గోవా బ్యూటీని భయపెడుతున్న హీరో | bollywood star akshay kumar unlucky for south heroines | Sakshi
Sakshi News home page

గోవా బ్యూటీని భయపెడుతున్న హీరో

Published Tue, Mar 8 2016 9:26 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

గోవా బ్యూటీని భయపెడుతున్న హీరో - Sakshi

గోవా బ్యూటీని భయపెడుతున్న హీరో

రాక రాక ఒక్క అవకాశం వచ్చినా.. ఆ ఆనందాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేయలేకపోతుంది గోవా బ్యూటీ ఇలియానా. సౌత్లో మంచి ఫాంలో ఉండగానే బాలీవుడ్ మీద మనసు పారేసుకున్న ఈమె ముంబైలో సెటిలయ్యింది. మొదట్లో కాస్త అవకాశాలు వచ్చినట్టుగానే కనిపించినా తరువాత బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఈ భామను పట్టించుకోవటం మానేశారు. దీంతో ఏడాది కాలంగా ఒక్క సినిమా కూడా లేక ఖాళీగా ఉంది ఇలియానా.

తాజాగా అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కనున్న రుస్తుం సినిమా కోసం ఇలియానాను హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారు. అయితే అవకాశం వచ్చినందకు ఆనందపడాలా లేక అక్షయ్ సెంటిమెంట్కు భయపడాలో అర్థం కాక ఇలియానా తికమకపడిపోతుంది. సౌత్ బ్యూటీలకు అక్షయ్తో చేసిన సినిమాలు పెద్దగా కలిసి రాలేదు. ఈ హీరో పక్కన నటించిన దక్షిణాది భామలందరూ ఆ సినిమా తరువాత తిరుగు పయనమయ్యారు.

గతంలో బాలీవుడ్లో పర్వాలేదనిపించుకున్న అసిన్, అక్షయ్ సరసన ఖిలాడీ 786 తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. స్పెషల్ చబ్బీస్లో నటించిన కాజల్ అగర్వాల్ కూడా తరువాత నార్త్లో సౌత్లో అవకాశాలు కరువై తెగ ఇబ్బంది పడింది. బేబీ సినిమాలో చేసిన ఢిల్లీ బ్యూటీ తాప్సీదీ అదే పరిస్థితి. అందుకే ఈ లిస్ట్లో తాను కూడా చేరిపోతానేమో అని కంగారు పడుతోంది ఇలియానా. మరి అక్షయ్ సెంటిమెంట్ ఇలియానా విషయంలో ఎంత వరకు పనిచేస్తుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement