బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసు 2016లో హీరో కరణ్ సింగ్ గ్రోవర్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. గతేడాది నవంబర్ 12న పండంటి పాపకు ఆమె జన్మనిచ్చింది. తమ గారాలపట్టికి 'దేవి బసు సింగ్ గ్రోవర్' అనే పేరును ఇప్పటికే ఖరారు చేశారు. ఈ జంట తల్లిదండ్రుల క్లబ్‌లో చేరినప్పటి నుంచి, వారి ఆనందానికి అవధులు లేవనే చెప్పవచ్చు. వారిద్దరూ తమ పాపతో ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా బుజ్జాయి అన్నప్రాసన వేడుకను ఘనంగా నిర్వహించారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఫోటోలతో పాటు వీడియోలను అభిమానులతో పంచుకున్నారు.
Baby