
కొన్నేళ్ల క్రితం తెలుగులో స్టార్ హీరోయిన్ గా వరస సినిమాలు చేసిన రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం పెళ్లి చేసుకుని బాలీవుడ్ కి పరిమితమైపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ నటి.. తన వైవాహిక జీవితం, సినీ కెరీర్ గురించి చెప్పుకొచ్చింది. తెలుగు దర్శకుడు పూరీ జగన్నాథ్ కి నో చెప్పిన సందర్భాన్ని గుర్తుచేసుకుంది.
'కాలేజీ టైంలో మోడలింగ్ కూడా చేసేదాన్ని. అలా నా ఫొటోలు చూసి కన్నడ ఇండస్ట్రీలో తొలి అవకాశం వచ్చింది. అప్పుడు నాకు దక్షిణాది సినిమాల గురించి పెద్దగా తెలియదు. దీంతో చాలా ఆలోచించాను. కానీ నా తండ్రికి సదరు చిత్ర యూనిట్ ఫోన్ చేసి చెప్పడంతో కన్నడలో తొలి మూవీ చేశాను. ఇందులో నటనకు మంచి పేరొచ్చింది కానీ చదువుకి సమస్య రావడంతో సినిమాలు వద్దనుకున్నాను'
(ఇదీ చదవండి: కోట్లాది రూపాయల స్కాంలో 'పుష‍్ప 2' డబ్బింగ్ ఆర్టిస్ట్)
'తొలి మూవీ రిలీజైన తర్వాత పూరీ జగన్నాథ్ నుంచి ఫోన్ వచ్చింది. 70 రోజుల కాల్ షీట్ అడిగారు. నేనేమో 4 రోజులైతేనే వస్తానని చెప్పా. నా ఇబ్బందిని ఆయన అర్థం చేసుకున్నారు. ఇదే కాదు.. ఇలా చాలా సినిమాలు కెరీర్ ప్రారంభంలో వదిలేసుకున్నా' అని రకుల్ చెప్పుకొచ్చింది.
హిందీ నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లి చేసుకున్న రకుల్.. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని బాగానే ఎంజాయ్ చేస్తోంది. కాకపోతే సినిమా అవకాశాలు గతంతో పోలిస్తే చాలా తగ్గిపోయాయి.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన 20 మూవీస్)