
టాప్ సింగర్ మికా సింగ్ (Mika Singh) ఆ మధ్య నిర్మాతగా తన లక్ పరీక్షించుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా డేంజరస్ అనే వెబ్ సిరీస్ నిర్మించాడు. కానీ ఆ సీరిస్ షూటింగ్‌లో కరణ్ సింగ్ గ్రోవర్- బిపాసా బసు (Bipasha Basu)ల గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక, వారి డిమాండ్లు కాదనలేక, ఆ ఇద్దరి డ్రామా, యాటిట్యూడ్ చూడలేక తలపట్టుకున్నాడు. ఇంకోసారి నిర్మాణరంగంలోకే రాకూడదని శపథం చేసుకున్నాడు.
రూ.4 కోట్లు అనుకుంటే..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మికా సింగ్ మాట్లాడుతూ.. వాళ్లిద్దరూ (కరణ్-బిపాసా) ప్రాజెక్టులు లేక ఖాళీగా ఉంటున్నారు. ఎందుకో తెలుసా? పైన దేవుడన్నీ చూస్తున్నాడు. నిజానికి కరణ్ అంటే నాకిష్టం. తనను హీరోగా పెట్టి రూ.4 కోట్లతో ఓ సినిమా తీయాలనుకున్నాను. హీరోయిన్‌గా ఎవరైనా కొత్తవారిని తీసుకుందామనుకున్నాను. కానీ కరణ్ భార్య, నటి బిపాసా బసు తనే చేస్తానని పట్టుపట్టింది. లండన్‌లో షూటింగ్ చేశాం. బడ్జెట్ రూ.4 కోట్ల నుంచి రూ.14 కోట్లకు ఎగబాకింది.

మూడు చెరువుల నీళ్లు తాగించారు
బిపాసా చేసిన డ్రామా అంతా ఇంతా కాదు. అనవసరంగా నిర్మాణ రంగంలోకి వచ్చానేంట్రా దేవుడా అని ఎంతో బాధపడ్డాను. భార్యాభర్తలిద్దరూ ఓ కిస్ సీన్‌లో నటించాలన్నాను. ఆమె తిట్లదండకం అందుకుంది. అలాంటివి నేనెందుకు చేస్తా? చేయనుగాక చేయను అని రాద్ధాంతం చేసింది. ఇలా ఎన్నో ఇబ్బందులు పెట్టినా వారి పారితోషికం మాత్రం ఆలస్యం చేయకుండా సమయానికి ఇచ్చేశాను. అయినా సరే డబ్బింగ్ చెప్పడానికి కూడా నాతో మూడు చెరువుల నీళ్లు తాగించారు. ఒకసారి బిపాసా తన గొంతు బాలేదంటుంది. మరోసారి కరణ్ తన ఆరోగ్యం బాగోలేదంటాడు. ఇలా ఇద్దరూ నాతో ఆడుకున్నారు అని చెప్పుకొచ్చాడు.
వెండితెరపై కనిపించని బిపాసా
కరణ్ సింగ్ గ్రోవర్, బిపాసా బసు 2015లో ఎలోన్ సినిమా షూటింగ్‌లో కలుసుకున్నారు. 2016లో పెళ్లి చేసుకోగా 2022లో వీరికి దేవి అనే కూతురు జన్మించింది. టక్కరిదొంగ చిత్రంతో తెలుగువారికి పరిచయమైన బిపాసా బసు హిందీలో అనేక సినిమాలు చేసింది. పూర్తిస్థాయిలో నటించిన చివరి చిత్రం ఎలోన్. 2018లో వచ్చిన వెల్‌కమ్ టు న్యూయార్క్ మూవీలో అతిథి పాత్రలో మెరిసింది. తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించనేలేదు. 2020లో డేంజరస్ వెబ్‌సిరీస్‌తో ఓటీటీలో మెరిసింది.
చదవండి: సినిమాలు తీయడం కంటే IAS అవడం ఈజీ: సందీప్ రెడ్డి వంగా
Comments
Please login to add a commentAdd a comment