
సింగర్ మికా సింగ్ (Mika Singh) బాలీవుడ్ జంట కరణ్ సింగ్ గ్రోవర్ (Karan Singh Grover)- బిపాసా బసు వల్ల దాదాపు రూ.10 కోట్లమేర నష్టపోయానన్నాడు. చిత్రవిచిత్రమైన డిమాండ్లతోపాటు తనకు ఏమాత్రం సహకరించలేదని ఆగ్రహించాడు. ముఖ్యంగా బిపాసా చేసిన డ్రామా వల్ల ఇంకోసారి నిర్మాణరంగంలోకే అడుగుపెట్టకూడదని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. తనను అంతలా టార్చర్ పెట్టారు కాబట్టే ఇండస్ట్రీలో లేకుండా పోయారని సెటైర్లు వేశాడు.
తాజాగా ఈ విమర్శలపై బిపాసా బసు (Bipasha Basu) స్పందించింది. ఒంటినిండా విషం నింపుకున్న కొందరు ఎప్పుడూ గొడవలు సృష్టించడానికే ఇష్టపడుతుంటారు. అవతలివారిని వేలెత్తి చూపుతుంటారు, నిందలు మోపుతారు. బాధ్యతగా ఉండేందుకు అస్సలు ఇష్టపడరు. ఇలాంటి నెగెటివిటీకి, ద్వేషభావజాలానికి దూరంగా ఉంటే మంచిది. ఆ దేవుడు అందరినీ ఆశీర్వదించుగాక అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. మికా సింగ్‌ను ఉద్దేశించే బిపాసా ఈ పోస్ట్ పెట్టిందని తెలుస్తోంది.

చదవండి: ధనుష్‌ను కాపీ కొడుతున్నారా? ఇబ్బందిపడ్డ ప్రదీప్ రంగనాథన్
Comments
Please login to add a commentAdd a comment