమా పేరేంటి? ఎ) దేవదాసు బి) సువర్ణసుందరి సి) కీలుగుర్రం డి) తెనాలి రామకృష్ణ 6. హీరో రాజÔó ఖర్ను ఒకప్పుడు ‘అంకుశం’ రాజశేఖర్ అనేవారు. ఆ సినిమా ద్వారా ఆయనకు అంత పేరొచ్చింది. మరి... ఆ సినిమా రీమేక్ ద్వారా బాలీవుడ్‌కి హీరోగా పరిచయమైన తెలుగు నటుడెవరో తెలుసా? ఎ) బాలకృష్ణ బి) వెంకటేశ్ సి) చిరంజీవి డి) నాగార్జున 7. ‘మిస్సమ్మ’ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. ఆ సినిమాలో ఎన్టీఆర్ చేసిన పాత్రను తమిళ్లో చేసిన నటుడెవరు? ఎ) యంజీఆర్ బి) శివాజీ గణేశన్ సి) జెమినీ గణేశన్ డి) శివకుమార్ 8. కన్నడ చిత్రం ‘యు టర్న్’ తెలుగు రీమేక్‌లో సమంత జర్నలిస్ట్‌గా చేశారు. కన్నడ ‘యు టర్న్’లో ఆ పాత్ర చేసిన నటి ఎవరో కనుక్కోండి? ఎ) ప్రియమణి బి) రకుల్ ప్రీత్‌సింగ్ సి) అంజలి డి) శ్రద్ధా శ్రీనాథ్ 9. రజనీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ అన్ని భాషల్లోనూ పెద్ద హిట్. ఆ సినిమా మొదట మలయాళంలో వచ్చింది. ‘చంద్రముఖి’ కన్నడ, తమిళ్, తెలుగు భాషలకు డైరెక్టర్ పి.వాసు. ఒరిజినల్ మలయాళ చిత్రానికి దర్శకుడెవరు? ఎ) సురేశ్ కృష్ణ బి) సిద్ధిక్ లాల్ సి) ఫాజిల్ డి) ప్రియదర్శన్ 10 కృష్ణ, జయప్రద జంటగా నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘ఊరికి మొనగాడు’. ఆ చిత్రాన్ని హిందీలో ‘హిమ్మత్వాలా’ పేరుతో విడుదల చేశారు. అది పెద్ద హిట్. జయప్రద రోల్‌ను పోషించిన నటి ఎవరు? ఎ) రేఖ బి) హేమ మాలిని సి) శ్రీదేవి డి) డింపుల్ కపాడియా 11. ‘ప్రేమమ్’ తెలుగు సినిమాలో లెక్చరర్ పాత్రలో నటించారు హీరోయిన్ శ్రుతీహాసన్. ఆ పాత్ర ఒరిజినల్ క్యారెక్టర్‌ను మలయాళంలో చేసిన నటి ఎవరో తెలుసా? ఎ) సాయిపల్లవి బి) మంజిమా మోహన్ సి) అనుపమా పరమేశ్వరన్ డి) నివేథా థామస్ 12 మహేశ్ బాబు కెరీర్లో ‘పోకిరి’ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్. అదే పేరుతో ఆ సినిమాను తమిళ్లో తెరకెక్కించారు. అక్కడ కూడా ‘పోకిరి’ మంచి హిట్‌ను సొంతం చేసుకుంది. మహేశ్‌బాబు క్యారెక్టర్‌ను చేసిన ఆ తమిళ్ హీరో ఎవరు? ఎ) అజిత్ బి) శివ కార్తికేయన్ సి) విజయ్ డి) సూర్య 13. ‘తుమ్హారి సులు’ అనే సినిమాను హిందీలో విద్యాబాలన్ చేశారు. తమిళ్లో ఆ సినిమా రీమేక్ ‘కాట్రిన్ మొళి’లో ఆ పాత్రను చేసిన నటి ఎవరో తెలుసా? ఎ) శ్రుతీహాసన్ బి) జ్యోతిక సి) నయనతార డి) సమంత 14 నాగచైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఏ మాయ చేసావె’. ఆ చిత్రం తమిళ్ వెర్షన్లో సమంత పాత్రను పోషించిన నటి ఎవరో తెలుసా? ఎ) శ్రియ బి) త్రిష సి) అమలాపాల్ డి) మీరా జాస్మిన్ 15. సునీల్ హీరోగా నటించిన ‘మర్యాద రామన్న’ చిత్రం హిందీ రీమేక్‌లో ఆ పాత్రను పోషించిన నటుడెవరో తెలుసా? ఎ) అజయ్ దేవగన్ బి) అక్షయ్ కుమార్ సి) సంజయ్‌దత్ డి) సైఫ్ అలీఖాన్ 16. విద్యాబాలన్ చేసిన హిందీ ‘కహానీ’ తెలుగు రీమేక్ ‘అనామిక’లో నయనతార నాయికగా నటించారు. ‘అనామిక’ సంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) మణిశర్మ బి) యం.యం.కీరవాణి సి) మిక్కీ జే మేయర్ డి) కె.యమ్ రాధాకృష్ణన్ 17. వెంకటేశ్ హీరోగా తెలుగు ‘సూర్యవంశం’, అమితాబ్ బచ్చన్ హీరోగా హిందీ ‘సూర్యవంశ్’ చిత్రాలు వచ్చాయి. ఈ రెండు చిత్రాలనూ తెరకెక్కించిన దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) ఈవీవీ సత్యనారాయణ బి) దాసరి నారాయణరావు సి) కోడి రామకృష్ణ డి) బి.గోపాల్ 18. విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ సంచలన విజయం సాధించింది. హీరోయిన్గా షాలినీ పాండే నటించారు. ఆ చిత్రాన్ని హిందీలో సేమ్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నారు. హిందీ ‘అర్జున్ రెడ్డి’లో హీరోయిన్గా నటిస్తున్నది ఎవరో తెలుసా? ఎ) కరీనా కపూర్ బి) కియరా అద్వాని సి) ఆలియా భట్ డి) ప్రియాంకా చోప్రా 19. తమిళ చిత్రం ‘వసంత మాళిగై’ అంటే తెలుగు ‘ప్రేమనగర్’. రెండు భాషల్లోనూ హీరోలు శివాజీ గణేశన్, అక్కినేని. కానీ హీరోయిన్ ఒక్కరే. ఎవరా హీరోయిన్? ఎ) సావిత్రి బి) వాణిశ్రీ సి) జమున డి) కాంచన 20. రీమేక్ చిత్రాలు చేయడానికి ఇష్టపడనని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన శంకర్ ఓ హిందీ సినిమాని ‘నన్బన్’ పేరుతో తమిళంలో రీమేక్ చేశారు. ఇది ‘స్నేహితుడా’ పేరుతో తెలుగులో విడుదలైంది. హిందీలో కరీనా కపూర్ నాయిక.. మరి సౌత్‌లో ఎవరు? ఎ) ఇలియానా బి) చార్మి సి) కాజల్ అగర్వాల్ డి) శ్రియ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) డి 3) సి 4)ఎ 5) బి 6) సి 7) సి 8) డి 9) సి 10) సి 11) ఎ 12) సి 13) బి 14) బి 15) ఎ 16) బి 17) ఎ 18) బి 19) బి 20) ఎ నిర్వహణ: శివ మల్లాల -
కథతో పాటే కామెడీ
రవితేజ, ఇలియానా జంటగా నటించిన చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటొని’. శ్రీనువైట్ల దర్శకత్వంలో మైత్రీ మూవీస్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఈ చిత్రంలోని హాస్యనటులతో పాటు చిత్రదర్శకుడు శ్రీను వైట్ల పాల్గొన్నారు. ‘వెన్నెల’ కిశోర్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నా పాత్ర పేరు చంటి మిరియాల. దర్శకుడు శ్రీనుగారు తన ప్రతి సినిమాలోనూ మంచి క్యారెక్టర్ ఇచ్చి ప్రోత్సహిస్తారు. ఫస్ట్ టైమ్ నా కెరీర్లో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర చేశాను. ఓ కమెడియన్ రోల్‌ని స్టార్టింగ్ టు ఎండింగ్ డిజైన్ చేసే డైరెక్టర్స్‌లో శ్రీనుగారు ఒకరు’’ అన్నారు. నటుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో ‘వాటా’ (హోల్ ఆంధ్రా, తెలంగాణ ఆర్టిస్ట్ యూనియన్) లో మేమందరం చేసే అల్లరి మామూలుగా ఉండదు. ప్రతి సీన్ చాలా ఎంజాయ్ చేస్తూ చే శాం. రఘుబాబుగారిని విపరీతంగా టీజ్ చేసే క్యారెక్టర్ నాది. శ్రీను వైట్లగారు ప్రతి సినిమాలో మమ్మల్ని పెట్టుకుని ఆదరించినందుకు చాలా థ్యాంక్స్’’ అన్నారు. నటుడు గిరిధర్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలోని చేతన్ శర్మ పాత్ర ద్వారా నా కెరీర్ మరో లేయర్లోకి వెళ్లే పాత్ర ఇది. ‘వెన్నెల’ కిశోర్‌గారి అసిస్టెంట్ పాత్ర నాది. చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అందరూ ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ– ‘‘ఈ కామెడీ గ్యాంగ్‌తో పాటు సెకండ్ హాఫ్‌లో సునీల్ జాయినవుతాడు. అతని పేరు బేబీ సిట్టర్ బాబి. ఆ పాత్ర ద్వారా ఆయన ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తారు. ఈ కామెడీ పాత్రలన్నీ కథలో కలిసి ఉంటాయి. సెపరేట్ ట్రాక్‌లు కాదు. మొదటినుంచి చివరివరకు ఈ పాత్రలన్నీ సినిమాలో ఉంటాయి. చాలా రోజుల తర్వాత ఇంత బాగా కామెడీ సెట్ అయినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. -
నేను చెప్పేదాకా ఏదీ నమ్మొద్దు
48 అవర్స్‌లో తెలుస్తుంది... కొన్ని ప్రశ్నలకు రవితేజ చెప్పిన సమాధానం ఇది. ఇంతకీ 48 గంటల కహానీ ఏంటీ అంటే.. ‘ఈ సినిమాలో మీరు మూడు క్యారెక్టర్స్ చేశారట కదా’ అంటే.. దానికి సమాధానం 48 అవర్స్. శ్రీను వైట్లతో చాలా గ్యాప్ తర్వాత సినిమా చేశారు కదా? ఈ సినిమా కూడా హిట్ అవుతుందా? అంటే.. 48 అవర్స్. మీ క్యారెక్టర్లో ‘స్లి్పట్ పర్సనాల్టీ’ ఉంటుందా? అనడిగితే.. 48 అవర్స్... శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ, ఇలియానా జంటగా నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మించిన ‘అమర్ అక్బర్ ఆంటొని’ రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడినప్పుడు రవితేజ దాటేయాలనుకున్న ప్రశ్నలకు ‘48 అవర్స్’ అని సింపుల్‌గా చెప్పారు. రవితేజ చెప్పిన మరిన్ని విశేషాలు... ► ఒక హిట్ వస్తే సూపర్ అని, ఫ్లాప్ వస్తే కాదని కాదు. ఒక ఫ్లాప్ ఇచ్చినవాళ్లు సూపర్‌హిట్ ఇవ్వొచ్చు. బ్లాక్‌బస్టర్ ఇచ్చినవాళ్లు ఫ్లాప్ ఇవ్వొచ్చు. ప్రతి సినిమా బాగా ఆడాలనే చేస్తాం. కొన్ని సినిమాలు ప్రేక్షకులకు నచ్చుతాయి. మరికొన్ని నచ్చవు.. అంతే. ఫ్లాప్ అయిన సినిమా గురించి ఆలోచిస్తాను కానీ సీరియస్‌గా తీసుకోను. నెక్ట్స్ ఏంటీ? అనే విషయం పై మరింత ఫోకస్ పెడతా. ► ‘అమర్ అక్బర్ ఆంటొని’ సినిమాలో త్రిపాత్రాభినయం చేశానా? లేక ఒకే పాత్రలో స్పిల్ట్ పర్సనాలిటీస్ ఉంటాయా? అన్న విషయాలను వెండితెరపై చూపిస్తాం. ఇంటెన్స్ అండ్ ఎమోషన్ ఉన్న అమర్ పాత్రంటే పర్సనల్‌గా ఇష్టం నాకు. అక్బర్, ఆంటొని పాత్రలు కాస్త హాస్యభరితంగా ఉంటాయి. ► ఒక నటుడికి రెండు కన్నా ఎక్కువ షేడ్స్ ఉన్న పాత్రలు వచ్చినప్పుడు చాలెంజింగ్‌గా ఉంటుంది. ఈ సినిమా నాకు అలాగే అనిపించింది. ఈ సినిమాలో నటన పరంగా సంతృప్తి చెందాను. ఇక ప్రేక్షకులు డిసైడ్ చేయాలి. ఇంతకు ముందు శ్రీను వైట్ల, నా కాంబినేషన్లో ‘నీ కోసం, వెంకీ, దుబాయ్ శీను’ సినిమాలు వచ్చాయి. కానీ ‘అమర్ అక్బర్ ఆంటొని’ సినిమా స్క్రిప్ట్ ఇద్దరికీ కొత్తే. ‘నీ కోసం’ ఒక లవ్‌స్టోరీ. ‘దుబాయ్ శీను, వెంకీ’ చిత్రాల్లో బాగా అల్లరి ఉంది. ఈ సినిమాలో అల్లరితో పాటు ఇంటెన్స్ అండ్ ఎమోషన్స్ కూడా ఉంటాయి. ప్రతి కథలోనూ చిన్న చిన్న డౌట్స్ ఉంటూనే ఉంటాయి. శ్రీను వైట్ల కథ చెప్పినప్పుడు కొన్ని డౌట్స్ చెప్పాను. క్లారిఫై చేశారు. ఆయన గత సినిమాల్లో జరిగిన మిస్టేక్స్ ఈ సినిమాలో జరగవని నా స్ట్రాంగ్ ఫీలింగ్. టైమ్ తీసుకుని బాగా ఫోకస్‌తో చేశాడు. ► ఈ సినిమాలో స్పూఫ్‌లు లేవు. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో లయ, అభిరామ్ స్నేహితులుగా కనిపిస్తారు. నా చిన్నప్పటి పాత్రను నా కొడుకు మహాధన్ చేయాలి. స్కూలు, డేట్స్ కుదరక చేయలేదు. ‘దుబాయ్ శీను’లోలా సునీల్ బాగా నవ్విస్తాడు. కమెడియన్ సత్య పాత్ర ఓ హైలైట్. ఇలియానా మంచి ఆర్టిస్టు. ఈ సినిమాకు తనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. తమన్ మంచి సంగీత దర్శకుడు. చక్కని పాటలిచ్చాడు. ► ఇంతకుముందు డిఫరెంట్‌గా ‘ఈ అబ్బాయి చాలా మంచోడు, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్, నేనింతే, శంభో శివ శంభో’లాంటి మంచి సినిమాలు చేశాను. ఆడలేదు. కానీ డిఫరెంట్ జానర్ సినిమాలు ట్రై చేయడం మానను. భవిష్యత్‌లో మళ్లీ ప్రయత్నిస్తాను. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ సినిమాలూ చేస్తా. అసలు నేను ఇది చేయను, అది చేయను అని ఎప్పుడూ చెప్పను. నచ్చితే అన్ని రకాల పాత్రలూ చేస్తాను. హాలీవుడ్ మూవీ ‘టేకెన్’ అంటే ఇష్టం. అలాంటి సినిమా చేయాలని ఉంది. ► ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండటమే నా ఉత్సాహానికి కారణం. నెగిటివిటీ, డిప్రెషన్, స్ట్రెస్ వంటి వాటిని పక్కన పెడితే అందరూ ఉత్సాహంగానే ఉంటారు. రాజకీయాల గురించి చదవను. అంతగా తెలీదు. ‘మీటూ’ వల్ల ఇండస్ట్రీల్లో కాస్త కుదురు వచ్చినట్లుంది. ► మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలతో కానీ, ఎస్ఆర్టి నిర్మాతతో కానీ మూడు సినిమాల డీల్ అనే వార్తల్లో నిజం లేదు. నాకు కంఫర్ట్‌గా అనిపించింది. చేస్తున్నాను. నా గురించి తెలిసిన వాళ్లందరూ నా సినిమాల గురించి ఓపెన్‌గా చెబుతారు. ఎవరో ఎందుకు మా అబ్బాయి మహాధన్ కూడా తన ఒపీనియన్‌ను ఓపెన్‌గా చెబుతాడు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యా. ‘తేరీ’ రీమేక్ చేయడం లేదు. సంతోష్ శ్రీనివాస్ కొత్త స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు. పూరీ జగన్నాథ్‌తో ఓ సినిమా ఉంటుంది. కానీ అన్నీ కుదరాలి. నాకు టైమ్ దొరికితే నెట్‌ఫ్లిక్స్ చూస్తాను. వెబ్ సిరీస్‌లో నేను నటించడం గురించి త్వరలో చెబుతాను’’ అంటున్న రవితేజతో ‘మీకు ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసే ఆలోచన ఏమైనా ఉందా?’ అని అడిగితే – ‘‘ఇప్పట్లో ఆ ఆలోచన లేదు. అలాంటి వార్త ఏదైనా వస్తే... నేను చెప్పేదాకా ఏదీ నమ్మొద్దు’’ అన్నారు. -
ఏ హీరోను, నిర్మాతనూ ఇబ్బంది పెట్టలేదు!
‘‘నా కెరీర్లో ఏం జరిగినా అది నా బాధ్యతే. మంచైనా.. చెడైనా. నాది సింపుల్ లివింగ్ స్టైల్. సినిమా అంటే నాకు పిచ్చి ఉంది కానీ కీర్తి కాంక్ష లేదు. సక్సెస్ వచ్చినప్పుడు మన చుట్టూ ఉన్నవాళ్లు ఫెయిల్యూర్ వచ్చినప్పుడు లేరే అని బాధపడే మనస్తత్వం కాదు నాది. ఇప్పటివరకు నాతో సినిమా చేయమని ఏ హీరోను, ఏ నిర్మాతను ఇబ్బంది పెట్టలేదు’’ అన్నారు శ్రీను వైట్ల. రవితేజ హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటొని’. ఇలియానా కథానాయికగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా శ్రీను వైట్ల చెప్పిన విశేషాలు. ‘అమర్ అక్బర్ ఆంటొని’ ఒక పాయింట్ బేస్డ్ సినిమా. అందుకే ఇప్పుడు చెప్పలేకపోతున్నాను. రవితేజతో నేను చేసిన ‘నీ కోసం, వెంకీ, దుబాయ్ శీను’ సినిమాల్లో లేనటువంటి బలమైన కథ ఈ సినిమాలో బోనస్‌గా ఉంటుంది. మేజర్ షూటింగ్ న్యూయార్క్‌లో చేశాం. నన్ను, కథను అర్థం చేసుకుని ప్రొడ్యూసర్స్ బాగా సపోర్ట్ చేశారు. మూవీ జర్నీ బాగుంటే ఫలితం బాగుంటుందని నా నమ్మకం. ఆ నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేస్తారని ఆశిస్తున్నాను. ఈ సినిమాను చాలా లగ్జరీగా తీశాను. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ఏ సినిమాకు బడ్జెట్ హద్దులు దాటలేదు. నిర్మాతలు స్వేచ్ఛ ఇచ్చారు కదా అని బడ్జెట్‌ను పెంచే మనస్తత్వం నాది కాదు. రవితేజ మంచి పొటెన్షియల్ అండ్ ఇంటెన్స్ యాక్టర్. ఆయనకు సినిమాలంటే పిచ్చి. నాలోని డైరెక్టర్ని రవితేజ బాగా నమ్ముతారు. ఇంతకుముందు ఉన్న కమిట్స్‌మెంట్స్ కారణంగానే రవితో మళ్లీ సినిమా చేయడానికి ఇంత టైమ్ పట్టింది. ఇలియానాను కథానాయికగా తీసుకోవాలనుకునే ఆలోచన నాదే. సునీల్ మంచి క్యారెక్టర్ చేశారు. రవితేజ చిన్నప్పటి పాత్రకు ముందుగా ఆయన కుమారుడు మహాధన్‌ను అనుకున్నాం కానీ వర్క్ పర్మిట్ లేట్ అవ్వడం వల్ల కుదర్లేదు. అలాగే లయగారు, అభిరామిగారు బాగా చేశారు. కథకు కరెక్ట్‌గా సరిపోతుందనే ‘అమర్ అక్బర్ ఆంటొని’ టైటిల్ పెట్టాం. సినిమాలో రివెంజ్ బ్యాక్‌డ్రాప్ ఒక పార్ట్ మాత్రమే. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ ఆలస్యం అవడం వల్ల సినిమాను వాయిదా వేయాల్సి వచ్చింది. ‘తానా’ మీద ఈ సినిమాలో సెటైర్స్ వేయలేదు. తప్పుల నుంచి ఎక్కువ నేర్చుకుంటాం అనే మాట నిజం. నేర్చుకోకపోతే అక్కడే ఉండిపోతాం. ఎక్కడ తప్పు జరుగుతుందనే విషయంపై రియలైజ్ అయ్యాను. నేను సక్సెస్‌లో ఉన్నప్పుడు ఎలా పనిచేశానో ‘అమర్ అక్బర్ ఆంటొని’ సినిమా కోసం అంతకు మించి పని చేశాను. నేను ‘డౌన్’లో ఉన్నప్పుడు కూడా ‘అమర్ అక్బర్ ఆంటొని’ సినిమా కోసం ఐదుగురు ప్రొడ్యూసర్స్ పోటీ పడ్డారు. మైత్రీని చూజ్ చేసుకున్నాం. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అనే తేడా లేదు. చిన్న సినిమాల నుంచే పెద్ద డైరెక్టర్‌గా ఎదిగాను. నా తొలి సినిమా బడ్జెట్ 38 లక్షలు. కెరీర్లో ఎవరికైనా ఎత్తుపల్లాలు ఉంటాయి. నాకు కానీ, కొంతమంది డైరెక్టర్స్ కానీ ఒక బ్రాండ్ వచ్చింది. అదే శాపం, వరం కూడా. కొత్త కథను చెప్పడం కష్టం కాదు. అందులో నా మార్క్ మిస్ అవ్వకుండా ఎంటర్టైనింగ్గా చెప్పడం చాలా కష్టమైన విషయం. ‘అమర్ అక్బర్ ఆంటొని’ సినిమాపై కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. మహేశ్, నేను సినిమా చేయాలనుకుంటే చేస్తాం. నెక్ట్స్ ఇంకా ఏమీ అనుకోలేదు. స్క్రిప్ట్స్ రెడీ చేస్తున్నాను. బాలీవుడ్లో సినిమాలు చేయాలని నాకూ ఉంది. ‘ఢీ, దూకుడు’ సినిమాలను బాలీవుడ్లో చేయాల్సింది. కుదర్లేదు. ఈ సినిమాతో కుదురుతుందేమో చూడాలి. -
‘చెడు ఎక్స్పెక్ట్ చేయకపోవడం పిచ్చితనం’
మాస్ మహరాజ్ రవితేజ, డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్లో తాజాగా తెరకెక్కుతున్న సినిమా ‘అమర్ అక్బర్ ఆంటొని’. ఈ సినిమా థియరిటికల్ ట్రైలర్‌ను శనివారం విడుదల చేసింది మూవీ యూనిట్. ‘శక్తి చాలక నమ్మకం నిలబెట్టుకోలేని వారు కొందరు ఉంటే శక్తి మేరకు నయవంచన చేసేవారు కోకొల్లలు, చెడ్డవాళ్ల నుంచి చెడు ఎక్స్పెక్ట్ చేయకపోవడం పిచ్చితనం’ వంటి శ్రీను వైట్ల మార్కు డైలాగ్స్‌తో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. అమర్ పాత్రలో సీరియస్‌గా కనిపించిన రవితేజ... డాక్టర్ ఆంటొనిగా సునీల్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబులతో కలిసి తన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించారు. ఇక హీరోయిన్ ఇలియానా క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంది. కాగా లయ, సునీల్, వెన్నెల కిషోర్, రఘు బాబు, తరుణ్ అరోరా, అభిమన్యు సింగ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని నవంబరు 16న విడుదల చేయనున్నారు. డైరెక్టర్ శ్రీను వైట్ల, హీరోయిన్ ఇలియానాకు రవితేజతో ఇది నాలుగో చిత్రం కావడం విశేషం. శ్రీను వైట్ల- రవితేజ కాంబినేషన్లో గతంలో నీకోసం, వెంకీ, దుబాయ్ శీను చిత్రాలు రాగా, రవితేజ- ఇలియానా హీరోహీరోయిన్లుగా ఖతర్నాక్, కిక్, దేవుడు చేసిన మనుషులు చిత్రాలు రూపొందిన సంగతి తెలిసిందే. -
చెప్పాలనుకుంటే చెబుతా
‘‘ఇన్ని సంవత్సరాలు తెలుగులో కావాలని గ్యాప్ తీసుకోలేదు. బాలీవుడ్‌కి వెళ్లాక వరుస సినిమా ఆఫర్లు వచ్చాయి. అలా కంటిన్యూ అయిపోయాను. ఈలోపు నేను కావాలనే తెలుగుకి దూరంగా ఉంటున్నానని మిస్అండర్స్టాడింగ్ చేసుకున్నారు. ఏదేదో అనుకున్నారు. టాలీవుడ్, బాలీవుడ్‌ని బ్యాలెన్స్ చేద్దాం అనుకున్నాను. కానీ బ్యాలెన్స్ మిస్ అయింది (నవ్వుతూ)’’ అని ఇలియానా అన్నారు. రవితేజ, ఇలియానా జంటగా శ్రీను ౖÐð ట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటొని’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, రవిశంకర్ నిర్మించారు. ఈ చిత్రం ఈ శుక్రవారం రిలీజ్ కానుంది. ఆరేళ్ల గ్యాప్ తర్వాత ఇలియానా మళ్లీ తెలుగులో కనిపించనున్న చిత్రం ఇది. ఈ సందర్భంగా మీడియాతో ఇలియానా పలు విశేషాలు పంచుకున్నారు. ► ఈ సినిమా ఒప్పుకోవడానికి మొదటి కారణం కథ. వినగానే చాలా ఎగై్జట్ అయ్యాను. అలాగే రవితేజ కూడా ఉన్నారు. రవి నా ఫేవరెట్ కో–స్టార్. ఇద్దరం కలసి ఆల్రెడీ మూడు సినిమాలు చేశాం. ఇది నాలుగో సినిమా. ఈ సినిమాలో నా పాత్ర గురించి ఎక్కువ చెప్పకూడదు. నా పాత్ర పేరు చెప్పినా కూడా సినిమాలో క్లూ చెప్పేసినట్టే అవుతుంది. ► ఈ మధ్యలో కూడా కొన్ని సినిమాలు, స్పెషల్ సాంగ్స్ చేయమని ఆఫర్స్ వచ్చాయి. స్క్రిప్ట్స్ కుదరక మిస్ అయ్యాయి. సాంగ్స్ చేయాలంటే అది ఆ సినిమాకు ఉపయోగపడుతుందా? లేదా? అని ఆలోచించాను. అంత స్పెషల్‌గా ఉండదనిపించి వదిలేశాను. ఇటీవల ఓ పెద్ద సినిమా కూడా వదిలేశా. మంచి స్క్రిప్ట్, మంచి టీమ్ ఉన్నా నా పాత్ర చాలా చిన్నదిగా ఉండడంతో చేయలేదు. ► ‘దేవదాసు’తో నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నా వయసు 17,18. ఏ సినిమా వచ్చినా చేసేశాను. వయసు పెరిగే కొద్దీ మన ఆలోచన తీరు కూడా పెరుగుతుంది. మనం చేస్తున్న వృత్తి పట్ల ఇంకా గౌరవంగా ఉంటాం. మంచి సినిమాలు చేయాలనుకుంటాం. ప్రస్తుతానికి మంచి సబ్జెక్ట్స్ ఎంచుకుంటున్నాను. డ్రీమ్‌రోల్స్ లాంటివి పెద్దగా ఏం లేవు. యువరాణిలా చేయాలి, యోధురాలిగా కత్తి విద్యలు చేయాలి అని పెద్దగా అనుకోను. నా దర్శకులు అలాంటి పాత్ర చేయిస్తే చేస్తానేమో. ► నా కెరీర్ పట్ల సంతృప్తికరంగా ఉన్నాను. తప్పులు, ఒప్పులు అన్నీ ఉంటాయి. వాటి నుంచి నేర్చుకోవడమే. ‘పోకిరి’ సినిమా సమయంలో అనుకుంటా... ఆ సినిమా చేయాలా వద్దా అనుకున్నాను. మహేశ్ సోదరి మంజుల చేయమని చెప్పారు. ఆవిడ చెప్పకపోతే నా కెరీర్లో నిజంగా ఓ స్పెషల్ ఫిల్మ్ మిస్ అయ్యుండేదాన్ని. ► ‘అమర్ అక్బర్..’ సినిమాలో నా పాత్రకు స్వయంగా నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. తెలుగు డబ్బింగ్ చెప్పుకుంటానని అనుకోలేదు. శ్రీనుగారు బావుంటుందని చెప్పించారు. డబ్బింగ్ స్టూడియోకి వెళ్లి చెప్పేవరకూ నమ్మకం కుదర్లేదు. నేను డబ్బింగ్ చెప్పడం ఏంటీ? అని. ఎందుకంటే తెలుగు భాష స్పష్టంగా పలకకపోతే పాత్ర దెబ్బ తింటుంది. నా వాయిస్ నాకు నచ్చలేదు. (నవ్వుతూ). ► నేను నటిని. సెట్లో నటిస్తాను. అది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తే అందరిలాగానే నార్మల్‌గా ఉంటా. వండుకోవడం, ఇళ్లు శుభ్రం చేసుకోవడం అన్నీ నేనే చేసుకుంటాను. కానీ పర్సనల్ లైఫ్ పర్సనల్‌గా ఉంటేనే బావుంటుంది అని అనుకుంటున్నాను. అది కూడా నా వ్యక్తిగత విషయాలు చెప్పాలనుకుంటే చెబుతాను.. అలాగే మొత్తం చెప్పను (నవ్వుతూ). ► ప్రస్తుతం మానసిక ఆరోగ్యం గురించి మనందరం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని అర్థం చేసుకోగలగాలి. నేనే అర్థం చేసుకోలేకపోయాను. కానీ కొన్ని రోజులు మానసికంగా ఇబ్బంది పడ్డాను. యాంగై్జటీ, డిప్రెషన్లోకి వెళ్లడం ఇవన్నీ నార్మల్ బిహేవియర్ కాదు. సో.. అందరూ ఈ మానసిక ఆరోగ్యం మీద అవగాహన పెంచుకోవాలి. ► ‘మీటూ’ గురించి మాట్లాడుతూ – ‘‘చాలా మంది స్త్రీలు బయటకు వచ్చి తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలు చెబుతున్నారు. అలా చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి. ‘మీటూ’ ఉద్యమం కచ్చితంగా ఓ మార్పు తీసుకు రావాలని కోరుకుంటున్నాను’’ అంటున్న ఇలియానాతో మీకు ఇటువంటి సంఘటనలు ఎదురయ్యాయా? అని అడగ్గా – ‘‘ఆ విషయాల గురించి నేను మాట్లాడాలనుకున్నప్పుడు మాట్లాడతాను’’ అన్నారు. పోనీ మీ బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్‌తో రిలేషన్షిప్ స్టేటస్ ఏంటీ? అని అడిగితే – ‘‘ ప్రస్తుతానికి మా రిలేషన్షిప్ స్టేటస్ హ్యాపీ’’ అని చెప్పారు. -
శ్రీను వైట్ల గొప్ప నటుడు
‘‘శ్రీను వైట్ల సినిమాలంటేనే ఎప్పుడూ ఎంజాయ్ చేస్తూ చేస్తాం. ‘అమర్ అక్బర్ ఆంటొని’ సినిమా కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. మా కాంబినేషన్లో ఇది నాలుగో సినిమా. ఫస్ట్ చిత్రం ‘నీకోసం’ కొంచెం ఎమోషనల్ లవ్‌స్టోరీ. ‘వెంకీ, దుబాయ్ శీను’ ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైన్మెంట్. ఈ రెండింటి కలయిక ‘అమర్ అక్బర్ ఆంటొని’. మీకు నచ్చుతుందని నేను నమ్ముతున్నా’’ అని రవితేజ అన్నారు. రవితేజ, ఇలియానా జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటొని’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో రవితేజ మాట్లాడుతూ– ‘‘అమర్ అక్బర్ ఆంటొని’కి డబ్బింగ్ చెప్పేటప్పుడు విపరీతంగా నవ్వాను.. అంత ఎంజాయ్ చేశాను. తమన్‌తో ఇది 9వ సినిమా. నెక్ట్స్ పదో సినిమా. హిట్‌కి, ఫ్లాప్‌కి సంబంధం లేకుండా నాకు ఎప్పుడూ సూపర్ హిట్ మ్యూజిక్ ఇస్తాడు. తమన్.. మనం ఇలాగే కంటిన్యూ అవ్వాలి. నవీన్, రవి, మోహన్గార్లు సైలెంట్‌గా ఉన్నా వెటకారం ఎక్కువ. వీరితో ఎన్ని సినిమాలు చేయడానికైనా నేను రెడీ. అంతమంచి ప్రొడక్షన్ హౌస్ ఇది. ఇలియానా.. ఇంతకు ముందు చెప్పాను.. ఇప్పుడూ చెబుతున్నా.. షీ ఈజ్ డార్లింగ్. మనం మళ్లీ పని చేస్తాం. శ్రీను వైట్ల కామెడీ, సెన్సాఫ్ హ్యూమర్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎప్పుడూ సూపర్‌గానే ఉంటుంది. తను గొప్ప నటుడు. అతను చేసి చూపించినదాంట్లో మనం 50 శాతం చేస్తే చాలు విపరీతమైన పేరొస్తుంది. ఈ సినిమాలోని అందరి పాత్రల్లో శ్రీను కనిపిస్తారు.. ఇలియానాలో కూడా (నవ్వుతూ)’’ అన్నారు. శ్రీను వైట్ల మాట్లాడుతూ– ‘‘అమర్ అక్బర్ ఆంటొని’ కథని నేను, వంశీ రెండు నెలలు వర్కవుట్ చేసి, ఓ షేప్‌కి తీసుకొచ్చాం. ఆ తర్వాత ప్రవీణ్, మరో అబ్బాయి ప్రవీణ్ జాయిన్ అయ్యి రచనా సహకారం అందించారు. మేం నలుగురం 8 నెలలు కష్టపడి స్క్రిప్ట్ పూర్తి చేశాం. ఈ సినిమా స్క్రిప్ట్ మేకింగ్‌ని చాలా ఎంజాయ్ చేశాం. ఈ ప్రయాణం బాగుంది. ప్రయాణం బాగున్నప్పుడు ఫలితం కూడా అద్భుతంగా ఉంటుందని నేను నమ్ముతాను. ఈ సినిమాని మీరు ఆశీర్వదిస్తారు, పెద్ద హిట్ చేస్తారని 100 శాతం నాకు నమ్మకం ఉంది. రవితేజ నా ట్రబుల్ షూటర్. నేనెప్పుడైనా డల్‌గా ఉన్నప్పుడు ఎనర్జీ ఇచ్చి మళ్లీ పైకి తీసుకొస్తుంటాడు. అలా ‘వెంకీ’ అప్పుడు, ‘దుబాయ్ శీను’ అప్పుడు చేశాడు.. ఇప్పుడు ‘అమర్ అక్బర్ ఆంటొని’కి చేశాడు. తనకి నామీద ఉన్న నమ్మకానికి నేనెప్పుడూ థ్యాంక్ఫుల్గానే ఉంటాను. థ్యాంక్యూ రవి. తను ఇచ్చిన ఎనర్జీయే ఈ సినిమా. మేం రాసుకున్న కథని అలాగే తీయగలిగాం. దానికి కారణం నిర్మాతలు. నేను చేసిన సినిమాల్లో చాలా లగ్జరీగా చేసిన సినిమా ఇది. రెండు షెడ్యూల్స్ అమెరికాలో చేసినా నిర్మాతలు నాకు బాగా సహకరించినందుకు చాలా థ్యాంక్స్. వెంకట్ సి.దిలీప్ మంచి విజువల్స్ ఇచ్చాడు. తమన్ అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చారు. ఇలియానాతో ఎప్పటి నుంచో పని చేయాలనుకుంటున్నా.. ఇప్పటికి కుదిరింది. నేను ఫోన్ చేయగానే నటించేందుకు ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. తన డెడికేషన్ ప్రత్యక్షంగా చూశాను. మంచి నటి. తనతో నేను కూడా మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలి. కష్టపడి డబ్బింగ్ చెప్పినందుకు థ్యాంక్స్’’ అన్నారు. ఇలియానా మాట్లాడుతూ– ‘‘మిమ్మల్ని (ప్రేక్షకులు) చాలా మిస్ అయ్యాను.. మళ్లీ వెనక్కి వచ్చాను.. చాలా సంతోషంగా ఉంది.. లవ్ యూ. ‘అమర్ అక్బర్ ఆంటొని’ చిత్రంలో తొలిసారి డబ్బింగ్ చెప్పాను. మీకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. నన్ను నమ్మినందుకు శ్రీనుగారికి థ్యాంక్స్. రవిగారితో పనిచేయడం చాలా సరదాగా ఉంటుంది. తను రియల్లీ గుడ్ ఫ్రెండ్. తనతో చాలా చాలా సినిమాలు చేయాలనుకుంటున్నా. తమన్ చక్కని పాటలు ఇచ్చారు’’ అన్నారు. సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ– ‘‘రవితేజగారి అభిమానులకు హాయ్. మీరిచ్చే కిక్కే వేరు. 100 సినిమాలు ఎలా చేశానని నాకే తెలీదు. ఇదంతా రవితేజగారు ఇచ్చిన కిక్కే. ఆయన ఇచ్చే ఎనర్జీ నా బండికి పెట్రోల్‌లాగా నడిపిస్తూ ఉంటుంది. ‘పవర్’ సినిమా ఆడియోలో చెప్పాను. ఆయనకు ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ అయితే.. నాకు అమ్మా నాన్న రవితేజ. అందులో నిజం ఉంది. మ్యూజిక్ చేయడానికి నాకు ధైర్యం రాలేదు. ‘నువ్వు చేయగలవు.. చేస్తావు’ అంటూ ఆయన ఇచ్చిన కిక్, ధైర్యం, నమ్మకం, బలంవల్లే 100 సినిమాలు చేయగలిగాను. రవితేజగారితో 9 సినిమాలు చేశాను.. ఏ హీరోతోనూ చేయలేదు. శ్రీను వైట్లగారితోనూ 5 సినిమాలు చేశాను. ఈ రోజుకి కూడా ‘దూకుడు’ పాటలు వింటుంటే నేనేనా కంపోజ్ చేసింది అనిపిస్తుంది. అంత ఈజీగా ఆయన నా వద్ద నుంచి ట్యూన్స్ రాబట్టుకున్నారు. మనకు నచ్చిన హీరో, డైరెక్టర్‌తో ఎక్కువ సినిమాలు చేసే అవకాశం రావడంకంటే అదృష్టం ఏం ఉంటుంది. రవితేజని మాస్ మహారాజా అని పిలవను. ఆయన మనసే మహారాజ’’ అన్నారు. నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్లో ఈ సినిమా చేసినందుకు రవితేజ, శ్రీను వైట్లగార్లకు థ్యాంక్స్. తమన్‌గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. మళ్లీ ఆయనతో పని చేయాలనుకుంటున్నాం. శ్రీను వైట్లగారి గత సినిమాల్లో ఉన్నట్లు చాలామంది కమెడియన్స్ ఇందులో ఉన్నారు. టోటల్ ఎంటర్టైనర్ ఇది. శ్రీను వైట్లగారు దర్శకునిగానే కాదు.. మా నిర్మాతల రోల్ కూడా తీసుకున్నారు. ఓ మూవీ బడ్జెట్ కంట్రోల్ డైరెక్టర్ చేతిలో ఉంటుందని వంద శాతం నిరూపించారు’’ అన్నారు. చిత్రనిర్మాతలు వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి, నిర్మాతలు అనీల్ సుంకర, కిరణ్, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్, నటులు గౌతంరాజు, గిరి, పాటల రచయితలు రామజోగయ్య శాస్త్రి, విశ్వ, పారిశ్రామికవేత్త రఘురామరాజు తదితరులు పాల్గొన్నారు. -
గోవా బ్యూటీ తెలుగు పలుకులు
‘దేవదాసు’ చిత్రంతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమయ్యారు గోవా బ్యూటీ ఇలియానా. ఆమె టాలీవుడ్‌కి వచ్చి 12ఏళ్లు అవుతున్నా ఇప్పటి వరకూ తన పాత్రకు డబ్బింగ్ చెప్పలేదు. తాజాగా ‘అమర్ అక్బర్ ఆంటొని’ సినిమా కోసం తొలిసారి తెలుగు పలుకులు పలుకుతున్నారామె. రవితేజ, ఇలియానా జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటొని’. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదలవుతోంది. ఆరేళ్ల కిందట విడుదలైన ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం తర్వాత బాలీవుడ్ వెళ్లిన ఇలియానా ‘అమర్ అక్బర్ ఆంటొని’ సినిమాతో టాలీవుడ్‌కి రీ–ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో ఇలియానా చేసిన పాత్రకు ఆమెతోనే డబ్బింగ్ చెప్పించాలని శ్రీను వైట్ల అనుకున్నారు. నాలుగు రోజుల్లోనే ఇలియానా డబ్బింగ్ పార్ట్‌ని పూర్తి చేయడం విశేషం. ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్‌ని రేపు (శనివారం) నిర్వహించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: వెంకట్ సి.దిలీప్, సహనిర్మాత: ప్రవీణ్ మార్పురి. -
ఇలియానా తొలిసారిగా..!
చాలా రోజులుగా టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న గోవా బ్యూటి ఇలియానా అమర్ అక్బర్ ఆంటొని సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో తన పాత్రకు ఇలియానా స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. ఇటీవల పరభాషా హీరోయిన్లందరు తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకోవటం కామన్ అయిపోయింది. ఇప్పటికే కీర్తి సురేష్, తమన్నా, పూజ హెగ్డే లాంటి హీరోయిన్స్ ఓన్ వాయిస్‌తో ఆకట్టుకోగా తాజాగా ఈ లిస్ట్‌లో ఇలియానా కూడా చేరనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న అమర్ అక్బర్ ఆంటొని నవంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
తీన్మార్
‘ఖతర్నాక్, కిక్, దేవుడు చేసిన మనుషులు’ చిత్రాల తర్వాత రవితేజ, ఇలియానా జంటగా నటించిన చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటొని’. ఆరేళ్ల తర్వాత ఇలియానా ఈ సినిమాతో టాలీవుడ్‌కి రీ–ఎంట్రీ ఇస్తున్నారు. 11ఏళ్ల కిందట వచ్చిన ‘దుబాయ్ శీను’ తర్వాత రవితేజ– శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం ఈ నెల 16న విడుదల కానుంది. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంలో రవితేజ మూడు క్యారెక్టర్స్‌లో కనిపించనున్నారు. సో.. ఆయన అభిమానులకు తీన్మార్ అన్నమాట. ఈ నెల 10న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సరికొత్త కథ, భిన్నమైన నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. రవితేజ మూడు వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తారు. ఇప్పటికే విడుదలైన మా సినిమా టీజర్, మొదటి పాటకు మంచి స్పందన వచ్చింది. రెండవ పాటను దీపావళి సందర్భంగా ఈ రోజు విడుదల చేస్తున్నాం’’ అన్నారు. లయ, సునీల్, ‘వెన్నెల’ కిషోర్, రఘుబాబు, తరుణ్ అరోరా, అభిమన్యు సింగ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: వెంకట్ సి. దిలీప్, సహ నిర్మాత: ప్రవీణ్ మార్పురి. -
‘అఅఆ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్!
మాస్ మహరాజా రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు అంచనాలు ఎక్కువగా ఉంటాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వెంకీ, దుబాయ్ శ్రీను లాంటి కామెడీ ఎంటర్టైనర్స్ వచ్చాయి. అయితే చాలా ఏళ్ల తరువాత మళ్లీ వీరిద్దరు కలిసి చేస్తోన్న మూవీ ‘అమర్ అక్బర్ ఆంటొని’ . రీసెంట్గా విడుదల చేసిన టీజర్‌తో అంచనాలు పెరిగాయి. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. నవంబర్ 16 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక నవంబర్ 10న నిర్వహించబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, మొదటి పాటకు ప్రేక్షకులనుంచి మంచి స్పందన వస్తోంది. రెండవ పాటను దీపావళి సందర్భంగా మంగళవారం విడుదల చేయనున్నారు. రవితేజ మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో లయ, సునీల్, వెన్నెల కిషోర్, రఘు బాబు, తరుణ్ అరోరా, అభిమన్యు సింగ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. -
ఏం చేస్తుంటారు?
ఇటీవల వచ్చిన ఫస్ట్ లుక్‌తో ‘అమర్ అక్బర్ ఆంటొని’ ఎలా ఉంటారో తెలిసింది. మరి ఈ ముగ్గురు ఏం చేస్తుంటారు? ఎలా మాట్లాడతారో చూపించడానికి శాంపిల్‌గా టీజర్‌ను రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు టీమ్. రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మించిన సినిమా ‘అమర్ అక్బర్ ఆంటొని’. ఇలియానా కథానాయిగా నటించారు. బాలీవుడ్‌కి వెళ్లిన ఇలియానా ఈ సినిమాతోనే మళ్లీ సౌత్‌కి తిరిగొస్తున్నారు.‘‘శ్రీను వైట్ల పుట్టినరోజు సందర్భంగా రిలీజైన గ్లిమ్స్ ఆఫ్ అమర్ అక్బర్ ఆంటొనికి మంచి స్పందన వచ్చింది. సరికొత్త కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో హీరో రవితేజ డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపిస్తారు. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 29న విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. సునీల్, లయ, ‘వెన్నెల’ కిశోర్, రవి ప్రకాష్, తరుణ్ అరోరా కీలక పాత్రలు చేసిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. -
జోడీ కుదిరిందా?
ఈ ఏడాది ‘సత్యమేవ జయతే’ చిత్రంతో మంచి విజయాన్ని సాధించిన బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహాం మంచి ఫామ్‌లో ఉన్నట్లున్నారు. ఇటీవల ‘రోమియో అక్బర్ వాల్టర్’ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసిన అబ్రహాం తాజాగా అనీస్ బాజ్మీ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు బాలీవుడ్ సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో సెట్స్‌పైకి వెళ్లనుందట. ఇందులో ఇలియానాను కథానాయికగా తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇవే నిజమైతే కెరీర్లో తొలిసారి జాన్‌తో జోడీ కట్టనున్నారు ఇలియానా. అలాగే ఈ స్క్రిప్ట్ పరంగా ఈ సినిమాకు మరో హీరో అవసరం ఉందట. ఇందుకోసం సంజయ్‌దత్, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్ పేర్లను పరిశీలిస్తున్నారట టీమ్. మరి..ఫైనలైజ్ అయ్యారా? లేదా అన్నది మరికొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. ఈ చిత్రానికి ‘పాగల్పాంటీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాక్. జాన్ అబ్రహాం నటించిన ‘బట్లా హౌస్’ సినిమా వచ్చే ఏడాది ఆగస్టులో రిలీజ్ కానుంది. అలాగే బాలీవుడ్లో లవ్ రంజన్ దర్శకత్వంలో అజయ్ దేవగణ్, రణ్‌బీర్ కపూర్ హీరోలుగా రూపొందనున్న ఓ సినిమాలో కథానాయికగా ఇలియానా పేరు తెరపైకి వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. తెలుగులో రవితేజతో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో ఇలియానా కథానాయికగా నటించిన విషయం తెలిసిందే. -
‘అత్యంత ప్రమాదకర సెలబ్రిటీ ఇలియానా’
అభిమాన తారలకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఫ్యాన్స్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. సోషల్ మీడియాలో తారలను ఫాలో అవ్వటంతో పాటు వారికి సంబంధించిన వార్తలకు తెలుసుకునేందుకు ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తుంటారు. అయితే అలా సెర్చ్ చేసే సమయంలో కొంత మంది తారల గురించి వెతకటం ప్రమాదకరమంటున్నారు ఎక్స్పర్ట్స్. పాపులర్ సెలబ్రిటీలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు డౌన్లోడ్ చేసే సమయంలో మీ కంప్యూటర్లలోకి వైరస్‌లను ప్రవేశ పెట్టే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రముఖ ఇంటర్నెట్ సెక్యూరిటీ సంస్థ మెకాఫీ మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీల లిస్ట్‌ను విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో గోవా బ్యూటీ ఇలియానా టాప్ ప్లేస్‌లో ఉన్నారు. ఇలియానా తరువాతి స్థానాల్లో ప్రీతీ జింటా, టబు, క్రితీ సనన్, అక్షయ్ కుమార్, దీపికా పదుకొనే లాంటి వారు ఉన్నారు. అయితే టాప్ సెలబ్రిటీలను పక్కన పెట్టి పెద్దగా సినిమా అవకాశాలు లేని ఇలియానా మెస్ట్ డేంజరస్ సెలబ్రిటీల లిస్ట్‌లో టాప్ ప్లేస్‌లో ఉండటం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ భామ రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న అమర్ అక్బర్ ఆంటొని సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. -
గుమ్మడికాయ కొట్టేశారు
‘ఖతర్నాక్, దేవుడు చేసిన మనుషులు, కిక్’ చిత్రాల తర్వాత రవితేజ, ఇలియానా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటొని’. శ్రీనువైట్ల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ (సివిఎమ్) నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌కి గుమ్మడికాయ కొట్టేశారు. హీరో హీరోయిన్లపై హైదరాబాద్‌లో చిత్రీకరించిన చివరి పాటతో షూటింగ్ పూర్తయింది. సోమవారం శ్రీనువైట్ల పుట్టిన రోజు కానుకగా ‘అమర్ అక్బర్ ఆంటొని’ పాత్రలను పరిచయం చేస్తూ, ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘‘సరికొత్త కథ, భిన్నమైన నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రవితేజ మూడు వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తారు. ఈ గెటప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. లయ, సునీల్, ‘వెన్నెల’ కిశోర్, రఘుబాబు, తరుణ్ అరోరా, అభిమన్యు సింగ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సహ నిర్మాత: పవ్రీణ్ మర్పూరి, సీఈఓ: చెర్రీ, కెమెరా: వెంకట్ సి దిలీప్, సంగీతం: ఎస్ఎస్ తమన్. -
ఇండియా రిటర్న్
అమెరికాలో పని ముగించుకొని ఇండియా రిటర్న్ అయ్యారు అమర్ అక్బర్ ఆంటొని. ఈ ట్రిప్‌లో వాళ్లు ఏం సందడి చేశారన్నది స్క్రీన్ మీద తెలుసుకోవాల్సిందే. శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటొని’. ఇందులో రవితేజ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఇలియానా కథానాయికగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. నెల రోజుల పాటు అమెరికాలో షూటింగ్ జరిపిన చిత్రబృందం ఆ షెడ్యూల్‌ని ముగించుకొని ఇండియా రిటర్న్ అవుతున్నారు. ఈ షెడ్యూల్‌తో ఒక్క పాట మినహా సినిమా షూటింగ్ కంప్లీట్ అయిందని సమాచారం. మిగిలిన సాంగ్ కూడా సెట్ సాంగ్ అని, నెక్ట్స్ వీక్‌లో షూట్ చేయనున్నారట. అక్టోబర్ 5న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: యస్.యస్.తమన్, కెమెరా: వెంకట్ సి.దిలీప్. -
స్క్రీన్ టెస్ట్
1. బాలచందర్ దర్శకత్వం వహించిన ‘మరోచరిత్ర’ సినిమాలో కమల్‌హాసన్ సరసన నటించిన హీరోయిన్ ఎవరో గుర్తుందా? ఎ) సరిత బి) జయప్రద సి) సుమలత డి) రేవతి 2. ‘బొమ్మరిల్లు’ చిత్రంలో హీరో సిద్ధార్థ్‌కు తల్లిగా నటించిన ప్రముఖ నటి ఎవరు? ఎ) జయసుధ బి) శారద సి) గీత డి) కవిత 3. ఈ ఏడాది ఆగస్ట్ 27వ తేదీతో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న చిరంజీవి సినిమా ఏంటో తెలుసా? ఎ) కొదమ సింహం బి) కొండవీటి దొంగ సి) మాస్టర్డి) చూడాలని వుంది 4. ‘అల్లరి మొగుడు’ చిత్రంలో హీరో మోహన్‌బాబు సరసన ఇద్దరు కథానాయికలు నటించారు. ఒకరు మీనా. రెండో హీరోయిన్ ఎవరు? ఎ) వాణీ విశ్వనాథ్ బి) శోభన సి) దివ్యభారతి డి) రమ్యకృష్ణ 5. నటుడు చంద్రమోహన్ హీరోగా చేసిన మొదటి చిత్రం ‘రంగుల రాట్నం’. ఆ చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించింది ఒక్కరే. ఎవరా దర్శక–నిర్మాత? ఎ) బి.ఎన్. రెడ్డి బి) కె.వి. రెడ్డి సి) హెచ్.యం. రెడ్డి డి) ఆదుర్తి సుబ్బారావు 6. ‘జిల్’ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమయ్యారు రాధాకృష్ణ. ఆయన తదుపరి చిత్రంలో హీరో ఎవరో తెలుసా? ఎ) ప్రభాస్ బి) నాగార్జున సి) నాని డి) వెంకటేశ్ 7. ‘ఏ మాయ చేశావే’ చిత్రంలో చిన్న పాత్ర ద్వారా తెరంగేట్రం చేసిన నటుడు ఎవరు? ఎ) సుధీర్ బాబు బి) సందీప్ కిషన్ సి) వరుణ్ సందేశ్ డి) నిఖిల్ 8. ఇప్పటివరకు తెలుగులో 5 పాటలు పాడారు ఈ హీరో. ఆయన పాడిన అన్ని పాటలూ ప్రజాదరణ పొందాయి. ఆ టాప్ హీరో ఎవరో కనుక్కోండి? ఎ) రామ్‌చరణ్ బి) రానా సి) నాగచైతన్య డి) యన్టీఆర్ 9. ‘శుభలగ్నం’ చిత్రంలో భర్తను కోటి రూపాయలకు అమ్మేసే క్యారెక్టర్లో నటించన నటి ఎవరు? ఎ) రోజా బి) ఆమని సి) భూమిక డి) సౌందర్య 10. ‘కృష్ణం వందే జగద్గురుమ్’ చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో నర్తించిన నటి ఎవరో తెలుసా? ఎ) తమన్నా బి) జెనీలియాసి) సమీరా రెడ్డి డి) హన్సిక 11. ‘యమహా నగరి కలకత్తా పురీ.. నమహో హుబ్లీ హౌరా వారధీ...’ పాట రచయిత ఎవరో తెలుసా? ఎ) భువనచంద్ర బి) వేటూరి సి) సుద్దాల అశోక్ తేజ డి) ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి 1.2 శ్రీదేవి సోదరి మహేశ్వరి నటించిన హిట్ చిత్రం ‘పెళ్లి’. ఆ చిత్రదర్శకుడెవరో కనుక్కోండి? ఎ) కోడి రామకృష్ణ బి) పి. వాసు సి) బి. గోపాల్ డి) ముత్యాల సుబ్బయ్య 13. వెంకటేశ్, వరుణ్‌తేజ్ ప్రస్తుతం ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఆ చిత్రదర్శకుడెవరో కనుక్కోండి? ఎ) అనిల్ రావిపూడి బి) బాబీ సి) సంకల్ప్ రెడ్డి డి) సందీప్ రెడ్డి 14. ‘రేసుగుర్రం’ చిత్రంలోని ‘సినిమా సూపిత్త మామా... నీకు సినిమా సూపిత్త మామా.. సీను సీనుకి నీతో సీటీ కొట్టిస్త మామా...’ పాటను పాడిందెవరు? ఎ) అనుదీప్ బి) రేవంత్ సి) సింహా డి) హేమచంద్ర 15. ‘నర్తనశాల’ చిత్రంలో ద్రౌపదిగా నటించిన నటి ఎవరో తెలుసా? ఎ) సావిత్రి బి) వాణిశ్రీ సి) జయలలిత డి) అంజలీదేవి 16. రామ్‌చరణ్ నటించిన ‘ధృవ’ చిత్రానికి సంగీత దర్శకుడు? ఎ) యస్.యస్. తమన్ బి) హిప్ హాప్ తమిళ సి) యువన్ శంకర్‌రాజా డి) దేవిశ్రీ ప్రసాద్ 17. దర్శకుడు సురేందర్ రెడ్డి తన కెరీర్లో ఇద్దరు హీరోలతో రెండు చిత్రాలకు పని చేశారు. కానీ ఓ హీరోయిన్‌కు మాత్రం రెండు సినిమాల్లో ఛాన్స్ ఇచ్చారు. ఎవరా హీరోయిన్? ఎ) అమృతా రావు బి) ఇలియానా సి) శ్రుతీహాసన్ డి) రకుల్ ప్రీత్ సింగ్ 18. ‘బిగ్ బాస్2’ తెలుగు రియాలిటీ షోకి వ్యాఖ్యాతగా నాని చేస్తున్నారు. మరి తమిళ ‘బిగ్ బాస్’ కి హోస్ట్‌గా ఏ హీరో చేస్తున్నారు? ఎ) విజయ్ బి) ధనుష్ సి) కమల్‌హాసన్ డి) శింబు 19. కృష్ణంరాజు, శ్రీదేవి నటించిన ఈ స్టిల్ ఏ సినిమా లోనిది? ఎ) త్రిశూలం బి) బాబులు గాడి దెబ్బ సి) బొబ్బిలి బ్రహ్మన్న డి) కటకటాల రుద్రయ్య 20. ఈ క్రింది ఫొటోలోని బాల నటుడు ఇప్పుడొక పెద్ద నటుడు చెప్పగలరా? ఎ) కమల్‌హాసన్ బి) హరీశ్ సి) రమేశ్‌బాబు డి) హరికృష్ణ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) ఎ 3) డి 4) డి 5) ఎ 6) ఎ 7) ఎ 8) డి 9) బి 10) సి 11) బి 12) ఎ 13) ఎ 14) సి 15) ఎ 16) బి 17) డి 18) సి 19) బి 20) ఎ నిర్వహణ: శివ మల్లాల -
మూడు ముక్కలాట?
అమర్.. అక్బర్.. ఆంటొని.. ఒక్కరా? ముగ్గురా? అన్నదానిపై చిన్న క్లారిటీ ఇచ్చింది ‘అఅఆ’ చిత్ర బృందం. అమర్ అక్బర్ ఆంటొని ముగ్గురు అంటూ క్లారిటీ ఇచ్చారు. మూడు పేక ముక్కల మీద ముగ్గురి స్టిల్స్‌తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. సో.. ముగ్గురు హీరోలు కాబట్టి మూడు ముక్కలాటలా ఉంటుందా? థియేటర్స్‌లోనే తెలుస్తుంది. ‘వెంకీ, దుబాయ్ శీను’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత దర్శకుడు శ్రీను వైట్ల, రవితేజ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటొని’. ఇలియానా కథానాయిక. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను సోమవారం రిలీజ్ చేశారు. ‘‘ఈ ప్రాజెక్ట్ మీద చాలా ఎగై్జటెడ్ ఉన్నాను’’ అని రవితేజ పేర్కొన్నారు. ‘‘రవితేజ కెరీర్లో భిన్నంగా కనిపించడంతో పాటు నటిస్తున్న చిత్రం ఇది. మూడు భిన్న గెటప్స్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది. సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌తో ఆల్మోస్ట్ టాకీ పార్ట్ పూర్తవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 5న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
డబుల్ ధమాకా
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ప్రతినిధులు నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవి శంకర్ సినీ లవర్స్‌కు ఒకే రోజు డబుల్ ధమాకా ఇచ్చారు. రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’, నాగచైతన్య ’సవ్యసాచి’ సినిమాల విడుదల తేదీలను ఒకే రోజున అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. ‘‘ఈ ఏడాది తొలి అర్ధభాగంలో మా బ్యానర్లో విడుదలైన ‘రంగస్థలం’ చిత్రం మంచి హిట్ సాధించింది. మా సక్సెస్ఫుల్ జర్నీలో భాగస్వాములైన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరు ఇచ్చిన ఈ విజయాలు మా బాధ్యతను మరింత పెంచుతున్నాయి. అలాగే మా సంస్థ నుంచి వస్తున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’, ‘సవ్యసాచి’ సినిమాల రిలీజ్ డేట్స్‌ను ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. రవితేజ, ఇలియానా జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాను అక్టోబర్ 5న, నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సవ్యసాచి’ సినిమాను నవంబర్ 2న విడుదల చేయబోతున్నాం’’ అని పేర్కొన్నారు మైత్రీమూవీ మేకర్స్ ప్రతినిధులు. -
అఅఆ ఎప్పుడు వస్తారు?
అమెరికాలో నెల రోజులపాటు ఫుల్ స్పీడ్‌లో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ షూటింగ్లో రవితేజ బిజీగా ఉన్నారని తెలుసు. మరి అక్కడ షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసి ఇండియా తిరిగెప్పుడొస్తారు? సరిగ్గా తెలియదు కదా. మేం చెప్తాం. దాదాపు పదేళ్ల తర్వాత శ్రీను వైట్ల, రవితేజ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. ఇలియానా కథానాయికగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యర్నేని, మోహన్ చెరుకూరి, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతుంది. నెలరోజుల పాటు జరగనున్న ఈ చిత్రీకరణ సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో కంప్లీట్ కానుంది. సెప్టెంబర్ 5న ఇండియా తిరిగిరానున్నారు చిత్రబృందం. ఈ అమెరికా షెడ్యూల్‌తో ఒక్క పాట మినహా షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఆ మిగిలిన ఒక్క సాంగ్‌ను హైదరాబాద్‌లో షూట్ చేయనున్నారు. సెప్టెంబర్ 27న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: యస్.యస్. తమన్ -
డేటింగ్ ప్రశ్నపై నటి దిమ్మతిరిగే రిప్లై
గోవా సుందరి, నటి ఇలాయానా తరచూ ఏదో ఓ పోస్టుతో సోషల్ మీడియాలో టౌక్ ఆప్ ది టౌన్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. విదేశీ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్లో ఉన్న ఇలియానా చాలారోజుల కిందట హబ్బీ అని పోస్ట్ చేసి, ఇటీవల పోస్ట్‌లో మాత్రం మై లవ్ అని సంబోధించారు నటి. తాజాగా ప్రియుడు నీబోన్‌తో డేటింగ్, పెళ్లి లాంటి విషయాలపై ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఇలాయానా చక్కటి బదులిచ్చారు. అది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఓ విదేశీయుడితో మీరు ఎందురు డేటింగ్ చేస్తున్నారు, అతడిని మీ జీవిత భాగస్వామిగా ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నిస్తూ పోస్ట్ చేశారు. ‘ఓ వ్యక్తి మనసుతో నా మనసు ప్రేమలో పడింది. అతడి శరీర రంగు, జాతీయత (ఏ దేశం) లాంటి విషయాలు నాకు అనవసరం’ అంటూ ఇలియానా బదులిచ్చారు. ప్రేమ, పెళ్లి గురించి తనను అడిగిన ప్రశ్నకు నటి దిమ్మతిరిగే రిప్లై ఇచ్చారంటూ ఇలియానా ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మరోవైపు ఆండ్రూ నిబోన్‌తో వివాహం జరిగిందా అన్న ప్రశ్నకు సమాధానాన్ని మాత్రం ఎప్పటికప్పుడూ చాలా అందంగా దాటవేస్తున్నారు. రీల్ లైఫ్‌తో పాటు రియల్ లైఫ్ చాలా బాగుందని మాత్రం సెలవిస్తున్నారు. -
తారుమారు
సినిమా కథల్లోలాగే సినిమా మేకింగ్‌లో కూడా ట్విస్టులుంటాయి. మన ఒళ్లో పడ్డ బంగారాన్ని ఇంకొకరికి అప్పజెప్పడం.. మనకి వర్కవుట్ కాదనుకున్నది ఇంకొకరికి బీభత్సంగా వర్కవుట్ అవ్వడం... మనకు ఫిట్ కాదనుకున్నది ఇంకొకరికి హిట్ అవ్వడం..ఇలాంటి ట్విస్టులు మారుమారు తారుమారు. ‘ప్రాప్తమున్న తీరానికి పడవ చేరుకుంటుంది’ అన్నాడొక కవి. ‘దానే దానే పే లిఖా హై ఖానే వాలే కా నామ్’ అంటాడు ఉత్తర దేశపు యతి. ‘అంతా లలాట లిఖితం’ అనుకుంటాడు వేదాంతి. ఏమైనా అటుకులు చిటుకులు మారుతుంటాయి. త్రాసులోని పళ్లేలు ఉల్టాపల్టా అవుతుంటాయి. పూలు పండ్లవుతుంటాయి. పండ్లు పేస్ట్రీలవుతుంటాయి. రజనీకాంత్ అన్నట్టు ‘దక్కేది దక్కకుండా పోదు దక్కనిది ఎన్నటికీ దక్కదు’. మొన్న చూడండి... ‘ఆర్ ఎక్స్ హండ్రెడ్’ పెద్ద హిట్ అయ్యింది. దర్శకుడు తెలియదు... హీరో తెలియదు... హీరోయిన్ తెలియదు... కాని రెండు కోట్లతో తీసిన సినిమాకు 10 కోట్లు వచ్చాయని టాక్. ఈ సినిమా మొదట హీరో నిఖిల్ దగ్గరకు పోయిందట. సుధీర్ దగ్గరకు కూడా పోయిందట. కాని వాళ్లు రిజెక్ట్ చేశారు. ఆ సినిమా కోసం ఫోకస్ చేయాల్సిన కెమెరా ఎదుట నిలవాల్సింది ‘కార్తికేయ గుమ్మకొండ’ అని విధి నిర్ణయించినప్పుడు ఇలాంటి వైచిత్రే చోటు చేసుకుంటూ ఉంటుంది.సినిమాల్లో ఇవి మామూలే. అవకాశం రానంత వరకూ ఒక బాధ. అవకాశం వచ్చి వదులుకోవాల్సినప్పుడు ఇంకో బాధ. సరిగ్గా జడ్జ్ చేయకుండా వదిలేసి అది కాస్త హిట్ అయితే ఇంకో బాధ. ఇంద్రగంటి మోహనకృష్ణ రెండు హిట్స్ ‘జెంటిల్మెన్’, ‘సమ్మోహనం’ కూడా మొదట వేరే హీరోల దగ్గరకు వెళ్లాయి. ‘జెంటిల్మెన్’ కోసం శర్వానంద్, వరుణ్‌తేజ్‌లను సంప్రదించాడు దర్శకుడు. కాని ఆ హిట్ నానీ అకౌంట్లో పడింది. ‘సమ్మోహనం’ కోసం కూడా నిఖిల్‌ని, నానిని అనుకుంటే ఆ సినిమాలోని కీలక సన్నివేశం టెర్రస్ సీన్ లాంటిది గతంలో ‘ఎటో వెళ్లిపోయింది మనసు’లో సమంతతో తాను చేసి ఉన్నాడు కనుక నాని ఆలోచనలో పడ్డాడని ఫలితంగా ఆ మిఠాయి పొట్లం సుధీర్ జేబులో పడిందని సమాచారం. ‘బాహుబలి’ కోసం శివగామి పాత్రకు శ్రీదేవిని అనుకుంటే ఆ బర్గండీ రంగు చీర ధరించే పాత్రకు రమ్యకృష్ణ హక్కుదారు కాలేదూ? సక్సెస్ అనే ఏనుగు మాల పట్టుకొని వీధిలోకి వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అది మన మెడలో పడేలా చూసుకోవాలి. లేకుంటే అర్ధరాజ్యం, రాకుమారి ఎవరి పరమో అయిపోతుంది. ‘శతమానం భవతి’ మొదట సాయిధరమ్ తేజ్ దగ్గరకు వెళ్లింది. ఎందుకో వర్కవుట్ కాలేదు. రాజ్ తరుణ్‌కు కూడా ఈ సినిమా చిక్కాల్సింది. అయితే చిక్కించుకున్నవాడు శర్వానంద్. ఇక దర్శకుడు వక్కంతం వంశీ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ కోసం మొదట అనుకున్నది ఎన్.టి.ఆర్‌ను అన్న సంగతి తెలిసిందే. జరిగిపోయిన సినిమాల కథ ఇలా ఉంటే జరుగుతున్న సినిమాల కథ కూడా కుతూహలం రేపుతోంది. శ్రీను వైట్ల ‘అమర్ అక్బర్ ఆంటోనీ’గా రవితేజను చూపించాలని సినిమా మొదలుపెట్టారు. హీరోయిన్గా అనూ ఇమ్మాన్యుయేల్‌ను తీసుకున్నారు. కాని అనూకు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు ఏవో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయనే వార్తలు గుప్పుమన్నాయి. ఈ వివాదం ఎటుపోయి ఎటు వస్తుందని అనుకున్నారో ఏమో అనూ ఇమ్మాన్యుయేల్ ఓ స్టేట్మెంట్ ఇస్తూ నాగచైతన్యతో ‘ శైలజారెడ్డి అల్లుడు’ చేస్తున్నాను. ఆ డేట్స్ రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ డేట్స్‌తో క్లాష్ అవుతున్నాయి. అందుకే రవితేజ సినిమా నుంచి తప్పుకుంటున్నాను అన్నారు. వాస్తవం ఏదైనా ఈ అవకాశం ఇలియానాకు ప్రాప్తమైంది. బాలీవుడ్‌కు వెళ్లి తెలుగుకు ఆరేళ్లుగా దూరంగా ఉన్న ఇలియానా ఈ సినిమాతో మళ్లీ కనిపించనుందని తెలిసి ఆమె ఫ్యాన్స్ రిలీజ్ డేట్ కోసం, బుక్ మై షోలో టికెట్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా పాత్రలు మారే తీరు తమిళంలో ఇంకా ఊపు మీద ఉంది. దర్శకుడు సి.సుందర్ అక్కడ 250 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘సంఘమిత్ర’ అనే సినిమా పనులు మొదలెట్టారు. లీడ్ రోల్ శ్రుతిహాసన్‌కు వెళ్లింది. జయం రవి, ఆర్య కీలక పాత్రలు. అంతా హ్యాపీనే అనుకుంటూ ఉన్నప్పుడు ట్విస్ట్ వచ్చింది. ‘సంఘమిత్ర’ టీమ్‌తో తనకు సెట్ కావడం లేదని, ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ ఇవ్వలేదని, క్యాలెండర్ డిటేల్స్ కూడా చెప్పలేదని శ్రుతి ఆరోపించారు. సినిమా నిర్మాతలు ఇంకో వెర్షన్ చెప్పారు. శ్రుతితో ఎఫెక్టివ్‌గా పని చేయలేమని మేమే నిర్ణయించుకున్నాం అన్నారు. మరి సంఘమిత్ర పాత్రను ఎవరు చేయబోతున్నారు? అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. నయనతార, అనుష్క, హన్సిక ఇలా సౌత్‌లో చాలామంది టాప్ హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి కానీ ఫైనల్‌గా ‘ఎం.ఎస్.ధోని’లో నటించిన దిశా పాట్నీకి ఆ చాన్స్ వెళ్లింది. త్రిష కూడా ఇటీవల ఇలాగే తప్పుకున్నారు. విక్రమ్ హీరోగా ఆమె హీరోయిన్గా హరి దర్శకత్వంలో ‘సామీ స్క్వేర్’ అనే సినిమా మొదలైంది. ఇది గతంలో పెద్ద హిట్టయిన ‘సామీ’కి సీక్వెల్. మొదటి భాగంలో నటించినందున తనను రిపీట్ చేశారని త్రిష అనుకున్నట్టున్నారు. అయితే నిర్మాతలు కీర్తి సురేష్‌ను హీరోయిగా తీసుకుని త్రిష చేస్తున్నది సెకండ్ హీరోయిన్ పాత్ర అనే హింట్ ఇచ్చారు. ఒక రకంగా చూస్తే ఇది పూలమ్మిన చోట కట్టెలమ్మడం అవుతుంది. దాంతో క్రియేటివ్ డిఫరెన్సెస్ పేరుతో త్రిష తప్పుకుంటే ఆ నూకలు ‘ఐశ్వర్య రాజేష్’కు దక్కాయి. ఇలా తమిళ సాంబారుకు తెలుగు పోపు పడిన మరో ఘటన కూడా జరిగింది. సూర్య హీరోగా కె.వి.ఆనంద్ దర్శకత్వంలో ఒక భారీ సినిమా మొదలైతే అందులో అల్లు శిరీష్ ఒక పాత్ర పోషిస్తున్నట్టు వార్తలొచ్చాయి. కానీ లండన్‌లో షూటింగ్‌కు మరో తమిళ నటుడు ఆర్య శిరిష్ స్థానంలో హాజరైనట్టు తెలిసింది. ఏం జరిగిందో తెలియదు కానీ డేట్స్ ప్రాబ్లమ్‌తో నేనే ఆ సినిమా నుంచి తప్పుకున్నాను అని అల్లు శిరీష్ స్టేట్మెంట్ ఇచ్చారు. దర్శకుల విషయంలో కూడా మార్పుచేర్పులు జరగడం ఇటీవల జరుగుతోంది. ‘సర్దార్ గబ్బర్‌సింగ్’కు మొదట దర్శకుడిగా సంపత్ నందిను అనుకున్నారు. కానీ ఆ అవకాశం బాబీకి దక్కింది. ‘కాటమరాయుడు’ కోసం ఎస్.జె.సూర్య సైన్ చేశారు. కానీ షూటింగ్ కూడా మొదలయ్యే దశలో ఆ అవకాశం కిశోర్ పార్థసాని (డాలీ)కు దక్కింది. హిందీలో హిట్ అయిన ‘క్వీన్’ దక్షిణాది భాషల్లో రీమేక్ అవుతోంది. తెలుగులో అవకాశం నీలకంఠకు వెళ్లింది. హీరోయిన్గా తమన్నాను తీసుకున్నారు. అయితే దర్శకునికీ హీరోయిన్‌కు క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని వార్తలు పొక్కాయి. దర్శకుడు మారాడు. నీలకంఠ స్థానంలో ‘ఆ’ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ మెగాఫోన్‌ను ధరించాడు. సినిమా పేరు ‘దటీజ్ మహాలక్ష్మి’. ఇక బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక ఎన్.టి.ఆర్ బయోపిక్ తేజ దర్శకత్వంలో హైదరాబాద్‌లో అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. కాని కొన్ని రోజులకు ఈ సినిమా నుంచి తేజ తప్పుకోనున్నారట అనే లీకులు వినిపించాయి. చివరికి ఈ లీకులే నిజమైయ్యాయి. ఆ స్థానంలో దర్శకుడు క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ) డైరెక్ట్ చేస్తున్నారు. నిర్మాత అయినా దర్శకుడు అయినా హీరో అయినా ఒక సినిమా గురించి ఆలోచించినప్పుడు మొదట కోరుకునేది సక్సెస్‌నే. కొన్ని పాత్రలు కొందరు చేస్తే బాగుంటుందని అనుకోవచ్చు. కాని అన్నిసార్లు అది కుదరక పోవచ్చు. వాటిని దక్కించుకున్నవారు అనుకున్నవారి కంటే బాగా చేసి మెప్పించవచ్చు. తెర వెనుక జరిగే ఈ విషయాలు సినీ అభిమానులకు ఆసక్తి కలిగించేవే. కాని థియేటర్లో వారు ప్రేక్షకులుగా కూచున్నప్పుడు తెర మీద ఏం కనిపిస్తున్నది తమను ఎలా మెప్పిస్తున్నదే ముఖ్యం. మార్పుచేర్పులతో కూడా సినిమాకు మంచే జరగాలని కోరుకుందాం. భానుమతి బదులు సావిత్రి పాత రోజులలో కూడా చాలా రీప్లే్లస్మెంట్స్ ఆర్టిస్టులకు లాభించాయి. ‘మిస్సమ్మ’లో మొదట భానుమతిని అనుకుని కొంచెం షూటింగ్ తర్వాత ఆమెను తొలగించి సావిత్రిని తీసుకున్నారు. ఆ సినిమాతో ఆమె స్టార్ అయ్యింది. అలాగే జానపదాలకు పేరు గడించిన అక్కినేనిని మొదట ‘పాతాళభైరవి’కి అనుకున్నారు. కానీ ఎన్.టి.ఆర్. తోటరాముడుగా స్టార్ అయ్యారు. సాంఘికాలతో గుర్తింపు పొందుతున్న ఎన్.టి.ఆర్‌ను ‘దేవదాసు’కు అనుకున్నారు. ఎ.ఎన్.ఆర్ ఆ పాత్ర వేసి కీర్తి పొందారు. ‘రక్తసంబంధం’ సినిమా మొదట ఎ.ఎన్.ఆర్కు వెళ్లింది. కానీ చెల్లెలి పాత్రలో సావిత్రి ఉంటే తమ జంటను యాక్సెప్ట్ చేయరేమో అన్న సందేహం ఆయన వ్యక్తం చేశారు. ఆ పాత్ర ఎన్.టి.ఆర్కు చాలా పేరు తెచ్చి పెట్టింది. ‘సాగర సంగమం’లో హీరోయిన్ వేషం మొదట జయసుధకు వెళ్లింది. కానీ జయప్రదకు ఆ పాత్ర రాసి పెట్టి ఉంది. ‘పడమటి సంధ్యారాగం’లో హీరోయిన్గా చేయాల్సింది సుహాసిని. కానీ ఎంతో చక్కగా ఆ పాత్ర పోషించి విజయశాంతి పేరు తెచ్చుకున్నారు. ‘ఖైదీ’ సూపర్‌స్టార్ కృష్ణ చేయాల్సింది. కానీ చిరంజీవికి దక్కి పెద్ద స్టార్ అయ్యారు. ‘సమరసింహారెడ్డి’ కథ మొదట వెంకటేశ్ దగ్గరకు వెళ్లింది. కానీ బాలకృష్ణ ఆ పాత్రతో కొత్త ట్రెండ్‌ను సృష్టించారు. ఇక రవితేజతో చేయాల్సిన ‘పోకిరి’ మహేశ్‌బాబుకు దక్కి ఆయన కెరీర్‌ను ఎంత మలుపు తిప్పిందో తెలిసిందే. – సినిమా డెస్క్, ఇన్పుట్స్: శివాంజనేయులు -
హబ్బీ బాయ్‌ఫ్రెండ్!
మీరు ఇలియానాను ఫాలో అవుతున్నారా? అంటే ఆమె సినిమాలను, యాక్టింగ్‌ను అని కాదు. సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అవుతున్నారా? అయితే తప్పకుండా ఆండ్రూ నీబోన్‌ని మీరు చాలాసార్లు చూసి ఉంటారు. అతనొక మంచి ఫొటోగ్రాఫర్. ఇలియానా కొద్దికాలంగా పోస్ట్ చేస్తున్న ప్రతీ ఫొటో అతను తీసిందే అయి ఉంటుంది. లేదా వీరిద్దరూ కలిసి ఆ ఫొటోలో ఉంటారు. మొన్న ఆండ్రూ బర్త్‌డే సందర్భంగా ఒక ఫొటో పోస్ట్ చేసి, ‘హ్యాపీ బర్త్‌డే మై లవ్’ అంది ఇలియానా. అంతవరకు బాగుంది. అంతకుముందు ఎప్పుడో చేసిన ఒక పోస్ట్‌లో బాయ్‌ఫ్రెండ్ అని అంటుంది. అంతకు చాలా ముందు చేసిన ఒక పోస్ట్‌లో ‘హబ్బీ’ (హజ్బండ్కి ముద్దుపేరు) అని పిలుచుకుంటుంది. ‘వీరిద్దరికీ ఇప్పటికే పెళ్లైపోయిందా?’ ఇది అందరికీ అప్పట్నుంచీ ఉన్న అనుమానం. ఆమెనే అడిగిస్తే పోతుంది కదా అని అడిగేశారు కొంతమంది. ‘అది పర్సనల్. పర్సనల్ లైఫ్ చాలా బాగుంది. ప్రొఫెషనల్ లైఫ్ లాగే!’ అంటుంది ఇలియానా. అంటే అతను హబ్బీనా? బాయ్‌ఫ్రెండా? ఇలియానే చెప్పాలి ఇంకెప్పుడైనా! -
ఒక్కరా? ముగ్గురా?
థియేటర్లోకి రావడానికి టైమ్ ఫిక్స్ చేసుకున్నారు రవితేజ. శ్రీను ౖవైట్ల దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తోన్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. ఇందులో ఇలియానా కథానాయికగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. రీసెంట్గా హైదరాబాద్‌లో సాంగ్ చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా యూనిట్ నెక్ట్స్ షెడ్యూల్‌ను యూఎస్‌లో స్టార్ట్ చేయనుంది. ఈ నెల 20న మొదలయ్యే ఈ షెడ్యూల్ దాదాపు 40 రోజులకుపైగా జరుగుతుందట. ఈ షెడ్యూల్‌తో ఈ సినిమా చిత్రీకరణ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుందని సమాచారం. రవితేజ మూడు పాత్రల్లో కనిపిస్తారని కొందరు, లేదు రవితేజ క్యారెక్టర్లోనే త్రీ షేడ్స్ ఉంటాయని మరికొందరు అంటున్నారు. మరి.. ఈ సినిమాలో రవితేజ ఒక్కరిగా వస్తారా? లేక ముగ్గురిలా అలరిస్తారా? అనేది తెలియాలంటే కాస్త టైమ్ పడుతుంది. ఈ సినిమాను సెప్టెంబర్ 28న రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోందని టాక్. తరుణ్ అరోరా, అభిమన్యుసింగ్, ‘వెన్నెల’ కిశోర్ తదితరులు నటిస్తోన్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. -
‘వెన్నెల’కిశోర్ షూటింగ్ కష్టాలు.. వైరల్!
హైదరాబాద్ : సినీ ఇండస్ట్రీలో కొన్నిసార్లు వచ్చిన ఆఫర్లు వెనక్కి తీసుకోవడం, లేక షూటింగ్స్ వాయిదా పడటం గురించి తరచుగా వింటుంటాం. అయితే కొన్నిసార్లు షూటింగ్ వాయిదాకు బదులుగా షెడ్యూల్ అనుకోకుండా ముందుకు జరిగిపితే (ప్రీ పోన్ చేస్తే) ఎలా ఉంటుందో తెలియాలంటే హాస్యనటుడు ‘వెన్నెల’ కిశోర్ పోస్ట్ చేసిన వీడియో చూడాలి. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ కమెడియన్ పోస్ట్ చేసిన వెంటనే వీడియోకు భారీగా వ్యూస్ వస్తున్నాయి. ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’,. మాస్ మహారాజా రవితేజ, ఇలియానా జోడీగా కనిపించనున్న ఈ మూవీలో వెన్నెల కిశోర్ కీలకపాత్రలో నటిస్తున్నారు. అయితే షూటింగ్ షెడ్యూలు 15 నిమిషాలు ముందుకు ప్లాన్ చేయగా మేకప్ టైమ్ చాలా టైట్‌గా ఉంటుందని’ ట్రిమ్మింగ్ ఓ వీడియోను వెన్నెల కిశోర్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. One of those days where ur shoot call time has been preponed by 15 mins and u hav planned the makeup time xtremely tight🙈😂 #AmarAkbarAnthony pic.twitter.com/5a75N6I4Id — vennela kishore (@vennelakishore) 9 July 2018 -
చిందేస్తే.. మస్తే మస్తే
డబుకు డిబుకు డబుకు డిబుకు డప్పులే.. అదిరిపోద్ది థియేటర్ రవితేజ వేస్తే స్టెప్పులే. మరి.. ఇలాంటి స్టెప్పులకు ఇలియానా కూడా కాలు కదిపితే సాంగ్ అదుర్స్ కదూ. ప్రజెంట్ ఇలాంటి దుమ్ము రేపే సాంగ్‌నే షూట్ చేస్తున్నారు. రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై వై. రవిశంకర్, చెరుకూరి మోహన్, నవీన్ ఎర్నేని నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇలియానా కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రత్యేక సెట్లో రవితేజ, ఇలియానాలపై చిత్రీకరిస్తున్న పాట షూటింగ్ ఈ రోజుతో కంప్లీట్ అవుతుంది. ఫుల్ ఎనర్జీతో రవితేజ వేసిన ఈ స్టెప్పులకు ఫ్యాన్స్ మస్తే మస్తే అన్నమాట. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌ను యూఎస్‌లో ప్లాన్ చేస్తున్నారు. పదేళ్ల తర్వాత రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్లో ఈ సినిమా రూపొందుతోంది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఇలియానా ఈ సినిమాతోనే సౌత్‌లోకి రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. సునీల్, లయ, అభిమన్యు సింగ్, తరుణ్ అరోరా, ‘వెన్నెల’ కిషోర్, శ్రీనివాసరెడ్డి నటిస్తున్న ఈ సినిమాకు తమన్ స్వరకర్త. -
అందర్నీ మెప్పించడం అసాధ్యం!
మన చేతికి ఉన్న ఐదు వేళ్లు సమానంగా ఉండవు. అలాగే క్లాస్‌లో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఒకేలా ఉండరు. అలాంటప్పుడు మన గురించి అందరి అభిప్రాయాలు ఒకేలా ఎందుకు ఉంటాయి? మనల్ని అభిమానించే వాళ్లు ఉన్నట్లే, ఇష్టపడనివాళ్లూ ఉంటారు. అందుకే ప్రతి విషయంలోనూ అందరి మెప్పు పొందాలనుకోవడం తెలివితక్కువ పనే అవుతుంది. ఇదే విషయాన్ని గుర్తు చేస్తున్నారు కథానాయిక ఇలియానా. ‘‘ కెరీర్లో స్టార్టింగ్‌లో అందర్నీ ఇంప్రెస్ చేయాలని ఎంతో ఆరాటపడేదాన్ని. లుక్స్ విషయంలో బాగా కేర్ తీసుకునేదాన్ని. ఆ తర్వాత నాకు అర్థం అయ్యింది.. అందర్నీ ఇంప్రెస్ చేయడం ఇంపాజిబుల్ అని. ముఖ్యంగా మనపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ను అన్ని వేళలా రీచ్ అయ్యేలా ప్రవర్తించడం ఇంకా కష్టం. అందుకే నన్ను నేను ఒక సెలబ్రిటీగా ఊహించుకోను. యాక్టర్‌ని అని మాత్రమే అనుకుంటాను’’అని పేర్కొన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ఆరేళ్ల తర్వాత సౌత్‌లో ఇలియానా కాలుపెడుతున్న సంగతి తెలిసిందే. రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో కథానాయికగా నటిస్తున్నారు ఇలియానా. -
నేను గర్భం దాల్చానా?
తమిళసినిమా: నేను గర్భం దాల్చానా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది నటి ఇలియానా. ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలిన ఈ జాణ ఆ తరువాత కోలీవుడ్ అవకాశాలను కాదనుకని బాలీవుడ్లో రాణించాలన్న ఆకాంక్షతో అక్కడ మకాం పెట్టింది. అక్కడ ఒకటి రెండు అవకాశాలు అమ్మడిని వరించడంతో దక్షిణాది చిత్ర పరిశ్రమపై విమర్శలు కురిపించింది. ముఖ్యంగా దక్షిణాదిలో అదేం టేస్టో గానీ నా నడుమునే ఎక్కువ చూపించేవారని వెటకారపు వ్యాఖ్యలు చేసి అడ్డంగా బుక్కయ్యింది కూడా. అయితే అక్కడ బర్ఫీ, హిమ్మత్వాలా లాంటి చిత్రాల్లో నటించినా పెద్దగా పట్టించుకోలేదు. దీంతో మళ్లీ దక్షిణాదిలోనే అవకాశాల వేట సాగించింది. అలా టాలీవుడ్లో తాజాగా ఒక అవకాశాన్ని పట్టేసింది. రవితేజకు జంటగా అమర్ అక్బర్ ఆంటోని అనే చిత్రంలో నటించడానికి రెడీ అవుతోంది. ఇది తమిళంలో విజయ్ నటించిన తెరి చిత్రానికి రీమేక్ అన్నది గమనార్హం. చేతిలో అవకాశాలు లేకపోయినా ఇలియానా వార్తల్లో నానుతూనే ఉంది. తన బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూతో చెటాపట్టాలేసుకుని తిరిగిన ఫొటోలను సోషల్ మీడియాల్లో విడుదల చేస్తూ సంచలనం కలిగిస్తూనే ఉంది. ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్‌ను రహస్యంగా పెళ్లి చేసుకుందని, గర్భం దాల్చిందనే ప్రచారం హోరెత్తుతోంది. ఈ విషయాల గురించి నోరెత్తని ఇలియానా తాజాగా వివరణ ఇవ్వడం మంచిదనుకుందో ఏమో, తాను గర్భం దాల్చలేదనీ, ఇప్పుడే పిల్లల్ని కనే ఆలోచన లేదని చెప్పింది. తాను హీరోయిన్గా మరి కొంత కాలం నటించాలని కోరుకుంటున్నానని అంది. అంతేకానీ తనకు పెళ్లి కాలేదని మాత్రం చెప్పలేదు. సో తను బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న మాట నిజమేనని అంటున్నారు నెటిజన్లు. -
దక్షిణాదికి మరో బాలీవుడ్ బ్యూటీ
తమిళసినిమా: బాలీవుడ్ సుందరీమణులు దక్షిణాది చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపడంతో పాటు, ఇక్కడ నిలదొక్కుకోవాలని ఆశపడుతున్నారు. అలా ఇలియానా, తాప్సీ, హన్సిక వంటి హీరోయిన్లు ఇక్కడ రాణించిన వారే. అయితే ఇటీవల బాలీవుడ్ బ్యూటీల తాకిడి ముఖ్యంగా కోలీవుడ్‌లో తగ్గిందనే టాక్ వినిపించినా, వారి దిగుమతి మాత్రం జరుగుతూనే ఉంది. అలా అన్యాసింగ్ అనే వర్ధమాన బాలీవుడ్ నటి తాజాగా దక్షిణాదికి పరిచయం అవుతోంది. బాలీవుడ్లో లెక్స్ టాలియానిస్, ఖైదీ బ్రాండ్ చిత్రాల్లో నటించిన ఈ జాణ ఇప్పుడు ఒకే చిత్రంతో తెలుగు, తమిళ భాషల్లో పరిచయం కానుంది. ఇంతకు అట్టకత్తి దినేశ్ హీరోగా తిరుడన్ పోలీస్, ఉల్కుత్తు చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు కార్తీక్ రాజా తాజాగా ద్విభాషా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సందీప్‌కిషన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా బాలీవుడ్ బ్యూటీ అన్యాసింగ్ నటిస్తోంది. ఇప్పటికే ఒక షూటింగ్ ఒక షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం సూపర్ నేచురల్ ఎంటర్టెయినర్గా ఉంటుందని దర్శకుడు పేర్కొన్నారు. అన్ని వర్గాల వారిని అలరించే విధంగా చిత్రం ఉంటుందని, హీరోయిన్ పాత్రకు ఒక పెక్యులర్ నటి అవసరం అవడంతో అన్యాసింగ్ బాగుంటుందని ఆమెను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఇందులో నటుడు కరుణాకరన్ హాస్య పాత్రలో నటిస్తున్నారు. నటి అన్యాసింగ్ను తమిళ, తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి. -
పెళ్లయిందని అక్క, వదిన పాత్రలు ఇస్తున్నారు!
తమిళసినిమా: సంచలన నటీమణుల్లో ఇలియానా ఒకరని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే మీడియాపై విరుచుకుపడటం కూడా ఈ అమ్మడికి అలవాటే. టాలీవుడ్లో హీరోయిన్గా నటిస్తున్నప్పుడు ఎలాంటి ఆరోపణలు చేయని ఈ బ్యూటీ ఎప్పుడైతే బాలీవుడ్‌కు మూటాముల్లు సర్దుకుందో అప్పటి నుంచి దక్షిణాది చిత్రపరిశ్రమపై విమర్శలు గుప్పించడం మొదలెట్టింది. ఒక టైమ్‌లో కోలీవుడ్‌ను పట్టించుకోలేదు. అలాంటిది బాలీవుడ్‌లోనూ ఈ జాణను పక్కన పెట్టేయడంతో ఇప్పుడు మళ్లీ దక్షిణాదిపై దృష్టి సారించింది. అలా ఒక తెలుగు చిత్రంలో నటించే అవకాశాన్ని కూడా దక్కించుకుంది. తమిళంలో విజయ్ నటించిన తెరి చిత్ర తెలుగు రీమేక్‌లో రవితేజకు జంటగా నటించనుంది. ఇలియానా ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ నిపోన్ అనే అతనితో ప్రేమ కలాపాలు సాగిస్తున్నట్లు మీడియా కోడైకూస్తోంది. ఇలియానా ఆండ్రూతో చెట్లాపట్టాలేసుకుని తిరుగుతుండడమే ఈ ప్రచారానికి కారణం. అయితే ఇటీవల ఇలియానా తన బాయ్ఫ్రెడ్ను రహస్యంగా పెళ్లి చేసుకుందనే ప్రచారం సోషల్‌మీడియాల్లో హల్చల్ చేస్తోంది. దీని గురించి అడిగితే ఇలియానా ఆగ్రహంతో ఊగిపోతోంది. ఆమె ఏమంటుందో చూద్దాం. ప్రేమ,పెళ్లి అన్నది నా వ్యక్తిగతం. ఈ విషయం గురించి మీడియా, సినిమా వాళ్లు ఎందుకు ఆసక్తి చూపుతున్నారు? పెళ్లయిన నటి అని అక్క, వదిన పాత్రల్లో నటింపజేయాలని చూస్తున్నారా? నేను ఇంకా చాలా కాలం కథానాయకిగానే నటిస్తాను. దీన్ని నిరూపించి చూపిస్తాను. నా ప్రేమ గురించి ఇప్పటి వరకూ ఎక్కడా వెల్లడించలేదు. ఇకపై కూడా చెప్పను. ఇంకా చెప్పాలంటే నా వ్యక్తగత వ్యవహారాల గురించి చర్చంచడానికి ఇష్టపడను. అంటున్న ఇలియానా తన బాయ్‌ఫ్రెండ్‌లో సన్నిహితంగా ఉన్న ఫొటోలను తరచూ ఇంటర్నెట్లో విడుదల చేయడం ఎందుకు అని నెటిజన్ల ఇలియానాపై ఎదురుదాడి చేస్తున్నారు. -
సరికొత్త టెక్నాలజీతో శ్రీనువైట్ల
వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో పడ్డ స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల కాస్త గ్యాప్ తీసుకొని రవితేజ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అమర్ అక్బర్ ఆంటోని పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎక్కువగా ఫారిన్ లోకేషన్స్‌లో షూటింగ్ చేయనున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం శ్రీనువైట్ల సరికొత్త టెక్నాలజీలను వినియోగిస్తున్నారు. అమెరికాలోని విభిన్న వాతావరణ పరిస్థితుల్లో షూటింగ్ చేసేందుకు ఈ టెక్నాలజీ వాడుతున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు అమర్ అక్బర్ ఆంటోని సినిమాను 8కె క్వాలిటీతో రూపొందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాతో ఇలియానా టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇటీవల నేలటిక్కెట్టు సినిమాతో రవితేజ కూడా నిరాశపరచటంతో సెట్స్‌మీద ఉన్న అమర్ అక్బర్ ఆంటోని హీరో హీరోయిన్లు రవితేజ, ఇలియానా దర్శకుడు శ్రీనువైట్ల కెరీర్‌కు కీలకంగా మారింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. -
స్క్రీన్ టెస్ట్
1 ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి రాసిన రచనల్లో సినిమాగా వచ్చిన మొదటి నవల ఏది? ఎ) మీనా బి) రాధాకృష్ణ సి) సెక్రటరీ డి) అగ్నిపూలు 2 సులోచనారాణి నవలా చిత్రాల్లో ఎక్కువగా నటించిన తెలుగు హీరో ఎవరో కనుక్కోండి? ఎ) ఎన్టీఆర్ బి) కృష్ణ సి) చిరంజీవి డి) అక్కినేని నాగేశ్వరరావు 3 ‘ఇడియట్’ సినిమా హీరోగా రవితేజకు, దర్శకుడిగా పూరి జగన్నాథ్‌కు మైల్స్టోన్ లాంటిది. కానీ మొదట ఆ సినిమాను కన్నడ భాషలో తీశారు పూరి. ఆ సినిమా ద్వారా పరిచయమైన హీరో ఎవరో తెలుసా? ఎ) ఉపేంద్ర బి) శివ రాజ్‌కుమార్ సి) పునీత్ రాజ్‌కుమార్ డి) సుదీప్ 4 సులోచనారాణి రాసిన ‘గిరిజా కల్యాణం’ నవల ఆధారంగా రూపొందిన ‘గిరిజా కల్యాణం’ చిత్రంలో హీరోయిన్గా నటించిందెవరు? ఎ) జయసుధ బి) జయప్రద సి) వాణిశ్రీ డి) జయలలిత 5 బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సంజు’. ఈ చిత్రంలో టైటిల్ రోల్ చేస్తోన్న హీరో ఎవరు? ఎ) రణ్‌బీర్ కపూర్ బి) అర్జున్ కపూర్ సి) షాహిద్ కపూర్ డి) సంజయ్ కపూర్ 6 తేజ దర్శకత్వంలో వచ్చిన ‘జయం’ సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యారు నితిన్. కానీ ఆ సినిమాలో మొదట హీరోగా అనుకున్నది నితిన్‌ని కాదు. మరి ఆ హీరో ఎవరయ్యుంటారు? ఎ) ప్రభాస్ బి) అల్లు అర్జున్ సి) ఉదయ్ కిరణ్ డి) గోపీచంద్ 7 నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి ఈ నటుని అసలు పేరు. ఎవరా నటుడు? ఎ) కల్యాణ్ చక్రవర్తి బి) శ్రీకాంత్ సి) జేడీ చక్రవర్తి డి) రామ్కీ 8 దర్శకురాలు నందినీ రెడ్డి తన కొత్త ప్రాజెక్టును వైజయంతి మూవీస్‌లో చేస్తున్నారు. ఆ చిత్రంలో హీరో ఎవరో తెలుసా? ఎ) నానీ బి) నాగశౌర్య సి) విజయ్ దేవరకొండ డి) దుల్కర్ సల్మాన్ 9 అల్లు అర్జున్ సరసన ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో ఓ హీరోయిన్గా కేథరిన్ థెరిస్సా నటించారు. మరో హీరోయిన్ ఎవరు? ఎ) దిశా పాట్ని బి) ఇలియానా సి) అమలా పాల్ డి) మన్నారా చోప్రా 10 65వ జాతీయ చలనచిత్ర అవార్డ్సులో ‘బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ తెలుగు’ అవార్డును సొంతం చేసుకున్న చిత్రమేదో చెప్పుకోండి చూద్దాం? ఎ) శతమానం భవతి బి) ఘాజీ సి) పెళ్లి చూపులు డి) బాహుబలి 11 యద్దనపూడి సులోచనారాణి అమెరికాలోని ఏ రాష్ట్రంలో స్వర్గస్తులైనారోతెలుసా? ఎ) టెక్సాస్ బి) డల్లాస్ సి) కాలిఫోర్నియా డి) వాషింగ్టన్ 12 ‘గంగోత్రి’ నుండి ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’ వరకు హీరోగా అల్లు అర్జున్ ఎన్ని చిత్రాల్లో నటించారో తెలుసా? (అతిథి పాత్రలు కాకుండా) ఎ) 18 బి) 24 సి) 26 డి) 21 13 కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘స్వాతిముత్యం’ సినిమాలో హీరోయిన్ రాధిక. ఆ సినిమా హిందీ రీమేక్ ‘ఈశ్వర్’లో నటించిన హీరోయిన్ ఎవరో కనుక్కోండి? ఎ) రాధిక బి) రాధ సి) గీత డి) విజయశాంతి 14 íహీరోలు సిక్స్ ప్యాక్ చేయడం కామన్. అలాంటిది కమెడియన్పాత్రలతో పైకొచ్చిన ఈ నటుడు సిక్స్ ప్యాక్ చేశారు. ఎవరతను? ఎ) ‘వెన్నెల’ కిశోర్ బి) శ్రీనివాసరెడ్డి సి) సునీల్ డి) అలీ 15 రీసెంట్గా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను పెళ్లాడిన బాలీవుడ్ నటి ఎవరో తెలుసా? ఎ) ప్రియాంకా చోప్రా బి) సోనమ్ కపూర్ సి) అనుష్కా శర్మ డి) కత్రినా కైఫ్ 16 సులోచనా రాణి సెక్రటరీ నవలను అదే పేరుతో సినిమాగా తీశారు డి. రామానాయుడు. అక్కినేని, వాణిశ్రీల కాంబినేష లో ఆయన ఈ చిత్రాన్ని ఏ దర్శకునితో నిర్మించారో తెలుసా? ఎ) ఎ.కోదండ రామిరెడ్డి బి) కె.యస్.ప్రకాశ్‌రావు సి) కె.రాఘవేంద్రరావు డి) ప్రత్యగాత్మ 17 ‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోని హీరో కాకముందు ఓ శాఖలో మంచి టెక్నీషియన్. ఏ శాఖలో ఆయన పని చేశారో తెలుసా? ఎ) ఫైట్ మాస్టర్ బి) సింగర్ సి) సంగీత దర్శకుడు డి) ఎడిటర్ 18 ‘మీనా’ చిత్రదర్శకురాలెవరో కనుక్కోండి? చిన్న క్లూ: దర్శకురాలిగా ఆమెకది మొదటి సినిమా ఎ) సావిత్రి బి) జమున సి) అంజలీ దేవి డి) విజయ నిర్మల 19 ఈ ఫొటోలోని చిన్నారి ఎవరు? ఎ) అనుష్క బి) త్రిష సి) ఆలియాభట్ డి) సమంత 20 పై స్టిల్‌లో ఉన్న ప్రముఖ నటుడెవరో తెలుసా? ఎ) రేలంగి బి) రాజనాల సి) పధ్మనాభం డి) రమణా రెడ్డి మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) డి 3) సి 4) బి5) ఎ 6) బి 7) సి 8) సి 9) సి 10) బి 11) సి 12) డి 13) డి 14) సి 15) బి 16) బి 17) సి 18) డి 19) ఎ 20) ఎ నిర్వహణ: శివ మల్లాల -
తలచినదే జరిగినదా...
‘రవితేజతో కలిసి మళ్లీ ఓ సినిమా చేయాలని ఉంది’ అని తాము నటించిన ‘కిక్’ సినిమా తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల ఇలియానా పేర్కొన్నారు. సరదాగా అన్నారో.. ఆమె సంకల్ప బలానికి ఉన్న పవరో చెప్పలేం కానీ ఇలియానా తలచినదే జరిగింది. రవితేజ, ఇలియానా కలిసి నాలుగోసారి యాక్ట్ చేయబోతున్నారు. సోమవారం ‘సాక్షి’లో ‘‘రవితేజ సరసన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్ ప్లేస్‌లో ఇలియానాను తీసుకోనున్నారని సమాచారం’’ అని ప్రచురించిన వార్త నిజమైంది. రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో వై.రవిశంకర్, నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. తొలుత ఈ సినిమాలో హీరోయిన్గా అనూ ఇమ్మాన్యుయేల్‌ని అనుకున్నారు. డేట్స్ క్లాష్ రావడంతో ఆ ప్లేస్‌లోకి ఇలియానా వచ్చారు. విశేషం ఏంటంటే 2012లో రవితేజతో కలసి చేసిన ‘దేవుడు చేసిన మనుషులు’ తెలుగులో ఇలియానా లాస్ట్ సినిమా. ఆరేళ్ల తర్వాత మళ్లీ రవితేజ సినిమాతోనే రీ–ఎంట్రీ ఇవ్వనున్నారీ గోవా బ్యూటీ. -
ఖతర్నాక్ జోడీ
గోవా బ్యూటీ ఇలియానా– రవితేజ తొలిసారి ‘ఖతర్నాక్’ సినిమాలో జోడీ కట్టారు. ఆ తర్వాత వీరిద్దరూ ‘కిక్, దేవుడు చేసిన మనుషులు’ చిత్రాల్లో నటించి, ప్రేక్షకులను అలరించారు. మూడు సార్లు జోడీ కట్టిన రవితేజ–ఇలియానా నాలుగోసారీ కలసి నటించనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం తర్వాత తెలుగులో మరో సినిమా చేయని ఇలియానా బాలీవుడ్ చిత్రాలతో బిజీ అయ్యారు. అయితే.. తనకు స్టార్ డమ్ తీసుకొచ్చిన తెలుగు చిత్ర పరిశ్రమలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న ఇలియానా ఓ సినిమాకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని టాక్. రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వలో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమా తెరకెక్కుతోంది. అనూ ఇమ్మాన్యుయేల్‌ని కథానాయికగా తీసుకున్నారు. అయితే.. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ సినిమా నుంచి అనూ తప్పుకున్నారు. దీంతో చిత్రవర్గాలు ఇలియానాని సంప్రదించాయట. కథ నచ్చడంతో పాటు రవితేజతో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా నటించేందుకు ఈ గోవా బ్యూటీ ఒప్పుకున్నారట. -
గోవా బ్యూటీ రీ ఎంట్రీ..!
టాలీవుడ్లో టాప్ హీరోల సరసన నటించి తరువాత బాలీవుడ్ ఆశలతో తెలుగు సినిమాకు గుడ్ బై చెప్పిన బ్యూటీ ఇలియానా. తెలుగులో మంచి ఫాంలో ఉండగానే హిందీ సినిమాల వైపు అడుగులు వేసిన ఈ బ్యూటీ అక్కడ ఆశించిన స్థాయిలో అవకాశాలు సాధించలేకపోయారు. తరువాత దక్షిణాదిలో రీ ఎంట్రీ ఇచ్చేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఒకటి రెండు సినిమాల్లో అవకాశాలు వచ్చినా భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయటంతో చేజారిపోయాయి. తాజాగా ఈ గోవా బ్యూటీ ఓ టాలీవుడ్ సినిమాకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. శ్రీనువైట్ల దర్శకత్వలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో ఇలియానా హీరోయిన్గా నటించనున్నారు. అల్లు అర్జున్ సరసన నటించిన జులాయి తరువాత ఇలియానా చేస్తున్న తెలుగు సినిమా ఇదే. -
నేను గర్భవతిని కాదు
గోవా బ్యూటీ ఇలియానాకి బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్‌తో పెళ్లి అయ్యిందా? లేదా? అనే విషయంపై అఫీషియల్ క్లారిటీ లేదు. ఆండ్రూతో కలిసి ఉన్న ఫొటోలు షేర్ చేస్తుంటారే కానీ, పెళ్లి విషయంపై ఇలియానా కూడా స్పష్టత ఇవ్వడం లేదు. కానీ, ఆమె ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలపై మాత్రం ఫుల్ క్లారిటీ ఇచ్చారు ఇలియానా. సౌత్‌లో స్టార్‌గా ఎదిగిన ఈ బ్యూటీ బాలీవుడ్‌లోనూ సక్సెస్ బాటలో ముందుకెళ్తున్నారు. అయితే.. ఆమె గర్భవతి అంటూ ఇటీవల వార్తలు హల్చల్ చేశాయి. ‘‘నేను గర్భవతిని కాదు’’అంటూ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు ఇలియానా. ప్రెగ్నెంట్ విషయంపై క్లారిటీ ఓకే.. మరి పెళ్లి విషయంలో కూడా ఇలియానా ఓ స్పష్టత ఇస్తే బాగుంటుంది కదా! అంటున్నారు సినీ జనాలు.