
వరుసగా లైగర్, డబుల్ ఇస్మాట్ చిత్రాలతో ప్లాప్ కొట్టిన దర్శకుడు పూరీ జగన్నాద్(Puri Jagannadh) ఈ సారైనా గట్టిగా హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇటీవలే విజయ్ సేతుపతి(Vijay Sethupathi)తో సినిమాను ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచిన పూరీ, ఆ చిత్రానికి ఫీమేల్ లీడ్‌గా నటి 'టబు'ను తీసుకున్నారు. ఈ రోజు అధికారికంగా ఆ విషయాన్ని వెల్లడించారు. అల్లు అర్జున్‌తో కలిసి 'అల వైకుంఠపురము'లో చిత్రం తరువాత టబు తెలుగులో అంగీకరించిన సినిమా ఇదే కావడం విశేషం.
అంటే దాదాపు ఐదు సంవత్సరాల విరామం తరువాత 'టబు' మరో తెలుగు చిత్రంలో నటిస్తోందన్నమాట. కేవలం మంచి పాత్రలు దొరికితేనే నటిస్తానన్న టబు(Tabu) పూరీ సినిమాలో తన పాత్ర చాలా కొత్తగా, వైవిద్యంగా, బలంగా ఉంటుందని తెలిపింది. ఇక ఈ చిత్ర రెగ్యులర్ షూట్ జూన్‌లో మొదలుకానుంది. తెలుగుతో పాటు హింది, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. చూస్తుంటే ఈ సారి పూరీ ఏదో కొత్తగా ప్లాన్ చేసినట్టే ఉన్నాడు.