ముంబై : తమ కింద పనిచేసే వారు పైకొస్తే ఓర్వలేని యజమానులున్న సమాజంలో నాలుగేళ్లుగా తన వద్ద పనిచేసిన స్పాట్‌బాయ్‌ను వ్యాపారంలో పైకెదిగేలా ప్రోత్సహించిన బాలీవుడ్ నటి భూమి ఫడ్నేకర్ అందరి ప్రశంసలూ అందుకుంటున్నారు. స్పాట్ బాయ్‌గా పరిశ్రమలో నిరాదరణకు గురైన ఉపేంద్ర సింగ్‌లో దాగిన నైపుణ్యాలను పసిగట్టిన భూమి అతడిని వ్యానిటీ వ్యాన్‌ల తయారీ కంపెనీ స్ధాపించేలా ప్రోత్సహించారు. భూమి ప్రోద్బలంతో బిజినెస్‌లో అడుగుపెట్టిన సింగ్ తొలి వ్యానిటీ వ్యాన్‌ను తన హీరోయిన్ భూమి కోసం రూపొందించి ఆమెకు బహుమతిగా ఇచ్చారు.
తాను పైకి ఎదిగేలా వెన్నుతట్టి ప్రోత్సహించిన భూమి కోసం తొలి వ్యానిటీ వ్యాన్‌ను తయారుచేసి ఆమెకు బహుమతిగా ఇచ్చానని, ఆమె తనకు చేసిన సాయం ఎన్నటికీ మరిచిపోనని సింగ్ చెప్పుకొచ్చారు. ఆమె చేసే ప్రతి సినిమా సూపర్‌హిట్ కావాలని ఆకాంక్షించారు. ఏ వ్యక్తికైనా జీవితంలో అవకాశాలు రావాలని తాను నమ్ముతానని, అలాంటి వారికి తాను చేయగలిగింది చేస్తానని భూమి పేర్కొన్నారు.
సింగ్ తన కుమారుడు ఆకాష్ పేరుతో ఆకాష్ వ్యానిటీ అనే కంపెనీని ఏర్పాటు చేసి అత్యున్నత స్ధాయికి చేరకున్నారని చెప్పారు. తొలి వ్యానిటీ వ్యాన్ తనకే ప్రెజెంట్ చేశారని అన్నారు. వ్యానిటీ వ్యాన్ రూపకల్పనలో వాళ్లు ఎంతటి శ్రమకోర్చారో తనకు తెలుసన్నారు. భూమికి అందించిన ఈ వ్యాన్‌లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఆమెకు ఇష్టమైన పింక్ కలర్ వాల్స్‌తో పాటు సెంట్రల్ ఏసీతో కూడిన మేకప్ రూమ్, రెస్ట్ రూమ్ సహా సకల సదుపాయాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment