Srija
-
‘స్పప్నాల నావ’.. ‘సిరివెన్నెల’కు అంకితం
ప్రముఖ దర్శకుడు వీ.ఎన్. ఆదిత్య(VN Aditya) ‘స్వప్నాల నావ’ అనే పాటను తెరకెక్కించేందుకు సిద్దమయ్యాడు. డల్లాస్‌లో స్థిరపడిన తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గోపీ కృష్ణ కొటారు నిర్మాణ సంస్థ ‘శ్రీ క్రియేటివ్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్’లో రూపొందుతున్న తొలి వీడియో సాంగ్ ఇది. గోపీ కృష్ణ కుమార్తె శ్రీజ కొటారు పాడి, నటించబోతున్న ఈ పాటకు పార్ధసారధి నేమాని స్వరాలు సమకూర్చగా.. యశ్వంత్ సాహిత్యం అందజేశారు. ఈ మ్యూజిక్ వీడియోకి బుజ్జి.కే సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. పూర్తిగా అమెరికాలోని డల్లాస్ నగరంలో చిత్రీకరించిన స్వప్నాల నావ పాట పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భగా జరిగిన వీడియో లాంచ్ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని నిర్మాత గోపీకృష్ణ కొటారు, కుమారి శ్రీజ కొటారును అభినందించారు.సిరివెన్నెల సీతారామశాస్త్రి(Sirivennela Seetharama Sastry ) భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన భావజాలం ప్రతి ఒక్కరి హృదయాలను తాకుతుందన్నారు గోపీకృష్ణ . ఆయనే ఉండి ఉంటే యువతరానికి తన సాహిత్యం ద్వారా ఎలాంటి సందేశం ఇస్తారన్న ఆలోచనలో నుంచే స్వప్నాల నావ పాట చేయాలనే భావన కలిగిందని గోపికృష్ణ తెలిపారు.పార్ధసారథి నేమాని మాట్లాడుతూ.. ప్రతి చిన్న విషయానికి యువత నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాస్త్రిగారిలాంటి గొప్ప వ్యక్తి ఇచ్చిన సాహిత్యాన్ని ప్రేరణగా తీసుకుని పిల్లల కోసం ఈ పాట చేశామన్నారు. ఈ పాటను ఆలపించిన శ్రీజకు ప్రొఫెషనల్ సింగర్ అయ్యే లక్షణాలు ఉన్నాయని పార్ధు ప్రశంసించారు. ఎన్నో పెద్ద సినిమాలకు దర్శకత్వం వహించిన వీఎన్ ఆదిత్య ఈ పాటకు దర్శకత్వం వహించడం గొప్ప విషయమన్నారు పార్ధసారథి.దర్శకుడు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. ఎన్నిసార్లు కిందపడితే అంతగా మనిషి పైకి వస్తాడని అన్నారు . గోపీకృష్ణ కొత్త ప్రయాణం మొదలుపెట్టారని.. ఆయన జర్నీ సక్సెస్ కావాలని వీఎన్ ఆదిత్య ఆకాంక్షించారు. శ్రీజ ప్రతిభ, గాత్రం చూస్తే ప్రొఫెషనల్ సింగర్‌గా అనిపించిందే కానీ అప్పుడే అరంగేట్రం చేసిన యువతిలా కనిపించలేదని ప్రశంసించారు. ‘‘స్వప్నాల నావ’’ పాటను వీలైనంత త్వరగా చిత్రీకరణ జరిపి మీ ముందుకు తీసుకొస్తామని ఆదిత్య వెల్లడించారు. -
యూటీటీ సీజన్‌కు శ్రీజ దూరం
చెన్నై: భారత నంబర్‌వన్ టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) సీజన్ నుంచి తప్పుకుంది. ఒత్తిడి కారణంగా ఈ నెల 22న ప్రారంభం కానున్న సీజన్‌కు తాను దూరం అవుతున్నట్లు ఆమె తెలిపింది. ఇటీవల పారిస్ ఒలింపిక్స్ టీటీ మహిళల సింగిల్స్‌లో ప్రిక్వార్టర్స్‌కు చేరి ఆకట్టుకున్న 26 ఏళ్ల శ్రీజ ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నట్లు వెల్లడించింది. ‘యూటీటీలో ఆడలేకపోవడం బాధగా ఉంది. విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’ అని రెండుసార్లు జాతీయ చాంపియన్ శ్రీజ పేర్కొంది. లీగ్‌లో శ్రీజ జైపూర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉండగా ఆమె స్థానంలో ఫ్రాంచైజీ నిత్యశ్రీ మణిని ఎంపిక చేసుకుంది. -
శ్రీజ, ఐనీ రెడ్డిలకు పతకాలు
జాతీయ సబ్ జూనియర్ క్యారమ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు రెండు పతకాలు లభించాయి. వారణాసిలో జరిగిన ఈ పోటీల్లో అండర్–14 బాలికల సింగిల్స్‌లో వి. ఐనీ రెడ్డి రజత పతకం... అండర్–12 బాలికల సింగిల్స్‌లో టి.శ్రీజ కాంస్య పతకం గెల్చుకున్నారు. పతక విజేతలకు తెలంగాణ క్యారమ్ సంఘం జనరల్ సెక్రటరీ ఎస్.మదన్‌రాజ్ అభినందించారు. -
Maanas Nagulapalli Srija Wedding: తొలిసారి పెళ్లి ఫొటోలు షేర్ చేసిన 'బిగ్ బాస్' మానస్ (ఫొటోలు)
-
Maanas-Srija Reception: గ్రాండ్‌గా బిగ్‌బాస్ కంటెస్టెంట్ మానస్ రిసెప్షన్ (ఫోటోలు)
-
Maanas-Srija Marriage: బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటుడు మానస్ పెళ్లి (ఫోటోలు)
-
కాలేజీకి వెళ్ళొస్తానని చెప్పి.. అంతలోనే ఇలా.. విషాద ఘటన!
ఆదిలాబాద్: రోడ్డు ప్రమాదంలో మూడు నెలల గర్భిణి మృత్యువాత పడిన సంఘటన బుధవారం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్ కాలనీకి చెందిన శివలింగు శ్రీజ(32) సోఫీనగర్ మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల కళాశాలలో గెస్ట్ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తోంది. మధ్యాహ్నం ఆమె విధులు ముగించుకుని భర్త వీరేన్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా.. ఈదుగాంలోని గోల్డెన్ ఫంక్షన్‌హాల్ వద్ద వెనుక నుంచి వచ్చిన బొలెరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీజ బైక్‌పై నుంచి ఎగిరి రోడ్డుపై పడగా తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి అక్కడి నుంచి ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందింది. కాగా శ్రీజకు ఓ కుమార్తె (5) ఉండగా, ప్రస్తుతం మూడు నెలల గర్భిణి. కాలేజీకి వెళ్తానని చెప్పి శ్రీజ శవమై ఇంటికి రావడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై రాజేశ్వర్‌గౌడ్ తెలిపారు. -
మేనకోడలుకోసం అపొలోకి వచ్చిన అత్తలు శ్రీజ,సుష్మిత
-
మంగ్లీ గ్రామాన్ని సందర్శించిన ట్రైనీ కలెక్టర్
ఆదిలాబాద్‌రూరల్: మండలంలోని వాన్వాట్ గ్రామ పంచాయతీ పరిధిలోని మారుమూల గిరిజన గ్రామమైన మంగ్లీ గ్రామాన్ని ట్రైనీ కలెక్టర్ పి.శ్రీజ కాలినడకన వెళ్లి శుక్రవారం సందర్శించారు. గ్రామానికి గతంలో గవర్నర్ అసిస్స్టెట్ నిధుల నుంచి రూ.10లక్షలతో ఎస్టీ కమ్యూనిటీ హాల్, మరో రూ.11లక్షలతో అంగన్వాడీ కేంద్రం నిర్మాణం కోసం నిధులు మంజూరయ్యాయి. గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక ఇప్పటి వరకు నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. వర్షాలు ప్రారంభమైతే గ్రామ నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ తీసుకెళ్లడం కష్టామని, అప్పటిలోగా తాత్కాలిక రోడ్డు వేయించాలని గ్రామస్తులు ఆమెను కోరారు. స్పందించిన ఆమె ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తాత్కాలిక రోడ్డు నిర్మాణం కోసం నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. అనంతరం అక్కడి నుంచి మామిడిగూడలోని సబ్ సెంటర్‌ను సందర్శించిన ఆమె మంగ్లీ గ్రామంలో వెంటనే వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి చిన్నారులతో పాటు గర్భిణులకు వైద్య పరీక్షలు చేయాలని వైద్యులకు సూచించారు. అంగన్వాడీ కేంద్రం, కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. ఆమె వెంట ఏఈఈ సలావుద్దీన్, కాంట్రాక్టర్ ప్రకాష్ చౌహన్, సర్పంచ్, ఎంపీటీసీ ఉన్నారు. -
షోరూం ప్రారంభోత్సవంలో మెగా డాటర్స్, అమల సందడి.. ఫొటోలు వైరల్
జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లో కళామందిర్ రాయల్ చీరల షోరూం సోమవారం ప్రారంభమైంది. సినీ నటి అమల అక్కినేని, మెగాస్టార్ చిరంజీవి కుమార్తెలు సుష్మిత కొణిదెల, శ్రీజ కొణిదెల షోరూంను ప్రారంభించారు. కార్యక్రమంలో లగడపాటి పద్మ, ఫిక్కీ చైర్మన్ సుబ్రా మహేశ్వరి, కళామందిర్ సుమజ, ఝాన్సీ, కూచిపూడి నృత్యకారిణి దీపికారెడ్డి, ఫ్యాషన్ డిజైనర్ దివ్యారెడ్డి, ఎండి. కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఇది 49వ స్టోర్ అని తమ వద్ద ప్రత్యేకమైన పైతాని, సిల్క్, కోట, పటోల, హ్యాండ్లూమ్, ఖాదీ చీరలు అందుబాటులో ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా అమల మాట్లాడుతూ.. చీర కట్టులోనే మహిళల ఔన్నత్యం దాగి ఉంటుందన్నారు. చీర కట్టడం అంటే తనకు ఎంతో ఇష్టమని, ఇక్కడ ఎన్నో డిజైనరీ బ్రాండ్లు కనువిందు చేస్తున్నాయన్నారు. -
Civils Ranker: ఎవరి కోసమూ ఎదురు చూడొద్దు..
సాక్షి, హైదరాబాద్: జీవితంలో సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదని, అలా అని అంత ఈజీగా ఏదీ దక్కదని సివిల్స్‌లో 20వ ర్యాంకు సాధించిన డాక్టర్ పొడిశెట్టి శ్రీజ అన్నారు. ఎంబీబీఎస్ పూర్తవ్వగానే తండ్రి శ్రీనివాస్ ప్రోత్సాహంతోనే ఐఏఎస్ కోచింగ్ తీసుకున్నట్లు తెలిపారు. సివిల్స్‌లో తాను 100 లోపు ర్యాంక్‌ను ఊహించానని ఇంత మంచి ర్యాంకు వస్తుందనుకోలేదని ఆనందం వ్యక్తం చేశారు. శనివారం ర్యాంకర్ శ్రీజ తన కెరియర్ విశేషాలను ‘సాక్షి’కి వివరించారు. అమ్మ ప్రేరణే డాక్టర్‌గా మలిచింది తన చిన్న తనంలోనే అమ్మ నర్సుగా సేవలందిస్తున్న అంశాలు తనను ప్రేరేపించడంతో ఎంబీబీఎస్ చేసి డాక్టరయ్యానని శ్రీజ తెలిపారు. విద్యాభ్యాసం రెండవ తరగతి నుంచి 10 వ తరగతి వరకు చైతన్యపురిలోని రఘునాథ హైస్కూల్లో, ఇంటర్ శ్రీ చైతన్య కళాశాలలో, ఎంబీబీఎస్ ఉస్మానియా యూనివర్సిటీ(2019)లో పూర్తి చేసినట్లు తెలిపారు. అక్కడి నుంచి సివిల్స్ కోచింగ్ ప్రిపరేషన్ ప్రారంభించానన్నారు. కూతురుకు మిఠాయి తినిపిస్తున్న శ్రీజ తల్లిదండ్రులు, శ్రీనివాస్, శ్రీలత, చిత్రంలో సోదరుడు సాయిరాజ్ మహిళా సాధికారతకు కృషి... డాక్టర్‌గా సేవలందించాలనుకున్న తనకు అమ్మతో పాటు నాన్న ప్రోత్సాహం తోడైందని..అక్కడ నుంచి తన సేవలను కొద్ది మందికి కాకుండా మరింత మందికి అందించాలన్న ఆశయంతో సివిల్స్ వైపు అడు గులు వేసినట్లు తెలిపారు. మహిళ ఉన్నత చదువు చదివితే ఆ ప్రభావం కుటుంబపై ఎలా చూపుతుందో తెలుసుకున్నట్లు తెలిపారు. మహిళా సాధికారతతోపాటు విద్యాభివృద్ధికి కృషిచేస్తానన్నారు. యువతకు సూచన ఎవ్వరూ తమను తాము తక్కువ అంచనా వేసుకోకూడదని, అందరూ సమర్థులేనని గుర్తించి ముందుకు సాగాలని శ్రీజ పేర్కొన్నారు. ఎవ్వరి ప్రోత్సా హం కోసం ఎదురు చూడొద్దని.. ఎవరికి వారు తమకు తాముగా ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగితే ఎలాంటి వాటినైనా సాధించుకోవచ్చన్నారు. సివిల్స్ ర్యాంకర్ డాక్టర్ పొడిశెట్టి శ్రీజ తండ్రి కల నెరవేర్చిన కూతురు చదువులో చురుగ్గా ఉండే శ్రీజ తన తండ్రి కోరిక మేరకు మొదటి ప్రయత్నంలోనే ఎంబీబీఎస్ సాధించడంతో తండ్రి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అంతటితో ఆగకుండా కూతురును ఐఏఎస్ చదివించాలనే కోరిక తండ్రిలో బలపడింది. అదే విషయాన్ని శ్రీజకు చెప్పి ఒప్పించాడు. అతి సాధారణ కుటుంబం నుంచి ఐఏఎస్ వరకు... అతి సాధారణ కుటుంబ నుంచి వచి్చను శ్రీజ సివిల్స్ బెస్ట్ ర్యాంక్ సాధించడంతో శ్రీనివాస్ స్నేహితులు చిలుకానగర్ డివిజన్ సాయినగర్‌కాలనీలో సంబరాలు చేసుకుంటున్నా రు. 20 సంవత్సరాల క్రితం నగరానికి వచ్చిన శ్రీనివాస్ పలు ఆటోమొబైల్ షోరూమ్స్‌లో పని చేశారు. ప్రస్తుతం ఉప్పల్ చిలుకానగర్ డివిజన్ పరిధిలో సాయినగర్‌లో డబుల్ బెడ్ రూం ఇంటిలో అద్దెకుంటున్నారు. శ్రీజకు ఓ సోదరుడు సాయిరాజ్ కూడా ఉన్నాడు. అతను బీబీఏ పూర్తి చేశాడు. -
చింతలకుంట సైంటిస్ట్
కరోనా ముప్పుతో పొలానికి వెళ్లాలంటేనే భయంగా ఉందన్న తన తండ్రి మాటను తేలికగా తీసుకోలేదు శ్రీజ. రేయింబవళ్లు కష్టపడి ‘కోవిడ్ స్మార్ట్ అలారం వాచ్’ తయారు చేసింది. దానిని తన తండ్రి చేతికి కట్టి ధైర్యంగా పొలానికి వెళ్లిరమ్మని చెప్పింది. ప్లాస్టిక్ కవర్ కుండీలో కనిపించిన చనిపోయిన మొక్కను పక్కకు పెట్టి మరో మొక్కను నాటలేదు శ్రీజ. మొక్క చనిపోవడానికి కారణమైన ‘ప్లాస్టిక్’కు చెక్ పెట్టేందుకు వేరుశనగ పొట్టుతో ‘జీవ శైథిల్య కుండీలు’ తయారు చేసింది. పద్నాలుగేళ్ల శ్రీజ రైతు బిడ్డ. జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం చింతలకుంట ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న శ్రీజకు పైరెండు ఆవిష్కరణల వల్ల బాల శాస్త్రవేత్తగా గుర్తింపు లభించింది. చేతుల ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందని తెలుసుకున్న శ్రీజ.. ఏమరుపాటుగానైనా ముఖం మీదకు చేయి వెళ్లకుండా అప్రమత్తం చేసేందుకు పాఠశాల హెచ్.ఎం. ఆగస్టీన్ సహకారం తీసుకుని కోవిడ్ స్మార్ట్ అలారం (అలర్ట్ బజర్) ను తయారు చేసింది! ఇది ధరించి.. కరచాలనం చేయబోతున్నా, నోరు, ముక్కు, చెవుల దగ్గరకు చేతిని తీసుకెళ్లినా అలారం మోగుతుంది. ఇందుకు రు. 50 మాత్రమే ఖర్చు అయిందనీ, దీనిలో 9 వాట్స్ బ్యాటరీ, బజర్, చిన్న లైట్, ఒక సెన్సర్ ఉంటాయని శ్రీజ చెప్పింది. కోవిడ్ స్మార్ట్ వాచ్‌ని కనిపెట్టిన క్రమంలోనే.. ఓసారి గద్వాలకు వెళ్తుండగా దారి మధ్యలో నర్సరీ మొక్కల ప్లాస్టిక్ కుండీలు చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని గమనించింది శ్రీజ. స్కూలు తరఫున మొక్కలు నాటుతున్నప్పుడైతే ప్లాస్టిక్ కుండీలలోని కొన్ని మొక్కలు చనిపోవడం చూసింది. అప్పట్నుంచే ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయంగా ఏదైనా తయారు చేయాలని అనుకుంది. హెచ్.ఎం. సూచనలు తీసుకుని వేరుశనగ పొట్టుతో మొక్కల కుండీలు తయారు చేసింది. వాటిని అలాగే భూమిలో నాటితే వాటంతట అవే భూమిలో కలిసిపోతాయి. అంతేకాదు.. వేరుశనగ పొట్టులో నైట్రోజన్, ఫాస్పరస్ ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల అవి మొక్కకు సహజ ఎరువుగా మారి పెరుగుదలకు దోహదపడతాయి. ఈ ఆలోచనతో శ్రీజ చేసిన ఆవిష్కరణ సౌత్ ఇండియా సైన్స్‌ఫేర్‌లో బహుమతి దక్కించుకుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ‘ఇంటింటా ఇన్నోవేషన్’ కార్యక్రమానికి జిల్లా నుంచి శ్రీజ తయారు చేసిన ‘జీవశైథిల్య మొక్కల కుండీలు’ కాన్సెప్ట్ ఎంపికైంది. – బొల్లెదుల కురుమన్న, సాక్షి, గద్వాల అర్బన్ కుటుంబ నేపథ్యం శ్రీజ తల్లిదండ్రులు మీనాక్షి, సాయన్న. సొంత పొలంలో పత్తి, వేరుశనగ, మిరప, కంది పంటలు సాగు చేస్తారు. నలుగురు పిల్లల్లో శ్రీజ రెండో అమ్మాయి. అక్క మౌనిక ఇంటర్ పూర్తి చేసింది. చెల్లెలు అశ్విని కూడా తొమ్మిదో తరగతి, తమ్ముడు శివ నాలుగో తరగతి చదువుతున్నాడు. -
నవిష్క అన్నప్రాసనకు పవన్ కల్యాణ్ భార్య
సాక్షి, హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి దంపతులు మనుమరాలు అన్నప్రాసన వేడుకలో ఖుషీఖుషీగా గడిపారు. ఈ వేడుక జూన్ 19న చిరు నివాసంలో జరిగింది. తాజాగా ఈ వేడుకకు సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో అప్లోడ్ చేయటంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిరంజీవి రెండో కూతురు శ్రీజ - కల్యాణ్‌దేవ్ దంపతుల బుజ్జి పాపాయి అన్నప్రాసన వేడుకకు కుటుంబ సభ్యులు, బంధువులు తరలివచ్చారు. వారితోపాటు పవన్ కల్యాణ్ భార్య అన్నాలెజ్నోవా తన కొడుకు మార్క్ శంకర్‌తో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన లెజ్నోవా, శ్రీజ కూతురికి స్వీట్ బాక్స్ ఇచ్చి ముద్దు చేశారు. ఇక ఈ కార్యక్రమం ఆసాంతం చిరంజీవి దంపతులు మనుమరాలితో సరదాగా గడిపారు. నవిష్కకు అన్న ప్రాసన చేయించారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోని చిరు రెండో అల్లుడు హీరోకల్యాణ్దేవ్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్ అయింది. -
రెండో పెళ్లి చేసుకున్న శిరీష్ భరద్వాజ్
సాక్షి, హైదరాబాద్ : సినీ నటుడు చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ తాజాగా రెండో పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ విహనను ఆయన వివాహం చేసుకున్నారు. 2007లో శ్రీజను శిరీష్ భరద్వాజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెద్దలకు తెలియకుండా జరిగిన ఈ వివాహం అప్పట్లో సంచలనం రేపింది. అనంతరం వీరిద్దరి మధ్య కొన్ని విభేదాలు వచ్చాయి. అదనపు కట్నం కోసం శిరీష్ తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని శ్రీజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే వేరుగా ఉంటున్న ఇద్దరు 2014లో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. అనంతరం ప్రముఖ వ్యాపారవేత్త తనయుడైన కళ్యాణ్‌ను శ్రీజ 2016 మార్చి 28న పెళ్ళి చేసుకున్నారు. శిరీష్ - శ్రీజ జంటకు ఒక పాప ఉండగా, వారిరువురు విడిపోయిన తర్వాత పాప శ్రీజ దగ్గరే ఉంటోంది. రాజకీయాల్లోకి అడుగుపెట్టి బీజేపీలో చేరిన శిరీష్ తాజాగా రెండో పెళ్లి చేసుకున్నారు. -
శ్రీజ–నిఖత్ జంటకు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో ఆకుల శ్రీజ–నిఖత్ బాను (తెలంగాణ) జంట స్వర్ణంతో మెరిసింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో శ్రీజ–నిఖత్ ద్వయం 11–2, 11–8, 8–11, 11–7తో అనన్య బసక్–సృష్టి (మహారాష్ట్ర) జోడీపై గెలిచింది. సెమీఫైనల్లో శ్రీజ–నిఖత్ జంట 7–11, 11–7, 15–13, 13–11తో అహిక– ప్రాప్తి సేన్ (పశ్చిమ బెంగాల్) జోడీని ఓడించింది. -
ఏపీ, తెలంగాణ స్విమ్మర్లకు పతకాల పంట
సాక్షి, విజయవాడ: సౌత్‌జోన్ అక్వాటిక్స్ చాంపియన్ షిప్లో రెండో రోజూ ఆంధ్రప్రదేశ్ (ఏపీ), తెలంగాణ స్విమ్మర్లు తమ పతకాల వేట కొనసాగించారు. శుక్రవారం జరిగిన పోటీల్లో వారు తొమ్మిదేసి పతకాలను గెల్చుకున్నారు. తెలంగాణ తరఫున గ్రూప్–2 బాలుర 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో వై.జశ్వంత్ రెడ్డి (తెలంగాణ; 2ని:21.14 సెకన్లు) పసిడి పతకం సాధించాడు. గ్రూప్–2 బాలుర 50 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో సూర్యాన్షు (తెలంగాణ; 28.37 సెకన్లు), గ్రూప్–1 బాలికల 200 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్‌లో ముప్పనేని శ్రీజ (తెలంగాణ; 3ని:12.72 సెకన్లు), గ్రూప్–1 బాలుర 200 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో యష్ వర్మ (తెలంగాణ; 2ని:13.67 సెకన్లు) రజత పతకాలను దక్కించుకున్నారు. గ్రూప్–1 బాలుర 800 మీటర్ల ఫ్రీస్టయిల్లో చల్లగాని అభిలాష్ (తెలంగాణ; 9ని:30.39 సెకన్లు), గ్రూప్–1 బాలికల 50 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో చెన్నవోజుల కృష్ణప్రియ (తెలంగాణ; 35.15 సెకన్లు), గ్రూప్–2 బాలికల 50 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో కాల్వ సంజన (తెలంగాణ; 32.97 సెకన్లు) కాంస్యాలు కైవసం చేసుకున్నారు. గ్రూప్–3 బాలికల 4్ఠ50 మీటర్ల మెడ్లేలో, గ్రూప్–2 బాలుర 4్ఠ100 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలేలో తెలంగాణ బృందాలకు కాంస్యాలు లభించాయి. ఆంధ్రప్రదేశ్ తరఫున గ్రూప్–1 బాలుర 50 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో ఎం.వాసురామ్ (ఆంధ్రప్రదేశ్; 27.11 సెకన్లు), గ్రూప్–1 బాలుర 200 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో ఎం.లోహిత్ (ఆంధ్రప్రదేశ్; 2ని:25.76 సెకన్లు), గ్రూప్–4 బాలుర 50 మీటర్ల ఫ్రీస్టయిల్లో ఎం. తీర్ధు సామదేవ్ (ఆంధ్రప్రదేశ్; 31.81 సెకన్లు) స్వర్ణ పతకాలను హస్తగతం చేసుకున్నారు. గ్రూప్–1 బాలుర 200 మీటర్ల ఫ్రీస్టయిల్లో ఎం. వాసురామ్ (ఆంధ్రప్రదేశ్; 2ని: 03.94 సెకన్లు) రజతం గెలిచాడు. గ్రూప్–2 బాలుర 200 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో మొహమ్మద్ పర్వేజ్ మహరూఫ్ (ఆంధ్రప్రదేశ్; 2ని:48.57 సెకన్లు) కాంస్యం నెగ్గాడు. గ్రూప్–1 బాలుర 4్ఠ100 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలేలో, గ్రూప్–3 బాలుర 4్ఠ50 మీటర్ల మెడ్లేలో, గ్రూప్–4 బాలికల 4్ఠ50 మీటర్ల మెడ్లేలో, గ్రూప్–4 బాలికల 4్ఠ50 మీటర్ల మెడ్లేలో ఆంధ్రప్రదేశ్ బృందాలకు కాంస్యాలు లభించాయి. -
విజేత శ్రీజ
పుణే: జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) యూత్ చాంపియన్‌షిప్ బాలికల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి ఆకుల శ్రీజ విజేతగా నిలిచింది. పుణే ఆతిథ్యమిచ్చిన ఈ టోర్నీలో శ్రీజ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తరఫున బరిలోకి దిగింది. మంగళవారం జరిగిన ఫైనల్లో శ్రీజ 11–7, 5–11, 11–9, 12–14, 11–9, 9–11, 12–10తో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రాప్తి సేన్‌పై గెలుపొందింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో శ్రీజ 4–2తో సురభి పట్వారి (పశ్చిమ బెంగాల్)పై, క్వార్టర్ ఫైనల్లో 4–3తో బైశ్య పోయమంటిని (పశ్చిమ బెంగాల్)పై విజయం సాధించింది. 20 ఏళ్ల శ్రీజ హైదరాబాద్‌లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ)లో కోచ్ సోమ్‌నాథ్ ఘోష్ వద్ద శిక్షణ తీసుకుంటోంది. -
మళ్లీ పవన్‌ను టార్గెట్ చేసిన శ్రీరెడ్డి
సాక్షి, హైదరాబాద్ : పవన్ కళ్యాణ్‌పై వివాదాస్పద నటి శ్రీరెడ్డి నిప్పులు చెరిగారు. పదహారేళ్లు పెంచుకున్న పాపని కాంగ్రెస్ నాయకులు మోసపూరితంగా ఢిల్లీలో జాతీయ చానెళ్ల ఎదుట కూర్చోబెడితే మా కడుపు ఉడికిపోయిందన్న పవన్ కళ్యాణ్..మరి మీ అన్న ఇంకా కాంగ్రెస్‌లోనే ఎందుకు కొనసాగుతున్నారు. ఓట్ల కోసం ఆయన అభిమానుల ద్వారా మీకు ఎలా సాయపడుతున్నారని నిలదీశారు. దీనిపై మీ అన్న సిగ్గుపడటం లేదా..? అన్నం పెట్టేవాడికి సున్నం వేస్తారా..? అంటూ శ్రీరెడ్డి మెగా బ్రదర్స్‌ను టార్గెట్ చేశారు. చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ ప్రేమ వివాహం సందర్భంగా కాంగ్రెస్ నేతలు తమ బిడ్డను బజారుకీడ్చారంటూ పవన్ కళ్యాణ్ ఇటీవల ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాగా, కాస్టింగ్ కౌచ్‌పై శ్రీరెడ్డి వరుస ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. -
కష్టాల్లో సీనియర్ నటి.. ఆదుకున్న చిరంజీవి
సాక్షి, హైదరాబాద్ : ‘అల్లరి’ సినిమాతో ప్రసిద్ధి పొందిన సీనియర్ నటి సుభాషిణీ తీవ్ర కష్టాల్లో ఉన్నారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో ఆమె బాధపడుతున్నారు. ఆమె కష్టాల గురించి తెలుసుకున్న సీనియర్ హీరో, మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆమె అనారోగ్యం గురించి తెలుసుకొని.. రూ. 2 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ బుధవారం స్వయంగా సుభాషిణి ఇంటికి వెళ్లి.. ఆమెకు రూ. రెండు లక్షలు అందజేశారు. కష్టాల్లో ఉన్న సీనియర్ నటికి చిరంజీవి సాయం అందించడంపై సోషల్ మీడియాలో పలువురు ప్రశంసిస్తున్నారు. -
తూ.గో జిల్లాలో స్వైన్ ఫ్లూ కలకలం
తూర్పుగోదావరి: జిల్లాలోని రావులపాలెంలో స్వైన్ ఫ్లూ కలకలం రేగింది. గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలకు ఈ వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. జిల్లాలోనే మొట్టమొదటిగా రావులపాలెం ఈ వ్యాధి వెలుగు చూడటంతో వైద్యులు అప్రమత్తమయ్యారు. గ్రామానికి చెందిన సత్తి వెంకటరెడ్డి భార్య నళిని ఇటీవల తీవ్ర అనారోగ్యంతో మృతి చెందింది. ఈమెకు తీవ్ర జ్వరం రావడంతో రాజమండ్రి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. నిమోనియా వ్యాధితో ఈమె మృతి చెందినట్టు వైద్యులు స్పష్టం చేశారు. అయితే, ఆమె ఇద్దరు కుమార్తెలు దీప్తి, శ్రీజలు కూడా నాలుగు రోజుల క్రితం జ్వరం బారిన పడటంతో వారిని కూడా రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రికి చేర్పించారు. వీరిలో దీప్తికి సాధారణ జ్వరం కాగా శ్రీజకు మాత్రం స్వైన్ ఫ్లూ సోకినట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారించారు. వీరి సమీప బంధువు కర్రి వీరారెడ్డి నాలుగేళ్ల కుమార్తె హర్షిత కూడా జ్వరం బారిన పడటంతో కాకినాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా ఈమెకు కూడా స్వైన్ ఫ్లూ సోకినట్టు నిర్ధారించి చికిత్స అందజేస్తున్నారు. జిల్లాలో మొదటి సారిగా స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో డీఎంఆండ్‌హెచ్‌ఓ కె. చంద్రయ్య హుటాహుటిన రావులపాలెం చేరుకున్నారు. స్థానిక ఊబలంక పీహెచ్సీ వైద్య సిబ్బందితో కలసి బాధితులు ఇళ్ళ వద్ద పరిస్థితిని సమీక్షించారు. గాలి ద్వారా వ్యాపించే ఈ వ్యాధి మరింత మందికి సోకే అవకాశం ఉన్నందున అంతా జాగ్రత్తలు పాటించాలని ఆయా కుటుంబాల వారికి సూచించారు. గ్రామంలో ఏడు వైద్య బృందాలను ఏర్పాటు చేసి సర్వే చేయించారు. ఎవరికైనా ఈ వ్యాధి సోకినట్లు లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. -
శ్రీజ సంచలనం
ఇండియా ఓపెన్ టీటీ టోర్నీలో కాంస్యం న్యూఢిల్లీ: హైదరాబాద్ యువతార ఆకుల శ్రీజ తన కెరీర్లో గొప్ప ప్రదర్శన చేసింది. అంత్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) వరల్డ్ టూర్ ఇండియా ఓపెన్ టోర్నమెంట్లో అండర్–21 మహిళల సింగిల్స్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. బుధవారం జరిగిన అండర్–21 మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 322వ ర్యాంకర్ శ్రీజ 2–11, 11–13, 7–11తో వాయ్ యామ్ మినీ సూ (హాంకాంగ్) చేతిలో ఓడిపోయి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో శ్రీజ 11–7, 6–11, 6–11, 11–3, 11–9తో ప్రపంచ 171వ ర్యాంకర్ లిన్ పో సువాన్ (చైనీస్ తైపీ)పై సంచలన విజయం సాధించగా... తొలి రౌండ్లో 7–11, 8–11, 11–6, 11–5, 11–5తో అమృత పుష్పక్ (భారత్)ను ఓడించింది. మరోవైపు ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులు ఆంథోనీ అమల్‌రాజ్, హర్మీత్ దేశాయ్, జ్ఞానశేఖరన్ సత్యన్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు. -
సురేశ్ కామాక్షి దర్శకత్వంలో మిగమిగ అవసరం
నిర్మాతగా అనుభవం గడించిన వాళ్లు దర్శకులుగా అవతారమెత్తడం అన్నది కొత్తేమీ కాదు. ఆ కోవలో తాజాగా సురేశ్ కామాక్షి చేరారన్నదే తాజా న్యూస్. ఇంతకు ముందు వి.హౌస్ ప్రొడక్షన్ పతాకంపై అమైదిప్పడై-2,కంగారు వంటి చిత్రాలను నిర్మించిన సురేశ్ కామాక్షి ఇప్పుడు అదే పతాకంపై స్వీయ దర్శకత్వంలో మిగ మిగ అవసరం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నామ్ తమిళర్ పార్టీ అధ్యక్షుడు, దర్శకుడు ప్రధాన పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో గోరిపాలైయం చిత్రం ఫేమ్ హరీష్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా కంగారు, వందామల చిత్రాల ఫేమ్ శ్రీజ నాయకిగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో లింగా, ఆండవన్కట్టళై అరవింద్, దర్శకుడు శరవణ పిళ్లై, వీకే.సుందర్, వెట్రికుమరన్ నటిస్తున్నారు.చిత్ర వివరాలను దర్శక నిర్మాత సురేశ్ కామాక్షి తెలుపుతూ చిత్ర షూటింగ్‌ను సేలం జిల్లా, భవాని గ్రామ సమీసంలో గల కోనేరిపట్టి బ్రిడ్జి వద్ద నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో 23 ఏళ్ల క్రితం దర్శకుడు కే.భాగ్యరాజ్ పవను పవనుదాన్ చిత్ర షూటింగ్ నిర్వహించారన్నారు. ఆ తరువాత ఈ ప్రాంతంలో చిత్రీకరించుకుంటున్న చిత్రం తమ మిగ మిగ అవసరం చిత్రమేనని చెప్పారు. కథకు అవసరం అవ్వడంతో ఇక్కడ చిత్రీకరిస్తున్నట్లు వివరించారు. మరో మిషయం ఏమిటంటే ఈ చిత్రానికి ఎపిక్ వెపన్ హెలియం 8కే సెన్సార్ అనే అతి నవీన కెమెరాను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఇది 8కే రెజల్యూషన్‌తో కూడిన కెమెరా అని, భారతీయ సినిమా చరిత్రలోనే ఈ కెమెరాతో చిత్రీకరిస్తున్న తొలి చిత్రం మిగ మిగ అవసరం అని దర్శక నిర్మాత సురేశ్ కామాక్షి పేర్కొన్నారు. -
అద్భుతం... మదర్ థెరిసా నాటకం
పెదవాల్తేరు : రంగస్థలంపై అద్భుతం అవిష్కతమైంది. వెండితెరను తలపించే సెట్టింగ్‌లతో ప్రేక్షక లోకాన్ని మైమరపించింది. రెండు గంటల పాటు తమ నాటన కౌశలంతో నటీనటులు నాటకాన్ని రక్తికట్టించారు. కోల్‌కతా మురికవాడల్లో అమతమూర్తి ‘మదర థెరిసా’ చేసిన సేవలను కళ్ల కట్టినట్టుగా ఆవిష్కరించి విశాఖ కళాప్రియుల మన్ననలు అందుకున్నారు. సికింద్రాబాద్‌కు చెందిన యాక్మి లయోలా ఓల్డేజ్ హోమ్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం పోర్టు కళావాణి ఆడిటోరియంలో మదర్ థెరిసా నాటకాని ప్రదర్శించారు. అమతవాణి సమర్పణలో బాలశౌరి దర్శకత్వంలో ప్రముఖ సినీ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ బ్యాక్‌డ్రాప్ మ్యూజిక్‌ను అందించారు. –మదర్పాత్రతో లీనమై ప్రేక్షకులను కట్టిపడేసిన శ్రీజ సాధినేని చావైనా బతుకైనా హుందా ఉండాలని విశ్వసించిన విశ్వమాత మదర్ థెరిసా. మానవత్వానికి ప్రతిరూపం ఆమె. అభాగ్యులను ఆదుకుని పట్టెడన్నం పెట్టేందుకు ఆమె పడిన శ్రమ విశ్వవ్యాప్తంగా స్ఫూర్తిని నింపింది. ఈ నాటకంలో మదర్ థెరిసా పాత్రధారిగా శ్రీజ సాధినేని తన నటనా చాతుర్యంతో ప్రేక్షకుల హదయాలను దోచుకున్నారు. తన హావభావాలతో పాత్రకు రక్తి కట్టించి ప్రేక్షకులను కట్టిపడేశారు. కోల్‌కతా మురికివాడలో కలరా వ్యాధితో అల్లాడుతున్న వారికి మదర్ సేవలందించే నటనలో ప్రేక్షకులను హదయాలను కదిలించారు. జన నీరాజనాలు అందుకున్నారు. రెండు గంటల నిడివి.. 22 సెట్టింగ్‌లు ఇంత వరకు సురభి నాటకాల సెట్టింగ్‌లు చూసిన విశాఖ వాసులకు మదర్‌థెరిసా నాటకం మరో అద్భుతాన్ని రుచిచూపింది. ఏకంగా కోల్‌కతా హౌరాబ్రిడ్జి బ్యాక్‌డ్రాప్‌ను సెట్టింగ్ వేశారు. వేదికపైకి నిజంగా ట్రైన్ వచ్చిందా అన్నట్టుగా వేసిన సెట్టింగ్‌తో కళాకారులు ప్రశంసలుపొందారు. సెయింట్ మేరీస్ స్కూల్ సెట్, అక్కడ ఉండే పెద్ద గేట్‌ను సెట్ ద్వారా చూపించారు. కోల్‌కతా మురికివాడలను సెట్‌ను సైతం వేసి నాటకానికి వన్నెతెచ్చారు. నాటకం మొత్తానికి 22 సెట్టింగ్‌లు అదరహో అనిపించాయి. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఈ నాటకానికి బ్యాక్‌డ్రాప్ మ్యూజిక్ అందించి సన్నివేశానికి తగ్గట్టు రక్తికట్టించారు. మదర్ థెరిసా నాటకానికి సంగీతం సమకూర్చే అదష్టం కలగడం పూర్వజన్మసుకతం. విశ్వమాత నాటకానికి పనిచేయడం నా జన్మలో గొప్ప విషయంగా భావిస్తున్నానని సంగీతం అందించిన సినీ సంగీత దర్శకుడు అనురూప్ రూబెన్స్ వ్యాఖ్యానించారు. పలువురు ప్రముఖులు ఈ నాటకాన్ని తిలకించారు. -
పేరు మారింది మరి ఫేట్?
సెంటిమెంట్ చాలా చేయిస్తుంది. చిత్ర పరిశ్రమలో ఇది కొంచెం ఎక్కువేనని చెప్పక తప్పదు. న్యూమరాలజీని బాగానే నమ్ముతారు.దానిని బట్టి తారలు పేర్లు మార్చుకోవడం అన్నది పరిపాటే.తద్వారా ఎవరు ఎలాంటి ఫలితాలను పొందారన్నది పక్కన పెడితే ఈ పేర్ల మార్పుల పరంపర కొనసాగుతూనే ఉంది.ఆ మధ్య నటి లక్ష్మీరాయ్ తన పేరును రాయ్‌లక్ష్మీగా మార్చుకున్నారు.తాజాగా వర్ధమాన నటి శ్రీప్రియాంక శ్రీజగా పేరు మార్చుకున్నారట. ఇటీవల తమిళ భాష తెలిసిన నటీమణులకు ఇక్కడ అవకాశాలు లేవు అంటూ ఒక వేదికపై తన ఆవేదనను వ్యక్తం చేసి నలుగురి దృష్టిలో పడ్డ ఈ అమ్మడు పుదుచ్చేరికి చెందిన అచ్చమైన తమిళ అమ్మాయి. కంగారు చిత్రం ద్వారా నటిగా పరిచయం అయిన శ్రీప్రియాంక ఆ తరువాత వందామల, కోడైమళై చిత్రాల్లో నటించింది. తాజా చిత్రం సారల్ విడుదలకు ముస్తాబవుతోంది. అయితే నాయకిగా తగిన గుర్తింపు కోసం పోరాడుతున్న శ్రీప్రియాంక తన పేరును శ్రీజగా మార్చుకోవడానికి కారణాన్ని తెలుపుతూ శ్రీప్రియాంక పేరుతో ఇప్పటికే ఇక్కడ ఇంకొందరు నటీమణులు ఉన్నట్లు ఇటీవలే తనకు తెలిసిందని చెప్పుకొచ్చింది. పేరుతో కన్ఫ్యూజన్ ఉండరాదనే శ్రీజగా మార్చుకున్నట్లు వివరించారు. అయితే న్యూమరాలజీ ప్రకారం శ్రీజ పేరు తనకు భాగుంటుందన్నారని అసలు సంగతిని మెల్లగా చెప్పింది. తాను నటించిన సారల్ చిత్ర పాటలకు మంచి స్పందన వస్తోందని చిత్ర విడుదల కోసం ఎదురు చూస్తున్నానని అంది. ప్రస్తుతం రింగారం అనే చిత్రంలో నటిస్తున్నానని, తిరుపతి లడ్డు అనే మరో చిత్రం త్వరలో ప్రారంభం కానుందని చెప్పింది. మరి కొన్ని నూతన చిత్రాలను అంగీకరించే విషయంలో చర్చలు జరుగుతున్నట్లు శ్రీజగా మారిన శ్రీప్రియాంక చెప్పుకొచ్చింది. మరి ఈ కొత్త పేరు అయినా తనకు మంచి అవకాశాలు తెచ్చి పెట్టి తన ఫేట్‌ను మారుస్తుందేమో చూడాలి. -
దుర్గమ్మ సన్నిధిలో శ్రీజ దంపతులు
చిరంజీవి చిన్నకుమార్తె శ్రీజ దంపతులు విజయవాడ కనకదుర్గమ్మను మంగళవారం సందర్శించుకున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఎన్నారై కళ్యాణ్‌తో శ్రీజ పెళ్లి మార్చి 28న జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి అయిన తర్వాత తొలిసారిగా విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధికి వచ్చిన ఈ కొత్త దంపతులు అమ్మవారిని, స్వామిని కూడా దర్శించుకున్నారు. -
శ్రీజకు రూ.10 లక్షల చెక్కు ఇచ్చిన సీఎం
♦ చిన్నారి ధారణ శక్తికి ముగ్ధుడైన సీఎం కేసీఆర్ ♦ సొంత ఖాతా నుంచి రూ.10 లక్షలు అందజేత ♦ ఇంటికి భోజనానికి వస్తానని హామీ సాక్షి, హైదరాబాద్: కాకతీయుల కాలం నాటి స్వర్ణయుగం, శాతవాహనుల పాలనా దక్షత, నిజాం నవాబుల హయాంలోని ప్రగతి, సమైక్య రాష్ట్రం-తెలంగాణ ఉద్యమం.. ఒక్కటేమిటి ఇలా అనేక విషయాలను ఓ చిన్నారి ధారాళంగా చెబుతుంటే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు. ఎలాంటి భయం లేకుండా మూడో తరగతి చదువుతున్న ఓ చిన్నారి సీఎం ముందు అనేక విషయాలను అనర్గళంగా చెప్పింది. ఆ పాప జ్ఞాపకశక్తి, మేధోసంపత్తికి ముగ్ధుడైన సీఎం తన సొంత ఖాతా నుంచి రూ.10 లక్షల పదహార్లు అందజేశారు. బాగా చదువుకోవాలని ఆశీర్వదించారు. ఏదైనా ఓ రోజు భోజనానికి వస్తానని పాప తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. అనర్గళంగా చెప్పడంలో దిట్ట ఖమ్మంకు చెందిన కిరణ్‌కుమార్, సుధారాణి దంపతుల కూతురు లక్ష్మీ శ్రీజ.. ఎన్నో విషయాలను గుర్తుంచుకుని తిరిగి చెప్పడంలో దిట్ట. పాప ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు తెలంగాణ చరిత్రతో పాటు సమకాలీన అంశాలపై అవగాహన కల్పించేవారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు, ముఖ్యమంత్రి పనితీరు, మంత్రుల పేర్లు ఇలా అనేక విషయాలను అలవోకగా శ్రీజ చెప్పేస్తుంది. ఆదివారం క్యాంపు కార్యాలయంలో శ్రీజ తల్లిదండ్రులు ముఖ్యమంత్రిని కలిశారు. ముందుగా చెప్పినవే కాకుండా అప్పటికప్పుడు అడిగే ప్రశ్నలకు కూడా ఠక్కున సమాధానం చెప్పే తీరును చూసి కేసీఆర్ ఆశ్చర్యపోయారు. -
హల్చల్ చేస్తున్న పవర్‌స్టార్ లిటిల్ ప్రిన్స్
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండవ కుమార్తె ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లి వేడుకల్లో సందడి చేసిన ఈ చిన్నారి ఫోటోలను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. పవన్, అన్నా లెజెనివా ల ముద్దుల తనయ 'పోలెనా' ఫోటోలు ఇప్పటి వరకు ఎక్కడా కనిపించలేదు. దీంతో తమ అభిమాన హీరో లిటిల్ ప్రిన్స్ తాజా ఫోటోలతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మెగా ఫ్యామిలీ ఘనంగా నిర్వహించిన శ్రీజ- కళ్యాణ్ వేడుకల్లో పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజెనివా కొత్త కళను తీసుకొచ్చిందని అభిమానులు మురిసిపోయారు. మరోవైపు ఈ లిటిల్ ప్రిన్స్.. అల్లు అర్జున్ కొడుకు అయాన్, ఇతర మెగా ఫ్యామిలీ పిల్లలతో ఆడుకుంటూ సందడి చేసింది. -
శ్రీజ మెహందీ ఫంక్షన్
-
కొణిదల వారి పెళ్లి సందడి
కొద్ది రోజులుగా మెగా ఫ్యామిలీ అంతా పెళ్లి పనుల్లో బిజీగా ఉంది. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం అంగరంగ వైభవంగా జరిపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు కుటుంబ సభ్యులు. ఇప్పటి వరకు అఫీషియల్‌గా ఎనౌన్స్ చేయకపోయినా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్న ఫోటోలు, వార్తలతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తాజాగా శ్రీజను పెళ్లి కూతురిని చేస్తున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియలో సందడి చేస్తున్నాయి. మెగా ఫ్యామిలీ హీరోలు రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బెంగుళూరులోని చిరంజీవి ఫాం హౌజ్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో మార్చి 28న శ్రీజ వివాహం జరగనుంది. తరువాత హైదరాబాద్ లోని ప్రముఖుల కోసం మార్చి 31న గ్రాండ్ రిసెప్షన్‌ను ప్లాన్ చేస్తున్నారు. -
చిరంజీవి చిన్న అల్లుడు ఈయనేనా ?
హైదరాబాద్: టాలీవుడ్ మెగాస్టార్, కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ పెళ్లి కబుర్లు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాయి. దీనిపై చిరంజీవి కుటుంబం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాకపోయినా అంతటా ఆసక్తి నెలకొంది. గతంలో ప్రేమ వివాహం, విడాకులతో సంచలన వార్తగా నిలిచిన శ్రీజ.. ఇప్పుడు తన చిన్ననాటి స్నేహితుడు కళ్యాణ్‌ను పెళ్లి చేసుకుంటుందని అంటున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల చేతికి ఆపరేషన్ చేయించుకున్న చిరంజీవి కట్టుతో ఉన్న ఫొటో ఒకటి హల్చల్ చేసిన సంగతి తెలిసిన విషయమే. అయితే చిరంజీవి చిన్న అల్లుడు ఈయనే అంటూ మరో ఫొటోఒకటి ఇప్పుడు ఆందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. చిరంజీవి భార్య సురేఖకు సన్నిహితుల కొడుకు, తిరుపతి సమీప ప్రాంతానికి చెందిన కళ్యాణ్‌తో పెళ్లికి ముహూర్తం ఖరారైనట్టు సమాచారం. ఏ హంగూ, ఆర్భాటం లేకుండా, చాలా నిరాడంబరంగా కొద్దిమంది విశిష్ట అతిథుల సమక్షంలో ఈ పెళ్లి చేయించేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. కొణిదల వారి ఇంటి పెళ్లిసందడిపై... స్వయంగా పెళ్లివారి నుంచి కబురు అందేవరకు ఈ సస్పెన్స్ తప్పదు. -
చిరంజీవి ఇంట్లో మొదలైన పెళ్లి సందడి
చిరంజీవి రెండో కుమార్తె శ్రీజకు మళ్లీ వివాహం ఖరారైందనే వార్త ఇటీవల కొద్దిరోజులుగా ప్రచారమవుతోంది. దీని గురించి చిరంజీవి కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా ఇప్పటి దాకా రాలేదు. గతంలో శ్రీజ ప్రేమ వివాహం, తదనంతర పరిణామాల్లో విడాకులు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కానీ, చిరంజీవి ఇంట పెళ్లి సందడి మొదలైందని భోగట్టా. వివాహ వేడుకలకు నాందిగా చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ కలిసి పసుపు దంచే కార్యక్రమం మొదలుపెట్టినట్లుగా సామాజిక మాధ్యమంలో హల్చల్ చేస్తున్న ఓ ఫొటో స్పష్టం చేసింది. కాగా, సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం వరుడు తిరుపతి సమీప ప్రాంతానికి చెందిన కుర్రాడు. చిరంజీవి సతీమణి సురేఖకు సన్నిహితులైనవారి కుమారుడు. ఇరు కుటుంబా లకూ ఎప్పటి నుంచో సాన్నిహిత్యం ఉంది. ఈ ఫిబ్రవరి నెలాఖరున (25వ తేదీ ప్రాంతంలో) పెళ్లి జరగనుందట. ఎలాంటి హంగూ, ఆర్భాటం లేకుండా నిరాడంబరంగా ఈ పెళ్ళి జరపాలని వధూ వరుల కుటుంబాలు నిర్ణయించాయి. పెళ్ళి కూడా హైదరాబాద్‌లో కాక, వేరే చోట జరపనున్నారు. -
నిఖత్, శ్రీజ, వరుణిలకు కాంస్యాలు
జాతీయ ర్యాంకింగ్ టీటీ టోర్నీ గువహటి: జాతీయ సీనియర్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ-ఈస్ట్‌జోన్) టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయిలు నిఖత్ బాను, ఆకుల శ్రీజ, వరుణి జైస్వాల్ కాంస్య పతకాలు గెల్చుకున్నారు. బుధవారం ముగిసిన ఈ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో నిఖత్ 3-4 (11-9, 12-10, 3-11, 6-11, 15-13, 6-11, 8-11)తో షామిని (పీఎస్‌పీబీ) చేతిలో పోరాడి ఓడింది. మరో సెమీస్‌లో మౌమా దాస్ (పీఎస్‌పీబీ) 4-0తో పూజా సహస్రబుద్దే (పీఎస్‌పీబీ)పై గెలిచింది. సెమీస్‌లో ఓడిన నిఖత్, పూజాలకు కాంస్యాలు లభించగా... ఫైనల్లో షామిని 4-3తో మౌమా దాస్‌ను ఓడించి విజేతగా నిలిచింది. యూత్, జూనియర్ బాలికల సింగిల్స్ విభాగంలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) జట్టు తరఫున బరిలోకి దిగిన తెలుగు అమ్మాయి ఆకుల శ్రీజకు కాంస్య పతకాలు దక్కాయి. ‘యూత్’ సెమీస్‌లో శ్రీజ 2-4తో రీత్ రిష్యా (పీఎస్‌పీబీ) చేతిలో... ‘జూనియర్’ సెమీస్‌లో 0-4తో హర్షవర్ధిని (తమిళనాడు) చేతిలో ఓడిపోయింది. జూనియర్ బాలికల సింగిల్స్ సెమీస్‌లో వరుణి 1-4తో మౌమితా దత్తా (బెంగాల్) చేతిలో పరాజయం పాలైంది. -
తారలు దిగివచ్చిన వేళ...
(సాక్షి వెబ్ ప్రత్యేకం) వాళ్లంతా ఆకాశంలో ఉండే తారల కంటే ఏమాత్రం తక్కువ కారు. తమ అభిమానుల గుండెల్లో గూడు కట్టుకుని ఉంటారు. కోట్లల్లో సంపాదన.. పెద్ద పెద్ద పడవల్లాంటి కార్లలోనే తిరగడం.. ఐదు నక్షత్రాల జీవితం. ఇదీ సినీ తారల పరిస్థితి. కానీ.. అలాంటి తారలు ఆకాశం నుంచి కిందకు దిగి వస్తున్నారు. తమను ఎంతగానో అభిమానించే సామాన్యుల కోసం తామే నేరుగా నడిచి వెళ్తున్నారు. ఆపదలో ఉన్నవాళ్లను తాము స్వయంగా ఆదుకోలేకపోయినా.. తమను చూడటమే వాళ్లకు కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని తెలుసుకుని, తీరిక చేసుకుని మరీ వెళ్తున్నారు. తమను ఎంతగానో అభిమానించి.. ఇంతవాళ్లను చేసిన వాళ్ల కోసం ఎంతోకొంత చేయాలన్న ఉద్దేశంతో మంచి పనులు మొదలు పెడుతున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన శ్రీనిధి అనే చిన్నారి కేన్సర్ వ్యాధితో బాధపడుతోంది. ఆమె ఇక బతకడం కూడా కష్టమని వైద్యులు చెప్పేశారు. ఆమెకు హీరో ఎన్టీఆర్ అంటే వల్లమాలిన అభిమానం. అతడు నటించిన 'యమదొంగ' సినిమా చాలా చాలా నచ్చింది. ఆమె అనారోగ్యం విషయం తెలిసిన ఎన్టీఆర్.. స్వయంగా ఆస్పత్రికి వెళ్లాడు. పెద్ద టెడ్డీ బేర్ ఆమెకు బహుమతిగా ఇచ్చాడు. బోలెడన్ని చాక్లెట్లను గిఫ్టు బాక్సులో ప్యాక్ చేయించి ఇచ్చి, ఆమె పక్కనే కూర్చుని మాట్లాడాడు. ఆ చిన్నారి శ్రీనిధికి ఎక్కడలేని ఆనందం. కొన్నాళ్ల క్రితం ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీజ అనే అమ్మాయి కూడా తీవ్ర అనారోగ్యంతో బాధపడింది. ఆమెకు పవన్ కల్యాణ్ అంటే ఎనలేని ఇష్టం. విషయం తెలిసిన పవర్ స్టార్.. తానే స్వయంగా ఖమ్మం ఆస్పత్రికి వెళ్లారు. కానీ ఆ సమయానికి ఆమె మాట్లాడే పరిస్థితిలో లేదు. కొన్నాళ్ల తర్వాత కోలుకున్న ఆమెను ఆమె తండ్రి పవన్ వద్దకు తీసుకొచ్చారు. అప్పుడు ఆమె కళ్లలో ఎనలేని సంతోషం. హీరోయిన్ సమంత మహిళలు, అమ్మాయిల కోసం 'ప్రత్యూష ఫౌండేషన్' పేరుతో ఓ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని పెద్ద పెద్ద ఆస్పత్రులు అన్నింటితోను ఈ ఫౌండేషన్ ఒప్పందాలు కుదుర్చుకుంది. అక్కడ చికిత్స చేయించుకోడానికి వచ్చి, ఆర్థిక పరిస్థితి అనుకూలించని నిరుపేదలు ఎవరైనా ఉంటే.. ఆ సమాచారాన్ని సదరు ఆస్పత్రి వర్గాలు ప్రత్యూష ఫౌండేషన్‌కు పంపుతాయి. అవకాశం మేరకు వాళ్లకు ఫౌండేషన్ నుంచి సాయం అందుతుంది. ఇందుకోసం తాను వివిధ సినిమాల్లో ధరించిన దుస్తులు, నగలతో పాటు సహ నటులు ధరించిన దుస్తులను కూడా సమంత ఆన్లైన్లో వేలానికి పెడుతోంది. గబ్బర్‌సింగ్ సినిమాలో పవన్ కల్యాణ్ వేసుకున్న పోలీసు యూనిఫాం, దూకుడు సినిమాలో మహేష్‌బాబు ఓ పాటలో ధరించిన ఎర్ర పువ్వుల చొక్కా లాంటివి ఈ వేలంలో ఉన్నాయి. వాటి ద్వారా వచ్చిన సొమ్మును కూడా ఆమె ఇలా చికిత్సల కోసం వెచ్చిస్తోంది. అభిమానులు టికెట్లు కొన్న డబ్బులతో సకల సౌకర్యాలు అనుభవించే తారలు.. ఆ అభిమానుల కోసం తాము కిందకు దిగివచ్చి స్వయంగా వెళ్లి పలకరించడంతో పాటు వీలైనంత మేర ఆర్థిక సాయం కూడా అందించడం ప్రశంసనీయం. -పి.ఆర్.ఆర్. కామేశ్వరరావు -
'తండ్రిగా ఆ బాధ నాకు తెలుసు'
-
శ్రీనిధికి జూనియర్ ఎన్టీఆర్ పరామర్శ
-
బ్రెయిన్ ట్యూమర్ చిన్నారి శ్రీజతో పవన్ కళ్యాణ్
-
శ్రీజకు రెండు లక్షలు, బొమ్మలు ఇచ్చిన పవన్
హైదరాబాద్ : బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న చిన్నారి శ్రీజ (13)ను సినీనటుడు పవన్ కళ్యాణ్ శుక్రవారం పరామర్శించారు. ఖమ్మం కార్తీక ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను పవన్ పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని గురించి ఆస్పత్రిలోని వైద్యులను అడిగి తెలుసుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా శ్రీజకు రూ.2లక్షల చెక్కుతో పాటు, బొమ్మలను అందచేశాడు. అనంతరం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ బయల్దేరారు. విశాఖలో తుఫాను బాధితులను పరామర్శించిన అనంతరం హైదరాబాద్ వస్తూ మార్గమధ్యంలో ఖమ్మం వెళ్లి, అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీజను పవన్ పరామర్శించారు. తనకు పవన్ కల్యాణ్ ను కలవాలని ఉందని శ్రీజ చెప్పడంతో మేక్ ఎ విష్ ఫౌండేషన్ సభ్యులు పవన్ కు సమాచారం అందించి ఆమె కోరిక తీర్చారు. -
పవన్ కళ్యాణ్‌కు తప్పిన ప్రమాదం
ఖమ్మం : సినీ హీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు కొణిజర్ల వద్ద స్వల్ప ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పవన్ కళ్యాణ్ వాహనం ముందుభాగం స్వల్పంగా ధ్వంసమైంది. దాంతో ఆయన మరో కారులో ఖమ్మం బయల్దేరి వెళ్లారు. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న శ్రీజ అనే పదమూడేళ్ళ చిన్నారిని పవన్ కళ్యాణ్ పరామర్శించేందుకు ఖమ్మం వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా శ్రీజకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానం. అభిమాన నటుడిని చూడాలని ఆమె ఆకాంక్ష. అయితే ఆమె ప్రస్తుతం ఖమ్మంలోని కార్తీక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. శ్రీజ కదలలేని పరిస్థితిలో ఉండటంతో మేక్ ఏ విష్ స్వచ్ఛంద సంస్థ విజ్ఞప్తితో ఆమెను చూసేందుకు పవన్ కళ్యాణే ఖమ్మం వచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీజను ఆయన పరామర్శించి ఆమె కోరికను తీర్చారు. -
శ్రీజను కలవడానికి ఖమ్మం వెళుతున్నా
రాజమండ్రి : విశాఖలో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన శుక్రవారం ఉదయమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో పరిస్థితులు కుదుట పడుతున్నాయన్నారు. హుదూద్ తుఫాను బాధితులకు అందరూ అండగా నిలవాలని నిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో విపత్తు నివారణ వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. తుఫాను పునరావాస సహాయక చర్యల్లో సినీ పరిశ్రమ పాలుపంచుకోవటం అభినందనీయమన్నారు. మున్ముందు ఉత్తరాంధ్రలో పునరావాస కార్యక్రమాల్లో జనసేన పాలుపంచుకుంటుందన్నారు. కాగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీజను కలవటానికి ఖమ్మం వెళుతున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. మేక్ ఏ విష్' సంస్థ చేసిన విజ్క్షప్తికి స్పందించిన ఆయన ఈరోజు శ్రీజను పరామర్శించనున్నారు. కార్తీక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో 13 ఏళ్ల శ్రీజ బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతోంది. ఈ చిన్నారికి పవన్ కల్యాణ్ అంటే ఎంతో అభిమానం. పవన్‌ను కలిపించేందుకు మేక్ ఎ విష్ ప్రయత్నించింది. అందుకోసం శ్రీజను హైదరాబాద్ తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే వైద్యులు వద్దనడంతో ఆ ప్రయత్నం విరమించింది. దీంతో పవన్ పవన్ కళ్యాణే శ్రీజ దగ్గరికి రావాలని విజ్ఞప్తి చేయటంతో పవన్ సానుకూలంగా స్పందించి తానే ఖమ్మం బయల్దేరారు. ఆయన ఈరోజు ఉదయం రాజమండ్రి నుంచి నేరుగా ఖమ్మం బయల్దేరి వెళ్లారు. -
శ్రీజను కలుసుకోనున్న పవన్ కళ్యాణ్
హైదరాబాద్: సినీ నటుడు పవన్ కళ్యాణ్ శుక్రవారం ఖమ్మంలో పర్యటించనున్నారు. 'మేక్ ఏ విష్' సంస్థ చేసిన విజ్క్షప్తికి పవన్ కళ్యాణ్ రేపు ప్రాణాపాయ స్థితిలో ఉన్న శ్రీజను కలుసుకోనున్నారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శ్రీజ చికిత్స పొందుతున్నారు. హుదూద్ తుఫాన్ బాధితులను పరామర్శించేందుకు ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ తిరుగు ప్రయాణంలో ఖమ్మం చేరుకుని శ్రీజను పరామర్శిస్తారు. -
శ్రీజకు ఖాయమైన పతకం
స్లొవేకియా ఓపెన్ టీటీ ఫైనల్లో భారత్ సాక్షి, హైదరాబాద్: గ్లోబల్ టేబుల్ టెన్నిస్ అకాడమీ (జీటీటీఏ)కి చెందిన హైదరాబాద్ అమ్మాయి ఆకుల శ్రీజ.. యూరప్ పర్యటనలో పతకం ఖాయం చేసుకుంది. శ్రీజతోపాటు ప్రియదర్శిని దాస్, ఐహికా ముఖర్జీలతో కూడిన భారత జట్టు స్లొవేకియా ఓపెన్ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో టోర్నీలో భారత్ కనీసం రజతం దక్కించుకోనుంది. స్లొవేకియాలోని సెనెక్‌లో జరుగుతున్న ఈ ప్రపంచ స్థాయి జూనియర్ పోటీల్లో టాప్ సీడ్ భారత్ సెమీఫైనల్లో 3-1తో బల్గేరియా-ఉరుగ్వే (మిక్స్డ్) జట్టుపై నెగ్గింది. ఈ పోటీలో సింగిల్స్‌లో శ్రీజ 4-11, 11-6, 11-7, 11-7తో మిహెలా దిమోవాను ఓడిం చింది. అంతకుముందు జరిగిన క్వార్టర్ఫైనల్లో భారత్ 3-0తో స్లొవేకియాపై గెలుపొందింది. స్లొవేకియాపై తొలి గేమ్‌లో ప్రియదర్శిని దాస్ 3-0 తేడాతో మిరియామేను ఓడించగా, రెండో గేమ్‌లో ఐహికా 3-0తో కరోలినాపై, మూడో గేమ్‌లో శ్రీజ 3-0తో అనోవా లూసియాపై గెలుపొందారు. -
భారత టీటీ జట్టులో స్నేహిత్, శ్రీజ
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: టేబుల్ టెన్నిస్‌లో విశేషంగా రాణిస్తున్న హైదరాబాదీలు స్నేహిత్, ఆకుల శ్రీజ, నైనా జైస్వాల్, హరికృష్ణలు భారత జట్టుకు ఎంపికయ్యారు. ఐటీటీఎఫ్ గ్లోబల్ జూనియర్, క్యాడెట్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో పాల్గొనే భారత క్యాడెట్, జూనియర్ జట్లకు ఎంపికయ్యారు. భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య ప్రధాన కార్యదర్శి డి.ఆర్.చౌదరి ఈ మేరకు వెల్లడించారు. భారత బాలుర జట్టులో చాన్నాళ్ల తర్వాత ఇద్దరు క్రీడాకారులు చోటు దక్కించుకోవడం పట్ల రాష్ట్ర టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సుల్తానా హర్షం వ్యక్తం చేశారు. ఈ టోర్నీలో పాల్గొనే భారత జట్టుకు త్వరలో కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తారని చెప్పారు. క్యాడెట్ అండర్-15 బాలుర విభాగంలో ఎస్.ఎఫ్.ఆర్.స్నేహిత్, వి.ఎస్.హరికృష్ణలకు తొలిసారిగా జాతీయ జట్టులో చోటు దక్కింది. అలాగే భారత జూనియర్ జట్టుకు ఆకుల శ్రీజా, నైనాలు ఎంపికయ్యారు. ఈ పోటీలు మార్చి 25 నుంచి 28 వరకు గోవాలో జరుగుతాయి. రాష్ట్ర సబ్ జూనియర్ చాంపియన్ అయిన స్నేహిత్... జూనియర్ , యూత్ విభాగం రాష్ట్ర స్థాయి ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్నాడు. జాతీయ సబ్ జూనియర్ విభాగంలో అతను మూడో ర్యాంకులో కొనసాగుతున్నాడు. స్నేహిత్, శ్రీజాలు గ్లోబల్ టీటీ అకాడమీలో శిక్షణ పొందారు. హరికృష్ణ సెయింట్ పాల్స్ టీటీ అకాడమీలో శిక్షణ తీసుకున్నాడు. హరికృష్ణ భారత జట్టుకు ఎంపిక కావడం పట్ల హైదర్‌గూడలోని సెయింట్ పాల్స్ టీటీ అకాడమీలో తోటి క్రీడాకారులు, కోచ్‌లు సంతోషం వ్యక్తం చేశారు. కోచ్‌లు ఇబ్రహీమ్ ఖాన్, నాగేందర్‌రెడ్డిలు ఈ సందర్భంగా మాట్లాడుతూ హరికృష్ణకు మంచి భవిష్యత్తు ఉందన్నారు. అంకితభావం గల హరికి కష్ణపడేతత్వం ఉందని వారు పేర్కొన్నారు. ఎల్బీస్టేడియంలో శిక్షణ పొందిన నైనా ఇప్పటికే పలు అంతర్జాతీయ టీటీ టోర్నీల్లో సత్తాచాటిన సంగతి తెలిసిందే. -
మెల్లని పాపాయికి లాలనే ఆలంబన
పిల్లలు అల్లరి చేస్తుంటే... ‘ప్రాణాలు తోడేయకండ్రోయ్’ అని మొత్తుకుంటాం! పిల్లలు అసలే అల్లరి చేయకుండా ఉంటుంటే? అప్పుడూ... ప్రాణాలు తోడేసినట్లే ఉంటుంది! రెండిట్లో ఏది బెటర్? అల్లరి చేయడమే! అల్లరి అంటే చురుకుదనం, చలాకీదనం. అంతేకదా! హరివిల్లంటే రంగురంగులుగా ఉండాలి. పక్షులంటే కిలకిలలాడుతూ ఉండాలి. సెలయేరులంటే గలగలమంటూ ఉండాలి. పూలు, పూలతలు తలలూపుతూ ఉండాలి. పిల్లలంటే... ఇవన్నీ చేస్తూండాలి. కిలకిలమనాలి, కిసుక్కుమనాలి. గలగలలాడాలి, గెంతులేయాలి. కానీ కొంతమంది పిల్లలు ‘స్పెషల్’గా ఉంటారు. ఆ స్పెషాలిటీ పిల్లలది కాదనీ పుట్టుకతోవచ్చిన ఒక అసహజత్వమనీ తెలియగానే తల్లిదండ్రులు హతాశులవుతారు. అలా ఏం కానవసరం లేదని, కౌన్సెలింగ్‌తో వారిని తక్కిన పిల్లల్లా తీర్చిదిద్దవచ్చనీ భరోసా ఇచ్చేదే... ఈ వారం లాలిపాఠం... మూడు నెలల తన బుజ్జితండ్రికి లాలపోసి తీసుకొచ్చింది శ్రీజ. ఒళ్లు తుడిచి పౌడర్ వేస్తూ బిడ్డను చూసుకుంటూ మురిసిపోతోంది. ఎక్కువ ఏడవకుండా బుద్ధిగా ఉంటున్నాడని, రాత్రుళ్లు హాయిగా నిద్రపోతున్నాడని ముచ్చటపడుతోంది. ఒకరోజు పోలియో డ్రాప్స్ వేయించడానికి, రొటీన్ చెకప్ కోసం పీడియాట్రీషియన్ దగ్గరకు తీసుకెళ్లింది. చైల్డ్ రెస్పాన్స్ నార్మల్‌గానే ఉంటోందా అనే సందేహంతో డాక్టర్ బిడ్డ ఎదురుగా చిటికె వేసి శబ్దం చేశారు, వెనుక వైపుగా పెద్ద శబ్దం చేశారు. బిడ్డ పెద్దగా స్పందించడం లేదని అర్థమైంది. శ్రీజను కొన్ని ప్రశ్నలు వేసిన తర్వాత డాక్టర్ తన సందేహం నిజమేనని నిర్ధారణకు వచ్చారు. ఆ మాటలను బట్టి తన బిడ్డ స్పెషల్ నీడ్స్ కిడ్ అని అర్థం కావడంతో శ్రీజకు భూమి కంపించినట్లయింది. ప్రపంచంలో ఇంతమంది పిల్లలు ఆరోగ్యంగా ఆడుతూ పాడుతూ ఉంటే తన బిడ్డకే ఇలా ఎందుకు? అని కుమిలిపోయింది. అన్నీ ప్రశ్నార్థకాలే ! శ్రీజ కౌన్సెలర్ల దగ్గర ట్రైనింగ్ తీసుకుంటూ బిడ్డను పెంచుతోంది. నాలుగేళ్లు గడిచాయి. ఇప్పుడు శ్రీజలో ‘బాబుకు చదువెలా?’ అనే మరో ప్రశ్నార్థకం. ఇలాంటి పిల్లలను సాధారణ పిల్లలతో మెలగ గలిగేలా తీర్చిదిద్దడం ఎలా? అదసలు సాధ్యమేనా? వంటి సందేహాలతో కృశించిపోతోంది. అయితే అలా బెంగపడక్కరలేదు, మానసిక, శారీరక అవకరాలతో పుట్టిన స్పెషల్ కిడ్స్‌ని సాధారణమైన పిల్లల్లా తీర్చిదిద్దడం సాధ్యమేనంటారు వైద్య నిపుణులు. ఈ కింది సూచనలను పాటిస్తే ఈ పిల్లలు సాధారణ పిల్లల్లాగే సమాజంలో సులువుగా కలిసిపోగలరంటారు. ప్రత్యేకంగా పెంచాలి! ‘స్పెషల్ కిడ్స్‌ని మెయిన్‌స్ట్రీమ్‌లోకి తీసుకురావడం కష్టమైన పనే, కానీ అసాధ్యం మాత్రం కాద’ంటారు హైదరాబాద్‌లోని ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ నిర్వహకురాలు శైలజారావు. తమ స్కూల్లో నత్తి, స్లో లెర్నర్, ఇతర సమస్యలతో పుట్టిన పిల్లలకు సాధారణ పిల్లలతో కలిపి పాఠాలు చెప్తున్నట్లు, అలా చదువుకున్న వారిలో నేషనల్ ఓపెన్ స్కూల్ పరీక్ష రాసి టెన్త్ క్లాస్ పాసయినట్లు చెప్పారామె. ‘బాధపడుతూ కూర్చోవడం వల్ల, సమస్య నుంచి పారిపోవడం వల్ల ప్రయోజనం ఉండదు. దాన్ని స్వీకరించాలి. సమాజం నుంచి ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కోవడానికి వీలుగా విల్‌పవర్‌ని పెంచుకోవాలి. పాఠశాలలు కూడా అన్నిరకాల పిల్లల్ని చేర్చుకోవడానికి ప్రయత్నించాలి. అటెన్షన్ డిజార్టర్‌తో బాధపడుతున్న పిల్లలకు పాఠాలను తేలిక పదాలతో నేర్పించాలి. అలా చేయగలిగితే స్పెషల్ కిడ్స కూడా సాధారణ పిల్లల్లాగే సమాజంలో కలిసిపోతారు. స్పెషల్ చిల్డ్రన్ని సాధారణ పిల్లల్లా తీర్చిదిద్దడం అంటే గతంలో అసలు ఊహకందని విషయం. ఇప్పుడు సమాజంలో అవగాహన పెరిగింది. పిల్లలకు, తల్లిదండ్రులకు సపోర్టు లభిస్తోంది. మా స్కూల్లో అంధ విద్యార్థులు చదువు, ఆటపాటల్లో రాణిస్తున్నారు. తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకుంటే చాలు. స్పెషల్ కిడ్ నుంచి ఎక్ట్స్రార్డినరీ పెర్ఫార్మెన్స్ని ఆశించకూడదు కానీ నార్మల్ కిడ్‌గా మార్చడం సాధ్యమే’ అన్నారామె. గుర్తించిన వెంటనే..! స్పెషల్ కిడ్ అని గుర్తించిన తర్వాత ఆలస్యం చేయకుండా చికిత్స ప్రారంభించాలంటారు డాక్టర్ విష్ణుస్వరూప్‌రెడ్డి. ‘‘స్పెషల్ చైల్డ్ విషయంలోనూ తల్లిదండ్రులు డాక్టర్‌కు ప్రతి సమస్యనూ వివరించాలి. డాక్టర్ బిడ్డ పెంపకం గురించి తల్లిదండ్రులకు చెప్పిన సూత్రాలను యథాతథంగా పాటించాలి. తొలిదశలో ట్రీట్మెంట్ మొదలైతే మంచి ఫలితాలు ఉంటాయి. నత్తి విషయానికి వస్తే ఆందోళన, ఉద్వేగం ఎక్కువయ్యేకొద్దీ మాట పట్టేయడం కూడా ఎక్కువవుతుంది. ఆందోళనకరమైన పరిస్థితిలో జాగ్రత్తగా వ్యవహరించాలి. నిదానంగా మాట్లాడితే మాట పట్టేయడం తగ్గుతుంది. ఆవేశంగా ఉన్నప్పుడు మౌనంగా ఉండి, తర్వాత మెల్లగా మాట్లాడితే చెప్పదలుచుకున్న విషయాన్ని సులభంగా చెప్పవచ్చు. ఈ రకంగా తల్లిదండ్రులు ప్రాక్టీస్ చేయిస్తూ పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి’’ అంటారాయన. సహనానికి ప్రతీకలు కావాలి! స్పీచ్ సమస్యతో బాధపడుతున్న పిల్లలు ఇంట్లో చక్కగా మాట్లాడతారు. కానీ కొత్తవారితో మాట్లాడాలంటే భయపడుతుంటారు. నలుగురిలో ఉత్సాహంగా మాట్లాడబోయి మాట రాక బిక్కముఖం పెడతారు. అలాంటప్పుడు తల్లిదండ్రులకు ఏమీ పాలుపోక పిల్లల్ని అక్కడే దండిస్తుంటారు. స్పెషల్ కిడ్స తల్లులు పిల్లలతో చాలా సహనంతో వ్యవహరించాలి. ఇది చాలా తప్పు. పిల్లలు ధైర్యం కోల్పోతుంటే వారికి ఎప్పటికప్పుడు ధైర్యం చెబుతూ ఉండాలి. ‘ఇది చాలా చిన్న సమస్య, డాక్టర్ చెప్పినట్లు చేస్తుంటే తగ్గిపోతుంది’ అని నచ్చచెప్పాలి. డాక్టర్ కౌన్సెలింగ్ కంటే తల్లి కౌన్సెలింగ్ బాగా పనిచేస్తుంది. - వాకా మంజులారెడ్డి స్పెషల్ కిడ్స్ ఉన్న తల్లిదండ్రుల కోసం... కుటుంబ చరిత్రలో ఎవరికైనా సరే, నత్తి, మూగ, అంధత్వం, చెవిటితనం వంటి శారీరక లోపాలు లేదా ఆటిజం, డౌన్స్ సిండ్రోమ్ వంటి మానసిక సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే తల్లిదండ్రులు తమ పిల్లల మానసిక, శారీరక పెరుగుదలను ప్రత్యేక శ్రద్ధతో గమనించాలి. ఒకవేళ ఏమైనా తేడా ఉన్నట్లు గమనిస్తే, ఆ పరిస్థితిని సత్వరంగా స్వీకరించి, మానసికంగా దృఢంగా మారాలి. సమాజం నుంచి ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనే విల్‌పవర్‌ని మనం పెంచుకుని, పిల్లల్లోనూ పెంచాలి. మనసులో ఏమాత్రం అసహనం, చిరాకు కలిగినా దానిని పిల్లల మీద ప్రదర్శించకూడదు. సంయమనం పాటిస్తూ ఇలాంటి పిల్లలను ప్రత్యేక శ్రద్ధతో పెంచితే స్పెషల్ కిడ్స్ కూడా అన్ని రంగాలలో బాగానే రాణిస్తారు. -
హీరోయిన్ చేస్తానని.... గర్భవతిని చేశాడు
-
హీరోయిన్ చేస్తానని చెప్పి.. గర్భవతిని చేశాడు
సినిమాల్లో హీరోయిన్ చేస్తానంటూ సినిమా దర్శకుడు చాంద్ పాషా మోసం చేసి.. తనను గర్భవతిని చేశాడని శ్రీజ అనే సీరియల్ కళాకారిణి నాచారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత ఆరు నెలలుగా తనను మోసం చేశాడని తెలిపింది. చాంద్ పాషాకు గతంలోనే పెళ్లయ్యి, ఇద్దరు పిల్లలున్నారు. మళ్లీ తనను కూడా పెళ్లి చేసుకుంటానని చెప్పాడని ఆమె చెప్పింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెం ప్రాంతానికి చెందిన శ్రీజను లవ్ ఈజ్ గేమ్ అనే సినిమాలో హీరోయిన్ చేస్తానని అతడు మోసగించినట్లు తెలిపింది. ఇంతకుముందు అతడు లవ్ సిలబస్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. పోలీసులు శనివారం తెల్లవారుజామున చాంద్ పాషాను అదుపులోకి తీసుకున్నారు. అయితే తాను శ్రీజను మోసం చేయాలని సదరు దర్శకుడు చెప్పటం విశేషం. బాధితురాలి తల్లి మాట్లాడుతూ తన కుమార్తెకు సినిమాల్లో ఛాన్సు ఇప్పిస్తానంటూ సుమారు ఆరు లక్షల వరకూ తీసుకున్నాడని, దాంతో పాటు తన కుమార్తెను మోసం చేశాడని ఆరోపించింది. తనకు దర్శకులు, నిర్మాతలు తెలుసు అని చెప్పాడని.... పెళ్లి కాలేదని... పిల్లలు లేరని చాంద్ పాషా అబద్దాలు చెప్పాడని తెలిపింది. గతరాత్రి కొంతమంది తన కుమార్తెపై దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించింది. తమకు తగిన న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని ఆమె స్పష్టం చేసింది. -
శ్రీజ సంచలనం
టెహరాన్: హైదరాబాద్‌కు చెందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి... 15 ఏళ్ల శ్రీజ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ఇరాన్లో జరిగిన ఫజర్ కప్ అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ టోర్నీ జూనియర్ విభాగంలో సింగిల్స్ టైటిల్ గెలిచింది. శనివారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో శ్రీజ 3-0 (11-9, 14-12, 11-7) తేడాతో బెలారస్‌కు చెందిన బరవోక్ను చిత్తు చేసింది. విజేతగా 800 డాలర్ల ప్రైజ్‌మనీని అందుకుంది. క్యాడెట్ విభాగంలో ప్రపంచ 23వ ర్యాంకర్ అయిన శ్రీజ ఈ టోర్నీలో అగ్రశ్రేణి క్రీడాకారులను చిత్తు చేసి టైటిల్ నెగ్గింది. సెమీస్‌లో హంగెరీకి చెందిన టాప్ సీడ్ క్రీడాకారిణిని మట్టికరిపించి శ్రీజ అందరి దృష్టినీ ఆకర్శించింది. మరోవైపు జూనియర్స్ సింగిల్స్‌లో వ్యక్తిగత ప్రదర్శనతో పాటు టీమ్ ఈవెంట్లోనూ శ్రీజ రాణించింది. టీమ్ విభాగంలో భారత్ ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. అలాగే డబుల్స్ ఈవెంట్లో శ్రీజ, ప్రియదర్శిని (బెంగాల్) కలిసి కాంస్యం సాధించారు. ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయిలో శ్రీజ మొత్తం 12 పతకాలు సాధించడం విశేషం. డబుల్స్‌లో నైనా జోడికి స్వర్ణం: ఇదే టోర్నీ డబుల్స్ ఫైనల్లో హైదరాబాద్‌కే చెందిన నైనా జైస్వాల్ జోడి స్వర్ణం సాధించింది. బెంగాల్‌కు చెందిన మోమితా దత్తాతో జత కట్టిన నైనా 11-8, 9-11, 11-9, 11-6 తేడాతో సబా సఫారీ, మషీద్ (ఇరాన్)ను ఓడించింది. బాలికల క్యాడెట్ టీమ్ ఈవెంట్లోనూ నైనా, దత్తా జోడి స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. చాలా సంతోషంగా ఉంది. ఎంతోమంది ప్రపంచ ర్యాంకింగ్స్ ఆటగాళ్లు ఫజర్ కప్‌ను చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. ఇప్పటిదాకా ఇదే నా అత్యుత్తమ ప్రదర్శనగా భావిస్తున్నాను. ఈ విజయాన్ని నా తల్లిదండ్రులకు, కోచ్ సోమ్‌నాథ్‌కు అంకితమిస్తున్నాను’ - శ్రీజ. ‘దేశానికి ప్రాతినిధ్యం వహించాలనేది ప్రతి ఒక్కరి కల. అలాంటి అవకాశాన్ని మా అమ్మాయి ఇంత చిన్న వయసులోనే చేజిక్కించుకోవడం, చెప్పుకోదగ్గ విజయాలు సాధించడం గొప్ప విషయం. ఆమె ఘనవిజయాల పట్ల మేం గర్వపడుతున్నాం.’ - ప్రవీణ్, సాయిసుధ (శ్రీజ తల్లిదండ్రులు)