
టాలీవుడ్ హీరో మంచు మనోజ్- మౌనికల దాంపత్యానికి గుర్తుగా ఈ ఏడాది ఏప్రిల్‌లో పండంటి పాపాయి జన్మించింది.

ఆమెకు దేవసేన శోభా ఎమ్‌ఎమ్ అని నామకరణం చేశారు.

ముద్దుగా ఆమెను ఎమ్‌ఎమ్ పులి అని పిలుచుకుంటారు. తాజాగా తన అన్నప్రాసన నిర్వహించారు.

తొలిసారి తనకు ఆహారం తినిపించారు. కోడలి అన్నప్రాసన అంటే అత్త లేకపోతే ఎలా?

అందుకే ముంబై నుంచి పరుగెత్తుకుంటూ వచ్చేసింది మంచు లక్ష్మి.

తన కూతురు యాపిల్‌ను సైతం తీసుకొచ్చింది. కానీ ఈ విషయాన్ని మనోజ్‌కు చెప్పనేలేదట!

తన కూతుర్ని తీసుకెళ్లి వారికి సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇక యాపిల్‌ను చూడగానే మనోజ్ తెగ సంతోషపడిపోయాడు.

తనను హత్తుకుని ప్రేమనంతా గుమ్మరించాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను మంచు లక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

అలాగే అన్న ప్రాసనకు సంబంధించిన ఫోటోలను సైతం అందులో పొందుపరిచింది.

అందులో పులి అన్న సింబల్‌కు గుర్తుగా మనోజ్ షర్ట్‌పై చిన్న పులి బొమ్మ ఉండటం విశేషం. అలాగే ఫోటోలలో చిన్నారి ముఖం కనబడకుండా జాగ్రత్తపడింది.






