Suresh Kamakshi
-
రూ.3 లక్షలిస్తేనే ప్రమోషన్స్.. హీరోయిన్‌పై నిర్మాత ఫైర్!
కోలీవుడ్ బ్యూటీ అబర్నతి ఇటీవలే మాయ పుత్తగం అనే సినిమాతో తమిళ ప్రేక్షకులను పలకరించింది. తాను ప్రధాన పాత్రలో నటించిన మరో మూవీ నరకప్పర్ ఆగస్టు 9న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ జూలై 30న చెన్నైలో ఓ ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి అబర్నతి డుమ్మా కొట్టింది.డబ్బు కావాలిహీరోయిన్ తీరుపై నిర్మాత సురేశ్ కామాక్షి మండిపడ్డాడు. ప్రమోషన్స్‌కు రావాలంటే రూ.3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిందని బయటపెట్టాడు. అంతేకాకుండా స్టేజీపై ఎవరి పక్కన కూర్చోవాలనేది కూడా తానే నిర్ణయించుకుంటానని చెప్పినట్లు తెలిపాడు. అయితే తన వైఖరితో చిత్రయూనిట్ ఇబ్బందిపడుతోందని గమనించిన బ్యూటీ వారికి సారీ చెప్పింది. ఇక మీదట ప్రమోషన్స్‌కు వస్తానని హామీ ఇచ్చింది.హీరోయిన్‌పై సెటైర్లుప్రమోషన్స్కు వస్తానని చెప్పి మాట తప్పిన అబర్నతిపై నిర్మాత మరోసారి ఫైరయ్యాడు. తమిళ సినిమా, తమిళ నిర్మాతలు బతకాలంటే ఇలాంటివారు శాశ్వతంగా దూరంగా ఉండటమే మంచిదని సెటైర్లు వేశాడు. ఈ వ్యవహారంపై చిత్రయూనిట్.. తమిళ సినీ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసింది. కాగా అబర్నతి.. జైల్, తేన్, ఇరుగపట్రు వంటి చిత్రాలతో పాపులర్ అయింది.చదవండి: సిగరెట్ తాగిన హీరోయిన్? అబ్బే, మా అమ్మాయికి అలవాటు లేదు! -
సురేశ్ కామాక్షి దర్శకత్వంలో మిగమిగ అవసరం
నిర్మాతగా అనుభవం గడించిన వాళ్లు దర్శకులుగా అవతారమెత్తడం అన్నది కొత్తేమీ కాదు. ఆ కోవలో తాజాగా సురేశ్ కామాక్షి చేరారన్నదే తాజా న్యూస్. ఇంతకు ముందు వి.హౌస్ ప్రొడక్షన్ పతాకంపై అమైదిప్పడై-2,కంగారు వంటి చిత్రాలను నిర్మించిన సురేశ్ కామాక్షి ఇప్పుడు అదే పతాకంపై స్వీయ దర్శకత్వంలో మిగ మిగ అవసరం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నామ్ తమిళర్ పార్టీ అధ్యక్షుడు, దర్శకుడు ప్రధాన పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో గోరిపాలైయం చిత్రం ఫేమ్ హరీష్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా కంగారు, వందామల చిత్రాల ఫేమ్ శ్రీజ నాయకిగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో లింగా, ఆండవన్కట్టళై అరవింద్, దర్శకుడు శరవణ పిళ్లై, వీకే.సుందర్, వెట్రికుమరన్ నటిస్తున్నారు.చిత్ర వివరాలను దర్శక నిర్మాత సురేశ్ కామాక్షి తెలుపుతూ చిత్ర షూటింగ్‌ను సేలం జిల్లా, భవాని గ్రామ సమీసంలో గల కోనేరిపట్టి బ్రిడ్జి వద్ద నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో 23 ఏళ్ల క్రితం దర్శకుడు కే.భాగ్యరాజ్ పవను పవనుదాన్ చిత్ర షూటింగ్ నిర్వహించారన్నారు. ఆ తరువాత ఈ ప్రాంతంలో చిత్రీకరించుకుంటున్న చిత్రం తమ మిగ మిగ అవసరం చిత్రమేనని చెప్పారు. కథకు అవసరం అవ్వడంతో ఇక్కడ చిత్రీకరిస్తున్నట్లు వివరించారు. మరో మిషయం ఏమిటంటే ఈ చిత్రానికి ఎపిక్ వెపన్ హెలియం 8కే సెన్సార్ అనే అతి నవీన కెమెరాను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఇది 8కే రెజల్యూషన్‌తో కూడిన కెమెరా అని, భారతీయ సినిమా చరిత్రలోనే ఈ కెమెరాతో చిత్రీకరిస్తున్న తొలి చిత్రం మిగ మిగ అవసరం అని దర్శక నిర్మాత సురేశ్ కామాక్షి పేర్కొన్నారు. -
వారిది నిర్భాగ్యపు బతుకే
సినిమాల్లో నిర్మాతలది నిర్భాగ్యపు బతుకేనని యువ నిర్మాత సురేష్కామాక్షి వ్యాఖ్యానించారు. ఇక్కడ అందరూ సురక్షితంగానే ఉన్నారని, డబ్బు పెట్టే నిర్మాత మాత్రం నిత్యం చచ్చి బతుకుతున్నారని అన్నారు. వీహౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై సంచలన దర్శకుడు స్వామి దర్శకత్వంలో నిర్మించిన చిత్రం కంగారు. ఈ చిత్రం ఈనెల 24న తెర మీదకు రానున్నది. ఈసందర్భంగా సురేష్ కామక్షితో చిట్‌చాట్. ప్ర: చాలా ఆవేదనలో ఉన్నారు? జ: సినిమాకు పనిచేసే లైట్ మెన్నుంచి స్టార్ హీరో హీరోయిన్ల వరకు వేతనాలు ఇచ్చేది నిర్మాతలే. అలా, అందరికీ పారితోషికాల్ని ఇచ్చే నిర్మాత ఇవాళ సంతోషంగా ఉన్నాడా అంటే కచ్చితంగా లేదు. నిర్మాతల పాట్లు, వాళ్లు ఎదుర్కొనే సవాళ్లు చెప్పలేనివి. చిత్రానికి టెంకాయ కొట్టిన నాటి నుంచి సెన్సార్పూర్తి చేసుకుని విదుదల అయ్యే వరకు నిర్మాత పడే వే దన అంతా ఇంతా కాదు. ప్ర: లైట్‌మెన్ సమస్యను సృష్టించినట్టున్నారే? జ: షూటింగ్ ఆరంభమైందంటే రోజూ ఖర్చే. ఏ రోజుకు ఆ రోజు వేతనాలు చెల్లించాల్సిందే. మధ్యలో ఒకటి రెండు రోజులు వేతనాలు చెల్లించకుంటే, షూటింగ్ నిలిపి వేస్తారు. అలా, లైట్ మెన్, హెయిర్ డ్రెస్సర్ కూడా షూటింగ్‌లను నిలిపి వేయగలరు. వారందరికీ వేతనాలు ఇచ్చే నిర్మాత మాత్రం ఏమీ చేయలేడు. అలాంటి ఒక చేదు అనుభవం నాకూ ఎదురు అయింది. ఒక లైట్ మెన్ రెండు రోజుల పాటుగా షూటింగ్ నిలిపి వేయించాడు. కొడెకైనాల్లో షూటింగ్ జరుగుతుండగా, అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందక పోవడంతో వేతనాలు ఇవ్వడం రెండు రోజులు ఆలస్యమైంది. అంత వరకు ఆగలేక ఓ లైట్ మెన్ షూటింగ్ నిలిపి వేయించాడు. నిర్మాతది ఎంతటి నిర్భాగ్యపు పరిస్థితో చూడండి. ఇక్కడ నిర్మాత పెట్టుబడికే ఎలాంటి గ్యారంటీ లేదు. ప్ర: సినిమాను వ్యాపారం చేసుకుంటారుగా...? జ : మంచి ప్రశ్న. ఒక చిత్రం నిర్మిస్తే అది నాలాంటి చిన్న నిర్మాత చిత్రం అయితే, వ్యాపారం చేయడం చాలా కష్టం. ఎవరి ఆకాంక్ష మేరకు సినిమా తీయాలో తెలియదు. ఒప్పందాల ప్రకారం ఇక్కడ వ్యాపారం జరగడం లేదు. మరో విషయం ఏమిటంటే, చిన్న నిర్మాతలకు ఇక్కడ మర్యాద లేదు. ప్రముఖ హీరోల చిత్రాలనే కొనుగోలు చేయడానికి బయ్యర్లు ఆసక్తి చూపుతున్నారు. ఇక, చిన్న చిత్రాలకు సెన్సార్సమస్య, పైరసీ బెడద తప్పదు. ఇలాంటికష్ట నష్టాలు ఎన్నో. ప్ర: కంగారు చిత్రం గురించి చెప్పరూ...? జ: కంగారు చిత్రం చాలా బాగా వచ్చింది. పాటలు ఇప్పటికే మార్కెట్లోకి విడుదలై ప్రజాదరణ పొందాయి. ఈ చిత్రాన్ని 24న విడుదల చేస్తున్నాం. కంగారు చిత్రం విజయంపై నాకు చాలా నమ్మకం ఉంది. -
నిర్మాతకు పొగరు ఉండాలి
తమిళసినిమా: నిర్మాత అనే వాడికి పొగరు ఉండాలని సీనియర్ దర్శక నటుడు ఆర్.సుందరరాజన్ అన్నారు. వి.హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ కామాక్షి నిర్మిస్తున్న చిత్రం కంగారు. వివాదస్పద చిత్రాల దర్శకుడిగా పేరొందిన సామి దర్శకత్వం వహిస్తూ, నవ నటుడు అర్జునా, ప్రియాంక, కోమల్ శర్మ నాయికా నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర ఆడియో ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం నగరంలోని ఆర్కేవీ స్టూడియోలో జరిగింది. చిత్ర దర్శకుడు సామి మాట్లాడుతూ నాలుగేళ్ల తరువాత తాను దర్శకత్వం వహిస్తున్న చిత్రం కంగారు అని తెలిపారు. తన గత చిత్రాలు వేరే విధంగా ఉండడానికి తాను మాత్రమే కారణం కాదన్నారు. ఒక చిత్రం ఎలా ఉండాలన్నది ఒక వ్యక్తి నిర్ణయించలేదన్నారు. దర్శకుడు, నిర్మాత, కథానాయకుడు ఇలా అందరూ కలసి నిర్ణయం తీసుకుంటారన్నారు. అయితే చిత్రం విజయం సాధిస్తే అందరూ భాగం పంచుకుంటారన్నారు. అపజయాలకు దర్శకుడిని మాత్రమే బాధ్యుడిని చేస్తారని, ఇదెక్కడి న్యాయం అని ఆవేదన వ్యక్తం చేశారు. కంగారు చిత్రం విషయానికొస్తే తన శిష్యుడు సాయి ప్రసాద్ చెప్పిన కథతో తెరకెక్కించిన చిత్రం అని చెప్పారు. తమిళ సినిమాలు గుర్తుండిపోయే చిత్రంగా ఉంటుందన్నారు. వైరముత్తు రాసిన ఐదు పాటలు ఆణిముత్యాల్లా ఉంటాయని ఈ చిత్రాన్ని కలైపులి ఎస్.థాను విడుదల చేయనున్నారని వెల్లడించారు. ఏమిటి దుస్థితి : చిత్ర నిర్మాత సురేష్ కామాక్షి మాట్లాడుతూ ఈ కంగారు చిత్రాన్ని చాలాకాలం మోసుకుంటూ వస్తున్నానన్నారు. ఇది తనకు చాలా నేర్పిందన్నారు. ఇతర వృత్తుల్లో యాజమాన్యం కార్మికులను కట్టడి చేస్తుంటే సినిమాలో మాత్రం కార్మికులు నిర్మాతలను కట్టడి చేస్తున్న దుస్థితి నెలకొందన్నారు. ఆయన వ్యాఖ్యలకు స్పందించిన దర్శక, నటుడు ఆర్.సుందరరాజన్ మాట్లాడుతూ, ఒకసారి సంగీత దర్శకుడు ఇళయరాజా ఏడు పాటలు కంపోజ్ చేసి అవన్నీ ఒకే చిత్రానికి అందిస్తానన్నారు. కొందరు నిర్మాతలు నాలుగైదు పాటలు చాలంటే, అలాగైతే తన పాటలు ఇవ్వనని చెప్పారు. ఒక సంగీత దర్శకుడికే అంత పొగరు ఉంటే రచయితగా తనకెంత పొగరుండాలని ఆయన పాటలు విందాం అనుకుని విన్నానన్నారు. ఆ తరువాత ఆ పాటలన్నీ తానే తీసుకుని వైదేహి కాత్తిరుందాల్ చిత్రంకు వాడుకున్నానన్నారు. ప్రతిభ పొగరంటే అలా ఉంటుందన్నారు. అలాగే నిర్మాతలకు పొగరు, ఐక్యతా భావం ఉండాలన్నారు. లేకుంటే ఎవరూ విలువనివ్వరని చెప్పారు.