చెన్నై: భారత నంబర్‌వన్ టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) సీజన్ నుంచి తప్పుకుంది. ఒత్తిడి కారణంగా ఈ నెల 22న ప్రారంభం కానున్న సీజన్‌కు తాను దూరం అవుతున్నట్లు ఆమె తెలిపింది. ఇటీవల పారిస్ ఒలింపిక్స్ టీటీ మహిళల సింగిల్స్‌లో ప్రిక్వార్టర్స్‌కు చేరి ఆకట్టుకున్న 26 ఏళ్ల శ్రీజ ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నట్లు వెల్లడించింది.
‘యూటీటీలో ఆడలేకపోవడం బాధగా ఉంది. విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’ అని రెండుసార్లు జాతీయ చాంపియన్ శ్రీజ పేర్కొంది. లీగ్‌లో శ్రీజ జైపూర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉండగా ఆమె స్థానంలో ఫ్రాంచైజీ నిత్యశ్రీ మణిని ఎంపిక చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment