bipasa basu
-
టాప్ హీరోయిన్ కూతురి అన్నప్రాసన వేడుక చూశారా?
-
టాప్ హీరోయిన్ కూతురి అన్నప్రాసన వేడుక చూశారా?
బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసు 2016లో హీరో కరణ్ సింగ్ గ్రోవర్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. గతేడాది నవంబర్ 12న పండంటి పాపకు ఆమె జన్మనిచ్చింది. తమ గారాలపట్టికి 'దేవి బసు సింగ్ గ్రోవర్' అనే పేరును ఇప్పటికే ఖరారు చేశారు. ఈ జంట తల్లిదండ్రుల క్లబ్లో చేరినప్పటి నుంచి, వారి ఆనందానికి అవధులు లేవనే చెప్పవచ్చు. వారిద్దరూ తమ పాపతో ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా బుజ్జాయి అన్నప్రాసన వేడుకను ఘనంగా నిర్వహించారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఫోటోలతో పాటు వీడియోలను అభిమానులతో పంచుకున్నారు. (ఇదీ చదవండి: మూడేళ్ల కిందట రహస్యంగా రెండో పెళ్లి.. పాపకు జన్మనిచ్చిన ప్రభుదేవా భార్య!) ఈ వేడుకలో బిపాషా, కరణ్ కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు పాల్గొన్నారు. బంగారు రంగులో ఉండే డ్రెస్‌తో ఆ బుజ్జాయి ఎంత క్యూట్‌గా ఉందో అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వారి కెరీర్ విషయానికి వస్తే, బిపాషా బసు గత కొంతకాలంగా సినిమాలకు విరామం ఇచ్చింది. కరణ్ సింగ్ గ్రోవర్ మాత్రం హృతిక్ రోషన్-దీపికా పదుకొనే నటించిన ఫైటర్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. View this post on Instagram A post shared by Bipasha Basu (@bipashabasu) (ఇదీ చదవండి: హీరోయిన్ మెటిరియల్ కాదన్న నెటిజన్.. అదే రేంజ్లో రిప్లై ఇచ్చిన అనుపమ) -
గుడ్‌న్యూస్ చెప్పిన స్టార్ హీరోయిన్, బేబీ బంప్‌తో సర్ప్రైజ్
బాలీవుడ్ బ్యూటీ బిపాషా తన ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. తాను తల్లికాబోతున్నట్లు తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చింది. కాగా ఇటీవల ఆమె గర్భవతి అయినట్లు వార్తలు వినిపించగా దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. దీంతో అందరిలో సందేహాలు నెలకొనగా ఈ వార్తలపై క్లారిటీ ఇస్తూ బిపాషా అధికారిక ప్రకటన చేసింది. ఈ మేరకు బేబీ బంప్‌తో ఉన్న ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. భర్త కరణ్ సింగ్ గ్రోవర్తో కలిసి బేబీబంప్‌తో ఫోజులు ఇచ్చిన ఫొటోలను షేర్ చేస్తూ త్వరలోనే తమ బేబీ రాబోతున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా బిపాషా ఎమోషనల్ నోట్ పంచుకుంది. చదవండి: బాలీవుడ్‌కు బాయ్‌కాట్ సెగ, మరో స్టార్ హీరోపై విరుచుకుపాటు ‘మా జీవితంలోకి మరింత సంతోషం జతకానుంది. కొంతకాలంగా వేరువేరుగా జీవించిన మేం(బిపాషా-కరణ్ సింగ్ గ్రోవర్) ఒక్కటయ్యాం. మా మధ్య ఉన్న అపారమైన ప్రేమ అనంతరం ఇద్దరం కాస్తా ముగ్గురుగా కాబోతున్నాం. త్వరలోనే మా బిడ్డ మాతో కలవబోతోంది. మాపై చూపించిన మీ ప్రేమ, అప్యాయతలకు కృతజ్ఞురాలిని’ అంటూ బిపాషా రాసుకొచ్చింది. కాగా ఎంతోకాలంగా పరిశ్రమలో తన అందచందాలతో కుర్రకారును అల్లాడించిన బిపాషా బసు ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. ఈ క్రమంలో ‘ఎలోన్’ సినిమాలో నటుడు కరణ్ సింగ్ గ్రోవర్తో తొలిసారి జతకట్టింది. ఈ మూవీ షూటింగ్లో ప్రేమలో పడ్డ వీరిద్దరు కొన్ని నెలల డేటింగ్ అనంతరం 2016లో పెళ్లి చేసుకుని ఒక్కటైన సంగతి తెలిసిందే. చదవండి: సింగర్ రాహుల్ జైన్‌పై అత్యాచారం కేసు View this post on Instagram A post shared by bipashabasusinghgrover (@bipashabasu) -
బాసూ.. బసు ఈజ్ బ్యాక్
బిపాసా బసు స్క్రీన్ మీద కనిపించి సుమారు మూడేళ్లు అయిపోయింది. 2015లో కనిపించిన ‘ఎలోన్’ ఆమె లాస్ట్ రిలీజ్. ఇప్పుడు గ్యాప్‌కి బ్రేక్ ఇచ్చి సినిమాలు స్టార్ట్ చేస్తున్నారు. అయితే తన భర్త కరణ్ సింగ్ గ్రోవర్తో కలిసే మళ్లీ కంబ్యాక్ ఇస్తున్నారు. సింగర్ మైకా సింగ్ నిర్మించనున్న ఈ చిత్రంలో కరణ్, బిపాస హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాతోపాటు ‘వో కౌన్ తీ’ సినిమాలోనూ యాక్ట్ చేయడానికి రెడీ అయ్యారు. నిజానికి ‘వో కౌన్ తీ’లో ఫస్ట్ హీరోయిన్గా ఐశ్వర్యారాయ్ యాక్ట్ చేయాల్సింది. కానీ ఐష్ తప్పుకోవడంతో ఈ ప్రాజెక్ట్‌లోకి బిపాస ఎంటర్ అయ్యారు. ఇదిలా ఉంటే.. 2016లో కరణ్ సింగ్ గ్రోవర్–బిపాసా ప్రేమ వివాహం చేసుకున్నారు. మ్యారీడ్ లైఫ్ కోసమే రెండేళ్లు బ్రేక్ తీసుకున్నారామె. -
స్క్రీన్ టెస్ట్
1. మహేశ్‌బాబు ఏ సంవత్సరంలో పుట్టారో కనుక్కోండి? ఎ) 1974 బి)1976 సి)1975 డి)1979 2. మహేశ్‌బాబును ‘రాజకుమారుడు’ చిత్రంతో హీరోగా పరిచయం చేసిన నిర్మాత ఎవరు? ఎ) యం.యస్. రాజు బి) సి. అశ్వనీదత్ సి) మంజుల డి) అల్లు అరవింద్ 3. ‘నానీ’ చిత్రంలో మహేశ్‌బాబు సరసన నటించిన బాలీవుడ్ బ్యూటీ ఎవరో తెలుసా? ఎ) అమీషా పటేల్ బి) సోనాలీ బింద్రే సి) బిపాసా బసు డి) ప్రీతీ జింటా 4. ‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు..’ అని మహేశ్ చెప్పిన డైలాగ్ ఏ సినిమాలోనిది? ఎ) అతడు బి) ఖలేజా సి) పోకిరి డి) సైనికుడు 5. మహేశ్‌బాబు తనని తాను మొదటిసారి స్క్రీన్ మీద చూసుకున్న చిత్రం ‘నీడ’. ఏ దర్శకుడు మహేశ్‌ను అరంగేట్రం చేశారో తెలుసా? ఎ) దాసరి నారాయణరావు బి) కె. మురళీ మోహన్‌రావు సి) కోడి రామకృష్ణ డి) కృష్ణ 6. రాక్‌స్టార్ పాత్రలో మహేశ్‌బాబు నటించిన చిత్రం ‘1 నేనొక్కడినే’. ఆ చిత్రానికి కెమెరామెన్ ఎవరో తెలుసా? ఎ) కేకే సెంథిల్ కుమార్ బి) మధి సి) ఛోటా.కె. నాయుడు డి) రత్నవేలు 7. మహేశ్‌బాబు నటి నమ్రతను ఏ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు పెళ్లి చేసుకున్నారో తెలుసా? ఎ) వంశీ బి) ఒక్కడు సి) మురారీ డి) అతడు 8. మహేశ్‌బాబు ‘పోరాటం’, ‘గూఢచారి 117’ సినిమాల్లో బాలనటుడిగా నటించారు. ఈ రెండు చిత్రాలకు దర్శకుడెవరు? ఎ) కోడి రామకృష్ణ బి) ఎ. కోదండ రామిరెడ్డి సి) కేయస్ఆర్ దాస్ డి) కె.బాపయ్య 9. ఈ దర్శకుడు మహేశ్‌బాబుకు క్లోజ్ ఫ్రెండ్. మహేశ్‌బాబు ఫ్యామిలీతో విదేశాలకు విహార యాత్రలకు వెళ్లినప్పుడు ఈ దర్శకునికి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. ఎవరా దర్శకుడు తెలుసా? ఎ) పూరి జగన్నాథ్ బి) మెహర్ రమేశ్ సి) శివ కొరటాల డి) త్రివిక్రమ్ 10. ‘శ్రీమంతుడు’ సినిమాలో చేసిన పాత్ర ఇన్సిపిరేషన్‌తో మహేశ్‌బాబు ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆ గ్రామం తెలంగాణా ప్రాతంలోని ఏ జిల్లాలో ఉందో తెలుసా? ఎ) మహబూబ్ నగర్ బి) అదిలాబాద్ సి) వరంగల్ డి) రంగారెడ్డి 11. మహేశ్‌బాబు ఇప్పటి వరకూ ఎన్ని సినిమాలకు వాయిస్ ఓవర్ అందించారో కనుక్కోండి? ఎ) 2 బి) 1 సి) 6 డి) 4 12. మహేశ్‌బాబు తన కెరీర్లో ఒకే ఒక్క దర్శకునితో మూడు సినిమాల్లో నటించారు. ఆ దర్శకుడెవరు? ఎ) శ్రీకాంత్ అడ్డాల బి) పూరి జగన్నాథ్ సి) శ్రీను వైట్ల డి) గుణశేఖర్ 13. మహేశ్ నటించిన ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’.. ఈ రెండు సినిమాల్లోని పాటలన్నీ రాసిన రచయిత ఎవరో తెలుసా? ఎ) శ్రీమణి బి) రామజోగయ్య శాస్త్రి సి) సిరివెన్నెల డి) చంద్రబోస్ 14. ‘పోకిరి’ సినిమాలోని ‘గల గల పారుతున్న గోదారిలా...’ పాటను పాడిన సింగర్ పేరేంటి? ఎ) హేమచంద్ర బి) నిహాల్ సి) సింహా డి) కార్తీక్ 15. బెస్ట్ డెబ్యూ హీరో, బెస్ట్ హీరో, స్పెషల్ జ్యూరీ అన్ని కేటగిరీలకు కలిపి మహేశ్‌బాబు మొత్తం ఎన్ని నందులను అందుకున్నారో తెలుసా? ఎ) 4 బి) 8 సి) 6 డి) 9 16. మహేశ్‌బాబుని ట్వీటర్లో దాదాపు 68లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఆయన ట్వీటర్ హ్యాండిల్ ఏంటో తెలుసా? ఎ) మీ మహేశ్ బి) యువర్స్ మహేశ్ సి) మహేశ్ డి) యువర్స్ ట్రూలీ మహేశ్ 17. మహేశ్ కెరీర్లో ఇద్దరు హీరోయిన్లతో మాత్రమే రెండుసార్లు నటించారు. ఆ ఇద్దరిలో ఓ హీరోయిన్ త్రిష. మరి రెండో హీరోయిన్ ఎవరు? ఎ) నమ్రతా శిరోద్కర్ బి) భూమిక సి) తమన్నా డి) సమంతా 18. మహేశ్‌బాబు స్కూలింగ్ చెన్నైలో జరిగింది. అదే స్కూల్లో చదువుకున్న తన జూనియర్ తమిళ సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో. ఆ హీరో ఎవరో కనుక్కోండి? ఎ) సూర్య బి) విజయ్ సి) ధనుష్ డి) కార్తీ 19. ప్రస్తుతం మహేశ్‌బాబు నటిస్తున్న ‘మహర్షి’లో కీలక పాత్ర చేస్తున్న కామెడీ హీరో ఎవరు? ఎ) ‘అల్లరి’ నరేశ్ బి) రాజేంద్రప్రసాద్ సి) సునీల్ డి) సప్తగిరి 20 మహేశ్‌బాబు బాలనటుడిగా నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిది? ఎ) నీడ బి) కొడుకు దిద్దిన కాపురం సి) బాలచంద్రుడు డి) పోరాటం మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) సి 2) బి 3) ఎ 4) సి 5) ఎ 6) డి 7) డి 8) ఎ 9) బి 10) ఎ 11) డి 12) డి 13) బి14) బి 15) బి 16) డి 17) డి 18) డి 19) ఎ 20) బి నిర్వహణ: శివ మల్లాల -
బీ సేఫ్
బిపాసా బసు, సన్నీ లియోన్, రాఖీ సావంత్.. వీళ్ల ముగ్గుర్లో ఒక కామన్ పాయింట్ ఉంది. ముగ్గురూ అందగత్తెలని తప్పించుకోవద్దు. ముగ్గుర్లో ఎవరు కనబడినా సినిమా పరుగులు తీస్తుందని చెప్పేయొద్దు. కేక పుట్టే క్యారెక్టర్లు చేశారని క్లాస్ పీకొద్దు. కొంచెం ఆలోచించండి. మీరు ఎవ్వరూ ఊహించలేని ఒక కామన్ పాయింట్ ఉంది. సాధారణంగా ఆ కామన్ పాయింట్ మగ మారాజుల దగ్గరే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ! బీ సేఫ్. కాండోమ్ వాడండి. ఇది మన ప్రభుత్వమే కాదు, ప్రపంచమంతా రన్ అవుతున్న కాంపెయిన్. అనవసరంగా జబ్బులు రాకుండా ఉండటానికి, అవసరం ఉన్నప్పుడే పిల్లల్ని కనడానికి బీ సేఫ్. కాండోమ్ వాడండి అని ప్రపంచంలో ఉన్న మగ మారాజులందరూ పుంజులై కూశారు. మన దగ్గర బిపాస, సన్నీ, ఇప్పుడు రాఖీ కాండోమ్ వాడమని ప్రకటనల్లో కనబడుతున్నారు. -
ప్రియుడిని సర్ప్రైజ్ చేసిన బిపాసాబసు
‘ఎలోన్’ చిత్రంతో ‘జంట’గా మారిన సెక్సీ తార బిపాసాబసు జతగాడు కరణ్‌సింగ్‌తో కలసి ఓ రేంజ్లో ఎంజాయ్ చేసిందట. ఈ సినిమాలో కలసి చేసిన ఇద్దరూ ఆఫ్‌స్క్రీన్‌లో కూడా ఒకరికి ఒకరుగా తిరిగేస్తున్నారట. రీసెంట్గా కరణ్ 33వ బర్త్‌డేను గోవా బీచ్‌లో సెలబ్రేట్ చేసిందట బిపాసా! అది కూడా అతగాడికి తెలియకుండా గుట్టుగా అరేంజ్మెంట్స్ చేసేసిందట. అన్నీ అనుకున్నట్టుగా జరిగుంటే... ముంబై నుంచి తన ఫ్రెండ్స్‌తో ఫ్లయిట్లో డెరైక్టుగా గోవాలో దిగి, అక్కడ మిడ్నైట్ అకేషన్ జరిపి ప్రియుడిని సర్ప్రైజ్ చేయాలన్నది ఈ చిలిపి చూపుల చిన్నదాని ప్లాన్. కానీ... అమ్మడు అతిగా నిద్దర పోవడం వల్ల ప్రోగ్రామ్ కాస్త అటూఇటూ అయినా... మొత్తానికి అర్ధరాత్రి 12 గంటలకు ముందే కరణ్ దరి చేరి హ్యాపీ బర్త్‌డేను మెమరబుల్‌గా మార్చినట్టు ముంబై మిర్రర్ కథనం. బాయ్‌ఫ్రెండ్ జతగా బిప్... తన క్లోజ్ ఫ్రెండ్స్ డిజైనర్ రాకీ, ఫిట్నెస్ ఎక్స్పర్ట్ డేన్ పాండే, మోడల్ క్యాండిస్ పింటోలతో కలసి లాంగ్ డ్రైవ్‌కు వెళ్లిందట! -
బాలీవుడ్ తెరపై మళ్లీ రానా, బిపాసా
దమ్ మారో దమ్ సినిమాలో విపరీతంగా కెమిస్ట్రీ పండించిన బిపాసా బసు, రానా దగ్గుబాటి మళ్లీ మరోసారి వెండితెర మీద మెరవబోతున్నారు. 'నియా' అనే ఈ కొత్త సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని రానా ఎదురు చూస్తున్నాడట. ఈ సినిమాతో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ విక్రమ్ ఫడ్నిస్ దర్శకుడిగా అవతారం ఎత్తుతున్నాడు. ఈ సినిమా జీవితం గురించి ఉంటుందని, చాలా అద్భుతమైన సినిమా అని.. బిపాసాతో మరోసారి నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని రానా అన్నాడు. విక్రమ్ తన పాత్రను మలచిన తీరు అద్భుతమని చెరప్పాడు. దమ్ మారో దమ్ సినిమాలో రానా.. బిపాసా కేవలం స్క్రీన్ మీదే కాక విడిగా కూడా రొమాన్స్ పండించారన్న రూమర్లు అప్పట్లో గట్టిగా వ్యాపించాయి. అయితే.. ఆమె చాలా మంచిదని, ముంబైలో తనకున్న ఏకైక స్నేహితురాలు ఆమేనని రానా అన్నాడు. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ రాణా బాలీవుడ్ తెరమీద మెరుస్తున్నాడు. ఇంతకుముందు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన డిపార్ట్మెంట్, ఆ తర్వాత ఏ జవానీ హై దివానీ సినిమాల్లో మెరిశాడు. ప్రస్తుతం బాహుబలి సినిమాలో చేస్తున్నందువల్లే హిందీ సినిమాలకు దూరంగా ఉన్నానని రానా చెప్పాడు. ఆ సినిమాలో తన పాత్రకు భారీ పర్సనాలిటీ అవసరమని, అందుకే కొన్నాళ్ల పాటు ఇతర చిత్రాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని అన్నాడు. కేవలం ఆ సినిమా క్లైమాక్స్ ఒక్కటే 120 రోజుల పాటు తీస్తున్నారని అన్నాడు. -
జన్మలో బిపాసాతో సినిమా చేయను
బ్లాక్ బ్యూటీ అయినా కూడా బిపాసా బసు అంటే బాలీవుడ్లో బోలెడంత క్రేజ్ ఉంది. కానీ, శుక్రవారమే విడుదలైన 'హమ్‌షకల్స్' చిత్ర నిర్మాత వాషు భగ్నాని మాత్రం ఆమె పేరెత్తితే చాలు.. భగ్గుమంటున్నారు. ఇకమీదట పొరపాటున కూడా ఆమెతో సినిమా చేసే ప్రసక్తి లేదని కుండ బద్దలుకొట్టి మరీ చెబుతున్నారు. సాజిద్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రితేష్ దేశ్‌ముఖ్, సైఫ్ అలీఖాన్, రాం కపూర్, ఈషా గుప్తా, తమన్నా.. వీళ్లంతా కూడా ఉన్నారు. ఇంతమంది ఉన్నా, బిపాసా అంటే మాత్రం ఆ నిర్మాత మండిపడుతున్నారు. తాను ఇలాంటి మాట చెప్పి ఉండకూడదు గానీ, వీలైనంత వరకు ఆమెతో సినిమా చేయకుండానే ఉంటానన్నారు. సినిమాకు సంబంధించిన ఒక్క ప్రమోషన్ ఈవెంట్‌కు కూడా బిపాసా వెళ్లలేదు. మిల్కీబ్యూటీ తమన్నా పక్కన తాను అంత అందంగా కనపడనని అనుకుందో ఏమో గానీ, మొత్తానికి బిప్స్ డుమ్మా కొట్టింది. ఇదే నిర్మాత గారి ఆగ్రహానికి కారణం అయ్యిందని అంతా అంటున్నారు. చివరకు సినిమా కూడా తుస్సుమందన్న టాక్ మొదటిరోజే వినిపించింది. సినిమాలో తన పాత్ర చిన్నదని ఆమె అంటున్నా.. సినిమా చూస్తే అలా ఎవరికీ అనిపించదని, తాను స్వయంగా ఆమెకు పారితోషికం కూడా ఇచ్చానని నిర్మాత అన్నారు.