'జాట్‌' ట్విటర్‌ రివ్యూ.. గోపీచంద్‌ మలినేని హిట్‌ కొట్టాడా..? | Gopichand Malineni And Sunny Deol Jaat Movie Twitter Review | Sakshi
Sakshi News home page

Jaat X Review: 'జాట్‌' ట్విటర్‌ రివ్యూ.. గోపీచంద్‌ మలినేని హిందీలో హిట్‌ కొట్టాడా..?

Published Thu, Apr 10 2025 11:35 AM | Last Updated on Thu, Apr 10 2025 12:42 PM

Gopichand Malineni And Sunny Deol Jaat Movie Twitter Review

తెలుగు దర్శకుడు గోపీచంద్‌ మలినేని(GopiChand malineni) బాలీవుడ్‌లోకి జాట్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు.  సీనియర్‌ హీరో సన్నీ డియోల్‌తో(Sunny Deol)  భారీ మాస్‌ యాక్షన్‌ చిత్రాన్ని ఆయన తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్‌ ఈ మూవీని నిర్మించారు. ఏప్రిల్‌ 10న విడుదలైన ఈ చిత్రంలో రణదీప్‌ హుడా విలన్‌గా మెప్పించగా.. వినీత్‌ కుమార్‌ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కీలకపాత్రల్లో నటించారు. తమన్‌ సంగీతం అందించారు. అయితే, బాలీవుడ్‌లో గోపీచంద్‌ మలినేని హిట్‌ అందుకున్నాడా..? అనే అంశంపై నెటిజన్లు తమ అభిప్రాయాన్ని ఎక్స్‌ పేజీలలో పోస్ట్‌లు పెడుతున్నారు.

జాట్‌ ట్రైలర్‌ను చూసిన వారందరూ చాలా మాస్‌గా ఉందని తప్పకుండా బాలీవుడ్‌లో హిట్‌ కొడుతాడని  దర్శకుడు గోపీచంద్‌ మలినేనిపై అంచనాలు పెట్టుకున్నారు. కానీ, సినిమా అనుకున్నంత రేంజ్‌లో లేదని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. రొటీన్ కథకు భారీ యాక్షన్‌ సీన్స్‌ జత చేసి సినిమా తీశారని చెప్పుకొస్తున్నారు. అయితే, ఈ సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్ చాలా వరకు ప్లస్ అయిందని అంటున్నారు. ఇలాంటి కథతో తెలుగులో ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయని జాట్‌ చూసిన వాళ్లు పోస్టులు షేర్‌ చేయడం విశేషం. అయితే, గోపీచంద్‌ మలినేని మేకింగ్‌ స్టైల్‌ చాలా రిచ్‌గా ఉందని చెబుతున్నారు. పుష్ప సినిమాతో బాలీవుడ్‌ ప్రేక్షకులు మాస్‌ స్టోరీకి కనెక్ట్‌ అయ్యారు. ఇప్పుడు జాట్‌ కథకు వారు కనెక్ట్‌ అయితే మాత్రం బ్లాక్‌బస్టర్‌ గ్యారెంటీ అంటూ రివ్యూవర్లు పేర్కొంటున్నారు.

వీరసింహారెడ్డి వంటి ఓల్డ్‌ స్టోరీతో భారీ వసూళ్లు రాబట్టిన  గోపీచంద్ మలినేని.. ఆ తరువాత రవితేజతో ఓ చిత్రాన్ని ప్లాన్‌ చేసుకున్నాడు. కానీ, అది సెట్స్‌ మీదకు వెళ్లకుండానే ఆగిపోయింది. అదే కథను జాట్‌గా బాలీవుడ్‌లో తెరకెక్కించాడని తెలుస్తోంది. అయితే, ఎక్కువమంది జాట్‌ చిత్రంపై కాస్త నెగటివ్‌ రిపోర్ట్స్‌ ఇస్తున్నారు. కానీ అభిమానులు మాత్రం సన్నీ డియోల్‌ దుమ్మురేపాడంటూ చెబుతున్నారు.  సినిమా అద్భుతంగా ఉందంటూ.. చాలా ఏళ్ల తర్వాత వింటేజ్ సన్నీ డియోల్ కనిపించాడని అంటున్నారు. జాట్‌ చూసిన కొందరు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంటూ.. బాక్సాఫీస్‌ వద్ద పైసా వసూల్ చిత్రం అంటున్నారు. 

ఓవరాల్‌గా మంచి ఎంటర్‌టైనరే కాకుండా భారీ యాక్షన్‌ మూవీ అంటూ తమ ఎక్స్‌ పేజీలలో పోస్టులు పెడుతున్నారు. సన్ని డియోల్‌ను అభిమానించే వారికి జాట్‌ తప్పకుండా నచ్చుతుందని అంటున్నారు. అయితే,  ఈ సినిమాకు ఎక్కువమంది 2.5/5 రేటింగ్‌ ఇస్తున్నారు. పెద్దగా చెప్పుకోదగిన సినిమా అయితే కాదని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement