thapsi
-
షూటింగ్లో షూటింగ్
ఇన్ని రోజులు గన్ షూటింగ్ ప్రాక్టీస్ చేసిన తాప్సీ ఇప్పుడు ఫీల్డ్‌లోకి దిగారు. ఆమెకు భూమి ఫడ్నేకర్ తోడయ్యారు. మరి.. వీరిద్దరూ ఎన్ని పతకాలు సాధించారు? అనేది వెండితెరపై తెలుసుకోవాలి. తాప్సీ, భూమి ఫడ్నేకర్ ముఖ్య తారలుగా దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కి చెందిన షార్ప్ షూటర్స్ చంద్రో, ప్రకాషి తోమర్ల జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. నూతన దర్శకుడు తుషార హీరా నందానీ తెరకెక్కిస్తున్నారు. ‘‘కూలెస్ట్ అండ్ ఓల్డెస్ట్ షూటర్స్ చంద్రో, ప్రకాషిలను కలిశాం. షూటింగ్ మొదలుపెట్టాం’’ అని పేర్కొంటూ రియల్ షూటర్స్‌తో ఉన్న ఫొటోను షేర్ చేశారు తాప్సీ. సో.. ఈ సినిమా షూటింగ్లో తాప్సీ, భూమి గన్ షూటింగ్ చేస్తారన్న మాట. -
హైదరాబాద్‌లో తాప్సీ సందడి
-
నేను చిన్నప్పుడే ప్రేమలో పడ్డా!
నేనెప్పుడో అంటే ఎనిమిదేళ్ల వయసులోనే ప్రేమలో పడ్డానంటోంది నటి తాప్సీ. ఈ ఢిల్లీ బ్యూటీ మోడలింగ్ రంగం నుంచి వెండి తెరకు దిగుమతి అయిన నటి అన్నది గమనార్హం. ఆడుగళం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైందీ ఈ భామ. ఆ తరువాత ఆరంభం, కాంచన 2, వైరాజావై వంటి చాలా తక్కువ చిత్రాల్లోనే నటించిన తాప్సీని బాలీవుడ్ చేయి అందించింది. హిందీలో బేబీ, పింక్, రన్నింగ్ షాది, ది ఘాజీ ఎటాక్ (త్రిభాషా చిత్రం) చిత్రాలు మంచి పేరే తెచ్చి పెట్టాయి. ఇటీవల తెరపైకి వచ్చిన నామ్ షబానా చిత్రం నటిగా తాప్సీ స్థాయిని మరింత పెంచిందనే చెప్పాలి. ప్రస్తుతం తడ్కా, జుడ్వా 2 చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే కోలీవుడ్‌లో అవకాశాలను ఆశిస్తున్నానంటున్న ఈ బ్యూటీని ఇక్కడ గ్లామరస్ పాత్రలకే వాడుకునే ప్రయత్నం చేశారు. బాలీవుడ్లో తనలోని నటనను వెలికి తీసే పాత్రల్లో నటించే అవకాశాలు రావడం గమనార్హం. కాగా ప్రేమ గురించి ఈ జాణను అడగ్గా తాను ఎనిమిదేళ్ల వయసులోనే ప్రేమలో పడ్డానని చెప్పింది. అయితే అది మీరనుకునే ప్రేమ కాదని, తనకు నాట్యం అంటే వల్లమాలిన ప్రేమ అని, నాట్యాన్ని ఎనిమిదేళ్ల వయసు నుంచే ప్రేమిస్తున్నానని వివరించింది. నాట్యమే తాను, తానే నాట్యం అని, నాట్యం లేకుండా తాప్సీ లేదని పేర్కొంది. అంతే కానీ, తాను ఇప్పటి వరకూ మనుషులనెవరని ప్రేమించలేదని చెప్పింది. చిత్ర పరిశ్రమలో హీరోలు, ఇతర సహనటీనటులతో ప్రేమగా ఉంటానని, అయితే అది వృత్తిపరమైన ప్రేమేనని చెప్పుకొచ్చింది. ఇక జీవితంలో తాను ప్రేమించింది ఒకే ఒకరినని అంది. అదీ తానేనని చెప్పింది. ఎస్ తానంటే తనకు చాలా ఇష్టం అని పేర్కొంది. ఇక నటిగా మంచి పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తున్నానని తాప్సీ చెప్పుకొచ్చింది. -
ఫిబ్రవరి 24న 'ఘాజీ'
ప్రస్తుతం బాహుబలి షూటింగ్లో బిజీగా ఉన్న రానా, అదే సమయంలో తన ఇతర సినిమాల పనులను కూడా పూర్తిచేసేస్తున్నాడు. బాహుబలి 2తో పాటే 1971లో మునిగిపోయిన పాకిస్థాన్ సబ్ మెరైన్ కథతో తెరకెక్కుతున్న ఘాజీ సినిమా వర్క్‌ను పూర్తి చేస్తున్నాడు. రానా నావీ ఆఫీసర్‌గా నటిస్తోన్న ఈ సినిమాతో సంకల్ప రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఫిబ్రవరి 24న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే షూటింగ్ పూర్తయినా భారీగా గ్రాఫిక్స్ వర్క్ ఉండటంతో అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాలో తాప్సీ, కెకె మీనన్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. -
గోవా బ్యూటీని భయపెడుతున్న హీరో
రాక రాక ఒక్క అవకాశం వచ్చినా.. ఆ ఆనందాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేయలేకపోతుంది గోవా బ్యూటీ ఇలియానా. సౌత్‌లో మంచి ఫాంలో ఉండగానే బాలీవుడ్ మీద మనసు పారేసుకున్న ఈమె ముంబైలో సెటిలయ్యింది. మొదట్లో కాస్త అవకాశాలు వచ్చినట్టుగానే కనిపించినా తరువాత బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఈ భామను పట్టించుకోవటం మానేశారు. దీంతో ఏడాది కాలంగా ఒక్క సినిమా కూడా లేక ఖాళీగా ఉంది ఇలియానా. తాజాగా అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కనున్న రుస్తుం సినిమా కోసం ఇలియానాను హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారు. అయితే అవకాశం వచ్చినందకు ఆనందపడాలా లేక అక్షయ్ సెంటిమెంట్‌కు భయపడాలో అర్థం కాక ఇలియానా తికమకపడిపోతుంది. సౌత్ బ్యూటీలకు అక్షయ్‌తో చేసిన సినిమాలు పెద్దగా కలిసి రాలేదు. ఈ హీరో పక్కన నటించిన దక్షిణాది భామలందరూ ఆ సినిమా తరువాత తిరుగు పయనమయ్యారు. గతంలో బాలీవుడ్లో పర్వాలేదనిపించుకున్న అసిన్, అక్షయ్ సరసన ఖిలాడీ 786 తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. స్పెషల్ చబ్బీస్లో నటించిన కాజల్ అగర్వాల్ కూడా తరువాత నార్త్‌లో సౌత్‌లో అవకాశాలు కరువై తెగ ఇబ్బంది పడింది. బేబీ సినిమాలో చేసిన ఢిల్లీ బ్యూటీ తాప్సీదీ అదే పరిస్థితి. అందుకే ఈ లిస్ట్‌లో తాను కూడా చేరిపోతానేమో అని కంగారు పడుతోంది ఇలియానా. మరి అక్షయ్ సెంటిమెంట్ ఇలియానా విషయంలో ఎంత వరకు పనిచేస్తుందో చూడాలి. -
హీరోయిన్లను మార్చేస్తున్నాడు
హ్యాట్రిక్ సక్సెస్‌లతో మంచి ఫాంలో కనిపించిన యంగ్ హీరో నిఖిల్‌కు శంకరాభరణం సినిమాతో షాక్ తగిలింది. ప్రయోగాత్మక చిత్రాలను ఎంపిక చేసుకొని వరుస విజయాలు సాధిస్తున్న నిఖిల్.. శంకరాభరణంతో మాత్రం ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయాడు. ముఖ్యంగా రొటీన్ కామెడీతో బోర్ కొట్టించిన ఈ యంగ్ హీరో తదుపరి సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. శంకరాభరణం సినిమా విడుదలకు ముందే టైగర్ ఫేం వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా ఎనౌన్స్ చేశాడు నిఖిల్. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ముగ్గురు హీరోయిన్లను ఫైనల్ చేసిన చిత్రయూనిట్.. తాజాగా ఆ ముగ్గురిని మర్చేయాలని నిర్ణయించుకుందట. ముందుగా ఈ సినిమాలో తాప్సీ, కేథరిన్, అవికా గోర్లు హీరోయిన్లుగా నటిస్తారని ప్రకటించారు. శంకరాభరణం రిజల్ట్ తరువాత ఆ నిర్ణయం మార్చుకున్నారు. టాలీవుడ్లో పెద్దగా సక్సెస్ లేని తాప్సీని ముందే పక్కనపెట్టిన నిఖిల్ టీం, తరువాత కేథరిన్ ప్లేస్‌లో కుమారి 21ఎఫ్ హీరోయిన్ హేబా పటేల్‌ను సెలెక్ట్ చేశారు. తాజాగా అవికాను కూడా పక్కన పెట్టేశారన్న టాక్ వినిపిస్తోంది. బాగా బొద్దుగా తయారైన అవికా, నిఖిల్ పక్కన సూట్ అవ్వదనే ఆలోచనతో అవికాను కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించారన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే సరికి ఇంకెన్ని మార్పులు చేస్తారో చూడాలి.