bhoomi phadnekar
-
Parisha Pe Charcha: విక్రాంత్ మాస్సే, భూమి పడ్నేకర్ అమూల్యమైన సలహాలు..!
బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో సంభాషించే వార్షిక కార్యక్రమం ప్రధాని మోదీ 'పరీక్ష పే చర్చ' చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ఈసారి కార్యక్రమం ఢిల్లీలోని ఐకానిక్ సుందర్ నర్సరీలో జరుగుతోంది. ఈ ఈవెంట్ ద్వారా విద్యార్థులకు పరీక్షలో ఒత్తిడిని ఎలా జయించాలి, పోషకాహారం ప్రాముఖ్యత తదితర వాటి గురించి ప్రధాని మోదీ తోపాటు పలువురు ప్రముఖులు సూచనలు ఇస్తారు. ఈ ఆదివారం ప్రసారమైన పరీక్షపై చర్చలో బాలీవుడ్ నటులు, విక్రాంత్ మూస్సే, నటి భూమి పడ్నేకర్ తమ అనుభవాలను షేర్ చేసుకోవడమే గాక విద్యార్థులకు అమూల్యమైన సలహాలు, సూచనలు అందించారు. అవేంటో చూద్దామా..!2023లో విడుదలైన 12th ఫెయిల్ చిత్రంతో విక్రాంత్ మాస్సే ఒక్కసారిగా సెలబ్రిటీ స్టార్‌గా మారిపోయారు. ఆ మూవీ విజయంతో విక్రాంత్ మాస్సే పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది. అప్పటి వరకు టెలివిజన్‌లో చిన్నపాత్రలతో పరిచయమైన వ్యక్తి ఒక్కసారిగా తనలోని విలక్షణమైన నటుడుని పరిచయం చేసి విమర్శకుల ప్రశంసలందుకున్నారు. ఆయన ఈ పరీక్ష పే చర్చలో విద్యార్థులను విజువలైజేషన్ పవర్‌పై సాధన చేయమని కోరారు. మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం సాధించాలనుకుంటున్నారు వంటి వాటిని దృశ్యమాన రూపంలో ఊహించడం వల్ల అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం సులభతరమవుతుందన్నారు. అలాగే మంచి మార్కులు తెచ్చుకున్నామనే గర్వాన్ని తలకెక్కించుకోవద్దు, ఆలోచనలను మాత్రం ఉన్నతంగా ఉంచుకోండి అని సూచించారు. కేవలం పరీక్షల కోసమే కాదు జీవితంలో ఉత్తీర్ణత సాధించడానికి చదవుకోండని చెప్పారు.అంచనాలను అందుకోలేకపోతే మరోసారి ప్రయత్నించి సాధించండి అని ప్రోత్సహించారు. ఇక మాస్సే తన అనుభవాలను షేర్ చేస్తూ..తాను మరీ ఇంటిలిజెంట్ విద్యార్థి కాకపోయినా.. మెరుగ్గానే చదివేవాడనని అన్నారు. తనకు ఆటలంటే మహా ఇష్టమని చెప్పారు. పరీక్షలకు కొన్ని రోజుల ముందే పుస్తకాలు తీసే వాడినని, ఆ టైంలో ఇంట్లో కేబుల్ కూడా డిస్కనెక్ట్ అయ్యేదని అన్నారు. దురదృష్టం ఏంటంటే నేటితరానికి ఆటల కంటే ఎక్కువ కాలక్షేపం మొబైల్ ఫోనే అంటూ విచారం వ్యక్తం చేశారు. అలాగే మన దేశానికి అత్యంత ఇష్టమైన క్రీడ క్రికెట్. దానికోసం ఒకరూ ఉండాలి అని అన్నారు. ఆ తర్వాత ప్రధాని మోదీ సంభాషిస్తూ.. వర్తమానం అనేది భగవంతుడు ఇచ్చిన మంచి బహుమతి దాన్ని వదులుకోకూడదు అని చెప్పారు. అలాగే విక్రాంత్ విద్యార్థులను మీ డ్రీమ్ ఏంటన్నది తల్లిదండ్రులతో పంచుకోవాలని చెప్పారు. మొదట్లో అంగీకరించకపోయినా..వెనకడుగు వేయకుండా మీకు అదే ఎందుకు ఇష్టం అనేది చేతల ద్వారా అందులోని మీ స్కిల్‌ని, అభిరుచుని వ్యక్తపరిచమని సూచించారు. అప్పుడు తల్లిదండ్రులే తప్పక ఒప్పుకుంటారని అన్నారు. ఇక పరీక్షలకు ప్రిపేరయ్యేటప్పుడూ యోధుడిలా బాగా తినండి, బాగా విశ్రాంతి తీసుకోండి, మెరుగుపెట్టుకోండి(బాగా చదవడం) వంటి మూడు టెక్నిక్‌లు గుర్తించుకోండని అన్నారు. ఇక బాలీవుడ్ ప్రముఖ నటి భూమి పడ్నేకర్ తన అనుభవాన్ని షేర్ చేసుకుంటూ..తన తండ్రిని కోల్పోయిన ఘటనను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఆ వయసులో దాన్ని అర్థం చేసుకునే పరిణితి తనకు లేదని అన్నారు. అలాంటి క్లిష్టమైన సమయంలో మనలోని బలాన్ని గుర్తించాలి, నేర్చుకోవడానికి మార్గాను అన్వేషించాలని చెప్పుకొచ్చింది. అలాగే తాను ఎప్పుడు ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్‌ని కాదని, చదువుకు సంబంధంలేని యాక్టివిటీస్‌లో చురుకుగా ఉండేదాన్ని అన్నారు. ఆ టైంలోనే తాను నటిని కావాలని ఫిక్స్ అయ్యానని, అలాగే తల్లిలదండ్రులు సంతోషంగా గర్వంగా ఉండేలా తన నటన ఉండాలని భావించినట్లు చెప్పుకొచ్చింది. ఇక ఆమె పరీక్షల సమయంలో 'విరామం' ప్రాముఖ్యతను చెబుతూ ఆ టైంలో మనకు నచ్చింది ఏదైనా చెయ్యమని చెప్పారు. అలాగే ఆ సమయంలో నాణ్యమైన నిద్ర కూడా ఉండాలని అన్నారు. ఇక పరీక్షల ఒత్తిడిని జయించేలా యోధుడిలా ఉండడి తప్ప చింతించే వ్యక్తిగా ఉండొద్దని చెప్పారామె. యోగా వంటి వాటితో ఏకాగ్రతను పెంపొందించడమే కాకుండా సులభంగా ఒత్తిడిని జయించగలుగుతారని అన్నారు. కాగా ఇంతకుమునుపు సెషన్లో బాక్సర్ మేరీ కోమ్, ఆధ్యాత్మికవేత్త సద్గురు, బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణే వంటి ప్రముఖులు కూడా విద్యార్థులతో తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు.(చదవండి: ఆ జంటకి వివాహమై 84 ఏళ్లు..వంద మందికి పైగా మనవరాళ్లు..) -
షారుక్ ఖాన్ నిర్మాత.. డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తున్న థ్రిల్లర్ చిత్రం
తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకొని అభిమానులను సొంతం చేసుకుంది బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్. వరుస సినిమాలతో ఆమె కెరియర్ ఎంతో బిజీగా ఉంది. గతేడాదిలో ఆరు సినిమాలతో మెప్పించినా ఈ బ్యూటీ కొత్త ఏడాదిలో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది. బదాయి దో, గోవింద నామ్ మేరాలో రెండు అద్భుతమైన ప్రదర్శనలతో భారతదేశంలోని అత్యుత్తమ నటీమణులలో తానూ ఒకరని మరోసారి నిరూపించుకుంది భూమి ఆమె కీలక పాత్రలో పులకిత్ దర్శకత్వంలో రూపొందిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘భక్షక్’ సినిమాతో ఆమె ఈ ఏడాది తొలిసారి కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై షారుక్‌ఖాన్, గౌరీఖాన్‌లు నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అన్నీ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ప్రముఖ ఓటీటీ వేదిక అయిన నెట్‌ఫ్లిక్స్‌లో భక్షక్ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఈ చిత్రం హిందీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. తాజాగా విడుదుల అయిన టీజర్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. నిజాలు నిర్భయంగా బయట పెట్టే జర్నలిస్ట్ వైశాలీ సింగ్ పాత్రలో భూమి పెడ్నేకర్ కనిపించనుంది. వాస్తవ సంఘటనల ఆధారం చేసుకుని ఈ చిత్రాన్ని డైరెక్టర్ తెరకెక్కించాడు. ప్రస్తుత సమాజంలో బాలికలు, మహిళలపై జరుగుతున్న నేరాలను జర్నలిస్ట్‌గా వైశాలి ఎలా గుర్తించింది..? అనేది చాలా ఆసక్తిగా ఉండనున్నట్లు టీజర్‌ను చూస్తే అర్థం అవుతుంది. ఈ సాహసవంతమైన కార్యచరణలో ఆమెకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి అనేది తెలియాలంటే ఫిబ్రవరి 9వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో చూడాల్సిందే.. -
రీమేక్ సినిమాకు ఓ ప్లస్ ఉంది
‘‘ఎవరైనా వాళ్ల సినిమాను ప్రేక్షకులకు థియేటర్స్‌లోనే చూపించాలనుకుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీలో విడుదల తప్పనిసరి అయింది’’ అన్నారు దర్శకుడు జి. అశోక్. అనుష్క ముఖ్య పాత్రలో అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భాగమతి’. అశోక్ దర్శకత్వంలోనే ఈ చిత్రం ‘దుర్గామతి’ టైటిల్‌తో హిందీలో రీమేక్ అయింది. భూమి పెడ్నేకర్ ముఖ్య పాత్ర చేశారు. అక్షయ్ కుమార్ ఓ నిర్మాత. డిసెంబర్ 11 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. ఈ సందర్భంగా అశోక్ చెప్పిన విశేషాలు. ► ఓ పెద్ద హీరోతో హిందీ సినిమా గురించి చర్చిస్తున్నప్పుడు ‘భాగమతి’ రీమేక్ కోసం హిందీ నిర్మాతలు నన్ను కలిశారు. అప్పటికే సినిమా రిలీజ్ అయిపోయి ఏడాది దాటడంతో ఇప్పుడు రీమేక్ చేస్తే చూస్తారా? అనుకున్నాను. రీమేక్ చేయాలని, నేనే చేయాలని నిర్మాతలు అడిగారు. అప్పటికే అక్షయ్ కుమార్‌గారు ఈ సినిమా రీమేక్‌ని నిర్మించే ఆలోచనలో ఉన్నారు. రీమేక్ సినిమాకు ఓ ప్లస్ ఉంది. ఒరిజినల్లో మనం సరిగ్గా చెప్పలేదు అనుకున్న సీన్లను ఇంకా బాగా చెప్పొచ్చు ► దర్శకుడిగా నాకు ఏది కావాలంటే అది ఎంపిక చేసుకునే స్వేచ్ఛని ఇచ్చారు. భూమి పెడ్నేకర్ ఈ పాత్రకు కరెక్ట్‌గా సరిపోతుందనుకున్నాం. చాలా బాగా చేసింది. ఈ పాత్రకు న్యాయం చేసింది. లాక్డౌన్ కంటే ముందే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. లాక్డౌన్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేశాం. షూటింగ్ కంటే నిర్మాణానంతర కార్యక్రమాలు చాలా కష్టం అయ్యాయి. లాక్డౌన్ సమయంలో టెక్నీషియన్లు బయటకు రావడానికి కాస్త భయపడ్డారు. ► ఈ సినిమా థియేటర్స్ కోసం చేశాం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల ఓటీటీలో విడుదల చేస్తున్నాం. ఇంట్లోనూ వీలైనంత ఆస్వాదించేలా ఈ సినిమాను రెడీ చేశాం. ‘సినిమా బుల్లెట్లా పరిగెడుతోంది. చాలా బావుంది’ అని చూసిన తర్వాత అక్షయ్ కుమార్‌గారు అన్నారు. ► హన్సికతో ఓ వెబ్ సిరీస్ పూర్తి చేశాను. అదీ అమెజాన్‌లో త్వరలోనే విడుదల కానుంది. అలానే ఓ రెండు హిందీ సినిమాలు చేయబోతున్నాను. ఒక సినిమా చిత్రీకరణ జనవరిలో ప్రారంభం కానుంది. తమిళంలోనూ ఓ పెద్ద హీరోతో కథా చర్చలు జరుగుతున్నాయి. -
శుభాకాంక్షలు
ఆయుష్మాన్ ఖురానా ముఖ్య పాత్రలో హర్షవర్ధన్ కులకర్ణి తెరకెక్కించిన చిత్రం ‘బదాయి హో’. 2018లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ‘బదాయి దో’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావ్, భూమి ఫెడ్నేకర్ జంటగా నటించబోతున్నారు. ఈ సీక్వెల్‌ను హర్షవర్థన్ కులకర్ణి డైరెక్ట్ చేస్తారు. జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ‘శుభాకాంక్షలు. చేయి ఇటు ఇవ్వండి. (శానిటైజ్ చేసుకున్నాకే)’’ అంటూ ఈ సీక్వెల్‌ని ప్రకటించారు రాజ్‌కుమార్ రావ్. -
స్పాట్ బాయ్‌కు భూమి సాయం..
ముంబై : తమ కింద పనిచేసే వారు పైకొస్తే ఓర్వలేని యజమానులున్న సమాజంలో నాలుగేళ్లుగా తన వద్ద పనిచేసిన స్పాట్బాయ్ను వ్యాపారంలో పైకెదిగేలా ప్రోత్సహించిన బాలీవుడ్ నటి భూమి ఫడ్నేకర్ అందరి ప్రశంసలూ అందుకుంటున్నారు. స్పాట్ బాయ్‌గా పరిశ్రమలో నిరాదరణకు గురైన ఉపేంద్ర సింగ్‌లో దాగిన నైపుణ్యాలను పసిగట్టిన భూమి అతడిని వ్యానిటీ వ్యాన్ల తయారీ కంపెనీ స్ధాపించేలా ప్రోత్సహించారు. భూమి ప్రోద్బలంతో బిజినెస్‌లో అడుగుపెట్టిన సింగ్ తొలి వ్యానిటీ వ్యాన్‌ను తన హీరోయిన్ భూమి కోసం రూపొందించి ఆమెకు బహుమతిగా ఇచ్చారు. తాను పైకి ఎదిగేలా వెన్నుతట్టి ప్రోత్సహించిన భూమి కోసం తొలి వ్యానిటీ వ్యాన్‌ను తయారుచేసి ఆమెకు బహుమతిగా ఇచ్చానని, ఆమె తనకు చేసిన సాయం ఎన్నటికీ మరిచిపోనని సింగ్ చెప్పుకొచ్చారు. ఆమె చేసే ప్రతి సినిమా సూపర్‌హిట్ కావాలని ఆకాంక్షించారు. ఏ వ్యక్తికైనా జీవితంలో అవకాశాలు రావాలని తాను నమ్ముతానని, అలాంటి వారికి తాను చేయగలిగింది చేస్తానని భూమి పేర్కొన్నారు. సింగ్ తన కుమారుడు ఆకాష్ పేరుతో ఆకాష్ వ్యానిటీ అనే కంపెనీని ఏర్పాటు చేసి అత్యున్నత స్ధాయికి చేరకున్నారని చెప్పారు. తొలి వ్యానిటీ వ్యాన్ తనకే ప్రెజెంట్ చేశారని అన్నారు. వ్యానిటీ వ్యాన్ రూపకల్పనలో వాళ్లు ఎంతటి శ్రమకోర్చారో తనకు తెలుసన్నారు. భూమికి అందించిన ఈ వ్యాన్‌లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఆమెకు ఇష్టమైన పింక్ కలర్ వాల్స్‌తో పాటు సెంట్రల్ ఏసీతో కూడిన మేకప్ రూమ్, రెస్ట్ రూమ్ సహా సకల సదుపాయాలున్నాయి. చదవండి : అతడితో కెమిస్ట్రీ కుదిరింది: భూమి ఫడ్నేకర్ -
షూటింగ్లో షూటింగ్
ఇన్ని రోజులు గన్ షూటింగ్ ప్రాక్టీస్ చేసిన తాప్సీ ఇప్పుడు ఫీల్డ్‌లోకి దిగారు. ఆమెకు భూమి ఫడ్నేకర్ తోడయ్యారు. మరి.. వీరిద్దరూ ఎన్ని పతకాలు సాధించారు? అనేది వెండితెరపై తెలుసుకోవాలి. తాప్సీ, భూమి ఫడ్నేకర్ ముఖ్య తారలుగా దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కి చెందిన షార్ప్ షూటర్స్ చంద్రో, ప్రకాషి తోమర్ల జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. నూతన దర్శకుడు తుషార హీరా నందానీ తెరకెక్కిస్తున్నారు. ‘‘కూలెస్ట్ అండ్ ఓల్డెస్ట్ షూటర్స్ చంద్రో, ప్రకాషిలను కలిశాం. షూటింగ్ మొదలుపెట్టాం’’ అని పేర్కొంటూ రియల్ షూటర్స్‌తో ఉన్న ఫొటోను షేర్ చేశారు తాప్సీ. సో.. ఈ సినిమా షూటింగ్లో తాప్సీ, భూమి గన్ షూటింగ్ చేస్తారన్న మాట. -
బొద్దుగుమ్మకు భలే గిరాకీ..
‘దమ్ లగాకే హైసా’ విజయంతో బొద్దుగుమ్మ భూమి పెడ్నేకర్‌కు భలే గిరాకీ పెరిగింది. గిరాకీ అంటే సినిమా అవకాశాలు వెల్లువలా వచ్చిపడటం కాదు, ఆమెకు పెళ్లి సంబంధాలు వచ్చిపడుతున్నాయి. బ్యాచిలర్ బాబాయిలంతా ఆమె ఇంటి ముందు క్యూ కడుతున్నారు. కొందరైతే పెళ్లి మాటల కోసం తమ తల్లిదండ్రులతో సైతం తరలి వస్తున్నారు. భూమి తల్లిదండ్రులు ఈ పరిణామానికి షాక్ తింటుంటే, ఆమె మాత్రం నవ్వుకుంటోంది.