సురేశ్ కామాక్షి దర్శకత్వంలో మిగమిగ అవసరం
నిర్మాతగా అనుభవం గడించిన వాళ్లు దర్శకులుగా అవతారమెత్తడం అన్నది కొత్తేమీ కాదు. ఆ కోవలో తాజాగా సురేశ్ కామాక్షి చేరారన్నదే తాజా న్యూస్. ఇంతకు ముందు వి.హౌస్ ప్రొడక్షన్ పతాకంపై అమైదిప్పడై-2,కంగారు వంటి చిత్రాలను నిర్మించిన సురేశ్ కామాక్షి ఇప్పుడు అదే పతాకంపై స్వీయ దర్శకత్వంలో మిగ మిగ అవసరం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నామ్ తమిళర్ పార్టీ అధ్యక్షుడు, దర్శకుడు ప్రధాన పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో గోరిపాలైయం చిత్రం ఫేమ్ హరీష్ కథానాయకుడిగా నటిస్తున్నారు.
ఆయనకు జంటగా కంగారు, వందామల చిత్రాల ఫేమ్ శ్రీజ నాయకిగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో లింగా, ఆండవన్‌కట్టళై అరవింద్, దర్శకుడు శరవణ పిళ్లై, వీకే.సుందర్, వెట్రికుమరన్ నటిస్తున్నారు.చిత్ర వివరాలను దర్శక నిర్మాత సురేశ్ కామాక్షి తెలుపుతూ చిత్ర షూటింగ్‌ను సేలం జిల్లా, భవాని గ్రామ సమీసంలో గల కోనేరిపట్టి బ్రిడ్జి వద్ద నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో 23 ఏళ్ల క్రితం దర్శకుడు కే.భాగ్యరాజ్ పవను పవనుదాన్ చిత్ర షూటింగ్ నిర్వహించారన్నారు. ఆ తరువాత ఈ ప్రాంతంలో చిత్రీకరించుకుంటున్న చిత్రం తమ మిగ మిగ అవసరం చిత్రమేనని చెప్పారు. కథకు అవసరం అవ్వడంతో ఇక్కడ చిత్రీకరిస్తున్నట్లు వివరించారు.
మరో మిషయం ఏమిటంటే ఈ చిత్రానికి ఎపిక్ వెపన్ హెలియం 8కే సెన్సార్ అనే అతి నవీన కెమెరాను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఇది 8కే రెజల్యూషన్‌తో కూడిన కెమెరా అని, భారతీయ సినిమా చరిత్రలోనే ఈ కెమెరాతో చిత్రీకరిస్తున్న తొలి చిత్రం మిగ మిగ అవసరం అని దర్శక నిర్మాత సురేశ్ కామాక్షి పేర్కొన్నారు.