నవిష్క అన్నప్రాసనకు పవన్‌ కల్యాణ్‌ భార్య | Pawan Kalyan Wife Participate In Chiranjeevi Granddaughter Annaprashan | Sakshi
Sakshi News home page

నవిష్క అన్నప్రాసనకు పవన్‌ కల్యాణ్‌ భార్య

Published Wed, Aug 28 2019 9:41 AM | Last Updated on Wed, Aug 28 2019 10:01 AM

Pawan Kalyan Wife Participate In Chiranjeevi Granddaughter Annaprashan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మెగాస్టార్‌ చిరంజీవి దంపతులు మనుమరాలు అన్నప్రాసన వేడుకలో ఖుషీఖుషీగా గడిపారు. ఈ వేడుక జూన్‌ 19న చిరు నివాసంలో జరిగింది. తాజాగా ఈ  వేడుకకు సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయటంతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చిరంజీవి రెండో కూతురు శ్రీజ - కల్యాణ్‌దేవ్‌ దంపతుల బుజ్జి పాపాయి అన్నప్రాసన వేడుకకు కుటుంబ సభ్యులు, బంధువులు తరలివచ్చారు. వారితోపాటు పవన్‌ కల్యాణ్‌ భార్య అన్నాలెజ్‌నోవా తన కొడుకు మార్క్‌ శంకర్‌తో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన లెజ్‌నోవా, శ్రీజ కూతురికి స్వీట్‌ బాక్స్‌ ఇచ్చి ముద్దు చేశారు. ఇక ఈ కార్యక్రమం ఆసాంతం చిరంజీవి దంపతులు మనుమరాలితో సరదాగా గడిపారు. నవిష్కకు అన్న ప్రాసన చేయించారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోని చిరు రెండో అల్లుడు  హీరోకల్యాణ్‌దేవ్‌ సోషల్‌ మీడియాలో పంచుకోవడంతో వైరల్‌ అయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement