Annaprasana
-
మంచు మనోజ్- మౌనికల కూతురి అన్నప్రాసన.. అత్త లేకపోతే ఎలా? (ఫోటోలు)
-
మనోజ్ కూతురి అన్నప్రాసన.. సర్ప్రైజ్ ఇచ్చిన మంచు లక్ష్మి
టాలీవుడ్ హీరో మంచు మనోజ్- మౌనికల దాంపత్యానికి గుర్తుగా ఈ ఏడాది ఏప్రిల్‌లో పండంటి పాపాయి జన్మించింది. ఆమెకు దేవసేన శోభా ఎమ్ఎమ్ అని నామకరణం చేశారు. ముద్దుగా ఆమెను ఎమ్ఎమ్ పులి అని పిలుచుకుంటారు. తాజాగా తన అన్నప్రాసన నిర్వహించారు. తొలిసారి తనకు ఆహారం తినిపించారు. కోడలి అన్నప్రాసన అంటే అత్త లేకపోతే ఎలా? సడన్ సర్ప్రైజ్అందుకే ముంబై నుంచి పరుగెత్తుకుంటూ వచ్చేసింది మంచు లక్ష్మి. తన కూతురు యాపిల్‌ను సైతం తీసుకొచ్చింది. కానీ ఈ విషయాన్ని మనోజ్‌కు చెప్పనేలేదట! తన కూతుర్ని తీసుకెళ్లి వారికి సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఇక యాపిల్‌ను చూడగానే మనోజ్ తెగ సంతోషపడిపోయాడు. తనను హత్తుకుని ప్రేమనంతా గుమ్మరించాడు.మనోజ్ షర్ట్‌పై పులి బొమ్మఇందుకు సంబంధించిన వీడియోను మంచు లక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అలాగే అన్న ప్రాసనకు సంబంధించిన ఫోటోలను సైతం అందులో పొందుపరిచింది. అందులో పులి అన్న సింబల్‌కు గుర్తుగా మనోజ్ షర్ట్‌పై చిన్న పులి బొమ్మ ఉండటం విశేషం. అలాగే ఫోటోలలో చిన్నారి ముఖం కనబడకుండా జాగ్రత్తపడింది.అన్నప్రాసన వేడుక'నా మనసు సంతోషంతో నిండిపోయింది. నా ముద్దుల కోడలు తొలిసారి ఆహారం టేస్ట్ చేసింది. కుటుంబసభ్యులు, మిత్రుల సమక్షంలో ఈ అన్నప్రాసన వేడుక జరిగింది. మన హిందూ ఆచారాల్లో ఏదైనా కొత్త ప్రయాణం మొదలుపెడుతున్నామంటే చాలు అందరం ఒకేచోట కలిసి దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ సంతోషం వెలకట్టలేనిదినిజంగా ఇదెంత బాగుంటుందో కదా! నా కూతురు యాపిల్ వస్తుందని మనోజ్‌కు తెలియదు. తనను తీసుకొచ్చి సర్ప్రైజ్ చేశాను. యాపిల్‌ను చూడగానే తను పొందిన సంతోషం వెలకట్టలేనిది. కుటుంబం, ఫ్రెండ్స్‌తో ఉన్న అనుబంధం కంటే గొప్పది మరొకటి లేదు. నాకంటూ ఇంతమంది ఉన్నందుకు చాలా హ్యాపీ.భగవంతుడికి థ్యాంక్స్ఇలాంటి అందమైన రోజును ప్రసాదించిన భగవంతుడికి థ్యాంక్స్. అలాగే కార్లు, విమానాలు కనిపెట్టడం వల్లే అందరూ ఇలా కలవడానికి వీలవుతోంది. ఆ గణేశుడు నా కోడలు దేవసేనను ఎల్లప్పుడూ రక్షించాలని, తనకు ఏ అడ్డూ లేకుండా చూడాలని మనసారా కోరుకుంటున్నాను' అని మంచు లక్ష్మి రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Actor Vishwa: బిగ్‌బాస్ కంటెస్టెంట్ విశ్వ రెండో కుమారుడి అన్నప్రాసన (ఫోటోలు)
-
తిరుమల అన్నప్రసాదం...!
-
టాప్ హీరోయిన్ కూతురి అన్నప్రాసన వేడుక చూశారా?
-
టాప్ హీరోయిన్ కూతురి అన్నప్రాసన వేడుక చూశారా?
బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బసు 2016లో హీరో కరణ్ సింగ్ గ్రోవర్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. గతేడాది నవంబర్ 12న పండంటి పాపకు ఆమె జన్మనిచ్చింది. తమ గారాలపట్టికి 'దేవి బసు సింగ్ గ్రోవర్' అనే పేరును ఇప్పటికే ఖరారు చేశారు. ఈ జంట తల్లిదండ్రుల క్లబ్లో చేరినప్పటి నుంచి, వారి ఆనందానికి అవధులు లేవనే చెప్పవచ్చు. వారిద్దరూ తమ పాపతో ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా బుజ్జాయి అన్నప్రాసన వేడుకను ఘనంగా నిర్వహించారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఫోటోలతో పాటు వీడియోలను అభిమానులతో పంచుకున్నారు. (ఇదీ చదవండి: మూడేళ్ల కిందట రహస్యంగా రెండో పెళ్లి.. పాపకు జన్మనిచ్చిన ప్రభుదేవా భార్య!) ఈ వేడుకలో బిపాషా, కరణ్ కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు పాల్గొన్నారు. బంగారు రంగులో ఉండే డ్రెస్‌తో ఆ బుజ్జాయి ఎంత క్యూట్‌గా ఉందో అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వారి కెరీర్ విషయానికి వస్తే, బిపాషా బసు గత కొంతకాలంగా సినిమాలకు విరామం ఇచ్చింది. కరణ్ సింగ్ గ్రోవర్ మాత్రం హృతిక్ రోషన్-దీపికా పదుకొనే నటించిన ఫైటర్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. View this post on Instagram A post shared by Bipasha Basu (@bipashabasu) (ఇదీ చదవండి: హీరోయిన్ మెటిరియల్ కాదన్న నెటిజన్.. అదే రేంజ్లో రిప్లై ఇచ్చిన అనుపమ) -
అన్నప్రాశనకు వెళ్తూ అనంత లోకాలకు
వత్సవాయి/జగ్గయ్యపేట/చందానగర్ (హైదరాబాద్): చిన్నారి అన్నప్రాశన కోసమని సంతోషంగా బయలుదేరిన ఆ కుటుంబాన్ని మృత్యువు వెంటాడింది. కొద్దిగంటల్లో గమ్యస్థానం చేరుకుంటారనగా డ్రైవర్ నిద్రమత్తు రూపంలో ఐదుగురిని కబళించింది. ఏపీలోని కృష్ణా జిల్లా వత్సవాయి మండలం గౌరవరం సమీపంలో అదుపుతప్పిన కారు కల్వర్టును ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాద మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుకావడం, ఇందులో అన్నప్రాశన చేసుకోవాల్సిన చిన్నారి కూడా ఉండటం విషాదాన్ని నింపింది. ఆ సంతోషమూ ఆవిరి ప్రమాదంలో మరణించిన ఇందిర 6 నెలల గర్భిణి. వివాహమై మూడేళ్లు గడిచాక ఇటీవలే ఆమె గర్భం దాల్చింది. కుటుంబమంతా ఎంతో సంతోషించింది. కానీ ఇంతలోనే ఆమెనూ విధి బలితీసుకుంది. ప్రమాదంపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ముందురోజు రాత్రే తమతో మాట్లాడిన వారంతా తెల్లవారేసరికి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారనే వార్తను జీర్ణించుకోలేక పోతున్నామని కుటుంబరావు బంధువు లు, ఇరుగుపొరుగు బాధను వ్యక్తం చేశారు. ఒకే కుటుంబంలో ఐదుగురు మృత్యువాత పడటంతో హుడా కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. నిద్రమత్తుతో ప్రమాదం.. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం జాలిపూడికి చెందిన కూరపాటి కుటుంబరావు (60) కుటుంబం హైదరాబాద్‌లోని చందానగర్ హుడా కాలనీలో స్థిరపడింది. ఆయన భార్య మరియమ్మ (50), ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన చిన్నకుమార్తె శాంతి (28)ని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన బోనాల రవీంద్రకి ఇచ్చి వివాహం చేశారు. ఇటీవలే రవీంద్ర–శాంతి దంపతులకు కుమార్తె గాబ్రియేల్ జన్మించింది. ఆ చిన్నారికి 6 నెలలు నిండ టంతో జంగారెడ్డిగూడెంలో అన్నప్రాశన జరపాలని నిర్ణయించారు. కుటుంబరావు, మరియమ్మ, వారి కుమారుడు జోషి, కోడలు ఇందిర (30), కుమార్తె శాంతి, మనవరాలు అడోనా గాబ్రియేల్‌తో కలిసి శనివారం రాత్రి 11 గంటల సమయంలో జాలిపూడికి బయలుదేరారు. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో.. ఏపీలోని కృష్ణా జిల్లా వత్సవాయి మండలం గౌరవరం సమీపంలోకి వచ్చేసరికి కారు నడుపుతున్న జోషి నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో కారు అదుపు తప్పి కల్వర్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మరియమ్మ, కుటుంబరావు, శాంతి అక్కడికక్కడే చనిపోయారు. జోషి, ఇందిర, చిన్నారి అడోన గాబ్రియేల్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. ఇందిర, చిన్నారి కూడా మృతి చెందారు. జోషిని మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించారు. -
అన్నప్రాశనం..
శిశువుకు ప్రప్రథమంగా అన్నం తినిపించే సంస్కారమే అన్నప్రాశనం. తల్లి గర్భంలో వున్న శిశువు, ఆ గర్భమాలిన్యాన్ని తిన్న దోషం పోవడానికి ఈ సంస్కారం జరిపించాలని సూత్రకారులు చెప్పారు. దాదాపుగా అన్ని గృహ్యసూత్రాలూ ఈ అన్నప్రాశన గురించి పేర్కొన్నాయి. కొందరు సూత్రకారులు ఆరునెలల తర్వాత చేయాలని సూచించి వుంటే, మరికొందరు సంవత్సరం చివరన జరిపించాలని సూచించారు. కొందరు సూత్రకారులు పుత్రునికి ఆరు లేదా ఎనిమిదవ నెలలో, పుత్రికకు ఐదవ లేదా ఏడవనెలలో జరిపించాలని చెప్పారు. ఏతావాతా, ఈ అన్నప్రాశన సంస్కారమనేది, శిశువుకు ఆరునెలల వయస్సు నుండి వీలును బట్టి సంవత్సరం లోపు జరిపించాలని శాస్త్రం. అప్పటివరకు తల్లిపాలను మాత్రమే ఆహారం గా తీసుకున్న శిశువుకు క్రమక్రమంగా ఇతర ఆహార పదార్థాలను పరిచయం చేయడం ఈ సంస్కారంతో మొదలౌతుంది. కనుక, ఈ సంస్కారాన్ని ఉత్తరాయనంలో, శుక్ల పక్ష శుభతిథులలో జరిపించాలని శాస్త్రకారులు చెప్పారు. శిశువుకు పెట్టే ఆహారపదార్థాలలో ఆవుపాలు, ఆవుపెరుగు, ఆవునెయ్యి, తేనె, బెల్లం ప్రముఖపాత్ర పోషిస్తాయి. సంస్కార విధానం : శుభ ముహుర్తాన దంపతులు ఆయురారోగ్యాలకొరకు సంకల్పం చెప్పుకుని గణపతిపూజ, పుణ్యహవాచన జరిపించి, శిశువుతో సహా ముగ్గురూ మంత్రపూర్వకంగా కంకణాలు ధరించాలి. శిశువును, ఆ తండ్రి, తన కుడితొడపై కూర్చుండబెట్టుకోవాలి. సాంప్రదాయ స్వర్ణ శిల్పాచార్యులు నూతనంగా తయారు చేసిన బంగారు లేక వెండి పాత్రను, చెంచాను, దక్షిణఫల తాంబూలాదులను ఇచ్చి, వారి ఆశీర్వాదం తీసుకుని తెచ్చుకోవాలి. అందులో ఆవుపాలు, నెయ్యి, బెల్లంతో తయారైన పరమాన్నాన్ని వుంచి, శిశువు మేనమామ ముమ్మారు శిశువుకు నాకించాలి. ఆ తర్వాత శిశువు తల్లిదండ్రులు కూడా కొద్దిగా రుచి చూపించాలి. తదుపరి ఆచార్యులు, బంధువులు, ఆహూతుల ఆశీర్వాదాలు తీసుకుని, వారికి భోజన ఫల దక్షిణాదులను సమర్పించాలి. కొందరు సూత్రకారులు ఈ సంస్కారంలో చరు హోమం చేయాలని చెప్పారు. తర్వాత వివిధరకాలైన వస్తువులను అంటే పుస్తకాలు, ధనం, బంగారం, వెండి, ఇతర పనిముట్లు, ఆహార పదార్థాలు తదితరాలను దేవుడి దగ్గర విడివిడిగా వుంచి, ఆ శిశువును వాటి ఎదురుగా వుంచాలి. వాటిలో ఏ వస్తువును ఆ శిశువు ముట్టుకుంటే, ఆ పనిలో నిపుణత సాధిస్తారని అర్థం చేసుకోవాలని కొందరు సూత్రకారులు చెప్పారు. – ఆచార్య తియ్యబిండి కామేశ్వరరావు -
నవిష్క అన్నప్రాసనకు పవన్ కల్యాణ్ భార్య
సాక్షి, హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి దంపతులు మనుమరాలు అన్నప్రాసన వేడుకలో ఖుషీఖుషీగా గడిపారు. ఈ వేడుక జూన్ 19న చిరు నివాసంలో జరిగింది. తాజాగా ఈ వేడుకకు సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో అప్లోడ్ చేయటంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిరంజీవి రెండో కూతురు శ్రీజ - కల్యాణ్‌దేవ్ దంపతుల బుజ్జి పాపాయి అన్నప్రాసన వేడుకకు కుటుంబ సభ్యులు, బంధువులు తరలివచ్చారు. వారితోపాటు పవన్ కల్యాణ్ భార్య అన్నాలెజ్నోవా తన కొడుకు మార్క్ శంకర్‌తో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన లెజ్నోవా, శ్రీజ కూతురికి స్వీట్ బాక్స్ ఇచ్చి ముద్దు చేశారు. ఇక ఈ కార్యక్రమం ఆసాంతం చిరంజీవి దంపతులు మనుమరాలితో సరదాగా గడిపారు. నవిష్కకు అన్న ప్రాసన చేయించారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోని చిరు రెండో అల్లుడు హీరోకల్యాణ్దేవ్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్ అయింది. -
సూర్యాంశ్ అనే చిన్నారికి అన్నప్రసాన చేసిన వైఎస్ జగన్