ఫిబ్రవరి 24న 'ఘాజీ' | Rana trilingual movie Ghazi to release feb 24th | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరి 24న 'ఘాజీ'

Published Tue, Sep 27 2016 3:47 PM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

ఫిబ్రవరి 24న 'ఘాజీ' - Sakshi

ఫిబ్రవరి 24న 'ఘాజీ'

ప్రస్తుతం బాహుబలి షూటింగ్లో బిజీగా ఉన్న రానా, అదే సమయంలో తన ఇతర సినిమాల పనులను కూడా పూర్తిచేసేస్తున్నాడు. బాహుబలి 2తో పాటే 1971లో మునిగిపోయిన పాకిస్థాన్ సబ్ మెరైన్ కథతో తెరకెక్కుతున్న ఘాజీ సినిమా వర్క్ను పూర్తి చేస్తున్నాడు. రానా నావీ ఆఫీసర్గా నటిస్తోన్న ఈ సినిమాతో సంకల్ప రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఫిబ్రవరి 24న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే షూటింగ్ పూర్తయినా భారీగా గ్రాఫిక్స్ వర్క్ ఉండటంతో అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాలో తాప్సీ, కెకె మీనన్లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement