షూటింగ్‌లో షూటింగ్‌ | Taapsee Bhumi Pednekar to star in Anurag Kashyaps next production | Sakshi
Sakshi News home page

షూటింగ్‌లో షూటింగ్‌

Published Sun, Feb 10 2019 2:10 AM | Last Updated on Sun, Feb 10 2019 2:10 AM

Taapsee Bhumi Pednekar to star in Anurag Kashyaps next production - Sakshi

ఇన్ని రోజులు గన్‌ షూటింగ్‌ ప్రాక్టీస్‌ చేసిన తాప్సీ ఇప్పుడు ఫీల్డ్‌లోకి దిగారు. ఆమెకు భూమి ఫడ్నేకర్‌ తోడయ్యారు. మరి.. వీరిద్దరూ ఎన్ని పతకాలు సాధించారు? అనేది వెండితెరపై తెలుసుకోవాలి. తాప్సీ, భూమి ఫడ్నేకర్‌ ముఖ్య తారలుగా దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కి చెందిన షార్ప్‌ షూటర్స్‌ చంద్రో, ప్రకాషి తోమర్‌ల జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. నూతన దర్శకుడు తుషార హీరా నందానీ తెరకెక్కిస్తున్నారు. ‘‘కూలెస్ట్‌ అండ్‌ ఓల్డెస్ట్‌ షూటర్స్‌ చంద్రో, ప్రకాషిలను కలిశాం. షూటింగ్‌ మొదలుపెట్టాం’’ అని పేర్కొంటూ రియల్‌ షూటర్స్‌తో ఉన్న ఫొటోను షేర్‌ చేశారు తాప్సీ. సో.. ఈ సినిమా షూటింగ్‌లో తాప్సీ, భూమి గన్‌ షూటింగ్‌ చేస్తారన్న మాట. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement